TOLLYWOOD.NET AUGUST 2021 | VOL 18 | ISSUE 08 | Rs.20/-
ముఖ్య కథనాలు
p
RNI NO: APTEL/2003/10076
/tollywood
/tollywood
NEWS HAPPENINGS
“SOMEONE IS SITTING IN THE SHADE TODAY BECAUSE SOMEONE PLANTED A TREE A LONG TIME AGO.”
LIFE style
Murali Mohan Ravi
HOT SPICY
Credits: Editor in Chief CEO VP Sales and Marketing Associate Editor Telugu Content Writer Graphic & Web Designer/Developer Publication Consultant
: : : : : : :
CHIT CHAT
Murali Mohan Ravi Siva Dosakayala Sanathan Prathama Singh Vihari Moulali Deshamoni Raghurama Raju Kalidindi
PA
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS
FOR ADVERTISEMENT ENQUIRES CALL : +91 7702 555 873
LOCAT ON
Follow Us On :
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE
wanna be featured
Email: editor@tollywoodmag.com I www.tollywood.net
in
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 AUGUST 2021
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు శంకర్ ప్యాన్ ఇండియా చిత్రాన్ని చేయబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. శంకర్ ఆధ్వర్యంలో కాస్ట్ అండ్ క్రూను ఫైనలైజ్ చేస్తున్నారు. ఇప్పటికే జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా, ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా కన్ఫర్మ్
అయిన విషయం తెల్సిందే. సాయి మాధవ్ బుర్రా డైలాగులను రాస్తున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర హీరోయిన్ ను కూడా కన్ఫర్మ్ చేసారు. బాలీవుడ్ టాప్ బ్యూటీగా ఫుల్ బిజీగా ఉన్న కియారా అద్వానీ ఈ చిత్రంలో నటించబోతోంది. ఈ న్యూస్ ను ఇటీవల అధికారికంగా ప్రకటించారు. రామ్ చరణ్, కియారా కలిసి నటించిన వినయ
send your details and portfolio to
subscription 1 year (12 issues) : Rs 200
2 Year ( 24 issues) : Rs 400
Name:_______________________________________________________________________ Address: _____________________________________________________________________ ____________________________________________________________________________ City: ____________________________ Pin:________________________________________ Phone Number: ___________________Email Id:_____________________________________ Please find enclosed cheque/dd no: _________________________ Date: ________________ IN FAVOUR OF : VIBHU MEDIA PVT LTD Mailing Address: #8-3-833/A, Flat No.105, Ground Floor, B Block, Usha Enclave, Srinagar Colony, Hyderabad - 500073. Contact: +91 7702555873 Terms & Conditions 1. Rates are valid for Hyderabad only. For delivery to other parts of Telangana add Rs 40 per 12 issues, Rs 80 for 24 issues. 2. Vibhu Media PVT LTD is not responsible for postal delays or delivery failures. 3. Subscriptions are not refundable. 4. All disputes are subject to the exclusive jurisdiction of competent courts in Hyderabad only.
editor@tollywoodmag.com విధేయ రామ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెల్సిందే. అయితే ఈసారి మాత్రం లెక్కలు సరిచేస్తామంటున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ లెవెల్లో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం గురించి మరింత సమాచారం త్వరలోనే బయటకు రానుంది.
QUIZ COMPETET ON
d ary B RTHDAYS EXCLUS VE
LittleStar
ఎ
నర్ టి జి క్ స్ర్ టా రామ్ ఇప్పుడు ఉస్తాద్ రామ్ పోతినేనిగా మారిన విషయం తెల్సిందే. రామ్ ఇప్పుడు తమిళ స్ర్ టా దర్శకుడు లింగుసామి తెరకెక్కిస్ న తో ్న ద్విభాషా చిత్రంలో నటిస్ న్ తు నాడు. ప్రస్ త తు ం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కన్ఫర్మ్ అయింది. ఇక విలన్ గా ఆది పినిశెట్టిని కన్ఫర్మ్ చేసారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ కూడా నటిస్ న తు ్నట్ లు తెలుస్తోంది. ఆదికి పెయిర్ గా అక్షర కనిపిస్తుందిట. అలాగే ఈ చిత్రంలో కడప యాసలో అక్షర మాట్ డు లా తుందని సమాచారం. ఇక రామ్ ఈ చిత్రం కోసం తన లుక్ ను, బాడీని పూర్ గా తి మార్చేశాడు. అయితే ప్రస్ తా తు నికి అది సస్పెన్స్. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్ న్ తు నాడు. శ్రీనివాస చిట్ టూరి నిర్మిస్ న తో ్న ఈ సినిమాను 2022 సమ్మర్ కు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారం త్వరలోనే రివీల్ అవుతుంది.
AUGUST, 2021 b టాలీవుడ్ z 3
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ రొమాంటిక్
డ్రామా రాధే శ్యామ్ షూటింగ్ ఇటీవలే పూర్తైన విషయం తెల్సిందే. 2018లో మొదలైన రాధే శ్యామ్ షూటింగ్ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దీనికి కరోనా వైరస్ వల్ల కూడా ఇబ్బంది ఎదురైంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ రాధే శ్యామ్ విషయంలో కొంత అసహనానికి గురయ్యారు. వీటన్నిటికీ తెర దించుతూ రాధే శ్యామ్ నుండి అప్డేట్ వచ్చింది. రాధే శ్యామ్ ను మొదట జులై 30న విడుదల చేయాలనుకున్నారు
మొదట. అది కుదరలేదు కాబట్టి అదే రోజున ఇప్పుడు అప్డేట్ వచ్చింది. రాధే శ్యామ్ ను సంక్రాంతి రేసులోకి తీసుకొచ్చారు. జనవరి 14, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలియజేసారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు.
నం
దమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వరస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. కళ్యాణ్ రామ్ నటిస్తోన్న పలు ప్రాజెక్ట్స్ వివిధ ప్రొడక్షన్ దశల్లో ఉన్నాయి. వాటిలో డెవిల్ కూడా ఒకటి. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తి రేకెత్తించిన ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం సాగుతోంది. ఇందులో సీక్రెట్ బ్రిటిష్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపిస్తాడు. 1945ల కాలానికి సంబంధించిన కథతో పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ప్రముఖ సాంకేతిక
నిపుణులు రామకృష్ణ, మోనికాలు ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైనర్, ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు కథ కావడంతో ఆర్ట్ విషయంలో, ప్రొడక్షన్ డిజైన్ నేపథ్యంలో బెస్ట్ ఔట్పుట్ ఇవ్వాలి. అందుకే పలు టాప్ సినిమాలకు కలిసి పనిచేసిన వీరిని ఈ చిత్రానికి తీసుకున్నారు. శ్రీకాంత్ విస్సా కథ అందించిన ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించాడు. నవీన్ మేడారం ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా అభిషేక్ నామా భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు.
