TOLLYWOOD.NET DECEMBER 2019 | VOL 16 | ISSUE 12/1 | Rs.20/-
/tollywood
/tollywood
p
RNI NO: APTEL/2003/10076
ముఖ్య కథనాలు
NEWS HAPPENINGS
“THE BEST AND MOST BEAUTIFUL THINGS IN THE WORLD CANNOT BE SEEN OR EVEN TOUCHED - THEY MUST BE FELT WITH THE HEART.”
LIFE style
Murali Mohan Ravi
HOT SPICY
Credits: Editor in Chief VP Sales and Marketing Associate Editor Telugu Content Writer Telugu Content Writer English Content Writer Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant
: : : : : : : : :
CHIT CHAT
Murali Mohan Ravi Sanathan Prathama Singh Vihari Yoganand Venu Gopal Krishna Moulali Deshamoni Vincent Raghurama Raju Kalidindi
BEAUTY t ps
BEHIND THE WOODS
LOCAT ON
FOR ADVERTISEMENT ENQUIRES CALL : +91 7702 555 873
Follow Us On :
fash on
అం2 దాల రాక్షసి సినిమాతో
TICKET TOLLYWOOD
wanna be featured
Email: editor@tollywoodmag.com I www.tollywood.net
in
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2019
మాటల
మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ లో టాప్ దర్శకులలో ఒకరు. ఈయన సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువే. దానికన్నా త్రివిక్రమ్ మాటలు అంటే చెవి కోసుకునే ఫ్యాన్స్ లక్షల్లో ఉన్నారు. కేవలం త్రివిక్రమ్ మాటలకోసమే సినిమాలు చూసేవాళ్ళు కూడా ఎక్కువే. నిజాయితీగా
మాట్లాడుకుంటే త్రివిక్రమ్ దర్శకుడు అయ్యాక కంటే అవ్వకముందు త్రివిక్రమ్ రచనలకు ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. స్వయంవరం, చిరునవ్వుతో, నువ్వే కావాలి, వాసు, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు.. ఇలా త్రివిక్రమ్ పెన్ను పడిన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే. త్రివిక్రమ్ కు తెలుగు భాష మీద ఉన్న
subscription
2 Year ( 24 issues) : Rs 380
Name:_______________________________________________________________________ Address: _____________________________________________________________________ ____________________________________________________________________________ City: ____________________________ Pin:________________________________________ Phone Number: ___________________Email Id:_____________________________________ Please find enclosed cheque/dd no: _________________________ Date: ________________
editor@tollywoodmag.com పట్టు అటువంటిది. దర్శకుడయ్యాక పెన్ను నుండి వచ్చే చెమకులు కొంచెం తగ్గినా ఇప్పటికీ త్రివిక్రమ్ సినిమా అంటే డైలాగ్స్ కు ఫేమస్. త్రివిక్రమ్ కు తెలుగు భాష మీద ఉన్న పట్టు అటువంటిది. త్రివిక్రమ్ లోని దర్శకుడ్ని, రచయిత కాపాడిన సందర్భాలు కోకొల్లలు. దుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడూ నేల విడిచి సాము చేయలేదు. తన బలమేంటో, బలహీనత ఏంటో త్రివిక్రమ్ కు బాగా తెలుసు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా ఫ్యామిలీ సెంటిమెంట్స్, డ్రామా,యాక్షన్, కామెడీ ఈ జోనర్లను టచ్ చేస్తూనే సినిమా చేస్తూ వస్తున్నాడు. ఇందులో కూడా ఫ్యామిలీ సెంటిమెంట్స్, కామెడీ ప్రధానంగా తీస్తున్నాడు. ల వైకుంఠపురములో తర్వాత ఎన్టీఆర్ తో చేయబోతున్న సినిమాను త్రివిక్రమ్ ప్యాన్ ఇండియాగా తీయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే త్రివిక్రమ్ ఈ కథకు సంబంధించిన లైన్ ఎన్టీఆర్ కు వినిపించడం కూడా పూర్తయిందని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఫ్రీ అవుతాడు. ఆర్ ఆర్ ఆర్ నుండి ఫ్రీ అయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలో జాయిన్ అవుతాడు. దాదాపు 200 కోట్ల బడ్జెట్ ఉంటుందని ప్రాధమికంగా అంచనా వేశారు. ఎన్టీఆర్ ఆర్
IN FAVOUR OF : VIBHU MEDIA PVT LTD Mailing Address: #8-3-833/A, Flat No.105, Ground Floor, B Block, Usha Enclave, Srinagar Colony, Hyderabad - 500073. Contact: +91 7702555873 Terms & Conditions 1. Rates are valid for Hyderabad only. For delivery to other parts of Andhra Pradesh add Rs 40 per 12 issues, Rs 80 for 24 issues. 2. Vibhu Media PVT LTD is not responsible for postal delays or delivery failures. 3. Subscriptions are not refundable. 4. All disputes are subject to the exclusive jurisdiction of competent courts in Hyderabad only.
అ
తెలుగు కి పరిచయమైన లావణ్య sex ఇండస్ట్రీ psychology త్రిపాఠి చాలా తక్కువ కాలంలోనే హీరోయిన్ top గా పేరు తెచ్చుకుంది . అయితే ఆమె చాలా తక్కువ సక్సెస్ఫుల్ చిత్రాల్లో నటించడం N GHT Life వల్ల ఆమె కెరీర్ ఎప్పుడూ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళలేదు. tradeత్రిపాఠి GUIDE లావణ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ అంటే భలే భలే మగాడివోయ్, My CHOICE సోగ్గాడే చిన్ని నాయన మాత్రమే. ఈ రెండు చిత్రాలు భారీ సక్సెస్ సాధించినా QUIZ దాని చుట్టూ వచ్చిన ప్లాప్స్ ఆమె కెరీర్ ను దెబ్బ తీశాయి. అందం, అభినయం COMPETET ON రెండూ ఉన్నా కూడా లావణ్య కెరీర్ సక్సెస్ లేని కారణంగానే ముందుకు d ary వెళ్ళలేదు. దీంతో ప్రస్తుతం లావణ్య B RTHDAYS త్రిపాఠి కెరీర్ లో సినిమాలే లేవు. ఎన్నో ఆశలు పెట్టుకున్నVE అర్జున్ సురవరం EXCLUS ఏడాది పాటు వాయిదా పడడంతో బజ్ మొత్తం పోయింది. దీంతో ఈ సినిమా వల్ల లావణ్యకు పెద్ద ఒరిగేదేమి లేదు. LittleStar యినా ఈ సినిమా ప్రమోషన్స్ కోసం లావణ్య హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మీడియా ఆమె చేతిలో సినిమాలు లేవన్న విషయాన్ని గుర్తు చేసారు. అయితే లావణ్య త్రిపాఠి ఈ విషయాన్ని చాలా కూల్ గా తీసుకుంది. తనకు సినిమాలు లేకపోవడం కాదు, తనకే వచ్చిన స్క్రిప్ట్ లు నచ్చక చేయలేదు అంటోంది. తనకు ఈ నెంబర్ రేస్ ల పట్ల నమ్మకం లేదని, చేసిన రెండు, మూడు సినిమాలు నిలిచిపోవాలని కోరుకుంటున్నా అంటోంది. నా కెరీర్లో గ్యాప్ రాలేదు.. కావాలని నేనే గ్యాప్ తీసుకున్నా అంటోంది లావణ్య. ఇదంతా బానే ఉంది కానీ అసలు వచ్చిన ప్రాజెక్ట్ లు వద్దనేంత రేంజ్ లో లావణ్య ఉందా అనేది అసలు డౌట్.
అ
send your details and portfolio to
అం
1 year (12 issues) : Rs 200
RAZZI
PA
ఆర్ ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా సినిమా చేయాలనే నిర్ణయించుకున్నాడు కానీ బయట దర్శకులని కన్సిడర్ చేసాడు. తమిళ్ స్టార్ దర్శకుడు అట్లీ, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్.. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా కమిట్ అవ్వాలని చాలా రోజులు ఆలోచించాడు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజల అభిరుచి, తన బలం వగైరా అంశాల గురించి అవగాహన ఉన్న తెలుగు దర్శకుడైతే మేలని త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఓటేసినట్లు తెలుస్తోంది. రి త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారి తన కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి చేయబోతున్న ఈ ప్రయత్నం సక్సెస్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం.
