TOLLYWOOD.NET DECEMBER 2018 | VOL 15 | ISSUE 12 | Rs.25/-
/tollywood
/tollywood
p
ముఖ్య కథనాలు
RNI NO: APTEL/2003/10076
super star
Rajinikanth
ప్ర
ముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న సామాజిక సేవా సంస్థ మనం సైతం పేదవాడి జీవ నాడిగా నిలుస్తోంది. అపదలో ఉన్న ఎందరినో ఆదుకుంటూ ఆపన్నులను అక్కున చేర్చుకుంటోంది. దంబరి కిరణ్ మాట్లాడుతూ...అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం కళ్ల ముందు కనిపిస్తోంది. సంతోషన్న, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి మంచి వాళ్ల అండ దొరికింది. 1977 ఫిబ్రవరిలో హైదరాబాద్ కు వచ్చాను. బంధువులు అడిక్ మెట్ లో ఉండేవాళ్లు. అప్పుడు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారి అబ్బాయితో నాకు మితృత్వం ఏర్పడింది. అలా జి.కృష్ణ గారి సాన్నిహిత్యం దొరికింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పెషల్ కరస్పాండెంట్ గా జి.కృష్ణ పనిచేసేవారు. మంత్రులు ఆయన ఇంటి ముందు వేచి ఉండేంత పరపతి ఉన్నా...సొంత ఇళ్లు గురించి కూడా ఆలోచించలేదు. నిస్వార్థంగా జీవించారు. అద్దె ఇంటిలో బతికి అక్కడే కన్నుమూశారు. అలాంటి వాళ్ల సాహచర్యం నాలో సేవా ఆలోచన రేకెత్తించింది. నిస్వార్థంగా ఉండటం, నలుగురికి సహాయ పడాలనే దృక్పథాన్ని కలిగించింది. ఈ ప్రపంచంలో మనల్ని మనమే నమ్ముకోవాలి, మనకు మనమే అండగా నిలబడాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే మనం సైతం. ముగ్గురు నలుగురితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల మందికి చేరువువతోంది. సంస్థ ప్రధాన సభ్యులమే పాతిక మంది దాకా ఉన్నాం. ప్రతి జీవి సంపాదన ఆహారమే. అవి దొరికిన ప్రతి ఆహారాన్ని తోటి వాళ్లతో పంచుకుంటాయి. మనిషి మాత్రమే తన సంపాదన తన వాళ్లకే దక్కాలనుకుంటాడు. స్వార్థంగా ఆలోచిస్తాడు. జి.కృష్ణ లాంటి గొప్పవాళ్ల జీవితాలను తెలియపరిస్తే ప్రతి హృదయం కదులుతుంది. ప్రతి మనసు మారుతుంది. నాకున్నది ఒక మెతుకే కదా అని దాన్ని కూడా వెనకేసుకుంటున్నారు. వంద మెతుకులు కలిస్తే ఒక ముద్ద. వంద ముద్దలు కలిస్తే ఒక జీవితం. మనం సైతం స్ఫూర్తి ఇదే. మా సంస్థ కార్యక్రమాలు చూసి దర్శకులు కొరటాల శివ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి..రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. మనం సైతంతో నేనున్నాను అని చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కంటే మనం సైతం గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రశంసించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం సైతం కార్యక్రమాలను అభినందించారు. కొరటాల శివ, పూరీ జగన్నాథ్, టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, రామజోగయ్య శాస్త్రి, బెల్లంకొండ సురేష్, కౌషల్, కోన వెంకట్, జయలలిత, తలసాని శ్రీనివాస యాదవ్, బన్నీ వాస్, దిల్ రాజు, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం స్వామి గౌడ్, అనిల్, మనం సైతం సభ్యుడు బందరు బాబీ ఆర్థిక సహాయం అందించి మనం సైతం వెంట తామూ ఉన్నామనే భరోసా కలిగించారు. యూకే నుంచి రామ్ నామనగిరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అక్కౌంట్ కు లక్షా యాభై వేల రూపాయలు పంపించాను. ఎవరికైనా సహాయం చేయండి అన్నారు. ఆయనెవరో నాకు తెలియదు.
కా
యూట్యూబ్ లో మా సంస్థ కార్యక్రమాలు చూసి స్పందించాడు. అలా వంద రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు సహాయం చేస్తున్న దాతలున్నారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హాయం కోసం వేచి చూసే వాళ్లు మన చుట్టూనే ఉంటారు. ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ల అవసరాన్ని తీర్చగలుగుతాం. మనం కలిసి ఉండాలి, పరస్పరం సహాయం చేసుకోవాలనే తత్వం మనుషుల కంటే చిన్న చిన్న ప్రాణులకు ఎక్కువగా ఉంటుంది. పేదరికాన్ని మనం తొలగించలేకపోవచ్చు. కానీ కష్టాల్లో ఉన్న కొంతమందికైనా ఉపయోగపడాలనే లక్ష్యంతో మనం సైతం సంస్థ ను ఏర్పాటు చేశాం. ఒక్కరితో మొదలైన మనం సైతం ఇవాళ లక్ష మందికి పైగా సభ్యులతో బలోపేతమవుతోంది. సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే చేయి అందించే మనసున్న వాళ్లు ఎందరో ఉంటారు. జీవితంలో మనల్ని భగవంతుడు తన చేత్తో అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నప్పుడు...మనం మరో చేయి చాస్తే...ఆ అండతో కొన్ని వేల లక్షల మంది ఆసరా పొందుతారు. ఈ విషయాన్ని నమ్మాను కాబట్టి మనం సైతం సంస్థను భుజాలకు ఎత్తుకున్నాను.. పరిశ్రమలో మంచి మనుషులు పెరుగుతూనే ఉన్నారు. వాళ్లలో కొందరు మన కార్యక్రమానికి వచ్చారు. నేను జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటి సమయంలో కూడా ఎవరినీ నాకీ సహాయం చేయండి అని అడగలేదు. కానీ ఇవాళ మనం సైతం కోసం వెళ్తున్నప్పుడు ప్రతి పెద్ద వాళ్లూ నన్ను ఆదరిస్తున్నారు. మాకు సహాయం చేయాలని ఉంటుంది కానీ నిజాయితీ గల వేదిక దొరకడం లేదు. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి అని ప్రోత్సహిస్తున్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. పేదరికాన్ని రూపుమాపకున్నా వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేదే నా ధ్యైయం, లక్ష్యం. గతేడాది నేను విజ్ఞప్తి చేసి బతిమాలితే వివిధ ఆస్పత్రుల నుంచి 43 లక్షల రూపాయల బిల్లులు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికి 90 మందికి సహాయం చేశాం. మన కాళ్లకు తాకిందని సముద్రపు అలను చులకనగా చూడకూడదు. సహాయం కోసం మన దగ్గరకు వచ్చిన పేదవాడిని తక్కువగా చూడొద్దు. మొదట్లో పరిశ్రమలో ఎవరికైనా కష్టం వస్తే అనారోగ్యం పాలైతే ఎవరూ పట్టించుకునేవారు కాదు. మాకు కష్టముందని చెప్పుకుంటే దగ్గరకు రానీయరేమో అని భయపడేవారు. కానీ ఇవాళ మనకు కష్టమొస్తే ఆదుకునేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది అని మనం సైతం నిరూపించింది. మాకు సరైన వేదిక లేక ఎవరి కష్టం నిజమో తెలియక సహాయం చేయడం లేదు. నువ్వు మంచి మార్గం చూపించావు. దీని ద్వారా మేము సహాయం చేస్తాం అంటూ ఎందరో పెద్దలు మనం సైతంలో భాగమవుతున్నారు. ఈ పెద్దలు మనం సైతంలో చేరుతున్నారు అంటే రెండు రాష్ట్రాల చలనచిత్ర పరిశ్రమలోని కార్మికులకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్లే. నాతో ముఖ పరిచయం లేని వాళ్లు కూడా నా ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో చూసి విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. మనం సైతంను మరింత విస్తృతమైన సేవా సంస్థగా
స
మార్చేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటాం. పేదల చిరునవ్వు చూడటమే నా ఆశ. అన్నారు.
తిత్లీ బాధితులకు అండగా మనం సైతం
ప్ర
ముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ తిత్లీ తుఫాన్ బాధితులకు అండగా నిలిచింది. శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాన్ కారణంగా సర్వం కోల్పోయిన ప్రజలకు మనం సైతం సభ్యులు తమ వంతు సాయాన్ని అందించారు. శ్రీకాకుళం, నందిగం మండలం, భర్తుపురం, కందులగూడెం, సవరనీలాపురం, కిట్లపాడు, రాంపురం గ్రామాల ప్రజలకు నిత్యావరస వస్తువులు, దుస్తులు అందజేశారు.
కేరళకు అండగా మనం సైతం...