దర్శకుడు
సుకుమార్ కు రీసెంట్ గా డెంగ్యూ జ్వరం రావడంతో పుష్ప షూటింగ్ కు బ్రేకులు పడిన విషయం తెల్సిందే. డాక్టర్ల పర్యవేక్షణలో ఇన్ని రోజులు ఉన్న సుకుమార్ ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోకపోయినా డెంగ్యూ లక్షణాలు తగ్గుముఖం పట్టడంతో డాక్టర్ల సలహా మేరకు తిరిగి షూటింగ్ కు హాజరయ్యాడు. ఇటీవల పుష్ప షూటింగ్ తిరిగి మొదలైంది. ఇంకా లైట్ గా నీరసం ఉందిట క్రియేటివ్ దర్శకుడికి. సుకుమార్ తో పాటు
మరికొంత మంది క్రూ కు కూడా డెంగ్యూ లక్షణాలు కనిపించాయని అన్నారు. మరి వారి విషయంలో ఎటువంటి సమాచారం లేదు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 2022 సమ్మర్ కు పుష్ప విడుదలవుతుందని అంటున్నారు. ఇంకా విడుదల తేదీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. AUGUST, 2021 b టాలీవుడ్ z 5
NEWS HAPPENINGS
LIFE style
బంజారా
బిగ్ సినిమాస్ పతాకంపై శంకర్ జాదవ్, కరిష్మా, అదిరే అభి ప్రధాన తారాగణంగా శంకర్ జాదవ్ దర్శకత్వంలో రేఖ్యా నాయక్ రెండు భాషలో నిర్మిస్తున్న చిత్రం గోర్ మాటి (power of unity) (బంజారా), రాజ్ పుత్ (born warrior) తెలుగు , అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇటీవలే ప్రసాద్ ల్యాబ్ లో సిని నటులు మరియు దర్శకుడు శ్రీ నారాయణమూర్తి గారి చేతుల మీదుగా టీజర్ మరియు గోర్ మాటి టైటిల్ సాంగ్ విడుదల చేసారు. నారాయణమూర్తి గారు మాట్లాడుతూ బంజారా బిగ్ సినిమాస్ పతాకంపై వస్తున్న ఈ గోర్ మాటి బంజారా సినిమా చాలా అద్బుతంగా ఉందని నముతున దానికి ఈ గోర్ మాటి టైటిల్ సాంగ్ రామ్ రామ్ అనే
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
సాంగ్ బంజారా సమాజమును ఏకం చేసేలా ఉంది అంటే సినిమా కుడా అదే విధముగా ఉంటుంది అనుకుంటున్నాను ఇదే సినిమా ను తెలుగులో రాజ్ పుత్ గా తీసుకురావడం గొప్ప విషయము. ఇంత గొప్ప సినిమాను మన ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్న నిర్మాత రేఖ్యా నాయక్, ఈ సినిమా దర్శకుడు మరియు హీరో శంకర్ జాదవ్ ఇద్దరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ సినిమాను బంజారా జాతి తో పాటు అన్ని జాతుల వారు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను ఎందుకంటే ఒక రైతు ఆ రైతు ఆవేదన ఆ రైతు బాధ రైతు కష్టం ఏంటో తెలియజేసే సినిమా ఈ గోర్ మాటి సినిమా రైతు లేకపోతే మన జీవనం ఎటు పోతుందో అని
BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life
మంచి సందేశాత్మక చిత్రం రూపొందిస్తున్నారు ఇలాంటి చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ ముందుకు రావాలి థియేటర్లు ఇవ్వాలి థియేటర్లకు మీరంతా వచ్చి ఈ సినిమాను చూసి ఇలాంటి సినిమాను ప్రోత్సహించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ అని అన్నారు. అదిరే అభి మాట్లాడుతూ నేను బంజారా లో మొట్టమొదటి సినిమా చేస్తున్నాన ఈ సినిమా కోసం ప్రొడ్యూసర్ రేఖ్యా నాయక్ గారు అలాగే మా డైరెక్టర్ శంకర్ జాదవ్ గారు ఎంతో కష్టపడి ఈ సినిమాని పూర్తి చేశారు సినిమా చాలా అద్భుతంగా వచ్చింది మీరందరూ సినిమా థియేటర్స్ కు వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ రేఖ్యానాయక్ మాట్లాడుతూ మా బంజారా జాతిలో వస్తున్నా గోప్ప సినిమా మా ఈ గోర్ మాటి సినిమా అలాగే ఈ సినిమాను తెలుగులోరాజ్ పుత్ అనే పేరుతో నిర్మిస్తున్నాను ఈ సినిమా కోసం మా డైరెక్టర్ మా తమ్ముడు శంకర్ జాదవ్ చాలా కష్టపడ్డాడు నా సినిమాకు సహకరించిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయిపోయాయి ప్రస్తుతం మా చిత్రం సెన్సార్ దశలో ఉన్నది సెన్సార్ కంప్లీట్ అయిపోయి సెప్టెంబర్ లో మీ ముందుకు
తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అందరూ మా చిత్రాన్ని సహకరించి మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటూ జై సేవాలాల్ జై గోర్ మాటి ఈ సినిమా హీరో మరియు డైరెక్టర్ శంకర్ జాదవ్ మాట్లాడుతూ సినిమా మీద ప్రేమతో సినిమా అంటే ఇష్టం తో 17 సంవత్సరాల క్రితం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఇబ్బందులు పడుతూ సినిమా మీద ప్రేమతో ప్రయత్నిస్తూ అటు అసిస్టెంట్ డైరెక్టర్ గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు అనుభవం సంపాదించి బంజారా బిగ్ ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి అక్కడితో ఆగకుండా బంజారా బిగ్ సినిమాస్ ప్రొడక్షన్ ని తన అన్న రేఖ్యానాయక్ తో కలిసి స్థాపించి ఎంతో మంది బంజారా కళాకారులకు అవకాశం ఇచ్చారు ఇప్పుడు ఈ గోర్ మాటి సినిమా బంజారా లో తెలుగులో రాజ్ పుత్ అనే పేరుతో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము అన్ని సంవత్సరముల కష్టానికి నిలువెత్తు రూపం ఈ గోర్ మాటి సినిమా నా సినిమాను నా టీం ను మీరందరూ ఆదరిస్తారని ఆదరించాలని మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను నా సినిమాను మీరు సక్సెస్ చేస్తే ఇలాంటి సినిమాలు చేస్తూనే ఉంటాను జై సేవాలాల్ జై గోర్ మాటి.
trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE AUGUST, 2021 b టాలీవుడ్ z 7
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY CHIT CHAT RAZZI
PA
BEAUTY t ps BEHIND THE WOODS
LOCAT ON
fash on
2
TICKET TOLLYWOOD
sex psychology
వేణు
తొట్టెంపూడి గుర్తున్నాడా? ఎర్లీ 2000లలో పలు చిత్రాల్లో నటించాడు. అందులో కొన్ని విజయం సాధించాయి కూడా. క్రమంగా వేణు హీరో వేషాలు చెల్లలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ నటుడిగా మారాడు కూడా. ఎన్టీఆర్ నటించిన దమ్ము చిత్రంలో వేణు కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత వాటికి కూడా దూరమైన వేణు ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో రీఎంట్రీ ఇస్తున్నాడు. మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రంలో వేణు కీలక పాత్రకు ఎంపికైనట్లు అధికారికంగా
top
N GHT Life
trade GUIDE My CHOICE
QUIZ
కన్ఫర్మ్ అయింది. ఖిలాడీ తర్వాత రవితేజ చేస్తోన్న చిత్రం రామారావు ఆన్ డ్యూటీ. ఈ చిత్రాన్ని శరత్ మండవ అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో వేణు కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా దివ్యంశ కౌశిక్, రజిష విజయన్ నటిస్తోన్న విషయం తెల్సిందే. రామారావు ఆన్ డ్యూటీ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ నిర్మిస్తోంది. మరోవైపు రవితేజ ఖిలాడీ చిత్రాన్ని దాదాపు పూర్తి చేసాడు. ఈ ఏడాదిలోనే ఖిలాడీ విడుదలవుతుంది.
COMPETET ON
d ary B RTHDAYS EXCLUS VE LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
అక్కినేని హీరో సుమంత్ ప్రస్తుతం సింగిల్ గానే
ఉంటున్నాడు. 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకున్న సుమంత్, 2006లో విడాకులు తీసుకున్నాడు. అప్పటి నుండి సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. పెళ్లి గురించి అడిగినా కూడా ఇక వద్దు అన్నట్లుగా చెప్పే సుమంత్ ఇప్పుడు మరో పెళ్ళికి సిద్ధమయినట్లుగా తెలుస్తోంది. సుమంత్ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ కే చెందిన పవిత్రను సుమంత్ 8 z టాలీవుడ్ b AUGUST, 2021
పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అక్కినేని ఫ్యామిలీతో పాటు అతికొద్ది మాత్రమే అటెండ్ అయ్యే ఈ వెడ్డింగ్ ఫంక్షన్ త్వరలోనే జరగనుంది. ఇదిలా ఉంటే రామ్ గోపాల్ వర్మ ఈ న్యూస్ పై స్పందించాడు. “ఒక్కసారి అయ్యాక కూడా నీకు బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ, అనుభవించండి” అని తన స్టైల్ లో ట్వీటాడు. ప్రస్తుతం సుమంత్ నటించిన అనగనగా ఒక రౌడీ విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజిఎఫ్ చాప్టర్ 1 ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలుసు. కన్నడ ఇండస్ట్రీలోనే కాక యావత్ భారతదేశంలోనే ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇప్పుడు పార్ట్ 2 మరింత ఘనంగా ఉండబోతోందని అర్ధమవుతోంది. కేజిఎఫ్ చాప్టర్ 2 విషయంలో ఏ స్థాయి బజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. కన్నడ రాక్ స్టార్ యష్ ఈ చిత్రంలో హీరోగా, రాకీ భాయ్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ పాత్రకు
ధీటుగా అధీరా పాత్రను పార్ట్ 2లో పరిచయం చేయనున్నాడు. సంజయ్ దత్ ఈ పాత్రలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇటీవల సంజయ్ దత్ పుట్టినరోజు సందర్భంగా కేజిఎఫ్ మేకర్స్ ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేసారు. విలన్ అంటే ఇలానే ఉండాలి అన్నట్లుగా సంజయ్ దత్ లుక్ ను డిజైన్ చేసారు. ఈ లుక్ స్టన్నింగ్ గా ఉందనే చెప్పాలి. రాకీ భాయ్ ను ఢీకొట్టాలంటే ఈ మాత్రం ఉండాలిగా మరి.
