The King / Telugu

Page 1


రాజు

తిరిగి చెప్పబడిన మార్కు సువార ్త

Copyright © 2014 FL Media All rights reserved

మొదటి ప్రచురణ 2014

వ్యాస కర :్త రోజ్‌మేరి మరియు చిత్రాలు గీసినవారు: టెర్రి లిమ్ కళా దర్శకత్వం: అట్ స్లా అసోసియేట్స్ ముద్రించినవారు: మీడియా సర్వ్ www.mediaserve.org Printed in India ISBN 978 1 906389 35 2 Telugu


రాజు

మరో పుస ్తక మా లేక మరో ప్రపంచమా?

రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజురాజురాజు రాజు రాజు

రాజురాజురాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు రాజు


నమస్తే!

నువ్వు ఒక రాజును గూర్చి

తెలుసుకోవాలనుకుంటున్నావా? ఒక నిజమైన రాజు? అతని వంటి రాజును నువ్వు ఊహించి కూడా ఉండవు. మరి అతని గూర్చి తెలుసుకుంటావా? అయితే ఒక ప్రయాణానికి సిద మౌ ్ధ , అది నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుటకు నాందిపలుకుతుంది... ఇది మధ్య తూర్పునగల ఒక చిన్న దేశంలో ఆరంభమైంది. అక్కడ ప్రజలు ఒకానొక క్రూర సైన్యం చేత పరిపాలించబడుతున్నారు - అది రోమా సైన్యం. రోమీయులు చిన్న దేశమైన ఇశ్రాయేలును ఆక్రమించుకున్నారు. వాళ్ లు ప్రపంచాన్నే జయించాలని ప్రణాళిక వేసారు. కానీ వాళ కు ్ల తెలిసింది కొంచమేతమకంటే గొప్ప ప్రణాళిక మరొకాయనకుందని వారికి తెలియదు.

ఎవరు? దేవుడు.

దేవుని ప్రణాళిక పురాతన గ్రంధాల్లో వ్రాయబడింది. భూలోకానికి రాజును ఎక్కడికి, ఎప్పుడు పంపాలో దేవునికి స్పష మై ్ట న ప్రణాళిక ఉంది. అవును, అది ఆ చిన్నదేశమైన ఇశ్రాయేలు దేశమే. రోమా ఆక్రమణలో పరిస్ తు థి లు కఠినంగా ఉన్నాయి. ఎట్ టి వ్యతిరేకతనైనా కూృరంగా అణచి వేసేవారు. రోమా సైనికులు ధరించిన వస్త లు ్రా భయంకరంగా ఉంటాయని అనుకోకండి.

అదిగో అటుచూడండి. అతని పేరు బాప్ స తి ్మమిచ్చు యోహాను. అతడు బాల్యం నుండి అరణ్యంలో నివశించినవాడు. అతనిని గురించిన సమాచారం దేశంలో వ్యాపించి, అనేక ప్రజలు అతనిని చూసేందుకు వెళ్ న్ తు నారు. అతడెలా ఉన్నాడు? అతడు నిజంగా అడవి మనిషి, వింతైన వస్త్రధారణ, ఒంటెరోమాల వస్త లు ్రా ధరించాడు. ఇదేం బాగోలేదు అనుకుంటున్నారా, అతడేం తింటాడో తెలుసుకునేంత వరకు ఆగండి.

ఏమిటి?

2


.

మిడతలు మరియు తేనె.

ఛీ! కా

ని యోహానుకు దేవుని ప్రణాళిక తెలుసు. అతనికి రాజు రాబోతున్నాడని తెలుసు. అందుచేతనే ప్రజలను సిద ప్ధ రిచేందుకు అరణ్యంలో ఉన్నాడు.

సిద ్ధపర్చటమా దేనికి?

అవును, రోమా సామ్రాజ్యంలో అనేకమంది బానిసలున్నారుప్రజలు ఎవరిచేత చెఱపట బ ్ట డతారో, వారికి ఏ జీతం లేకుండానే జీవితాంతం పనిచెయ్యాలి. ప్రాధమికంగా వాళ్ లు బంధింపబడిన స్ తి థి లో ఉన్నారు. ప్రజలు గ్రహించలేనిదేమంటే, తాము స్వేచ్ఛగా ఉన్నామని అనుకున్నా, దేనికో ఒక దానికి బానిసలే. ఇప్పుడు మనం కూడా మనకు మనమే బానిసలము. దేవుడు మనం ఏం చెయ్యాలని కోరుకుంటున్నాడో దానిని చెయ్యలేకపోతున్నాం. పాపం అంటే మన జీవితాల కొరకు ఉన్న దేవుని ప్రణాళికను చెయ్యలేకపోవటమే. దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక మన కోసం శ్రేష ్ఠమైనది చేయాలనుకున్నాడు. ఆ ప్రత్యేక ప్రణాళిక యోహానుకు తెలుసు- అది వారి కోసమేకాదు మన కోసం కూడా- సరైన త్రోవలోనికి రావటం. తన సొంత కుమారుని, యేసుక్రీస్తును, రక్షకునిగాను - రాజుగాను పంపటం!

3


“ప్రత్యేకమైన ఒక వ్యక్ తి రాబోతున్నాడు, సిద ్ధంగా ఉండండి” అని యోహాను

చెప్పాడు. అప్పుడతడు యోర్థానునదిలో వారిని ముంచిపైకి లేపాడు. అతడు దాన్ని బాప్ స తి ్మం అన్నాడు. వాళ్ లు తమ జీవితాల్లోని మురికి, ప్రతి విధమైన చెడుతో నీళ్ళలో మునిగి, పరిశుద్ధులుగా వెలుపలికి వచ్చారు - ఇది ఆ నది నీటి వలన కాదు, వాళ ్ల హృదయాల్లో దేవుని కార్యానికి గుర్తు మాత్రమే. దేశం నలుమూలలనుండి ప్రజలు, యోహానును చూచేందుకు, ఆయన చెప్పే రాజ్యాన్ని గురించి, రాజును గురించి వినేందుకు వచ్చేవారు.

“ఇదిగో! వినండి! మీరింకా ఏమీ చూడనే లేదు!” యోహాను బిగ ్గరగా చెప్పాడు. “రాజు రాబోతున్నాడు! నేనే ఆయననుకుని అయోమయం పడతారేమో, నేను ఆయన దూతను మాత్రమే. నేను ఆయన చెప్పులు విప్పటానికి కూడా అర్హుడను కాను” అన్నాడు. అప్పుడు రాజు వచ్చాడు! కానీ ఎవరూ ఆయన్ని గుర్తుపట ్టలేదు, ఒక్క బాప్ స తి ్మం ఇచ్చే యోహాను తప్ప.

ఎందుకు?

ఎందుకంటే ఆయన ఒక రాజువలె కనిపించలేదు. మనలానే ఆయన

ఒక సామాన్యునిగా కనిపించాడు. ఆయన యోహాను దగ ్గరకు వెళ్ళి తనకు బాప్ స తి ్మము ఇమ్మని అడిగాడు. యోహాను నిర్ఘాంత పోయాడు.

నేను నీచేత బాప్ స తి ్మం పొందాలి. నేను నీకు బాప్ స తి ్మం ఇవ్వటమా? అన్నాడు. కానీ రాజు ఇవ్వమని ఒత్ డి తి చేసాడు.

అయితే ఏం జరిగింది?

ఆ రాజు నీళ ్లలోనికి

వెళ గా ్ల నే, ఆశ్చర్యకరమైన ఒక సంగతి జరిగింది. పరిశుద్ధాత్మ ఆయన పైకి దిగివచ్చింది మరియు, “ఈయన నా పుత్రుడు, నేనాయనను ప్రేమిస్తున్నాను, ఈయనయందు ఆనందిస్తున్నాను” అని దేవుడు పలికాడు.

4

దేవుడు నిజంగా అద్భుతమైనవాడు. ఆయనవంటి వాడెవ్వడూ లేడు. ్త కుడు! ఆయన నిజంగా పరిమితులు లేనివాడు- అనంతుడు, వాస వి నిగూఢంగా ఆయన ఒక్క దేవుడై ముగ్గురుగా ఉన్నాడు. తండ్రిగా ఉన్న దేవుడు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు (ఈ కథలోని రాజు ఈయనే), మరియు వింతగా ఉండే పరిశుద్ధాత్మ. యేసు బాప్ స తి ్మం పొందినప్పుడు ఈ ముగ్గురూ ఉన్నారు. నిజానికి దేవుడు ఎల ్లప్పుడు ముగ్గురై ఉన్నవాడు.

ఆశ్చర్యం!


అటు తరువాత, తన రాజ్యాన్ని గూర్చి చెప్పవలసిన సమయం వచ్చిందని ఆ రాజుకు తెలుసు. కానీ, ఆయన దీన్ని చేయక ముందు కష ్ట పరిస్ తు థి లు చుట్టుముట్టాయి. ఆయన రాజే అయినా కొన్ని పరీక్షలు నెగ ్గవలసి ఉంది.

ఎలాంటి పరీక్షలు?

ఆ పరీక్షలలో నీవు నేను నెగ ్గలేము. ఎక్కడైతే క్రూర మృగాలు నివశిస్తాయో అలాంటి నిర్జన ప్రదేశానికి ఆయన ఒంటరిగా వెళ్ళాడు. తినడానికి కూడా ఆయన ఏమీ పట్టుకుని వెళ్ళలేదు. రోజుల తరబడి అక్కడ ఆయన ఉండిపోయాడు. గమనించావా! రాజు వచ్చాడని దేవునికి తెలుసు, ఆయన వచ్చాడని యోహానుకూ తెలిసింది. ...మరొకరికి కూడా తెలుసు!?

ఎవరు?

దేవునికి శత్రువు- సాతాను. ఒకప్పుడు సాతాను ప్రకాశమానమైన దూతలలో ఒకడు- ఈ దేవదూతలు ప్రత్యేక సేవకులు, మరియు వార హ ్త రులు. కానీ, సాతాను తనున్న స్థానంలో సంతృప్ తి చెందలేదు. తాను కూడా దేవునంత శక్ మ తి ంతుడు కావాలనుకున్నాడు. దేవునిపై తిరగబడి, చివరకు పరలోకంనుండి తన అనుచరులతో సహా త్రోసివేయబడ్డాడు.

ప్రతి ఒక్కరు స్వతంత్రులు కావాలనేదే దేవుని కోరిక. రోమీయుల నుండి మాత్రమే స్వాతంత్రం పొందాలని మాత్రమే నేను మాట్లాడుటలేదు, కానీ దానికంటే అతీతమైన కేవలం రాజు మాత్రమే చేయగల- పాప బానిసత్వం నుండి విడుదల. అందుకే దేవుడు తన కుమారుడైన యేసును పంపాడు. ప్రతి ఒక్కరూ విముక్తులు కావాలన్నదే ఆయన కోరిక.

కా

ని సాతాను దేవున్ని ద్వేషిస్తాడు, మరియు అందరూ చెడ ్డ తలంపులకు, చెడు ప్రవర న ్త కు బానిసలుగానే నిరంతరం ఉండిపోవాలని కోరుకుంటాడు. చివరికి రాజును కూడా ఈ చెడు తలంపుకు బానిసను చేయాలని ప్రయత్నించాడు. ఆ వెలుపల అరణ్య ప్రదేశంలో రాజు తన సొంత అవసరతలు, ఆశలకు స్వాధీనమైపోయి దేవుని ప్రణాళికను నెరవేర్చకుండా చేసేందుకు శోధించాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి, పొరుగువారిని రెండవ స్థానంలో, చివరి స్థానంలో నిన్ను నీవు ఉంచుకొనుట ద్వారానే నిజమైన స్వాతంత్రతకు మూలం. ఇది కష ్టమే! కాని ఆయన ఈ సవాలును జయించి, సాతాను పరీక్షలలో నెగ్గాడు.

తరువాత ఏమిటి? 5


సా

తాను ఉగ్రుడైపోయాడు! రాజును ఒంటరిగా విడిచి, తన ద్వేషాన్నంతా అరణ్యం నుండి వచ్చిన బాప్ స తి ్మమిచ్చు యోహానుపైకి మళ్ళించాడు.

