Tollywood Magazine Telugu October - 2018

Page 1

TOLLYWOOD.NET OCTOBER 2018 | VOL 15 | ISSUE 10 | Rs.25/-

/tollywood

/tollywood

p

ముఖ్య కథనాలు







 





RNI NO: APTEL/2003/10076



Young Tiger

N. T. Rama Rao Jr.


 

ప్రే



మించి పెళ్లి చేసుకొని కొద్దిరోజులు కాపురం చేసాక భర్తతో వచ్చిన విబేధాలతో అతడికి విడాకులు ఇచ్చిన బ్లాక్ బ్యూటీ అమలా పాల్ మళ్లీ పెళ్లి చేసుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేసింది. అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ప్రేమించి , విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా విడాకులు ఇచ్చిన తర్వాత రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ పిచ్చ షాక్ ఇస్తోంది ఈ భామ . అంతేకాదు క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా నైనా నటించడానికి నాకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించి మరింత సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పలుమార్లు అందాల ఆరబోతతో ఫోటో షూట్ చేయగా తాజాగా మరో హాట్ ఫోటో షూట్ చేసి మరింత షాక్ ఇచ్చింది అమలాపాల్.

పె

ళ్లికి ముందు అందాల ఆరబోతలో కాస్త నియమాలను పెట్టుకుంది కానీ విడాకులు తీసుకున్న తర్వాత మాత్రం వీర లెవల్లో రెచ్చిపోయింది. ఇక తాజాగా అమలాపాల్ చేసిన ఫోటో షూట్ పిచ్చెక్కించేస్తోంది. అంతేనా మళ్లీ నేను రెండో పెళ్లి చేసుకుంటానని , అలాగే రాజకీయాల్లోకి కూడ వస్తానని కూడా అంటోంది . అయితే రాజకీయాలలోకి రావడానికి మాత్రం కాస్త సమయం పడుతుందని అంటోంది. ఇక రెండో పెళ్లి కూడా ఇప్పుడే కాదని ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాల మీదే ఉందని , క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా నైనా నటించడానికి నాకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది అమలా పాల్ . తెలుగులో ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు కానీ తమిళంలో మాత్రం వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

 

యం

గ్ టైగర్ ఎన్టీఆర్ తన మార్కెట్ ని మరింతగా పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లున్నాడు అందుకే తమిళ , తెలుగు భాషల్లో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటుగా నేరుగా తమిళ్ సినిమా చేయడం ద్వారా అభిమానులను పెంచుకోవడం మాత్రమే కాకుండా మార్కెట్ కూడా పెరుగుతుంది. అలాగే అదనంగా మరో 5 కోట్ల నుండి 30 కోట్ల వరకు అక్కడ రాబట్టవచ్చు అనే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో నటించడానికి ఒప్పుకున్నాడట . తమిళంలో అట్లీ స్టార్ డైరెక్టర్ అన్న విషయం తెలిసిందే. క ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత అశ్వనీదత్ నిర్మించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్ స్వప్న సినిమాతోనే దూసుకుపోయింది. మొదటి చిత్రం ప్లాప్ అయినప్పటికీ స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతోనే ఎన్టీఆర్ సక్సెస్ కొట్టాడు . దాంతో అశ్వనీదత్ కోసం మరో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట . అంతేకాదు శక్తి అనే డిజాస్టర్ సినిమా కూడా వైజయంతి మూవీస్ అశ్వనీదత్ నిర్మించిందే. దానికోసమైనా ఎన్టీఆర్ మరో సినిమా చేయడం ఖాయం. అందుకే అట్లీ తో మాట్లాడారట అశ్వనీదత్ .అయితే ఎన్టీఆర్ -అట్లీ అశ్వనీదత్ ల కాంబినేషన్లో సినిమా అంటే 2020 లొనే వీలౌతుంది ఎందుకంటే అప్పటి వరకు రాజమౌళి సినిమానే చేయనున్నాడు ఎన్టీఆర్ .


“THE BEST AND MOST BEAUTIFUL THINGS IN THE WORLD CANNOT BE SEEN OR EVEN TOUCHED - THEY MUST BE FELT WITH THE HEART.”

Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :



               నా అ Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 OCTOBER 2018

క్కినేని నాగార్జున , నాని లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న సినిమా కదా అని ముందు వెనుకా ఆలోచించకుండా దేవదాస్ సినిమా ఒప్పుకొని తప్పుచేసింది రష్మీక మందన్న . ఛలో చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న భామ రష్మీక , ఛలో సూపర్ హిట్ కావడంతో వెంటనే గీత గోవిందం చిత్రంలో ఛాన్స్ వచ్చింది దాంతో ఆ సినిమా చేసింది . మంచి పాత్ర లభించడంతో తన నటనని ప్రదర్శించే ఛాన్స్ లభించింది. ఇక గీత గోవిందం విడుదల కాకముందే మళ్లీ విజయ్ దేవరకొండ సరసన డియర్ కామ్రేడ్ చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది . కట్ చేస్తే గీత గోవిందం బ్లాక్ బస్టర్ అయి రష్మీక మందన్న కు స్టార్ డం ని తెచ్చిపెట్టింది. అయితే దేవదాస్ మాత్రం దెబ్బకొట్టింది రష్మీక ని .

గార్జున , నాని లాంటి స్టార్ లు నటిస్తున్న సినిమా కావడంతో కథ , కథనం గురించి పట్టించుకోకపోవడంతో ఫలితం దారుణంగా దెబ్బకొట్టింది. దేవదాస్ సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో రావడం లేదు. దాంతో దేవదాస్ ప్లాప్ బారిన పడినట్లే ! ఛలో , గీత గోవిందం చిత్రాలతో వరుస విజయాలు సాధించిన రష్మీక మందన్న కు దేవదాస్ చిత్రం వల్ల హ్యాట్రిక్ మిస్ అయ్యింది. స్టార్ హీరోలు అని తొందరపడి చేసి తప్పు చేసింది రష్మీక మందన్న .





గీ

పె

బి

కౌ

త గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ కాగా ఈ హీరో తనకు వచ్చిన స్టార్ డంతో అమాంతం తన రెమ్యునరేషన్ ని డబుల్ చేశాడని వార్తలు వస్తున్నాయి . ఈ వార్తలు మరింతగా స్ప్రెడ్ కావడంతో కాబోలు విజయ్ దృష్టికి వచ్చాయి దాంతో రెమ్యునరేషన్ విషయం పై స్పందించాడు . నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నానని , స్టార్ గా ఎడిగానని అనుకోవడం లేదని అందుకే నా రెమ్యునరేషన్ పెంచలేదని చెప్పాడు హీరో విజయ్ దేవరకొండ.

గ్ బాస్ 2 కు హోస్ట్ గా వ్యవహరించినందుకు కుమిలి ,కుమిలిపోతున్నాడట నాని . మొదట్లోనేమో ఎన్టీఆర్ స్థాయిలో నాని హోస్ట్ గా చేయడం లేదని , ప్రేక్షకులను ఆకట్టుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే రాను రాను ఆ విమర్శలు పోయి ఇతర అంశాలు తెరమీదకు వచ్చాయి. కట్ చేస్తే అన్ని అంశాలు పక్కకు పోయి కౌశల్ ఆర్మీ దాడి నానిపై ఎక్కువగా పనిచేసింది. ఎక్కువ ఒత్తిడి అయ్యింది నాని మీద . ఒక దశలో కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ నే శాసించే స్థాయికి రావడంతో నాని ఓ లెక్కా . కౌశల్ ని విమర్శించే వాళ్ళని కౌశల్ ఆర్మీ టార్గెట్ చేసింది. అందులో నాని కూడా ఉండటంతో పాపం నాని పరిస్థితి దారుణంగా మారింది.

