OCTOBER 2017 VOL 14 ISSUE 10
/tollywood /tollywood
RNI NO: APTEL/2003/10076
TOLLYWOOD.NET
“THE BEST AND MOST BEAUTIFUL THINGS IN THE WORLD CANNOT BE SEEN OR EVEN TOUCHED - THEY MUST BE FELT WITH THE HEART.” Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By
: : : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 OCTOBER 2017
టాలీవుడ్ P 3
రా
జ్యానికి రాజెంత ముఖ్యమో, ఆ రాజును, ప్రజలను , చుట్టు ఉన్న వారికి కాపాడే దళపతి కూడా అంతే ముఖ్యం. సైన్యాన్ని ముందుండి నడిపే దళప తి రాజ్యానికి వెన్ను దన్ను. మరి మా `దళపతి` ఏం చేశాడో తెలుసుకోవాలంటే సినిమా చూడాలంటున్నారు చిత్రయూనిట్. ఆది అక్షర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై సదా దర్శకత్వంలో బాబురావు పెదపూడి నిర్మించిన చిత్రం `దళపతి`. సదా - కవితా అగర్వాల్ , బాబు - ప్రియాంక శర్మ రెండు జంటలుగా నటిస్తున్నారు ఈ సందర్బంగా దర్శకులు సదా మాట్లాడుతూ " విభిన్న కథాంశం తో యాక్షన్ , ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న దళపతి చిత్ర షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది. జై అందించిన సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవనుంది , జై అందించిన సహకారం వల్లే మా సినిమా అద్భుతంగా వచ్చిందని , జై అందించిన విజువల్స్ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వడం ఖాయమని దర్శకుడు సదా అన్నారు . ర్మాత బాబురావు మాట్లాడుతూ రజనీకాంత్, మమ్ముట్టి కాంబినేషన్‌లో పాతికేళ్ల క్రితం వచ్చిన దళపతి ఎంతటి సెన్సేషన్ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. అందులో ఎలాంటి ఎమోషన్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయో, అలాంటి ఎమోషన్స్ ఈ సినిమాలో ప్రేక్షకులను అలరిస్తాయి.
ని
దర్శకు డు సదా సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యాజమాన్యగారు అందించిన సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్ అయ్యింది. అల్రెడి విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తుంది. మా బ్యానర్లో వస్తోన్న మొదటి చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని నమ్మకంగా ఉన్నాం`` అన్నారు.
4 P టాలీవుడ్
య
శ్వంత్ మూవీస్ సమర్పణలో ఆర్.ఒ.క్రియేషన్స్ బేనర్‌పై రూపొందిన చిత్రం `దేవిశ్రీ ప్రసాద్`. పూజా రామచంద్రన్, భూపాల్‌రాజు, ధనరాజ్, మనోజ్ నందం ప్రధాన పాత్రధారులు. శ్రీ కిషోర్ దర్శకుడు. డి.వెంకటేష్, ఆర్.వి.రాజు, ఆక్రోష్ నిర్మాతలు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా... క్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ - ```దేవిశ్రీ ప్రసాద్ ట్రైలర్, టైటిల్ రెండూ బావున్నాయి. సూపర్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ పేరుతో ముగ్గురు పాత్రలు చేసిన సినిమా ఇది. సినిమా కూడా అదే రేంజ్‌లో తీసి ఉంటారని అనుకుంటున్నాను. ఈ సినిమాతో యూనిట్ సభ్యులందరికీ మంచి పేరు రావాలి. నిర్మాతలకు బాగా ప్రాఫిట్స్ రావాలి. దర్శకు డికి మంచి పేరు రావాలి`` అన్నారు. జ్ కందుకూరి మాట్లాడుతూ - ``సినిమా మంచి థ్రిల్లర్. ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా వ్యవథి కూడా తక్కువే. భూపాల్, మనోజ్ నందం, ధనరాజ్‌లు అద్భుతంగా నటించారు. పూజా రామచంద్రన్ చక్కగా నటించింది. దర్శకుడు శ్రీ కిషోర్ కొరియోగ్రాఫర్ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. హాంగ్ కాంగ్‌లో ఉంటూ ఇక్కడ సినిమాలు తీయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాతో దర్శక నిర్మాతలకు మంచి బ్రేక్ రావాలని కోరుకుంటున్నాను`` అన్నారు. వీన్ చంద్ర మాట్లాడుతూ - ``భూపాల్, ధనరాజ్, మనోజ్ నందం, పూజా రామచంద్రన్ అందరూ నాకు బాగా తెలిసినవాళ్లే. ట్రైలర్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. భూపాల్‌కు ఆల్ ది బెస్ట్. ముగ్గురు క్యారెక్టర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. నిర్మాతలు
బె
కథపై నమ్మక ంతో సినిమా చేసినందుకు వారిని అభినందిస్తున్నాను. దర్శకుడు శ్రీ కిషోర్ ముప్పై రోజుల్లోపే సినిమాను పూర్తి చేశాడంటే, తనెంత పక్కాగా సినిమా చేశాడో అర్థం చేసుకోవచ్చు. టీమ్ ఆల్ ది బెస్ట్`` అన్నారు. నరాజ్ మాట్లాడుతూ - ```దేవిశ్రీ ప్రసాద్`లో భూపాల్, మనోజ్, ధనరాజ్ అనే క్యారెక్టర్స్‌ను కాకుండా దేవి, శ్రీ, ప్రసాద్ అనే మూడు క్యారెక్టర్స్‌ను మాత్రమే చూడండి. పాత్రల్లో ఒదిగిపోయే ప్రయత్నం చేశాం. శ్రీ కిషోర్ హాంగ్ కాంగ్ నుండి ఇక్కడికి వచ్చి సినిమాలు చేస్తున్నాడు. కాన్సెప్ట్‌ను నమ్మి సినిమా చేయడానికి ముందుకు వచ్చిన నిర్మాతలకు థాంక్స్. అలాగే డి.వెంకటేష్‌గారు సినిమాను విడుదల చేస్తుండటం మంచి పరిణామం. మేం సినిమా చూశాం. రెండు వారాలు సినిమా ఆడితే చాలు. ఇలాంటి చిన్న సినిమాలు ఆడితే మంచి కాన్సెప్ట్ సినిమాలు మరిన్ని వస్తాయి`` అన్నాయి. ర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ - ``సినిమా చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. సినిమా చూసిన తర్వాత నేను ఈ సినిమా నిర్మాణంలో భాగమయ్యాను. శ్రీకిషోర్ తక్కువ బడ్జెట్‌లోనే సినిమా చేశాడు. రేపు భవిష్యత్‌లో నేను స్ట్రయిట్ తెలుగు సినిమా చేస్తే శ్రీ కిషోర్ వంటి టాలెంటెడ్ డైరెక్టర్‌తోనే చేస్తాను. సినిమాలో ఎలాంటి వల్గారిటీ కనపడదు. అందరూ చూసేలా సినిమా ఉంటుంది`` అన్నారు. కిషోర్ మాట్లాడుతూ - ``సినిమా జర్నీ స్టార్ట్ చేసి ఏడాదిన్నర అయ్యింది. ధనరాజ్‌గారికే ముందు లైన్ చెప్పాను. తనకు లైన్ నచ్చగానే, సినిమా చేద్దామని అన్నాడు. ఇద్దరి సహకారంతో సినిమా పూర్తి చేశాను. సెన్సార్ వాళ్లు సినిమా చూశారు. బావుందని అన్నారు. తప్పకుండా సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది.
ధ
రా
ని
న
శ్రీ
టాలీవుడ్ P 5
లా
వోస్ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న మొదటి చిత్రం `నయనం`. ఎస్తేర్ నొరోన్హా,నోయెల్ సీన్ , శ్రీ మంగం , అర్జున్ ఆనంద్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి వద్ద ఈగ, మర్యాద రామన్న , మగధీర చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేసిన క్రాంతి కుమార్ వడ్లమూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇటీవల పూర్తి చేసుకుంది. ఈ చిత్రం యొక్క టైటిల్ లోగో లాంచ్ హైదరాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో `పెళ్లి చూపులు` చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ...``నయనం` టైటిల్ తో పాటు లోగో కూడా చాలా బావుంది. స్ర్కిప్టు కూడా కొంచెం విన్నాను ఇంట్రస్టింగ్ గా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజమౌళి గారి శిష్యుడి డైరక్షన్ లో సినిమా వస్తుందంటే ఎలా ఉండబోతుందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. నిర్మాత కూడా చాలా ప్యాషనేటెడ్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్టిస్టులందరూ కూడా టాలెంటెడ్ పర్సన్స్. అందరికీ నా శుభాకాంక్షలు`` అని తెలిపారు. దర్శకు డు క్రాంతి కుమార్ వడ్లమూడి మాట్లాడుతూ... “ నయనం` టైటిల్ లోగో ఆవిష్కరణ కు విచ్చేసిన రాజ్ కందుకూరి గారికి ధన్యవాదాలు. టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న సినిమా కూడా
కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని``అన్నారు. ర్మాతల్లో ఒకరైన శ్రీ రామ్ కందుకూరి మాట్లాడుతూ....`` మా తొలి చిత్రం `నయనం` లోగో లాంచ్ అభిరుచి గల నిర్మాత రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇటీవల ఎనౌన్స్ చేసిన నయన ం టైటిల్ కు, థీమ్ ఏంటో గెస్ చేయండంటూ మేము నిర్వహించిన వినూత్నమైన కాంటెస్ట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దీపావళి రోజున మా చిత్రానికి సంబంధించిన టీజర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. పోస్ట్ పొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి. నవంబర్ లో సినిమాను విడుదల చేయాలన్న ప్లాన్ లో ఉన్నాం`` అన్నారు. కా ఈ టైటిల్ లోగో లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్న నటులు నోయల్, శ్రీ, అర్జున్ ఆనంద్ ఒక మంచి సినిమాలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. చిత్రానికి కెమెరా చేతన్ మధురాంతకం , సంగీతంః గీత పూనిక , ఆర్ట్ఃరమేష్ , ప్రొడక్షన్ కంట్రోలర్ః చౌదరి , ప్రొడక్షన్ మేనేజర్ః మోహన్ రావు , పిఆర్ఓః కుమార స్వామి , కాస్ట్యూమ్ డిజైనర్ః అజబ్ , రచన సహకారంః టైం నాని , రవి కిరణ్ , కథః లావోస్ మోషన్ పిక్చర్స్ , నిర్మాతలుఃరామ్ కేతు, కృష్ణ మోహన్ , శ్రీ రామ్ కందుకూరి , నరేన్ లేబాకు, స్క్రీన్ ప్లే - దర్శకత్వంః క్రాంతి కుమార్ వడ్లమూడి.