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
తమిళ స్టార్ హీరో ధనుష్ తో సెన్సిబుల్ చిత్రాలు
చేసే శేఖర్ కమ్ముల సినిమా చేయబోతున్నాడు. ఈ మధ్యనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా వెల్లడించాడు. సాధారణంగా శేఖర్ కమ్ముల తన సినిమాలను తనే రాసుకుంటాడు. సినిమా సినిమాకూ మధ్య చాలా గ్యాప్ తీసుకుంటాడు కానీ ఈసారి చాలా త్వరగానే స్క్రిప్ట్ ను పూర్తి చేసాడు. ధనుష్ సినిమా ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం చేసేసాడు. అయితే ఇంకా ధనుష్ కు ఈ స్క్రిప్ట్ ను నరేట్
చేయలేదు. త్వరలోనే ధనుష్ ను శేఖర్ కమ్ముల కలిసి ఫుల్ స్క్రిప్ట్ ను వినిపిస్తాడట. ఫస్ట్ నరేషన్ విన్న ధనుష్ ఇంప్రెస్ అయ్యి ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. నారాయణ్ దాస్ నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరోవైపు పూజ హెగ్డేను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న బిజీకి పూజ హెగ్డే డేట్స్ ఇవ్వగలదా అనేది ప్రధాన ప్రశ్న.
తమిళ
స్టార్ హీరో ఆర్యకు డబల్ ధమాకా దక్కినట్లు అయింది. రీసెంట్ గా ఆర్య నటించిన సర్పట్ట పరంబరాయ్ చిత్రానికి విశేష స్పందన దక్కింది. ముఖ్యంగా ఆర్య పెర్ఫార్మన్స్ కు అన్ని వర్గాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెల్సిందే. దీనికి తోడు ఆర్యకు మరో హ్యాపీ న్యూస్ వచ్చింది. ఆర్య భార్య సయేశా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆర్య, సయేశా 2019లో పెళ్లి చేసుకున్నారు. ఈ డెలివరీ న్యూస్ ను ఆర్య
సన్నిహితుడు విశాల్ ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేసాడు. “ఈ వార్త చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు షూట్ మధ్యలో ఉన్నాం కానీ ఎమోషన్స్ ను ఆపలేకపోతున్నా. నేను మావయ్య అయినందుకు ఆనందంగా ఉంది. వాళ్లకు ఎప్పుడూ మంచే జరగాలి” అని ట్వీట్ చేసాడు. ఆర్య, విశాల్ ఎనిమీ సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇటీవల ఈ చిత్ర టీజర్ కూడా విడుదల కానుంది.
ముందు
దర్శకుడిగా సత్తా చాటి ఆపై తమిళ సినిమాల్లో నటుడిగా నిరూపించుకున్న సముద్రఖని ఇప్పుడు తెలుగు చిత్రాల్లో ఫుల్ బిజీగా మారిపోయాడు. తెలుగులో వరసగా టాప్ చిత్రాలను కైవసం చేసుకుంటున్నాడు సముద్రఖని. రీసెంట్ గా అల వైకుంఠపురములో, క్రాక్ చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు ఈ నటుడు కమ్ దర్శకుడు. దీంతో తెలుగులో అవకాశాలు క్యూ కడుతున్నాయి. రీసెంట్ గా రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ లో కీలక పాత్ర పోషించాడు సముద్రఖని.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాటలో కూడా మంచి పాత్ర చేజిక్కించుకున్నాడు. అలాగే తేజ తెరకెక్కిస్తోన్న కొత్త చిత్రంలో కూడా సముద్రఖని నటిస్తున్నాడు. ఇంకా రెండు, మూడు చిత్రాలు డిస్కషన్ దశల్లో ఉన్నాయి. అటు నెగటివ్, ఇటు పాజిటివ్ రోల్స్ ను అంతే ఎఫెక్టివ్ గా పోషించగల సముద్రఖని టాలీవుడ్ లో టాప్ స్థాయికి చేరాలని అనుకుంటున్నాడు. తెలుగులో సినిమాలకు తోడు తన తమిళ చిత్రాలు ఉండనే ఉన్నాయి. AUGUST, 2021 b టాలీవుడ్ z 9
NEWS HAPPENINGS
ఉప్పెన భామ కృతి శెట్టికి వరసగా అవకాశాలు
క్యూ కడుతున్నాయి. నాని చిత్రం శ్యామ్ సింగ రాయ్ షూటింగ్ ను పూర్తి చేసిన కృతి శెట్టి సుధీర్ బాబు హీరోగా నటిస్తోన్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలని ఉంది చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తాజా సమాచారం ప్రకారం రెండు చిత్రాలను సైన్ చేసింది కృతి శెట్టి. నాగ చైతన్య సరసన కృతి శెట్టి నటిస్తోంది. నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
తెరకెక్కుతోన్న బంగార్రాజు చిత్రంలో నాగ చైతన్య నటిస్తున్నాడు. నాగ చైతన్య సరసన కీలక పాత్రలో కృతి శెట్టి చేస్తోంది. రీసెంట్ గా ఆమె ఈ సినిమాను సైన్ చేసింది కూడా. దీంతో పాటు నితిన్ లేటెస్ట్ సినిమాను కూడా కృతి శెట్టి ఓకే చేసింది. ఎడిటర్ ఎస్ఆర్ శేఖర్ దర్శకుడిగా మారుతున్నాడు. నితిన్ ఈ కథను ఓకే చేసాడు. కృతి శెట్టిను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఉప్పెన భామ డైరీ ఇప్పుడు ఫుల్ అయిపోయింది.
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
fash on
2 TICKET TOLLYWOOD
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి
sex psychology
కలిసి నటిస్తోన్న విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ రీమేక్ అయ్యప్పనుమ్ కోశియుమ్ చిత్రంలో నటిస్తున్నారు. సాగర్ కె చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా చిన్న మేకింగ్ వీడియోను విడుదల చేసారు. దీంట్లో పవన్ కళ్యాణ్, రానా ఇద్దరి లుక్స్ అదిరిపోయాయనే చెప్పాలి. పవన్ కళ్యాణ్
top
N GHT Life
trade GUIDE My CHOICE
భీమ్లా నాయక్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ మేకింగ్ వీడియోకు రెస్పాన్స్ అదిరింది. ఇక రానా పవన్ కళ్యాణ్ తో పనిచేయడం గురించి స్పందించాడు. పవన్ తో పనిచేయడం తనకు గౌరవమని రానా అన్నాడు. అంత అనుభవమున్న నటుడితో పనిచేయడాన్ని ఆస్వాదిస్తున్నట్లు తెలిపాడు. నిత్యా మీనన్, ఐశ్వర్య రాజేష్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు.
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
బబ్లీ బ్యూటీగా ఇండస్ట్రీకి పరిచయమైన రాశి
ఖన్నా తన చబ్బీ లుక్ నుండి పూర్తి స్లిమ్ లుక్ లోకి మారిపోయింది. గత కొంత కాలం నుండి రాశి ఖన్నా గ్లామరస్ లుక్ ను ఎక్కువ ఇష్టపడుతోంది. తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ స్టిల్స్ తో అందరికీ కిక్ ఇస్తోంది. తాజాగా ఆరెంజ్ రివీలింగ్ టాప్, వైట్ ప్యాంటుతో రాశి ఖన్నా దుమ్మురేపింది. తన నడుమందాలతో పాటు క్లివేజ్ ను కూడా ఎంత వరకూ ప్రదర్శించాలో రివీల్ చేసి స్టన్ చేసింది. ఈ ఫోటోషూట్ కు ఇప్పుడు లైకుల
వర్షం కురుస్తోంది. “సన్ రైజ్ ఆర్ సన్ సెట్” అని ఈ ఫోటోషూట్ కు క్యాప్షన్ ను జత చేసింది. నాగ చైతన్య సరసన థాంక్యూ చిత్రంలో నటిస్తోన్న రాశి ఖన్నా, గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న పక్కా కమర్షియల్ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది రాశి ఖన్నా. అంతే కాకుండా అజయ్ దేవగన్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న వెబ్ సిరీస్ లో కూడా రాశి ఖన్నా కీలక పాత్రను పోషిస్తోంది.
LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ గా ఒక మూవీ
ఫంక్షన్ కు అటెండ్ అయ్యాడు. అక్కడ తెలుగు సినిమా, థియేటర్ల గురించి స్పందించాడు. సినిమాలను థియేటర్లలో చూడటం మన సంస్కృతిలోనే ఉందని తెలిపాడు. సినీ ఇండస్ట్రీ మనుగడకు థియేటర్లు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా నాని 10 z టాలీవుడ్ b AUGUST, 2021
వ్యాఖ్యానించాడు. ఈ వ్యాఖ్యల బట్టి చూసుకుంటే నాని లేటెస్ట్ సినిమా టక్ జగదీష్ థియేటర్లలోనే విడుదలవుతుందని చెప్పవచ్చు. నాని నటించిన లాస్ట్ సినిమా వి ఓటిటి రిలీజ్ అయిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా టక్ జగదీష్ కూడా ఓటిటిలో విడుదలవుతుందని రూమర్స్
వచ్చాయి. చాలా మంది దీన్ని నమ్మడం మొదలుపెట్టారు కాబట్టి నాని క్లారిటీ తన సినిమాకు కూడా వర్తిస్తుందని చెప్పుకోవచ్చు. టక్ జగదీష్ ను
శివ నిర్వాణ డైరెక్ట్ చేసాడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామాలో జగపతి బాబు నాని అన్న పాత్రలో నటించాడు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.
NEWS HAPPENINGS
మొదట చిన్న చిన్న పాత్రలతో తన ప్రయాణాన్ని
మొదలుపెట్టిన నటుడు సత్యదేవ్ క్రమంగా ఇప్పుడు హీరో అయ్యాడు. మంచి మంచి సినిమాలు చేస్తూ ఇప్పుడు తనకంటూ కొంత మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య వంటి సినిమాలతో నటుడిగా తానేంటో నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సత్యదేవ్ నటించిన లేటెస్ట్ సినిమా తిమ్మరుసు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెల 30న తిమ్మరుసు విడుదల కాబోతోంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడ్డాక విడుదలవుతున్న మొదటి తెలుగు సినిమా ఇదే
LIFE style
కావడం విశేషం. మహేష్ ఎస్ కోనేరు నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ తో అందరినీ ఇంప్రెస్ చేసింది. ఇక సత్యదేవ్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు సినిమా గురించి స్పందించాడు. “లాక్ డౌన్ కారణంగా జనాలకు వరల్డ్ సినిమా చూసే అవకాశం ఎక్కువ దక్కింది. ఏడాది క్రితం కంటే ఇప్పుడు వారు కొంత మెచ్యూర్ అయ్యారు. అయితే అది మంచికే జరిగింది. ఇప్పుడు రియలిస్టిక్ సినిమాలకు ఆదరణ పెరిగింది. కొత్త తరం దర్శకులు కూడా ఈ దిశగానే ఆలోచిస్తున్నారు” అని సత్యదేవ్ అన్నాడు.
HOT SPICY
CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
మహానటి ద్వారా తెలుగు వారిని ఇంప్రెస్ చేసిన
దుల్కర్ సల్మాన్ ఇప్పుడు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేస్తున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఒక హిస్టారికల్ డ్రామాను మొదలుపెట్టాడు. మహానటితోనే బ్యానర్ కు ఒక వేల్యూ క్రియేట్ చేసుకున్న స్వప్న సినిమా బ్యానర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు. “యుద్ధంతో రాసిన ప్రేమకథ” క్యాప్షన్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవల దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర గ్లిమ్ప్స్
ను విడుదల చేసారు. ఈ గ్లిమ్ప్స్ లో విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా కాశ్మీర్ పరిసరాల్లోని అందాలను, నైట్ ఎఫెక్ట్ లో రైల్వే స్టేషన్ సీన్ ను అద్భుతంగా క్యాప్చర్ చేసాడు సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్. విశాల్ చంద్రశేఖర్ అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకుంది. ఇక దుల్కర్ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మొత్తానికి చిన్న గ్లిమ్ప్స్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలను పెంచేశారు. బ్రిటిష్ ప్రభుత్వంలోని ఒక సైనికుడిగా దుల్కర్ కనిపించనున్నాడు. AUGUST, 2021 b టాలీవుడ్ z 11
LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
12 z టాలీవుడ్ b AUGUST, 2021
AUGUST, 2021 b టాలీవుడ్ z 13
ng od Bollywood w ప్ర tory od
ముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్న్ సినిమాలు నిర్మిస్తున్నాడన్న కారణంతో అరెస్ట్ కాబడిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో రోజుకొక వార్త రాజ్ కుంద్రా గురించి బయటకు వస్తోంది. రాజ్ కుంద్రా భార్య ప్రముఖ నటి శిల్పా శెట్టి ఈ విషయంలో ఇప్పటిదాకా స్పందించింది లేదు. అయితే ఇటీవల శిల్పా శెట్టి వద్ద స్టేట్మెంట్ తీసుకోవడానికి ముంబై పోలీసులు ఆమె నివాసానికి వెళ్లారు.
రాజ్ కుంద్రాకు సంబంధించిన హాట్ హిట్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పా శెట్టి చెప్పుకొచ్చింది. అలాగే తన స్టేట్మెంట్ ఇస్తోన్న సమయంలో ఎమోషనల్ అయ్యి ఏడ్చినట్లు తెలుస్తోంది. తాను మానసికంగా చాలా డిస్టర్బ్ అయినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. అలాగే తన భర్తను వెనకేసుకొచ్చే ప్రయత్నం కూడా చేసింది శిల్పా శెట్టి. ఆయన తీసినవి పోర్న్ సినిమాలు కాదని, ఏరోటికా జోనర్ కు చెందిన చిత్రాలని శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చింది. ఈ కేసు ఇంకా ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
అక్కినేని నాగ చైతన్య బాలీవుడ్ డెబ్యూ చేస్తోన్న
విషయం తెల్సిందే. ఆమిర్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న లాల్ సింగ్ చద్దాలో నాగ చైతన్య కూడా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ మధ్యనే అధికారికంగా తెలియజేసారు. ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా షూటింగ్ లడఖ్ లో సాగుతోంది. గత వారం రోజుల నుండి నాగ చైతన్య షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మరో వారం రోజుల పాటు నాగ చైతన్య
లడఖ్ లోనే షూట్ చేస్తాడు. దీంతో తన పోర్షన్ షూటింగ్ పూర్తవుతుంది. లాల్ సింగ్ చద్దా లడఖ్ షెడ్యూల్ ఈ నెలాఖరు వరకూ సాగుతుంది. ఈ చిత్రంలో చైతన్యది కామియో పాత్ర. ఆర్మీ అధికారి పాత్రలో కనిపిస్తాడు చైతూ. తెలుగులో చైతన్య నటించిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ షూటింగ్ చివరి దశలో ఉంది.
టి సిరీస్ అధినేత భూషణ్ కుమార్ పై రేప్
కేసు నమోదైంది. బాలీవుడ్ నిర్మాత, టి సిరీస్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ తనను మూడేళ్ళుగా రేప్ చేస్తున్నాడని 30 ఏళ్ల అమ్మాయి కంప్లైంట్ ఫైల్ చేసింది. కేసు నమోదు చేసిన డీఎన్ నగర్ పోలీసులు ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. ఈ కేసులో ఇంకా ఎటువంటి అరెస్టులు జరగలేదని తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే 30 ఏళ్ల యువతిని టి సిరీస్ లో ప్రాజెక్ట్ ఇప్పిస్తానని చెప్పి తనను 14 z టాలీవుడ్ b AUGUST, 2021
లోబరుచుకున్నాడని 2017 నుండి 2020 వరకూ తనను ఎబ్యూస్ చేసాడని ఆ యువతి కంప్లైంట్ లో పేర్కొంది. డిఎన్ నగర్ పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 376 కింద కేసును నమోదు చేసారు. 2018లో కూడా భూషణ్ కుమార్ పై సెక్సువల్ హరాస్మెంట్ ఆరోపణలు వచ్చాయి. ఒక అపరిచిత ట్విట్టర్ యూజర్ భూషణ్ కుమార్ తనను సినిమాల్లోంచి తీసి వేసాడని, భూషణ్ అడిగింది నేను ఇవ్వలేదనే కారణంతోనే ఇలా చేసాడని ఆరోపించింది.