ళ్లిచూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలతో సంచలనం సృష్టించిన విజయ్ దేవరకొండ తాజాగా గీత గోవిందం చిత్రంతో ప్రభంజనం సృష్టించాడు. చిన్న చిత్రంగా విడుదలైన గీత గోవిందం ఏకంగా 120 కోట్లకు పైగా వసూల్ చేసింది. దాంతో విజయ్ దేవరకొండ తన రెమ్యునరేషన్ ని పది కోట్లకు పెంచాడని వినబడుతోంది కానీ విజయ్ మాత్రం రెమ్యునరేషన్ పెంచలేదని 5 కోట్లు మాత్రమే తీసుకుంటున్నామని పరోక్షంగా చెబుతున్నాడు . నిజమేనా ! నమ్మొచ్చా ...... విజయ్ దేవరకొండ మాటలను. శల్ ని టార్గెట్ చేయడానికి మిగతా వాళ్ల లాగే నాని కూడా వ్యవహరించాడని అందుకే నాని ని టార్గెట్ చేస్తున్నామని బహిరంగంగానే ప్రకటించారు కౌశల్ ఆర్మీ. దాంతో బిగ్ బాస్ 2 కి హోస్ట్ గా చేసినందుకు నిజంగానే కుమిలిపోతున్నాడట నాని. బిగ్ బాస్ వల్ల నాని కి మంచి పేరు రాకపోగా విమర్శలు రావడమే కాకుండా కొంతమంది శత్రువులను సంపాదించుకున్నట్లు అయ్యిందని బాధపడుతున్నాడట నాని. కౌశల్ ఆర్మీ పగబట్టినట్లుగానే నాని నటించిన దేవదాస్ ప్లాప్ అయ్యింది.

          

3 P టాలీవుడ్






తె

లంగాణ యువ నాయకుడు కల్వకుంట్ల తారకరామారావు ని ఛాలెంజ్ చేస్తున్నాడు కొండా మురళి. కేటీఆర్ నీకు దమ్ముంటే వరంగల్ జిల్లా బాధ్యతలు తీసుకొని నాతో పోటీపడి నీ దమ్ము చూపించు అంటూ సవాల్ విసిరాడు కొండా మురళి. వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా టీఆర్ఎస్ గెలుచు కోదని , గెలవనిచ్చే ప్రసక్తే లేదని శపథం చేస్తున్నాడు కొండా మురళి. వరంగల్ ఈస్ట్ స్థానం నుండి టీఆర్ఎస్ తరుపున గత ఎన్నికల్లో పోటీచేసి విజయం సాధించింది కొండా సురేఖ . అయితే ఈసారి మాత్రం కొండా సురేఖ కు టికెట్ కేటాయించకపోవడంతో కేసీఆర్ , కేటీఆర్ లపై నిప్పులు చేరుగుతూ టీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరారు కొండా దంపతులు.

మ్మడి వరంగల్ జిల్లాలో కొండా దంపతులకు మంచి పలుకుబడి ఉంది దాంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ కు ఒక్క స్థానం కూడా రానీయకుండా ప్రచారం చేస్తామని సవాల్ విసురుతున్నాడు కొండా మురళి. నిజంగా కేటీఆర్ కు దమ్ముంటే నాతో పోటీ పడాలని , వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి గా ప్రచార బాధ్యతలు చేపట్టాలని అప్పుడు నీ సత్తా ఏంటో తెలుస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసాడు కొండా మురళి. వరంగల్ జిల్లాలో కనీసం అయిదు నియోజకవర్గాల్లో కొండా దంపతులు ప్రభావం చూపించే అవకాశం ఉంది దాంతో టీఆర్ఎస్ కు వరంగల్ జిల్లాలో ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

   బి

గ్ బాస్ 2 విన్నర్ గా కౌశల్ నిలిచిన విషయం తెలిసిందే. నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ 2 లో అనామకుడిగా అడుగుపెట్టిన కౌశల్ రోజు రోజుకి తన స్థాయి పెంచుకుంటూ ఏకంగా కౌశల్ ఆర్మీ తయారయ్యేలా చేసుకున్నాడు. ఎలిమినేషన్ వచ్చిన ప్రతీ సందర్భంలో కౌశల్ ఆర్మీ సహాయంతో భారీ ఎత్తున ఓట్లు కొల్లగొట్టి హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాని ని మాత్రమే కాదు చివరకు బిగ్ బాస్ ని సైతం శాసించే స్థాయికి చేరుకున్నాడు కౌశల్. ఈ స్థితికి రావడానికి కారణం కౌశల్ ఆర్మీ అండదండలు . ఇక బిగ్ బాస్ 2 లో విన్నర్ గా నిలిచిన కౌశల్ కు ట్రోఫీతో పాటుగా 50 లక్షల నగదు బహుమతి కూడా లభించింది.



మొత్తాన్ని కౌశల్ ఏం చేస్తున్నాడో తెలుసా........ క్యాన్సర్ పేషెంట్ ల కోసం ఖర్చు చేయాలని నిర్ణయించుకున్నాడట . ఎందుకంటే కౌశల్ తల్లి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చనిపోయిందట అందుకే క్యాన్సర్ బాధితుల సహయార్థం 50 లక్షలను వినియోగిస్తానని ప్రకటించాడు కౌశల్. ఇక బిగ్ బాస్ 2 ఫైనల్స్ లో విన్నర్ ని ప్రకటించడానికి సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు . మొత్తానికి బిగ్ బాస్ 2 సీజన్ కంప్లీట్ అయ్యింది. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా , రెండో సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. ఇక మూడో సీజన్ ఎప్పుడో ? దానికి హోస్ట్ గా వ్యవహరించేది ఎవరో ?

ఉన్న సుధీర్ కు బాలీవుడ్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. మల్టీస్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రంలో విలన్ గా నటించమని సుధీర్ ని కోరారట అయితే ఆ ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించాడు సుధీర్ బాబు . ద్ద బ్యానర్ , పైగా మల్టీస్టారర్ చిత్రం అందునా టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఓ గెస్ట్ రోల్ పోషిస్తున్న చిత్రం అయినప్పటికీ సుధీర్ బాబు విలన్ గా నటించడానికి ఒప్పుకోలేదు. ఇంతకుముందు భాగీ చిత్రంలో విలన్ గా నటించాడు కూడా కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పటికీ ఎందుకు ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేశాడో తెలుసా ........ పుల్లెల గోపీచంద్ బయోపిక్ లో నటించడానికి ఒప్పుకోవడం వల్లే ! బ్యాడ్మింటన్ స్టార్ పుల్లెల గోపిచంద్ బయోపిక్ లో నటించాలని ఎప్పుడో డిసైడ్ అయ్యాడు సుధీర్ పైగా బాలీవుడ్ లో కూడా రూపొందుతోంది ఈ బయోపిక్ దాంతో బ్రహ్మాస్త్ర కు బయోపిక్ కు ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉన్నందున బాలీవుడ్ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు సుధీర్ బాబు .

 పె 

టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బావ హీరో సుధీర్ బాబు ఇటీవలే నన్ను దోచుకుందువటే చిత్రంతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా విజయం సాధించాడు అయితే పూర్తిస్థాయి విజయం కాకపోయినా ప్లాప్ కాలేదు పైగా హిట్ టాక్ కూడా వచ్చిన చిత్రం కాబట్టి సుధీర్ బాబు హీరోగా నిర్మాతగా రెండు విధాలుగా సక్సెస్ కొట్టునట్లే ! నన్ను దోచుకుందువటే సక్సెస్ తో సంతోషంగా





వి

టాలీవుడ్ P 4

వాదాస్పద నటి శ్రీ రెడ్డి కి తమిళనాట ఛాన్స్ లు వచ్చేలా ఉన్నాయి . కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించిన ఈ భామ తాజాగా కోలీవుడ్ మీద పడింది . అక్కడి దర్శకులను ఒకరిద్దరు హీరోలను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేసింది దాంతో అక్కడ కూడా అట్టుడికిపోయింది అయితే తెరవెనుక విశాల్ నడిపిన మంత్రాంగంతో శ్రీ రెడ్డి లీక్స్ వాయిదా పడ్డాయి . ఇక ఈ భామ చేసిన ఆరోపణల సంగతి పక్కన పెడితే మాజీ నటి , నిర్మాత కుట్టి పద్మిని శ్రీ రెడ్డి కి తమిళనాట ఛాన్స్ లు ఇవ్వడానికి ముందుకు వచ్చింది అంతేకాదు

ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు ఇప్పుడు కాదు 1983 నుండే ఉన్నాయని సెలవిచ్చింది కూడా . మిళంలో కుట్టి పద్మిని పలు సూపర్ హిట్ సీరియల్స్ తీసింది దాంతో శ్రీ రెడ్డి కి మంచి ఛాన్స్ వచ్చింది అని అంటున్నారు అయితే శ్రీ రెడ్డి ఆ ఛాన్స్ లను ఉపయోగించుకుంటుందా ? లేక మళ్ళీ యధావిధిగా ఆరోపణలు చేసుకుంటూ కాలయాపన చేస్తుందా చూడాలి . కుట్టి పద్మిని ఇచ్చే ఛాన్స్ వినియోగించుకుంటే నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్లు అవుతుంది లేదంటే షరా మామూలే !