ఆనాటి పరిపాలకులలో ఒకడైన హేరోదు

ఎలా?

అంతిపకు యోహాను అంటే అయిష ్టం. ఇతను తన సహోదరుని భార్యను అక్రమంగా ఉంచుకున్నాడు. దీని విషయమై యోహాను అతనితో తీవ్రంగా విభేదించాడు. ఇది అతడు అక్రమంగా పెట్టుకున్న భార్యకు కంటగింపైంది. హేరోదు స్త్రీ విషయంలో బలహీనుడని ఎరిగి తన కుమార్తె సలోమి చేత అతని ఎదుట శృంగారభరిత నాట్యం చేయించింది. ఆ వేడుకలో ఆమె నాట్యం ముగించిన తరువాత, హేరోదు సలోమితో ఆమెకు కావలసింది ఏదైనా కోరుకోమనే అవకాశాన్ని ఇచ్చాడు. ఒక భయానకమైనది అడగమని సలోమిని తల్లి ప్రేరేపించింది.

“బాప్ స తి ్మమిచ్చు యోహాను తలను పళ్ళెంలో పెట్ టి ఇమ్మని”

ఏమిటది?

కాదు, హేరోదు అలా చేసాడా? హేరోదు నిజంగా చాలా బాధ పడ్డాడు. హేరోదు బయట పడకపోయినా, నిజాయితీని బట్ టి భయపడక తనను విమర్శించే యోహానంటే అతనికి ఇష ్టం. యోహాను సత్యమే పలికాడని హేరోదుకూ బాగా తెలుసు. కానీ అప్పటికే ప్రజలలో అతను చులకన అయిపోయాడు. దీన్నిబట్ టి మరింత బలహీనం కాకూడదని యోహాను తల నరికించాడు.

6

అయ్యో! అలా కాకూడదు!


కానీ శుభవార ్త ఏమంటే, రాజు పరిసర ప్రాంతాలలోనే ఉన్నాడు, పరిస్తుథి లు అంతకంతకు విపరీతంగా మారుతున్నాయి.

ఆయన మార్గాలను ప్రజలు నేర్చుకోవాలంటే రాజుకు కొంతమంది అనుచరులు ్త ఎంపిక చేసుకున్నాడు. ఆయన గలలీ కావాలి. అందుచేత యేసు జాగ్రత గా సముద్ర తీరాన నడుస్ తూ సీమోను, ఆంద్రెయ అనే ఇద రు ్ద సహోదరులను చూశాడు. వాళ్ళు జాలరులు. “నన్ను వెంబడించండి” “నేను మనుష్యులను ఎలా పట్టాలో చూపిస్తాను” అని పలికాడు.

వారు అలా చేశారా?

అవును, వాళ్ళు తమ వలలను అక్కడే వదలి రాజుతో కలిసి

వెళ్ళిపోయారు. మరి ముందుకు వెళ్ళి తీరంలో మరో ఇద రు ్ద సోదరులైన యోహాను, యాకోబులను చూచి వారినీ అలానే పిలిచాడు. వారుకూడా తమ తండ్రి చేపల వ్యాపారాన్ని వదలి రాజుతో కలిసారు.

అటు తరువాత ఏమైంది?

7


రాజుకు రాజ్యముంది. సమస్య ఏమిటంటే చాలమంది

నీవంటున్న దానికి అర ్థం?

తమ జీవితాలకు తామే రాజులమన్నట్టు వ్యవహరిస్ తూ ఉంటారు. వాస వా ్త నికి తాము బానిసలమని వారు గ్రహించరు. ప్రజల కొరకు ఎలాంటి రాజ్యాన్ని దేవుడు సిద ్ధం చేశాడో తెలుసుకోవాలనే దేవుడు యేసును పంపాడు. ఆ దేవున్ని సేవించుట ద్వారానే వారు విముక్తులు కాగలరు.

ఎప్పుడు దేవుని రాజ్యం వస్తుందో, అప్పుడు పరిస్తుథి లన్నీ మారతాయి. తన చుట్ టూ ఉన్న పరిస్ తు థి లన్నిటిని రాజు మార్చివేస్తున్నాడు. రోగులు బాగుపడుతున్నారు. యేసు పలికే మాటల ద్వారా జీవితాలు మారుతున్నాయి. రాజు వచ్చాడని ఇంకా అనేక మంది ప్రజలకు తెలియదు. ఆయన్ని వారు గుర్తించలేదు గాని ఆయన కలిగిస్తున్న మార్పును మాత్రం ఎరిగారు.

యేసు కపెర్నహోము అని పిలవబడే పట ణ ్ట ంలో ఉన్నాడు. ఆయన యూదుడైనందున యూదా ఆచారాలను పాటించేవాడు. వారంలో ఒక ప్రత్యేకమైన రోజును సబ్బాతు దినంగా పిలిచేవారు. ఆ రోజు సమాజ మందిరానికి వెళ్ళి దేవుని మార్గాలను గూర్చి నేర్చుకుంటూ ఉండేవారు. యేసు వారితో కూడి మాట్లాడేవాడు. ఆయన అద్భుత బోధకుడు! యేసు చెప్పిన విషయాలను గూర్చి ఎవ్వరూ ఎన్నడూ వినలేదు. ఆయన నిజమైన అధికారంతో బోధించాడు. ఎందుకంటే ఆయన రాజు. ఆయన తనతో కూడా రాజ్యాన్ని తీసుకువచ్చాడు. ఇది కొంతమందిని పట్ టి పీడిస్తున్న దురాత్మలకు ్ట ది. చూడండి, కలవరం పుట ించిం సామాన్య ప్రజలు యేసు ఎవరో గ్రహించలేకపోయారు- కాని ఆ దురాత్మలు గుర్తించాయి.

8

“నీవు మమ్మల్ని నశింపచేయడానికి వచ్చావా?” నీవెవరో నాకు తెలుసు, నీవు పరిశుద్ధుడవు, దేవుని వద నుండి ్ద పంపబడినవాడవు” అని ఒక పిశాచం యేసు మీద కేకలు వేసింది.

ఆహాఁ! తరువాత ఏమైంది?

రా

గా


ఏదో అసాధారణమైనది సంభవించింది. ఆ దురాత్మ ఆ మనిషిని

విలవిలలాడించి క్రింద పడద్రోసి వెళ్లిపోయింది. ఎందుచేతనంటే రాజు వచ్చాడు! దేవుని సామ్రాజ్యం వచ్చింది కనుక దురాత్మ పారిపోవలసిందే. యేసు ఒప్పింప చేసే బోధకుడు మాత్రమే కాదు గాని, దురాత్మలు ఆయన ముందు నిలబడలేనంత శక్ మ తి ంతుడు.

యేసు ఇంకేమి చేసాడు?

ఆయన ప్రజలను స్వసప్థ రిచాడు.

సమాజమందిరం నుండి సీమోను ఆంద్రెయల గృహానికి వెళ్ డు లా . సీమోను అత ్త జ్వరంతో అస్వస్థురాలై మంచం మీద పడుకుని ఉంది. ఏ పనీ చేయలేని బలహీనురాలుగా ఉంది. యేసు వెళ్లి ఆమెను ముట్ న టి వెంటనే బాగుపడింది. నిజంగా, వారందరికీ వంటచేసి భోజనం సిద ప్ధ రిచేంత శక్ ని తి పొందింది.

ఏం జరిగిందో ప్రజలు విన్నారు, సూర్యాస మ ్థ య సమయానికి పెద ్ద సంఖ్యలో సమూహంగా ప్రజలు వచ్చారు. రోగగ్రస్థులైన ప్రజలతో నిండిపోయింది, వారిలో కొందరు దురాత్మలచేత పీడింపబడుతున్నవారు.

ఆశ్చర్యం!

యేసు ఏం చేశాడు? 9


ఆయన వారందరినీ బాగుచేసాడు. మరుసటి రోజు

సూర్యోదయానికి ముందే ప్రార్థించేందుకు ఏకాంత స లా ్థ నికి వెళ్ళాడు.

నీవనేది ఏమిటి?

యేసు దేవుని కుమారుడు. తన తండ్రిని ఆయన ప్రేమించాడు, ఒంటరిగా ఆయనతో చాలా సమయం గడుపుతూ, మాట్లాడుతూ ఉండేవాడు. దీనినే మనం ప్రార న్థ అని అంటున్నాం.

లేదు. ఆయన చేయవలసిన పని ఉంది. అందుకే

యేసు కపెర్నహోములోనే ఉన్నాడా?

తన అనుచరులతో “మనం ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి, అక్కడికి కూడా రాజ్యాన్ని తీసుకుని వెళ వ్ల లసి ఉంది. నేను వచ్చింది అందుకే” అన్నాడు. సమాజ మందిరాల్లో బోధిస్ ,తూ రోగులను స్వస ప్థ రుస్ ,తూ ఆయన ప్రయాణించాడు. ఒకసారి, కుష్ ఠురోగి ఒకడు యేసు ఎదుట మోకాళ్ళూని, తనను బాగుచేయుమని యాచించాడు. ఆ రోజుల్లో కష్ ఠువ్యాధితో ఉన్న ప్రజలను ఆరోగ్యవంతులైన వారితో నివశించుటకు అనుమతించేవారు కాదు. ఎందుచేతంటే ఆ వ్యాధి ఇతరులకు సోకుతుందేమోనన్న భయం. యేసు ఆ తి బాగుచేసి, వెళ్లి యాజకునికి కనపరచుకో వ్యక్ ని అన్నాడు. అలా అతడు మరలా తన సమాజంలో ఒకడై ఉంటాడు. అయితే ఈ విషయాన్ని ఎవ్వరితోను ఎలా బాగుపడ్డావో చెప్పవద న్ ్ద నాడు. ఏమైతేనేమి, ఆ వ్యక్ తి ఎంతో ఆశ్చర్యపడి కనబడిన ప్రతి వారికీ చెప్పాడు. అటుతరువాత విస్తారమైన ప్రజలు యేసును కనుగొనేందుకు వచ్చారు. ఆయన పట ణ ్ట ంలో ఉండక, అరణ్యంలోనికి వెళ్ళి ఉన్నాడు. అక్కడికి కూడా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఒక రోజు ఆయన కపెర్నహోంకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చాడనే వార ్త దావనంలా వ్యాపించింది. ఆయన బసచేసిన ఇల్లు ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఇక ఒక్క మనిషికి కూడా లోనికి వెళ్ళే అవకాశం లేదు. కానీ కొందరు నిజంగా నిశ్ఛయించుకున్నారు.

10

ఎ మ

యే


ల్గురు పురుషులు, పక్షవాయువుగల తమ స్నేహితుడ్ని మంచంపై మోసుకుని వచ్చారు. ఎలాగైనా అతనికి సహాయం చెయ్యాలని, మట్ టితో చేయబడిన ఇంటి పై కప్పుకు రంద్రం చేసి, మంచంతో సహా యేసు ముందు దించారు. యేసు అతనితో “నీ పాపాలు క్షమించబడ్డాయి” అని చెప్పాడు.

అలా చెప్పడం ఎంత వింతైన సంగతి.

ఇతరులు కూడా అలాగే అనుకున్నారు. కొందరు

ధర్మశాస్త్ర మత బోధకులు “ఇది దేవదూషణ! దేవుడొక్కడే పాపములను క్షమిస్తాడు” అని వారిలో వారు సణుక్కున్నారు. దేవదూషణ అంటే యూదులలో అతి తీవ్రమైన పాపాన్ని జరిగించడమే. దీనర ్థం దేవుని నామాన్ని తక్కువ చేయటం. యేసు దైవశక్ గతి లవాడ్నని చెప్పుకుంటున్నాడని ఆ ధర్మశాస్త్రోపదేశకులు నొచ్చుకున్నారు.

