Tollywood Magazine Telugu July - 2015

Page 1

JULY 2015 VOL 12 ISSUE 7

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET








తె

లుగులో కంటే తమిళం లోనే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హాట్ భామ స్వాతి కి ఇప్పుడు అవకాశాలు జోరందుకున్నాయి. స్వామి రారా , కార్తికేయ వంటి వరుస హిట్స్ తో మంచి జోరుమీదుంది స్వాతి. ఇటు తెలుగుతో పాటు అటు తమిళం లోను వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. లేటెస్ట్ గా స్వాతి కి ఓ మంచి అవకాశం దక్కింది. ఆర్య హీరోగా రూపొందే యత్తాన్ అనే చిత్రం లో ఈమె హీరోయిన్ గా ఎంపికయింది. దాంతో పాటు మరో క్రేజీ చిత్రం లో కుడా అవకాశం ఉందంటూ .. తెగ మురిసిపోతుంది.






మి

ల్కీ బ్యూటీ తమన్నా కు తాజాగా బాహుబలి వల్ల బుద్ది వచ్చిందట ! ఎందుకంటే ఇన్నాళ్ళు బాలీవుడ్ లో జెండా పాతాలని పాపం ఈ భామ బాలీవుడ్ బాట పట్టినప్పటికీ అక్కడ పరాజయమే ఎదురయ్యింది కానీ ప్రాంతీయ భాషా చిత్రమైన బాహుబలి వల్ల నేడు ప్రపంచ వ్యాప్తంగా తమన్నా పేరు మారుమోగిపోతోంది . దాంతో నాకు బుద్ది వచ్చిందని ఇకపై దక్షినాది సినిమాలపైనే ద్రుష్టి పెడతానని అంటోంది మిల్కీ బ్యూటీ . బాహుబలి ప్రచారం కోసం ముంబై బాట పట్టిన ఈ భామ కు అక్కడ నీరాజనాలు అందుతుండటం తో సంతోషంగా ఉంది . Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JULY 2015

టాలీవుడ్ P 3




షూ

టింగ్ లో గాయాలు కావడం కామన్ అయిపొయింది హీరో అజిత్ కు . ఇప్పటివరకు ఈ తమిళ హీరోకు లెక్కలేనన్ని దెబ్బలు తగిలాయి కానీ



వాటిని లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొనడం మూమూలు విషయం అయ్యింది . తాజాగా అజిత్ కు మరోసారి షూటింగ్ లో గాయాలు అయ్యాయి కానీ వాటిని లెక్కచేయకుండా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ షూటింగ్ లో పాల్గొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు . శివ దర్శకత్వం వహిస్తున్న ఈ తమిళ చిత్రాన్ని ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు . కాగా యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో అజిత్ కంఠానికి దెబ్బలు తగిలాయి .



 ఒ

కప్పటి బాలీవుడ్ స్టార్ హీరో గోవిందా కూతురు టీనా అహుజా ''సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ '' చిత్రంతో బాలీవుడ్ కు పరిచయం అవుతోంది . పెళ్ళైన ప్రతీ మగాడు కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ మరో ఆడదాని ప్రేమలో పడతాడనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో సీనియర్ హీరో సుమీప్ కంగ్, నిజ జీవితంలో కూడా నిజంగానే సెకండ్ హ్యాండ్ హజ్బెండ్ అయిన ధర్మేంద్ర నటిస్తున్నాడు . టీనా అహుజా కు ఇది తొలి సినిమా కాబట్టి చాలా టెన్షన్ గా ఉందట సినిమా రిజల్ట్ విషయంలో . నేను 2013లోనే సినిమాల్లోకి రావాల్సి ఉండే కానీ అనుకోని అవాంతరాల వల్ల ఆలస్యం అయ్యింది . మొత్తానికి ఈ చిత్రంతో వస్తున్నాను తప్పకుండా హిట్ సాధిస్తాననే నమ్మకం ఉందన్నారు టీనా .

4 P టాలీవుడ్


p

మద్య నాని హీరోగా నటించిన పైసా సినిమాలో నటించిన హాట్ భామ కాథరిన్ త్రేసా. ఆ తరువాత ఎన్నో సినిమాలలో నటించిన కూడా పాపం ఈ భామకు సరైన కమర్షియల్ సక్సెస్ రాలేదు. ఆ తరువాత తమిళ , మలయాళ భాషల్లో ప్రయత్నాలు మొదలు పెట్టిన ఈ అమ్మడికి ఇప్పుడు కోలీవుడ్ లో మంచి క్రేజీ దక్కింది. లేటెస్ట్ గా శింబు హీరోగా నటిస్తున్న కాన్ అనే సినిమాలో హీరోయిన్ గా ఎంపికయింది. తాప్సి ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా ఎంపికయింది. మరి ఈ సినిమాతో ఈ భామకు ఎలాంటి కమర్షియల్ బ్రేక్ ఇస్తుందో చూడాలి ?

 

  టాలీవుడ్ P 5






బా

హుబలి కోసం విలువైన మూడేళ్ళ కాలాన్ని కేటాయించిన ప్రభాస్ తాజాగా స్పీడ్ ని పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే సుజిత్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభాస్ ఆ చిత్రం కాస్త ఆలస్యం అవుతుండటం తో శ్రీను వైట్ల తో మరో చిత్రం చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి . ఆగడు చిత్రానికి ముందు శ్రీను వైట్ల అగ్ర దర్శకుల జాబితాలో ఉండేవాడు కానీ ఆగడు పెద్ద డిజాస్టర్ కావడంతో దానికి తోడూ పలు వివాదాలు చుట్టుముట్టడంతో నీలి నీడలు కమ్ముకున్నాయి . అయితే అవి త్వరగానే పటాపంచలు అయి ప్రస్తుతం చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు శ్రీను వైట్ల . దాని తర్వాత ప్రభాస్ తో సినిమా చేయనున్నారని తెలుస్తోంది .

 

సం

పత్ నంది దర్శకత్వంలో ప్రారంభం కావాల్సిన గబ్బర్ సింగ్ 2 మరో దర్శకుడి చేతిలోకి ప్రాజెక్ట్ వెళ్ళడానికి కాలం ,పరిస్థితులే తప్ప మరో కారణం లేదని పైగా మీడియా అనుకుంటున్నట్లుగా అస్సలు కారణం కాదని అంటున్నాడు ప్రస్తుతం రవితేజతో బెంగాల్ టైగర్ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంపత్ నంది . అయితే త్వరలోనే పవన్ తో సినిమా చేస్తానని చెబుతున్నాడు సంపత్ నంది .గబ్బర్ సింగ్ 2 చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ రాగానే ఎగిరి గంతేశాడు కానీ పరిస్థితులు అనుకూలించకపోవ డంతో ఆ చిత్రం చేజారింది అదే సమయంలో రవితేజ సంపత్ నందికి అవకాశం ఇచ్చాడు . సెప్టెంబర్ 18న బెంగాల్ టైగర్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

6 P టాలీవుడ్




 మె

గా హీరోలైన రామ్ చరణ్ తేజ్ ,నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ల మద్య దసరా కు భీకర పోరు సాగనుందా అంటే ప్రస్తుత పరిస్తితులైతే అవుననే అంటున్నాయి . ఎందుకంటే చరణ్ ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . ఆ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి ముందుగానే ప్లాన్ చేసుకున్నారు కాగా పూరి జగన్నాద్ కాంబినేషన్ లో వరుణ్ నటించబోయే లోఫర్ షూటింగ్ జూలై నుండి జరుగనుంది కాగా ఆ చిత్రాన్ని కూడా దసరా కే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు . దాంతో ఇద్దరు మెగా హీరోలు అందునా అన్నాదమ్ములు అయిన చరణ్ - వరుణ్ ల మద్య భీకర పోరు సాగడం ఖాయం . అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు రాజీ పడక తప్పదు ఎందుకంటే ఒకేసారి ఇద్దరి చిత్రాలు వస్తే మెగా అభిమానులకు ఇబ్బంది తప్పదు కాబట్టి నాగబాబు చొరవ తీసుకొని ఆ పోటీ తప్పించి మార్గాన్ని సుగమం చేస్తాడో లేక పోటీ లోకి దింపుతాడో చూడాలి .