నూహ్యమైన క్రేజ్ ని తక్కువ సమయంలోనే పొందిన హీరో విజయ్ దేవరకొండ సొంత కంపెనీ స్టార్ట్ చేసి సంచలనం సృష్టించాడు. ఇటీవల జరిగిన నోటా పబ్లిక్ మీటింగ్ లో తన సొంత ప్రొడక్షన్ హౌజ్ లోగో ఆవిష్కరించాడు విజయ్ దేవరకొండ. ఇంతకీ ఈ క్రేజీ హీరో ప్రొడక్షన్ హౌజ్ పేరేంటో తెలుసా ....... కింగ్ ఆఫ్ ది హిల్ . రాజు కిరీటంని లోగోగా మలిచాడు విజయ్ దేవరకొండ. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం చిత్రాలతో విజయ్ కి ఎనలేని క్రేజ్ వచ్చేసింది . రుస విజయాలతో విపరీతమైన క్రేజ్ రావడంతో దాన్ని సొమ్ము చేసుకోవడానికి సొంత కంపెనీ స్టార్ట్ చేసాడు విజయ్ దేవరకొండ. క్రేజ్ ఎలాగూ ఉంది కాబట్టి దాన్ని బయటి నిర్మాతలకు కట్టబెట్టే కంటే సొమ్ము చేసుకుంటేనే బెటర్ అని అనుకున్నట్లున్నాడు ఈ హీరో. లోగో అయితే లాంచ్ చేసాడు కానీ పూర్తి వివరాలు మాత్రం చెప్పలేదు.









ల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అంతు చూస్తామని ప్రతిన బూనారు కాంగ్రెస్ తాజా మాజీ ఎం ఎల్ ఏ లు రేవంత్ రెడ్డి , సంపత్ లు. వేరు వేరుగా ఈ ఇద్దరూ మీడియా ముందుకు వచ్చినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ అసహనంతో ఊగిపోతున్నాడని , వచ్చే ఎన్నికల్లో ఒడిపోతాననే భయం పట్టుకుందని అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులు చేయిస్తూ అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పడుతున్నారని అయితే ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని స్పష్టం చేసారు రేవంత్ రెడ్డి , సంపత్ లు. సనసభలో స్పీకర్ పై దాడి చేశారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో పాటుగా

శా

సంపత్ ల శాసన సభ్యత్వంని కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. దాంతో సంపత్ , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేసీఆర్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి అంటే మొదటి నుండి కెసిఆర్ అండ్ కో కు పడటం లేదు దాంతో అతడ్ని ఎలాగైనా సరే జైలుకి పంపాలని చూసినప్పటికి రేవంత్ మాత్రం వెన్ను చూపకుండా పోరాటం చేస్తూనే ఉన్నాడు. తాజాగా రేవంత్ ఇంట్లో ఐటీ అధికారులతో పాటుగా ఈడీ అధికారులు కూడా రైడ్ చేసి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో రేవంత్ కూడా చాలా కసిగా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ని జైల్లో పెడతామని అంటున్నారు.

  



తె

లంగాణ రాష్ట్ర సమితి కి , కేసీఆర్ కు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాడు తాజా మాజీ శాసనసభ్యుడు , సినీ నటుడు బాబుమోహన్. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధినేత అమిత్ షాసమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు బాబుమోహన్. తెలుగుదేశం పార్టీకి చెందిన బాబుమోహన్ గత ఎన్నికల సమయంలో కెసిఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీలో చేరాడు . ఆందోల్ శాసనసభ నియోజకవర్గ ఎం ఎల్ ఏ గా గెలిచాడు , అయితే ఆ సమయంలో మంత్రి పదవి వస్తుందని భావించాడు కానీ పదవి దక్కలేదు దాంతో మిన్నకుండి పోయాడు కానీ ఈసారి ఏకంగా టికెట్

నిరాకరించడంతో షాక్ తిన్న బాబుమోహన్ తనకు టికెట్ కేటాయించకపోవడం వల్ల ఆగ్రహంతో ఊగిపోయాడు దాంతో కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీలో చేరాడు. చ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరుపున బాబుమోహన్ ఆందోల్ నుండి పోటీ చేయనున్నాడు . ఆమేరకు భారతీయ జనతా పార్టీ నుండి హామీ లభించినట్లు తెలుస్తోంది. బాబుమోహన్ సినీ నటుడు కావడంతో తమకు లాభిస్తుందని భావిస్తున్నారు భాజపా నాయకులు. మొత్తానికి బాబుమోహన్ భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల ఆందోల్ లో టీఆర్ఎస్ కు ఇబ్బందికర పరిస్థితి రావడం ఖాయం .

5 P టాలీవుడ్


  

పే

 



తె

లుగు , తమిళ భాషల్లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న హీరో విశాల్ .అయితే ప్రస్తుతం వినబడుతున్న కథనాల ప్రకారం హీరో విశాల్ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. స్టార్ హీరోగా రాణిస్తున్న హీరోకు ఆర్ధిక ఇబ్బందులు ఏంటి ? అని అనుకుంటున్నారా ? విశాల్ స్టార్ హీరో అయినప్పటికీ ఎక్కువగా చేసిన చిత్రాలన్నీ సొంత చిత్రాలే అందులో ఎక్కువగా ప్లాప్ చిత్రాలే దాంతో ఇబ్బందులు వచ్చినట్లు తెలుస్తోంది. విశాల్ నిర్మించిన చిత్రాల బడ్జెట్ ఎక్కువ కావడం ఆ స్థాయిలో వసూళ్లు రాకపోవడం, ఒకవేళ డబ్బులు వచ్చినా మరో సినిమాలో పెట్టుబడి పెట్టడం లాంటి వ్యవహారాలు ఉంటాయి కాబట్టి ఈ సమస్య వచ్చినట్లుంది. మన్ గా సినిమారంగంలో ఫైనాన్షియర్ ల దగ్గర అప్పు తీసుకుని సినిమా చేస్తారు ,

కా

రుకి వెబ్ సిరీస్ అయినప్పటికీ పోర్న్ మూవీ ని తలదన్నేలా ఉంది XXX అన్ సెన్సార్డ్ వెబ్ సిరీస్ . మహిళా నిర్మాత ఏక్తా కపూర్ ఈ అడల్ట్ వెబ్ సిరీస్ ని నిర్మించడం విశేషం. ఇప్పటికే పలు టీజర్ లతో ట్రిపుల్ ఎక్స్ అన్ సెన్సార్డ్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లతో ప్రకంపనలు సృష్టించగా తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రారంభమై మరింత సంచలనం సృష్టిస్తోంది. పోర్న్ సినిమాకు ఏమాత్రం తక్కువ తినకుండా ఉంది ర్ వెబ్ సిరీస్ . చ్చిగా శృంగార సన్నివేశాలు ఉన్నాయి దాంతో యువత తో పాటుగా కాస్త ఏజ్ మీద

అలాగే ఈ హీరో కూడా చేసాడు కానీ రొటేషన్ లో కాస్త ఇబ్బంది ఎదురయ్యిందట . విశాల్ బయటి సినిమాలు తక్కువగా చేసాడు సొంత సినిమాలు ఎక్కువగా చేసాడు. ఇటీవల అభిమన్యుడు చిత్రంతో హిట్ కొట్టిన విశాల్ తాజాగా పందెం కోడి 2 తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు . పందెం కోడి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ కూడా ఆ స్థాయి హిట్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు. పైగా పందెం కోడి 2 విశాల్ కు 25 వ సినిమా కావడం విశేషం.