మ
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 3
4 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
డి
సెంబర్ ప్యాక్ అయిపోయింది. డిసెంబర్ 5న కార్తికేయ నటించిన 90ml సినిమా విడుదలవుతుంటే, డిసెంబర్ 6న కమెడియన్ శ్రీనివాస రెడ్డి దర్శకనిర్మాతగా మారి హీరోగా కూడా చేసిన భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు సినిమా వస్తోంది. ఇక ఇప్పటిదాకా నిరసించిపోయిన థియేటర్లకు కళ తెచ్చేందుకు పెద్ద సినిమాలు ప్రేక్షకుల ముందుకు ఆ తర్వాత వారం నుండి వస్తున్నాయి. డిసెంబర్ 13న వెంకటేష్, నాగ చైతన్య కలిసి నటించిన మల్టీస్టారర్ వెంకీ మామ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డిసెంబర్ 20న క్రిస్మస్ హాలిడే అడ్వాంటేజ్ ఉండడంతో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే, నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సినిమా రూలర్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక డిసెంబర్ 25న రాజ్ తరుణ్ నటించిన లవ్ స్టోరీ ఇద్దరి లోకం ఒకటే వస్తోంది. ది అయిపోయాక సంక్రాంతి సినిమాల సందడి మొదలవుతుంది. ఇప్పటికే సంక్రాంతి సినిమాల హంగామా మొదలైపోయింది. డిసెంబర్ 9న రజినీకాంత్ దర్బార్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక జనవరి 11న మహేష్ 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు, జనవరి 12న అల్లు అర్జున్ లేటెస్ట్ ఎంటర్టైనర్ అల వైకుంఠపురములో చిత్రాలు
బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 15న నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా సినిమా ద్వారా కామ్ గా వచ్చి సూపర్ హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు. సంక్రాంతి హంగామా అయిపోయాక రిపబ్లిక్ డే హాలిడేకి జనవరి 24న మాస్ మహారాజా సినిమా డిస్కో రాజా విడుదల కానుంది. ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ జనవరి 25న అనుష్క సైలెంట్ థ్రిల్లర్ నిశ్శబ్దం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అవకాశముంది. ఇలా డిసెంబర్, జనవరి నెలలు వరస సినిమాలతో ఫుల్ ప్యాక్ అయిపోయి ఉన్న నేపథ్యంలో అన్ సీజన్ అయినా కూడా ఫిబ్రవరికి కూడా క్రేజ్ ఉన్న సినిమాలే మన ముందుకు రానున్నాయి.
ముం
దుగా ఫిబ్రవరి 7న శర్వానంద్, సమంత కలిసి నటించిన 96' సినిమా విడుదల కానుంది. ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడో పూర్తైపోయినా సరైన రిలీజ్ డేట్ కోసం ఫిబ్రవరికి వాయిదా వేసాడు నిర్మాత దిల్ రాజు. ఇక ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ చిత్రం వరల్డ్ ఫేమస్ లవర్ విడుదల కాబోతోంది. ఈ సినిమా ఎప్పుడో మొదలైనా కూడా విజయ్ దేవరకొండ ముందు డియర్ కామ్రేడ్ ను పూర్తి చేయడంతో ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ చిత్రం ఇంకా ఒక షెడ్యూల్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు వంటి మంచి సినిమాను తీసిన క్రాంతి మాధవ్ ఈ సినిమాకు దర్శకుడు. ఫిబ్రవరి 21న నితిన్, రష్మిక మందన్న కలిసి నటించిన భీష్మ ప్రేక్షకులను పలకరించనుంది. ఛలో తో మంచి హిట్ అందుకున్న వెంకీ కుడుముల దీనికి దర్శకుడు. ఇలా ఫిబ్రవరిలో కూడా ఆసక్తికర సినిమాలే విడుదలవుతున్నాయి. మరి వీటిలో ఎన్ని విజయాలు సాధిస్తాయో చూడాలి.
ఇ
ఇస్మార్ట్
శంకర్ తో తిరుగులేని హిట్ అందుకున్నాడు పూరి జగన్నాథ్. దర్శకుడిగా తనలోని సత్తా ఇంకా తగ్గిపోలేదని నిరూపించిన సినిమా అది. వరస ప్లాపులతో ఉన్న ఇటు పూరి జగన్నాథ్ కు, అటు రామ్ కు కూడా ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ డబల్ కిక్ ఇచ్చింది అనడంలో ఆశ్చర్యం లేదు. ఒకవైపు రామ్ తన తర్వాతి సినిమా రెడ్ షూటింగ్ లో బిజీ అయిపోయాడు. తమిళ సూపర్ హిట్ చిత్రం తడంకు రిమేక్ గా ఆ సినిమా తెరకెక్కుతోంది. ఏప్రిల్ 9కి విడుదల చేయాలి అనుకుంటున్నారు. మరోవైపు పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమా విజయ్ దేవరకొండతో ఉంటుందని ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో ఉన్న పూరి జగన్నాథ్, మరోవైపు తన కొడుకు హీరోగా నటిస్తోన్న రొమాంటిక్ నిర్మాణ కార్యకలాపాలలో కూడా భాగం పంచుకుంటున్నాడు. ఈ సినిమాను పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెల్సిందే. జా సమాచారం ప్రకారం ఈ చిత్రం గోవా షెడ్యూల్ ను పూర్తి చేసుకుని హైదరాబాద్ చేరుకుంది. గత నెల రోజుల నుండి గోవాలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైన సీన్లను చిత్రీకరిస్తున్న సంగతి తెల్సిందే. ఆకాష్ పూరి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఢిల్లీ భామ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో సీనియర్ నటి రమ్య కృష్ణ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఈ ఇటీవలే ప్రకటించారు. ఆమె కూడా గోవా షెడ్యూల్ లో పాల్గొన్నారు. కొన్ని రోజుల విరామం తర్వాత హైదరాబాద్ లో నెక్స్ట్ షెడ్యూల్ మొదలవుతున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ ను వచ్చే ఏడాది మార్చ్ కల్లా
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి
దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ప్రతిరోజూ పండగే. ఈ సినిమా ఇటీవలే ఒక్క పాట తప్పితే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న విషయం తెల్సిందే. ఈ పాట చిత్రీకరణ ఇప్పుడు జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. థమన్ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పెప్పీ నెంబర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన గ్రాండ్ సెట్ లో చిత్రీకరిస్తున్నారు. ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. త్రలహరి సినిమాతో డీసెంట్ హిట్ ను అందుకున్న సాయి ధరమ్ తేజ్ కు ప్రతిరోజూ పండగే హిట్ అవ్వడం ఎంతో ముఖ్యం. ఈ సినిమా సక్సెస్ తిరిగి రైట్ ట్రాక్ లో పడాలని చూస్తున్నాడు తేజ్. ప్రతిరోజూ పండగే డిసెంబర్ 20న విడుదల కానున్న విషయం
చి
తెల్సిందే. తేజ్ సరసన ఈ చిత్రంలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలోని రెండు పాటలను విడుదల చేసారు. ఈ రెండూ కూడా ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. సినిమా చాలా ఆహ్లాదంగా సాగిపోతుందని తప్పకుండా అందరికీ నచ్చుతుందని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ప్రధానంగా సాగుతుందని తేజ్ కు తాతగా నటించిన సత్యరాజ్ పాత్ర ఈ చిత్రానికి ప్రధాన హైలైట్ అని అంటున్నారు. దీంతో పాటు రావు రమేష్ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉండబోతోంది. గీత ఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మరి తేజ్ ఎదురుచూస్తున్న ఆ భారీ హిట్ ఈ చిత్రంతో వస్తుందేమో చూడాలి.
తా
పూర్తి చేసి వేసవిలో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అనిల్ పాడూరి ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నా పూరి జగన్నాథ్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 5
6 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
B RTHDAYS EXCLUS VE
LittleStar
నటీనటులు: సందీప్ కిషన్, హన్సిక, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ, ప్రభాస్ శీను, రఘు బాబు తదితరులు దర్శకత్వం : జి నాగేశ్వర రెడ్డి నిర్మాత : అగ్రహారం నాగి రెడ్డి సంగీతం : సాయి కార్తీక్ విడుదల తేదీ : నవంబర్ 15, 2019
మరి అప్పుడు తెనాలి ఏం చేస్తాడు? ఈ కేసు వల్ల తన జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది. మధ్యలో రుక్మిణి (హన్సిక)తో లవ్ ట్రాక్ కూడా నడుపుతుంటాడు మనోడు. ఇంతకీ రుక్మిణికి మెయిన్ కథకు సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సినిమా చూసి సమాధానాలు తెలుసుకోవాల్సిందే.