NEWS HAPPENINGS
LIFE style
HOT SPICY CHIT CHAT
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు
వారి పాట షూటింగ్ లో పాల్గొంటున్నాడు. కరోనా వైరస్ కారణంగా బ్రేక్ వచ్చాక రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. హైదరాబాద్ లోనే ఈ షెడ్యూల్ సాగుతోంది. 2022 సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం కూడా లైన్లో ఉంది. అక్టోబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలవుతుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో మహేష్ కొత్త చిత్రాలను కన్ఫర్మ్ చేసినట్లు వార్తలు
PA
RAZZI
BEAUTY t ps
వస్తున్నాయి కానీ ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. మహేష్ సర్కారు వారి పాట, త్రివిక్రమ్ సినిమాలు తప్ప మరో చిత్రాన్ని ఓకే చేయలేదు. నెక్స్ట్ సమ్మర్ కు ఈ రెండు చిత్రాల కమిట్మెంట్స్ నుండి బయటకు వచ్చేసే మహేష్ ఆ తర్వాత బల్క్ డేట్స్ ను రాజమౌళికి కేటాయించనున్నాడు. రాజమౌళి అంటే మినిమం రెండేళ్లు డేడికేట్ చేయాల్సి ఉంటుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయబోయే చిత్రం మహేష్ తోనే అన్న విషయం తెల్సిందే.
BEHIND THE WOODS LOCAT ON
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life trade GUIDE My CHOICE
QUIZ
COMPETET ON
అక్కినేని
నాగ చైతన్య కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది. వరసగా సినిమాలతో సూపర్ బిజీగా ఉన్నాడు. లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చిత్రాన్ని దాదాపుగా పూర్తి చేసేసాడు. అలాగే ప్రస్తుతం ఆమీర్ ఖాన్ చిత్రం లాల్ సింగ్ చద్దా చిత్ర షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్ కు ఓటేసినట్లు తెలుస్తోంది. శరత్ మరార్
d ary B RTHDAYS EXCLUS VE
నిర్మాణంలో ఈ 8 ఎపిసోడ్స్ ఉన్న వెబ్ సిరీస్ కు సంబంధించిన ఆసక్తికర డీటెయిల్స్ ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ఒక హారర్ థ్రిల్లర్. విక్రమ్ కె కుమార్ ఈ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇది కాకుండా మరో వెబ్ సిరీస్ లో కూడా నటించనున్నాడు నాగ చైతన్య. దాని డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది.
మెగాస్టార్
చిరంజీవి ఆచార్య చిత్రాన్ని దాదాపు పూర్తి చేసేసాడు. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ నడుస్తోంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ఇదిలా ఉంటే ఆచార్య తర్వాత చిరంజీవి తన నెక్స్ట్ సినిమాను కూడా లైన్లో పెట్టిన విషయం తెల్సిందే. మలయాళ సూపర్ హిట్ డ్రామా లూసిఫెర్ చిత్రాన్ని రీమేక్ చేయనున్నాడు. మోహన్ రాజా ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి.
హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను వేస్తున్నారు. అందులోనే ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసాడు దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 12 నుండి లూసిఫెర్ రీమేక్ షూట్ మొదలవుతుంది. ఎన్వీ ప్రసాద్, రామ్ చరణ్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు కాగా అతని ఇప్పటికే ట్యూన్స్ ను ఫైనలైజ్ చేసేసాడట. త్వరలోనే పాటల రికార్డింగ్ మొదలుపెడతాడు అని తెలుస్తోంది. AUGUST, 2021 b టాలీవుడ్ z 15
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ
Priyanka Jawalkar
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
talent contact us for PORTFOLIO'S and featured in TICKET 2 TOLLYWOOD m: +91 7702 555 873 e: editor@tollywoodmag.com
Shriya Sharma
NEWS HAPPENINGS
LIFE style ర
చయిత, దర్శకుడు మారుతి చిన్న సినిమాలకు ఎప్పుడూ చేదోడుగా ఉంటాడు. ప్రతిరోజూ పండగే చిత్రం తర్వాత కొంత బ్రేక్ తీసుకున్న మారుతి గోపీచంద్ తో పక్కా కమర్షియల్ చిత్రాన్ని అనౌన్స్ చేసాడు. షూట్ కూడా మొదలైంది. అయితే ఈలోగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కు బ్రేక్ పడింది. దీంతో మారుతి తన ఫ్రీ టైమ్ లో ఒక చిన్న కథపై వర్కౌట్ చేసాడు. సంతోష్ శోభన్, మెహ్రీన్ హీరో, హీరోయిన్లుగా ఈ సినిమాను త్వరగా పట్టాలెక్కించాడు. షూట్ మొత్తం
HOT SPICY CHIT CHAT PA
RAZZI
అల్యూమినియం ఫ్యాక్టరీలో స్పెషల్ సెట్ వేసి ప్లాన్ చేసాడు. ఇక్కడ విశేషం ఏంటంటే మంచి రోజులు వచ్చాయి షూట్ మొత్తం కేవలం 24 రోజుల్లోనే పూర్తి చేసేసాడు. రీసెంట్ గా క్యారెక్టర్ ఇంట్రో వీడియో ఒకటి విడుదల చేసాడు. బోలెడు పాత్రలతో, పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రం అందిస్తున్నట్లు అర్ధమవుతోంది. మరి 24 రోజుల్లోనే అంతమంది ఆర్టిస్ట్ లతో సినిమా చేయడం అంటే విశేషమే మరి.
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE
My CHOICE QUIZ
మె COMPETET ON
గా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలను సెట్స్ పై ఉంచాడు. వెంకటేష్ తో కలిసి ఎఫ్2 సీక్వెల్ ఎఫ్3ను చేస్తోన్న వరుణ్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో గని చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో బాక్సర్ అవతారం ఎత్తుతున్నాడు. తన పాత్ర కోసం బాక్సింగ్ లో నాలుగు నెలలు శిక్షణ కూడా తీసుకున్నాడు. ప్రస్తుతం గని షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెం సాంగ్ కూడా ఉందిట. ఈ
d ary B RTHDAYS EXCLUS VE
సాంగ్ ను చేయడానికి కొంత మంది టాప్ హీరోయిన్స్ ను పరిశీలించాక ఇక మిల్కీ బ్యూటీ తమన్నాకే ఓటు వేశారు. తమన్నాకు స్పెషల్ సాంగ్స్ చేయడం కొత్తేమి కాదు. బెల్లంకొండ శ్రీనివాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. ఇప్పుడు భారీ రెమ్యునరేషన్ తీసుకుని గనిలో కూడా స్పెషల్ సాంగ్ చేస్తోంది. తమన్నా ఇప్పుడు భిన్నమైన పాత్రలను ఎంచుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. మేస్ట్రో చిత్రంలో నెగటివ్ ఛాయలున్న పాత్రను చేసిన విషయం తెల్సిందే.