   

వి

జయ్ దేవరకొండ టైం బాగుందని అనుకుంటున్న సమయంలో టాక్సీ వాలా సినిమా మొత్తం లీకై హల్చల్ చేస్తోంది. గీత గోవిందం సినిమాతో పాటుగా టాక్సీ వాలా కూడా లీకైంది . గీత గోవిందం చిత్రంలోని కొన్ని సన్నివేశాలు మాత్రమే లీక్ కాగా టాక్సీ వాలా మాత్రం మొత్తం సినిమా లీకైంది. అయితే సినిమా మొత్తం రీ రికార్డింగ్ పూర్తిచేసుకున్న సినిమా మాత్రం కాదు. మొత్తం నాలుగు గంటల సినిమానట లీకైంది. ఇంకేముంది టాక్సీ వాలా సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురి దగ్గర ఈ సినిమా చేరిపోయింది. మొబైల్ ఫోన్ లలో ఆ సినిమాని చూసుకుంటున్నారట . సలే విజయ్ దేవరకొండ వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇలా టాక్సీ వాలా మొత్తం పైరసి బారిన పడటంతో పాటుగా గ్రాఫిక్స్ కారణంగా నాలుగు నెలలుగా విడుదలకు నోచుకోవడం లేదు. అదిగో ఇదిగో అంటూ ఏకంగా నాలుగు నెలలు పూర్తయ్యాయి , ఐదో నెల లో అడుగుపెట్టింది . ఆలస్యం అయ్యే కొద్దీ ఈ సినిమా విడుదల అవుతుందా ? లేదా ? అన్న అనుమానం నెలకొంది.

టాలీవుడ్ P 6

     

కు

టుంబ సమేతంగా చూడతగ్గ చిత్రాలు నిర్మిస్తాడని పేరున్న అగ్ర నిర్మాత దిల్ రాజు లిప్ లాక్ , కౌగిలింతల సినిమాల గురించి కామెంట్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల హైదరాబాద్ లో జరిగిన హుషారు చిత్ర ప్రెస్ మీట్ లో దిల్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. కాగా ఆ వేడుకలో పాల్గొన్న దిల్ రాజు లిప్ లాక్ ల సినిమాలు ఈమధ్య బాగా ఆడుతున్నాయి , బహుశా అలాంటి సినిమాలు చేసే వాళ్లే కరక్టేనేమో అనిపిస్తోంది ర్ హుషారు సినిమా పోస్టర్ చూస్తుంటే , నేను కూడా మారాలేమో అనిపిస్తోంది మిమ్మల్ని

దే

వదాస్ సెప్టెంబర్ 27న విడుదలైంది , అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ లభించలేదు కాకపోతే నాగార్జున నాని ల కాంబినేషన్ కాబట్టి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ వసూళ్లు బయ్యర్లకు సేఫ్ జోన్ లోకి తీసుకురాలేకపోయాయి. 36 కోట్ల బిజినెస్ కాగా ఇప్పటివరకు 22 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. టోటల్ గా 41 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే బయ్యర్లు లాభాలలోకి రావాలంటే మరో 14 కోట్ల షేర్ రావాలి కానీ ఆ షేర్ మాత్రం వచ్చేలా లేదు దాంతో మరోసారి నాగార్జున చేత దేవదాస్ ప్రెస్ మీట్ పెట్టించారు ఆ చిత్ర బృందం. భార్య అమల, పిల్లలు నాగచైతన్య, అఖిల్ , కోడలు సమంత తో కలిసి విదేశాలకు వెళ్లొచ్చిన నాగ్ నిర్మాత అశ్వనీదత్ కోరిక మేరకు ప్రెస్ మీట్ పెట్టాడు.

పడిన వాళ్లని కూడా ఈ వెబ్ సిరీస్ ఆకట్టుకోవడం ఖాయమని అంటున్నారు. శృంగార సన్నివేశాల్లో ఏమాత్రం బెరుకు లేకుండా నటించారు అందాల ముద్దుగుమ్మలు. క్రేజ్ కోసం ,డబ్బు కోసం ఎంతకైనా దిగజారుతున్నారు ఈ భామలు. మొత్తానికి ఏక్తా కపూర్ మహిళ అయినప్పటికీ యువత బలహీనతలను ఆసరాగా చేసుకుని అడల్ట్ సినిమాలను రూపొందిస్తూ సొమ్ము చేసుకున్న ఈ భామ తాజాగా వెబ్ సిరీస్ తో కూడా పిచ్చెక్కించేస్తోంది.

అందరినీ చూస్తుంటే అని కామెంట్ చేసి సంచలనం సృష్టించాడు. ల్ రాజు ఇప్పటి వరకు అన్ని కూడా ఫ్యామిలీ అంతా కోరుకునే చిత్రాలనే నిర్మించాడు. దాదాపుగా దిల్ రాజు సినిమాలో వల్గర్ దృశ్యాలు కూడా పెద్దగా ఉండవు. ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకునే చిత్రాలను అందించే దిల్ రాజు కు మూడు సినిమాలు దెబ్బేసాయి దాంతో పునరాలోచనలో పడ్డాడు . లవ్ , ఫ్యామిలీ చిత్రాలు చేసెకంటే యూత్ కి కనెక్ట్ అయ్యే లిప్ లాక్ ల సినిమాలు చేస్తే బెటర్ అని ఫీల్ అవుతున్నాడేమో అనిపిస్తోంది చూస్తుంటే .

ది

దా

దాపుగా బయ్యర్ల ని ముంచిన దేవదాస్ సినిమా కోసం బాగానే ప్రయాస పడుతున్నాడు నాగార్జున. ఇప్పటి వరకు చాలాసార్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు నాగార్జున. ఒక అగ్ర హీరో ఇన్నిసార్లు ఒక సినిమా కోసం మీడియా ముందుకు రావడం అరుదు కానీ నాగార్జున మాత్రం దేవదాస్ కోసం తెగ కష్టపడుతున్నాడు. అయిన పోయిన సినిమా కోసం ఎంతగా కష్టపడినా ప్రయోజనం ఏముంటుంది శ్రమ తప్ప. ఇటీవల విడుదలైన నోటా చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో దేవదాస్ బ్రేక్ ఈవెన్ కావడానికి ఇంతగా శ్రమ పడుతున్నారు. అయితే నాగ్ శ్రమ వృధా అవడం తప్ప మరో ప్రయోజనం అయితే కనిపించడం లేదు.










నం సైతం సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సేవా సంస్థ ఇటీవల మరికొంత మంది పేదలకు ఆర్థిక సహాయం చేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కోటి, నిర్మాత బెల్లంకొండ సురేష్, దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకురాలు నందినీ రెడ్డి, నటుడు రాజీవ్ కనకాల, నటి రజిత, డాన్స్ మాస్టర్ సత్య, గాయని విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతిథుల చేతుల మీదుగా చినయోగి రెడ్డి, వర్షిత, లీలాధర్, మురళీ కృష్ణారెడ్డి, గన్నోజి గంగాధర్, అభిషేక్, దిలీప్ తేజా, కళ్యాణ్, డీవీకే నాగేశ్వరరావు, అభినయలకు చెక్ లను అందజేశారు. నంతరం కాదంబరి కిరణ్ మాట్లాడుతూ... పరిశ్రమలో మంచి మనుషులు పెరుగుతూనే ఉన్నారు. వాళ్లలో కొందరు మన కార్యక్రమానికి వచ్చారు. నేను జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాను. అలాంటి సమయంలో కూడా ఎవరినీ నాకీ సహాయం చేయండి అని అడగలేదు. కానీ ఇవాళ మనం సైతం కోసం వెళ్తున్నప్పుడు ప్రతి పెద్ద వాళ్లూ నన్ను ఆదరిస్తున్నారు. మాకు సహాయం చేయాలని ఉంటుంది కానీ నిజాయితీ గల వేదిక దొరకడం లేదు. నువ్వు చేస్తున్న సేవా కార్యక్రమాలు బాగున్నాయి అని ప్రోత్సహిస్తున్నారు. వాళ్లందరికీ నా కృతజ్ఞతలు. పేదరికాన్ని రూపుమాపకున్నా వాళ్లకు ధైర్యాన్ని ఇవ్వాలనేదే నా ధ్యైయం, లక్ష్యం. గతేడాది నేను విజ్ఞప్తి చేసి బతిమాలితే వివిధ ఆస్పత్రుల నుంచి 43 లక్షల రూపాయల బిల్లులు తగ్గించారు. ఈ ఏడాది ఇప్పటికి 90 మందికి సహాయం చేశాం. పరిశ్రమలో చిరంజీవి,