FilmMaking Kollywood Bollywood నటీనటులు : రేటింగ్ : 2/5 Interview SpecialStory Hollywood అసలు హిట్టు అన్న పదమే మరిచిపోయినట్టుగా వరస ప్లాపులు కొట్టిన సందీప్ కిషన్, రీసెంట్ గా నిను వీడను నీడను నేనే చిత్రంతో కొంత ఊరట పొందాడు. ఇక ఇప్పుడు తెనాలి రామకృష్ణ బీఏ బిఎల్ సినిమాతో మాస్ కామెడీ చేయడానికి సిదమై ్ధ పోయాడు. మరి సందీప్ కిషన్ కొట్టుకుంటున్న భారీ హిట్ ఈ సినిమాతో వచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా?
కథ :
తెనాలి రామకృష్ణ (సందీప్ కిషన్) ఒక ఛోటా లాయర్. ఏవో చిన్న చిన్న సెటిల్మెంట్లు చేసుకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. ఏదైనా కేసు పట్టాలని చెప్పి ఆఫర్లు కూడా ప్రకటిస్తాడు. అయినా ప్రయోజనం ఉండదు. తన లైఫ్ ను మార్చేసే కేసు రావాలని ఎదురుచూస్తుంటాడు. సరిగ్గా అదే సమయంలో ఒక మర్డర్ మిసరీ ్ట కేసులో వరలక్ష్మి (వరలక్ష్మి శరత్ కుమార్) కేసు వాదించాల్సి వస్తుంది.
సందీప్ కిషన్ మంచి నటుడన్న విషయం అందరికీ తెల్సిందే. అయితే ఈ చిత్రంతో తన నటనను కామెంట్ చేయలేము. అలా అని బాగా చేయలేదని కాదు. ఎప్పట్లానే చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ చిత్రంలో కామెడీ, డ్యాన్స్, ఎమోషన్ ఇలా అన్నీ ఉన్నాయి. తనదైన ఎనర్జీతో నటించేసాడు. హన్సిక గురించి చెప్పుకోవడానికేం లేదు. అసలు ఆమె పాత్ర ఏమాత్రం బాగోనప్పుడు ఇక పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకునేది ఏముంటుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఏదైనా పాత్రకు బలం తేగలదు. ఆ ఇంటెన్సిటీ ఆమెలో ఉంది. కానీ ఎందుకని అన్నీ ఒకలాంటి పాత్రలేఎంచుకుంటోందో అర్ధం కాదు. రఘుబాబుకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర పడింది. మురళి శర్మ విసిగిస్తాడు. వెన్నెల కిషోర్, సప్తగిరి, ప్రభాస్ శీను లాంటి వాళ్ళు కామెడీ చేయడానికి కషప ్ట డ్డారు. మిగతా వారంతా మాములే.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో సాంకేతిక నిపుణుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ఎడిటింగ్ చాలా బ్యాడ్. చాలా సన్నివేశాలు సడెన్ గా ఎండ్ అయిపోయిన భావన
కలుగుతుంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ బాలేదు. సంగీతంలో కొతద ్త నమేం లేదు. సాయి కార్తీక్ తన పాత పాటలనే అటు తిప్పి ఇటు తిప్పి కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్గా లు ఉంది. తెనాలి రామకృష్ణ రైటింగ్ దగ్గరే ఫెయిల్ అయింది. కామెడీ అంటే కేవలం బూతే అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. డబల్ మీనింగ్ జోకులు ఈ సినిమాలో కోకొలలు ్ల . కొన్ని విసుగు తెప్పిస్తాయి. నిజజీవితంలో జరిగిన కోడి కత్తి వంటి సంఘటనలపై జోకులు బానే పేలాయి. జి నాగేశ్వర రెడ్డి దర్శకుడిగా సినిమాకు న్యాయం చేయలేకపోయాడు. సినిమాలో ఎక్కడా కన్సిస్టెన్సీ ఉండదు.
చివరిగా :
జి నాగేశ్వర రెడ్డి అసలు ఫామ్ లో లేడు. తన రీసెంట్ హిట్ ఏంటనేది గుర్తు తెచ్చుకోవడం కూడా కషమే ్ట . తన పాత సినిమాలు గుర్తు తెచ్చుకున్నా అందులో డబల్ మీనింగ్ తోనే సినిమాను ముందుకు నడిపాడు. అప్పట్లో ఆ జోకులు చెల్లిపోయాయి. కామెడీ పండించడం చాలా కషమై ్ట పోతున్న ఈ అవుతాడు. స్వతహాగా చదువులో జెమ్ అయిన జార్జ్ రెడ్డి ఆ యూనివర్సిటీలో వేళ్ళూనుకునిపోయి ఉన్న కుల, మత, డబ్బు వ్యత్యాసాలపై పోరాటం మొదలుపెడతాడు. అక్కడ అప్పటికే చక్రం తిప్పుతున్న స్టూడెంట్ గ్రూప్స్ పై తిరుగుబాటు జెండా ఎగురవేస్తాడు. జార్జ్ రెడ్డి సినిమా ఎలా అతను ఒక నాయకుడిగా ఎదిగాడు, ఎందుకని ఇప్పటికీ అతని గురించి మాట్లాడుకుంటున్నాం, అంతలా అతను ఏం చేసాడు, తదితర విషయాలను ప్రస్తావిస్తుంది.
వేయిస్తాయి. ఎడిటింగ్ లో కన్సిస్టెన్సీ లేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకత్వం చాలా ఫ్లాట్ గా ఉంది. రెండు, మూడు ఎపిసోడ్స్ తప్పితే మిగతావి ఫ్లాట్ నరేషన్ ఇచ్చాడు.
నటీనటులు:
చివరిగా:
జార్జ్ రెడ్డిగా సందీప్ ఆ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. స్వతహాగా మంచి నటుడైన సందీప్, జార్జ్ రెడ్డి మ్యానరిజమ్స్ ను, బాడీ లాంగ్వేజ్ ను చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. ఎక్కడా ఓవర్ అనిపించకుండా చక్కగా ఎమోషన్స్ ను పలికించగలిగాడు. ఇతర పాత్రల్లో సత్యదేవ్, చైతన్య కృష్ణ బాగా నటించారు. హీరోయిన్ కూడా పర్వాలేదు. ఇతర పాత్రల్లో ఎక్కువగా కొత్త ముఖాలే కనిపించాయి. అందరూ తమ పరిధి మేరకు బాగానే నటించారు.
సాంకేతిక వర్గం: దర్శకుడు: జీవన్ రెడ్డి నిర్మాత: అప్పి రెడ్డి, సంజయ్ రెడ్డి, దాము రెడ్డి,
సుధాకర్ రెడ్డి యక్కంటి బ్యానర్: మైక్ మూవీస్, త్రి లైన్ సినిమాస్, సిల్లీ మొంక్స్ స్టూడియోస్ మ్యూజిక్: సురేష్ బొబ్బిలి నటీనటులు: సందీప్ మాధవ్, దేవిక, సంజయ్ రెడ్డి, మనోజ్ నందం, సత్యదేవ్ విడుదల తేదీ: నవంబర్ 22, 2019 రేటింగ్: 2.5/5
తెలుగులో బయోపిక్ ల కాలం నడుస్తోంది. ఇప్పటికే ఎంతో మంది స్ఫూర్తిమంతమైన వ్యక్తుల బయోపిక్ లు మనం చూసాం. లేటెస్ట్ గా ఈ కోవలోకి చెందే సినిమా జార్జ్ రెడ్డి. స్టూడెంట్ గా ఉంటూనే ఒక జనరేషన్ ను ఇన్స్పైర్ చేసిన గొప్ప స్టూడెంట్ నాయకుడి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దామా.