టాలీవుడ్ P 7






 ద

శాబ్దం క్రితం మహేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి తర్వాత నెంబర్ వన్ హీరో అంటూ ఎవరూ ఉండరని ,చిరంజీవితోనే అది లాస్ట్ అని ఆ తర్వాత నెంబర్ గేమ్ అన్నది తాత్కాలికంగా మారుతూనే ఉంటుంది తప్ప ఇక నెంబర్ వన్ హీరో అంటూ ఎవరూ ఉండరని అన్నారు . మహేష్ అప్పుడు అలా చెప్పినప్పుడు ఏమో అనుకున్నారు కానీ పదేళ్ళ క్రితం మహేష్ చెప్పిందే నిజం అయ్యింది . చిరంజీవి తర్వాత ఇప్పటి వరకు నెంబర్ వన్ హీరో అంటూ ఎవరినీ చెప్పలేం ఎందుకంటే ఒక్కో సంవత్సరం ఒక్కో హీరో బ్లాక్ బస్టర్ ఇచ్చి నెంబర్ వన్ హీరో అనిపించు కుంటున్నారు . ఇదొక కుర్చీలాట లాగ మారింది . చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళాక పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు లు ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లుగా బాక్సాఫీస్ పై దండెత్తుతున్నారు కానీ నెంబర్ వన్ పై ఎవరో ఒకరు మాత్రం పట్టు సాధించడం లేదు . ఇప్పటికి కూడా నెంబర్ వన్ పీఠం ఖాళీగానే ఉంది. పవన్ - మహేష్ లు ఆ పీఠం కోసం పోరాడుతూనే ఉన్నారు . మరి ఎవరిని వరిస్తుందో ఆ పీఠం .

8 P టాలీవుడ్


 

సె

క్సీ భామ పూనం పాండే యోగా పేరుతో ఆసనాలు అంటూ వేస్తూ ఓ వీడియో ని రూపొందించింది అయితే అవి యోగ ఆసనాలు అని మాత్రం ఖచ్చితంగా చెప్పలేం అయితే ఆ పేరుతో మాత్రం అందాలను ఆరబోస్తూ కుర్రకారుకి మంచి పసందుని అందించింది . యోగా డే కావడంతో తను మళ్ళీ లైం లైట్ లోకి రావడానికి ఈ ప్రయత్నాలు చేసింది పూనం . స్తన ద్వయం బయటకి తొంగి చూస్తుంటే వాటి పొంగులను మరింతగా ఉబికి వచ్చేలా చేస్తూ చేసిన యోగ వీడియో తో కొంతవరకు ఆకట్టుకుంటోంది . అయితే ఈ భామ చేసిన ఫీట్ లన్నీ యోగ అంటే డౌట్ వస్తోంది .

టాలీవుడ్ P 9




 చి రంజీవి ముఠా మేస్త్రి గా ప్రేక్షకులను మెప్పిస్తే తనయుడు చోటా మేస్త్రి గా అలరించడానికి రెడీ అవుతున్నాడు . రచ్చ తో హిట్ కొట్టిన సంపత్ నంది మళ్ళీ చోటా మేస్త్రి గా చరణ్ ని చూపించడానికి రెడీ అవుతున్నాడు . ఇప్పటికే చరణ్ ని కలిసి అవుట్ లైన్ వినిపించినట్లు తెలుస్తోంది . ప్రస్తుతం సంపత్ నంది రవితేజ తో బెంగాల్ టైగర్ చిత్రాన్ని చేస్తున్నాడు ,అలాగే చరణ్ కూడా శ్రీను వైట్ల దర్శకత్వం లో సినిమా చేస్తూ బిజీ గా ఉన్నాడు దసరా నాటికీ ఈ ఇద్దరూ ఖాళీ అవుతారు కాబట్టి అప్పుడు మళ్ళీ ఇద్దరూ కలిసి చోటా మేస్త్రి కోసం పని చేయనున్నారు అని తెలుస్తోంది . తండ్రి ముఠా మేస్త్రి కాగా తనయుడు చోటా మేస్త్రి గా మెగా అభిమానులను అలరించడానికి సన్నాహాలు చేస్తున్నారు .

 

 బా

హుబలి చిత్రంతో రాజమౌళి పేరు ప్రఖ్యాతులు మారుమ్రోగుతున్నాయి ,దాంతో చైనా సినిమా చేసే అవకాశం వచ్చింది జక్కన్న కు కానీ ప్రస్తుతం బాహుబలి తో బిజీ గా ఉన్నందున ఆ అవకాశాన్ని తిరస్కరించాడు . బాహుబలి రెండు భాగాలుగా వస్తున్న నేపథ్యంలో జూలై 10న మొదటి భాగం వస్తుంది ఇక రెండో భాగాన్ని కూడా పూర్తిచేసి రిలీజ్ చేసాకే నేను మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని బదులిచ్చారు రాజమౌళి . హాలీవుడ్ లో చాన్స్ వచ్చిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తనకు హాలీవుడ్ లో చాన్స్ రాలేదని కానీ చైనా సినిమాకు దర్శకత్వం చేసే అవకాశం వచ్చిందని చెప్పారు జక్కన్న . విజువల్ వండర్ గా తెరకెక్కిన బాహుబలి చిత్రం రిలీజ్ అయ్యాక జక్కన్న కు మరెన్ని అవకాశాలు రానున్నాయో చూడాలి .

10 P టాలీవుడ్






ప్ర

భాస్ కు భయం పట్టుకుందట ,భారీ బడ్జెట్ తో దాదాపు మూడేళ్ళ కు పైగా తన విలువైన సమయాన్ని బాహుబలి కోసం కేటాయించిన ప్రభాస్ కు ఇప్పుడు భయం పట్టుకుంది ఎందుకంటే అహోరాత్రులు శ్రమించి ,ఎన్నో కష్టాలను ఎదుర్కొని చేసిన బాహుబలి త్వరలో రిలీజ్ కు సిద్దం అయ్యింది దాంతో దాని రిజల్ట్ ఎలా ఉంటుందో అని తెగ భయపడిపోతున్నాడు ప్రభాస్ . బాహుబలి చిత్రంలో తండ్రీ కొడుకులుగా నటించాడు ప్రభాస్ . రెండు పాత్రల కోసం ,వాటిలో వేరియేషన్స్ చూపించడానికి బాగా శ్రమించాడట . అయితే సక్సెస్ అయినప్పుడు ఆ కష్టం మొత్తం మర్చిపోతారు కానీ ఇంకా రిలీజ్ కాలేదు కదా అందుకే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో నని తెగ ఆరాట పడుతున్నాడట ప్రభాస్ . ఇప్పటికే రిలీజ్ కు ముందే పలు సంచలనాలను నమోదు చేసిన బాహుబలి తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు .

టాలీవుడ్ P 11




ఆం

ధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కొనసాగుతారని అంతేతప్ప ఓటుకి నోటు వ్యవహారంలో బాబుకి ఏమి కాదని ఆయనే ముఖ్యమంత్రి గా సుపరిపాలన అందిస్తాడని నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని అలా వస్తున్న వార్తలన్నీ వాస్తవం కాదని అన్నారు నందమూరి బాలకృష్ణ . ఓటుకి నోటు వ్యవహారం గత 20రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అవుతుండటంతో బాబు జైలుకి వెళ్ళడం ఖాయమని బాలయ్య ముఖ్యమంత్రి కావడం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఖండించాడు బాలయ్య .

 

స్వ

చ్చ హైదరాబాద్ అంటూ హైదరాబాద్ ని విశ్వ నగరంగా తీర్చి దిద్దడానికి ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇక పాడైపోయిన సినిమా బస్తీ ని కూడా బాగు చేస్తానని మాటిచ్చారు . హైదరాబాద్ లో జరిగిన బస్తీ ఆడియో వేడుకలో పాల్గొన్న కేసిఆర్ తెలుగు సినీ ప్రముఖులు దాసరి నారాయణరావు ,శంకర్ ల సూచన మేరకు తప్పకుండా త్వరలోనే సినిమా ప్రముఖులతో సమావేశం ఏర్పాటుచేసి ఫిలిం నగర్ 2 కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు కేసిఆర్ . చిన్న నిర్మాతలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది కాబట్టి పాడైపోయిన సినిమా బస్తీ ని కాపాడమని కోరారు .