కృష్ణ గారి దగ్గర నుంచి ఎంతోమంది మనం సైతంకు చేయూత నిస్తున్నారు. త్వరలో ఎన్టీఆర్, కేటీఆర్ తో కలిసి పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం. కానీ ఇటీవల కొన్ని సంఘటనలు జరగడం వల్ల అది ప్రస్తుతానికి వాయిదా వేశాం. ప్రభుత్వం నుంచి ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, కేటీఆర్ సహకారంతో దాదాపు 20 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పేదలకు అందించాం. మా కార్యక్రమానికి వచ్చే పెద్దలు స్పందించి సహాయం చేస్తున్నారు కానీ నేనెవరినీ ఇవ్వండి అని అడగడం లేదు. నా సహాయ కార్యక్రమాలు చూసి దేశ విదేశాల నుంచి దాతలు స్పందిస్తున్నారు. ఇవాళ పదిమందికి ఆర్థిక సహాయం అందిస్తున్నాం. మనం సైతం ఇవాళ లక్షా 26 వేల మంది పేదల సేవా సంస్థ. కులాలను బట్టి కాకుండా ఆర్థిక స్థితిని బట్టి రిజర్వేషన్లు పెట్టాలని మేము ప్రభుత్వాలకు ప్రతిపాదిస్తున్నాం. పేదవాడిని పట్టించుకునే ప్రభుత్వాల, నాయకుల వెంట మాత్రమే మనం సైతం ఉంటుంది అన్నారు. ర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... పరిశ్రమలో ఇంత మంది పేదలు బాధపడుతున్నారని ఈ కార్యక్రమానికి వచ్చాక తెలిసింది. కాదంబరి చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకు అభినందనలు. నా వంతుగా 50 వేల రూపాయలు సహాయం ఇస్తాను. అన్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.... మాటలు చెప్పడం సులువు. మైక్ ఇస్తే ఎవరైనా ప్రసంగాలు చేస్తారు. కానీ ఒక మంచి పని చేయడం చాలా కష్టం. కాదంబరి కిరణ్ అలాంటి శ్రమను తీసుకున్నాడు. తన ఆలోచనను ఆచరించి

ని

చూపిస్తున్నాడు. ఇంకా చాలా మందికి కాదంబరి సేవ చేయాలి. గొప్పగా ఉన్నామనుకునే పరిశ్రమలో ఉండి తోటి పేదలకు సహాయం చేయలేకపోవడం సిగ్గుచేటుగా ఉంది. అన్నారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ....నటుడిగా దర్శకుడిగా కాదంబరి కిరణ్ నాకు తెలుసు. కానీ ఇవాళ నేను ఆయన్ని దేవుడిగా చూస్తున్నాను. ప్రస్తుతం నేను దేవాలయం వెళ్లాలి. కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడికొచ్చాక ఇదే దేవాలయం అనిపించింది. ఇంతపెద్ద పరిశ్రమలో ఇంతమంది పేదలకు సహాయం చేసే అదృష్టం ఒక్క కాదంబరికే దక్కింది. అది దేవుడి సంకల్పమేమో. నేను కూడా చాలా మందికి సహాయం చేశాను.

మనం సైతంకు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అదంతా పేదలకు చేరుతుందనే నమ్మకం కలుగుతోంది. నా వంతుగా 50 వేల రూపాయలు అందిస్తున్నాను. అన్నారు. నం సైతం సభ్యులు, ఫిలిం ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బందరు బాబీ మాట్లాడుతూ... కాదంబరి కిరణ్ అన్న పుట్టిన రోజు వేడుకలు చేసుకోవడం ఆపేసి నాలుగేళ్లవుతోంది. ఎందుకంటే అప్పుడే మనం సైతం సేవా సంస్థను స్థాపించాం. కొద్దిమందితో ప్రారంభమైన మనం సైతం ఇవాళ లక్షలాది మందికి చేరువవుతోంది. మనం సైతం వెంట మా సభ్యులంతా ఉంటాం. అన్నారు.



రోజుల్లో బయోపిక్స్ అనేవి ఇండియన్ సినిమాకు కొత్త ట్రెండ్. నెమ్మదిగా ఇవి ప్రేక్షకుల అభిరుచిని మార్చేస్తున్నాయనిపిస్తుంది. నిజ జీవిత పాత్రలతో వస్తున్న సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి అన్నది నిస్సందేహం. ఒక సామాన్యుడు ఒక లక్ష్యం ఏర్పరుచుకొని అది సాధించడం కోసం పడిన కష్టం, ఎదుర్కొన్న ఆటుపోట్లు, జీవనశైలికి కొంత నాటకీయత జోడిస్తూ చూపిస్తున్న తీరుకు ప్రేక్షకుడు ఆకర్షితుడవుతున్నాడని చెప్పడానికి ఈ మధ్య వస్తున్న బయోపిక్సే నిదర్శనం. బయోపిక్ లో పెద్ద ఉపయోగం ఏమిటంటే ప్రేక్షకుడికి ఇవి ఇట్టే “కనెక్ట్” అయిపోతాయి. అటువంటి జీవిత కథల్లో – లోతైన కథ, మంచి పట్టున్న దృశ్యాలు, వీనుల విందైన సంగీతం ఉన్నట్లయితే అవి తప్పకుండా ప్రేక్షకున్ని కట్టిపడేయడం ఖాయం. త వరకు మనం చరిత్రకారుల, క్రీడాకారుల, నటీనటుల జీవిత చిత్రాలను చూశాము. మొన్నటి “దంగల్” నిన్నటి “మహానటి” ఎంత ఘన విజయం సాధించాయో తెలియంది కాదు. దక్షిణ భారతదేశంలో మహానటి అంటే సావిత్రి, మహాగాయకుడు అంటే ఘంటసాల అని భారతదేశం అంతా తెలుసు. అయన జీవితం ఆధారంగా ఇప్పుడు “ ఘంటసాల” సినిమా వచ్చేస్తుంది. టసాల అంటే పాట, పాట అంటే ఘంటసాల అని అందరికీ తెలుసు. కాని, అయన ఒక వ్యక్తిగా ఎంత గొప్పవాడో కొందరికే తెలుసు. అది అందరికి తెలియచేసేదే ఈ చిత్రం. అయన జీవితం పూల బాట కాదని, ముళ్ళ బాటలో నడిచి, మనకి పూల ‘పాట’లందించాడని చెప్పేదే ఈ చిత్రం. పాట కోసం ఎన్ని కష్టాలు పడినా, పట్టిన పట్టు విడవక విజయం సాదించి, “కృషితో నాస్తి దుర్భిక్షం” అని నిరూపించాడు. వినయంతోనే విద్య ప్రకాశిస్తుంది అనడానికి అయన జీవితమే నిదర్శనం.

ఇం ఘం

యన పాడిన పాటలకు అయన జీవితానికి ఎంత దగ్గర సంబంధం వుందో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. అయన జీవితం ఎన్నో ఎత్తు పల్లాలకు లోని నడిచి, చివరికి డ్రమెటిక్ గా ముగియడం విశేషం. న్యుక్తరం ప్రొడక్షన్స్ బ్యానర్ పై శ్రీమతి లక్శ్మీ నీరజ నిర్మాతగా, గాయకుడూ G.V. భాస్కర్ నిర్మాణ సారధ్యం లో వస్తున్న ఈ చిత్రానికి – పాటల పుస్తకాల కేటగిరిలో అత్యధికంగా అమ్ముడుబోయిన “ఘంటసాల ‘పాట’ శాల” సంకలన కర్త సి. హెచ్ రామారావు రచన – దర్శకత్వం వహించారు. ఈ చిత్రం రీ రికార్డింగ్ ముగించుకొని ఈ సంవత్సరం డిసెంబర్ లో విడుదలకు సిద్దమవుతుంది. బాహుబలి కెమెరామెన్ సెంథిల్ కుమార్ శిష్యుడు వేణు వాదనల ఈ చిత్రానికి కెమెరామెన్ గాను, ఇటీ వలే విడుదలైన “అంతకుమించి” చిత్రానికి పనిచేసిన క్రాంతి (RK) ఎడిటర్ గాను, ప్రఖ్యాత సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వర రావు గారి కుమారుడు, సంగీత లోకానికి చిరపరిచితులు అయిన సాలూరి వాసూరావు గారు సంగీత దర్శకులుగా పనిచేస్తున్నారు. కపోతే మహా గాయకుడు “ఘంటసాల” గా వర్ధమాన గాయకుడూ, ‘సూపర్ సింగర్స్ 7’ తో చిరపరిచితుడైన కృష్ణ చైతన్య పోషిస్తున్నారు. ఘంటసాల సతీమణి ‘సావిత్రి’ గా కృష్ణ చైతన్య సతీమణి ప్రముఖ యాంకర్ మృదుల పోషించగా, ఘంటసాల గురువుగా పట్రాయని సీతారామ శాస్త్రిగా సుబ్బరాయశర్మ చేస్తున్నారు. చిత్రం ఫస్ట్ లుక్ ని ఇటీవల హైదరాబాద్ లో ప్రముఖ దర్శకులు కె . రాఘవేంద్ర రావు ఆవిష్కరించారు . క్టోబర్ లో ఈ చిత్రానికి సంబంధించిన ‘టీజర్’ సినిమా దిగ్గజాల సమక్షంలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి .

7 P టాలీవుడ్


 

నో

టా చిత్రం అసలు అల్లు అర్జున్ కోసం రాసారు, అతడితో సినిమా చేయాలని నిర్మాత జ్ఞానవేల్ రాజా ప్రయత్నాలు చేసాడు అయితే దర్శకుడు ఆనంద్ శంకర్ చెప్పిన కథ అల్లు అర్జున్ కు నచ్చకపోవడంతో నాకు ఈ కథ సూట్ కాదని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాడట దాంతో చేసేది లేక విజయ్ దేవరకొండ దగ్గరకు వెళ్లారు ఆనంద్ శంకర్. జ్ఞానవేల్ రాజా పంపించిన దర్శకుడు కావడంతో విజయ్ ఆనంద్ శంకర్ చెప్పిన కథ విన్నాడు నచ్చడంతో ఓకే చేసాడు. కట్ చేస్తే ఇటీవల విడుదలైన నోటా చిత్రానికి ప్లాప్ టాక్ వచ్చింది.

నా

పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే సినిమా చేస్తున్న సమయంలోనే నోటా రావడంతో దాన్ని రిజెక్ట్ చేసాడు అల్లు అర్జున్. ఒకవేళ అల్లు అర్జున్ కనుక ఈ నోటా చిత్రాన్ని ఓకే చేసి ఉంటే తప్పకుండా మరో ప్లాప్ ని ఎదుర్కొనేవాడు. ఇప్పటికే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే ప్లాప్ తో ఇబ్బందిపడుతున్నాడు అల్లు అర్జున్. ఇది కూడా ప్లాప్ అయితే మరీ దారుణంగా ఉండేది అల్లు అర్జున్ పరిస్థితి అందుకే నోటా ని రిజెక్ట్ చేసి భారీ ప్లాప్ నుండి తప్పించుకొని మంచి పని చేసాడు అల్లు అర్జున్. ఇంకా ఏ కొత్త చిత్రాన్ని

 

స్టా

ర్ మా టివిలో ప్రదీప్ పెళ్లిచూపులు కార్యక్రమం అంటూ ఓ చెత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ ప్రోగ్రాం ప్రారంభం కాకముందే ప్రోమోల వల్ల ఎలా ఉండబోతోందో తెలియడంతో అప్పుడే విమర్శలు వచ్చాయి. అయితే ప్రోగ్రాం స్టార్ట్ అయ్యాక తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాలను మంటగలిపే కార్యక్రమంగా భావించి నిప్పులు చెరుగుతున్నారు . ఒక అబ్బాయి కోసం 14 మంది అమ్మాయిలు వెంటపడేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించి మహిళల పట్ల చిన్న చూపు చూస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలువురు మహిళలు. ల్లితెర అంటే మహిళలకు ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే సీరియల్స్ తో , స్పెషల్ ప్రోగ్రాం లతో పలు సినిమాలతో సేద తీరుతుంటారు. అలాంటి బుల్లితెరపై యాంకర్ ప్రదీప్ కి పెళ్లిచూపులు అంటూ ఇంట్లో వాళ్ళు అందరూ చూడలేని విధంగా చేస్తున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని పైగా దీనివల్ల చెడు ఫలితాలు వస్తాయని అంటున్నారు. 14 మంది అమ్మాయిల్లో కొంతమంది నిజంగానే ప్రదీప్ ని ప్రేమిస్తే , ఆ

ప్రేమ విఫలం అయితే ఆ అమ్మాయిల పరిస్థితి ఏంటి? దీని గురించి మా యాజమాన్యం ఎందుకు ఆలోచించలేదో కానీ ఇలాంటి కార్యక్రమం క్రొత్తదని అనుకుంటున్నారు కానీ హిందీలో ఇలాంటివి ఎప్పుడో వచ్చాయి. మద్యం తాగి ,కారు డ్రైవ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి యాంకర్ ప్రదీప్ అయితే అతడి పెళ్లిచూపులు అంటూ ఇంతోటి కార్యక్రమం చేయడం సమంజసమా ? ….. మా ?

ళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , మహానటి, గీత గోవిందం చిత్రాలతో 4 హిట్లు అందుకున్న విజయ్ దేవరకొండ ద్వారకా , ఏ మంత్రం వేశావే ,ఈ నగరానికి ఏమైంది చిత్రాల తర్వాత ఇప్పుడు నోటా తో నాలుగు ప్లాప్ చిత్రాలను అందుకున్నాడు విజయ్ దేవరకొండ. 2016 నుండి ఇప్పటి వరకు రెండున్నర సంవత్సరాలలో నాలుగు హిట్స్ నాలుగు ప్లాప్స్స్ తో ఉన్నాడు. మధ్యలో ఈ నగరానికి ఏమైంది చిత్రంలో కామియో రోల్ పోషించాడు అది ప్లాప్ దాంతో హిట్స్ కంటే ప్లాప్ జాబితా పెద్దదై పోయింది. ఈ నగరానికి ఏమైంది చిత్రంలో అధితి పాత్ర పోషించడానికి కారణం దాస్యం తరుణ్ భాస్కర్ కావడమే కారణం. క ఏ మంత్రం వేశావే చిత్రం పెళ్లిచూపులు సమయంలో నటించాడు. అయితే అర్జున్ రెడ్డి

విడుదల తర్వాత అనూహ్యంగా విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగినప్పటికి ఆ స్థాయిలో సినిమా లేకపోవడంతో అది ప్లాప్ అయ్యింది. ఇక ద్వారకా సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకొని చేసాడు కానీ అది కూడా ప్లాప్ అయ్యింది.సంచలన విజయం సాధించిన మహానటి చిత్రంలో కూడా గెస్ట్ గా నటించాడు. ఇక ఇప్పుడేమో నోటా చిత్రం పెద్ద ప్లాప్ అయ్యింది. ఇటీవల విడుదలైన ఈ నోటా చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. నోటా పెద్ద హిట్ అవుతుందని , తమిళ్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడుతుందని ఆశించాడు కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే విజయ్ కున్న క్రేజ్ వల్ల ఓపెనింగ్స్ మాత్రం బాగానే వచ్చాయి.

బు

              పె ఇ

టాలీవుడ్ P 8

p

కూడా అంగీకరించలేదు ఈ హీరో .అరవింద సమేత హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు అల్లు అర్జున్. ఎందుకంటే త్రివిక్రమ్ తో జత కట్టాలని చూస్తున్నాడు అల్లు అర్జున్.

న్టీఆర్ చిత్రానికి విపరీతమైన క్రేజ్ రావడంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి సిద్ధమయ్యాడు నందమూరి బాలకృష్ణ. మొదట ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు అంతగా క్రేజ్ రాలేదు అయితే ఎప్పుడైతే దర్శకుడు గా క్రిష్ ఎంటర్ అయ్యాడో అప్పుడు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కు ఎనలేని క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ భామ విద్యాబాలన్ , సుమంత్ , రానా , నందమూరి కళ్యాణ్ రామ్ లు యాడ్ అవ్వడంతో పాటు ఎన్టీఆర్ గెటప్ లో బాలయ్య ఫస్ట్ లుక్ రావడంతో అనూహ్యంగా ఎన్టీఆర్ చిత్రానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున బయ్యర్లు ఎన్టీఆర్ చిత్రం కోసం పోటీ పడుతుండటంతో దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్టీఆర్ ని రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు బాలయ్య.

అం

దుకే ఇటీవల ఎన్టీఆర్ కథానాయకుడు అంటూ ఓ పోస్టర్ ని విడుదల చేసారు దాంట్లో జనవరి 9న విడుదల అని ప్రకటించారు. మరో పోస్టర్ సాయంత్రానికి విడుదల చేసారు. ఎన్టీఆర్ మహా నాయకుడు అని.ఇంతకుముందు ఎన్టీఆర్ అని మాత్రమే ప్రకటించి సస్పెన్స్ మెయింటైన్ చేశారు . ఇక ఇప్పుడేమో ఆ సస్పెన్స్ కి తెరదించుతూ మొదటి భాగానికి కథానాయకుడు అని రెండో భాగానికి మహా నాయకుడు అని పెట్టారు. ఇక ఈ రెండు భాగాన్ని జనవరి 24న విడుదల చేయనున్నారట . అంటే 15 రోజుల వ్యవధిలో రెండు భాగాలు విడుదల అవుతున్నాయన్నమాట .