కథ:
జార్జ్ రెడ్డి (సందీప్ మాధవ్) 1970లో ఉస్మానియా యూనివర్సిటీలో ఫిజిక్స్ గ్రూప్ లో జాయిన్
రోజుల్లో కూడా అప్పటి కామెడీనే పండించాలని చూసాడు జి నాగేశ్వర రెడ్డి. ఒక డీసెంట్ సినిమా కాగల తెనాలి రామకృష్ణను రైటింగ్ దగ్గరే చంపేశాడు. ఓవర్ ది టాప్ కామెడీతో జనాలకు చిరాకు తెప్పించాడు. హన్సిక పాత్రను తీర్చిదిద్దిన విధానంతో జి నాగేశ్వర రెడ్డి ఫామ్ గురించి తెలిసిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో ఇలాంటి సన్నివేశాలున్నా కొంత పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ టైమ్ కు సినిమా మీద ఆసక్తి కలుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత కూడా కోర్ట్ రూమ్ సన్నివేశంతో మొత్తానికి సినిమా గాడిలో పడిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే ఒకసారి ఆ సన్నివేశం ముగిసాక సినిమా అటు పోతుందో కూడా అర్ధం కాక ప్రేక్షకుడు అయోమయానికి గురవుతాడు. మొత్తంగా తెనాలి రామకృష్ణ నవ్వించడానికి వచ్చి నవ్వుల పాలైంది.
సాంకేతికంగా జార్జ్ రెడ్డి ఉన్నతంగా తెరకెక్కింది. సురేష్ బొబ్బిలి అందించిన సంగీతం పర్వాలేదనిపించేలా ఉంది. అర్జున్ రెడ్డి చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. అతని వర్క్ స్టాండ్ అవుట్ గా నిలుస్తుంది. చాలా చోట్ల తన సౌండ్స్ తో గూస్ బంప్స్ తెప్పించాడు. అయితే కొన్ని చోట్ల లౌడ్ గా కూడా అనిపిస్తుంది. సుధాకర్ యక్కంటి సినిమాటోగ్రఫీ సూపర్బ్ గా ఉంది. సినిమా మూడ్ ను చక్కగా రిప్రెసెంట్ చేయగలిగింది సినిమాటోగ్రఫీ. ఫైట్ సీక్వెన్స్ లలో వాడిన షాట్స్ అయితే సూపర్బ్. యాక్షన్ సీన్లను బాగా హ్యాండిల్ చేసారు. ముఖ్యంగా ఫైర్ బాల్ ఫైట్, బెల్ట్ ఫైట్ ప్రేక్షకుల చేత విజిల్స్
ఒక జనరేషన్ మొత్తాన్ని చాలా తక్కువ కాలంలో ఇన్స్పైర్ చేసిన వ్యక్తి జార్జ్ రెడ్డి. స్టూడెంట్ నాయకుడిగా ఎదిగే క్రమంలో దానికే బలైపోయాడు. ఇప్పటికీ అతని గురించి మాట్లాడుకుంటున్నామంటే అది అతని వ్యక్తిత్వం యొక్క గొప్పతనమే. అయితే ఈ సినిమాలో దాన్ని ఎఫెక్టీవ్ గా చూపించడంలో విఫలమయ్యారు. సెకండ్ హాఫ్ మొత్తం సాగతీసిన ఫీల్ కలుగుతుంది. నరేషన్ లో కన్సిస్టెన్సీ లేకపోవడం పెద్ద మైనస్. ఎడిటింగ్ ఇంకా బాగుండాల్సింది. చాలా చోట్ల సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా జార్జ్ రెడ్డి అంటే కేవలం హీరోయిజం చూపించే ఫైట్స్ మాత్రమే అన్నట్లు చిత్రీకరించారు. జార్జ్ రెడ్డి జీవితంలో ఈ గొడవలో ఎంత భాగమో పక్కన పెడితే అంతకు మించిన తెలివైన విద్యార్థి, ఉస్మానియాలో కొన్నేళ్ల పాటు అతని గురించే మాట్లాడుకునేలా చేసిన ప్రభావంతమైన వ్యక్తి. కేవలం ఫైట్స్ మాత్రమే కాకుండా జార్జ్ రెడ్డి జీవితంలో మరో కోణాన్ని ఆవిష్కరించి ఉంటే బాగుండేది. ఇక ఈ సినిమాలో క్లైమాక్స్ పెద్ద లెట్ డౌన్ అని చెప్పవచ్చు. మొత్తంగా చూసుకుంటే జార్జ్ రెడ్డి సరైన ఎమోషన్స్ ను తట్టడంలో విఫలమైంది. ఫైర్ బాల్ ఫైట్, బ్లేడ్ ఫైట్, టెరిఫిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి ఈ సినిమాను ఒకసారి చూడవచ్చు. మిగతా అంతా బోరింగ్ వ్యవహారమే.
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 7
Rajinikanth
Interview SpecialStory Hollywood
4. దళపతి చేసే ప్రతి సినిమాలో బేసిక్ పాయింట్ ని మహాభారత నుంచి తీసుకునే డైరెక్టర్ మణిరత్నం మహాభారతంలో “దుర్యోధనుడు కర్ణుడికి ఉన్న స్నేహం” అనే పాయింట్ మీద ఈ సినిమా తీశాడు. ఇందులో సూర్య అనే ఒక అనాధ యువకుడి పాత్రలో రజినీకాంత్ కనిపిస్తాడు. ఈ సినిమాలో కొంతవరకు అప్పట్లో విజయవాడలో జరిగిన రాజకీయ పరిస్థితులకు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయి.
సాధారణంగా
సాధారణంగా మనం రోడ్డుమీద నడుచుకుంటూ వెళుతున్నప్పుడు ఏదైనా గుడి కనిపించినప్పుడు లేదా ఏదైనా దేవుడి బొమ్మ కనిపించినప్పుడు అటువైపుగా చూసి దండం పెట్టుకుని వెళ్తాం. కానీ తమిళనాడులో ఎవరైనా సడన్ గా రోడ్డు మీద ఆగి, ఒక సినిమా పోస్టర్ వైపు చూసి దణ్ణం పెట్టుకుని వెళ్తున్నారు అంటే.. ఆ పోస్టర్ మీద ఉండే వ్యక్తి రజనీకాంత్. జనీకాంత్ అనే ఒక వ్యక్తి స్థాయి ఏంటో చెప్పడానికి పైన చెప్పిన ఈ చిన్న ఉదాహరణ సరిపోతుంది. సాధారణంగా సినిమా నటులు నిజ జీవితంలో కూడా ముఖానికి రంగేసుకుని వయస్సు మీద పడకుండా కేవలం వాళ్ళ నటించే సినిమా యొక్క ప్రమోషన్ కోసం; లేకపోతే వాళ్ళని వాళ్ళు సొంతంగా ప్రమోట్ చేసుకోవడం కోసం మాట్లాడుతూ ఉంటారు. కానీ సినిమా షూటింగ్ లేనప్పుడు ఎంత పెద్ద స్థాయి సినిమా ఫంక్షన్ కి అయినా, ఏ మాత్రం మేకప్ లేకుండా రజినీకాంత్ హాజరవుతాడు. “సినిమా నటీనటులు అనే వాళ్ళు కేవలం అందంగా ఉంటేనే ఆదరించ పడతారు” అనే ఒక గుడ్డి నమ్మకాన్ని బద్దలు కొట్టిన వ్యక్తి రజనీకాంత్. విషయంపై ఒకానొక సందర్భంలో సినిమా విశ్లేషకులు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది. రజనీకాంత్ ఎందుకు బయట మేకప్ లేకుండానే కనబడతాడు.? అన్న విషయంపై ఒక చిన్న సర్వే నిర్వహించగా; ఆయన మేకప్ లేకుండా కనబడితేనే కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇక ఆయన తెర మీద కనబడే మేకప్ తో జనంలో కూడా వచ్చాడు అంటే... అభిమానుల నియంత్రించటం ఎవరివల్లా కాదు అని అందరూ అభిప్రాయపడ్డారు. ఒకసారి రజనీకాంత్ కారులో వెళుతుండగా దారిలో ట్రాఫిక్ పోలీసులు వెళ్లే దారిలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కాన్వాయ్ వెళుతుందని, ఆయన కార్ ని ఆపగా; కారు దిగి ఒక రెండు నిమిషాలు రజినీకాంత్ బయట నిలబడ్డాడు. ఆ తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయ్యి రజనీకాంత్ వెళ్ళేంత వరకు సాక్షాత్తు ముఖ్యమంత్రి జయలలిత కాన్వాయ్ ఎదురుచూడాల్సి వచ్చింది. జినీకాంత్ అనే ఒక నటుడు భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు దొరికిన ఒక వరం. ఒక సూపర్ స్టార్ గా ఆయన ఎక్కువ సినిమాలు చేశాడో, తనలోని నటుడిని ఆవిష్కరించే సినిమాలు కూడా చేశాడు. దక్షిణ భారత దేశంలో ఒక పెద్ద హీరో సినిమా కొన్ని అనుకోని పరిస్థితుల మధ్య పరాజయం పాలైతే డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు తిరిగి ఇచ్చే సంప్రదాయాన్ని పరిచయం చేసిన నిజమైన హీరో రజినీకాంత్. దాదాపు 70 ఏళ్ల వయసులో కూడా, యంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోని ఎనర్జీతో ఆయన నటించిన గలుగుతున్నాడు అంటే అది
కేవలం ఆయనకు ఉన్న ఆధ్యాత్మిక పరమైన శక్తి ద్వారానే సాధ్యమవుతుంది.ఈ డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీ కాంత్ జన్మదినం సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ, ఆయన కెరీర్ లో ఆణిముత్యాల్లాంటి సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం.