ప్ర
ముఖ నటుడు కాదంబరి కిరణ్ నిర్వహిస్తున్న మనం సైతం సేవా సంస్థ వరదలతో అల్లాడుతున్న కేరళ రాష్ట్రానికి అండగా నిలబడింది. తమ వంతు సాయాన్ని ఆ రాష్ట్ర ప్రజలకు అందించాలని ముందడుగు వేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ కార్యాలయ ప్రాంగణంలో కేరళకు విరాళాల సేకరణ కార్యక్రమాన్ని మనం సైతం చేపట్టింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, మా అధ్యక్షుడు శివాజీ రాజా, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, ఫిలింనగర్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, భాజపా నేత చింతల రామచంద్రారెడ్డి, మనం సైతం సభ్యులు బందరు బాబీ, వినోద్ బాలా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ...కేరళలో వచ్చిన జల విలయం దేశంలోనే అత్యంత విషాధకరమైనది. ఉత్తరాఖండ్ వరదల కంటే ఇది పెద్ద విపత్తు. ఇవాళ కేరళ కోసం దేశం మొత్తం స్పందిస్తోంది. మనం సైతం కూడా ఇందులో భాగమవడం సంతోషంగా ఉంది. ప్రతి నెల, ప్రతి వారం ఏదో ఒక సేవా కార్యక్రమం చేస్తున్నారు కాదంబరి కిరణ్. ఆయన కృషిని అభినందిస్తున్నాను. అన్నారు.
ద
ర్శకులు సుకుమార్ మాట్లాడుతూ....ఒక రోజు అర్థరాత్రి ఫోన్ కాల్ వచ్చింది. మా సహాయ దర్శకుడి స్నేహితుడి భార్య అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ చనిపోయిందని. ఆమె భౌతిక కాయాన్ని విడుదల చేయడం లేదని తెలిసింది. నాకొక సమస్య తెలిసింది అప్పుడెలా స్పందించాలో అర్థం కాలేదు. కేవలం డబ్బులిస్తే సరిపోదు అక్కడికి వెళ్లి పనులన్నీ చూడాలి. ఆ సమయంలో నాకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి కాదంబరి కిరణ్ గారు. ఆయనకు అర్థరాత్రి ఫోన్ చేస్తే వెంటనే బదులిచ్చారు. నేను చూసుకుంటాను అన్నగారు అన్నారు. ఈలోగా విషయం గురించి చరణ్ కు తెలిసింది. ఆయన ఉదయం నాకు ఫోన్ చేసి మీ సహాయ దర్శకుడి భార్య అపోలో ఆస్పత్రిలో చనిపోయిందట కదా..నేను డబ్బు కట్టేశాను తీసుకెళ్లమని చెప్పండి అన్నారు. అంటే అలాంటి సమయంలో నాకు స్నేహితులు, నా చుట్టూ ఉన్న వాళ్లెవరూ గుర్తుకు రాలేదు. కేవలం కాదంబరి మాత్రమే గుర్తొచ్చారు. మనం సైతంకు ఎలాంటి సాయం కావాలన్నా మేము భాగమవుతాం. అన్నారు.
మనం సైతంకు మెగాస్టార్ చిరంజీవి ప్రశంసా పత్రం
సే
వా సామ్రాజ్యంగా విస్తరిస్తున్న మనం సైతం సంస్థకు అండగా ఉంటానన్నారు మెగాస్టార్ చిరంజీవి. గతంలో సంస్థ సేవా కార్యక్రమాల గురించి తెలిసి....మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ ను ఇంటికి ఆహ్వానించి 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేసిన చిరంజీవి...తాజాగా తన స్వదస్తూరితో ప్రశంసా పత్రాన్ని అందజేశారు. తమ్ముడు కాదంబరి మంచి కార్యక్రమం చేస్తున్నాడంటూ ఆ లేఖలో చిరు అభినందించారు. మనం సైతం కార్యక్రమాలను మెగాస్టార్ కు వివరించేందుకు సభ్యులు కాదంబరి కిరణ్, బందరు బాబీ ఆయన ఇంటికి వెళ్లారు. ఇటీవల తాము చేసిన సేవా కార్యక్రమాల గురించి కాదంబరి కిరణ్ చిరంజీవికి చెప్పారు. ఈ సందర్భంగా కాదంబరి బృందాన్ని మెచ్చుకున్న చిరు... మనం సైతంకు ఎప్పుడు, ఏ సాయం కావాలన్నా చేస్తానన్నారు. తమ్ముడు కాదంబరి కిరణ్ వయసులో చిన్నవాడైనా, మనసులో ఎంతో పెద్దవాడు. ఆపదలో ఉన్నవారిని, అవసరార్థులను అక్కున చేర్చుకుని, నేనుసైతం అంటూ వారికి చేయూత అందివ్వడం, వారికి భరోసాగా ఉండటం, వారికి ఆశాజ్యోతిలా ఉండటం ఎంతో అభినందనీయం. అతను చేస్తున్న ఈ కార్యక్రమానికి అతనితో పాటు మేము సైతం అంటూ మేమంతా ఉంటాం. ఈ సేవా కార్యక్రమంలో అతనికి చేదోడు వాదోడుగా ఉన్న ఆ సంస్థ కార్యవర్గ సభ్యులకు మనస్ఫూర్తిగా నా అభినందనలు. ఆ భగవంతుడు కాదంబరికి మంచి మనసు ఇవ్వడమే కాదు మంచి భవిష్యత్ ను కూడా ఇస్తాడని ప్రగాఢంగా నమ్ముతూ..ఆశీస్సులతో అన్నయ్య చిరంజీవి...అంటూ ప్రశంసా లేఖలో మెగాస్టార్ చిరు తన వాత్సల్యం చూపించారు
“I BELIEVE THAT WE ARE SOLELY RESPONSIBLE FOR OUR CHOICES, AND WE HAVE TO ACCEPT THE CONSEQUENCES OF EVERY DEED, WORD, AND THOUGHT THROUGHOUT OUR LIFETIME.
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant Distributed By
: : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
బి
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2018
చ్చగాడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ సాట్నా టైటస్ , కాగా ఈ భామ అమలా పాల్ రూట్లో వెళ్లనున్నట్లు తెలుస్తోంది . అమలా పాల్ రూట్ లో వెళ్లడం ఏంటి అని అనుకుంటున్నారా ? అమలా పాల్ దర్శకులు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . అయితే వెంటనే విడాకులు కూడా తీసుకుంది దాంతో ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటిస్తోంది ఇంతకుముందు కంటే గ్లామర్ పాత్రలు పోషిస్తూ . ఇక సాట్నా టైటస్ కూడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కార్తీక్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . కట్ చేస్తే అతడితో విడాకులు తీసుకోవడానికి
పె
సిద్దమైనట్లు తెలుస్తోంది . ద్దలు వద్దని చెప్పినప్పటికీ సాట్నా టైటస్ వినలేదు , ప్రేమలో ఉంది కాబట్టి పెద్దలను లెక్కచేయకుండా పెళ్లి చేసుకుంది . 2016 లో పెళ్లి చేసుకోగా అప్పుడే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయట . దాంతో కొద్దిరోజులుగా భర్తకు దూరంగా ఉంటోందట . ఇకపై కార్తీ తో కలిసి ఉండేది లేదని అతడికి విడాకులు ఇస్తానని చెప్పిందట పేరెంట్స్ కు . బిచ్చగాడు సంచలన విజయం సాధించడంతో బంగారం లాంటి అవకాశం వచ్చింది ఈ భామకు అయితే సినిమాలు అంగీకరించకుండా పెళ్లి చేసుకుని బాధపడుతోంది పాపం .
అ
క్కినేని అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు . అఖిల్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ కాగా రెండో సినిమా హలో యావరేజ్ గానే మిగిలింది . ఇక ఇప్పుడేమో మిస్టర్ మజ్ను అంటూ వస్తున్నాడు . అయితే మాస్ దర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ నటిస్తే అతడి రేంజ్ మారుతుందని భావించాడట నాగార్జున . కానీ బోయపాటి శ్రీను మాత్రం అఖిల్ తో సినిమా చేసే ఉద్దేశం లేనట్లు చెప్పాడు . అఖిల్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అటువంటిదేమీ లేదని ప్రస్తుతం నా ద్రుష్టి అంతా
చరణ్ తో చేస్తున్న వినయ విధేయ రామ చిత్రం పైనే ఉందని స్పష్టం చేసాడు బోయపాటి శ్రీను . టే బోయపాటి మాటల ప్రకారం అఖిల్ తో సినిమా చేసే ఉద్దేశం అయితే లేదు . అయితే మిస్టర్ మజ్ను పై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఆ సినిమా తర్వాత అభిమన్యుడు దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాడు . మనం చిత్రంలో కేవలం అయిదు నిముషాలు కనిపించి మేజిక్ చేసిన అఖిల్ పూర్తిస్థాయి హీరోగా మాత్రం సక్సెస్ అందుకోలేక పోతున్నాడు . మరి మిస్టర్ మజ్ను ఏం చేస్తుందో చూడాలి .