వా

ళ్ళేమి అంటున్నారో యేసు విని వారితో, “ఏది దైవ దూషణ? ఏది సులువు? నీ పాపములు క్షమించబడినవని చెప్పటమా? పరుపెత్తుకుని నడవమని చెప్పటమా?” “నాకు పాపములను క్షమించే అధికారం ఉందని మీకు నిరూపిస్తాను” అని అన్నాడు. పక్షవాయువుగల వానివైపు తిరిగి, ఆ రోగితో నీవులేచి నీ పరుపెత్తుకుని నీ ఇంటికి వెళ్ళు” అన్నాడు. అతడు గంతులు వేసి, జనసమూహాన్ని నెట్టుకుంటూ వెలుపలికి వెళ్ళాడు.

ఆహాఁ! వాళ్ళెప్పుడూ ఇలాంటివి చూడలేదని పందెం! 11


వును నిజమే. కానీ యేసు మతఛాందస్సులతో ఎన్నో సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఒక రోజు మత యి ్త అనే పన్నులు వసూలు చేసే వ్యక్ ని తి కలుసుకున్నాడు.

“వచ్చి నన్ను వెంబడించు” అని యేసు చెప్పాడు. మత యి ్త ఆయనను వెంబడించాడు. అతడు ఆ రాత్రి యేసుకొరకు ఆయన స్నేహితుల కొరకు విందు ఏర్పాటుచేశాడు.

ఆ విందుకు వచ్చిన వారిలో పన్నులు వసూలుచేసే వారున్నారు. అయితే అట్ వా టి రిలో కొంతమందికి మంచిపేరు లేదు. అలాంటి వారంతా ప్రభువు చుట్ టూ ఉన్నారు. దేవుని రాజ్యం అందరి కోసం, కేవలం ప్రత్యేకమైన వారికోసం కాదు. పరిసయ్యులకు ఇది కంఠగింపుగా ఉంది.

ఇలాటి పాపులతో యేసు భోజనం చేయడం ఏమిటి? అని వాళ్ళన్నారు. యేసు ఇది విని, “ఆరోగ్యవంతులకు వైద్యుడక్కరలేదు గాని రోగులకే వైద్యుడు అవసరం. అందుచేతే నేను పాపులను పిలువవచ్చాను గాని తాము ఇప్పటికే మంచి వాళ్ళం అనుకునే నీతిమంతులను నేను పిలువ రాలేదు” అని జవాబిచ్చాడు.

ఎందుకు మతపెద ్దలకు ద్వేషం కలిగింది?

పరిసయ్యుడంటే ఎవరు?

పరిసయ్యులు మతనియమాలను పాటించే గుంపు. మతపరమైన నియమాలను ప్రేమిస్తారు. హృదయ పూర్వకంగా దేవున్ని ప్రేమించటం, ఆయన్ను గౌరవించటం కంటే, మత నియమాలను పాటించటం సుళువని యేసుకు తెలుసు. ఈ విషయమై ఆయన పరిసయ్యులను సవాలు చేశాడు. వారు శుద ్ధంగాను, పవిత్రంగాను ఉన్నామనుకుంటారు గానీ దేవుని ప్రమాణాలలో జీవించరు.

అంటే దానర ్థం ఏమిటి?

12

వే

బో వి దే


పరిసయ్యులు తినేవద ,్ద పానం చేసే వద ్ధ కట్టుబాట కు్ల లోబడి జీవించేవారు. యేసు అనుచరులు ఆ నియమాలను పాటించటం లేదనే విషయం వాళ్ళకు నచ్చలేదు. కోపంతో నిండిన వారి మాటలు, విమర్శలే కాదు, వారి హృదయాలు కూడా యేసుకు తెలుసు.

ను

తన ొంగ ద

వేషధారులారా! మీ ఆరాధన నటన. దేవుని ఆజ ్ఞల స్థానంలో మీ సొంత

బోధనుంచుతున్నారు. దేవుని ఆజ ల ్ఞ కు బదులు మీ సొంత నియమాలకు విధేయత చూపుతున్నారు. అవసరంలో ఉన్న తల్లిదండ్రులను నిర ్లక్ష్యం చేసి, దేవునికిస్తున్నాం అనటం పరిహాసం!”

ఇంత కఠిన మాటలను జనులు ఎలా ఇష ప్ట డ్డారు?

కల లేనివి

్పించు

త్య నరహ

వారు శ్రదగా్ధ విన్నారు. “దేవుని రాజ్యంలో, నీవు

ఏం తిన్నావో, ఎలా తాగావో పరిగణనలోనికి రాదు. నువ్వు ఏం మాట్లాడావో, ఏం చేశావో అవే లెక్కలోనికి వస్తాయి.”

ఆయన తన స్నేహితులకు వివరించాడు- నీ ఆలోచనలు నిన్ను అపవిత్ర పరుస్తాయి. నీ ఆలోచనా జీవితం అపవిత్రతకు కారణం. అక్కడే, వ్యభిచార పాపం, దొంగతనం, క్రూరత్వం, దురాశ, ద్వేషం, చెడు మాట పుట ిం్ట చటం, గర్వం, బుద్ధిహీనత ఆరంభమౌతాయి. ఇది నీ అంతరంగంలోనే, వెలుపల కాదు.

గర్వం

13


యేసు ఒక రాజు, ఆ రాజ్యంలో ఆయన ప్రజలు ఎలా జీవించాలో

బోధించాడు. పరిశుద ్ధమైన హృదయం, పవిత్ర జీవితం కావాలంటే యేసు ఒక్కడే ఆ మార ్గం. యేసు ద్వారానే సాధ్యం. యేసు నిన్ను దేవునికి అంగీకారయోగ్యంగా మార్చుతాడు. ఏవో నియమాలను పాటించటం ద్వారా- నీ అంతట నీకు అది సాధ్యం కాదు. - యేసు ద్వారానే సాధ్యం.

పరిసయ్యులు ఇతర మతపెద లు ్ద దీనిని వినటానికి ఇష ప ్ట డలేదు సరికదా, యేసు చెప్పే ప్రతి మాటకు పెడర్థాలు తీస్ ,తూ విమర్శిస్ ,తూ గందరగోళం కలుగచేసేవారు.

అంటే దీని అర ్థం

వారు ధర్మశాస్త్రంలో సబ్బాతురోజున విశ్రాంతి

తీసుకోమని ఉంది. దీని అర ్థం ఏ పనీ చేయకూడదనిపరిసయ్యుల వద ్ద పని అనే పదానికి విసృతమైన నిర్వచనం ఉంది. ఒక సబ్బాతు రోజున యేసు సమాజమందిరంలో ఉన్నాడు. ఒక ఊచచెయ్యిగల వానిని చూశాడు. పరిసయ్యులు తనను పరీక్షిస్తున్నారని, తానేం చెయ్యబోతున్నాడో చూసేందుకు కనిపెడుతున్నారని యేసుకు తెలుసు. అందుచేత యేసు వారినే “సబ్బాతు రోజున మంచి చేయుట ధర్మమా? చెడుచేయుట ధర్మమా? అని ప్రశ్నించాడు. జవాబు చెప్పే ధైర్యం వారికి లేదు. అప్పుడు ఆయన, నీ చెయ్యి చాపుమనగానే, ఆశ్చర్యం వెంటనే అతడు బాగుపడ్డాడు.

14

స చె

గొప్ప సంగతే!

ఒ వా వ రా సూర్యు ప అ ఫ


అవును గానీ, పరిసయ్యులు కోపంతో వెలుపలికి వెళ్ళి, ఇతరులతో కలిసి యేసును ఎలా చంపాల అని

కుట్ర చేయనారంభించారు. నిజంగా ఆయన వారికి కోపం తెప్పించాడు. గొప్ప జన సమూహం ఎక్కడైనా ఆయనను వెంబడిస్ నేతూ ఉంది; దేశం నలుమూలలనుండి ఆయనను చూసేందుకు ప్రజలు వస్తున్నారు. ఆ రాజు తన రాజ్యంతోపాటు స్వస త ్థ లను, అద్భుతాలను కూడా తీసుకువచ్చాడు. మత సంబంధమైన కట్టుబాట్లు కాదుగాని స్వాతంత్రాన్ని తీసుకువచ్చాడు.

ఏం జరుగుతుందో, యేసు సొంత కుటుంబం వారికి కూడా అర ్థం చేసుకోవటం కష మైం ్ట ది. కానీ, ఇప్పుడు, అనేకులు తనను వెంబడిస్తున్నా, ఎల ్లప్పుడూ అనుచరులుగా ఉండేందుకు పన్నెండు మందిని ఎంపిక చేసుకున్నాడు. రాజ్యంలో ్త ఎలా జీవించాలో, రాజ్యపు పని ఎలా చెయ్యాలో జాగ్రత గా బోధిస్ తూ చూపించాడు. ఆయన వారికి తన అధికారాన్ని ఇచ్చాడు. తరచూ వారు ఆయన “శిష్యులని” పిలువబడే వారు. దానర ్థం విద్యార్థులు అని.

వారెవరు?

ఇది వారి జాబితా: సీమోను (కానీ యేసు అతనికి పేతురు అనే కొత ్తపేరు పెట్టాడు) యి, బర ్తలోమ ఫిలిప్ యోహా మత యి ్త పు ను ఆంద్రేయ బు కా నా నీయు డైన సీమో ్ధ యి ద యాకో ను చినయాకోబు త తోమా మరియు ద్రోహిగా మారిన ఇస్కరియోతు యూదా, అతనిని గూర్చి తరువాత తెలుసుకుంటాం.

అయితే ఈ శిష్యులు ఏం నేర్చుకున్నారు?

ఆ రాజు స్వసత్థ లతో పాటు బోధను కూడా తీసుకువచ్చాడు.

సంగతులను సుళువుగా అర ్థం చేసుకునేందుకు ఉపమానరీతిగా చెప్పేవాడు. అలాంటి వాటిలో ఒకటి-

ఒక వ్యవసాయదారుడు విత ్తనాలు చల్లేందుకు వెళ్ళాడు. అతడు వాటిని చల్లినప్పుడు కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని ఎత్తుకుని పోయాయి. కొన్ని మన్ను అంతగాలేని రాతి నేలను పడ్డాయి. అక్కడ విత ్తనాలు మెులిచాయి గానీ సూర్యుని వేడికి వేరులు ఎండిపోయాయి. కొన్ని ముళ ్ల చెట ్లలో పడ్డాయి, ముళ తు ్ల ప్పలు వాటిని అణచి వేశాయి. అందువలన అవి ఫలించలేదు. కానీ కొన్ని మంచినేలన పడ్డాయి- మంచిగా ఫలించాయి. వాటిల్లో కొన్ని వందశాతం ఫలించాయి!

అంటే దాని అర ్థం? 15


పన్నెండు మంది శిష్యులు ఆయనతో ఏకాంతంగా ఉన్నప్పుడు, వారికి ఆ

వా

భావాలు వివరించాడు:

వి ఈ ని త

“బో ము

“వ్యవసాయదారుడు దేవుని వర మా ్త నాన్ని ప్రజలవద కు ్ద తెచ్చే

వాడు. త్రోవ ప్రక్కన పడిన విత ్తనాలు ఎవరంటే వర మా ్త నం వినేవారేగాని సాతాను వచ్చి వారు విన్న ఆ బోధలను ఎత్తుకుని పోతాడు. రాతినేలకు చెందినవారు సంతోషంతో వాక్యం వింటారు కానీ లోతుగా అర ్థం చేసుకోలేదు గనుక సమస్యలు రాగానే వాడిపోతారు. కారణం వారు నిజంగా విశ్వసించలేదు. ముళ ్ల పొదలలో పడిన వారు, విని అంగీకరించిన వారే గాని, ఐహిక విచారాలు, భౌతిక సంబంధమైన ఆశలకులోనై చివరకు ఫలించనివారుగా ఉంటారు. కానీ మంచి నేలను పడిన వారెవరంటే దేవుని వర మా ్త నం విని అంగీకరించి గొప్ప పంటను ఫలించినవారు.”

ఒక చిన్న ఆవగింజ

యే అ

యేసు ఇంకా రాజ్యాన్ని గూర్చి చెప్తూ, అది ఆవగింజను పోలి ఉంది అని చెప్పాడు.

అది చిన్నిది కదా!