5. ముత్తు కోట్ల ఆస్తికి వారసుడు అయినా ఒక సాధారణ పనివాడిగా పెరిగిన వ్యక్తి పాత్రలో రజినీకాంత్ నటన అద్భుతంగా ఉంటుంది. రజనీకాంత్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేశాడు. మరొక పాత్రలో డబ్బు గురించి రజనీకాంత్ చెప్పిన డైలాగులు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ ఉంటాయి.
ర
1. అపూర్వ రాగంగల్ ఈ రజనీకాంత్ మొదటి సినిమా. దేశం గర్వించదగ్గ దర్శకుడు K. బాలచందర్ గారు ఈ సినిమాతో శివాజీరావు గైక్వాడ్ నీ రజినీకాంత్ గా పరిచయం చేశారు. ఈ సినిమాలో ఒక అనుమానపు భర్త పాత్రలో రజినీకాంత్ అద్భుతంగా నటించాడు.
6. భాషా సినిమా పరంగా కలెక్షన్ల పరంగా యావత్ భారతదేశాన్ని ఒక్కసారి తమిళ చిత్రసీమ వైపు చూసేలా చేసిన సినిమా భాషా.సూపర్ స్టార్ రజనీకాంత్ అనే వ్యక్తిని ఒక హీరో స్థాయి నుంచి ఒక డమ్మీ god స్థాయికి తీసుకెళ్లిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత ఇలాంటి కథాంశంతో అనేక మంది హీరోలు సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అది కేవలం రజినీకాంత్ మ్యాజిక్ అని అనుకోవచ్చు.
9. చంద్రముఖి రజినీకాంత్ కెరియర్ కి రీ బర్త్ లాంటి సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమాలో కేవలం రెండే రెండు సీన్లు మినహాయిస్తే ప్రతి సీన్ లో రజినీకాంత్ ఉంటాడు. ఆకలితో ఉన్న సింహం వేటాడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో రజినీకాంత్ అచ్చం అలాగే ఉంటాడు.
10. శివాజీ శంకర్ మరియు రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టెక్నాలజీ పరంగానే కాదు; కలెక్షన్లు మరియు రికార్డుల పరంగా కూడా ప్రభంజనం సృష్టించింది. బ్లాక్ మనీ మీద యుద్ధం చేసే ఒక ఎన్నారై శివాజీ క్యారెక్టర్ లో రజనీకాంత్ నటన అద్భుతంగా ఉంటుంది.
11. రోబో శంకర్ ఈ సినిమా స్క్రిప్ట్ తీసుకొని అమీర్ ఖాన్, షారుక్ ఖాన్ దగ్గరికి వెళ్లితే, వాళ్లు స్క్రిప్టులో మార్పులు చెబుతుంటే ఇక తప్పదని రజనీకాంత్ దగ్గరికి ఆ స్క్రిప్టుని తీసుకువచ్చాడు. ఆ వయసులో రజనీకాంత్ రోబో సినిమా ఏంటి.? అని చాలామంది సందేహాలు వ్యక్తం చేయగా, తనదైన నటనతో రోబో సినిమా ని శిఖరాగ్రానికి తీసుకెళ్లాడు రజినీకాంత్. ఒక సూపర్ హీరో గా మరియు ఒక సూపర్ విలన్ గా రజనీకాంత్ నటన ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తుంది.
ఈ
2. మాప్పిలై తెలుగులో అల్లుడుగారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒక కుటుంబంలో తాను పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి భర్తగా వెళ్లి; ఆ కుటుంబ పరిస్థితులను చక్కదిద్దే వ్యక్తి పాత్రలో రజనీకాంత్ కనిపిస్తాడు. ఈ బేసిక్ పాయింట్ తీసుకొని దాదాపు ఇప్పటివరకు ఒక ఐదు వందల సినిమాలు వచ్చి ఉంటాయి.
7. అరుణాచలం మన తెలుగు అగ్ర రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాలో 30 రోజుల్లో 30 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తిగా మరియు ఒక ఊరు మొత్తం తను పెద్ద కొడుకు గా భావించే పాత్రలో రజినీకాంత్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది
ర
8 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
౩. పదునారు వయినిదిలే. ఎవర్ గ్రీన్ హీరోయిన్ శ్రీదేవి నటించిన ఈ సినిమాలో రజినీకాంత్ విలన్ పాత్రలో కనిపిస్తాడు. తెలుగులో “పదహారేళ్ళ వయసు” అనే సినిమాగా వచ్చిన ఈ సినిమాలో రజనీకాంత్ పాత్రను అతని స్నేహితుడు మోహన్ బాబు చేశాడు. ఇప్పటికీ అభిమానుల దృష్టిలో ట్రెండ్ అయ్యే రజనీకాంత్ డైలాగ్ “ఇది ఎప్పుది ఇరిక్కు” ఈ సినిమాలోనే ఉంటుంది.
8 . నరసింహ “నా దారి రహదారి”, అనే ఒక్క డైలాగ్ చాలు ఈ సినిమా ఏంటో చెప్పడానికి. ఈ సినిమాలో రజనీకాంత్ తన ఆరాధ్య దైవం లాంటి శివాజీ గణేషన్ గారితో తెర పంచుకున్నాడు. రమ్యకృష్ణ - రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చిన సన్నివేశాలు ఇప్పటికీ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి.
12. పేట రజినీకాంత్ వీరాభిమాని అయిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తీసిన ఈ సినిమాలో రజినీకాంత్ “పేట వీర” అనే ఒక వంట మాస్టర్ పాత్రలో నవరసాలను నిమ్మ రసం పిండినట్లు పిండాడు. ఈ సినిమా లో రజనీకాంత్ కి ఒకసారి చూస్తే ఆయన నటన, స్టైల్, నడక, ఆహార్యం, డాన్స్, ఫైట్ ముఖ్యంగా ఆయన డైలాగులు చూసి జనాలందరూ 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి రజనీకాంత్ మళ్లీ తెర మీద చూసినట్టు ఉందని ఆనంద పడ్డారు. కథ అంత గొప్పగా లేకపోయినా కేవలం “రజనీకాంత్ ఈజ్ బ్యాక్” అనే ఒక్క ఎమోషన్ కి ఈ సినిమా చూడొచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే రజనీకాంత్ గురించి చెప్పడానికి పేజీలు కూడా సరిపోవు. వచ్చే సంవత్సరం సంక్రాంతికి మళ్ళీ రజనీకాంత్ ఆదిత్య అరుణాచలం అనే పోలీస్ పాత్రలో దర్బార్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకి దర్శకుడు. త్యాశ అయినా కానీ, మరొక 20 సంవత్సరాలు రజనీకాంత్ ఇలాగే నటించి మనకి ఎంటర్టైన్మెంట్ తో పాటు, ఎన్ లైటెన్మెంట్ అంటే జ్ఞానాన్ని కూడా ఇవ్వాలని కోరుకుందాం.