ని
ఇం ఈ
6 P టాలీవుడ్
టాలీవుడ్ P 7
మి
స్టర్ పెళ్లాం’, ‘శ్రీకారం’ వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ చాముండీ చిత్ర చాలా విరామం తర్వాత మళ్లీ సినిమాలు నిర్మించనుంది. ఈ సంస్థ అధినేత గవర పార్థసారధి రెండు సినిమాలు నిర్మిస్తున్నారు. ఒకటి అడివి సాయికిరణ్ దర్శకత్వంలో మరొకటి సంకల్ప్‌రెడ్డి దర్శకత్వంలో.
అడివి శేష్‌హీరోగా...
వి
నాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి చిత్రాల ద్వారా దర్శకుడు అడివి సాయికిరణ్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా గవర పార్థసారధి
8 P టాలీవుడ్
నిర్మిస్తోన్న చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ త్వరలో ఆరంభం కానుంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు.
ఇం
సంకల్ప్‌రెడ్డి సినిమా త్వరలో ప్రారంభం
డియన్ ఫస్ట్ సబ్‌మెరైన్ మూవీ ‘ఘాజి’ ద్వారా జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు సంకల్ప్ రెడ్డి. ఆయన దర్శకత్వంలో ఓ సెన్సేషనల్ మూవీ నిర్మించడానికి గవర పార్థసారధి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఓ ప్రముఖ యువకథానాయకుడు ఈ చిత్రంలో నటించనున్నారు.
ఇ
టీవలే దసరా బరిలో నిలిచి మహానుభావుడు చిత్రంతో గెలిచిన దర్శకులు మారుతి తన తదుపరి టార్గెట్ ఎవరో చెప్పేసాడు . చైతూ తో నా తదుపరి చిత్రాన్ని చేస్తున్నాను ఇక నా టార్గెట్ అల్లు అర్జున్ , ప్రభాస్ లు ఈ ఇద్దరితో సినిమాలు చేయడమే నా ముందున్న లక్ష్యం అంటూ తన మనసులో ఉన్న మాటని బయట పెట్టేసాడు మారుతి . అల్లు అర్జున్ తో ఎన్నాళ్ళుగానో మారుతి కి స్నేహం ఉంది , పైగా అల్లు అర్జున్ తో సినిమా చేయాలనీ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు మారుతి . యితే ఆ ఛాన్స్ త్వరలోనే రానున్నట్లు చెబుతున్నాడు మారుతి . అల్లు అర్జున్ కూడా మారుతి చెప్పే స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు . నాగచైతన్య తో సినిమా కంప్లీట్ చేసాక అల్లు అర్జున్ కోసం కథ చేసే పనిలో పడతాడు . అలాగే బాహుబలి తో ప్రభాస్ రేంజ్ ప్రపంచ వ్యాపితం అయ్యింది కాబట్టి అతడితో కూడా సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు మారుతి . మహానుభావుడు చిత్రంతో సక్సెస్ అందుకున్నాడు కనుక మారుతి కి అల్లు అర్జున్ , ప్రభాస్ లు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది..... అప్పుడు మారుతి నెక్స్ట్ లెవల్ డైరెక్టర్ అవుతాడు అనడంలో సందేహం లేదు .
అ
టాలీవుడ్ P 9
ది
ల్` నుండి ఇటీవల విడుదలైన `ఫిదా` వరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఓ సెన్సేషనల్ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఆ చిత్రమే `ఇండియన్ 2 `. 21 ఏళ్ల క్రితం విడుదలై తెలుగు, తమిళనాట బ్లాక్ బసర్ ్ట చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన చిత్రం `భారతీయుడు` అందరికీ గుర్తుండే ఉంటుంది. సమాజంలో లంచానికి వ్యతిరేకంగా పోరాడే ఓ స్వాతంత్ర్య సమరయోధుడి కథతో రూపొందిన `భారతీయుడు` చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ అద్భుతంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విలక్షణ నటుడు కమల్ హాసన్ భారతీయుడుగా సినీ ప్రేక్షకులను తన నటన తో మెప్పించారు. ఇప్పుడు కమల్ హాసన్, శంకర్‌ల హిట్ కాంబినేషన్లో భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియన్ 2` భారీ బడ్జెట్ సినిమాను దిల్‌రాజు తన నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై నిర్మించనున్నారు. ఈ సందర్భంగా...
10 P టాలీవుడ్
హి
ట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ - ``మా బేనర్‌లో ఎన్నో విజయవ ంతమైన చిత్రాలను అందించిన సంగతి తెలిసిందే. మా ప్రయత్నాన్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారు మా బేనర్‌పై ఉంచిన నమ్మకంతో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ `ఇండియన్ 2` సినిమాను నిర్మించబోతున్నాం. హై టెక్నికల్ వేల్యూస్‌తో కాంటెంపరరీ పాయింట్‌తో ఈ సీక్వెల్ రూపొందనుంది. మా నిర్మాణ సంస్థలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రమిది. స్టార్ డైరెక్టర్ శంకర్‌గారు సినిమాను డైరెక్ట్ చేస్తారు. శంకర్‌గారు ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్ `2.0`తో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తైన వెంటనే, మా `ఇండియన్ 2` మొదలవుతుంది. మొదటి భాగంగా వచ్చిన `భారతీయుడు` సినిమా ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాను మించేలా `ఇండియన్ 2`ను తెలుగు, తమిళ భాషల తో పాటు ఇతర భాషల్లో నిర్మించబోతున్నాం. సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక వివరాలను త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు.
అ
నీల్ బురగాని (వజ్రాలు కావాలా నాయనా ఫేం) కరీమ్ మునీషా జంటగా నటిస్తోన్న చిత్రం `ఐ రావణ`. కళ్యాణ్ శ్రీ వర్మ దర్శకు డిగా పరిచయం అవుతున్నారు. దాన్య ప్రొడక్షన్స్ పతాకంపై రత్న సంధ్య నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్టు లుక్ , మోషన్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లో జరిగింది. నటుడు, `మా` అధ్యక్షుడు శివాజీ రాజా పోస్టర్, ఫస్టు లుక్ ను ఆవిష్కరించారు. నంతరం ఆయన మాట్లాడుతూ, ` తెలుగు సినిమా ఇండస్ర్టీకి మరో కొత్త దర్శకు డు పరిచయం అవుతున్నాడు. కళ్యాణ్ గతంలో షార్ట్ ఫిలింస్ చేసి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఒకప్పుడు సినిమా డైరెక్ట్ చేయాలంటే చాలా సమయం పట్టేది. కానీ ఇప్పుటి తరం అంతా షార్ట్ ఫిలింస్ తో ట్యాలెంట్ ప్రూవ్ చేసుకుని త్వరగా దర్శకు లు అవుతున్నారు. పోస్టర్ బాగుంది. కథ కాన్సెప్ట్ చక్కగా ఉంది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి` అని అన్నారు. రో అనీల్ బురగాని మాట్లాడుతూ, ` శివాజీ రాజాగారు చేతుల మీదుగా పోస్టర్ లాంచ్ చేయడం సంతోషంగా ఉంది. ఇది నాకు రెండవ సినిమా. ఇందులో కామన్ మ్యాన్ గా కామ్ గోయింత్ పాత్రలో కనిపిస్తా. బాధ్యత అంటే ఎంటో చెప్పే సినిమా ఇది. షూటింగ్ దాదాపు పూర్తయింది. మంచి అవుట్ ఫుట్ వచ్చింది. ఎలాంటి అసభ్యకర సన్నివేశాలకు తావు లేకుండా అందర్నీ అలరించే సినిమా ఇది` అని అన్నారు.