అం
నడకే అనుకుంది . ఇక ప్రచారంలో కూడా పెద్ద ఎత్తున కూకట్ పల్లి వాసులు సుహాసినికి మద్దతు తెలుపుతుండటంతో చాలా సంతోషంగా ఉంది సుహాసిని . క సుహాసిని అభ్యర్థిత్వం పట్ల సినిమా రంగం నుండి పెద్దగా స్పందన లేకుండే ! కానీ నిశ్శబ్దాన్ని చీల్చుతూ నటుడు జగపతిబాబు తన పూర్తి మద్దతు సుహాసిని కే అంటూ ఓ స్టేట్ మెంట్ ఇచ్చి పడేసాడు . అంతేకాదు సుహాసిని మంచి ప్రతిభాశాలి తప్పకుండా మన కూకట్ పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంది అందుకే నా ఓటు సుహాసినికె అంటూ సెలవిచ్చాడు జగపతిబాబు . సినిమా రంగం నుండే కాకుండా సీమాంధ్రులు , ఎన్టీఆర్ , బాలకృష్ణ , తెలుగుదేశం పార్టీ అభిమానులు సుహాసిని గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు .
ఇ నం దమూరి హరికృష్ణ కూతురు సుహాసిని కి మద్దతు ప్రకటించాడు నటుడు జగపతిబాబు . నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీ తరుపున కూకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . సీమాంధ్రులు ఎక్కువగా ఉండే కూకట్ పల్లి ప్రాంతం నుండి వ్యహాత్మకంగా చంద్రబాబు సుహాసిని ని బరిలో దింపాడు . నామినేషన్ రోజున బాలయ్య బాబాయ్ వెంటరావడంతో సుహాసిని తన గెలుపు నల్లేరు మీద
3 P టాలీవుడ్
4
5 ఏళ్ల ఆంటీ ని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు యంగ్ హీరో అర్జున్ కపూర్ . హీరో తెలిసిపోయాడు కాబట్టి ఆ ఆంటీ ఎవరో ఇట్టే తెలిసిపోతుంది ఎందుకంటే గతకొంత కాలంగా ఈ ఇద్దరూ చెట్టా పట్టాలేసుకొని రాత్రనక , పగలనకా తిరుగుతూనే ఉన్నారు . ఇంతకీ ఆ ఆంటీ ఎవరయ్యా అంటే మలైకా అరోరా . సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ కు విడాకులు ఇవ్వకముందే ఈ యంగ్ హీరో తో రాసుకు పూసుకు తిరుగుతుండటం పెద్ద చర్చ అయ్యింది . కట్ చేస్తే అర్భాజ్ ఖాన్ - మలైకా లు విడాకులు తీసుకున్నారు దాంతో మలైకా ఫ్రీ బర్ద్ అయ్యింది . ఒకరికి భార్యగా ఉన్నప్పుడే లేని
అడ్డు ఫ్రీ బర్ద్ అయ్యాక ఉంటుందా ? అందుకే రాత్రయినా నాకు ఓకే ...... పగలైనా నాకు ఓకే అంటూ తిరిగేస్తున్నారు . క తాజాగా అర్జున్ కపూర్ ఓ షోలో పాల్గొని వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పాడు , అయితే చిన్న ట్విస్ట్ ఉంది ఇక్కడే మలైకా అరోరా ని పెళ్లి చేసుకుంటాను అని మాత్రం చెప్పలేదు . పెళ్లి వార్త కన్ఫర్మ్ చేసాడు కాబట్టి 45 ఏళ్ల ఆంటీ ని 33 ఏళ్ల అర్జున్ కపూర్ చేసుకోవడం ఖాయమని , పెళ్ళికి ....... శృంగారానికి వయసు అడ్డంకి కాదని చాటి చెబుతున్నారు ఈ జంట .
ఇ
కే
టీఆర్ జూబ్లీహిల్స్ రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ లో పలు నియోజక వర్గాల్లో రోడ్ షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవల జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ గెలుపు కోసం రోడ్ షో నిర్వహించడానికి వచ్చాడు. అయితే కేటీఆర్ అనుచరుడు , జూబ్లీహిల్స్ తరుపున ఇంతకుముందు నియోజక వర్గ ఇంఛార్జ్ గా వ్యవహరించిన సతీష్ రెడ్డి తన అనుచరులతో కలిసి కేటీఆర్ ని కలవడానికి వచ్చిన సమయంలో జూబ్లీహిల్స్ తాజా మాజీ ఎం ఎల్ ఏ మాగంటి గోపీనాథ్ అనుచరులకు సతీష్ రెడ్డి అనుచరులకు మధ్య జరిగిన వాగ్వాదం చిలికి చిలికి గాలివానగా మారడంతో ఈ విషయం కేటీఆర్ కు తెలిసి
మాగంటి గోపీనాథ్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడట . అంతేకాకుండా మాగంటి ఉన్న చోటుకి రాకుండా నేరుగా మోతీ నగర్ కు వెళ్లడంతో మాగంటి గోపీనాథ్ షాకయ్యాడు. సంఘటనలో మాగంటి గోపీనాథ్ ని అవమానించినట్లేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో అందరినీ కలుపుకొని పోవాలి కానీ ఇలా గొడవ పెట్టుకోవడం ఏంటి ? అని మాగంటి ని నిలదీశాడట కేటీఆర్. దాంతో అవమానంగా భావిస్తున్నాడు మాగంటి గోపీనాథ్. గత ఎన్నికల్లో మాగంటి గోపీనాథ్ తెలుగుదేశం పార్టీ తరపున గెలిచాడు. అయితే ఆ తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి మద్దతుగా టీఆర్ఎస్ పార్టీలో చేరాడు మాగంటి.
ఈ
తె
లంగాణ లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అని ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు గట్టి షాక్ తగులుతోంది . న్యూ ఢిల్లీ కేంద్రంగా వ్యవహరించే సారాన్ష్ డేటా సొల్యూషన్స్ అనే సంస్థ తెలంగాణలో ప్రీ పోల్ సర్వే నిర్వహించింది . మొత్తం తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఎవరు ఎక్కడ గెలవబోతున్నారు , ఎంత ఓటు శాతం తెచ్చుకుంటున్నారు ? అని సవివరంగా ప్రీ పోల్ సర్వే తేల్చి పడేసింది . ఈ సర్వే ప్రకారం టీఆర్ఎస్ దారుణంగా ఓడిపోతోంది . టిఆర్ఎస్ పార్టీకి కేవలం 42 స్థానాలు మాత్రమే దక్కుతుండగా కాంగ్రెస్ టిడిపి నేతృత్వంలోని ప్రజాకూటమి 66స్థానాల్లో గెలుపొందుతోంది . ఇక బిజెపి 5 , ఎం ఐ ఎం 6స్థానాల్లో గెలవబోతోంది . క ఈ సర్వే ఎప్పుడు చేశారో తెలుసా ....... 9 నవంబర్ నుండి 21 నవంబర్ వరకు చేసిన సర్వే ! అంటే తాజా సర్వే అన్నమాట ! ఈ సర్వే ప్రకారం కేసీఆర్ దారుణ ఓటమి ఖాయమైపోయింది . అయితే అసలు ఫలితాలు , ప్రజల తీర్పు మాత్రం డిసెంబర్ 11న వెలువడనుంది . డిసెంబర్ 7న తెలంగాణలో పోలింగ్ డిసెంబర్ 11 న రిజల్ట్ . కాంగ్రెస్ టిడిపి కూటమి పై ముఖ్యంగా చంద్రబాబు పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ మరింత అసహనానికి గురి అవుతున్నాడు కేసీఆర్ . తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరకపోవడంతో ప్రజలు కాంగ్రెస్ టిడిపి కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు సర్వే వెల్లడించింది .
ఇ
టాలీవుడ్ P 4
క
న్నడ రెబల్ స్టార్ అంబరీష్ గుండెపోటు తో కన్నుమూశాడు . 66 సంవత్సరాల అంబరీష్ గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు . ఇప్పటికే పలుమార్లు ఆసుపత్రుల్లో చేరిన అంబరీష్ నవంబర్ 25 రాత్రి 10 :45 నిమిషాలకు గుండెపోటు తో బెంగుళూర్ లోని ఓ ఆసుపత్రిలో మరణించాడు . అంబరీష్ ని బ్రతికించడానికి డాక్టర్లు శతవిధాలా ప్రయత్నించారు , బ్రతికించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి . దాంతో కన్నడ చిత్ర రంగంలో తీవ్ర విషాదం నెలకొంది . కన్నడంలో 230 సినిమాలలో నటించిన అంబరీష్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే .
తె
లుగమ్మాయి , హీరోయిన్ సుమలత ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అంబరీష్ . సుమలత - అంబరీష్ లకు ఒక కొడుకు పేరు అభిషేక్ . సినిమాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా రాణించాడు అంబరీష్ . కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంట్ కు అలాగే అసెంబ్లీ కి ప్రాతినిధ్యం వహించాడు . అలాగే కేంద్ర మంత్రిగా , రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం అంబరీష్ ది . అంబరీష్ మరణ వార్త తెలియగానే కర్ణాటకలో విషాద ఛాయలు నెలకొన్నాయి . అంబరీష్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు .
షూ
2019 లో జరిగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికారం నాదే ! ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తాను ఇది రాసి పెట్టుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . ఇటీవల చెన్నై వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసాడు . అయితే 2019 లో జరిగే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తానో తెలీదు కానీ ముఖ్యమంత్రి ని మాత్రం నేనే అంటూ అందరికీ షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ . ఆంధ్రప్రదేశ్ లో మరో ఆరు నెలలో ఎన్నికలు జరుగనున్నాయి . 2019 మేలో అసెంబ్లీ కి ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో పవన్ అదేపనిగా జనసేన తరుపున ప్రచారం చేస్తూనే ఉన్నాడు . యితే ఆంధ్రప్రదేశ్ లో జనసేన కు అంతగా పట్టు లేదు కాకపోతే ఉభయ గోదావరి జిల్లాలో కొంత ప్రభావం మాత్రం చూపించగలడు . కొన్ని సర్వేల ప్రకారం పవన్ కళ్యాణ్ కు 4 నుండి 9 స్థానాలు వస్తే గొప్ప అని తేల్చి పడేస్తుండగా పవన్ మాత్రం నేనే ముఖ్యమంత్రి అని అంటున్నాడు . కర్ణాటకలో కుమారస్వామి లాగా ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను కింగ్ అవుతానని భ్రమలో ఉన్నట్లున్నాడు పవన్ . పోటీ జగన్ - చంద్రబాబు ల మధ్య రసవత్తరంగా సాగుతోంది మరి .
టింగ్ నిమిత్తం కులుమనాలి వెళ్లిన నేను , నా కుటుంబం క్షేమంగా ఉన్నామని , నాకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపాడు సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ . కల్కి షూటింగ్ నిమిత్తం కులుమనాలి వెళ్ళాడు హీరో డాక్టర్ రాజశేఖర్ అయితే కులుమనాలి వెళ్తున్న సమయంలో కొండచరియలు విరిగిపడ్డాయి . దాంతో రాజశేఖర్ కు గాయాలు అయ్యాయని వార్తలు వచ్చాయి , అవి మరింతగా స్ప్రెడ్ కాకముందే స్పందిస్తే మంచిదని భావించిన రాజశేఖర్ తనకు కానీ , నా కుటుంబ సభ్యులకు కానీ ఎలాంటి గాయాలు కాలేదని ...... మా యోగ క్షేమాల కోసం ఫోన్ లు చేసి , మెసేజ్ లు పెట్టిన వాళ్లందరికీ
కు
కృతఙ్ఞతలు అంటూ తెలిపాడు రాజశేఖర్ . లుమనాలి వెళ్తున్న సమయంలో కొండచరియలు వవిరిగిపడ్డాయి , అయితే మాకు ఎలాంటి గాయాలు కాలేదని కాకపోతే ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది పడ్డామని అంటున్నాడు రాజశేఖర్ . తాజాగా ఈ హీరో కల్కి చిత్రంలో నటిస్తున్నాడు . ఇటీవలే యాక్షన్ దృశ్యాల్లో పాల్గొన్న సమయంలో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు రాజశేఖర్ . గరుడవేగ సూపర్ హిట్ కావడంతో మళ్ళీ హిట్ కోసం కష్టపడుతున్నాడు రాజశేఖర్ .
హీ
రో శర్వానంద్ కు బాగానే డిమాండ్ పెరిగింది . తాజాగా ఈ హీరో నటించిన పడిపడి లేచే మనసు చిత్రానికి భారీ డీల్ కుదిరింది . డిసెంబర్ 21 న విడుదల కానున్న ఈ చిత్ర హిందీ డబ్బింగ్ , డిజిటల్ రైట్స్ , తెలుగు శాటిలైట్ హక్కులు అన్నీ కలిపి 12 కోట్లకు బేరం కుదిరినట్లు తెలుస్తోంది . శర్వానంద్ సరసన సాయి పల్లవి నటిస్తున్న ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమా కోసం ఇటీవలే రీ షూట్ కూడా చేసారు . కొన్ని సన్నివేశాలు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న దర్శకుడు మళ్ళీ సాయి పల్లవి ని రిక్వెస్ట్ చేసి రీ షూట్ చేసారు . ర్వానంద్ గతకొంత కాలంగా విభిన్న కథా చిత్రాలు చేస్తూ వరుస విజయాలు సాధిస్తున్నాడు దాంతో అతడి మార్కెట్ కూడా పెరిగింది . ఇప్పుడున్న యంగ్ హీరోలలో శర్వా కి విపరీతమైన క్రేజ్ వచ్చింది . దాంతో అతడి సినిమాలకు డిమాండ్ ఏర్పడింది . పడిపడి లేచే మనసు చిత్రానికి రిలీజ్ కి ముందే లాభాలు వస్తున్నాయి . ఇక ఈ సినిమాని కొన్న బయ్యర్లు లాభాలు పొందాలంటే సినిమా హిట్ కావాల్సిందే . డిసెంబర్ 21 న ఈ సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
శ
అ
మా
స్ మహారాజ్ రవితేజ వరుసగా మూడు ప్లాప్ లను చవిచూసాడు . టచ్ చేసి చూడు , నేల టికెట్టు , అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రాలు వరుసగా ప్లాప్ కావడంతో హ్యాట్రిక్ కొట్టాడు రవితేజ . దాంతో రవితేజ మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది . ఈ మూడు చిత్రాలు కూడా ఘోర పరాజయం పొందడంతో మూడు కలిపి కనీసం 20 కోట్లు వసూల్ చేయలేకపోయాయి . కానీ రవితేజ మాత్రం ఒక్కో సినిమాకు పది కోట్ల చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు అంటే కనీసం రెమ్యునరేషన్ స్థాయిలో కూడా వసూళ్లు రాలేదంటే ఎంత దారుణంగా రవితేజ మార్కెట్ ఉందో అర్ధం చేసుకోవచ్చు . అలాగే రవితేజ సినిమా కొనుక్కున్న వాళ్ళు ఎంత దారుణంగా నష్టపోయారో ఈ లెక్కలు చూస్తే తెలిసిపోతుంది . వితేజ కు గుడ్డిలో మెల్లగా వచ్చిన హిట్ అంటే '' రాజా ది గ్రేట్ '' మాత్రమే ! కానీ ఆ సినిమా తర్వాత మళ్ళీ ప్లాప్ ల వర్షంలో తడిసిపోతున్నాడు . తాజాగా చేసిన అమర్ అక్బర్ ఆంటోనీ కేవలం ఆరు కోట్ల షేర్ మాత్రమే వచ్చింది . హిట్ కోసం తపనపడి చేసిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో బయ్యర్లు ఘోరంగా నష్టపోయారు .
ర
వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి , ఇక పూరి జగన్నాధ్ పరిస్థితి గురించి చెప్పాల్సిన పనే లేదు ..... హిట్ అనేది ఎలా ఉంటుందో తెలియక చాలా సంవత్సరాలు అవుతోంది . అయితే ఈ ఇద్దరూ సక్సెస్ కోసం కలుస్తున్నారు . రెండు ప్లాప్ లు కలిస్తే అతిపెద్ద డిజాస్టర్ లేదంటే , కాలం కలిసి వస్తే హిట్ కొట్టొచ్చు కదా అన్న ఆశతో ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయడానికి ముందుకు వస్తున్నారు . క ఈ సినిమాని పూరి జగన్నాధ్ - రామ్ సొంత బ్యానర్ స్రవంతి మూవీస్ బ్యానర్ పై సంయుక్తంగా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు . వచ్చే నెలలో సెట్స్ మీదకు ఈ సినిమా వెళ్లనుంది . ఈ కథ రామ్ ని కొంతవరకు ఇన్ స్పైర్ చేసి ఉంటుంది అందుకే కాబోలు వడ్డీతో సహా చెల్లిస్తాను మిత్రమా ! అంటూ మొన్నా మధ్య పోస్ట్ చేసాడు రామ్ . పూరి కూడా చాలా రోజులుగా హిట్ కోసం తపించి పోతున్నాడు పాపం . మరి ఈ సినిమాతోనైనా హిట్ మొహం చూస్తాడో చూడాలి .
ఇ యం
గ్ హీరో రామ్ తాజాగా ప్లాప్ లలో ఉన్న దర్శకులు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో రామ్ కు గతకొంత కాలంగా
5 P టాలీవుడ్
టా లీవుడ్ లో పలు చిత్రాల్లో విలన్ గా నటించిన నటుడు హరీష్ ఉత్తమన్ రహస్య వివాహం చేసుకున్నాడు . గతకొంత కాలంగా అమృతా కళ్యాణ్ పూర్ ని ప్రేమిస్తున్నాడు హరీష్ ఉత్తమన్ . దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమ వ్యవహారం సాగుతోంది , అయితే ఎట్టకేలకు ఆ ప్రేమని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావించిన హరీష్ - అమృత లు ఈనెల 6 న కేరళలోని గురువాయూర్ టెంపుల్ లో కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు . ఈ పెళ్లి విషయం గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు హరీష్ - అమృత లు .