అ
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
ఒక రాష్ట్రం, భౌగోళికంగా చూస్తే మొత్తం రాష్ట్రాన్ని
ఆవరించి ఉండే సముద్ర తీర రేఖ, 32 జిల్లాలు, ఎనిమిది కోట్ల జనాభా.. ఇదీ క్లుప్తంగా తమిళనాడు గురించి చెప్పాలంటే. తమిళనాడు రాష్ట్రంలో ప్రజలకి అత్యంత ముఖ్యమైన వినోద సాధనం సినిమా. వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవలసిన అంశాలు ఏమిటంటే; ఎన్ని వందల కోట్లు పెట్టి సినిమా తీసిన సినిమా పేరు మాత్రం తమిళంలోనే ఉండాలని ప్రయత్నిస్తారు. తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకు ప్రాధాన్యత ఇస్తారు. మన దగ్గర ఇక్కడ అభిమానులు మహా అయితే వాట్సప్, ఫేస్బుక్ గ్రూపులలో చిల్లర గొడవలు చేస్తూ ఉంటారు. కానీ అక్కడ ఒక సినిమా విషయంలో తేడా వస్తే; నేరుగా సొంత డబ్బులు పెట్టి పోస్టర్లు వేసి మరీ, వాటిపై పేడ కొడతారు. వాళ్ళ ప్రేమ అయినా కోపం అయినా అదే స్థాయిలో ఉంటుంది. మిళనాడులో ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయింది అంటే, కనీసం 4000 నుంచి 5000 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. కేవలం తమిళనాడులోనే కాదు; ఆ పక్కన ఉండే సింగపూర్, మలేషియా బ్యాంకాక్ మార్కెట్లను వాళ్ళు ఎప్పుడో ఆక్రమించేశారు. క్రాంతి సందడి వాళ్ళకి మొదలయ్యేది సినిమాలతోనే. తెలుగు ఇండస్ట్రీలో లాగా మొదట ఒకే రోజు రిలీజ్ చేస్తానని చెప్పి ఆ తర్వాత పిచికారి పంచాయతీ చేసి డేట్ ను మార్చే ప్రసక్తే వాళ్ళ దగ్గర ఉండదు. దానికి ఉదాహరణ 2019 సంక్రాంతి సీజన్ లో ఒకే తేదీన విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ పేట మరియు తాలా అజిత్ విశ్వాసం సినిమాలు. జనవరి 10వ తేదీన రిలీజ్ రెండు సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. ఈ మధ్యనే దీపావళికి దళపతి విజయ్ సినిమా బిగిల్ అదేవిధంగా సూర్య సోదరుడు కార్తీ నటించిన ఖైదీ సినిమా కూడా రిలీజ్ అయ్యాయి. బిగిల్ సినిమా హిట్ అని అనిపించుకోగా, కసితో టెక్నీషియన్లు పనిచేస్తే సినిమా ఎలా ఉంటుందో కార్తి నటించిన ఖైదీ సినిమా ప్రేక్షకులకు రుచి చూపించింది. చాలా రోజుల తర్వాత సినిమా థియేటర్లో ప్రేక్షకులు సీటు ఎడ్జ్ మీద కూర్చుని చూసిన సినిమా ఇది.
త
చిన్న
చిన్న క్యారెక్టర్లు వేసి పెద్ద హీరో స్థాయికి ఎదిగి అభిమానుల నోరారా “మక్కల్ సెల్వన్” అని పిలిచే విజయ్ సేతుపతి ఈ సంవత్సరం గట్టిగానే చేశాడు సినిమాలు. రజినీకాంత్ పేట సినిమా లో ఒక కీలకమైన పాత్రలో నటించి ఆ తర్వాత “సింధు బంద్”, ఈ మధ్యనే రిలీజ్ అయిన “సంఘ తమిళ” తో పాటు ఈ ఏడాది తమిళ చిత్రసీమ లోనే కాదు యావత్ భారతదేశంలో చర్చనీయాంశమైన “సూపర్ డీలక్స్” అనే సినిమాలో హిజ్రాగా అద్భుతమైన నటన చూపించాడు.
ఇక
ఇక
తాప్సీ నటించిన “గేమ్ ఓవర్” అమలాపాల్ నటించిన “ఆడాయి” నయనతార నటించిన “ఐరా” సినిమాలు మంచి ప్రయత్నం అనిపించుకున్నాయి.
ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అద్భుతమైన కథ - కథనం తో హిట్ కొట్టిన సినిమాలు ఈ సంవత్సరం కూడా తమిళంలో చాలానే ఉన్నాయి. మనకన్నా ఎక్కువగా హీరోలు, వాళ్ల అభిమాన సంఘాలు, డామినేషన్ తమిళ ఇండస్ట్రీలో ఎక్కువ అయినప్పటికీ.. వాళ్లు కథ బాగుంటే కొత్త హీరో నా.? పెద్ద హీరోనా.? అని చూడకుండా మనసులో పెట్టుకుంటారు. దానికి ఉదాహరణే చిన్న సినిమా హీరో అయిన అధర్వ చేసిన 100,
సం
ఇక హీరో సూర్య అగ్ర దర్శకుడు సెల్వ రాఘవన్ తో
చేసిన రాజకీయ నేపథ్యంతో కూడిన చిత్రం NGK ఫ్లాప్ అవ్వగా, ఆ తర్వాత మరొక సీనియర్ దర్శకుడు కె.వి.ఆనంద్ తో చేసిన “కాప్పాన్” (తెలుగులో బందోబస్త్) సినిమా పరవాలేదనిపించింది.
మరొక అగ్రనటుడు దళపతి విజయ్ తన విజయ
పరంపరను కొనసాగిస్తున్నాడు. గత సంవత్సరం సర్కార్ అనే సినిమాతో రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టిన దళపతి ఈసారి అట్లీ దర్శకత్వంలో “బిగిల్” అనే సినిమాలో నటించాడు. కథాపరంగా ఈ సినిమా గొప్పగా లేకపోయినా విజయ్ నటన కి ప్రేక్షకులు మరోసారి కనెక్ట్ అయ్యి సూపర్ హిట్ చేశారు
ఇక
2019 తమిళ చిత్రసీమలో విడుదలైన పలు విజయవంతమైన చిత్రాల గురించి మాట్లాడుకుంటే సూపర్ స్టార్ రజనీకాంత్ పేట, తాలా అజిత్ నటించిన విశ్వాసంతో పాటు హిందీ సినిమా పింక్ రీమేక్ అయిన “నేర్కొండ పార్వై” కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడిదే సినిమానే మన పార్ట్ టైం పొలిటిషియన్ పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తానని చెబుతున్నాడు.
“అసురన్” అనే సినిమా తమిళ చిత్రసీమలోనే కాదు.. యావత్ భారతదేశ చిత్రసీమలో చర్చనీయాంశమైంది. ఎప్పటిలాగే ఈ సినిమాని అందరూ రీమేక్ రైట్స్ పోటీపడి మరీ కొనుక్కుంటున్నారు.
గత
కొన్ని సినిమాల్లో హీరో, విలన్ పాత్రలు లతోపాటు అవకాశం ఇస్తే హీరోయిన్ పాత్ర కూడా మేకప్ వేసుకొని చేయడానికి ఏమాత్రం సంకోచించని నటుడు చియాన్ విక్రమ్ ఈ సంవత్సరం ప్రేక్షకుల్ని నిరాశ పరిచాడు. ఆయన నటించిన “కాదరం కొండేన్” ఫ్లాప్ అయింది. మరొక సినిమా అయిన “ధ్రువనక్షత్రం” ఇంకా రిలీజ్ కాలేదు. ఈలోగా ఒకసారి సినిమా అంతా అయ్యాక మళ్లీ ఆ సినిమాని రీషూట్ చేయించి మరీ తన కొడుకుని అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ అయినా “ఆదిత్యవర్మ” సినిమాతో లాంచ్ చేశాడు విక్రం.
అదేవిధంగా విజయ్ కుమార్ అనే ఒక యువ దర్శకుడు చేసిన ఉరియాది 2 సినిమాలు. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా తమిళ చిత్రసీమలో జోరందుకున్నాయి. మనవాళ్లు బాహుబలి సాహో లాంటి సినిమాలు తీసి, బాలీవుడ్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఏదైనా ఇండస్ట్రీ ఉంది అంటే అది తెలుగు ఇండస్ట్రీని అని గొప్పగా చెప్పుకోవచ్చు.