అ
హీ
ద
ర్శకుడు కళ్యాణ్ వర్మ మాట్లాడుతూ, ` రెస్పాన్స్ బులుటీ అనే పాయింట్ కు రామాయణంలో రావణుడి క్యారెక్టర్ ను ఆపాదించి తెరకెక్కించిన సినిమా ఇది. అందుకే ఐ రావణ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. బాద్యత గురించి మా హీరో ఎలా రియక్ట్ అయ్యాడు? యవతకు ఇచ్చిన సందేశం ఏంటి అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇందులో హీరోయిన్ జాబ్ సెర్జింగ్ గర్ల్ గా కనిపించనుంది. కథనం ఆసక్తికరంగా సాగుతుంది. టాకీ పార్టు పూర్తయింది. మొత్తం ఐదు పాటలున్నారు. రెండు బ్యాలెన్స్ పాటలను షూట్ చేయాల్సి ఉంది. త్వరలోనే ఆ పనులు కూడా పూర్తిచేసి ట్రైలర్, టీజర్, ఆడియో రిలీజ్ చేస్తాం. తెలుగు ప్రేక్షకులంతా మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా` అని అన్నారు. రోయిన్ కరీమ్ మునిషా మాట్లాడుతూ,` కాన్సెప్ట్ బేస్డ్ మూవీ ఇది. దర్శకుడు చక్కగా తెరకెక్కిస్తున్నారు. అనీల్ మంచి సహనటుడు. అంతా కొత్త వాళ్లైనా బాగా నటించారు. అందరికీ నచ్చే సినిమా అవుతుంది` అని అన్నారు. చిత్రంలో హరి ఎడ్లపల్లి, ఆర్. జె చందు ( రేడియో జాకీ) తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సతీష్ ముదిరాజ్, నేపథ్య సంగీతం: అరవింద్ రామా, నిర్మాత: రత్న సంధ్య, దర్శకుడు: కళ్యాణ్ శ్రీ వర్మ.
హీ
ఈ
టాలీవుడ్ P 11
ప
క్కింటి కుర్రాడు పాత్రల్లో నటించి మన కుటుంబంలో కుర్రాడిలా మన హ్రుదయాల్లో స్థానం సంపాయించిన నాగశౌర్య ఏ చిత్రం చేసినా కుటుంబ విలువలు వుండేలా చక్కటి ఎంటర్ టైన్‌మెంట్ కథలు ఎంచుకుంటారు. ప్రస్తుతం నాగశౌర్య ఐరా క్రియోషన్స్ బ్యానర్ పై కాలేజి బ్యాక్‌డ్రాప్ లో లవ్ ఎంటర్టై న్‌మెంట్ చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తరువాత మన్యం ప్రోడక్షన్ బ్యానర్ లో ప్రోడక్షన్ నెం1 గా మన్యం విజయ్ కుమార్ నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పిల్ల జమిందార్, సుప్రీమ్, గీతాంజలి, ఎక్కడకి పోతావు చిన్నవాడా లాంటి సూపర్‌డూపర్ చిత్రాలకి అద్బుతమైన సినిమాటోగ్రఫి అందించిన సాయి శ్రీరామ్ దర్శకు డిగా పరిచయం అవుతున్నారు. అందాల రాక్షసి, అర్జున్ రెడ్డి లాంటి చిత్రాలకి సంగీతాన్ని అందించిన రాదాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని డిసెంబర్ లో ప్రారంభిస్తారు. ఇతర వివరాలు అతిత్వరలో తెలయజేస్తారు. సందర్బంగా నిర్మాత మన్యం విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఫ్యామిలి ఆడియన్స్ లో మంచి స్థానం సంపాయించుకున్న నాగశౌర్య హీరోగా మా బ్యానర్
ఈ
12 P టాలీవుడ్
లో చిత్రాన్ని చేస్తున్నాము. వెరీ బ్యూటిఫుల్ ఇంటిలెజెంట్ సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడి గా మారుతున్నారు. ప్రస్తుతం నాగశౌర్య చేస్తున్న చిత్రానికి కూడా సాయి శ్రీరామ్ నే సినిమాటోగ్రాఫర్ కావటం విశేషం. అలాగే అర్జున్ రెడ్డి కి చాలా మంచి సంగీతాన్ని అందించిన రాదాన్ మ్యూజిక్ చేస్తున్నారు. అలాగే ప్రవీణ్ పుడి ఎడిటర్ గా చేస్తున్నారు. నాగశౌర్య కి ఈ చిత్రం కొత్త తరహ ఇమేజ్ ని తీసుకువస్తుంది. విజువల్ బ్యూటి ఎలా తీసుకురావాలో మా దర్శకుడి కి తెలుసు కాబట్టి ఈ చిత్రం టెక్నికల్ గా ఏరేంజిలో వుండబోతుందో చూసిన ఆడియన్స్ కి తెలుస్తుంది. అలాగే డిసెంబర్ లో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ని స్థార్ట్ చేస్తాము. ఇతర వివరాలు అతిత్వరలో తెలియజేస్తాము. అలాగే తెలుగు ప్రేక్షకులందరికి విజయదశమి శుభాకాంక్షలు అని అన్నారు
క
ణామయుడిగా, వేమనగా, ఆంద్రకేసరిగా తెలుగు రు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన నట పిపాసి విజయ్ చందర్. తాజాగా ఆయన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సచ్చిదానంద సమర్ధ సద్గురువుగా భక్తులచే కీర్తించబడే శ్రీ షిరిడి సాయినాధుని కథను `సాయి నీ లీలలు` టైటిల్ తో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. విజయ్ చందర్ దర్శకత్వ పర్యవేక్షణలో సజ్జల శ్రీనివాస్ నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. గా ఈ సినిమా పాటల రికార్డింగ్ పనులు పూజా కార్యక్రమాలతో ప్రసాద్ ల్యాబ్స లో ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభం అయ్యాయి. అనంతరం ఆయన మాట్లాడుతూ, ` విజయ్ చందర్ గారు గతంలో ఎన్నో భక్తి రస చిత్రాలు చేశారు. అవన్ని తెలుగు ఆడియోన్స్ ను ఎంత గానో అలరించాయి. మరో సారి సాయి నాథుని రూపంలో వస్తున్నారు. సినిమా చక్కని విజయం సాదిస్తుoది` అని అన్నారు. టుడు విజయ్ చందర్ మాట్లాడుతూ, ` 30 ఏళ్ల తర్వాత మళ్లీ బాబా ఆశీస్సులలతో ఆయన సినిమా చేస్తున్నా. నటీనటుల ఎంపిక మొత్తం పూర్తయింది. ఈనెలంతా పాటల రికార్డింగ్ పనులు జరుగుతాయి. నవంబర్ నెలఖారుకల్లా సినిమా సెట్స్ కు వెళ్తుంది. గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉంది. సినిమాకు అవి హైలైట్ గా ఉంటాయి. కరుణామయుడు సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డానో ఈ సినిమా కోసం అంతే కష్టం ఉంటుంది. అన్ని పనులు పూర్తి చేసి మార్చి నెల లోపు సినిమా విడుదల చేస్తాం` అని అన్నారు.
కా న
కా
జా సూర్య నారాయణ మాట్లాడూతూ,` సాయి బాబా పాత్ర వేస్తే విజయ్ చందర్ గానే వేయాలి. ఆయన ఆహార్యం...నటన ఎంత బాగుంటాయో గత సినిమాలు చూస్తే తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామి తర్వాత ప్రతీ ఒక్కరూ పూజించే దేవుడు సాయిబాబు. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది` అని అన్నారు. నంత శ్రీరాం మాట్లాడుతూ,` పాటలు, సంగీతం ఒక రే చేస్తే బాగుంటుందని విజయ్ చందర్ గారు సూచించడంతో నేను సంగీతం చేస్తున్నా. చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ చందర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు అని అన్నారు. నంత శ్రీరామ్ తండ్రి వీర వెంకట సత్యన్నారయణ మూర్తి మాట్లాడుతూ,` సాయిబాబా గా విజయ్ చందర్ గారు మాత్రమే నటించగలరని ఇప్పటికే నిరూపించుకున్నారు. మళ్లీ సాయిలీలలు టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటివరకూ నా కుమారుడు అనంత శ్రీరాం పాటల రచయితగానే అలరించాడు. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సినిమా చక్కని విజయం సాధించాలి` అని అన్నారు. టల రచయిత తొటపల్లి మధు మాట్లాడుతూ, ` 1985 లో శ్రీ షిరిడి సాయి బాబా మ హత్యానికి మాటలు రాశాను. మళ్లీ 30 ఏళ్ల తర్వాత సాయిబాబా సినిమాకు పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. విజయ్ చందర్ గారిని ఒప్పించడం అంటే చిన్న విషయం కాదు. చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇంటర్వెల్...క్లయిమాక్స్ సీన్లు, డైలాగ్ లు హైలైట్ గా ఉంటాయి` అని అన్నారు.