12 P టాలీవుడ్


  సం

తూర్ యాడ్ ఎప్పటికి ప్రేక్షకుల మదిలో చెరిగిపోనిది అని చెప్పవచ్చు . అంతలా జనాల హృదయాల్లో హత్తుకుపోయింది ఆ యాడ్ . ఇక అసలు విషయానికి వస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఓ బిడ్డ కు తల్లి అయినప్పటికీ ఇంకా పెళ్లి కానీ అమ్మాయిలా దర్శనం ఇస్తోంది . ఇటీవల లక్ష్మీ ప్రణతి వెస్ట్రన్ వేర్ లో దర్శనం ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది . ఆమెని చూస్తే లక్ష్మి కి ఇంకా పెళ్లి కాలేదేమో అనిపించేలా కనిపించే సరికి అందరూ అవాక్కయ్యారు . ఇంకా కాలేజ్ అమ్మాయిలా కనిపిస్తోంది లక్ష్మి ప్రణతి .



 సి

నిమా అవార్డుల విషయంలో ఇటీవల సీనియర్ హీరోలను పెద్దగా పట్టించుకోవడం లేదు కానీ టి. సుబ్బరామిరెడ్డి మాత్రం సీనియర్ హీరోలకు గౌరవం ఇస్తున్నాడు . తాజాగా టివి 9 తో కలిసి సుబ్బరామిరెడ్డి అవార్డులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నాడు . ప్రతీ ఏటా నిర్వహించే ఈ అవార్డుల కార్యక్రమంలో ఈ సంవత్సరం మొత్తం కూడా ఉత్తమ నటుడు కేటగిరీ లలో సీనియర్ హీరోలైన బాలకృష్ణ (లెజెండ్ )నాగార్జున ( మనం ) వెంకటేష్ (దృశ్యం ) మోహన్ బాబు (రౌడీ ) లతో పాటు రవితేజ (పవర్ ) లను కూడా తీసుకున్నాడు . ఇక ఉత్తమ నటుడు అవార్డ్ ఈ హీరోలలో ఎవరో ఒకరిని వరించనుంది . పలు సంస్థలు సీనియర్ హీరోలను పక్కన పెడుతుండటంతో టిస్సార్ నిర్ణయంతో సీనియర్ హీరోల అభిమానులు సంతోషంగా ఉన్నారు .



టాలీవుడ్ P 13


  

క్త కన్నప్ప అజరామరంగా నిలిచి కృష్ణంరాజు కు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తీసుకొచ్చింది కానీ అదే కన్నప్ప చిత్రం తాజాగా వివాదాలను రాజేస్తోంది . ఎందుకంటే భక్త కన్నప్ప చిత్రాన్ని ప్రభాస్ చేయాలనీ కృష్ణంరాజు భావిస్తున్నాడు కాగా అదే కథతో ఓ చిత్రం చెయ్యాలని తనికెళ్ళ భరణి భావించాడు కానీ అది వర్కౌట్ కాలేదు తాజాగా మంచు విష్ణు తో అది సెట్ అయ్యింది దాంతో కృష్ణంరాజు కు కోపం వచ్చిందట . భక్త కన్నప్ప నేను చెయ్యాలి లేదా ప్రభాస్ చేయాలి కానీ మరెవరో ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నాడట దాంతో భక్త కన్నప్ప షూటింగ్ కు ముందే పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి . ఇప్పటికే ప్రభాస్ బాహుబలి కోసం మూడు సంవత్సరాలు కేటాయించాడు ఇక ఇప్పుడప్పుడే భక్త కన్నప్ప చిత్రం చేయడానికి సిద్దంగా లేడు . కానీ పెదనాన్న మాటను కూడా కాదనలేడు కాబట్టి ప్రభాస్ భక్త కన్నప్ప గా కనిపించడం ఖాయం అయితే అది ఎప్పుడు అనేది తేలాల్సి ఉంది .







హేష్ నైజాం లో మరో సరికొత్త రికార్డ్ నెలకొల్పాడు . మహేష్ తాజా చిత్రం శ్రీమంతుడు చిత్రానికి 14కోట్ల 40 లక్షలు ఇచ్చి నైజాం హక్కులను సొంతం చేసుకున్నారు అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ . బాహుబలి మినహా మరే తెలుగు చిత్రం ఇంత భారీ మొత్తం అందుకోలేక పోయింది . మహేష్ చిత్రానికి ఎక్కడా లేని క్రేజ్ రావడంతో ఇంత భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్దం అయ్యాడు అభిషేక్ . కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈనెల 27న షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకోనుంది . ఆగష్టు 7న శ్రీమంతుడు చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . భారీ విజయం సాధిస్తుందన్న నమ్మకంతో ఇంత మొత్తాన్ని చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నాడు అభిషేక్

14 P టాలీవుడ్




 p

వన్ కళ్యాణ్ , మహేష్ బాబు లు ఖాళీ లేకపోవడంతో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు దర్శకులు త్రివిక్రమ్ . ఆ చిత్రంలో సమంత అయితే బాగుంటుందని భావించాడు త్రివిక్రమ్ ఇక అదే వార్తలు కూడా వచ్చాయి సమంత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతోంది అని . కానీ సమంత మాత్రం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించడం లేదని తేల్చి చెప్పింది . ప్రస్తుతం తమిళ చిత్రాలతో బిజీ గా ఉన్న సమంత తాజాగా మహేష్ బాబు తో బ్రహ్మోత్సవం చిత్రంలో నటించడానికి పచ్చ జెండా ఊపింది . ఇలా వరుస చిత్రాలతో సమంత బిజీ గా ఉండటంతో త్రివిక్రమ్ చిత్రం చేయడం లేదు పైగా త్రివిక్రమ్ ఇంకా సమంత ని కలిసి కథ కూడా చెప్పలేదట .

టాలీవుడ్ P 15


 లాహిరి లాహిరి లాహిరిలో చిత్రం నుంచ ఇప్పటివరకు ఎన్నో చిత్రాల్లో నటించి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య ఓం తన స్వీయ దర్శకత్వంలో ‘ఫ్రెండ్‌రిక్వెస్ట్’‌ పేరుతో తెలుగు, హిందీ భాషల్లో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ఒక ప్రముఖ పాత్రలో కూడా ఆదిత్య ఓం నటిస్తున్నారు. మోడరన్‌ సినిమా పతాకంపై ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ ఆవిష్కరణ ఆదివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత ఎ.రమేష్‌ప్రసాద్‌, ప్రముఖ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ, ప్రభుత్వం ఛీఫ్‌ రుద్రరాజు పద్మరాజు ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. పార్లమెంట్‌ సభ్యులు రాయపాటి సాంబశివరావు చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ను ‌ ఆవిష్కరించారు. ఈరోజు ఫాదర్స్‌ డే సందర్భంగా అమ్మా నాన్న ఫౌండేషన్‌ సొసైటీకి సంబంధించిన పోస్టర్‌ని రుద్రరాజు పద్మరాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా.... పార్లమెంట్‌ మెంబర్‌ రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ ‘‘విజయ్‌వర్మ నాకు మిత్రుడు, ఆదిత్య ఓం నాకు తెలుసు. చాలా మంచి నటుడు. అతని డైరెక్షన్‌లో వస్తున్న ‘ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌’ చిత్రం పెద్ద హిట్‌ అయి ఆదిత్య ఓం, విజయ్‌వర్మలకు, చిత్రంలో నటించిన ఇతర నటీనటులకు, టెక్నీషియన్స్‌కి చాలా మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఎ.రమేష్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ పోస్టర్‌ చూస్తుంటే ఇదొక యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద విజయం సాధిస్తుంది. టీజర్‌ రిలీజ్‌ సందర్భంగా అందరికీ నా బెస్ట్‌ విషెస్‌ తెలియజేస్తున్నాను’’ అన్నారు. రుద్రరాజు పద్మరాజు మాట్లాడుతూ ‘‘ఆదిత్య ఓం తెలుగులో చాలా సినిమాలు చేసినవాడు కావడంతో ఇక్కడ సుపరిచితుడే. టీజర్‌ బావుంది. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గానే కాకుండా థ్రిల్లింగ్‌సబ్జెక్ట్‌తో సాగుతుంది. సినిమాటోగ్రఫీ బావుంది. మనవూరి పాండవులు సినిమాలో చిరంజీవిగారు నటించినప్పుడు ఉన్న ఈజ్‌ ఆదిత్య ఓంలో కనపడుతుంది. ఆదిత్య ఓం, విజయవర్మ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా పెద్ద హిట్‌అవుతుందని భావిస్తున్నాను’’ అన్నారు. కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ ‘‘గతంలో నేను ఆదిత్యతో తెలుగు, హిందీలో ఓ సినిమా చేశాను. మంచి