రాం
చరణ్ నటించిన రంగస్థలం చిత్రం నిన్న మొన్నటి వరకు సౌత్ ఇండియాలో నెంబర్ వన్ గా ఉండేది 218 కోట్ల గ్రాస్ వసూళ్లతో కానీ తమిళ స్టార్ హీరో విజయ్ సర్కార్ చిత్రంతో ఆ రికార్డ్ ని బద్దలు కొట్టేసాడు 225 కోట్ల గ్రాస్ వసూళ్లతో . చరణ్ నటించిన రంగస్థలం ఈ ఏడాది వేసవిలో మార్చి 30 న విడుదలై ప్రభంజనం సృష్టించింది . వంద రోజుల్లో 218 కోట్ల గ్రాస్ వసూళ్లతో సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ గా నిలిచింది , అయితే తాజాగా విడుదలైన సర్కార్ చిత్రం కేవలం రెండు వారాల్లోనే 225 కోట్ల వసూళ్ళు సాధించి రంగస్థలం రికార్డ్ ని బ్రేక్ చేసి సరికొత్త రికార్డ్స్ దిశగా దూసుకుపోతోంది . పావళి కానుకగా నవంబర్ 6 న విడుదలైన సర్కార్ చిత్రానికి భారీ వసూళ్లు వస్తున్నాయి . అయితే పలు వివాదాలు ఈ చిత్రాన్ని చుట్టుముట్టడంతో మరిన్ని వసూళ్లు పెరిగాయి
దీ
. తెలుగులో కూడా పెట్టిన పెట్టుబడి అందరికీ వచ్చేసింది . ఇక తమిళనాట అయితే వసూళ్ల సునామీ సృష్టిస్తోంది సర్కార్ చిత్రం . రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన సర్కార్ చిత్రంలో విజయ్ సరసన కీర్తి సురేష్ నటించగా కీలక పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది . మురుగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇంకా మంచి వసూళ్ల ని సాధిస్తోంది దాంతో అవలీలగా 250 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
టా
లీవుడ్ లో జై లవకుశ , పవర్ , పండగ చేస్కో , శ్రీమంతుడు , జిల్ , కృష్ణగాడి వీర ప్రేమ గాధ , గౌరవం , ఎక్స్ ప్రెస్ రాజా , దువ్వాడ జగన్నాథం , నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా తదితర చిత్రాల్లో విలన్ గా నటించాడు హరీష్ ఉత్తమన్ . టాలీవుడ్ లోనే కాకుండా పలు తమిళ చిత్రాల్లో , మలయాళ చిత్రాల్లో నటించాడు హరీష్ ఉత్తమన్ . పెళ్లితో ఒక్కటైన ఈ జంట ని అందరూ ఆశీర్వదిస్తున్నారు అసలు విషయం తెలిసి . అలాగే షాక్ అవుతున్నారు కూడా .
ఎ
న్టీఆర్ బయోపిక్ చిత్రం 2019 జనవరి 9న మొదటి భాగం విడుదల అవుతుండగా అదే సమయంలో వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తీయబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . అసలు ఎన్టీఆర్ బయోపిక్ కు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించాలని ఆశపడ్డాడు . కానీ బాలయ్య ఛాన్స్ ఇవ్వలేదు దాంతో హర్ట్ అయిన వర్మ తెరమీదకు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తీసుకొచ్చాడు . లక్ష్మీపార్వతి ని కలిసి ఎన్టీఆర్ చనిపోయే ముందు తతంగమంతా క్షుణ్ణంగా తెలుసుకొని లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే వివాదాస్పద చిత్రానికి శ్రీకారం చుట్టాడు .
ప్రి
యాంత్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. నిశ్చయ్ ప్రొడక్షన్ స్ పతాకంపై తెరకెక్కుతున్న యూత్‌ఫుల్ & బ్యూటిఫుల్ సినిమా `కొత్తగా మా ప్రయాణం`. యామిని భాస్కర్ కథానాయిక. `ఈ వర్షం సాక్షిగా` ఫేం రమణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజైంది. టీజర్ ఆద్యంతం ఫన్, లవ్, యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ షేడ్స్ తో ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో యాక్షన్ కంటెంట్‌తో పాటు పంచ్ డైలాగ్‌లు వర్కవుటయ్యాయని తాజాగా రిలీజైన టీజర్ చెబుతోంది. ర్శకుడు రమణ మాట్లాడుతూ-``నలుగురికి సాయపడుతూ ఓపెన్ మైండెడ్‌గా ఉండే ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రేమకథ ఇది. నలుగురికి
ద
1995
లో ఎన్టీఆర్ ని పదవి నుండి దించేసిన కోణంలో బాలయ్య కానీ చంద్రబాబు కానీ దోషులుగానే కనబడతారు అలాగే ఎన్టీఆర్ చనిపోయే ముందు తీవ్ర మానసిక క్షోభ అనుభవించాడు . లక్ష్మీపార్వతి కోణంలో కథ చెబితే తప్పకుండా లక్ష్మీస్ ఎన్టీఆర్ తప్పకుండా వివాదాస్పదం అవ్వడం ఖాయం . ఇది బాలయ్య కు ఇబ్బందికరమైన అంశమే సుమా !
సాయపడే తత్వం ఉన్న అతడికి ప్రేమ, పెళ్లి, కుటుంబం వంటి విలువలపై అంతగా నమ్మకం ఉండదు. అయితే అలాంటివాడు మన సాంప్రదాయం విలువను, గొప్పతనాన్ని తెలుసుకుని అటుపై ఎలా మారాడు? అన్నది ఆద్యంతం ఆసక్తికరంగా చూపించాం. నెలకు 2లక్షల జీతం అందుకునే సాఫ్ట్‌వేర్ కుర్రాడి కథ ఇది. ప్రియాంత్ కి తొలి సినిమానే అయినా తడబ డకుండా చక్కగా నటించాడు. యామిని భాస్కర్ అందచందాలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ఆ ఇద్దరికీ పేరొస్తుంది. యువతరాన్ని టార్గెట్ చేసి తీసిన ఈ చిత్రాన్ని డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. భాను, గిరి, ఈరోజుల్లో సాయి, జీవా, కారుణ్య తదితరులు నటించారు. పాటలు: రామజోగయ్య శాస్త్రి, కరుణాకర్, సంగీతం: సునీల్ కశ్యప్, సాయి కార్తీక్, కెమెరా: అరుణ్ కుమార్, ఎడిటింగ్: నంచదమూరి హరి.
టాలీవుడ్ P 6
వి
క్రమ్ కుమార్ సినిమాలో నాని నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కాగా ఆ చిత్రంలో కీలక పాత్రలో విలన్ గా నటించడానికి హీరో సిద్దార్థ్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది . హీరోగా సిద్దార్థ్ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నాడు . ఈ హీరోకు తమిళనాట మాత్రమే కాకుండా టాలీవుడ్ లో కూడా అభిమానులు ఉన్నారు అయితే గతకొంత కాలంగా హీరోగా సక్సెస్ లు అందుకోలేక పోతున్నాడు సిద్దార్థ్ . దాంతో అతడ్ని నాని సినిమాలో విలన్ గా నటించమని విక్రమ్ కుమార్ కోరినట్లు అందుకు సిద్దార్థ్ అంగీకరించినట్లు చెబుతున్నారు . అయితే సిద్దార్థ్ విలన్ గా నటిస్తాడా
? అన్న అనుమానం కూడా నెలకొంది . భిన్న కథా చిత్రాలు చేస్తున్న నాని కి వరుసగా రెండు సినిమాలు పెద్ద దెబ్బ కొట్టాయి దాంతో విక్రమ్ కుమార్ సినిమా ఓకే చేసినట్లు తెలుస్తోంది . ఇప్పటికే జెర్సీ అనే సినిమా చేస్తున్నాడు నాని , దాన్ని కంప్లీట్ చేసాక విక్రమ్ కుమార్ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందట . థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్క నున్న విక్రమ్ సినిమాపై నాని ఆశలు పెట్టుకున్నాడు . ఇక నాని - సిద్దార్థ్ ఇద్దరు కూడా మంచి స్నేహితులు కట్ చేస్తే తెరమీద మాత్రం బద్ద శత్రువులుగా నటించడానికి సిద్ధం అవుతున్నారట .
వి
అ
క్క నందమూరి సుహాసిని కి నాన్న హరికృష్ణ లేడు , ఆయనే బ్రతికుంటే కూతురు కోసం మరోసారి చైతన్య రథసారధి అయి ప్రచారం చేసేవాడు , గెలిపించేవాడు కానీ నాన్న లేడుగా అందుకే నందమూరి సుహాసిని ఒంటరి పోరాటం చేస్తోంది ఇద్దరు తమ్ముళ్లు అందునా హీరోలైన తమ్ముళ్లు ఉండి కూడా . అక్క కోసం ప్రచారానికి
ఎందుకు వస్తారు వాళ్ళు రారు !...... వాళ్లకు వాళ్ళ డబ్బు , కెరీర్ మాత్రమే ముఖ్యం , కేసీఆర్ తో పెట్టుకుంటే పగబట్టి వాళ్ళని వేధిస్తాడేమో అన్న భయం కావచ్చు ..... .... చంద్రబాబు నాయుడు మీద కోపం కావచ్చు ఏది ఏమైనా అక్క కు నాన్న లేడు తమ్ముళ్లు రారు , ఇది నందమూరి సుహాసిని పరిస్థితి .