అ అ
మా
టాలీవుడ్ P 13
మా ` మూవీ ఆర్టిస్ట్ అసోసియేష్ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా `మా` టీమ్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల హైదరాబాద్ ఫిలి ఛాంబర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. లిత `మా` మాజీ అధ్యక్షులు, ఎంపీ మురళీ మోహన్ చేతుల మీదుగా బర్త్ డేలు జరుపుకుంటోన్న మా టీమ్ సభ్యులకు మెమోంటో లు అందజేశారు. అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది వరకూ ఈ విధానం కొనసాగనుంది. నంతరం మురళీ మోహన్ మాట్లాడుతూ, ` 25 సంవత్సరాలు క్రితం ఓ ఛారిటీ క్రికెక్ కోసం వెళ్లి విశాఖపట్టణం నుంచి నేను , చిరంజీవి గారు తిరిగి వస్తుండగా విమానంలో మనకంటు ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకుంటే మంచిదని గాల్లో ప్రయాణిస్తూ తీసుకున్న నిర్ణయ ం నుంచి పుట్టిందే `మా`. అసోసియేషన్ ద్వారా ఇన్నేళ్ల పాటు చాలా మంది కళాకారులకు పలు విధాలుగా లబ్ది పొందారు.మా` అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ, ` మురళీ మోహన్ గారు `మా` కు సరైన ఆఫీస్ లేకపోవడంతో ఆయన ఇంటిలోనే కొన్నాళ్ల పాటు ఆఫీస్ రన్ చేశారు. `మా` ఎంతో మందికి నీడనిచ్చింది. మరెంతో మందికి సహాయం గా నిలుస్తుంది. `మా` తరుపున నరేష్ అధ్యక్షతన ఇప్పటికే ఒక సర్వే కమిటీ ఏర్పాటు చేసి ఎంతో మందికి అన్ని రకాలుగా సహాయం అందించడం జరిగింది. 2500 రూపాయలను అందించడం, ఉచితంగా ఆరోగ్య కార్డులను ఇవ్వడం జరిగింది. ఇటీవల రెండవ సర్వే కమిటీ కూడా జెండా ఊపి ప్రారంభిస్తున్నాం. `మా` లో ఉన్న ప్రతి ఆర్టిస్ట్ దగ్గరకు నేరుగా వెళ్లి వాళ్ల సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. మొదటి సర్వే కమిటీలో లబ్ది పోందిన వారికి ఈ కమిటీ
తొ
అ
14 P టాలీవుడ్
ఉపయుక్తంగా ఉండదు. అలాగే ఎస్. వి. కృష్టారెడ్డిగా రు చైర్మన్ గా ఓల్డేజ్ హోమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. `మా` అధ్యక్ష పదవిలో ఎవరున్నా ఐదేళ్లు మాత్రం ఓల్డేజ్ హోమ్ బాధ్యతల్నీ ఆయనే నిర్వర్తిస్తారు. అలాగే ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలను చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు గారు మెంటర్స్ గా ఉండటానికి అంగీకరించారు. నాగార్జున గారు తమ స్టూడియో లను ఉచితంగా వినియోగించుకోమని అనుమతి కూడా ఇచ్చారు. ఈనెల 30వ తేదీ వరకూ మా మెంబర్ షిప్ డ్రైవ్ చేపడుతుంది. లక్షల్లో పారితోషికం తీసుకేనే వాళ్లంతా మెంబర్ షిప్ తీసుకోవాలి. లేకపోతే `మా` నుంచి ఎలాంటి సహకారం అందదు. ఇది హెచ్చరిక కాదు. విన్నపం మాత్రమే`` అని అన్నారు. స్. వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ, ` నాకు అప్పగించిన ఓల్డేజ్ హోమ్ బాధ్యతను సంతృప్తిగా స్వీకరిస్తున్నా. ఓల్డేజ్ హోమ్ కాదు. గోల్టేజ్ హో మ్ ఇది. శివాజీ కమిట్ మెంట్, రెస్పాన్స్ బిలిటీ ఈ గల వ్యక్తి. `మా`కోసం ఆయన చాలా కష్టపడుతున్నాడు. `మా` ను మరింత ముందుకు తీసుకెళ్లాలి` అని అన్నారు. లాగే సినిమా ఆర్టిస్టుల పై అసభ్యకర ంగా రాసిన వెబ్ సైట్ల గురించి `మా` తరుపున సైబర్ క్రైమ్ ఎస్. పి. రామ్మోహనరావుకు వినతి పత్రం అందించారు. ఎస్. పి. రామ్మోహనరావు మాట్లాడుతూ, ` కొన్ని వెబ్ సైట్లలో సినిమా వాళ్ల గురించి మరీ నీచంగా కథనాలు వస్తున్నాయి. అది పైశాచిక ఆనందం మాత్రమే. అలాం టి వాళ్లపై తప్పకుండా సైబర్ క్రైమ్ కఠిన మైన చర్యలు తీసుకుంటుందని` హెచ్చరించారు. లాగే `మా` సహాయ నిధికి నటి సూర్య ప్రభ 25000 రూపాయల చె క్ ను అందించారు. అలాగే ఇటీవల చనిపోయిన ప్రొడక్షన్ చీఫ్ చిరంజీవి కుటుంబానికి తెలుగు టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ `మా` ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల చెక్ ను అందించారు.
ఎ అ అ
ఎ
న్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్. నలుగురు స్నేహితులతో కలసి రాక్‌బ్యాండ్‌ను స్టార్ట్ చేస్తాడు. ఆ రాక్‌బ్యాండ్‌కి అతనే లీడర్. చిన్నప్పట్నుంచి హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్‌లైఫ్‌లోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. వాళ్లలో ఎవరితో అభిరామ్ ప్రేమలో పడ్డాడు? అభిరామ్ జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అసలు, అభిరామ్ కథేంటి? అనేది ఈ నెల (అక్టోబర్) 27న చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్ తిరుమల. యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్ సినిమాస్ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో సినిమా మొత్తం పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ
ఈ
సినిమా సాగుతుంది. రామ్‌అద్భుతంగా నటించాడు. కిశోర్ కథ, కథనం, దర్శకత్వం... ప్రతిదీ కొత్త పంథాలో ఉంటుంది. రామ్, కిశోర్ తిరుమల కలయికలో మేం నిర్మించిన ‘నేను శైలజ’ తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో పాటల్ని, అక్టోబర్ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ర్శకుడు కిశోర్ తిరుమల మాట్లాడుతూ– ‘‘అభిరామ్ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్ లైఫ్, కాలేజ్ తర్వాత లైఫ్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. అభిరామ్‌గా రామ్‌జీవించారు. పాత్ర కోసం బాడీ మేకోవర్ కావడంతో పాటు సరికొత్త సై్టల్‌లోకి మారారు. అతని నలుగురు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్ కనిపించనున్నారు. అభిరామ్ కథలో భాగంగానే ప్రేమకథలూ ఉంటాయి. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు. చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.`
ద
ఈ
టాలీవుడ్ P 15
సీ
నియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ సినిమాల్లో నటించి చాలాకాలమే అయ్యింది. తాజాగా ఇన్నాళ్లకు గరుడవేగ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ గరుడవేగ చిత్రాన్ని నవంబర్ 3న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ ఐటమ్ సాంగ్ చేయగా పూజాకుమార్ హీరోయిన్ గా నటించింది. యితే హీరోగా ఆల్మోస్ట్ కెరీర్ క్లోజ్ అయిందని అనుకుంటున్న ఈ సమయంలో మళ్లీ యాంగ్రీ యంగ్ మాన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 90వ దశకంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన డాక్టర్ రాజశేఖర్ 2007 తర్వాత రేసులో లేకుండా పోయాడు. కట్ చేస్తే ఇప్పుడు మళ్లీ సత్తా చాటడానికి వస్తున్నాడు. మరి గరుడవేగ చిత్రంతో హిట్ కొడతాడా ? ప్రేక్షకుల ఆదరణ చూరగొంటాడా ? చూడాలి .
అ
'లా
హిరి లాహిరి లాహిరిలో' చిత్రంతో పరిచయమై దాదాపు 30 చిత్రాల్లో హీరోగా నటించారు ఆదిత్య ఓం. ఆదిత్య ఓం నటించి, దర్శకత్వం వహించిన 'ఫ్రెండ్‌రిక్వెస్ట్' గత సంవత్సరం విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆదిత్య ఓం విలన్ పాత్రలు, విలక్షణ పాత్రలు పోషించేందుకు సిద్ధమయ్యారు. అక్టోబర్ 5 ఆదిత్య ఓం పుట్టినరోజు సందర్భంగా ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నానని, ఈ విషయంలో తనకు సీనియర్ నటులైన జగపతిబాబు, సాయికుమార్, శ్రీకాంత్‌లను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలిపారు. హీరోగా ఒకటిన్నర దశాబ్దంగా తనను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు సదా కృతజ్ఞుడనై వుంటానని, ఇకపై విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం తనకు వుందని ఆదిత్య ఓం తెలిపారు.
టాలీవుడ్ P 17
‘‘తె
లుగువారు మరచిపోలేని, మరచిపోకూడని, మరచిపోని గొప్ప నటుడు అక్కినేని నాగేశ్వరరావుగారు. అటువంటి గొప్ప వ్యక్తిపై ‘మన అక్కినేని’ పేరుతో ఓ చక్కటి ఫొటో బయోగ్రఫీని ప్రముఖ సినీ పరిశోధకుడు సంజయ్ కిషోర్ తీసుకురావడం చాలా సంతోషకరం’’ అని భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. టీవల విజయవాడలోని స్వర్ణభారతి ట్రస్ట్‌లో ప్రముఖ సినీ పరిశోధకులు సంజయ్ కిషోర్ రచించి, సేకరించి, రూపొందించిన ‘మన అక్కినేని’ పుస్తక ఆవిష్కరణోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెంకయ్యనాయుడు, గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, ప్రత్యేక అతిథులుగా ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఆత్మీయ
ఇ
18 P టాలీవుడ్
అతిథులుగా ‘కిమ్స్’ ఛైర్‌పర్సన్ బొల్లినేని కృష్ణయ్య, ప్రముఖ సినీ దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హాజరయ్యారు. స్తకావిష్కరణ అనంతరం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ– ‘‘అక్కినేనిగారు అంచెలంచెలుగా ఎదిగిన క్రమాన్నీ, వారి జీవితంలో వివిధ పార్శా్వలను చిత్రసమేతంగా మనకు కళ్ళకు కట్టినట్లు ‘మన అక్కినేని’ పుస్తకంలో చూపించారు. పది కాలాల పాటు, పది తరాల పాటు అక్కినేనిగారు ఎలా నిలిచిపోతారో ఈ పుస్తకం చూస్తే తెలిసిపోతుంది. సంజయ్ కిషోర్‌లోని కళాత్మక క్రియాశీలత, సృజనాత్మకతకు దర్పణం ఈ పుస్తకం. అక్కినేనివారి గొప్పతనాన్నీ, నాటి తెలుగు సినిమా వైభవాన్నీ మనం చూసుకునే అవకాశాన్ని తన అద్భుతమైన కలెక్షన్స్‌తో ఈ పుస్తకం ద్వారా కల్పించిన సంజయ్‌కిషోర్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అన్నారు.