అవును గానీ, అది పెరిగి కూరమెుక్కలన్నిటిలోకి పెద ది్ద అవుతుంది! దానిపై పక్షులు వాలగలవు, వాటి కొమ్మలపై గూళ్ళుపెట్టుకొనగలవు. నిజ విశ్వాసం కూడా అంతే. ఆ రాజు శిష్యులు ఈ అవకాశాన్ని తమ విషయంలో అనుభవపూర్వకంగా బాగా తెలుసుకున్నారు.

ఒక రోజు సాయంత్రం, యేసు పడవ ఎక్కి అద రి్ద కి వెళ్ళమన్నాడు. ఇంకా పెద ్ద సముహం చుట్ టూ ఉంది. బహుశా, తనకు కొంత సమయం కావాలని కోరుకున్నాడేమో, అలసిపోయాడు కనుక పడవలోనే నిద్రపోయాడు.

16

ఏం జరిగింది?

“మీ

“గా

యే బో వి యా


వాళ్ళింకా ఒడ్డుకు దూరంగా ఉండగానే బీకరమైన తుఫాను

విరుచుకు పడింది. పెద ్ద పెద ్ద అలలు పడవను ఇటు అటు ఈడ్చి కొడుతున్నాయి. పడవ నీటితో నిండిపోయింది. యేసు నిద్రపోతూనే ఉన్నాడు!! శిష్యులు భయంతో అరస్ తూ యేసును తట్ టి లేపారు:

“బోధకుడా, ఏం జరుగుతుందో నువ్వు గ్రహించుట లేదా? మనం మునిగిపోతున్నాం!” యేసు లేచి ‘నిమ్మళించు’ అని గాలిని నీటిని గద ిం్ద చాడు. అకస్మాత్తుగా గాలి ఆగిపోయింది, సమస ్తం నిమ్మళించింది.

ఆహాఁ!

“మీరెందుకు అంతగా భయపడ్డారు? మీకు విశ్వాసం లేదా?” అని అడిగాడు.

“గాలియు, సముద్రమును ఆయనకు లోబడుచున్నావే”, “ఈయన ఎవరు?” అని వాళ్ళు ఆశ్చర్యపోయారు!

యేసు ఏ విషయానికీ చింతించవద్దు గానీ, దేవునియందు విశ్వాసం ఉంచండి అని వారికి అనుభవపూర్వకంగా బోధించాడు. విశ్వాసాన్ని నీ అంతట నువ్వు సంపాదించుకోలేవు. కానీ దేవుని వాక్యం విత న ్త ం వంటింది- అది విశ్వాసాన్ని కలుగచేస్తుంది! విశ్వాసాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలు జరుగుతాయి. ఇలా నేర్చుకున్న వారిలో యాయీరు ఒకడు.

17


ఎవరు?

యా

యీరు ఓ ముఖ్యమైన వ్యక్ .తి సమాజమందిర నాయకుడు. అతని చిన్నకుమార్తె చావనై ఉంది. యేసు బాగుచేయగలడని అతనికి తెలుసు.

“నా కుమార్తె చనిపోవుటకు సిద ్ధంగా ఉంది, దయచేసి నీవు వచ్చి ఆమెపై చేయివేస్తే బ్రతుకుతుందని” యేసును వేడుకున్నాడు.

ఆయనేనా? అవును, యేసు యాయీరుతో వెళ్ళాడు- జనసమూహాలు

ఆయన వెంట వెళ్ళారు. ఆ సమూహంలో పన్నెండు సంవత్సరాలనుండి రక స్రా ్త వంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఉంది. ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది. వైద్యులకు తన ధనాన్నంతా ఖర్చుపెట ిం్ట ది. కానీ స్వస త ్థ కలుగలేదు. ఇక యేసు తప్ప ఆమెకు ఏ నిరీక్షణా లేదు. ఆమె జనసమూహాన్ని త్రోసుకుంటూ ఆయనకు సమీపంగా వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంది. “నేను కేవలం ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగు పడతానని” ఆమె అనుకుంది.

అవును! ఆమె ఎప్పుడు యేసు వస్త న్ని్రా ముట ిం్ట దో

రక స్రా ్త వం ఆగింది. బాగుపడ్డానని గుర్తించింది. యేసు వెంటనే తనలోనుండి స్వస ప్థ రిచే శక్ తి బయటికి వెళ్ళిందని గ్రహించి, చుట్ టూ చూచి “నా వస్త న్ని ్రా ముట ిం్ట ది ఎవరు?” అని అడిగాడు.

అందుకు శిష్యులు “జనసమూహాలు నీ మీద పడుతున్నారు కదా, ఎవరు ముట్టారో ఎలా చెప్పగలం?” అన్నారు. యేసు మౌనంగా నిలిచి చూచాడు. ఆ దీనురాలు, వణకుతూ ఆయన పాదముల దగ ్గర మోకరిల్లి, జరిగిన సంగతి చెప్పింది.

“కుమారీ, నీ విశ్వాసం నిన్ను స్వస ప్థ రిచింది, సమాధానం గలదానవై వెళ్ళు” అని అన్నాడు.

18

అదే విశ్వాసం!


తని సు.

పై సును

ఇది జరుగుతుండగానే, యాయీరు ఇంటి వద నుండి ్ద ,

అతని కుమార్తె చనిపోయిందని వర మా ్త నం తీసుకుని ఒకరు వచ్చారు. యేసు యాయూరుతో అయినా విశ్వాసం ఉంచమని చెప్పాడు. అప్పుడు తన వెంట వస్తున్న వారందరినీ ఆగిపొమ్మని చెప్పి, పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే, వెంటబెట్టుకుని వెళ్ళాడు.

యాయీరు ఇంటికి చేరుకోగానే అందరూ దుఃఖిస్ ,తూ

రోధిస్తున్నారు. యేసు వీటన్నింటినీ పట ించు ్ట కోకుండా లోనికి వెళ్ళాడు. “ఏం జరుగుతుంది, ఆమె చనిపోలేదు, కేవలం నిద్రిస్ తూ ఉంది” అన్నాడు.

ప్రజలు ఆయనను గేలిచేసారు. అందుచేత వారందరినీ ఇంటి బయటకు పంపి, ఆ పిల ్ల తండ్రిని, ముగ్గురు శిష్యులను లోని గదిలోనికి తీసుకువెళ్ళి, “చిన్నదాన లెమ్ము!” అన్నాడు. ఆమె వెంటనే లేచి నిలిచింది, నడిచింది! ఆమె తల్లిదండ్రులు సంతోషభరితులయ్యారు. ఏం జరిగిందో ఎవరికీ చెప్పవద ని్ద యేసు వారికి ఆజ్ ఞాపించి, తినేందుకు ఆమెకు ఏమైన పెట మ ్ట ని చెప్పాడు.

నీవేమంటున్నావు, ఆమె చనిపోయింది గానీ యేసు ఆమెను తిరిగి బ్రతికించాడా?

అవును.

ఆహాఁ ఎంత అద్భుతం! 19


అవును, ఇది రాజ్యంలో భాగం. భయం, విశ్వాసానికి

వ్యతిరేకమైనది, అది నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరగకుండా అవరోధంగా ఉంటుంది. ఎప్పుడు భయపడతావో, అప్పుడు రాజులో నమ్మిక ఉంచు.

కాబట్ టి ఈ రాజ్యంలో జీవించుటకు నీకు విశ్వాసం అవసరం?

అవును, యేసుకూడా వారి అవిశ్వాసాన్నిబట్ టి అనేక అద్భుతాలు చెయ్యలేదు.

యాయీరు కుమార్తెను బ్రతికించిన తరువాత యేసు

అంటే అర ్థమేమిటి?

తన స్వంత పట ణ ్ట మైన నజరేతుకు తిరిగి వెళ్ళాడు. మరుసటి సబ్బాతు రోజున స్థానిక సమాజమందిరంలో బోధించటం ఆరంభిచాడు. కానీ, అనేకులకు ఇది అర ్థం కాని సంగతి.

“ఈయనకు ఈ జ్ ఞానం అద్భుతములు చేసే శక్ తి ఎక్కడినుండి వచ్చాయి?” ఇతడు వడ్రంగి వాడు కాదా? మరియ యోసేపుల కుమారుడు కాడా? ఇతని సహోదర, సహోదరీలు మనతో ఉన్నవారు కారా? అని ఆయన యందు నమ్మిక ఉంచటానికి నిరాకరించారు.

ఆయన “ప్రవక ్త అన్ని చోట్లా

గౌరవించబడినా తన స్వకీయుల యెుద ్ద హితుడు కాడు” అని అన్నాడు. వారి అవిశ్వాసాన్ని బట్ టి అక్కడ ఏవో కొన్ని తప్ప ఎక్కువ అద్భుతాలు చెయ్యలేదు.

యేసు తన శిష్యులకు అధికారం ఇచ్చి పంపాడు. తమ వెంట ఏమియూ తీసుకుని వెళ్ళకూడదని, చివరికి మరో చొక్కా కూడా వెంట తీసుకు వెళ్ళవద ని్ద ఆజ్ ఞాపించాడు.

“ఏ గ్రామంలోనైనా మిమ్మల్ని చేర్చుకో పోతే, పట ించు ్ట కోవద్దు, మీ పాదధూళిని సాక్ష్యార ్థమై దులిపి వెళ్ళండి” అని చెప్పాడు.

యేసు ఏం చేశాడు?

దాని తరువాత ఏం జరిగింది?

కఠినమైన సంగతి.


వును, దేవుని రాజ్యం (మిథ్య కాదు) ఎంతో ప్రాముఖ్యమైనది.

వారు రాజ్య సువార ను్త

ప్రకటించి, ప్రజలను పాపమార్గాలను పాపాలను విడిచి దేవునివైపు తిరుగమని రోగులను స్వస ప్థ రచి, దురాత్మలను వెళ్ళగొట్టారు. అటుతరువాత విశ్వశించిన వారందరూ ఈ విధంగా చేయాలని యేసు చెప్పాడు.

చాలా సంగతులు జరిగాయి- ఈ

కథకు ఆశ్చర్యకరమైన ముగింపు ఉంది. కాస ్త వేచి ఉండండి. ముందుకు కొనసాగుదాం...

శిష్యులు ఏం చేశారు?

నిజంగానా!

శిష్యులు తమ ప్రయాణాన్ని ముగించి తిరిగి వచ్చారు. విశ్రాంతి కొరకు యేసు వారిని పడవపై తీసుకువెళ్ళాడు. కానీ అప్పటికే జనసమూహం రావటం ఆరంభమైంది, వస్ నేతూ ఉన్నారు. అనేకులు యేసు మరియు ఆయన శిష్యులు సమీపంలోనే ఉన్నారని, వారు ఒడ్డుకు రాకముందే, సముద్ర తీరం వెంట వీరిని కలుసుకునేందుకు పరుగుపరుగున వచ్చారు. యేసు వారు కాపరి లేని గొఱ్రెలవలె చెదరిపోయి ఉన్నారని వారిని చూసి కనికరపడి, రాజ్యాన్ని గురించి తిరిగి బోధింపసాగాడు.

21


సాయంకాలమయ్యింది, శిష్యులు “ఇప్పటికే చీకటి పడింది, వారు వెళ్ళి గ్రామాల్లో ఏమైన తినేందుకు జనసమూహాలను ఎందుకు పంపకూడదు?” అని అడిగారు.

“మీరే వారికి ఆహారం పెట ్టండి” అని యేసు బదులుపలికాడు.

ఎలా?

సరిగ్గా శిష్యులు అలాగే అడిగారు “ఇంతమందికి ఆహారం పెట్టాలంటే ఎంతో ధనం కావాలి!”

“మీ వద ్ద ఏముంది? వెళ్ళి చూడండి” అని యేసు అన్నాడు.

వారు తిరిగి వచ్చి “మా వద ్ద ఐదు రొట్టెలు, రెండు చేపలు మాత్రమే ఉన్నాయి” అని చెప్పారు.

ఏం జరిగింది?

యేసు వారితో అందరినీ యాబది మందిగాను, లేదా వందమందిగాను వరుసలలో కూర్చోబెట మ ్ట ని చెప్పాడు. ఆ కొద్ది ఆహారాన్ని పైకెత్ ,తి ఇచ్చినందుకు దేవున్ని స్తుతించి, కృతజ ్ఞతలు చెల ్లించాడు. విరిచి శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు.