కా
ఇక విలక్షణ చిత్రాలు చేస్తూ తనకంటూ అంతర్జాతీయ స్థాయిని తెచ్చుకున్న ధనుష్; హింసాత్మక సినిమాలకు పెట్టింది పేరయిన వెట్రిమారన్ దర్శకత్వంలో చేసిన
నీ సినిమాల రిలీజ్, బిజినెస్, బాక్సాఫీస్ వద్ద నమోదయ్యే నిజమైన లాభనష్టాల ఆధారంగా కొంచెం మనకి ఒప్పుకోడానికి కష్టం అనిపించినప్పటికీ... నిజం ఏమిటంటే బాలీవుడ్ తర్వాత ఇండియాలో తర్వాతిస్థానంలో ఉన్నది కోలీవుడ్. చి ఏదైనా అవతల వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకుంటే తప్పులేదు. కాబట్టి మన వాళ్లు అక్కడి నుంచి కొంత నేర్చుకోవాలని కోరుకుందాం
మం
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 9
Kollywood Bollywood Interview SpecialStory Hollywood
వాళ్ళు
ఇద్దరు చూడటానికి విడివిడిగా కొంచెం గంభీరంగా కనిపిస్తారు. కానీ ఇద్దరినీ కలిపితే గోదావరి గల గలే. అటు మేనమామ వెంకటేష్ పాతికేళ్ళ కుర్రాడైపోతే, అల్లుడు నాగ చైతన్య మరీ పదహారేళ్ళ పిల్లాడిలా అల్లరి చేస్తూ ఉంటారు. ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నట్టు ఉంటుంది వారి ఆప్యాయత. ఇక వాళ్ళిద్దరూ కలిసి వెండితెర పై చేసే పండుగ మన వెంకీ మామ. విక్టరీ వెంకటేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, త్వరలో రిలీజ్ కాబోతున్న వెంకీ మామ సినిమా గురించి మరిన్ని విశేషాలు మామా – అల్లుళ్ళ మాటలలోనే తెలుసుకుందాం. Q : హలో మామ గారు & అల్లుడు గారు ఎలా ఉన్నారు.? వెంకటేష్: ఇప్పటిదాకా బానే ఉన్నామండీ. ఇప్పుడు మీరు వచ్చారు కదా తెలీదు. నాగచైతన్య: సినిమా రిలీజ్ కదా.! అదే హడావిడి. Q: మళ్ళీ రెండోసారి మామ & అల్లుళ్ళ కాంబినేషన్ చూస్తున్నాం. ఈసారి అభిమానులకి ఫుల్ మీల్స్ గ్యారంటీ అన్నమాట. వెంకటేష్: అవునండీ... ప్రేమమ్ లో ఒక చిన్న శాంపిల్ మాత్రం చూపించాం. ఈ సారి సినిమాలో వచ్చేదే మా అసలు కాంబినేషన్. Q : అసలు మీ ఇద్దరూ కలిసి తెర పై కనిపించాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది.? నాగచైతన్య: నా ఫస్ట్ సినిమా జోష్ తర్వాత ఒక సారి మామను అడిగా. చేద్దాం లే అన్నాడు . కానీ నాకన్న ముందు మహేష్ తో చేసేసాడు. (మధ్యలో కల్పించుకుంటూ) వెంకటేష్: ఏంటీ..? నువ్వు నన్ను నిజంగా అడిగావా.? అబద్దాలు చెప్పకురా..! అసలు నీకు నేను గుర్తున్నాన్నా ..? ఏ మాయ చేసావే హిట్ తరువాత నాకు ఎప్పుడైనా ఫోన్ చేసావా.? నాగచైతన్య: లేదు .. నేను ఎప్పుడోనే అడిగా.. నువ్వే చెయ్యలేదు (నవ్వుకుంటూ) Q : అసలు మీ ఇద్దరి కాంబినేషన్ ఐడియా ఎవరిదీ.? వెంకటేష్: డైరెక్టర్ బాబీ నన్ను ఒకసారి అడిగారు. తరువాత ఆయన రచయిత జనార్ధన్ మహర్షి కలిసి కథ చేసి కలిసారు. మమ్మల్ని ఇద్దరినీ విడి విడిగా కలిసి కథ చెప్పారు. వెంటనే కనెక్ట్ అయిపోయాం . నాగచైతన్య: ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాలు అయితే నేను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోయా. చాల రోజులపాటు నన్ను ఆ ఎమోషన్ వదిలిపెట్టలేదు. ఇద్దరం కలిసి ప్లాన్ చేసుకున్నాం. Q: మొదట ఈ సినిమాలో హీరోయిన్ లుగా రకుల్ ప్రీత్ సింగ్ & శ్రియ లను అనౌన్స్ చేసారు కదా.? ఏమైంది.?
10 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
వెంకటేష్: సినిమా అంటే అందరి కాల్షీట్లు కుదరాలి కదండీ. అంతే తప్ప ఇంకేం లేదు. అయినా హీరోయిన్ల గురించి వీడికి, (నాగ చైతన్య) , వీళ్ళ నాన్నకే ఎక్కువ తెలుస్తుంది. (నవ్వులు) నాగచైతన్య: ఏమో.. నాకేం తెలీదు. ఫస్ట్ వాళ్ళ పేర్లు సరే అన్నాను. తర్వాత మార్చమని చెప్పినా సరే అన్నాను. అయినా అన్నిటికీ మా మామయ్య ఉన్నాడు. ఆయనకే తెలియాలి. ఏమైందో.? వెంకటేష్: అవును మరీ... చేసేదంతా చేసేసి మళ్ళీ మామని అనడం వీడికి చిన్నప్పటినుండి అలవాటే. (నవ్వులు) Q : ఈ సినిమా షూటింగ్ ఎక్కడెక్కడ జరిగింది.? వెంకటేష్: మొదట ఈ సినిమా గోదావరి బ్యాక్ డ్రాప్ లో రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఫస్ట్ షెడ్యూల్ చేసాం. ఆ తర్వాత రెండో షెడ్యూల్ హైదరాబాద్. తర్వాత అత్యంత ముఖ్యమైన పార్ట్ చిత్రీకరణ జరపడానికి టీమ్ అందరూ కాశ్మీరు వెళ్లారు. కాశ్మీర్ లో నెలకు పైగా ఈ సినిమా షూటింగ్ చేసింది. తర్వాత అక్కడి నుంచి మళ్లీ విశాఖపట్నంలో ఒక కీలకమైన షెడ్యూల్ చేశాం. నాగచైతన్య: (మధ్యలో కల్పించుకుంటూ) ఆ తర్వాత రామోజీ ఫిలిం సిటీ లో ఒక సూపర్ సాంగ్. మావ & పాయల్ కాంబినేషన్ లో చేసారు. వెంకటేష్: కంగారు వద్దు బంగారం అదే చెబుతున్నాను. ప్రస్తుతం కొన్ని ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. Q : మధ్యలో వెంకటేష్ గారికి అనుకోకుండా గాయం తగలడం వల్ల చిత్రీకరణ వాయిదా పడిందని విన్నాము వెంకటేష్: అదేమీ లేదండి... ఒక చిన్న దెబ్బ. సినిమా అన్నాక ఒకటి అర దెబ్బలు తగులుతుంటాయి. పాపం మా వాడైతే కాశ్మీర్ షెడ్యూల్లో ఒళ్ళు ఫోన్ చేసేసుకున్నాడు. నాగచైతన్య: సినిమా కోసం మనం ఎంతైనా కష్టపడాల్సిందే. అదే నేను నాన్న దగ్గర నుంచి, మామ దగ్గర నుంచి నేర్చుకుంది. వెంకటేష్: (మధ్యలో కల్పించుకుంటూ) అంటే సమంత దగ్గర్నుంచి ఏమి నేర్చుకోలేదా.? (గట్టిగా నవ్వులు) నాగచైతన్య: నేనేంటి నేర్చుకునేది..? తనే నా దగ్గర నుంచి అన్నీ నేర్చుకుని అప్పుడప్పుడు కాపీ కొడుతూ ఉంటుంది.. వెంకటేష్: అలాగా...! అయితే ఒకసారి ఫోన్ ఇవ్వు. మాట్లాడతా. Q : ఈ సినిమాలో ఎన్నాళ్ళకో అనే సాంగ్ లో డ్యాన్స్ అదరగొట్టారు అంటగా. (వెంకటేష్ మాట్లాడుతూ ఉండగా మధ్యలో నాగచైతన్య కల్పించుకొని) నాగచైతన్య: మామూలుగా కాదు..! సాంగ్ లో చెప్పినట్టు రేపు థియేటర్లో పెంకులు లేచి పోతాయి.