పు
శ్రీ
సరస్వతి ఫిలిమ్స్ పతాకం పై నాగ అన్వేష్, బ్యూటీ క్వీన్ హెబ్బా పటేల్ జంటగా తెరకెక్కిన విజువల్ వండర్ 'ఏంజెల్'. సోషియో ఫాంటసీ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమాకి రాజమౌళి శిష్యుడు బాహుబలి పళని దర్శకుడు. ప్రముఖ నిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. 45 నిమిషాలకు పైగా సీజీ సీన్స్ ఉండటంతో దాదాపు ఆరు నెలలుగా ఏంజెల్ బృందం ఈ విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉంది. ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాలు స్నో వైట్ అండ్ ద హంట్స్ మెన్, థార్, ఎవెంజర్స్ వంటి సినిమాలకి గ్రాఫిక్స్ అందించిన సీజీ నిపుణుల పర్యవేక్షణలో ఏంజెల్ విజువల్ ఎఫెక్ట్స్ పనులు జరుగుతున్నట్లుగా నిర్మాత భువన సాగర్ తెలిపారు. ఈ పనులతో పాటు తదితర పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ చేసి నవంబర్ 3న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా చిత్ర నిర్మాణ పర్యవేక్షకులు సింధూరపువ్వుకృష్ణారెడ్డి ప్రకటించారు. కళ్లు చెదిరే గ్రాఫీక్స్ తో పాటు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ రవివర్మ కంపోజ్ చేసిన భారీ యాక్షన్ ఎపిసోడ్స్, సప్తగిరి, తాగుబోతు రమేశ్, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను కాంబినేషన్ లో ఉన్న కడుపుబ్బా నవ్వించే కామెడీ సన్నివేశాలు, సెంటిమెంట్ సన్నివేశాల్లో నాగ అన్వేష్ పలికించే ఎమోషన్స్, హెబ్బా గ్లామర్ తో అన్ని
వర్గాల ప్రేక్షకుల్ని ఏంజెల్ అలరిస్తోందని దర్శకుడు పళని చెప్పారు. అలానే ఇప్పటికే విడుదలైన ఆడియోకి, ట్రైలర్ కి విశేష స్పందన లభిస్తున్నట్లుగా ఏంజెల్ చిత్ర బృందం తెలిపింది. యూ ట్యూబ్ లో ఈ సినిమా ట్రైలర్ అప్ లోడ్ చేసిన 24 గంటల్లోపే 10 లక్షలు వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమాకు బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సెసరోలియో సంగీత దర్శకత్వం వహించారు. భీమ్స్ ఇచ్చిన ట్యూన్స్ కచ్ఛితంగా శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయని ఏంజెల్ చిత్ర బృందం చెబుతోంది. బ్యానర్ శ్రీ సరస్వతి ఫిల్మ్స్ తారాగణం హీరో- నాగ అన్వేష్ హీరోయిన్- హేబా పటేల్ సుమన్, సప్తగిరి, తాగుబోతు రమేశ్,ప్రియదర్శీ కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను, సన సాంకేతిక వర్గం ప్రొడ్యూసర్- భువన్ సాగర్ డైరెక్టర్- 'బాహుబలి' పళని సంగీత దర్శకుడు- భీమ్స్ సెసిరోలియో సినిమాటోగ్రఫి - గుణ
క
మెడియన్ గా తెలుగు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేసి టాలీవుడ్ హీరోగా సుస్థిర స్తానం సంపాదించుకున్న సునీల్ మరో సారి తన దాతృత్వాన్ని చూపించాడు. తన వంతు గా ఎప్పుడు ఎవరు సాయం అడిగిన వారికి హెల్ప్ చేయడం ఆయన నైజం. అలాంటి సునీల్ అనాథ పిల్లల కోరిక మేరకు... రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి ఎంటర్ టైన్ చేయడం విశేషం. దాదాపు 20 మంది పిల్లల్ని రామోజీ ఫిల్మ్ సిటీ కి తీసుకెళ్లి వారిని ఆట పాటల్లో ముంచెత్తారు. సునీల్ ఇచ్చిన సర్ ప్రై స్ కి పిల్లలంతా ఎంజాయ్ చేశారు. తమకు బాగా ఇష్టమైన నటుడితో ఎంజాయ్ చేయడం లైఫ్ లో మర్చిపోలేమన్నారు. స్వచ్ఛమైన మమసున్న పిల్లలతో ఇలా గడపడం... నిజంగా నా అదృష్టమని హీరో సునీల్ ఈ సందర్బంగా ఆనందాన్ని పంచుకున్నారు.
టాలీవుడ్ P 23
త
న మొదటి సినిమాతోనే ఆస్కార్‌అవార్డ్‌నామినేషన్ వరకు వెళ్ళిన దర్శకుడు అనూప్ భండారి ఇప్పుడు తెలుగులో స్ట్రెయిట్‌మూవీ చేస్తున్నారు. జాలీ హిట్స్‌ప్రొడక్షన్స్ అధినేత అజయ్‌రెడ్డి గొల్లపల్లి,టాలెంటెడ్‌డైరెక్టర్‌భారతీయ సినిమా రంగానికి తన మొదటి చిత్రం 'రంగితరంగ' తో సుపరిచితమైన అనూప్ భండారిని 'రాజరథం' చిత్రంతో తెలుగులో పరిచయం చేస్తున్నారు. తెలంగాణలోని గొల్లపల్లి వాస్తవ్యుడైన అజయ్‌రెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. అక్కడ తెలుగు సినిమాలను ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు అజయ్‌రెడ్డి తెలుగు, కన్నడ భాషల్లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు. తెలుగులో 'రాజరథం' పేరుతో, కన్నడలో 'రాజరథ' పేరుతో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందుతోంది. రొమాంటిక్ కామెడీతోపాటు అడ్వెంచర్స్ కూడా ఈ చిత్రంలో వుంటాయి. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను అక్టోబర్2న విడుదల చేశారు. చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన అజయ్‌రెడ్డి గొల్లపల్లి తెలియజేస్తూ ''ఒక యునీక్ సబ్జెక్తో ట్ సినిమా చెయ్యాలని డిసైడ్‌అయ్యాము. ఎక్స్ట్రీ మ్‌టాలెంట్ కలిగిన రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు అయిన అనూప్ భండారిని అప్రోచ్ అయ్యాము. అనూప్ భండారి గతంలో 'రంగితరంగ' చిత్రానికి దర్శకత్వం వహించారు. 'రంగితరంగ' బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా 2016లో ఆస్కార్‌కి పంపే 305 చిత్రాలల్లో స్తానం పొందటం విశేషం.'రంగితరంగ' చిత్రం 2015 లో 8 IIFA,4 Film fare,7 SIIMA మరియు karnataka state అవార్డులు పొందింది. ఈ చిత్రం Overseas కలెక్షన్స్ లల్లొ రికార్డు బ్రేక్ చేసిన చిత్రంగా చరిత్రకెక్కింది.
ఈ
24 P టాలీవుడ్
ఈ
బ్లాక్‌బస్టర్‌మూవీలో నటించిన నిరూప్‌భండారి, అవంతిక శెట్టి మరోసారి 'రాజరథం' చిత్రంలో నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం తమిళ్‌హీరో ఆర్యను ఎంపిక చేశాం'' అన్నారు. ర్శకుడు అనూప్‌భండారి మాట్లాడుతూ ''ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో వేర్వేరుగా చిత్రీకరించడం జరిగింది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశాం. ఈ పోస్టర్లో హీరో, హీరోయిన్, రవిశంకర్ ఫస్ట్‌లుక్‌లను రివీల్ చేసాం. ఫస్ట్‌లుక్ పోస్టర్ డిఫరెంట్‌గా వుండేలా మా టీమ్ స్పెషల్ కేర్ తీసుకుంది. ఫస్ట్‌లుక్‌లో నిరూప్ భండారి టక్సిడోతో స్టైలిష్‌గానూ, అవంతిక శెట్టి ఎల్లో గౌన్, హెల్మెట్, గొడుగుతో క్యూట్‌గా కనిపిస్తుంది. ప్రముఖ నటుడు రవిశంకర్‌సరికొత్త హెయిర్ స్టైల్‌తో, ట్వీడ్‌కోట్‌తో స్పెషల్‌గా కనిపిస్తున్నారు. కాస్ట్యూమ్ డిజైనర్, అనూప్‌భండారి సతీమణి నీతాశెట్టి ఈ సినిమాకు కాస్ట్యూమ్స్‌ని ప్రత్యేకంగ డిజైన్ చేశారు . త్వరలోనే ఆర్యకు సంబంధించిన సోలో లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని'' తెలిపారు. చిత్రంలో ఆరు పాటలున్నాయి. ఈ పాటలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యాన్ని అందించారు. అనూప్ భండారి ఈ పాటలకు సంగీతాన్ని సమకూర్చారు. ఈ చిత్రానికి మాటలు అబ్బూరి రవి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్: అజనీష్ లోక్‌నాథ్, ఎడిటింగ్: శాంతకుమార్, సినిమాటోగ్రఫీ: విలియమ్ డేవిడ్, నిర్మాణం: జాలీహిట్స్ టీమ్ అంజు వల్లభనేని, విషు దకప్పగారి, సతీష్‌శాస్త్రి, అజయ్‌రెడ్డి గొల్లపల్లి, సంగీతం, స్క్రీన్ ప్లే, రచన, దర్శకత్వం,: అనూప్‌భండారి.