కానీ అవి సరిపోవు కదా?

అవును, చాలినంత! అందరూ కావలసినంత తినగా, మిగిలిన ముక్కలు పోగుచేస్తే పన్నెండు గంపలు నిండాయి! కావలసిన దాని కంటే ఎక్కువ. అది రాజ్య జీవితంలో మరో భాగం. నీకు ఏమి ఉన్నా, లేక పోయినా సరే దేవుని యందు నమ్మిక ఉంచితే, ఆయన నిన్ను దీవించి నీ అవసరతలన్నీ తీరుస్తాడు.

దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఆకాశమును భూమిని సృష ిం్ట చినవాడు. ఆయన ప్రకృతి నియమాలకు అతీతుడు.

నీకు మరో ఉదాహరణను చెప్పనివ్వు. ఇది జరిగిన వెంటనే యేసు తన శిష్యులతో ప్రజలను పంపివేయక ముందే అవతల ఒడ్డుకు వెళ్ళమని చెప్పి, ఆయన కొండపైకి ప్రార న్థ కు వెళ్ డు లా .

22

అద్భుతం!

తె

ప్రా


తెల వా్ల రు జామున, శిష్యులు ఇబ్బందుల్లో పడ్డారు. పెనుగాలి, పెద ్ద కెరటాలకు ఎదురు పడవను నడుపుట ప్రాణ సంకట పరిస్ తి థి . వారిని యేసు చూచి వారి దగ ్గరకు నడచి వచ్చాడు.

నువ్వు చెప్తున్నదేమిటి?

అంటే ఆయన నీటిపై నడిచాడు.

అసాధ్యం! ఆ

యన వేగంగా నడిచి రావటం శిష్యులు చూచి భయపడి “భూతమని” కేకలు వేసారు. “భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి నేనే” అని యేసు అన్నాడు.

వారు ఆయనను నమ్మారా? 23


పేతురు తనకు రుజువు కావాలని నిర యించు ్ణ కున్నాడు. యేసుతో “నీవే అయితే నన్ను కూడా

నీళ పై ్ద నడచి ్ల నడవ నివ్వు!” అన్నాడు. “రమ్ము” అని యేసు చెప్పగానే, పేతురు అలలపై యేసు వద కు వెళుతున్నాడు.

పేతురు ఏమి తలంచాడంటే చుట్ టూ గాలికి ఉవ్వెత్తున లేస్తున్న అలలను చూచి ఎంత పైకి లేస్తున్నాయో అని భయపడి, అతి తక్కువ సమయంలోనే యేసుపై నమ్మకం ఉంచుట మానుకున్నాడు. ఫలితంగా నీళ్ళలో దిగిపోవుట ఆరంభించాడు. యేసు అతని చెయ్యిపట్టుకుని విశ్వాసం తగ్గినందుకు గద ిం్ద చాడు.

అమ్మోఁ! వింటానికే భయంగా ఉంది.

అప్పటికే, అన్నిచోట్లా ప్రజలు తమలో తాము ఈయన ఎవరు, నిజంగా ఎవరీయన? అనుకుంటున్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ప్రజలు స్వస ప్థ డుతున్నారు. మూగ, చెవుడు, గుడ్డితనం, కుంటివారు ఇలా ఆయన బాగు చేయలేని రోగం గానీ గాయంగాని లేదు. ఒక రోజు యేసు తన శిష్యులను “ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు?” అని అడిగాడు.

వారు, కొందరు బాప్తీస్మమిచ్చు యోహాను మరల బ్రతికాడని అనుకుంటున్నారని, ఇంకొందరు ఏలియా అని, లేదా ఒక ప్రవక ్త అని అనుకుంటున్నారని చెప్పారు.

“నేను ఎవరని మీరను కుంటున్నార”ని యేసు వారిని అడిగాడు. పేతురు వెంటనే “నువ్వు మెస్సీయా” అన్నాడు.

దా

దాని అర ్థమేమిటి?

నికి “అభిషేకించబడిన వాడని” అర ్థం. బైబిల్‌మెుదటి భాగంలో సేకరించబడిన పుస కా ్త లను పాత నిబంధన అంటారు, అందులో అతడు దేవునికి మానవులకు మధ్య సరియైన సంబంధాన్ని ఏర్పాటు చేయుటకు దేవుడు రక్షకుణ్ణి పంపిస్తానని ప్రమాణం చేశాడు.

24

రాజు?

పే


అవును, ఆ రాజునే కొందరు మోస్సీయా అని పిలుస్తారు. ఇదే వ్యక్ .తి

పేతురు యేసు ఎవరో గ్రహించాడు, యేసు ఆ విషయం ఎవరితోనూ చెప్పవద న్ ్ద నాడు.

యేసుకు భయంకరమైన సంగతులు

ఎందుకు?

జరుగబోతున్నాయని, మతనాయకులు చేత, యాజకులచేతమరి అనేకులచేత నిరాకరించబడ బోతున్నాననే సత్యం తెలుసు.

ఆయన అనేక మంచి కార్యాలు చేశాడు కదా?

అవును, కానీ దేవుని ప్రణాళిక జ్ పఞా కం లేదా? ఆయన

ప్రణాళిక అంటే విమోచన, దీని కొరకు వెల చెల ్లించాలి. ఆయన రాజు గనుక జరగబోయే విషయాలన్నీ ముందుగానే బాగా తెలుసు. ఆయన తన శిష్యులలో తాను చంపబడి, మూడవ రోజున తిరిగి లేస్తానని చెప్పాడు.

అయ్యో పిచ్చిపని కదా!

లేదు!

పేతురు కూడా అలానే అలోచించుకుని, యేసును ప్రక్కకు తీసుకువెళ్ళి అలా మాట్లాడవద్దు అన్నాడు.

25


కానీ యేసుకు తానెందుకు వచ్చాడో తెలుసు. పేతురు వైపు తిరిగి “నువ్వు సంగతులను

గూర్చి మనుష్యులు ఆలోచించినట్లే ఆలోచిస్తున్నావు. గాని దేవుని సంగతులను తలంచుట లేద”ని, మిగిలిన వారిని పిలచి “మీరు నా అనుచరులు కావాలనుకుంటే, సొంత ఇష్టాలను మర్చిపోయి నన్ను సమీపంగా వెంబడించండి. నీ ప్రాణాన్ని కాపాడు కోవాలని ప్రయత్నిస్తే, దానిని పోగొట్టుకుంటావు. కానీ నీ జీవితాన్ని నా కోసం, రాజ్యం కోసం అప్పగించుకుంటే, నువ్వు నిజ జీవాన్ని కనుగొంటావు” అని పలికాడు.

అటు తరువాత ఆయన అడిగాడు, “ఈ లోకమంతటినీ సంపాదించుకుని నీ ప్రాణమును పోగొట్టుకుంటే నీకేమి లాభం? నీ ప్రాణం కంటే విలువైనది ఏమైనా ఉందా? నన్ను గురించి ఎవరైనా సిగ్గుపడితే, నేను నా తండ్రి మహిమతో తిరిగి వచ్చినప్పుడు దేవదూతల ఎదుట వాని విషయమై నేను సిగ్గుపడతాను.”

అది కష మై ్ట నదే, కానీ నేను ఊహించగలను ఇది సత్యమే

యేసును వెంబడించటానికి ఇవన్నీ అవసరం. కానీ నిజ జీవానికి ఇదొక్కటే మార ్గం.

ఒక వారం గడిచిన తరువాత, యేసు పేతురును, యాకోబును, యోహానును వెంటబెట్టుకుని కొండ శిఖరంపైకి వెళ్ళాడు. వారు ప్రభువుతో ఏకాంతంగా ఉన్నారు. అత్యంత ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది.

ఆయన అక్కడ నిలిచి ఉండగా, ఆయన ముఖరూపం మారింది. ఆయన వస్త లు ్రా ్ల మెరిసాయిమిరుమిట్లు గొలిపేటంత తెల గా నువ్వు ఊహించలేనంత తెలుపు. అప్పుడు ఇద రు ్ద వ్యక్తులు కనిపించారు.- ఏలియా, మోషే.

26

ఎవరు?


డ గా ది.

వా

రి ప్రస్థావన పాత నిబంధన గ్రంథంలో ఉంది, వారు నిజంగా దేవుని మార్గాలను ఎరిగిన మనుష్యులు. పేతురుకు ఏమి మాట్లాడాలో అర ్థం కాలేదు, కానీ ఏదైనా మాట్లాడాలని అనుకున్నాడు. అందువలన “ఇక్కడ మీ కొరకు మూడు పర శా ్ణ లలను మేం కడతాం” అన్నాడు. కానీ అతడు మతి లేకుండా మాట్లాడుతున్నాడు.

మత సంబంధంగా మాట్లాడుతున్నాడా?

అవును, రాజును, రాజ్యాన్ని ఎదుర్కొనేటప్పుడు మాటలు చాలవు.

అయితే తరువాత ఏం జరిగింది?

యేసు బాప్ సతి ్మం పొందినప్పుడు జరిగినదాన్ని గుర్తు చేసుకో?

అవును.

అదే మళ్ళీ జరిగింది. ఒక స్వరం “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినండి.”

ఆఁ!

వారు చూట్ టూ చూశారు. ఆ ఇద రు్ద కనిపించలేదు,

వెళ్ళిపోయారు. యేసు మాత్రమే కనిపించాడు. వారు కొండ దిగుట ఆరంభించగానే యేసు వారితో, “తాను మృతులలోనుండి తిరిగిలేచే వరకు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పవద్దు” అని చెప్పాడు.

ఆయన చెప్పిన దానికి అర ్థం ఏమిటి?

యి-

27


వా

రు కూడా ఆ విషయంలో విస్మయం చెందారు. కానీ దానిని గురించి ఆలోచించే సమయం దొరకలేదు. ఎందుకంటే వాళ్ లు కొండదిగువకు చేరుకోగానే వారు చేసేందుకు మరొకటి కాచుకుని ఉంది.

ఎప్పటిలానే పెద ్ద జన సమూహం, కానీ ఈసారి మిగిలిన శిష్యులు, ధర్మశాస్త్రోప దేశకులతో వాదిస్తున్నారు.

ఏమిటి?

“ఏం జరుగుతుందని” యేసు బిగ ్గరగా అన్నాడు.

ఎవరో ఏడుస్ తూ అన్నారు “నా కుమారుని స్వస త ్థ కోసం నీ వద కు ్ద తీసుకువచ్చాను. దురాత్మ నా కుమారుణ్ణి పట్ టి మూగవాణ్ణి చేసి, అతణ్ణి క్రింద పడేస్తుంది. నోటి వెంట నురుగు కారుతుంది, పండ్లు కొరుకుతాడు. దురాత్మను వెళ గొ ్ల ట మ ్ట ని నీ శిష్యులను అడిగాను అది వారి వల కా ్ల లేదు.”

“విశ్వాసం లేనివారలారా, మీరు నమ్మేందుకు ఎంత కాలం పడుతుంది? ఆ అబ్బాయిని తీసుకు రండి” అన్నాడు. వారు అలాగే చేశారు. ఆ దురాత్మ యేసును చూడగానే, ఆ కుర్రాణ్ణి క్రిందపడద్రోసింది. “ఇలా ఎంతకాలంనుండి జరుగుతుంద”ని ఆ కుర్రాడి నాన్నను అడిగాడు. “చిన్నతనం నుండే” అని “దయచేసి మీరేమైన చెయ్యగలిగితే చేసిపెట ్టండి” అన్నాడు.

్త ను సాధ్యము” అని యేసు అన్నాడు. “నేను చేయగలనని నీవు నమ్ముతున్నావా?” “నమ్మువానికి సమస ము

“నేను నమ్ముతున్నాను” కానీ “సంశయం రాకుండా కాపాడండి” అన్నాడు.

యేసు అపవిత్రాత్మను గద ిం్ద చగానే అది అతనిని విలవిల లాడించి విడిచి పోయింది. ఆ కుర్రాడు కదలక మెదలక పడిపోయాడు. కొందరు అతడు చనిపోయాడని అనుకున్నారు. యేసు అతని చెయ్యిపట్టుకుని లేపిఅతన్ని స్వస ప్థ రిచాడు!