ప్ర
తీ రోజు నా దగ్గరకు వచ్చి నన్ను బాగా నలిపేస్తున్నాడు అంటూ ఘోరమైన కామెంట్ పెట్టేసింది హాట్ భామ గ్యాబ్రిల్లా డిమిట్రియాడెస్ . ఇంతకీ ఈ హాట్ భామ ఎవరు అని అనుకుంటున్నారా ? నాగార్జున , కార్తీ , తమన్నా లు నటించిన ఊపిరి చిత్రంలో గ్యాబ్రిల్లా నటించింది . అయితే ఈ భామది అందులో చిన్న పాత్ర మాత్రమే ! కొద్దిసేపే కనిపిస్తుంది . నాగార్జున ని సంతోష పరచడానికి డ్యాన్స్ చేసే అమ్మాయిగా నటించింది గ్యాబ్రిల్లా . అయితే ఈ భామని అంతగా నలిపేది ఎవరయ్యా ? అనే కదా మీ డౌట్ ? అతడు బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్ . తగాడు తన భార్యకు విడాకులు ఇచ్చాడు , అయితే మరో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మాజీ భార్య సుసాన్నె ఖాన్ తో డేటింగ్ చేసాడు చెట్టా పట్టాలేసుకొని తిరిగారు కానీ ఎక్కడో చెడింది అందుకే గ్యాబ్రిల్లా తో సహజీవనం చేస్తున్నాడు గత కొంత కాలంగా . అయితే ఆమధ్య అర్జున్ రాంపాల్ - గ్యాబ్రిల్లా మధ్య ఏదో జరుగుతోందని గుసగుసలు వినిపించాయి కట్ చేస్తే అవి నిజమే అని చెప్పడానికి గ్యాబ్రిల్లా పోస్ట్ చేసిన ఫోటో నే సాక్ష్యం . అర్జున్ రాంపాల్ దాదాపుగా నగ్నంగా ఉన్న ఫోటో కావచ్చు , కాకపోతే సగం వరకే ఫోటో తీసి నన్ను నలిపేసేదే ఇతడే అంటూ పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది గ్యాబ్రిల్లా డిమిట్రియాడెస్ .
ఇ
ఎ
న్టీఆర్ కుటుంబంలో నివురుగప్పిన నిప్పులా ఉంది పరిస్థితి . ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్దది అన్న విషయం అందరికీ తెలిసిందే . ఎన్టీఆర్ సంతానం ఏకంగా 12 మంది దానికి తోడు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బంధువర్గమంతా ఓ గ్రామమే అవుతుంది . అయితే బంధువర్గాన్ని పక్కన పెడితే ఎన్టీఆర్ కుటుంబంలోనే సఖ్యత లేదు , పెద్దల్లుడు వెంకటేశ్వర్ రావు - చిన్నల్లుడు చంద్రబాబు లకు అంతగా పడదు . అయితే ఈ ఇద్దరినీ ఒక్క తాటిపైకి తేవాలని బాలయ్య భావిస్తున్నాడట అది ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ వేడుక కోసం . న్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం
ఎ
తెలిసిందే . ఎన్టీఆర్ కథానాయకుడు , ఎన్టీఆర్ మహానాయకుడు ఇలా రెండు భాగాలుగా 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు బాలయ్య . జనవరిలో విడుదల కాబట్టి డిసెంబర్ 16 న ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ రిలీజ్ వేడుక ఎన్టీఆర్ కుటుంబం అందరినీ ఏకతాటి పైకి తెచ్చి చేయాలనీ డిసైడ్ అయ్యాడట బాలయ్య . అయితే అందరినీ ఏకం చేయొచ్చు కానీ వెంకటేశ్వర్ రావు ని ఈ వేడుకకు రప్పించడం కష్టమే కావచ్చు అన్న మాట వినబడుతోంది . ఎందుకంటే చంద్రబాబు అంటే వెంకటేశ్వర్ రావు కు పడదు మరి .
7 P టాలీవుడ్
హా
ట్ భామ కేథరిన్ ట్రెసా అంటే తెగ ఇష్టపడుతున్నాడు దర్శకులు బోయపాటి శ్రీను . తాజాగా తన వినయ విధేయ రామ చిత్రంలో ఈ హాట్ భామ చేత ఐటెం సాంగ్ చేయిస్తున్నాడు . ఇప్పటికే తన సినిమాల్లో కేథరిన్ కు రెండుసార్లు వరుసగా ఛాన్స్ ఇచ్చాడు బోయపాటి . అల్లు అర్జున్ హీరోగా నటించిన సరైనోడు చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన జయ జానకి నాయక చిత్రంలో కేవలం ఐటెం సాంగ్ మాత్రం చేయించాడు బోయపాటి . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ వినయ విధేయ రామ చిత్రంలో కేథరిన్ ట్రెసా చేత ఐటెం సాంగ్
అ
చేయించడానికి రెడీ అవుతున్నాడు . సలు ఈ చిత్రంలో ఇలియానా చేత ఐటెం సాంగ్ చేయించాలని భావించారు . ఇలియానాని అడిగారు కూడా కానీ ఆమె 60 లక్షల రెమ్యునరేషన్ విని షాక్ అయ్యారు దాంతో కేథరిన్ ని తీసుకుందామని చరణ్ కు చెప్పాడట బోయపాటి శ్రీను . కేథరిన్ అంటే కాస్త మక్కువ ఏర్పడటంతో ఆ భామతో చేద్దామని చరణ్ ని ఒప్పించాడట . బోయపాటి కోరిక మేరకు చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది . ఇక ఈ చిత్రాన్ని 2019 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
ప
వన్ కళ్యాణ్ అభిమానులు నలుగురు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో కర్నూల్ జిల్లా డోన్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి . ఇటీవల పవన్ కళ్యాణ్ అనంతపురం లో జనసేన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే . కాగా ఆ కవాతులో పాల్గొనడానికి కర్నూల్ జిల్లా డోన్ కి చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు కారులో అనంతపురం బయలుదేరారు . అనంతపురం లో జరిగిన కవాతులో పాల్గొని తిరిగి ఇంటికి వస్తున్న నేపథ్యంలో డోన్ సమీపంలో భారీ యాక్సిడెంట్ జరిగింది . హైదరాబాద్ నుండి వేగంగా వస్తున్న బస్సు డీ కొట్టడంతో అక్కడికక్కడే నలుగురు చనిపోయారు . రులోనే మృతదేహాలు పడిఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోస్ట్ మార్టం నిమిత్తం . జనసేన కవాతు కి వెళ్లి వస్తూ నలుగురు అభిమానులు మృత్యువాత పడటంతో పవన్ కళ్యాణ్ అభిమానుల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి . ఇక ఆ నాలుగు కుటుంబాల రోదన వర్ణనాతీతం .
తె
లంగాణ ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ సభలో ఆత్మహత్యా యత్నం కలకలం సృష్టించింది . నేరెళ్ల బాధితులు కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ సభలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసారు అయితే పోలీసులు వాళ్ళని అడ్డుకోవడంతో ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు కోల హరీష్ అనే వ్యక్తి . హరీష్ తో పాటుగా పెంట బానయ్య ని కూడా అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు . సంచలనం సృష్టించిన ఈ సంఘటన ఇటీవల తంగళ్లపల్లి లో జరిగింది . నేరెళ్ల సంఘటన యావత్ తెలంగాణ
అ
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే ప్పటి నుండి బాధితులకు సరైన న్యాయం జరగడం లేదు దాంతో మరోసారి తమ బాధని వ్యక్తం చేయడానికి కేటీఆర్ సభని వినియోగించుకున్నారు బాధితులు . నేరెళ్ల గ్రామం సిరిసిల్ల నియోజకవర్గం లోనిదే కావడం విశేషం . కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే . నీతి , న్యాయం గురించి గొంతు చించుకొని మాట్లాడే కేటీఆర్ మమ్మల్ని పట్టించుకోవడం లేదని , అణగదొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు బాధితులు .
కా
కొ
టాలీవుడ్ P 8
డంగల్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ని ఇటీవల అరెస్ట్ చేసారు పోలీసులు . కొడంగల్ లో తన ఇంట్లో ఉన్న రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేయడంతో రేవంత్ అనుచరులు , కాంగ్రెస్ పార్టీకార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయితే రేవంత్ అనుచరులను , ముఖ్య కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేయడంతో కొడంగల్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి . రేవంత్ రెడ్డి ని అరెస్ట్ చేసి జడ్చర్ల ట్రైనింగ్ సెంటర్ కు తరలించడంతో రేవంత్ భార్య గీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడమే
కాకుండా పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది . ఇంట్లో ఉన్న మనిషి ని అరెస్ట్ చేయడం ఏంటి ? అరెస్ట్ చేయడానికి ఇంటి తలుపులు విరగ్గొట్టడం ఏంటి ? అంటూ నిప్పులు చెరిగింది . రోజు తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ కొడంగల్ లో పర్యటిస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి కొడంగల్ బంద్ కు పిలుపునిచ్చాడు దాంతో ఈసీ ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి ని ముందస్తు అరెస్ట్ చేసారు . రేవంత్ అరెస్ట్ తో కాంగ్రెస్ , టీడీపీ నాయకులు , కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు .
ఈ
ప
క్క కూకట్ పల్లి లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేస్తోంది అయితే అక్క కోసం ఎన్టీఆర్ ఇంతవరకు ప్రచారం చేయలేదు . దాంతో కేసీఆర్ కు భయపడి ఎన్టీఆర్ ప్రచారానికి దూరమయ్యాడు అని విమర్శలు వినిపిస్తున్నాయి . ఎన్టీఆర్ కు ఒకవేళ చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే తెలంగాణ లోని ఇతర ప్రాంతాల్లో ప్రచారం చేయొద్దు కానీ అక్క కోసమైనా కూకట్ పల్లి లోనైనా ప్రచారం చేయాలి కదా ! కానీ అలా ఎన్టీఆర్ ప్రచారం చేయడం లేదు . పోనీ అక్క పోటీ చేయడం ఇష్టం లేకపోతె …… చంద్రబాబు నాయుడు అంటే కోపం ఉంటే అసలు అక్క చేత నామినేషన్ వేయించకూడదు . క్క సుహాసిని నామినేషన్ వేయడమే కాకుండా నా తమ్ముళ్లు నాకోసం ప్రచారానికి వస్తారని పదేపదే చెబుతోంది కానీ తమ్ముళ్ల జాడ మాత్రం కానరావడం లేదు . మరోవైపు ప్రచారం కూడా గడువు ముగుస్తోంది , అయినా ఎన్టీఆర్ వైపు నుండి ఎలాంటి ప్రకటన లేదు దాంతో కేసీఆర్ కు భయపడి ప్రచారానికి రావడం లేదనే విమర్శలు
రా
వన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల లొల్లి మళ్ళీ షురూ అయ్యింది . ప్రతిపక్ష నేత జగన్ మరోసారి పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల పై కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు . ఇంతకుముందే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై కామెంట్ చేసిన జగన్ తాజాగా మరోసారి కార్ల ని మార్చినట్లుగా పెళ్లాలను మార్చుతున్నాడని పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగాడు జగన్ . పెళ్లాలను మార్చితే మగాడివా ? ఇదేనా నీ మగతనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసాడు జగన్ . జకీయ నాయకులు ఆరోపణలు చేసుకోవచ్చు కానీ వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగొద్దని హితువు పలుకుతున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు . జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తక్కువేమీ తినలేదు జగన్ వ్యక్తిగత జీవితం పై కూడా విమర్శలు చేసాడు . దాంతో జగన్ పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద కామెంట్ చేస్తూనే ఉన్నాడు . మూడు పెళ్లిళ్లు కాదని నాలుగో పెళ్లి కూడా చేసుకున్నాడని ఇంతకుముందు పవన్ పై జగన్ ఆరోపించిన విషయం తెలిసిందే . ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల నాటికి ఎంత దారుణంగా విమర్శించు కుంటారో అన్న చర్చ మొదలైంది .
అ అ
ఎక్కువయ్యాయి . తెలంగాణ లో తెలుగుదేశం పని అయిపొయింది కాబట్టి కేసీఆర్ తో పెట్టుకోవడం ఎందుకు ? ఇబ్బంది పడటం ఎందుకు ? అన్న భావనలో ఉండి ఉంటాడు ఎన్టీఆర్ .
ప్ర
భాస్ వద్దని రిజెక్ట్ చేసిన సినిమాని విజయ్ దేవరకొండతన్నుకుపోయినట్లు తెలుస్తోంది . బాహుబలి తో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగింది దాంతో బాలీవుడ్ లో ప్రభాస్ ని పరిచయం చేస్తూ ఓ సినిమా చేయాలనీ భావించాడు కరణ్ జోహార్ , అయితే రెమ్యునరేషన్ దగ్గర తేడా కొట్టడంతో ప్రభాస్ కరణ్ సినిమాని రిజెక్ట్ చేసాడు . కట్ చేస్తే ఇప్పుడు అదే సినిమాని చేయడానికి సిద్ధం అవుతున్నాడట విజయ్ దేవరకొండ . ప్రభాస్ వద్దన్నా సినిమాని విజయ్ దేవరకొండ తో చేయాలనీ సన్నాహాలు చేస్తున్నాడట కరణ్ జోహార్ .
ఇ
క ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది . జాన్వీ కపూర్ కు కూడా విజయ్ దేవరకొండ సరసన నటించాలని ఆసక్తి ఉంది . ఇంతకుముందు కరణ్ జోహార్ షోలో పాల్గొన్నప్పుడు విజయ్ దేవరకొండ ప్రస్తావన తెచ్చింది జాన్వీ కపూర్ . ఇక విజయ్ కూడా జాన్వీ తో నటించాలని ఉందని పేర్కొన్న విషయం తెలిసిందే . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం, టాక్సీ వాలా చిత్రాలతో విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగింది .
వి రాజ్ జె అశ్విన్ , రిద్దికుమార్ , రాధా బంగారు హీరో హీరోయిన్ లుగా తాతం శెట్టి ప్రతాప్ దర్శకత్వంలో కే ఎల్ ఎన్ రాజు నిర్మించిన చిత్రం ” అనగనగా ఓ ప్రేమ కథ ”. సందేశాత్మక ప్రేమకథ గా తెరకెక్కిన ఈ చిత్రాన్నీ ఈనెల 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . విడుదలకు సిద్దమైన నేపథ్యంలో ఈరోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు ఆ చిత్ర బృందం . ఈ వేడుకలో
హీరో విరాజ్ జె అశ్విన్ , నిర్మాత కే ఎల్ ఎన్ రాజు , దర్శకుడు ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు . న్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న అనగనగా ఓ ప్రేమకథ చిత్రాన్ని డిసెంబర్ 14న విడుదల చేస్తున్నామని , తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేసారు . తనకు దర్శకుడిగా అవకాశం ఇచ్చిన నిర్మాతకు కృతఙ్ఞతలు తెలిపాడు దర్శకుడు ప్రతాప్ .
సె
నం
దమూరి కళ్యాణ్ రామ్ సరసన సాయి పల్లవినటించనని తేల్చి చెప్పిందట దాంతో షాక్ అయ్యారట ఆ చిత్ర బృందం . ఇంతకీ సాయి పల్లవి కళ్యాణ్ రామ్ సినిమాని ఎందుకు తిరస్కరించిందో తెలుసా ……. కళ్యాణ్ రామ్ సినిమాలో తన పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదట ! దాంతో ఆ సినిమాలో నటించి ప్రయోజనం లేదు కాబట్టి నిర్మొహమాటంగా చెప్పిందట సాయి పల్లవి . ఇప్పుడు ఫిలిం నగర్ లో సాయి పల్లవి మ్యాటర్ సంచలనం సృష్టిస్తోంది కళ్యాణ్ రామ్ సినిమాని రిజెక్ట్ చేసిందని .
క
ళ్యాణ్ రామ్ హీరోగా విరించి వర్మ దర్శకత్వంలో ఓ ప్రేమకథా చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు . విరించి వర్మ సాయి పల్లవి దగ్గరకు వెళ్లి కథ చెప్పాడట ! అయితే కథలో ఎక్కడా తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత లేకపోవడంతో నో చెప్పిందట . సాయి పల్లవి అంత త్వరగా సినిమాలను ఒప్పుకోదు ఎందుకంటే తనకు బాగా నచ్చితేనే చేస్తుంది . పైగా ఆమెకు కొంత పొగరు ఎక్కువే ! అని కామెంట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు . సాయి పల్లవి నో చెప్పడంతో మరో హీరోయిన్ ని వెదికే పనిలో పడ్డారు కళ్యాణ్ రామ్ , విరించి వర్మ .
9 P టాలీవుడ్
న
టసింహం నందమూరి బాలకృష్ణ తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించారు . తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం రోడ్ షోలు చేపట్టారు బాలయ్య . సనత్ నగర్ , శేరిలింగం పల్లి లలో బాలయ్య ప్రచారం చేపట్టారు . కాగా మొన్న ఓ మాదిరిగా తెలంగాణ ప్రభుత్వం పై కేసీఆర్ పై విమర్శలు చేసిన బాలయ్య ఇటీవల నిప్పుల వర్షం కురిపించాడు , నటసింహం అనిపించాడు . నిజంగా మీకు దమ్ముంటే హైటెక్ సిటీ ని మూయండి ,ఫ్లై ఓవర్ లను మూసేయండి అంత దమ్ముందా కేసీఆర్ ? అంటూ నేరుగా కేసీఆర్ ని ప్రశ్నించాడు .
హై
దరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు పాత్రని ఎవరు కాదనలేని సత్యమని , చంద్రబాబుది ఒక చరిత్ర , ఆ చరిత్ర ని చెరిపేయ్యాలంటే హైటెక్ సిటీ ని , ఫ్లై ఓవర్ లను మూసేయండి అంటూ సవాల్ విసిరాడు అంతేకాదు చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తే హైదరాబాద్ ఈ స్థాయికి వచ్చిందని …… గడీల రాజ్యం పోయి గరీబోళ్ల రాజ్యం తెచ్చింది తెలుగుదేశం పార్టీ అని కానీ ఇప్పుడు మళ్ళీ గడీల రాజ్యం వచ్చిందని కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు బాలయ్య . చంద్రబాబు ముద్ర ని తీసేయ్యాలంటే చంద్రబాబు తెచ్చిన అన్నింటినీ మూసెయ్యాలని సంచలన వ్యాఖ్యలు చేసాడు బాలయ్య .