నం
దమూరి బాలకృష్ణ సినిమా అఖండలో హీరోయిన్ గా అవకాశం సంపాదించింది ప్రగ్యా జైస్వాల్. తెలుగులో కొన్ని సినిమాలు చేసినా కానీ ప్రగ్యాకు సరైన బ్రేక్ దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రగ్యా అఖండ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ చిత్రంలో గ్లామరస్ రోల్ లో నటించనుంది. సినిమాల్లోనే కాదు బయట కూడా గ్లామర్ ఒలికించడంలో ఈ భామ ముందుంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఏ మాత్రం మొహమాటం లేకుండా తన
రివీలింగ్ ఫొటోస్ అప్లోడ్ చేస్తుంది. అందుకే ఈ భామకు భారీ ఫాలోయింగ్ కూడా ఉంది. రీసెంట్ గా ప్రగ్యా పోస్ట్ చేసిన ఫోటో అయితే మైండ్ బ్లోయింగ్ అనాలేమో. నడుమందాలను ప్రధానంగా చూపిస్తూనే అమ్మడు వేసుకున్న టాప్ కు కేవలం ఒక్క బటన్ మాత్రమే పెట్టింది. ఇక ప్రగ్యా టెంప్టింగ్ ఎక్స్ప్రెషన్స్ ఈ ఫొటోకు భారీ సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి కూడా. ఇక అఖండ చిత్రం చివరి షెడ్యూల్ లో ఉంది. మరి ఈ చిత్రంతో భామకు బ్రేక్ వస్తుందేమో చూద్దాం. AUGUST, 2021 b టాలీవుడ్ z 17
B RTHDAYS EXCLUS VE
LittleStar
నటీనటులు: వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, రాజీవ్ కనకాల తదితరులు దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల నిర్మాత : సురేష్ బాబు, కలైపులి ఎస్ థాను సంగీతం : మణిశర్మ ై 20, 2021 విడుదల తేదీ : జుల
(కార్తీక్ రత్నం) అవమానిస్తాడు. దీంతో ముణికన్నను అత్యంత దారుణంగా చంపిస్తారు. ఈ హత్య జరిగినా కానీ నారప్పలో కదలిక ఉండదు. తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక భారీ అవమానాన్ని సైతం భరిస్తాడు.
సినిమాటోగ్రాఫి చాలా బాగుంది. నిర్మాణ విలువలు అయితే టాప్ స్థాయిలో ఉన్నాయి. దర్శకుడిగా శ్రీకాంత్ అడ్డాల రీమేక్ ను బాగానే హ్యాండిల్ చేసాడు.
అయితే చిన్న కొడుకు సినప్ప మాత్రం పగతో ఎవరూ ఊహించని పని చేస్తాడు. దీంతో జమిందారీ వంశం నారప్ప చిన్న కొడుకు కోసం వెతుకుతూ ఉంటుంది. నారప్ప తన చిన్న కొడుకుతో పారిపోతాడు. మరి జమిందారీ వంశం తాము అనుకున్న పని చేస్తుందా? ఎందుకని నారప్ప తన కుటుంబం విషయంలో అంత భయపడుతూ ఉంటాడు? తన గతమేంటి? చివరికి జరిగేదేంటి?
నారప్ప ఒక ఫెయిత్ ఫుల్ రీమేక్. కాకపోతే
చివరిగా:
FilmMaking Kollywood Bollywood రేటింగ్ : 3.25/5 నటీనటులు: Interview SpecialStory Hollywood తమిళంలో సూపర్ డూపర్ హిట్ గా నిలిచి, నేషనల్ అవార్డులను సైతం కొల్లగొట్టిన అసురన్ చిత్రాన్ని వెంకటేష్ నారప్పగా రీమేక్ చేసాడు. ఈ చిత్రం ప్రస్తుతమున్న పరిస్థితుల దృష్ట్యా డైరెక్ట్ ఓటిటి అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మరి ఈ చిత్ర రివ్యూ చూద్దామా.
కథ :
నారప్ప (వెంకటేష్) అనంతపూర్ లోని ఒక గ్రామంలో తన భార్య (ప్రియమణి), ఇద్దరు కొడుకులు, కూతురుతో జీవిస్తున్నాడు. పక్కనే తన బావమరిది (రాజీవ్ కనకాల) అన్ని పనులకూ చేదోడువాదోడుగా ఉంటాడు. నారప్పకున్న మూడెకరాల పొలం మీద పండుస్వామి కన్ను పడుతుంది. భూస్వాములైన పండుస్వామిని నారప్ప పెద్ద కొడుకు ముణికన్న
వెంకటేష్ మరోసారి తనలోని నటనాకౌశలాన్ని ప్రదర్శించాడు. వయసు మీదపడ్డ నారప్ప పాత్రలో వెంకటేష్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ లో వెంకటేష్ నటన అమోఘం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో కూడా వెంకీ మామ దుమ్ముదులిపేసాడు. ప్రియమణి వెంకటేష్ భార్య పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. కార్తీక్ రత్నం ఉన్న కాసేపు కూడా మెప్పిస్తాడు. రాజీవ్ కనకాల కూడా బాగా చేసాడు. నాజర్, రావు రమేష్ లు కూడా తమ పాత్రల పరిధి మేర రాణించారు.
సాంకేతిక వర్గం :
సాంకేతికంగా నారప్ప బలంగా నిలిచింది. స్క్రీన్ ప్లే దాదాపుగా ఒరిజినల్ ను పోలి ఉంటుంది. అయితే డైలాగులు బాగున్నాయి. మ్యూజిక్ కూడా ఓకే. కాకపొతే అసురన్ థీమ్ మ్యూజిక్ ను అలాగే దించేయకుండా ఉండాల్సింది.
నటీనటులు: సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్,
అజయ్ తదితరులు దర్శకత్వం : శరణ్ కొప్పిశెట్టి నిర్మాత: మహేష్ ఎస్ కోనేరు, సృజన్ ఎర్రబోలు సంగీతం : శ్రీ చరణ్ పాకల ై 30, 2021 విడుదల తేదీ : జుల
రేటింగ్ : 2.75/5
థియేటర్లు మూతబడి చాలా నెలలైంది. ఈ నేపథ్యంలో జులై 30న తిరిగి తెలుగు సినిమాలు విడుదల అవుతున్నాయి. ఈ క్రమంలో తిమ్మరుసు చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం రాబడుతుందోనన్న ఆసక్తి అందరిలో ఉంది. ప్రామిసింగ్ హీరో సత్యదేవ్ ఈ చిత్రంలో లీడ్ రోల్ లో నటించాడు.
కథ :
రామ్ చంద్ర (సత్యదేవ్) చాలా తెలివైన న్యాయవాది. డబ్బు కోసం కాకుండా న్యాయం కోసమే పనిచేస్తుంటాడు. ఇదిలా ఉండగా ఒక రోజు ఎనిమిదేళ్ల క్రితం మర్డర్ కేసు తిరిగి ఓపెన్ చేస్తాడు సత్యదేవ్. ఆ క్యాబ్ డ్రైవర్ మర్డర్ అవ్వగా కరప్ట్ పోలీస్ ఆఫీసర్ భూపతి రాజు (అజయ్) ఒక అమాయకుడిని ఈ కేసులో ఇరికిస్తాడు. అసలు ఎనిమిదేళ్ల తర్వాత ఈ కేసుని ఓపెన్ చేయాలని రామ్ చంద్ర ఎందుకు అనుకుంటాడు? ఓపెన్ చేసాక తనకు ఎదురైన సవాళ్లు ఏంటి? చివరికి ఏమైంది? అన్నది తిమ్మరుసు చిత్రం చూసి తెలుసుకోవాలి. 18 z టాలీవుడ్ b AUGUST, 2021
నటీనటులు:
సత్యదేవ్ ఈ సినిమాలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. తన పాత్రను చాలా సులువుగా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. సినిమా సినిమాకూ వైవిధ్యాన్ని చూపిస్తూ సత్యదేవ్ పరిణితి కనబరుస్తున్నాడు. ఇక ప్రియాంక జవాల్కర్ తన పాత్రను బాగా పోషించింది. సత్యదేవ్ కు అసిస్టెంట్ గా చేసిన బ్రహ్మాజీ కూడా తన పాత్రను బాగా పోషించాడు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అజయ్ మరోసారి రాణించాడు. మిగిలిన వాళ్ళందరూ తమ పాత్రలను బాగా చేసారు.
సాంకేతిక వర్గం :
తిమ్మరుసు చిత్రానికి సాంకేతిక విభాగం బలంగా నిలిచింది, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని సీన్స్ కు భిన్నత్వాన్ని తీసుకొచ్చింది సినిమాటోగ్రఫీ. ఎడిటింగ్ కూడా క్రిస్పీగా ఉంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ను ఎలివేట్ చేసేలా ఉంది. నిర్మాణ విలువులకు ఢోకా లేదు. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకొంత బిగి ఉంటే బాగుండేది. అదే ఈ సినిమాలో కొంత వీక్ పాయింట్ గా అనిపిస్తుంది. దర్శకత్వం ఓకే.