28


-

“తరువాత యేసు శిష్యులు “మేమెందుకు ఆ దురాత్మను పోగొట ్టలేక పోయాం” అని అడిగారు.

“అది ప్రార న్థ , ఉపవాసం ద్వారానే సాధ్యమౌతుంద”ని యేసు జవాబిచ్చాడు.

వాళ్ళు ఆ ప్రాంతమంతా ప్రయాణించారు. ఆ కాలమంతటిలో యేసు జనసమూహాలను విడిచి, శిష్యులతోనే సమయం గడిపాడు.

ఎందుకు?

ఎందుచేతనంటే తానేం ఎదుర్కోబోతున్నాడో ఆయనకు తెలుసు.

లే

కానీ ఆయన రాజు కదా ఇప్పటికే అన్ని పరీక్షల్లో నెగ్గాడు కదా.

దు, ఇంకా ఎదుర్కొనవలసిన ఆఖరి పరీక్ష ఉంది. అది చాలా కష మై ్ట నది, కేవలం దేవుని వద ్ద నుండి పంపబడిన వ్యక్ తి తప్ప ఎవ్వరూ చెయ్యలేరు. యేసు దీనిని తన శిష్యులకు వివరిస్ ,తూ “నేను అప్పగించబడి, చంపబడి, మూడవదినాన్న మృతులలోనుండి తిరిగి లేస్తాను” అన్నాడు.

నాకేమీ అర ్థం కావడం లేదు.

వారికికూడా అర ్థం కాలేదు. కానీ దాని అర ్థం ఏమో ఆయనను

అడిగేందుకు ఇష ప ్ట డలేదు. కానీ ఇది వారి మధ్య తర్కానికి కారణమైంది. వాళ్ళు తాము నివశిస్తున్న ఇంటికి వెళ్ళే దారిలో, రాజ్యంలో ఎవరు గొప్పవారు అని తర్కించుకుంటున్నారు. మీరేమి మాట్లాడు కుంటున్నారని యేసు వారిని అడిగాడు. వాళ్ళు చెప్పేందుకు ఇబ్బంది పడ్డారు. ఆయన కూర్చుని వారందరిని దగ ్గరకు పిలిచి,

“వినండి” “ఎవరు మెుదటి వాడైయుండగోరతాడో, అతడు కడపటివాడును, అందరికీ పరిచారకుడై యుండాలన్నాడు.”

29


అప్పుడు ఆయన ఒక చిన్న పిల వా్ల నిని వారి వద ్ద నిలబెట్ ,టి ఆ చిన్న వాని దగ ్గరకు వచ్చి, అతన్ని తన చేతుల్లోనికి తీసుకుని “ఎవరు ఇట్ టి చిన్న వానిని చేర్చుకుంటారో వాళ్ళు నన్ను పంపిన నా తండ్రిని చేర్చుకున్నట్లు, రాజ్యంలో చేరాలంటే మీరు కూడా చిన్న బిడ ల్డ వంటివారు కావాలి.”

యేసు చెప్పటం కొనసాగిస్ ,తూ “ఈ చిన్న పిల ల్ల లో ఒకనిని ఆటంక పరచువాని మెడకు పెద ్దరాయి కట్ టి సముద్రంలో పడవేయబడుట అతనికి మేలు” అని వారితో పలికాడు.

దీని భావం ఏమిటి? యేసు, పాపం యెుక్క తీవ్రతను ఉపమాన రూపంలో

వివరించాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించనివ్వకుండా ఆటంకపర్చేవాటన్నిటినీ తుడిచి వెయ్యాలి అని చెప్పటమే కాదు. మీరు లోకానికి ఉప్పువలె ఉండాలని కూడా చెప్పాడు.

రు

ఉప్పా? ఎందుకు?

చి కలిగించటం మాత్రమే కాదు, ఆహారాన్ని నిల్వ ఉంచుతుంది. ఉప్పు తన సారాన్ని కోల్పోతె తిరిగి దానిని ఎలా పొందగలదు?

సరే, ఈ రాజ్యంలో జీవించే నీవు ఉప్పువంటివాడవు. ఈ లోకం పూర్ గా తి చెడిపోకుండా కాపాడాలి. 30


అవును, ఎలా జీవించాలో- ఇతరులకు సహాయం చెయ్యటం, వారిని రాజ్యం వద కు ్ద నడిపించటం ఎలాగో యేసు శిష్యులకు చెప్పాడు.

ఎందుచేతనంటే ఆయన రాజు, యేసుకు ఏం జరగబోతుందో తెలుసు. ఇశ్రాయేలు దేశంలో అత్యంత వైభవోపేతమైన దేవాలయ నాశనాన్ని గురించి చెప్పాడు. అక్కడే ఇశ్రాయేలీయుల ముఖ్యమైన మతపండుగలను జరుపుకుంటారు. యుద్ధాలు వస్తాయని, యుద ్ధ సమాచారం వింటారని యేసు చెప్పాడు. నకిలీ మెస్సీయాలు, నకిలీ రాజులు వచ్చి - అనేకులను త్రోవ తప్పిస్తారని, భూకంపాలు, ్త ఉండాలని యేసు కరవులు వస్తాయని- మెలకువకలిగి జాగ్రత గా చెప్పాడు.

ఇది కేవలం ఆరంభం మాత్రమే. “మీరు నా శిష్యులైనందు వలన మిమ్ములను నిర్భందించి, శిక్షవిధిస్తారు. కానీ ఇది నన్ను గురించి చెప్పేందుకు మీకు అవకాశం. తీర్పులో నిలబడినప్పుడు ఏం మాట్లాడాలా అని ఆలోచించకండి. ఆ క్షణంలో దేవుడేం ఇస్తాడో వాటినే మాట్లాడండి. ఆ సమయం భయంకరం. కుటుంబంలోని వారే అప్పగిస్తారు. నీవు నాకు చెందిన వాడవు కావటం వలన అందరూ నిన్ను ద్వేషిస్తారు. అంతం వరకూ సహించినవాడు రక్షింపబడతాడు.” నిన్ను నీవు పరిశీలించుకునేందుకు ఇంకా అనేక హెచ్చరికలను యేసు ఇచ్చారు.

బై

వాటిని ఎక్కడ చూడగలను?

బిల్ దేవుని రాజ్యంలో ఎలా బ్రతకాలో క్షుణ ్ణంగా తెలియచేసే పుస క్త ం. వెంటనే ఒక దానిని తీసుకోండి.

ఇంకా భవిష్యత్‌ను గూర్చి యేసు ఏం చెప్పారు? 31


యేసు హెచ్చరిస్ తూ ఆ భయానక దినాల అంతంలో సూర్యుడు చీకటి అవుతాడు. సమస ్తం

కదిలించబడతాయి. అప్పుడు రాజు గొప్ప శక్ ,తి మహిమలతో ప్రత్యక్షమై, భూమి సుధూర ప్రాంతాలంతటి నుండి ఏర్పరచబడిన వారిని పోగు చేస్తాడు.

ఇదెప్పుడు జరుగుతుంది? తండ్రియైన దేవునికి తప్ప ఆ రోజు గానీ, ఆ గంటగానీ ఎవ్వరికీ తెలియదని యేసు చెప్పాడు. అందుచేత ఆయనకు అత్యంత సన్నిహితంగాను, మెలకువగా ఉండటం చాలా ముఖ్యం.

ఈలోగా, తనకు ఏం జరగబోతుందో యేసుకు తెలుసు. అవి పస్కాపండుగకు సమీప దినాలు.

పస్కా అంటే ఏమిటి?

పూర్వకాలంలో ఐగుప్తు నుండి, ఐగుప్తీయులకు సంభవించిన తెగుళ ్లనుండి దేవుడెలా

విమోచించాడో యూదాప్రజలు జ్ ప ఞా కం చేసుకునే సమయం. వారు ఐగుప్తులో బానిసలుగా జీవించారు, కాని వారిని దేవుడు విడిపించాడు. ఆ పండుగలో భాగంగా గొఱ్రపిల ను ్ల వధిస్తారు. ఆ సమయంలో మతపెద లు ్ద , యాజకులు ఏకమై యేసును పట్టుకుని, ఆయనను వదిలించుకునేందుకు కనిపెట్టుకుని కూర్చున్నారు

32


?

వారింకా యేసుని వెంటాడుతున్నారని నీవు అంటున్నావా? ఇదంతా జరుగుతున్నప్పుడు యేసు ఎక్కడ ఉన్నాడు?

ఎంత వృధా!

అవును. పస్కా సమయంలో తామేమి

చెయ్యలేమని, మరియు అల రి్ల అవుతుందని వారికి తెలుసు.

ఆయన బేతనియలో ఒక ఇంట ఉన్నాడు.

అది యెరూషలేముకు సమీపంలో ఉన్న చిన్న పట ణ ్ట ం. రాత్రి భోజనం వేళ ఒక స్త్రీ విలువగల అత రు ్త బుడ్డితో వచ్చింది. ఆమె ఆ అత రు ్త నంతా యేసు తల మీద పోసింది.

దే అక్కడున్న కొందరు అన్నారు. నిజంగా అది ఖరీదైన అత రు ్త . దానిని అమ్మి పేదలకు ఇవ్వవచ్చుగదా అని వారన్నారు. కానీ యేసుకు వేరే తలంపు ఉంది. “ఆమెను ఎందుకు తొందర చేస్తున్నారు, ఆమెను వదిలిపెట ్టండి” “పేదలు ఎల ్లప్పుడూ మీతో ఉంటారు, నేను మీతో ఉండను గదా” అన్నాడు.

ఆయన మాటల అర ్థం ఏమిటి?

ఆయన ఇంకా చెబుతూ “ఆమె నా భూస్థాపన

నిమిత ్తం నన్ను అభిషేకించింది. ఈమె చేసిన ఈ కార్యం రాబోయే సంవత్సరాల్లో చెప్పుకుంటారు.” అన్నాడు.

ఆయన ఇంకా చనిపోతానని నమ్ముతున్నాడా?

33


అవును, అప్పటికే సంగతులు జరుగుతున్నాయి. యేసు శిష్యులలో ఒకడైన యూదా ఇంతకు ముందే

ప్రధాన యాజకుణ్ణి కలుసుకున్నాడు. ఆయన్ను అప్పగించేందుకు బహుమానాన్ని కూడా పుచ్చుకున్నాడు.

అవును, యేసు ఆయన శిష్యులు

శిష్యులలో ఒకడా? లేదు!

పస్కాపండుగకు సిద ప్ధ డుతున్నారు. వారిలో ఇద రి్ద ని యెరూషలేమునకు పంపి “మీరు పట ణ ్ట ం లోనికి వెళ్ళగానే నీళ ్లకుండను ఎత్తుకుని వచ్చే ఒకనిని చూస్తారు. మీరు అతని వెంటవెళ్ళి అతడు ఇంటిలో ప్రవేశిస్తుండగా, బోధకుడు శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు విడిదిగది ఎక్కడ? అని అడగండి. అతడు మేడగదిలోనికి మిమ్మల్ని తీసుకువెళతాడు అక్కడ అంతా సిద ్ధంగా ఉంటుంది. అక్కడ మీరు పస్కా విందును సిద ్ధం చెయ్యండి” అన్నాడు.

యేసు, ఆయన శిష్యులు అక్కడ పస్కాను

భుజించారు. ఆ సమయంలోనే యేసు మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడని చెప్పాడు.

చాలా ఆశ్చర్యం?

ఏం జరగబోతుందో ఆయనకు ముందేతెలుసని నీవు అంటున్నావా?

అవును!

కానీ, ఆయన ఎందుకు దీనిని ఆపలేదు?

ఇది దేవుని విమోచనా ప్రణాళిక, గుర్తు 34

లేదా? యేసు దేవుని ఉద్దేశం నెరవేర్చేందుకే వచ్చాడు.

ఇది ఆఖరి పరీక్షా?