దీ
పికా పదుకోన్ – రణ్ వీర్ సింగ్ బాలీవుడ్ ప్రముఖులకు పెద్ద ఎత్తున రిసెప్షన్ పార్టీ ఇచ్చారు . కాగా ఆ పార్టీలో క్లీవేజ్ షోతో పిచ్చెక్కించి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది దిశా పటాని . లోఫర్ చిత్రంతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ సినిమా ప్లాప్ కావడంతో మళ్ళీ టాలీవుడ్ సినిమాల్లో నటించలేదు . అయితే బాలీవుడ్ లో మాత్రం పలు చిత్రాల్లో నటిస్తూ కుర్రాళ్ళని బాగానే రెచ్చగొడుతోంది . జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో జోరుగా ప్రేమాయణం సాగిస్తున్న ఈ భామ తాజాగా దీపికా – రణ్ వీర్ ల రిసెప్షన్ కు వచ్చి మతి పోగొట్టింది . గ్ ఫ్రాక్ లో డీప్ క్లీవేజ్ షో చేస్తూ అందరి చూపు ఆకర్షించింది . దిశా ఒక్కో అడుగు వేస్తుంటే దశ దిశలా ఎద అందాలు ఎగిరి ఎగిరి పడుతుంటే ఆ ఎత్తుల కదలికకు ఫిదా అయ్యారట ఆహుతులు . దీపికా – రణ్ వీర్ ల వేడుకలో దిశా పటాని అందాలే స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయట . క్లీవేజ్ అందాలు మతి పోగొడుతుంటే ఆ అందాలను చూడలేక చాలా ఇబ్బంది పడ్డారట .
లాం
ఎ
న్టీఆర్ – మహేష్ బాబు అభిమానుల మధ్య మళ్ళీ చిచ్చు మొదలైంది . ఇంతకుముందు కూడా మహేష్ మీద ఎన్టీఆర్ అభిమానులు నోరు పారేసుకున్నారు కాగా ఆ సంఘటన మర్చిపోగా మళ్ళీ తాజాగా మరోసారి మహేష్ బాబు మీద మళ్ళీ నోరు పారేసుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు . ఇంతకీ మహేష్ బాబు చేసిన తప్పు ఏంటంటే ……. ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అయినప్పుడు ఎన్టీఆర్ కు శుభాకాంక్షలు చెప్పలేదు కానీ ఇతర హీరోల సినిమాలు విడుదల అయినప్పుడు మాత్రం మహేష్ ట్వీట్ చేయడమే ఈ గొడవకు కారణం అయ్యింది . న్టీఆర్ కు బెస్ట్ విషెష్ చెప్పకుండా విజయ్ దేవరకొండ కు అతడి సినిమా విడుదల అవుతున్నప్పుడు శుభాకాంక్షలు తెలిపాడు . అలాగే తమిళ హీరో విజయ్ , మురుగదాస్ లకు కూడా శుభాకాంక్షలు అందజేశాడు . మొన్నటికి మొన్న రజనీకాంత్ నటించిన 2. ఓ చిత్రం విడుదల అవుతుండటంతో దానికి కూడా శుభాకాంక్షలు అందజేస్తూ సోషల్ మీడియా కు ఎక్కాడు మహేష్ . అంటే ఓ చిన్న హీరో కు , తమిళ హీరోలకు సంబందించిన సినిమాల పట్ల స్పందిస్తూ ట్వీట్ చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ ని మాత్రం ఎలా మర్చిపోయారు అంటూ మహేష్ మీద దాడి చేస్తున్నారు . మహేష్ ఫ్యాన్స్ కామ్ గా ఉంటారా ? వాళ్ళు కూడా రివర్స్ గేర్ లో ఎన్టీఆర్ పై దాడి చేస్తున్నారు .
ఎ
టాలీవుడ్ P 10
మై
త్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రాలు ఈ ఏడాదిలో మూడు విడుదల కాగా రంగస్థలం పెద్ద హిట్ అయ్యింది , భారీగా లాభాలను తెచ్చిపెట్టింది అయితే మిగతా రెండు చిత్రాలు మాత్రం ఘోరంగా దెబ్బ కొట్టాయి . అందులో ఒకటి సవ్యసాచి కాగా మరొకటి అమర్ అక్బర్ ఆంటోనీ . అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి చిత్రాన్ని చైతూ మార్కెట్ ని మించి ఖర్చు పెట్టి నిర్మించారు . తిరిగి 8 కోట్లు కూడా రాబట్టలేక పోయింది దాంతో 12 కోట్లకు పైగా నష్టం వచ్చింది దాంట్లో . ఆ తర్వాత రవితేజ హీరోగా నిర్మించిన అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం కూడా ఘోర పరాజయం పొందింది .
ఇ
పట్టుమని 6 కోట్లు కూడా రాబట్టలేక పోయింది . క ఇప్పుడేమో మైత్రి మూవీ మేకర్స్ హిట్ చిత్రాల క్రేజీ హీరో విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు . విజయ్ దేవరకొండ కు అనూహ్యమైన క్రేజ్ వచ్చింది దాంతో మామూలు చిత్రాలు కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి . ఇటీవలే టాక్సీ వాలా చిత్రంతో సూపర్ హిట్ కొట్టేసాడు విజయ్ , దాంతో మైత్రి మూవీస్ ఆశలన్నీ విజయ్ దేవరకొండ పైనే ఉన్నాయి . గీత గోవిందం చిత్రంతో వంద కోట్ల క్లబ్ లో చేరాడు , యావరేజ్ అనుకున్న టాక్సీ వాలా 30 కోట్లు వసూల్ చేయడంతో తప్పకుండా మమ్మల్ని ప్లాప్ ల నుండి గట్టెక్కించేది ఈ క్రేజీ హీరోనే అని ఆశ పెట్టుకున్నారట
మీ
టూ ఉద్యమం వల్ల నాతో మగాళ్లు పెద్దగా మాట్లాడటం లేదని సంచలన వ్యాఖ్యలు చేసింది మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ . పేరుకి మలయాళ భామ అయినప్పటికీ ఎక్కువగా తెలుగు చిత్రాల్లోనే నటించింది . తాజాగా టాలీవుడ్ లో మరో చిత్రాన్ని ప్రారంభించింది కూడా . ఇటీవలే అదుగో చిత్రంలో ఓ పాట చేసింది కానీ ఆ సినిమా ఘోర పరాజయం పొందింది . ముస్లిం మతానికి చెందిన వ్యక్తి ఈ పూర్ణ కానీ తన పేరుని మార్చుకొని
ఇ
సినిమాల్లో నటిస్తోంది . క మీ టూ విషయానికి వస్తే ....... ఎప్పుడో జరిగినపోయిన విషయాన్నీ ఇప్పుడు చెప్పడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని పైగా అది మనకే అవమానకరమని సంచలన వ్యాఖ్యలు చేసింది . లైంగిక వేధింపులు ఎదురైనప్పుడే ఎదురించాలి , నిలదీయాలి అంతేకాని అది జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మాట్లాడటం మంచిది కాదని దానివల్ల ఎటువంటి ప్రయోజనం
లేదని అంటోంది పూర్ణ . మీ టూ ఉద్యమం వల్ల నా మగ స్నేహితులు నాతో ఇంతకుముందు లా మాటాడటానికి భయపడుతున్నారని , అది స్పష్టంగా నాకు అర్ధం అవుతోందని అంటోంది . అంటే ఈ భామ చెప్పొచ్చే దేంటంటే మీ టూ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని అంతే !
జో
రు , అసుర , కిస్ చిత్రాల్లో నటించిన భామ ప్రియా బెనర్జీ తాజాగా లింగరీ లో అందాలను ఆరబోస్తూ షాక్ ఇచ్చింది . టాలీవుడ్ లో మూడు సినిమాల్లో నటించినప్పటికీ పాపం ఈ భామ ని పట్టించుకున్న నాథుడే లేకుండా పోయాడు . అయితే చేసిన మూడు చిత్రాలు కూడా ప్లాప్ కావడంతో ఈ భామని అంతగా గుర్తుపట్టే వాళ్లే లేరు . అందుకే కాబోలు సక్సెస్ తో కొట్టలేనిది అందాలతో కొట్టొచ్చు అని ఫిక్స్ అయి ఇలా ఇన్నర్ వేర్ లో అందాలను ఆరబోసి పండగ చేస్తోంది యువతరానికి .
తా
జాగా ఈ భామ ఇన్నర్ వేర్ లో దిగిన ఫోటోలను తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసింది . ఇంకేముంది ఆ అందాల కోసం కుర్రాళ్ళు ఎగబడుతున్నారు . అందమైన భామల అందాలను చూడటంలో ఉన్న కిక్కే వేరు అందుకే ఏరికోరి మరీ ప్రియా బెనర్జీ అందాలను చూస్తూ మైమరిచిపోతున్నారు . ఇలా లింగరీ లో దిగిన ఫోటోలు తన కెరీర్ కు ఉపయోగ పడతాయని భావిస్తుందేమో ! యువతని పిచ్చెక్కిస్తే చాలు అవకాశాలు వాటంతట అవే వస్తాయని ప్లాన్ వేసినట్లుంది ప్రియా బెనర్జీ .
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2018
Email: editor@tollywoodmag.com I www.tollywood.net