తీర్పు:
తిమ్మరుసు టోటల్ గా ఓకే అనిపిస్తుంది. కాకపోతే సినిమా గ్రాఫ్ పడుతూ లేస్తూ ముందుకు సాగటం వల్ల చిత్రంపై టోటల్ ఇంప్రెషన్ కొంత తగ్గుతుందని చెప్పాలి. సత్యదేవ్ నటన, కొన్ని మూమెంట్స్ ఈ
సినిమాకు బాగా వర్కౌట్ అయ్యాయి. ఓవరాల్ గా తిమ్మరుసు యావరేజ్ గా అనిపించే ఇన్వెస్టిగేషన్ థీమ్ చిత్రం.
అసురన్ ప్రధాన పాయింట్ అయిన కుల గొడవలను ఇక్కడ పేద-ధనిక ఘర్షణగా మార్చి చూపించారు. దీంతో కథ కొంత డైల్యూట్ అయింది. అయినప్పటికీ నారప్ప మెప్పిస్తుంది. వెంకీ తన నటనతో ఈ సినిమాను తన భుజాలపై మోశాడు. మొత్తానికి నారప్ప మంచి టైమ్ పాస్ బొమ్మగా నిలుస్తుంది.
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY
వి
CHIT CHAT PA
క్టరీ వెంకటేష్ మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం 2 ను తెలుగులో రీమేక్ చేసిన విషయం తెల్సిందే. దృశ్యం 1 తెలుగు వెర్షన్ లో కూడా వెంకటేష్ ప్రధాన పాత్రను పోషించాడు. దృశ్యం 2 షూటింగ్ రికార్డ్ సమయంలో షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే ఒరిజినల్ తరహాలోనే తెలుగు వెర్షన్ కూడా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలవుతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడు దానికి సపోర్ట్ చేసేలా
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
వెంకీ హింట్ ఇచ్చాడు. రీసెంట్ గా వెంకటేష్ నటించిన నారప్ప డిజిటల్ రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అందరూ వెంకీ పెర్ఫార్మన్స్ ను మెచ్చుకున్నారు కూడా. ఇటీవల నారప్ప సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ మీట్ లో వెంకటేష్ మాట్లాడుతూ దృశ్యం 2 కూడా ఇదే తరహాలో విడుదలవుతుందని హింట్ ఇచ్చాడు. ఎఫ్3తో మళ్ళీ మిమ్మల్ని థియేటర్లలో కలుసుకుంటానని వెల్లడించాడు. ఇక పరిస్థితిని అర్ధం చేసుకుని తనను సపోర్ట్ చేసిన ఫ్యాన్స్ కు ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిపాడు వెంకీ మామ.
fash on
2
TICKET TOLLYWOOD
sex psychology top
రియాలిటీ షోస్ లో టాప్ అనదగ్గ బిగ్
N GHT Life
బాస్ నెక్స్ట్ సీజన్ కు సర్వం సిద్ధమవుతోంది. తెలుగులో ఒక సీజన్ కు మించి మరో సీజన్ సూపర్ డూపర్ హిట్ అయిన విషయం తెల్సిందే. ముఖ్యంగా నాలుగో సీజన్ టీఆర్పీ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. ప్రస్తుతం కరోనా కొంచెం శాంతించడంతో బిగ్ బాస్ కు సంబంధించిన పనులు మొదలయ్యాయి. ఇప్పటికే కంటెస్టెంట్స్ ను దాదాపు ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్ లోంచి మరికొంత మందిని ఫైనల్ చేస్తారట. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 5 కు సంబంధించి
trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
మరికొంత సమాచారం ఇప్పుడు బయటకు వచ్చింది. సెప్టెంబర్ 5 నుండి బిగ్ బాస్ 5 మొదలుకానుంది. ఇక హోస్ట్ విషయంలో బోలెడన్ని రూమర్స్ నడిచాయి. నాగార్జున బిజీగా ఉన్న కారణంగా రానా దగ్గుబాటి ఈ సీజన్ ను హోస్ట్ చేస్తాడని అన్నారు. అయితే ఇందులో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. నాగార్జునే సీజన్ 5 ను కూడా హోస్ట్ చేస్తాడట. ఈ షో కు సంబంధించి మరింత ఆసక్తికర సమాచారం త్వరలోనే రానుంది.
LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైలాగ్ వెర్షన్ తో సహా ఫైనల్ డ్రాఫ్ట్ ను సిద్ధం
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ది సూపర్ క్రేజ్ ఉన్న కాంబినేషన్. వీరిద్దరూ కలిసి రెండు చిత్రాలకు పనిచేసారు. అటు అతడు, ఇటు ఖలేజా రెండూ కూడా క్లాసిక్స్ గా నిలిచాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి వీరు కలిసి పనిచేస్తోన్న విషయం తెల్సిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. తాజా సమాచారం ప్రకారం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్ర స్క్రిప్ట్ ను పూర్తి చేసాడట.
చేసినట్లు సమాచారం. మహేష్ కు ఫైనల్ నరేషన్ ఇచ్చేస్తే ఇక అన్నీ సెట్ అయినట్లే. మరోవైపు ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా త్వరలోనే మొదలవుతాయని అంటున్నారు. అక్టోబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టాలన్నది అసలు ప్లాన్. మరి ఆ సమయానికి మహేష్, సర్కారు వారి పాట షూటింగ్ ను పూర్తి చేయగలడా అన్నది చూడాలి. AUGUST, 2021 b టాలీవుడ్ z 19
NEWS HAPPENINGS
వికరీ్ట
వెంకటేష్ నటించిన తాజా చిత్రం నారప్ప ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెల్సిందే. ఈ సినిమా మంచి రివ్యూలనే సాధించింది. ముఖ్యంగా వెంకటేష్ పెర్ఫార్మన్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ పెర్ఫార్మన్స్ కు ముగ్దుడైపోయినట్లు తెలిపాడు. “నారప్ప చూసినప్పుడు నేను వెంకటేష్ ను చూడలేదు. ఆ పాత్రనే చూసాను. కచ్చితంగా ఈ సినిమాలో కొత్త వెంకటేష్ ను ఆవిష్కరించుకున్నాడు. నీలోని నటుడు ఎప్పుడూ
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE
నందమూరి
బాలకృష్ణ వరస ప్లాప్స్ నుండి బయటపడటానికి చేస్తోన్న సినిమా అఖండ. తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అఖండ షూటింగ్ లాంగ్ బ్రేక్ తర్వాత ఇటీవలే మొదలైన విషయం తెల్సిందే. తాజా సమాచారం ప్రకారం అఖండ షూటింగ్ ఇప్పుడు తమిళనాడులో సాగుతోంది. తమిళనాడులో ఒక పెద్ద ఆలయ బ్యాక్ డ్రాప్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారట. అది చిత్ర క్లైమాక్స్ అని తెలుస్తోంది. స్టంట్ శివ
My CHOICE
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
ఈ యాక్షన్ పార్ట్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సన్నివేశాలు రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్ లో ఉంటాయని భావిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్ కూడా అఖండపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం విడుదలైన టీజర్ అఖండపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రగ్య జైస్వాల్, పూర్ణ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే.
LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
రెబెల్
స్టార్ ప్రభాస్ రొమాంటిక్ లవ్ స్టోరీ రాధే శ్యామ్ లో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ గత కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే రాధే శ్యామ్ గురించి ఆసక్తికర సంగతులు చెప్పింది పూజ. అలాగే ఈ చిత్ర షూటింగ్ స్టేటస్ గురించి కూడా రివీల్ చేసింది. 20 z టాలీవుడ్ b AUGUST, 2021
“మరో 7 నుండి 10 రోజుల పాటు షూటింగ్ చేస్తే రాధే శ్యామ్ పూర్తవుతుంది. త్వరలోనే లాస్ట్ షెడ్యూల్ మొదలవుతుంది. నాకు తెలుసు ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. కానీ ఇది అందరికీ నచ్చుతుంది. ప్రభాస్ రొమాంటిక్ స్టోరీలో నటించడం కొత్తగా అనిపిస్తుంది. అలాగే నేను కూడా లవ్ స్టోరీ చేసి చాలా కాలమైంది” అని పూజ హెగ్డే తెలిపింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాను రాధా కృష్ణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు.