అవును, అంతా ప్రణాళిక చొప్పుననే జరిగింది. వారు భుజిస్తుండగా యేసు రొట్టెను పట్టుకొని,

కృతజ ్ఞతాస్తుతులు చెల ్లించి, రొట్టెను విరిచి “ఇది నా శరీరము”. ఆయన పాత్రలో ద్రాక్షరసం పోసి “ఇది అనేకుల కొరకు చింధించబడుతున్న నా రక ము ్త , దేవునికి మానవుల మధ్య నిబంధన” అన్నాడు.

ఎంత వింతగా ఉంది!

నేను ఊహించగలను, శిష్యులు కూడా అలాగే తలంచి

ఉంటారు. కానీ ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. దీనంతటినీ ఆ తరువాతనే వారు అర ్థం చేసుకున్నారు.

యేసు ఆ రాత్రి ఏం జరగబోతుందో చెప్పాడు. “మీరందరూ నన్ను విడిచి వెళ్ళిపోతారు” అని ప్రకటించాడు.

“అందరూ నిన్ను విడిచినా, నేను మాత్రం నిన్ను విడువను” అని పేతురు ప్రతి జవాబిచ్చాడు.

“నీవు, నీవే ఈ రాత్రి

కోడి రెండవ మారు కూయకమునుపు, మూడు మార్లు నన్నెరుగనని అబద మా ్ధ డతావు” అని యేసు చెప్పాడు.

“అలా జరగనే జరగదు” అని పేతురు గట్ గా టి అన్నాడు. శిష్యులందరూ అలానే అన్నారు.

వారు ఒలీవల తోట అనబడే గెత్సెమనేకు వెళ్ళారు. వారిని అక్కడనే కూర్చుండమని ఆయన ప్రార్థించేందుకు పేతురును, యాకోబును, యోహానును వెంట బెట్టుకుని వెళ్ళాడు.

ఇంతకు మునుపు చిన్నదానిని బ్రతికించినపుడు ఆయన వీరినే కదా వెంటబెట్టుకుని వెళ్ళింది?

35


అవును, ఆయన వారిని నిజంగా నమ్మాడు. అందువలననే తానెంతగా కలవరపడుతున్నాడో వారితో

చెప్పాడు. తనతో మెలకువగా ఉండమని వారిని అడిగాడు. ఆయన కఠిన నేలపై దేవునికి ప్రార్థించటం ఆరంభించాడు. సాధ్యమైతే ఆ గడియ తొలిగిపోనిమ్మని ప్రార్థించాడు. అయినా దేవుని చిత్తానికి అప్పగించుకోవాలని ఆయనకు తెలుసు. “నీ చిత ్తమే, నా చిత ్తం కాద”ని బిగ ్గరగా అన్నాడు.

ఆఖరి పరీక్ష ఎంత భయానకంగా ఉంటుందో ఆయనకు తెలుసా? తాను చనిపోతాడని ఆయనకు తెలుసా?

అవును!

ఎంత భయంకరం! ఆయన స్నేహితులు ఏం చేశారు? వారేమాత్రం ఉపయోగపడలేదు. యేసు తండ్రికి దుఃఖంతో మెురపెడుతున్నప్పుడు శిష్యులు నిద్రపోతున్నారు.

ఏమిటి?

ఆయన లేచినప్పుడు వాళ్ళు గాఢ నిద్రలో ఉన్నారు. “మీరు

ఒక్క గంట అయినా మెలకువగా ఉండలేరా?” అని ఆయన అడిగాడు. ఆయన మరలా వెళ్ళి మరికొంత సమయం ప్రార్థించాడు. మరలా వారు నిద్రపోయారు. ఆఖరుగా, మూడవసారి వారు నిద్రించటం యేసు చూచి “మీరింకనూ నిద్రిస్తున్నారా? ఇక చాలు సమయం వచ్చేసింది! నేను అప్పగించబడబోతున్నాను” అని అన్నాడు.

36

అటు తరువాత ఏం జరిగింది?


రు.

రు న

నూ

ఆయన ఆ మాటలు చెబుతుండగానే, యూదా, కత్తులు,

గుదియలు పట్టుకొనిన వారితో కలిసి చీకటిలోనుండి వచ్చాడు. యూదా వారికి ముందే చెప్పాడు. ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనను బంధించండని. యూదా, యేసు వద కు ్ద వెళ్ళి ముద్దుపెట్టుకున్నాడు. అలా చెయ్యటం ఆ రోజులలో సాంప్రదాయ పలకరింపు. వెంటనే సైనికులు పైనబడిపట్టుకున్నారు! పేతురు త్వరగా కత్ దూ తి సి, ప్రధాన యాజకుని సేవకుని చెవిని నరికాడు!

“ఆగు!” అని యేసు కేక వేసి, “నేను

భయంకరమైన నేరస్థుడనా, ఈ విధంగా మీరు ఆయుధాలతో బంధించటానికి? నేను ప్రతి రోజు దేవాలయంలో బోధిస్ నేతూ ఉన్నానే, అక్కడెందుకు బంధించలేదు? ఇదంతా లేఖనములు నెరవేరునట్లు జరుగుతుంది” అన్నాడు.

ఆ లేఖనాలేమిటి?

అవన్నీ మనము కలిగియున్న బైబిల్‌లోని పురాతన గ్రంథాలలో ఉన్నాయి. యేసుకు ఏం జరుగుతుందో ముందే వాటిల్లో చెప్పబడింది.

ఆశ్చర్యం! 37


యేసు తనను గూర్చి ముందుగా ఏమేమి జరుగబోతుందని చెప్పాడో, అలానే ఆయనను ఒంటరిగా

విడిచిపెట్ టి శిష్యులందరూ పారిపోయారు. ఆయనను ప్రధాన యాజకుని ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఆయన శత్రువులందరూ, ఆయనకు విరోధంగా సాక్ష్యం చెప్పి, మరణశిక్ష విధించేందుకు అక్కడే కూడుకున్నారు. ఈలోగా పేతురు, వెనుతిరిగి వచ్చి ఆయనను చాటుగా దూరంగా వెంబడించాడు. వారు ఆయనకు విరోధంగా అనేకం చెప్పారు. కానీ అవన్నీ అసమంజసంగానూ, పొంతన లేకుండా ఉన్నాయి. నిజం చెప్పాలంటే వారిలో వారే ఒకరు చెప్పిన దానికి విరోధంగా మరొకరు చెప్పారు. ప్రధాన యాజకుడు మహా ఉద్రేకంతో, “నువ్వు ఒక్క మాట అయినా చెప్పవా?” అని యేసును అడిగాడు. కానీ యేసు మౌనంగా ఉన్నాడు. మరలా ప్రధాన యాజకుడు అడిగాడు. “నీవు దేవుని కుమారుడవైన మెస్సీయావా?”

“అవును” నేను తండ్రి కుడిచేతివైపున అధికారం గలవాడనై కూర్చుండుటయు, మేఘాలపై తిరిగి వచ్చుటయు నువ్వు చూస్తావు” అని యేసు అన్నాడు.

ఆఁ!

ప్ర

ధాన యాజకుడు దానికి మండిపోయి, కోపంతో తన వస్త ల్రా ను చింపుకుని “ఇది దైవ ధూషణ, మనం ఇంకా ఎందుకు ఉపేక్షించాలని ఇతడు మరణానికి అర్హుడు అనటానికి ఇది చాలు” అన్నాడు. వారు యేసుపై ఉమ్మారు, కొట్టారు. కానీ ఆయన ఎదురుతిరుగలేదు. ఆయన కన్నులకు గంతలు కట్ టి ఆయనను హింసించి హేళనగా గేలి చేసారు.

38


కా

ను

ఇదంతా జరుగుతన్నప్పుడు, పేతురు దిగువ ఆవరణంలోనే ఉన్నాడు. అంతా విన్నాడు. ప్రధాన యాజకుని

పరిచారకురాలు అతనిని గుర్తుపట ిం్ట ది. ఆ చిన్నది నీవెవరు అని అడిగి, ఆమె దగ ్గరగా వచ్చి పరీక్షగా చూసింది. “నువ్వు నాకు తెలుసు” “నువ్వు యేసు అనుచరులలో ఒకడివి” అని పలికింది.

“నువ్వేం మాట్లాడుతున్నావో, నాకేం తెలియదు” అంటూ జవాబిచ్చాడు. వెంటనే కోడి కూసింది.

ఆ చిన్నది అతని వెంబడించి, మళ్ళీ అడిగింది, పేతురు మరలా నేనెరుగనని చెప్పాడు. మరి కొంతమంది ఆక్కడికి వచ్చి “నువ్వు తప్పకుండా యేసును వెంబడించిన గలిలయులలో ఒకడివి” అన్నారు.

“మీరేమంటున్నారో నాకు తెలియదు” అని పేతురన్నాడు. కోడి రెండవ మారు కూసింది. యేసు తనతో చెప్పిన మాటలు పేతురుకు జ్ ప ఞా కానికి వచ్చి, అతడు సంతాపపడి ఏడ్చాడు.

యేసు చెప్పిన ప్రకారమే జరుగుతుంది.

ఏమి జరగకపోవచ్చు? యేసు నిష్కారణంగానే మరణం పొందుతాడా!

39


దేవుని ప్రణాళికను జ్ పఞా కం చేసుకో, ప్రతి ఒక్కరిని విమోచించి, తన రాజ్యాన్ని భూమికి తీసుకురావాలి

కదా? యేసు వీటన్నింటి గుండా వెళ్ళాలి. పాపరుణం చెల ్లించుటకు ఇదొక్కటే మార ్గం. మరుసటి రోజు ఏం జరిగిందో చూడు, యేసును రోమా గవర్నరు పిలాతు వద కు ్ద తీసుకెళ్ళారు. అతను “నువ్వు యూదుల రాజువా?” అని అడిగాడు. “అవును” అని యేసు బదులు పలికాడు.

అప్పుడు మత పెద లు ్ద పిచ్చిపట్ న టి ట్లు, ఆయనకు విరోధంగా అనేకం చెప్పారు.

మరి యేసు ఏమన్నారు? ఏమీ అనలేదు.

ఏమిటి?

40


ఆయన ఏమీ మాట్లాడకపోవుట చూచి పిలాతు ఆశ్చర్యపోయాడు. నిన్ను నువ్వు సమర్థించుకోమని

పిలాతు యేసుతో చెప్పాడు. అయినా యేసు మౌనంగానే ఉన్నాడు. ఇప్పుడు, పస్కా సమయం గనుక ఒక ఖైదీని విడుదల చేసే ఆచారం పిలాతుకుంది - ప్రజలు కోరిన ఎవరైనా విడుదల చేయవచ్చు.

గొప్ప సంగతి! నాకు తెలుసు జన సమూహం యేసునే విడుదల చేయమని కోరి ఉంటారు.

లేదు, మత పెదలు్ద ప్రజల మనుసులను తిప్పి వేశారు. నరహంతకుడైన బరబ్బాను కోరమని ప్రేరేపించారు.

పిలాతు కూడా అలాగే అనుకున్నాడు. అతడు

ప్రజలకు మరో అవకాశమిచ్చాడు. యేసుని ఏమి చెయ్యమంటారో మీరే చెప్పండి అన్నాడు.

ఎంత అవివేకం!

మళ్ళీ...?

“శిలువ వేయండి” అని అరిచారు.

దాని అర ్థం ఏమిటి?

రో

మీయులు కనిపెట్ నటి భయంకరంగా శిక్షించే విధానం, కొయ్య శిలువకు కాళ్ళు చేతులను మేకులతో దిగగొడతారు. నేరస్థుడు అక్కడ వ్రేలాడుతున్నప్పుడు ఊపిరి కూడా పీల్చుకోలేడు. ఊపిరి పీల్చుకోవాలంటే మేకులను ఆసరా చేసుకోవాలి. గాయాల నుండి రక ్తం స్రవిస్తుంది. ఊపిరి పీల్చుకునే ప్రతి సారి ఇలాగే జరిగి తీవ్రంగా శక్ తిహీనుడై, ఊపిరికూడా అందనంతటి పరిస్ థితి ఏర్పడి మరణిస్తాడు. ఇది భయానకమైన చావు.