 కిం



గ్ నాగార్జున పరిచయ చిత్రం ‘విక్రమ్’ మొదలుకొని.. తెలుగులో అందరు అగ్ర హీరోలతో అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించిన సుప్రసిద్ధ కథానాయకి పద్మశ్రీ శోభన.. ఇప్పుడు మరో రూపంలో తెలుగు ప్రేక్షకులకు చేరువ అవుతున్నారు. ‘జాదూజ్’ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా ఉన్న పద్మశ్రీ శోభన.. తెలంగాణ ప్రభుత్వ ‘టి.ఫైబర్’తో కలిసి రంగారెడ్డి జిల్లాలోని తూములూరు గ్రామంలో జాదూజ్ ఏర్పాటు చేస్తున్న “జాదూజ్ సెంటర్” పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. నంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాదూజ్ సహ వ్యవస్థాపకురాలు శోభన, తెలంగాణ ఐటి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్, జాదూజ్ ఫౌండర్ సీఈవో రాహుల్ నెహ్రా, జాదూజ్ రీజనల్ పార్టనర్, రిక్లయినర్ సీఇవో, ప్రముఖ నటుడు లోహిత్, జాదూజ్ రిక్లయినర్ బ్రాండ్ అంబాసిడర్, నటుడు శ్రీధర్ రావు పాల్గొన్నారు.

టీవలకాలంలో సామాన్యులకు దూరమై పోయిన సినిమాను వారికి మళ్లీ చేరువ చేయాలనే వజ్ర సంకల్పంతో టి.ఫైబర్ తో కలిసి జాదూజ్ పని చేయనున్నదని ఈ సెంటర్స్ ద్వారా వినోదంతోపాటు.. గ్రామీణులకు విజ్ఞానాన్ని సైతం అందివ్వనున్నామని లోహిత్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో జాదూజ్ ఎంటర్ టైన్మెంట్స్ కు రిక్లెయినర్ భాగస్వామిగా వ్యవహరించనుందని ఆయన తెలిపారు. లంగాణలోగల 8 వేల గ్రామాల్లో.. తొలి విడతగా 500 గ్రామాల్లో జాదూజ్ సెంటర్స్ నెలకొల్పేందుకు రంగం సిద్ధమైందని. ఈ సెంటర్స్ లో “చాయ్ నాస్తా కేఫ్”లు కూడా ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా వంద మిలియన్ డాలర్ల (సుమారు 700 కోట్ల) ఆదాయంతోపాటు.. అయిదారు వేల మందికి ఆదాయం లభించనుందని రాహుల్ నెహ్రా అన్నారు నిమాను మారుమూల ప్రాంతాలకు విస్తరింపజేసే ఇంతటి బృహత్తర కార్యక్రమంలో భాగమైనందుకు గర్వంగా ఉందని, ఈ విధంగా

తె సి

తెలుగు ప్రేక్షకులకు మళ్లీ చేరువ కావడం సంతోషంగా ఉందని’ సినిమారంగంలో ఇదొక విప్లవం కానుందని శోభన అన్నారు. దీనికి ప్రచారకర్తగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల శ్రీధర్ రావు సంతోషం వ్యక్తం చేశారు!!





హ్యా

.

సం

గీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెగ పొగిడాడు . ఆ పొగడ్త ఎంతగా ఉందంటే తమన్ సైతం తట్టుకోలేనంత గొప్పగా ఉంది. తమన్ అందించిన పాటల గురించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి నేను వాటిని చూసాను అయితే అరవింద సమేత వీర రాఘవచిత్రం కోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో నాకు మాత్రమే తెలుసు . ఈ సినిమాకు మనసు పెట్టి కాదు ప్రాణం పెట్టి సంగీతం అందించాడు తమన్ అంటూ అతడ్ని ఆకాశానికి ఎత్తేసాడు ఎన్టీఆర్. తను అందించిన సంగీతం గురించి ఎన్టీఆర్ అంతగా పొగుడుతుంటే తట్టుకోలేక ఎన్టీఆర్ కు అభివాదం చేసాడు తమన్ .దాదాపుగా కన్నీళ్ల పర్యంతమయ్యాడు తమన్. యితే ఎన్టీఆర్ పొగడ్తలు పక్కన పెడితే తమన్ అందించిన సంగీతం పై మాత్రం

విమర్శలు చాలానే వస్తున్నాయి. తన ట్యూన్స్ ని తానే కాపీ కొట్టాడని , కొత్తగా లేవని రకరకాల కామెంట్స్ చేస్తున్నారు . ఆ కామెంట్ లకు తగ్గట్లుగానే అరవింద సమేత ఆడియో పెద్దగా సక్సెస్ కాలేదు కాకపోతే రెండు పాటలకు మాత్రం స్పందన అద్భుతమనే చెప్పాలి. ఇక తెరమీద అవి ఎలాంటి కిక్ ఇవ్వబోతున్నాయి అన్నదానిపై మాత్రమే ఆధారపడి ఉంది. విమర్శలు , పొగడ్తలు పక్కన పెడితే ఎన్టీఆర్ మాత్రం తమన్ ని మరీ ఎక్కువ పొగిడాడు అంటే అతడి పై అంత నమ్మకం ఉంది మరి. ఎన్టీఆర్ – తమన్ ల కాంబినేషన్లో ఇంతకుముందు బృందావనం , రభస , బాద్ షా చిత్రాలు రాగా బృందావనం సూపర్ హిట్ అయ్యింది, బాద్ షా ఫరావలేదనిపించింది రభస మాత్రం ప్లాప్ అయ్యింది. మరి ఈ అరవింద సమేత బ్లాక్ బస్టర్ అవుతుందా ? ప్లాప్ జాబితాలో చేరుతుందా అక్టోబర్ 11న తేలిపోనుంది.

క్కినేని నాగార్జున , నాని ల కాంబినేషన్ లో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన దేవదాస్బయ్యర్లకి దాదాపుగా ముంచేసింది . అన్ని ఏరియాలు కలుపుకొని దాదాపు 36 కోట్ల బిజినెస్ జరిగింది . అంటే 36 కోట్ల షేర్ వస్తే బయ్యర్లు హ్యాపీ కానీ ఇప్పటివరకు 40 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే సాధించాడు దేవదాస్ . 40 కోట్ల గ్రాస్ వసూళ్లు 22 కోట్ల షేర్ మాత్రమే సంపాదించాడు అంటే బయ్యర్లు లాభాల్లోకి రావాలంటే మరో 14 కోట్ల షేర్ రాబట్టాలి దేవదాస్ కానీ పరిస్థితి చూస్తుంటే మరో నాలుగు కోట్ల షేర్ కూడా రాబట్టడం కష్టమే అనిపిస్తోంది . ఇటీవలా విజయ్ దేవరకొండ నటించిన నోటా విడుదల అయ్యింది దాంతో

ట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఉత్సాహపడుతున్నారు. ఇదే విషయాన్ని నోటా పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు కొరటాల శివ. పెళ్లి చూపులు చిత్రం చూసి ఒక కథ చెప్పాలి , విజయ్ తో సినిమా చేయాలని అనుకున్నాను అయితే అర్జున్ రెడ్డి చూసాక ఒకలా అనుకున్నాను ఇటీవలే గీత గోవిందం చూసాను ఇక తాజాగా నోటాతో మనముందుకు వస్తున్నాడు , ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కోసం మంచి కథ రెడీ చేసి

దేవదాస్ కలక్షన్లు మరింతగా డ్రాప్ అవ్వడం ఖాయం . తర్వాతి వారం ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం విడుదల అవుతోంది దాంతో దేవదాస్ కలెక్షన్ల కు కొరత ఏర్పడినట్లే ! అంతేకాదు దేవదాస్ ఉన్న థియేటర్ లు కూడా లేపేస్తారు అరవింద సమేత రాకతో దాంతో దేవదాస్ బయ్యర్లు నష్టపోయినట్లే అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . నాగార్జున – నాని లాంటి స్టార్ హీరోలు నటించిన సినిమా అయినప్పటికీ ఫలితం దారుణంగా ఉండటంతో బయ్యర్లు బెంబేలెత్తి పోతున్నారు . నాగార్జున – నాని మేజిక్ ఏమాత్రం బాక్సాఫీస్ వద్ద పనిచేయలేదు .