ద
ఈ
సు
ప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఈ షెడ్యూల్‌లో ఒక యాక్షన్‌సీన్, కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా, ఈ చిత్రానికి ఎస్.ఎస్. థమన్‌ని మ్యూజిక్‌డైరెక్టర్గా ఎంపిక చేశారు. ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లోనే జరుగుతోంది. యిధరమ్‌తేజ్, లావణ్య త్రిపాఠి, పోసాని కృష్ణమురళి, ప్రియదర్శి, నల్లవేణు, భద్రం, వెంకీ, రాహుల్ రామకృష్ణ, నాజర్, జె.పి., రాహుల్‌దేవ్, దేవ్‌గిల్, ఆకుల శివ, ఆశిష్ విద్యార్థి, పవిత్ర లోకేష్, కాశీ విశ్వనాథ్, బ్రహ్మానందం, ఫిష్‌వెంకట్, తాగుబోతు రమేష్‌తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
సా
ఈ
చిత్రానికి కథ, మాటలు: శివ ఆకుల, సినిమాటోగ్రఫీ: విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: బ్రహ్మ కడలి, మేకప్: బాషా, కాస్ట్యూమ్స్: వాసు, స్టిల్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: జి.జి.కె.రాజు, సతీష్ కొప్పినీడి, ఫైట్‌మాస్టర్: వెంకట్, కో-డైరెక్టర్స్: సూర్యదేవర ప్రభాకర్‌నాగ్, పుల్లారావు కొప్పినీడి, కో-ప్రొడ్యూసర్స్: సి.వి.రావు, పత్సా నాగరాజ, నిర్మాత: సి.కళ్యాణ్, స్క్రీన్‌ప్లేదర్శకత్వం: వి.వి.వినాయక్.
టాలీవుడ్ P 25
మొ
త్తానికి 85 రోజుల తర్వాత మలయాళ స్టార్ హీరో దిలీప్ కి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. మలయాళ హీరోయిన్ ని కిడ్నాప్ చేయించిన సంఘ్ టనలో దిలీప్ అసలైన దోషి అని పక్కా సమాచారం తో అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే జైలుకి వెళ్లినప్పటి నుండి దిలీప్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కానీ ఎన్నిసార్లు కోర్టు మెట్లు ఎక్కినప్పటికి దిలీప్ కి నిరాశే ఎదురైంది.
26 P టాలీవుడ్
కా
నీ దిలీప్ అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తుండటంతో అతడి అభ్యర్థనని మన్నించి బెయిల్ మంజూరు చేసింది దాంతో కటకటాలలోంచి బయటకు రానున్నాడు దిలీప్. సంచలనం సృష్టించిన హీరోయిన్ కిడ్నాప్ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. దిలీప్ నిర్దోషిగా బయటపడతాడా లేక దోషిగా శిక్షించబడతాడా ?
క
థ చెప్పమంటే భయపడుతున్నాడట దర్శకులు కళ్యాణ్ కృష్ణ , ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున చెబుతున్నాడు . సోగ్గాడే చిన్నినాయనా సినిమాకు దర్శకత్వం వహించాడు కళ్యాణ్ కృష్ణ. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ చేస్తామని ప్రకటించాడు నాగార్జున. అయితే ఆ సినిమా సంగతి పక్కన పెడితే రెండో సినిమా కూడా తన బ్యానర్ లోనే ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున . అదే రారండోయ్ వేడుక చూద్దాం. తూ , రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఆ చిత్రం హిట్ అయ్యింది. దాని తర్వాత కళ్యాణ్ కృష్ణ సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ అంటూ ఓ కథ చెప్పాడట కానీ ఆ కథ నచ్చలేదు నాగ్ కు ,దాంతో ఆ కథ నచ్చలేదని కళ్యాణ్ కృష్ణ ముఖం మీదే చెప్పాడట . దానికి తోడు రారండోయ్ వేడుక చూద్దాం సినిమా సమయంలో కళ్యాణ్ కృష్ణ పై అరిచాడట . అందుకే కాబోలు కళ్యాణ్ కృష్ణ కథ చెప్పడానికి భయపడుతున్నట్లు ఉన్నాడు.
చై
టాలీవుడ్ P 27
సు
ప్రసిద్ధ. సినీ నటులు, రచయిత శ్రీ ఎల్. బి. శ్రీరాం తన నాటక, సినీ రంగాల విశేష అనుభవంతో- లఘుచిత్రాల నిర్మాణం చేపట్టివాటికి lb sriram he'art' films అని పేరుపెట్టినిన్నటి, నేటి తరాల మధ్య వారధిగా నిలుస్తూ- మన సంస్కృతికీ, మానవతా సంబంధాలకీ, ముఖ్యంగా కుటుంబవిలువలకీ పెద్దపీట వేస్తూ- కొన్ని అపురూప చిత్రాల్ని తీసి, తన స్వంత YOUTUBE ఛానల్ ద్వారా మన ముందుంచేరు! సరా కానుకగా"డోలు-సన్నాయి" లఘుచిత్రంతో మళ్ళీ ఇప్పుడు మన ముందుకొచ్చారు! హిందూ వివాహ వ్యవస్థ ఔన్నత్యాన్నీ , 'ఆలు-మగల' అద్భత అనుబంధాన్నీ , 'డోలుసన్నాయి'ల మంగళ వాయిద్యంగా సరి పోలుస్తూ తీసిన ఈ చిత్రం- అందరి మనసుల్నీ ఎంతో అలరిస్తోంది! వంబరు,2017 నుంచి ప్రతినెలా ' మొదటి శుక్రవారం ' ఒక్కో వైవిధ్యభరితమైన కొత్త చిత్రంతో మన ముందుకొస్తూంటామని- ఎల్.బి.శ్రీరాం తెలియజేశారు!
ద
న 28 P టాలీవుడ్
కో
ట్ల కొద్దీ రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు , దర్శకులు కానీ , కోట్ల కొద్దీ భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు తీసే నిర్మాతలు కానీ సినీ కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు కానీ చిన్న చిన్న వేషాలు వేసుకునే కాదంబరి కిరణ్ మాత్రం సినీ కార్మికుల సేవలో తరించిపోతున్నాడు . స్వతహాగా జర్నలిస్ట్ అయిన కాదంబరి కిరణ్ ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి నటుడిగా దర్శకుడిగా రాణించాడు . అయితే కాలక్రమంలో డైరెక్షన్ ని పక్కన పెట్టి నటుడిగా కొనసాగుతున్నాడు . నిమా రంగం అంటేనే బోలెడు కష్టాలు , ఆ కష్టాల సుడిగుండంలో చిక్కుకొని విలవిల్లాడుతున్న అభాగ్యులకు అండగా నిలవడం కోసం '' మనం సైతం ''
సి
అనే స్వచ్ఛంద సంస్థ ని నెలకొల్పి మిత్రులందరి సహకారంతో కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు . ఇప్పటికే పలువురికి ఆర్ధిక సహాయం అందించిన కాదంబరి ,మునుముందు సినీ కార్మికుల సంక్షేమం కోసం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు . తన తోటి కళాకారుల సహకారంతో మనం సైతం అనే స్వచ్ఛంద సంస్థ ని స్థాపించాడు . కాదంబరి కిరణ్ చేస్తున్న సేవలను కొనియాడుతూ పలువురు దర్శక నిర్మాతలు , నటీనటులు అతడికి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు .
టాలీవుడ్ P 29
శ్రీ
రత్నం దవేజీ సమర్పణలోశ్రీ సాయి పవన్‌పుత్ర ప్రొడక్షన్స్ బేనర్పై అవ్వారు వంశీ కృష్ణ నిర్మాణ సారథ్యంలో వెంకట్ దర్శకుడిగా జె.వి.నాయుడు నిర్మిస్తోన్న సినిమా ప్రారంభమైంది. రికార్డింగ్ కార్యక్రమాలతో విజయదశ మి సందర్భంగా సినిమాను స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత జె.వి.నాయుడు మాట్లాడుతూ ``ప్రస్తుతం టాలీవుడ్‌లో ట్రెండ్ క్రియేట్ చేస్తోన్న హారర్, లవ్, కామెడీ, సెంటిమెంట్ సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్న సంగతి తెలిసిందే.ప్రేక్షకులను మెప్పిస్తున్న లవ్ కామెడీ హారర్ అంశాలతో పాటు మనసుకు హత్తుకునే పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు వెంకట్. మధుమితతో పాటు యుక్త ప్రియ హీయిన్‌గా నటిస్తుంది. మరో హీరోయిన్ ఎవరనే ది త్వరలో తెలియజేస్తాం. అలాగే కృష్ణభ గవాన్, కాదంబరికిరణ్,
రాకెట్ రాఘవ, తాగుబోతు రమేష్, షకల క శంకర్, భావన, సురేఖావాణి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రంంలో ఇద్దరు ప్రముఖ హీరోలు నటించనున్నారు. వీరీతో పాటు సాంకేతిక వర్గాన్ని త్వరలోనే తెలియజేస్తాం`` అన్నారు. చిత్రానికి సమర్‌ణః రత్నం దవేజీ, సహ నిర్మాతలుః అవ్వారు వంశీకృష్ణ, కొలన్ నందన్‌రెడ్డి, నిర్మాతః జె.వి.నాయుడు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంః వెంకట్.