పిలాతు, యేసు చేసిన నేరం ఏమిటి? అని అడిగాడు. వారు కోపంతో వేసిన కేకల ముందు అతని ప్రశ్న కొరగానిదై పోయింది. ఇక అతనికి మరో అవకాశం లేదు. ప్రజలను సంతోషపర్చటం తప్ప. బరబ్బాను విడుదల చేసి యేసును హింసించటానికి అప్పగించాడు. కొరడాకు చివర సీసం ముళ ్ల కొక్కాలతో ఆయనను హింసించి సిలువకు తీసుకు వెళ్ళారు.

ఇది భయంకరం!

రిస్ తి థి మరింత ధారుణమైంది. యేసు శిలువ వేయబడక ముందే తీవ్రంగా శ్రమపొందాడు. సైనికులు ఆయనను ఎగతాళి చేశారు. యేసుకు రాజులాగా ఉదారంగు వస్త లు ్రా ధరింపచేసి, తలకు ముళ ్ల కిరీటం పెట్ టి ఆయన ఎదుట మోకరించి నమస్కారం చేసి అపహసించారు. ఆయనను కొట్టారు, ఉమ్మారు. ఇలా గంటల తరబడి చేసి, అటు తరువాత శిలువ వేసేందుకు తీసుకువెళ్ళారు.


ఆయన ఈ పరిస్ థితులన్నిటి నుండీ వెళ్ళాడా? నేను నమ్మలేక పోతున్నాను. ఇదేనా విమోచనా ప్రణాళిక!

ఇంకా అయిపోలేదు- ఇంకా ఉంది వినండి. వారు యేసును గొల్గొతా అనే కొండకు

తీసుకువచ్చారు. అంటే కపాల స ల్థ ం అని దానర ్థం. ఆయనకు చేదు కలిపిన ద్రాక్షారసాన్ని ఇచ్చారు. అది నొప్పి తెలియకుండా చేస్తుంది. కానీ యేసు దానిని నిరాకరించాడు. అప్పుడు మేకులతో ఆయనను శిలువకు కొట్టారు. అప్పుడు ఉదయం తొమ్మిది గంటలైంది. ఆయన తలకు పైగా శిలువపై “యేసు యూదులకు రాజు” అని వ్రాసి ఉంచారు. త్రోవన వెళుతున్న వారు గేలిచేస్ తూ “శిలువపై నుండి దిగివచ్చి- రాజునని నిరూపించుకో!” అన్నారు. ఇద రు ్ద దొంగల్ని కూడా ఆయనకు ఇరువైపులా శిలువ వేశారు. ఆ దొంగలు కూడా ఆయనను అపహసించారు.

ఇదా దీని ముగింపు? అసాధ్యం! 42


లేదు! మధ్యాహ్నం అకస్మాత్‌గా అంతా చీకటి

కమ్మింది. ఆ ప్రాంతమంతా గాఢాంధకారం. అప్పుడు యేసు బిగ ్గరగా “నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి?” అని పలికాడు. ఆయన ఆఖరి శ్వాస విడిచి మరణించాడు. సరిగ్గా అప్పుడే ఆశ్చర్యమైన సంగతులు జరిగాయి.

ఏమిటి?

43


దేవాలయంలో ఒక దళసరి

తెర అతి పరిశుద ్ధ స లా ్థ న్ని దేవాలయంలోని మిగిలిన భాగాన్ని వేరు చేస్ తూ ఉండేది. దీనిని అడ్డు తెర అంటారు. ఈ తెరలోనికి ప్రధాన యాజకుడు మాత్రమే అదీ సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళెందుకు అనుమతి ఉంది. యేసు మరణించగానే ఆ తెర పైనుండి క్రిందివరకు నడిమికి చిరిగింది!

ఆఁ! అయితే ఇప్పుడు అందరూ ప్రవేశించవచ్చు?

అవును, యేసుమరణం ద్వారా అందరూ దేవుని వద కు్ద నేరుగా రావచ్చు. మరిక ఏ యాజకుని మధ్యవర్ త తి ్వం అక్కరలేదు.

సాయంత్రం అయ్యింది, అరిమతయి యోసేపు అనే వ్యక్ తి యేసును సమాధి చేసేందుకు ఆయన దేహాన్ని ఇమ్మని, పిలాతు అనుమతి అడిగాడు. సైనికులు ఆయన చనిపోయాడా అని నిర్థారించుకునేందుకు పరీక్షించారు. యోసేపు యేసు దేహాన్ని వస్త్రంతో చుట్ టి సమాధిలో ఉంచి, రాతితో దానిని మూశాడు. పిలాతు ఆ సమాధి ముంగిట అడ ్డంగా పెద ్ద రాయిని పెట ిం్ట చమని ఆజ్ ఞాపించాడు. ఎందుచేత నంటే మత పెద లు ్ద యేసు అనుచరుల్లో ఎవరైనా ఆ దేహాన్ని దొంగిలిస్తారేమోనని తలంచారు.

అయితే ఇంతేనా ముగింపు, అవునా? 44

పె


లేదు, అయిపోలేదు. ఆ సమాధి ఎక్కడ ఉందో

ఇద రు ్ద స్త్రీలు చూసారు. సబ్బాతు ఆరంభం కాబోతోంది, యేసు దేహానికి సుగంథ పరిమళాలు కొని, యేసు దేహంపై చల టా ్ల నికి మరుసటి ఉదయం వరకూ ఆగాలి. వారం యెుక్క మెుదటి రోజు. సూర్యోదయాన్న, ఒక స్నేహితురాలిని వెంటబెట్టుకుని సమాధి వద కు ్ద వచ్చారు.

కానీ పెద ్దరాయి సంగతేమిటి?

ఏమిటి?!

రిగ్గా వారు కూడా అదే అనుకున్నారు. ఏం చేద్దాం, ఎవరు ఆ రాతిని దొర్లిస్తారు, అనుకుంటూనే సమాధి వద కు ్ద వచ్చారు. వారు సమాధి వద కు ్ద రాగానే అప్పటికే ఆ రాయి దొర్లించబడి ఉండటం చూశారు?

45


వారు త్వరగా లోనికి వెళ్ళి చూశారు,

దేహం లేదు! దేహానికి బదులు, ఆ సమాధిలో తెల ని్ల వస్త లు ్రా ధరించిన దేవదూత కూర్చుని ఉన్నాడు. అతడు వారితో “నిర్ఘాంత పోకండి! యేసు ఇక్కడ లేడు! ఆయన మృతులలోనుండి లేచాడు! ్థ న్ని ఇదిగో ఆయన దేహం ఉంచబడిన స లా చూడండి. తిరిగివెళ్ళి, ఆయన శిష్యులతో ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళుతున్నాడని చెప్పండి, ఆయన చెప్పినట్లే మీరక్కడ ఆయనను చూస్తార”ని చెప్పాడు.

ఆ స్త్రీలు భయపడి, పరిగెత్తారు. తరువాత రోజు ఉదయం ఆ స్త్రీలలో ఒకరు యేసును కలిసి మాట్లాడింది. ఆమె పరుగెత్ తి శిష్యులకు చెప్పినా ఎవరూ నమ్మలేదు.

నిజమే! ఎవరు నమ్ముతారు?

కాని దూత చెప్పిన ప్రకారం యేసు తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు మరలా మరలా కనిపించాడు.

ఎలా?

46

ఆయన శిష్యులలో ఇద రు్ద యెరుషలేము మార ్గమున నడుస్తున్నప్పుడు యేసు

వచ్చి కలుసుకున్నాడు. కానీ మొదట వారు గ్రహించలేదు. - ఆ తరువాత ఎప్పుడైతే గ్రహించారో మిగతా వారికి చెప్పడానికి పరిగెత్తారు.

తరు

విష చెప పొం

అవు

నుండి తెలు జీవి

ప్రభు సత్యాన్ని నేను

ఆకా అడు

మీ నాకొ నా జీ కోరు

నీ కా నా హ


మె

తరువాత, మిగిలిన పదకుండు మంది భోజనం చేస్తుండగా యేసు వారికి ప్రత్యక్షమైయ్యాడు. జరిగిన

విషయాలను గూర్చి, ఎందుకు నమ్మలేదని వారిని అడిగి, “మీరు లోకమంతటికి వెళ్ళి ప్రతి ఒక్కరికి సువార ను ్త చెప్పండి! నమ్మి బాప్ స తి ్మం పొందినవారు రక్షించబడతారు, ఎవరైతే నమ్మక వ్యతిరేకిస్తారో వారు తప్పక శిక్ష పొందుతారని” వారితో చెప్పాడు.

ఆహాఁ, యేసు నిజంగా మృతులలో నుండి తిరిగిలేచాడా!

అవును, ఇదే దేవుని ప్రణాళిక! యేసు ప్రజలను పాపం నుండి మరణం

నుండి విడిపించటానికే వచ్చాడు. తన మరణ పునరుత్థానాల ద్వారా దేవున్ని తెలుసుకునేందుకు మార ్గం తెరిచాడు. ఆయన యందు నమ్మిక ఉంచు, నీ జీవితం మార్పు చెందుతుంది. నీవు ఈ ప్రార న్థ ను చెయ్యి: ప్రభువైన దేవా, నిన్ను గూర్చి నాకు బయలుపర్చుకున్నందుకు, నన్ను గూర్చిన సత్యాన్ని తెలియ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి నా పాపాన్ని క్షమించు. నేను నిజంగా పశ్ఛాత్తాప పడుతున్నాను!

ఆకాశాన్ని భూమిని నీవే సృజించావు. సమస్తాన్ని సృజించింది నీవే. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నాలో నూతన జీవాన్ని కలిగించు.

మీ ప్రియకుమారుని నాకొరకు పంపినందుకు ధన్యవాదాలు. యేసు- రాజునాకొరకు మరణించి నాకొక నూతన ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ రోజున నేను నిన్ను నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను. నేను నీ రాజ్యంలో జీవించి, నీ ప్రణాళిక నా జీవితంలో నెరవేరాలని కోరుతున్నాను. సహాయకునిగా పరిశుద్ధాత్మను పంపినందుకు ధన్యవాదాలు.

నీ కార్యాలన్నింటినీ చూచేట్లు నా కన్నులు తెరవండి. నీ ఉపదేశమంతా వినేందుకు నా చెవులను తెరవండి. నా హృదయం, నా మనస్సు నీపై లగ్నం చేసేట్లు సహాయం చేయండి.

47


ఇప్పుడు ప్రార్థించిన నీవు,

యేసుక్రీస్తు రాజ్యంలో ప్రవేశించావు. వారంలో ప్రతి రోజు ఆయన రాజ్యంలో ఎలా జీవించాలో నేర్చుకోవాలి!

అతి ప్రాముఖ్యం, ప్రపంచానికే రాజైన ఆ దేవునితో అనుబంధాన్ని వృద్ధి చేసుకో. అది ఎలా చేయగలవంటే: ప్రార న్థ లో ఆయనతో మాట్లాడుట ద్వారా. నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావో ఎక్కడైనా, ఎప్పుడైనా ఆయనకు చెప్పవచ్చు. ఎల ్లప్పుడూ ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండవచ్చు. బైబిల్‌చదువుట ద్వారా- కానీ నిన్ను నడిపించడానికి పరిశుద్ధాత్ముని సహయం అడుగు. బైబిల్‌, నీవు సేకరించిన పాత పుస కా ్త లకంటే విలువైనది. పరిశుద్ధాత్మ సాయంతో చదివినట యి ్ల తే నీ జీవితపు ప్రతి పరిస్ తి థి లో నడిపింపు దొరుకుతుంది.

ఈలోకంలో యేసు కొరకు ఆసక్ తి కలిగి ఆయన రాజ్యంలో ఇక్కడ జీవిస్తున్నవారిని కనుగొనండి. ఇలాంటి వారు (మీ ఊరి చర్చిలో) స్థానిక సంఘాలలో, లేక ప్రతి చోటా ఉంటారు.

ఏది జరిగినా గానీ, కృతజ త ్ఞ భావం కలిగి ఉండండి. ప్రతి రోజు ఆయన ఇచ్చే వరమని దేవునికి వందనాలు చెప్పండి. మరియు అన్ని వేళలా ఆయన మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి.


విరాళం: రూ. 10/-



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.