16 P టాలీవుడ్



డేడికేషన్‌ఉన్న నటుడు. ఈ మధ్య హర్రర్‌మూవీలన్నీ మంచి విజయాలను సాధిస్తున్నాయి. అదే బాటలో ఈ సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని యూనిట్‌ను అభినందిస్తున్నాను’’ అన్నారు. ఆదిత్యా ఓం మాట్లాడుతూ ‘‘అనేక కష్టాలు దాటి డేడికేషన్‌తో ఈ సినిమాని పూర్తి చేశాం. దర్శక, నిర్మాతగా మా సబ్జెక్పై ట్‌ ఉన్న నమ్మకంతో సినిమా పెద్ద హిట్టవుతుందని గ్యారంటీగా చెబుతున్నాను. కొత్త నటీనటులు, టెక్నిషియన్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాను. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. అందరికీ థాంక్స్’‌’ అన్నారు. విజయ్‌ వర్మ పాకలపాటి మాట్లాడుతూ ‘‘షూటింగ్‌ పార్ట్‌ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఎడిటింగ్‌, గ్రాఫిక్స్‌ పనులు పూర్తయ్యాయి. జూలైలోపు రీ రికార్డింగ్‌, డి.ఐ సహా అన్నీ పనులు పూర్తి చేసి విడుదలకు ప్లాన్‌చేస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు. ఆదిత్యా ఓం, ప్రకాష్‌, సుదర్శన్,‌ రోహిత్‌, నితేష్‌, మనీషా కేల్కర్‌, రిచాసోని, సాగరిక చేత్రి, శీతల్‌ సింగ్‌, సైదా జూల్‌, టిమ్సీ గౌతమ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: లవన్‌`వీరల్‌, కెమెరా: సిద్దార్థ, ఎడిటింగ్‌: ప్రకాష్‌, నిర్మాణ, నిర్వాహణ: విజయ్‌వర్మ పాకలపాటి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆదిత్యా ఓం


 

నా

గార్జున ద్విపాత్రాభినయం పోషిస్తున్న చిత్రం ''సోగ్గాడే చిన్ని నాయనా ''. కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కు అవకాశం ఇచ్చారు నాగ్ అయితే సినిమా మొత్తం పూర్తయ్యాక రష్ చూసుకుంటే దాదాపు 25 శాతం సినిమా నాగ్ కు నచ్చలేదట దాంతో మళ్ళీ ఆ సన్నివేశాలను రీ షూట్ చేయడానికి సన్నద్ధం అయ్యారట . దర్శకుడు చెప్పిన కథ కు తీసిన సన్నివేశాలకు సంబంధం లేకుండా పోయిందని అందుకే వాటిని మళ్ళీ తియ్యాలని భావించాడు నాగార్జున . రమ్యకృష్ణ ,లావణ్య త్రిపాఠీ నాగార్జున సరసన నటించగా మరదలుగా హాట్ యాంకర్ అనసూయ నటించింది . మొత్తానికి ఈ చిత్రం రిలీజ్ కావాలంటే నాగార్జున పచ్చజెండా ఊపితేనే రిలీజ్ కు రెడీ అవుతుంది . అప్పటివరకు నాగ్ అభిమానులు వెయిట్ చేయాల్సిందే .







సూ

ర్య ....... తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ హీరో తాజాగా మరో సంచలనానికి తెరలేపనున్నాడు . ఇంతకుముందు హరి దర్శకత్వంలో సూర్య నటించిన ''సింగం '' తెలుగు ,తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది దాంతో దానికి సీక్వెల్ గా ''సింగం 2'' తెరకెక్కించారు అది కూడా సూపర్ హిట్ అయ్యింది . మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మూడో వెర్షన్ సింగం 3 ని కూడా తెరకెక్కించడానికి సిద్దం అవుతున్నారు సూర్య -హరి లు . అయితే దక్షినాదిన సీక్వెల్ చిత్రాలు హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ వాటిని సూర్య బ్రేక్ చేసి సక్సెస్ సాధించాడు . తాజాగా మరో సంచలనానికి రెడీ అయ్యాడు సూర్య . సింగం 3లో హీరోయిన్ గా సూర్య సరసన శృతి హాసన్ నటించనున్నట్లు తెలుస్తోంది .

టాలీవుడ్ P 17


  ఆ

శికి 2తో కుర్రకారుని ఓ ఊపు ఊపేసిన భామ శ్రద్దా కపూర్ తాజాగా పిచ్చేక్కించే స్టిల్ ఇచ్చి మతి పోగొడుతోంది . ఈ భామ ఎవరితో నటించినా వాళ్లతో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యేలా చేస్తూ ఓ ఊపు ఊపేస్తున్న శ్రద్దా తాజాగా వరుణ్ ధావన్ తో ఎబిసిడి 2 చిత్రంలో జతకట్టింది . వరుణ్ తో ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ని పండించిందని అంటున్నారు ఇక అందుకు నిదర్శనంగా ఈ ఇద్దరూ కలిసి చేసిన ఫోటో షూట్ సంచలనం రేపుతోంది . వరుణ్ కి అత్యంత సన్నిహితంగా వంటికి వల్లు రాసుకొని పూసుకొని దిగిన ఈ ఫోటోలతో కుర్రకారు పిచ్చేక్కిపోతున్నారు .

18 P టాలీవుడ్


భిమానం మితిమీరడంతో అనుష్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది . తిరుపతి లో జరిగిన బాహుబలి ఆడియో కోసం బాహుబలి యూనిట్ అంతా తిరుపతి చేరుకున్న విషయం తెలిసిందే . తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అనుష్క కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి అభిమానుల కోలాహలం ఎక్కువ కావడంతో ఇక నడక దారి కష్టమని భావించి వెళ్ళింది . ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చిన అనుష్క ను చూడటానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి రావడమే కాకుండా ఆమెని దగ్గరగా చూడటానికి తోసుకుంటూ మీద మీదకు రావడంతో అనుష్క ఇబ్బంది పడింది . ఒకదశలో అనుష్క పై పడిపోయారు కొంతమంది యువకులు దాంతో అనుష్క కు చుక్కలు కనిపించాయి . చివరకు పోలిసుల సహాయంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది .








ప్ర

ముఖ నటి జయసుధ తనయుడు శ్రేయాన్ హీరోగా పరిచయం అవుతూ వజ్మన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వాసు మంతెన స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బస్తీ'. ప్రగతి హీరోయిన్. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లోని శిల్పకలావేదిక లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కె.సి.ఆర్ సిడిని ఆవిష్కరించి తొలి సిడి ని దర్శకరత్న దాసరి నారాయణరావు కు అందించారు. అనంతరం కె.సి.ఆర్ మాట్లాడుతూ.. జయసుధ గారి మీద ఉన్న అభిమానంతో, వాసు మంతెన పై ఉన్న వాత్సల్యంతో నేను ఈ కార్యక్రమానికి విచ్చేసాను. శ్రేయాన్ ను చూస్తుంటే తెలుగు అమితాబచ్చన్ లాగా ఉన్నాడు. తనకు మంచి భవిష్యత్తు ఉండాలి. ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకోవాలి. ఓ అవార్డు కార్యక్రమం కోసం అమితాబ్ గారు హైదరాబాద్ వచ్చినపుడు హైదరాబాద్ లోనే ఎక్కువగా షూటింగ్స్ జరుగుతున్నాయి. బొంబాయి కంటే మహానగరంగా హైదరాబాద్ ను డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై నేను ఇండస్ట్రీకు చెందిన కొందరి పెద్ద వాళ్ళతో మాట్లాడాను. తెలుగు పరిశ్రమను బాగుచేయాలనుకుంటున్నాం. ప్రస్తుతం సినిమా రంగాన్ని విస్తరింపజేయడానికి వీలైనంత త్వరలోనే సమావేశాలను ఏర్పాటు చేయనున్నాం. కేబినేట్ సమావేశాలను నిర్వహించి స్టూడియోలను, ఫిలింనగర్ సొసైటీ లను వినియోగించుకునేలా వెసులుబాటు కల్పించనున్నాం. ఫిలిం నగర్ లాంటి మరో ఫిలిం నగర్2 ను నిర్మించుకుందాం. యాక్టింగ్ కోసం ఎక్కడికో వెళ్లి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇక్కడే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ను స్థాపించుకుందాం. నామినల్ రేట్స్ కే కళాకారులకు ఇళ్ళ స్థలాలను ఇప్పించనున్నాం. తెలంగాణా కళాకారులు ఇప్పటివరకు సినిమాలకు దూరంగా ఉన్నారు. కాని ఇప్పుడు వారు కూడా సినిమాలను నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తరంలోనే నేను సినిమాలను చూసాను అన్నారు. దాసరి నారాయణరావు మాట్లాడుతూ మొదటిసారి కెసిఆర్ గారు సినిమా ఆడియో ఫంక్షన్ కి వచ్చి ఆడియో సిడిను విడుదల చేసారు. కళాకారులను ఎంత గౌరవించాలో తెలిసిన వ్యక్తి. జయసుధ 43 ఏళ్ళ కెరీర్ లో నేను చేసిన 27 సినిమాలో నటించింది. వాసు మంతెన ఒకసారి నన్ను కలిసాడు. ఆ పరిచయంలో తన క్రియేటివిటీ ఏంటో అర్ధమయ్యింది. తన దర్శకత్వంలో ఈ సినిమా బాగా వచ్చిందనుకుంటున్నాను. కొన్ని క్లిప్పింగ్స్ చూసాను. శ్రేయాన్ అధ్బుతంగా నటించాడు. సినిమా బస్తీ పాడైపోయింది. చిన్న నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. బస్తీ లను బాగు చేస్తున్న