కొత్తదనాన్ని కోరుకుంటాడు. దానికి నారప్ప మంచి ఉదాహరణ” అని చిరంజీవి ఆడియో క్లిప్ రూపంలో తన రెస్పాన్స్ ను తెలిపాడు. “చిరంజీవి, నీ నుండి అభినందనలు ఎప్పుడూ నన్ను సంతోషింపజేస్తాయి. నారప్ప గురించి మంచి మాటలు చెప్పినందుకు థాంక్యూ” అని వెంకటేష్ దీనికి రెస్పాన్స్ ఇచ్చాడు. ప్రియమణి ఈ చిత్రంలో వెంకటేష్ భార్యగా నటించింది. శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు దర్శకుడు. సురేష్ బాబుతో కలిసి కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు.
NEWS HAPPENINGS
LIFE style
HOT SPICY
అగ్ర దర్శకుడు శంకర్ కొంత కాలంగా ఫామ్
కోల్పోయాడు అనే చెప్పాలి. అసలు ప్లాప్ అన్నదే ఎరుగని శంకర్ తన సత్తాకు తగ్గ చిత్రాన్ని మాత్రం ఈ మధ్య అందించలేకపోతున్నాడు.
CHIT CHAT PA
భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోన్న ఇండియన్ 2 లీగల్ చిక్కుల్లో ఇరుక్కుపోయి ఆగిపోయింది. శంకర్ ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రంపై ఫోకస్ పెట్టాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో శంకర్ పనిచేయనున్న సంగతి తెల్సిందే. టాప్ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసమే శంకర్ హైదరాబాద్ చేరుకున్నాడట. నిర్మాతతో షూటింగ్ షెడ్యూల్స్, లొకేషన్స్, కాస్టింగ్ తదితర అంశాల మీద విరివిగా చర్చలు జరుపుతున్నాడట. రికార్డ్ టైమ్ లో ఈ చిత్రాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాడు శంకర్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే. సాయి మాధవ్ బుర్రా తెలుగు వెర్షన్ కు డైలాగ్స్ రాయనున్నాడు.
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON మెగాస్టార్
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
చిరంజీవి నుండి సినిమా వచ్చి రెండేళ్లు కావొస్తోంది. సైరా నరసింహారెడ్డి తర్వాత గ్యాప్ తీసుకున్న చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే పలు మార్లు వాయిదా పడుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. చిరంజీవి ఆచార్య తర్వాత ఇప్పటికే లూసిఫెర్ ను లైన్లో పెట్టాడు. అయితే దాని తర్వాత చిత్రానికి కూడా సన్నాహాలు మొదలైపోయాయి. బాబీ
దర్శకత్వంలో కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చేయనున్నాడు చిరు. ఈ సినిమాలో చిరు డ్యూయల్ రోల్ పోషించనున్నాడని తాజాగా ఒక న్యూస్ బయటకు వచ్చింది. అయితే చిరంజీవికి డ్యూయల్ రోల్ చేయడం కొత్తేమి కాదు. గతంలో చాలా సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసాడు. ఈసారి తండ్రీ కొడుకులుగా చిరంజీవి ద్విపాత్రాభినయం చేస్తాడని అంటున్నారు. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగక తప్పదు.
N GHT Life trade GUIDE
My CHOICE QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం అత్యంత బిజీగా
ఉంటున్నాడు. ఏకంగా నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నాడు. రీసెంట్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తోన్న ప్రాజెక్ట్ కె షూటింగ్ మొదలైంది. హైదరాబాద్ లో షార్ట్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అమితాబ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ కె లో సమంత కీలక
LittleStar
పాత్ర పోషిస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని సమాచారం. ప్రాజెక్ట్ కె లో ఇంకా ఎవరినీ అధికారికంగా తీసుకోలేదు. అలాగే మలయాళ నటుడు పృథ్వీరాజ్ ఈ సినిమాలో నటించేది కూడా ఒట్టి రూమర్. బాలీవుడ్ టాప్ నటి దీపికా పదుకోన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రాజెక్ట్ తో పాటు ప్రభాస్ రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ చిత్రాలను కూడా చేస్తోన్న విషయం తెల్సిందే.
AUGUST, 2021 b టాలీవుడ్ z 21
NEWS HAPPENINGS
సంగీత
దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ కొంచెం స్లో అయినట్లు కనిపిస్తున్నా కొన్ని ఆసక్తికర సినిమాలను అయితే చేస్తున్నాడు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శర్వానంద్ దేవికి సోషల్ మీడియాలో వెల్కమ్ చెప్పాడు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ రెస్పాండ్ అయ్యాడు. “థాంక్యూ డియర్ బ్రదర్ శర్వానంద్. కిషోర్ తిరుమల నరేట్ చేసిన స్క్రిప్ట్ హిలేరియస్ గా
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
ఉంది. అలాగే ఎంటర్టైనింగ్, రొమాంటిక్, టచింగ్ గా ఉంది. అదరగొడదాం శర్వా” అని ట్వీట్ చేసాడు. శర్వానంద్ తో కలిసి దేవి పనిచేయడం ఇదే తొలిసారి. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో శర్వానంద్ కీలక పాత్ర పోషించాడు. దీనికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడన్న విషయం తెల్సిందే. ఆడవాళ్లు మీకు జోహార్లు చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోన్న విషయం తెల్సిందే. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ మొదలైంది.
BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology
top
N GHT Life
trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
మాస్
మహారాజా రవితేజ క్రాక్ సినిమాతో సూపర్ డూపర్ హిట్ సాధించి తిరిగి ఫామ్ లోకి వచ్చిన విషయం తెల్సిందే. క్రాక్ తర్వాత షార్ట్ గ్యాప్ లో ఖిలాడీ చిత్రాన్ని మొదలుపెట్టాడు. జెట్ స్పీడ్ లో ఈ సినిమా షూటింగ్ ను దాదాపు చేసాడు. తాజా సమాచారం ప్రకారం ఖిలాడీ చిత్ర లాస్ట్ షెడ్యూల్ ను దుబాయ్ లో ప్లాన్ చేసారు. అక్కడ రెండు సాంగ్స్, కొన్ని కీలకమైన సన్నివేశాలను షూట్ చేయాలని అనుకున్నారు. అక్కడ యూఏఈ ప్రభుత్వ అధికారులు కోవిడ్ 22 z టాలీవుడ్ b AUGUST, 2021
పరిస్థితి కారణంగా షూటింగుల నిమిత్తం పెర్మిషన్స్ ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఖిలాడీ షెడ్యూల్ లో మార్పులు జరిగాయి. హైదరాబాద్ లోనే భారీ సెట్ వేసి షూటింగ్ ను కొనసాగిస్తారు. అయితే రవితేజకు సంబంధించి కొన్ని సన్నివేశాలను మాత్రం దుబాయ్ లోనే ముందు అనుకున్న పద్దతి ప్రకారమే షూటింగ్ చేస్తారట. కథ ప్రకారం రవితేజ ఈ చిత్రంలో దుబాయ్ నుండి వచ్చే వ్యక్తిగా కనిపిస్తాడట. రమేష్ వర్మ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఉస్తాద్
రామ్ పోతినేని తన నెక్స్ట్ సినిమా విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. రెడ్ యావరేజ్ తో సరిపెట్టుకోవడంతో రామ్ ఈసారి కచ్చితంగా హిట్ కొట్టాలనుకుంటున్నాడు. తమిళ దర్శకుడు లింగుసామితో కలిసి సినిమా చేస్తున్నాడు రామ్. ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. దీని షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగం సాగుతోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కొక్క విషయం బయటకు వస్తోంది. ఉప్పెన ఫేమ్
కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక తాజాగా ఈ చిత్రంలో విలన్ గా ఆది పినిశెట్టి నటిస్తున్నట్లు కన్ఫర్మ్ అయింది. ఈ విషయాన్ని టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఆది గతంలో సరైనోడు చిత్రంలో విలన్ గా చేసాడు. దానికి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. మరోసారి విలన్ గా ఏ మేరకు ఇంప్రెస్ చేస్తాడో చూడాలి. శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
TOLLYWOOD.NET AUGUST 2021 | VOL 18 | ISSUE 08 | Rs.20/-
/tollywood
RNI NO: APTEL/2003/10076 AUGUST 2021 VOL:18 ISSUE:08 Rs.20/- TOLLYWOOD TELUGU MONTHLY MAGAZINE
/tollywood