అతడ్ని కలుస్తాను , సినిమా చేస్తానని అన్నాడు కొరటాల శివ . క్క కొరటాల శివ మాత్రమే కాదు పలువురు దర్శకులు విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విజయ్ దేవరకొండ మాత్రం అంత త్వరగా ఒప్పుకోవడం లేదు. విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు ఈ హీరో దాంతో అతడితో సినిమాలు చేయాలని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ ఎంతమందికి ఛాన్స్ ఇస్తాడో చూడాలి.

          

9 P టాలీవుడ్






ర్శక దిగ్గజం మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ప్రతీ ఒక్క నటుడికి ఉంటుంది , అతడి సినిమాలో చిన్న వేషం దొరికినా చాలు అని కోరుకుంటారు కానీ అది ఒకప్పుడు ఎందుకంటే మణిరత్నం ఒకప్పుడు దక్షిణాదిన మాత్రమే కాకుండా యావత్ భారతంలో కూడా గొప్ప దర్శకుడు గా పేరు పొందారు అలాగే సక్సెస్ కూడా ఉంది కాని పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది . మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న చిత్రాలన్నీ ఘోర పరాజయాలు పొందుతున్నాయి దాంతో అతడి సినిమాలో నటించడానికి కొంతమంది స్టార్స్ భయపడుతున్నారు. అందులో టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ కూడా ఒకరు. నవాబ్ సినిమాని రిజెక్ట్ చేసాడు చరణ్ . రుస పరాజయాల నేపథ్యంలో కసితో నవాబ్ కథ ని రాసుకున్న మణిరత్నం నవాబ్



నా

ని , నాగార్జున కలిసి నటించిన దేవదాస్చిత్రాన్ని ప్లాప్ చేస్తామని ప్రతిన బూనిన కౌశల్ ఆర్మీ ఎట్టకేలకు నానిపై పగ తీర్చుకుంది. దేవదాస్ చిత్రం విడుదల అవడమే ఆలస్యం బాగోలేదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు దాంతో ఇటీవల వసూళ్లు తగ్గాయి. సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ చాలా స్ట్రాంగ్ గా ఉంది , దాంతో క్షణాల్లో దేవదాస్ చిత్రం ప్లాప్ అంటూ ప్రచారం చేశారు. దేవదాస్ చిత్రానికి డివైడ్ టాక్ రావడానికి , ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడానికి కారణం కౌశల్ ఆర్మీ కారణం అని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు నాని . శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మించాడు. ఇటీవల భారీ ఎత్తున విడుదలైన దేవదాస్ చిత్రానికి రివ్యూస్ కూడా ఆశించిన స్థాయిలో రాలేదు దాంతో దేవదాస్ బృందం నిరుత్సాహంగా ఉంది. ని పై పగబట్టడానికి కౌశల్ ఆర్మీ కి బలమైన కారణమే ఉంది. నటుడు , మోడల్ అయిన కౌశల్ బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇక నాని ఈ షోకి

నా



హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అయితే బిగ్ బాస్ 2 హౌజ్ లో మొదటి నుండి కూడా కౌశల్ కు నాని సపోర్ట్ చేయలేదు ,పైగా కొన్ని సందర్భాల్లో కౌశల్ ని ఇబ్బంది పెట్టాడు కూడా దాంతో కౌశల్ ఆర్మీ నానిపై పగబట్టింది. కౌశల్ ని ఇబ్బంది పెట్టాలని చూసిన వాళ్ళందరిని ఒక్కొక్కరిగా ఎలిమినెట్ అయ్యేలా చేశారు కౌశల్ ఆర్మీ అయితే నాని ని ఎలిమినెట్ చేసే శక్తి కౌశల్ ఆర్మీ కి లేదు కాబట్టి నాని నటించిన దేవదాస్ పై దృష్టి పెట్టారు. ఆ సినిమా విడుదల అవుతుందని ప్రకటించగానే ప్లాప్ చేస్తామంటూ సవాల్ విసిరారు. కట్ చేస్తే దేవదాస్ రానే వచ్చింది. సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించడం లేదు దాంతో టాక్ స్ప్రెడ్ అయ్యేలా చేశారు. ఇక దేవదాస్ పై డివైడ్ టాక్ రావడానికి కారణం కౌశల్ ఆర్మీ నే కారణమని నమ్ముతున్నాడట నాని .







నా

నా పటేకర్ పై సంచలన ఆరోపణలు చేసింది బాలీవుడ్ భామ తనుశ్రీ దత్తా . నానా పటేకర్ తో నటించిన సమయంలో ఓ పాట చిత్రీకరిస్తున్న సందర్భంగా నన్ను తాకుతూ ఇబ్బందిపెట్టాడని , అసలు డ్యాన్స్ మాస్టర్ ని పక్కనపెట్టి తానే డ్యాన్స్ మూమెంట్స్ చెబుతూ నాపై చేతులు వేస్తూ చాలా అసహ్యంగా ప్రవర్తించాడని అందుకే ఆ పాట చేయనని వెళ్లిపోయానని దాంతో మరొకరితో ఆ పాట చేసారని సంచలన వ్యాఖ్యలు చేసింది తనుశ్రీ దత్తా . నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరభద్ర చిత్రంలో నటించింది తనుశ్రీ దత్తా . అలాగే మరో తెలుగు చిత్రంలో నటించినప్పటికీ రెండు కూడా ప్లాప్ అయ్యాయి దాంతో ఈ భామకు తెలుగులో మళ్లీ ఛాన్స్ రాలేదు. లాగే బాలీవుడ్ లో కూడా ఈ భామకు సినిమాలు లేకుండాపోయాయి. బాలీవుడ్

టాలీవుడ్ P 10

లో సినిమాలు లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా….. నానా పటేకర్ పై ఆరోపణలు చేయడమే ! అయితే తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన నేపథ్యంలో అప్పట్లో మీడియా కొద్దిరోజులు తెగ హడావుడి చేసింది కానీ తర్వాత ఆవిషయం మరుగున పడిపోయింది. ఇక ఈ భామకు ఛాన్స్ లు లేకపోవడంతో అమెరికా వెళ్లిపోయింది. ఇక ఇటీవల ఇండియాకు తిరిగివచ్చిన తనుశ్రీ దత్తా రజనీకాంత్, అక్షయ్ కుమార్ లపై నిప్పులు చెరిగింది. నానా పటేకర్ లాంటి వెధవలతో అంతటి పెద్దవాళ్ళు కలిసి నటిస్తుంటే ఇక అలాంటి వాళ్లకు నష్టం ఎలా ఉంటుందని , మేము గ్లామర్ పాత్రల్లో నటించినంత మాత్రాన మమ్మల్ని నిజ జీవితంలో కూడా అలాగే ఊహించుకొని ఎవడు పడితే వాడు మా మీద చేయి వేస్తామంటే ఎలా ఊరుకుంటామని ఆవేశంతో ప్రశ్నిస్తోంది.

చిత్రంలో శింబు నటించిన పాత్రలో రాంచరణ్ చేత చేయించాలని భావించి తన సతీమణి సుహాసిని ని తీసుకుని మరీ వచ్చాడు హైదరాబాద్. మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ నవాబ్ కథ చెప్పాడట ! అయితే కథ విని , శింబు పాత్ర లో నెగెటివ్ షేడ్స్ ఉన్నాయి కాబట్టి తెలుగులో ప్రేక్షకులు , అందునా మెగా ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తుందని సున్నితంగా తిరస్కరించాడట . కట్ చేస్తే నవాబ్ సినిమా విడుదల అయ్యింది . తెలుగులో పెద్దగా ఆకట్టుకోవడం లేదు అయితే తమిళంలో మాత్రం హిట్ అయ్యింది. ఇక శింబు పాత్రకు కూడా అక్కడ మంచి స్పందన వస్తోంది కానీ తెలుగు ప్రేక్షకులు ఒప్పుకోరు కాబట్టి చరణ్ రిజెక్ట్ చేశాడట . ఇటీవలే రంగస్థలం చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టిన చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటిస్తున్నాడు.


SALUTE TO OUR

NETIZENS

http://facebook.com/tollywood     

- Tollywood team


Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073

EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 OCTOBER 2018

Email: editor@tollywoodmag.com I www.tollywood.net


Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.