కెసిఆర్ గారే సినిమా ఇండస్ట్రీని బాగు చేయాలి అన్నారు. మోహన్ బాబు మాట్లాడుతూ .. పోరాటయోదుడు కెసిఆర్ మొదటిసారిగా చలన చిత్ర వేదికపైకి వచ్చారు. సినిమా పరిశ్రమ గర్వపడాల్సిన విషయం. ఆయన ఆలోచనలన్నీ నిజమైతే దేశంలోనే గొప్ప ముఖ్యమంత్రిగా నిలుస్తారు. నా చెల్లెలు జయసుధ కుమారుడు నటిస్తున్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి అన్నారు . జయసుధ మాట్లాడుతూ.. నా కొడుకు శ్రేయాన్ మొదటిసారిగా హీరోగా నటిస్తున్నాడు. తనొక స్పోర్ట్స్ పర్సన్. సినిమాలలోకి వస్తాడనుకోలేదు. సినిమా కథ చాలా సింపుల్ గా ఉండాలనుకున్నాం. మేము అనుకున్నట్లుగానే వాసు మంచి స్టోరీ ఇచ్చారు. అన్నారు.


 

సా

క్షి చౌదరి జేమ్స్ బాండ్ గా వస్తోంది . అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ''జేమ్స్ బాండ్ '' నేను కాదు నా పెళ్ళాం చిత్రంలో జేమ్స్ బాండ్ గా నటించింది . పిక్కల బలాన్ని చూపిస్తూ కుర్రకారు కి పిచ్చేక్కిస్తోంది సాక్షి . అందాలతో పందెం వేస్తూ తెలుగుతెరపై ఓ వెలుగు వెలగాలని భావిస్తోంది అందుకే అందాల ప్రదర్శనకు ఏమాత్రం అడ్డు చెప్పకుండా ఎక్స్ పోజింగ్ కు సై అంది . లేలేత అందాలను చూపిస్తూ ప్రేక్షకులను మైమరిచిపోయేలా చేస్తోంది . మంచి ఒడ్డు పొడవున్న ఈ భామ అందాలను అడ్డు చెప్పకుండా ప్రదర్శించి టాప్ రేంజ్ కి వెళ్ళాలని ఆశిస్తోంది చూడాలి మరి ఈ భామ ఆశ నెరవేరుతుందా ? సాక్షి అందాలకు మనోళ్ళు ఫిదా అవుతారా ? లేదా ? అన్నది .


 

మిళ కుర్ర డైరెక్టర్ తో గుండెలకు తన గుండెలను అనిచ్చి ఫోటోలకు ఫోజిచ్చి ఇప్పుడేమో ఏమి తెలియనట్లు నంగనాచి ముఖం పెడుతోంది హాట్ భామ నయనతార . సోషల్ మీడియాలో విజ్ఞేశ్ తో నయనతార కలిసి దిగిన ఫోటో సంచలనం సృష్టిస్తోంది . ఆమధ్య ఈ ఇద్దరూ కలిసి రహస్య ప్రదేశానికి వెళ్లి బాగా ఎంజాయ్ చేసి వచ్చారని పుకార్లు షికారు చేసాయి కానీ వాటిని వెంటనే ఖండించింది నయనతార . కానీ అప్పటి ఫోటోలు తాజాగా నెట్ లో దర్శనం ఇస్తుండటం తో ఇక ఇప్పుడేమి చెప్పాలో తెలియడం లేదు నయన్ కి . ఈ ఫోటోలో నయనతార దర్శకులు విజ్ఞేశ్ ని బాగా హత్తుకొని తన గుండె చప్పుడు ని అతడి గుండె కి వినిపిస్తోంది

టాలీవుడ్ P 23


 

సి







మెరికాలోని అయిదు నగరాల్లో డ్యాన్స్ షోలలో పాల్గొంటే అది కూడా వారం రోజులకే 12కోట్లు ఇస్తామని ముంబై కి చెందిన ఏజెన్సీ వాళ్ళు హీరో అల్లు అర్జున్ కు ఆఫర్ ఇచ్చినప్పటికీ అందుకు నో చెప్పాడట . అంత పెద్ద మొత్తం అది కూడా వారం రోజులకే వస్తున్నప్పుడు ఎవరైనా సరే దానికి ఒప్పుకొని 12కోట్ల భారీ మొత్తాన్ని అందు కుంటారు కానీ బన్నీ మాత్రం అందుకు తిరస్కరించాడు . ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది . అయితే బన్నీ ఇంత పెద్ద మొత్తాన్ని వదులుకోవడానికి కారణం ఏంటంటే ........... అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్ అయినప్పటికీ లైవ్ ప్రోగ్రాం ఇవ్వడం ఇష్టం లేకపోవడమే .

24 P టాలీవుడ్

నిమా రంగం వారసుల రాజ్యం అన్న విషయం తెల్సిందే . ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఉన్న వారసుల రాజ్యంలోకి మరో వారసుడు రాబోతున్నాడు . డ్యాన్సర్ గా సినీ రంగంలోకి ప్రవేశించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు హీరోగా ,దర్శకుడిగా సక్సెస్ అయిన విషయం తెలిసిందే . తాజాగా లారెన్స్ తమ్ముడు ఎల్విన్ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇప్పటికే కాంచన 2లో ఓ పాటలో లారెన్స్ తో కలిసి ఆడి పాడిన ఎల్విన్ ప్రేక్షకులకు పరిచయమే అయితే హీరోగా ఎల్విన్ ని నిలబెట్టాలని లారెన్స్ ప్రయత్నాలు చేస్తున్నారు . మరి ఎంతవరకు సక్సెస్ అవుతాడో చూడాలి .


   ని

తిన్ ఇమేజ్ ని డ్యామేజ్ చేసి కొంప అంటుకున్నాక తను చేసిన తప్పు తెలుసుకొని పెద్ద సారీ చెప్పేసింది ఛార్మి . నితిన్ - పూరి కాంబినేషన్ లో రూపొందబోయే చిత్రానికి నితిన్ నిర్మాత గా అనుకున్నారు అయితే అదే సమయంలో అఖిల్ హీరోగా వివివినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే దాంతో ఆ సినిమాకే మొత్తం డబ్బులు పెట్టడంతో వాళ్ళ దగ్గర డబ్బులు లేవని అందుకే నితిన్ తో పూరి చేసే సినిమా క్యాన్సిల్ అయ్యిందని ఛార్మి మీడియాకి అధికారికంగా చెప్పేసింది . అసలు ఆమెకి ఈ సినిమాకి సంబంధమే లేదు అటువంటప్పుడు తెలీదు అని చెప్పాలి కానీ పేటెంట్ ఉన్నట్లు చెప్పేసి నితిన్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత ఓ సారీ పడేసింది . ఇలా చేయడం నీకిది తగునా ఛార్మి .