ఈ
సడెన్ గా నా దగ్గరకు వచ్చి బుక్ రాసాను రావాలంటే ఆశ్చర్యపోయాను. ముందుమాటలన్నీ చాలా గొప్పగా ఉన్నాయి. అవి చూసి బుక్ రాయోద్దు...రాస్తూనే ఉండని అన్నా` అని అన్నారు. సమయి బాలకృష్ణ మాట్లాడుతూ,` నేను ఎదగడంలో చిత్రలేఖ పాత్ర ఉంది. నేను, ఆమె కలిసిన ప్రోగ్రామ్స్ నా రాజకీయ రంగానికి బాగా పనికొచ్చింది. తెలంగాణ అత్యంత క రువు జిల్లా మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి మంచి స్థానానికి చేరుకుంది. ఆ జిల్లా పేరు చెప్పుకోవాలంటేనే సముసాయించే వాళ్లం. కానీ ఆమె ఇక్కడ పోటీని తట్టుకుని నిలబడి సక్సెస్ అయింది. పుస్తకం ఇంకా చదవలేదు. బాగా రాసిందని అంతా అంటుంటే చాలా సంతోషంగా ఉంది` అని అన్నారు. నికెళ్ళ భరణి మాట్లాడుతూ,` చిత్ర లేఖ రాధాకృష్ణల పై పు స్తకం రాసి చాలా పెద్ద సాహసం చేసింది. కొన్ని కొన్ని అంతగా సరిగ్గా లేకపోయినా ఎక్కువ భాగం పుస్తకంలో అంశాలు బాగున్నాయి. ఆమెలో మంచి ర చయిత్రి ఉంది` అని అన్నారు. వారెడ్డి మాట్లాడుతూ,` 1200 వందల ప్రోగ్రామ్స్ ఆమె చేసింది. మంచి వ్యాఖ్యాత. చక్కని నటన, డ్యాన్స చేస్తుంది. ఆమె ఆల్ రౌండర్` అని అన్నారు. గడపాటి శ్రీధర్ మాట్లాడుతూ,` చిత్రలేఖ గారు ఇప్పటితరం వాళ్లకు రోల్ మోడల్ గా నిలుస్తారు. మంచి పుస్తకం రాసి ఇంతమంది రచయితల సమక్షంలో నేను పాల్గొనడం చాలా గర్వంగా ఉంది` అని అన్నారు. ల్యాణ్ కృష్ణ మాట్లాడుతూ,` చాలా పుస్తకాలు చదువుతాం. కానీ కొన్ని అర్ధం కాదు. కానీ పుస్తకం రెండు సార్లు చదివాను. బాగా అర్ధమైంది` అని అన్నారు. ణి చిత్రలేఖ మాట్లాడూత, `నాకు చాలా మంది సహాయం చేశారు. నాలో కవయిత్రిని గుర్తించి జనార్ధన్ మహర్షిగారు. తర్వాత తనికెళ్ల భరణి గారు నాకు అన్ని రకాలుగా స్ఫూర్తి. చంద్రబోసు గారు ఇంట్లో నాకు తొలిసారి సన్మానం చేశారు. నన్ను కవయిత్రిగా గుర్తించిన వారిలో వారు ఉన్నారు. తెలుగింటి అమ్మాయి చాలా మందికి రీచ్ అయ్యాను. చాలా సంతోషంగా ఉంది. ఈ పుస్తకం విషయంలో జోన్న విత్తలు రామలింగేశ్వరరావు, సౌభాగ్య, గొల్లపూడి మారుతిరావు గారి సహకారం మరువలేనిది.ఇక్కడకు నన్ను ఆశీర్వదిండానికి వచ్చిన ప్రతీ ఒక్కరికి కృతజ్ఞతలు` అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వకలంతా ్త చిత్రలేఖ పనితనాన్ని ప్రశంసించారు.
ర `క్లా
స్ మెట్స్', 'శంభో శివ శంభో', 'పరుగు', 'దమ్ము', లయన్', 'దళం' తదితర చిత్రాల్లో కీలక పాత్రల ద్వారా సిల్వర్ స్ర్కీన్ పై మెరిసిన రాణీ చిత్రలేఖ సుపరిచితురాలే. వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై యాంకర్ గా కూడా రాణిస్తున్నారు. స్ట్ ఫర్ ఫన్' అని 'మా' టీవీలో సందడి చేసినా, 'యాహూ' అని ఈటీవీలో అల్లరి చేసినా, 'స్వరనీరాజనం' అని తీయని స్వరంతో 'జీ తెలుగు'లో మాట్లాడినా, 'ఆట' డ్యాన్స్ షో ద్వారా అలరించినా... ఏ ప్రోగ్రామ్ కైనా, ఏ ఛానల్ కైనా యాంకర్ చిత్రలేఖ న్యాయం చేస్తారు. డ్యాన్స్ షో, టాక్ షో, మ్యూజిక్ షో ఏదైనా ఓకే. అందుకే యాంకర్ గా రాణీ చిత్రలేఖ బోలెడంత పాపులార్టీ తెచ్చుకున్నారు. ఇక, బుల్లితెర నటిగా 'రాధా మధు', 'నాన్న', 'మానసవీణ', 'సీతారామపురం' వంటి సీరియల్స్ ద్వారా నటిగా తానేంటో నిరూపించుకున్నారు. కర్ గా, నటిగా మాత్రమే కాదు.. 'వన్నెపూల విన్నపాలు'తో తనలో మంచి రచయిత్రి కూడా ఉందని నిరూపించుకోవడానికి రాణీ చిత్రలేఖ మన ముందుకు వచ్చారు. ఇటీవల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఆమె రచించిన `వన్నెపూల విన్నపాలు పు స్తకావిష్కరణ కార్యక్రమం సీనియర్ రచయిత శివారెడ్డి తో పాటు పలువురు రచయితల చేతుల మీదుగా జరిగింది. ద్రబోస్ మాట్లాడుతూ,` మంచి పరీశీలనతో బుక్ రచించారు. చక్కని భావుకత ఉంది. ఈ బుక్ లాంచింగ్ రావడం అరుదైన అవకాశంగా భావిస్తున్నా` అని అన్నారు. చయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ, చిత్రలేఖ యాక్టర్ గా పరిచంయం. మంచి నటి అవుతుంది. అంకిత భావం ఉంది. కానీ మంచి వ్యాఖ్యాత అయింది.
'జ
యాం చం
ర
త శి
ల క రా
టాలీవుడ్ P 31
మై
టీ స్టార్ శ్రీకాంత్ ప్రధాన పాత్రలో ఏవీఎల్ ప్రొడక్షన్స్ సంస్థ కొత్త చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రంతో అభయ్ కథానాయకుడిగా టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వైద్య రంగం నేపథ్యంలోని అంశాలతో మెడికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. జై రాజా సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ చిత్రంలో భాగమవడం గురించి కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ....కథ నన్ను బాగా ఆకట్టుకుంది. సబ్జెక్ట్ వినగానే నచ్చి వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను. చిత్రంలో నాది ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్. ఇలాంటి మంచి కథలో కీ రోల్ చేస్తుండటం సంతోషంగా ఉంది. జై రాజా సింగ్ కొత్త దర్శకుడు అయినా భిన్నమైన కథను ప్రతిభావంతంగా రాసుకున్నారు. అన్నారు. దర్శకుడు జై రాజా సింగ్ మాట్లాడుతూ... ఎప్పుడూ మంచి పాత్రలు, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని శ్రీకాంత్ గారు ఆరాటపడుతుంటారు. ఆయనలో గొప్ప నటుడు ఉన్నారు. కథ రాసుకుంటున్నప్పుడే ఈ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు చేయాలని అనుకున్నాను. ఆయన మా సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. ఇప్పటిదాకా తెరపై చూపించని విధంగా కొత్త తరహాలో ఆయన పాత్ర ఉంటుంది. మెడికల్ థ్రిల్లర్ గా సినిమాను రూపొందించబోతున్నాం. మంచి కాస్ట్ అండ్ క్రూ తో త్వరలో సెట్స్ మీదకు చిత్రాన్ని తీసుకెళ్తాం. అన్నారు.
32 P టాలీవుడ్
యం
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో '' సాహో '' చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ ఏడెకరాలలో షూటింగ్ జరుపుకుంటోంది . బాలీవుడ్ భామ శ్రద్దా దాస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందుతోంది . అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పూర్తి కాకముందే ప్రభాస్ మరో సినిమాని పట్టాలెక్కించడానికి సమాయత్తం అవుతున్నాడు . పీచంద్ తో జిల్ వంటి చిత్రాన్ని అందించిన రాధాకృష్ణ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ తో చేయడం విశేషం . ఇక ఈ చిత్రాన్ని కూడా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించనుంది . ప్రభాస్ కోసం రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాడు రాధాకృష్ణ . జిల్ సమయంలోనే ప్రభాస్ కు కథ చెప్పడం అది నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు . కాగా ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు పట్టాలెక్కుతోంది . సాహో పూర్తికాకుండానే మరో సినిమా సెట్స్ పైకి తీసుకెళ్తూ జోరు చూపిస్తున్నాడు ప్రభాస్ .
గో
టాలీవుడ్ P 33
?
మె
గాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తో అదరగొట్టిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని తెలుగు , తమిళ , హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సైరా నరసింహారెడ్డి సినిమా ప్రారంభం కాగా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే జరుపుకోనుంది. లెజెండ్ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మరో స్పెషల్ ఏంటో తెలుసా........ వలం ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా ......5 కోట్ల రూపాయలు. అవును వినడానికి ఆశ్చర్యంగా అనిపించినప్పటికి అయిదు కోట్ల రూపాయలను బట్టల కోసం ఖర్చు పెడుతున్నారు. చారిత్రాత్మక చిత్రం కాబట్టి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా చిరు సరసన నయనతార నటిస్తోంది. అయితే ఇంకా సంగీత దర్శకుడు ఎవరు అన్నది తేలలేదు. ముందుగా తమన్ ని అనుకున్నారు కట్ చేస్తే ఏ ఆర్ రెహ్మాన్ వచ్చాడు కానీ ఇప్పుడు వినబడుతున్న కథనం ప్రకారం మరొకరిని ఎంపిక చేసే పనిలో ఉన్నారు.