టాలీవుడ్ P 25


     

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఏడాది కూడా నితిన్ కు మామిడి పళ్ళు పంపించాడు . గత ఏడాది కూడా మామిడి పంపించిన విషయం తెలిసిందే . ఇక నితిన్ పవర్ స్టార్ కు వీరాభిమాని అన్న సంగతి కూడా అందరికి తెలిసిందే . పవన్ కళ్యాణ్ కు హైదరాబాద్ శివారు ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రం ఉంది . దాంట్లో మామిడిపళ్ళు కూడా విరివిగా పండుతుండటం తో తన సన్నిహితులకు ఈ మామిడి పళ్ళని పంపిస్తుంటాడు పవన్ . తన అభిమాన హీరో నుండి మామిడిపళ్ళు రావడంతో ఉబ్బి తబ్బిబ్బై పోతున్నాడు నితిన్ .

     

26 P టాలీవుడ్

ల్లరి నరేష్ తో అహనా పెళ్ళంట అనిపించి హిట్ కొట్టాడు ,ఆ తర్వాత సునీల్ ని సిక్స్ ప్యాక్ లో చూపించి పూలరంగడు అయ్యాడు కానీ కింగ్ నాగార్జున తో చేసిన భాయ్ సినిమా ఘోర పరాజయం పొందడంతో అడ్రస్ లేకుండా పోయాడు దర్శకులు వీరభద్రం చౌదరి . మొదటి రెండు చిత్రాలు హిట్ అయినప్పటికీ నాగార్జున తో చేసిన భాయ్ డిజాస్టర్ గా మారడంతో వీరభద్రం చౌదరి కి సినిమాలు ఇచ్చే వాళ్ళే కరువయ్యారు . కానీ ఎలాగో అలా ఇన్నాళ్ళ గ్యాప్ తర్వాత చౌదరి ఓ సినిమా పట్టేసాడు . సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా ఓ సినిమా మొదలు పెట్టేసాడు . ఈ సినిమా ఎప్పుడో కన్ఫర్మ్ అయినప్పటికీ షూటింగ్ కి ఆలస్యం అవుతుండటంతో ఇది కూడా ఉంటుందా లేదా అనే అనుమానం వచ్చింది కానీ మొత్తానికి సినిమా ప్రారంభం కావడంతో చౌదరి సంతోషంగా ఉన్నాడు .


 



నిమిదేళ్ళ తర్వాత చిరంజీవి అభిమానులను అలరించడానికి సిద్దమయ్యాడు . అయితే నేరుగా కాకుండా వాయిస్ ఓవర్ ఇచ్చి అభిమానులను అలరించనున్నాడు . గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ''రుద్రమదేవి ''చిత్రానికి వాయిస్ ఓవర్ ఇచ్చారు చిరంజీవి . గుణశేఖర్ - చిరంజీవి కాంబినేషన్ లో ఇంతకుముందు ''చూడాలని ఉంది '' వంటి సూపర్ హిట్ చిత్రం వచ్చింది దాంతో చిరుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల చిరంజీవి ని అడగగానే అందుకు ఒప్పుకున్నారట . ఇక చిరంజీవి కూడా సినిమాల్లో నటించి చాలా కాలం అయ్యింది కాబట్టి రుద్రమదేవి కోసం వాయిస్ ఓవర్ ఇచ్చాడట . ఇప్పటికే అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి గా నటించిన విషయం తెలిసిందే ,ఇప్పుడేమో చిరు వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల మెగా అభిమానుల సపోర్ట్ ఈ చిత్రానికి ఉండటం ఖాయం .



నం

దమూరి బాలకృష్ణ ప్రస్తుతం డిక్టేటర్ చిత్రం లో నటిస్తున్న విషయం తెలిసిందే. 99 వ చిత్రంగా రూపొందే ఈ సినిమా తరువాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తన నెక్స్ట్ సినిమా 100వ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు. అయితే ఈ సినిమా పై ఆసక్తికర విషయం ఫిలిం నగర్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తుంది. అదేమిటంటే బాలయ్య హీరోగా శ్రీకృష్ణ దేవరాయులు గా నటిస్తాడట. ఈ సినిమాను రాఘవేంద్రరావు తెరకేక్కిస్తాడని సమాచారం. ఈ సినిమాకోసం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సన్నాహాలు చేస్తున్నాడని తెలిసింది. ఎంతో ఘనత కలిగిన శ్రీకృష్ణ దేవరాయలు జీవిత కథ నేపద్యం లో ఈ సినిమా ఉంటుందని, బాలయ్య వందో సినిమా కుడా ఇదే అయ్యే

అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి రాఘవేంద్రరావు దర్శకత్వం లో రూపొందే ఈ సినిమా నిజంగానే ప్రత్యేకత సంతరించుకోనుంది.

టాలీవుడ్ P 27


 నె



గిటివ్ టైటిల్స్ పెట్టి హిట్స్ కొట్టేయడం లో దర్శకుడు పూరి ది విబిన్నమైన శైలి. ఆయన రుపొందించిన పోకిరి , ఇడియట్ వంటి సినిమాలు సంచలన విజయాలు అందుకున్నాయి. లేటెస్ట్ గా ఆయన మరో నెగిటివ్ టైటిల్ తో వస్తున్నాడు. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వం లో రూపొందే చిత్రానికి లోఫర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యుల్ రాజస్తాన్ లో ప్రారంబం కానుంది. అక్కడి పురాతన కోటలు తదితర ప్రాంతాల్లో ఈ సినిమా మొదటి షెడ్యుల్ ను త్వరలోనే మొదలు పెడతారట ! మరి లోఫర్ గా వరుణ్ ను ఎలా చూపిస్తాడో అని ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉంటుందట !





ము

క్కుసూటి గా మాట్లాడేది ఎవరంటే ఎవరైనా సరే టక్కున చెప్పే పేరు ఒక్కటే అదే మోహన్ బాబు. లేటెస్ట్ గా మంచు విష్ణు కుడా సూటిగా మాట్లాడుతాడు. లేటెస్ట్ గా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇంతకి ఆయన అన్నది ఏమిటో తెలుసా ? ఇప్పుడున్న పరిస్తుతుల్లో కేవలం ఐదు వందల సిడి లను కూడా అమ్మలేక పోతున్నాం. అలాంటిది వేల సిడిలు అమ్మేసాం అంటూ ప్లాటినం డిస్క్ వేడుకలను ఎలా చేస్తారో అర్థం కాదు. ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం చేసే జిమ్మిక్కే తప్ప మరేది ఉండదు అని అంటున్నాడు. నిజమే ఇప్పుడు ఏ సినిమా ఆడియో వేడుక జరిగిన పదిరోజుల్లో ప్లాటినం డిస్క్ ల వేడుకలంటూ నానా హంగామా చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే ఆ సినిమాలోని పాటలు కూడా అంత బాగోకపోయినా కూడా ఇలాంటి వేడుకలు చేయడం విశేషం.

28 P టాలీవుడ్




 రా

జమౌళి పై కోపంగా ఉన్నాడు సీనియర్ నటుడు ,ఒకప్పటి హీరో సురేష్ . ఇతగాడికి ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా ............. బాహుబలి చిత్రంలో ఎవరెవరో పరాయి భాష నటీనటులు నటించారు కానీ మన తెలుగు నటులైన జగపతి బాబు ,సాయి కుమార్ ,సుమన్ లాంటి పలువురు ప్రముఖ నటులు ఉన్నప్పటికీ వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళకు చాన్స్ ఇచ్చారని సురేష్ కోపంగా ఉన్నాడు . నిజమే సురేష్ కోపంలో అర్ధం ఉంది . జగపతి బాబు ,సుమన్ ,సాయి కుమార్ లే కాకుండా ఇంకా ప్రతిభ ఉన్న నటీనటులు చాలామందే ఉన్నారు కానీ వాళ్ళని కాదని ఇతర భాష వాళ్ళని పెట్టుకోవడంతో నేను బాహుబలి కి సపోర్ట్ చేయనని ఖరా కండి గా చెప్పాడు సురేష్ .



 ఈ

మద్య నానికి వరుసగా అపజయాలు రావడం తో కెరీర్ బాగా డల్ అయ్యింది. దాంతో ఈ సారి మంచి హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు నాని. ఇప్పటికే మారుతీ దర్శకత్వం లో భలే భలే మగాడివోయ్ చిత్రం లో నటిస్తున్న నాని హీరోగా మరో సినిమా మొదలైంది. ఈ చిత్రానికి హను రాఘవాపుడి దర్శకత్వం వహిస్తున్నాడు. అందాల రాక్షసి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హనీ చాలా గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా ఇది. ఈ చిత్రాన్ని మహేష్ తో దూకుడు , 1 నేనొక్కడినే, ఆగడు వంటి చిత్రాలను నిర్మించిన 14 రీల్స్ పతాకం పై నిర్మిస్తున్నారు.

టాలీవుడ్ P 29


ముగ్గురు భామలతో

   ఇ

ప్పటివరకు ఒకరిద్దరు హీరోయిన్ లతో మాత్రమే రొమాన్స్ చేసిన మహేష్ తాజాగా బ్రహ్మోత్సవం చిత్రంలో తొలిసారిగా ముగ్గురు భామలతో రొమాన్స్ చేయనున్నాడు . కాజల్ అగర్వాల్ ,సమంత, ప్రణీత లు మహేష్ సరసన నటించనున్నారు . కాజల్ బిజినెస్ మెన్ లో చిత్రంలో మహేష్ తో రొమాన్స్ చేయగా ,సమంత దూకుడు ,సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో మహేష్ కు జోడీగా నటించింది . కాగా ప్రణీత మాత్రం తొలిసారిగా మహేష్ తో రొమాన్స్ చేయనుంది . ముగ్గురు అందమైన భామలతో మహేష్ తొలిసారిగా రొమాన్స్ చేయనుండటంతో మహేష్ అభిమానులు సంతోషంగా ఉన్నారు . జూలై 10నుండి బ్రహ్మోత్సవం చిత్రం రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

పెడితే 

 కృ

30 P టాలీవుడ్

ష్ణమ్మ కలిపింది ఇద్దరినీ చిత్రం ద్వారా మహేష్ బావ సుదీర్ బాబు కు మంచి పేరే వచ్చింది . అయితే సక్సెస్ ని పక్కన పెడితే పెర్ఫార్మెన్స్ పరంగా ఓ మెట్టు ఎక్కాడు సుదీర్ బాబు . తన పాత్రలో విభిన్నపార్శ్వాలను స్పృశించి భేష్ అనిపించుకున్నాడు . అయితే సినిమా మాత్రం యావరేజ్ కలెక్షన్లతో నడుస్తోంది . సినిమా బాగున్నప్పటికీ స్లో నేరేషన్ వల్ల సినిమా చాలామంది కి దూరం అయ్యింది . పైగా మహేష్ ఈ చిత్రాన్ని ముందుగానే చూసి మాట్లాడితే కొంత ప్రయోజనం ఉండేదేమో కానీ ఆలస్యంగా మహేష్ స్పందించడంతో ఇప్పటికే కొన్ని థియేటర్ లలో ఈ చిత్రాన్ని తీసెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు దాంతో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ ప్రేక్షకులకు అందకుండానే పోతోంది . మొత్తానికి సుదీర్ కెరీర్ లో ఇదొక మచ్చుతునక అవడం ఖాయం .


లొ  

  

సౌ

త్ క్రేజీ గర్ల్స్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో త్రిష , హన్సిక లు ఇప్పుడు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ లుగా ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అరణ్మని 2 అనే హర్రర్ చిత్రం లో నటిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం లో ఇంతకు ముందు వచ్చిన అరణ్మని ( తెలుగులో చంద్రకళ ) సినిమాకు సీక్వెల్ రూపొందుతుంది. ఈ సినిమాలో ఈ ఇద్దరు భామలు ఇలా హాట్ హాట్ గా పోజులతో రెచ్చగొట్టారు మరి ? ఈ ఫోటో పోస్ట్ చేస్తూ హాట్ భామ హన్సిక ఇలా కామెంట్ పెట్టింది ? No cat-fights here ... Just sister-romance' అంటూ పెట్టింది మరి ?

టాలీవుడ్ P 31


 

నం

దమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 99 వ సినిమా ఇటివలే ప్రారంబం అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం బాలయ్య లుక్ లో స్టైల్ మార్చడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాకోసం బాలయ్య కూడా సన్నబడాలని ప్రయత్నాలు చేస్తున్నాడట. డిక్టేటర్ పేరుతో రూపొందే ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. శ్రీవాస్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ సినిమాకోసం అంజలి కూడా సన్నబడింది మరి ?







తె

32 P టాలీవుడ్

లుగులో సినిమాలు చేస్తూ కమర్షియల్ హిట్ కోసం టాలీవుడ్ పై దండయాత్రలు చేస్తున్న సచిన్ జోషి. ఇటీవలే నీజతగా నేనుండాలి చిత్రం లో నటించాడు. ప్రస్తుతం వర్మ దర్శకత్వం లో మొగలిపువ్వు చిత్రం లో నటిస్తున్న సచిన్ ఇప్పుడు మరో సినిమాలో నటించేందుకు సన్నాహాలు మొదలు పెట్టాడు. తాతినేని సత్య దర్శకత్వం లో రూపొందే సినిమాలో ఆయన హీరోగా నటిస్తాడట ! బాలీవుడ్ భామ ఈశా గుప్త హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సచిన్ నిర్మిస్తున్నాడు.




  అ

క్కినేని నాగార్జునకు ఉన్న ఫాలోయింగ్ ఏమిటో అందరికి తెలిసిందే. యాభయ్యవ పడిలో కూడా నవ మన్మదుడిగా గ్లామర్ మేంటైన్ చేస్తున్న నాగ్ కు ఇంకా అలాంటి క్రేజే ఉందని మరో సారి నిరూపించుకున్నారు. సోషల్ మీడియా లో ఎప్పుడు ఆక్టివ్ గా ఉండే నాగార్జున ట్విట్టర్ ఫాలోవర్స్ 1 మిలియన్ అయ్యారు ? ఇప్పటివరకు టాలీవుడ్ లో ఈ మార్క్ ను క్రాస్ చేసిన ఏకైక హీరో మహేష్ బాబు. ఆయన ఎప్పుడో 1 మిలయన్ ఫాలోవర్స్ ను దాటేసాడు. ఆయన తరువాత నాగార్జున ఈ మార్క్ ను క్రాస్ చేసాడు. ఈ లిస్టు లో పవన్ కళ్యాణ్ - 4. 6 లక్షలు , ఎన్టిఆర్ - 3. 6 లక్షలో ఉన్నారు. నాగార్జున ప్రస్తుతం సోగ్గాడే చిన్నినాయన చిత్రం లో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.

 

బా

హుబలి చిత్రీకరిస్తున్న సమయంలో దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి డైట్ విషయంలో స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడట ,అవును ఖచ్చితంగా అన్ని కూడా సమయానికి తినాలని ప్రతీదానికి ఓ సమయం కేటాయించాడట . అసలు జక్కన్న ఏ సమయానికి ఏం తిన్నాడో మీకు తెలుసా ................ ఇదిగో చూడండి ఆ లిస్టు పొద్దున్నే ముఖం కడుక్కున్నాక కాఫీ ,టీ లాంటివి తీస్కుంటారు కానీ జక్కన్న మాత్రం ఉదయం ఆరు గంటలకు ఒక ఆపిల్ ,ఏడు గంటలకు బొప్పాయి పది గంటలకు కొబ్బరి నీరు ,పదకొండు గంటలకు ఫ్రూట్ జ్యూస్ మద్యాహ్నం ఇంటి నుండి వచ్చిన భోజనం చేస్తాడు . మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటాడు . అలాగే జక్కన్న కు చికెన్ అంటే విపరీతమైన ఇష్టం . అందుకే వారానికి నాలుగు రోజులు చికెన్ కే ప్రాధాన్యత ఇస్తాడట .

టాలీవుడ్ P 33




  ము    

 రా

జమౌళి అద్భుతమైన దర్శకుడు ,నేను సినిమా ప్రియున్ని అంటూ సంచలనం సృష్టించారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు . నేను తరచుగా సినిమాలు చూస్తుంటానని ముఖ్యంగా బాహుబలి కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని అన్నారు కేటిఆర్ . నిత్యం రాజకీయాలతో సతమతం అవుతూ ఎల్లప్పుడూ బిజీ గా ఉండే కేటిఆర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం . అత్యంత భారీ బడ్జెట్ తో తెలుగులో తెరకెక్కుతున్న బాహుబలి చిత్రం కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .

34 P టాలీవుడ్

ద్దుగా బొద్దుగా ఉండే రాశి 90 వ దశకంలో పలు చిత్రాల్లో నటించి మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది . తెలుగు ,తమిళ చిత్రాల్లో నటించిన ఈ బొద్దుగుమ్మ కొన్నాళ్ళ తర్వాత అసోసియేట్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పింది . పైగా పెళ్ళయ్యాక బాగా లావు కావడంతో సినిమాల వైపు చూడలేదు కానీ మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావడానికి ఉత్సాహం చూపిస్తోంది . ఇక రాశి ఒక బిడ్డ కు తల్లి కూడా అయ్యింది . ఆ పాప పేరు రిథిమ . రాశి తల్లి కావడంతో ముద్దులొలికే ఆ పాపతో ఆడుతూ పాడుతూ ప్రపంచాన్నే మరిచిపోతోంది . రాశి తన కూతురు రిథిమ తో కలిసి బోలెడు ఫోటోలకు ఫోజిచ్చింది అందులో ఇదొకటి చూడండి .






రే



సుగుర్రం చిత్రంలో నటన కు గాను ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడి అవార్డ్ ని సొంతం చేసుకున్నాడు అల్లు అర్జున్ . ఆ అవార్డ్ ని మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు కు అంకితం ఇచ్చాడు అల్లు అర్జున్ . అక్కినేని మూడు తరాల వాళ్ళు నటించిన మనం చిత్రానికి కూడా అవార్డుల పంట పండింది . ఏకంగా మొత్తం 5అవార్డులను సొంతం చేసుకుంది మనం చిత్రం . అయితే రేసు గుర్రం చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డ్ అందుకున్న బన్నీ అక్కినేని కి గౌరవం ఇస్తూ ఆయన కు ఈ ఫిలిం ఫేర్ అవార్డ్ ని అంకితం ఇవ్వడం నిజంగా గ్రేటే !

 

 టెం

పర్ చిత్రంలో నేను నటించి ఉంటే దాని రేంజ్ మారిపోయేదని ఈ విషయం దర్శకులు పూరి జగన్నాద్ కు అలాగే నిర్మాత బండ్ల గణేష్ కు కూడా చెప్పానని అంటున్నాడు సీనియర్ హీరో ,ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయిన జగపతి బాబు . టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ కు గౌరవం ఇవ్వకుండా క్లైమాక్స్ లో మాత్రం సెల్యూట్ చేస్తాడు పోసాని ఆ క్యారెక్టర్ సినిమాకు బలంగా మారింది ,అయితే ఆ క్యారెక్టర్ ని పోసాని కాకుండా నేను కనుక చేసినట్లయితే క్యారెక్టర్ ఎలివేట్ అయ్యేదని తప్పకుండా సినిమా పెద్ద హిట్ అయ్యేదని మరిన్ని డబ్బులు వచ్చేవని ఈ విషయాలన్నీ దర్శక నిర్మాతలకు చెప్పానని వాళ్ళు కూడా అయ్యో ! మాకు ఆ విషయం తట్టనేలేదని వాపోయారట . జగపతి బాబు చెప్పిన విషయం నిజమే మరి . కానీ పోసాని ఎలా ఫీల్ అవుతాడో ఈ మాట విని .

టాలీవుడ్ P 35




 ఎ న్టిఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో రూపొందే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కుడా పూర్తి అయ్యింది. ఈ సినిమా ఎక్కువ భాగం లండన్ లో చిత్రికరిస్తారట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ నటుడు జగపతి బాబు నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టిఆర్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటిస్తుండగా ... ఎన్టిఆర్ కు మామ గా జగపతి బాబు కనిపిస్తాడట. నెగిటివ్ షేడ్ లో ఈ పాత్ర ఉంటుందని సమాచారం. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు.



 ప

36 P టాలీవుడ్



వర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న గబ్బర్ సింగ్ 2 చిత్రం ఇప్పటికే ఒక షెడ్యుల్ ను జరుపుకున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెండవ షెడ్యుల్ మొదలు కానుంది. అయితే గబ్బర్ సింగ్ 2 సీన్లు ఇప్పుడు బెంగాల్ టైగర్ సినిమా కోసం వాడారట ! అవును ? ఇంతకి విషయం ఏమిటంటే గబ్బర్ సింగ్ 2 చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తాడని , దానికోసం రెండేళ్ళు కథ ను కూడా రెడీ చేసుకున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా ఆలస్యం అవ్వడం తో సంపత్ ఆ సినిమా నుండి బయటకు వచ్చేసి రవితేజ హీరోగా బెంగాల్ టైగర్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే గబ్బర్ సింగ్ కోసం రాసుకున్న సీన్స్ బెంగాల్ టైగర్ లో రెండు యాక్షన్ సన్నివేశాలను వాడారట ! అయితే ఈ కథ మాత్రం గబ్బర్ సింగ్ కోసం రాసుకున్నది కాదని అంటున్నాడు దర్శకుడు. మరి ఈ సినిమా మరో గబ్బర్ సింగ్ గా ఉంటుందో లేదో చూడాలి ???






 ముం

దుగా జూలై 17న మహేష్ నటించిన శ్రీమంతుడు చిత్రాన్ని రిలీజ్ చేయాలనీ డేట్ ఫిక్స్ చేసుకున్నారు కానీ ఆ తర్వాత బాహుబలి జూలై 10న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు దాంతో మహేష్ కు కోపం రావాలి కానీ కోపగించుకోకుండా జక్కన్న చెప్పిన విషయాలను సావధానంగా విని బాహుబలి బ్లాక్ బస్టర్ కావాలని భావించి అందుకు తన సినిమా ఏమాత్రం అడ్డు కాకూడదని భావించి శ్రీమంతుడు చిత్రాన్ని ఆగష్టు 7కు వాయిదా వేసాడు మహేష్ . ఈ నిర్ణయం తీసుకోవడానికి గట్స్ కావాలి అది మహేష్ కు పుష్కలంగా ఉంది కాబట్టే బోలెడు విమర్శలు వచ్చినా వాటికీ భయపడకుండా బాహుబలి కి మార్గం సుగమం చేసాడు . మరో ప్రతిష్టాత్మక చిత్రానికి అడ్డంకులు లేకుండా చేసి మహేష్ గ్రేట్ అనిపించుకున్నాడు .

టాలీవుడ్ P 37






p



బా

టాలీవుడ్ P 38

ల నటిగా యావత్ ప్రేక్షకులందరి చేత శెభాష్ అనిపించుకున్న నటి షామిలి . అయితే బాలనటిగా ఎంత పేరు ప్రతిష్టలు సొంతం చేసుకుందో హీరోయిన్ గా వచ్చాక మాత్రం ఏమాత్రం ప్రభావం చూపించలేక పోయింది . సిద్దార్థ్ తో చేసిన ఓయ్ సినిమా అనుకున్నంత విజయం సాధించక పోవడంతో షామిలి గురించి దాదాపుగా మర్చిపోయారు . అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ హీరోయిన్ గా వస్తోంది . కన్నడ హీరో సుదీప్ సరసన నటిస్తున్న ఈ భామ మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతానని నమ్మకంగా ఉంది . తమిళ ,కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కే ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు .


     

మే

ము నటించే చిత్రాలకు సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టినాసరే మేము మీడియా ముందుకు వచ్చేది లేదని దర్శక నిర్మాతలకు చెబుతున్నారట ఇద్దరు హాట్ భామలు . ఎందుకంటే మేము మీడియా ముందుకు వస్తే సినిమా కు సంబందించిన విషయాలను అడగకుండా పర్సనల్ విషయాలను అడుగుతుంటారని అందుకే మేము వచ్చేది లేదని చెబుతున్నారు నయనతార ,హన్సిక లు . నయనతార విషయానికి వస్తే ఇటీవల ఓ యువ దర్శకుడితో సన్నిహితంగా దిగిన ఫోటో నెట్ లో సంచలనం సృష్టించగా హన్సిక విషయానికి వస్తే హన్సిక బాత్ రూం వీడియో అంటూ నెట్ లో సంచలనమే సృష్టించింది ,అంతేకాకుండా శింబు తో లవ్ ఫెయిల్యూర్ గురించి కూడా అడుగుతు న్నారు కాబట్టి మేము మీడియా ముందుకు వచ్చేది లేదని వాదిస్తున్నారట .



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.