కే
34 P టాలీవుడ్
యు
వకథానాయకుడు రాజ్‌తరుణ్ ఇప్పుడు వరుస విజయాలతో సక్సెస్‌ఫుల్ హీరోగా రాణిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏటీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బేనర్‌పై రాజ్‌తరుణ్ హీరోగా రూపొందిన 'ఈడోరకం-ఆడోరకం', 'కిట్టుఉన్నాడుజాగ్రత్త', 'అంధగాడు' సినిమాతో హ్యాట్రిక్ హీరోగా నిలిచారు. ఇప్పుడు ఇదే నిర్మాణ సంస్థలో రాజ్‌తరుణ్ చేస్తోన్న చిత్రం 'రాజుగాడు'. సంజనా రెడ్డి దర్శకురాలు. రామబ్రహ్మం సుంకర నిర్మాత. అమైరా దస్తుర్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా... ర్మాత రామబ్రహ్మం సుంకర మాట్లాడుతూ - ''యంగ్ హీరో రాజ్‌తరుణ్‌తో మా బేనర్‌లో హాట్రిక్ హిట్స్ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయనతో 'రాజుగాడు' సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. సినిమా చాలా బాగా వచ్చింది. లేడీ డైరెక్టర్ సంజనారెడ్డి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. కామెడీ, లవ్,
ని
యాక్షన్ ఇలా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఎంటర్‌టైనర్ ఇది. రాజ్‌తరుణ్‌ను సరికొత్త పాత్రలో చూస్తారు. రాజేంద్రప్రసాద్‌గారు, రావు రమేష్‌గారు కీలక పాత్రల్లో నటించారు. రెండు పాటలు మినహా చిత్రీకరణంతా పూర్తయ్యింది. సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. మా గత చిత్రాలు ప్రేక్షకులను మెప్పించిన విధంగానే ఈ సినిమా కూడా అలరిస్తుంది'' అన్నారు. జ్‌తరుణ్, అమైరా దస్తుర్, పూజిత, రాజేంద్రప్రసాద్, రావు రమేష్, నాగినీడు, పృథ్వీ, రాజా రవీంద్ర, కృష్ణభ గవాన్, సిజ్జు, సుబ్బరాజు, ప్రవీణ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఆర్ట్: కృష్ణ మాయ, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, సినిమాటోగ్రఫీ: బి.రాజశేఖర్, సంగీతం: గోపీ సుందర్, చీఫ్ కో డైరెక్టర్ః దాసం సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః కిషోర్ గరికిపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, డా.డి.లక్ష్మణ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, దర్శకత్వం: సంజనారెడ్డి.
రా
టాలీవుడ్ P 35
రా
ష్ట్ర విభజన తర్వాత సినీపరిశ్రమ భవితవ్యంపై సినీపరిశ్రమ ప్రముఖులు టి-ప్రభుత్వంతో ముచ్చటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ పెద్దల కు కొన్ని హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సింగిల్ విండో పద్ధతిలో షూటింగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సునాయాసంగా అనుమతులు లభించేలా చేస్తామని ప్రభుత్వం ప్రామిస్ చేసింది. జాగా ఆ ప్రామిస్‌ని నెరవేర్చింది టి-ప్రభుత్వం. నేడు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్వయంగా సింగిల్ విండో షూటింగ్ పర్మిషన్స్ వింగ్‌ను, ఆన్ లైన్ టిక్కెట్ పోర్టల్ ను ప్రారంభించారు. హైదరాబాద్‌సెక్రటేరియట్ లో నేటి ఉదయం 11 గంటలకు డి-బ్లాక్ లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో కాన్ఫరెన్స్ హాల్‌లో లాంచింగ్ కార్యక్రమం చేశారు. ఇక నుంచి సునాయాసంగా ఎలాంటి సమస్యలు లేకుండా సింగిల్ విండో విధానంలో నిర్మాతలు షూటింగు అనుమతులు పొందవచ్చని తలసాని తెలిపారు.
తా
షూటింగ్ లకు అనుమతుల విషయమై టీ.ఎఫ్.డి.సికీ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే 7 రోజుల్లో అనుమతులు లభిస్తాయన్ నారు. ఒకవేళ అనుమతి రాకపోతే అనుమతి వచ్చినట్లుగా పరిగణంచి షూటింగ్ చేసుకోవచ్చని తలసాని తెలిపారు. అలాగే బస్టాండ్లలో మినీ థియేటర్స్ నిర్మాణారికి టెండర్లు పిలిచామని, అంతర్జాతీయ ఫిలిం స్టూడియో నిర్మాణానికి సంబంధిచి స్థలం ఎంపికపై దీపావళి తర్వాత పర్యటిస్తామని, అలాగే ఐదవ ఆటకు సంబంధించి రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేయనున్నామయని తలసాని తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ సలహదారి కె.వి రమణాచారి, ఎఫ్.డి.సీ చైర్మన్ రామ్మోహనరావు, ఎఫ్.డి.సి ఎండీ నవీన్ మిట్టల్, జె.ఎం.డి కిషోర్ బాబు, హైదరాబాద్ అడీషనల్ కమీషనర్ టి.మురళీ కృష్ణ, సైబరాబాద్ జాయింట్ కమీషనర్ షాన్ వాజ్ ఖాసీమ్, నిర్మాతలు దిల్ రాజు, జెమిని కరణ్ తదితరులు పాల్గున్నారు.
ఈ
36 P టాలీవుడ్
సిం
గిల్ విండో విధానంలో షూటింగ్ లకు అనుమతులు... ఆన్ లైన్ టికెంటింగ్ ప్రభుత్వం పోర్టల్ ను లాంచ్ చేసిన సందర్భంగా `మా` మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శివాజీ రాజా హర్షం వ్యక్తం చేశారు. కపై షూటింగ్ అనుమతులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..అలాగే బ్లాక్ టికెట్ల దందా నిలువరించేందుకు తెలంగాణ రాష్ర
`ఇ
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలు టాలీవుడ్ ఇండస్ర్టీకి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారు పరిశ్రమ లో ఉన్న సమస్యల గురించి తెలుసుకుని స్వయంగా ఆయన మన అభివృద్ది కోసం ఎంతో ప్రత్యేకంగా శ్రద్ద తీసుకుని పనిచేస్తున్నారు. ఆయన సినీ పరిశ్రమ పక్షపాతి. అందుకు తలసాని గారికి `మా` తరుపున `మా` అధ్యక్షుడు శివాజీ రాజా కృతజ్ఞతలు ` తెలిపారు.
టాలీవుడ్ P 37
సూ
పర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం '2.0'. ఈ చిత్రానికి సంబంధించిన 3డి మేకింగ్ వీడియో ఇటీవల విడుదల చేశారు. సందర్భంగా లైకా ప్రొడక్షన్స్‌క్రియేటివ్‌హెడ్‌రాజు మహాలింగం మాట్లాడుతూ - ''రజనీకాంత్‌గారితో శంకర్‌గారు చేస్తున్న మరో అద్భుతమైన చిత్రమిది. ఇండియన్ సినిమాలోనే భారీ బడ్జెట్తో , హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ చిత్ర నిర్మాణం జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన 3డి మేకింగ్ వీడియోను ఇటీవల విడుదల చేశాం. ఈనెల 27న దుబాయ్‌లో ఈ చిత్రం ఆడియోను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన
ఈ
38 P టాలీవుడ్
పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌చేశాం'' అన్నారు. పర్‌స్టార్ రజనీకాంత్ సరసన ఎమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్‌కుమార్ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్ హుసేన్, కళాభవన్ షాజాన్, రియాజ్ ఖాన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్: ఆంటోని, సమర్పణ: సుభాష్ కరణ్, లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్.
సూ
ఈ
నే
హా బాసిన్ అనే సింగర్ తన పాటలతో కంటే బికినీ బేబీ గానే ఎక్కువగా పాపులర్ అయ్యింది . నా ఫిగర్ బికినీ కి యాప్ట్ అందుకే బికినీ వేస్తున్నాను అంటూ డంఖా బజాయించి చెప్పే ఈ హాట్ భామ తాజాగా పెళ్లి అయినప్పటికీ టూ పీస్ బికినీ వేసి సంచలనం సృష్టిస్తోంది . తాజాగా బికినీ లో వీరంగం వేసిన ఈ భామ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి మరింత షాక్ ఇచ్చింది నెటిజన్ల కు . అసలే అందగత్తె ఆపై టూ పీస్ బికినీ లో మరింత ద్విగుణీకృతం కావడంతో కళ్ళతోనే కాపురం చేస్తున్నారు నెటిజన్లు . దే కాదు ఇంకా రెచ్చిపోతాను , నా ఒళ్ళు నా ఇష్టం అంటోంది నేహా బాసిన్ . నెటిజన్లు ఎంతగా కామెంట్ చేస్తున్నా డోంట్ కేర్ అంటోంది . మహేష్ నటించిన 1నేనొక్కడినే చిత్రంలో '' ఆవ్ తుజే '' అంటూ సాగే పాటని పాడి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నేహా తాజాగా ఎన్టీఆర్ నటించిన జై లవకుశ చిత్రంలోని తమన్నా ఐటెం సాంగ్ '' స్వింగ్ జరా '' అనే పాటని కూడా పాడింది . మొత్తానికి పాటల కంటే బికినీ వేషాలతోనే హాట్ ఇమేజ్ తెచ్చుకున్న నేహా బాసిన్ ఇంకా రెచ్చిపోయి బికినీ లు వేస్తానని రెచ్చగొడుతోంది కుర్రాళ్ళని .
ఇ