ఆ సాంగ్ షూట్ జరిగినంత కాలం మామ ఎనర్జీ మామూలుగా లేదు. (వెంకటేష్ మధ్యలో కల్పించుకుంటూ..) వెంకటేష్: అల్లుడు ఎందుకమ్మా... నువ్వు వచ్చేది పాయల్ ని చూడటానికి. రాజు సుందరం టేక్ చెప్పినప్పుడల్లా, వీడు పాయల్ రాజ్ పుత్ నే గమనించేవాడు. నాగచైతన్య: అంటే నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు కదా.. తను ఎలా చేస్తుందో చూద్దామని అంతే. వెంకటేష్: అందుకే కదా.. ఇందాక ఫోన్ ఒకసారి అడిగాను గుర్తులేదా నాగచైతన్య: ఫోన్ మర్చిపోయి వచ్చా మామ Q : ఈ సినిమాలో మామా అల్లుళ్లు ఇద్దరు సొంత అన్నదమ్ములు లాగా కనిపిస్తున్నారు ఏంటి సీక్రెట్..? వెంకటేష్: కేవలం మీ ఇద్దరమే కాదు. సినిమా అంతా విజువల్ పరంగా సూపర్ గా రావడానికి కారణం మా డైరెక్టర్ ఫొటోగ్రఫీ ప్రసాద్ మూరెళ్ళ. ఈ సినిమాలో కథ పరంగా ఎన్నో షేడ్స్ ఉన్నాయి. వాటన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ సినిమాను ముందుకు నడిపించడం అంటే మామూలు విషయం కాదు. Q : ఇందాక పాయల్ గురించి మాట్లాడారు కదా..! ఇంతకీ రాశీ ఖన్నాతో మీ రొమాన్స్ ఎలా ఉంది.? వెంకటేష్: (మధ్యలో కల్పించుకుంటూ) అక్కినేని కుటుంబానికి రొమాన్స్ గురించి నేర్పడం; తాతకు దగ్గులు నేర్పటం ఒకటే. (పెద్దగా నవ్వులు) అలాగే సినిమా ట్రైలర్ లో చూస్తున్నారుగా.. అసలు మా వాడు ఎక్కడ తగ్గట్లే. నాగచైతన్య: మామ ఫస్ట్ నుండి అంతే. రాశీ సూపర్ టాలెంటెడ్. ఈ సినిమా చూసిన తర్వాత నిజంగా తనకి ఫ్యాన్స్ ఇంకా పెరుగుతారు.. Q: డైరెక్టర్ బాబీ గురించి చెప్పండి వెంకటేష్: బాబీ నాకు చాలా కాలంగా తెలుసు. రచయితగా తన కెరీర్ మొదలుపెట్టిన దగ్గర్నుంచీ తనని అబ్జర్వ్ చేస్తున్నా. ఒక దర్శకుడిగా తనకు ఏం కావాలో.? ఆర్టిస్టు దగ్గర్నుంచి నొప్పించకుండా రాబట్టగల సమర్ధుడు అతను. లవకుశ సినిమాతో తనకు ఎంత పేరు వచ్చిందో ఈ సినిమాతో అంతకు రెట్టింపు పేరు వస్తుంది నాగచైతన్య: గతంలో కూడా బాబీతో ఒక ప్రాజెక్ట్ చేయాలని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. తర్వాత ఈ ప్రాజెక్టు గురించి డిస్కషన్ వచ్చినప్పుడు నేను ఏమాత్రం డిలే చేయలేదు. సినిమా పరంగా బాబీకి అనే విషయాలపై చాల deep నాలెడ్జ్ తో పాటు విపరీతమైన క్లారిటీ కూడా ఉంది. Q : అయితే ఈ సినిమాని మొదట అక్టోబర్లో రిలీజ్ చేద్దామనుకున్నారు. ఆ తర్వాత సంక్రాంతికి. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్లోనే తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. వెంకటేష్: చూడండి సినిమా అనేది ఒక క్రియేటివ్
గా ఎంత గంభీరమైన విషయమో..! వ్యాపార పరంగా కూడా అంతే. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ విషయంలో అనేక మంది యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ సినిమా అయినా అనవసరమైన పోటీ వాతావరణంలో రిలీజ్ అయ్యి నష్టపోవడం పద్ధతి కాదు. మేము అన్ని ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం. నాగచైతన్య: అందరూ అనుకున్నట్లు సినిమా వాళ్ళు ఎవరికీ శత్రువులు కాదు. రిలీజ్ విషయంలో కూడా అంతే. అందరం కలిసి మెలిసి ఉంటాం. ఇక్కడ ఒక్కడు బాగుంటే సరిపోదు; మన చుట్టుపక్కల వాళ్ళు అందరూ హ్యాపీగా ఉంటేనే మనం కూడా హ్యాపీ గా ఉండగలుగుతాం వెంకటేష్: ఏంటమ్మా.. కొత్తగా వేదాంతం మాట్లాడుతున్నావ్.? నాగచైతన్య: మరి నీతో ఇంత కాలం పనిచేశాను కదా మామయ్య.. అలా అప్డేట్ అయిపోయాను అన్నమాట. వెంకటేష్: (మధ్యలో కల్పించుకుంటూ) వీరి మధ్య చాలా డైలాగులున్నాయి కాపీ కొట్టి, ఆవిడ ముందు బిల్డప్ ఇస్తున్నాడు. Q: యువసామ్రాట్ అక్కినేని నాగార్జున గారు సినిమా పై ఏమన్నారు. నాగచైతన్య: అసలు వెంకీ మామ తో సినిమా అనగానే డాడీ బ్లైండ్ గా ప్రొసీడ్ అన్నారు. ఎందుకంటే మా రెండు కుటుంబాలకి సినిమాల పరంగానే కాదు పర్సనల్ గా ఉన్నటువంటి ఎమోషనల్ బాండింగ్ అలాంటిది. అది కొంత మందికి తెలుసు కానీ, ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలియదు. వెంకటేష్: ఇప్పుడు వీళ్ళ జనరేషన్ మాత్రమే కాదు. అప్పట్లో మా నాన్నగారు నాగేశ్వరరావు గారు కూడా వ్యక్తిగతంగా వృత్తి పరంగా; కాకుండా ఒక సినిమాని ఇష్టపడే వ్యక్తులుగా ఎంతో లోతుగా మాట్లాడుకునేవాళ్లు. తెలుగు సినిమాని అన్ని రకాలుగా అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్లాలంటే ఏం చెయ్యాలో అన్నది వాళ్ళ దగ్గరనుంచి నేర్చుకోవాల్సిన విషయం. ఫైనల్ గా వెంకీమామ సక్సెస్ అయ్యి మళ్ళీ అలాంటి మరో అద్భుతమైన సినిమాతో ఇద్దరు మమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాం. వెంకటేష్ : నేను ఎపుడూ రెడీనే.. కానీ ప్రస్తుతం వీళ్ళ జనరేషన్ ని చూసారా..! చాలా డేంజర్ బ్యాచ్. అదిగో అంటే ఆరు నెలల తర్వాతే మళ్లీ కనిపించేది. (గట్టిగా నవ్వులు) నాగచైతన్య: (మధ్యలో కల్పించుకుంటూ) ఏంటి మామా..! అలా మాట్లాడుతావ్ నువ్వు ఇప్పుడు ఓకే అంటే,.. మన రెండు బ్యానర్ల మీద ఇప్పుడే నెక్స్ట్ సినిమా టైటిల్ రిజిస్టర్ చేసేద్దాం.
NEWS HAPPENINGS
LIFE style సి
నిమా ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా కష్టపడి పైకొచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అయితే వాళ్ళు ఎంత కష్టపడ్డా, తమ పిల్లలు సినిమాల్లోకి వస్తానంటే ఆ కష్టం ఉండకూడదనే భావిస్తారు. వాళ్ళకి పెర్ఫెక్ట్ లాంచ్ ఇవ్వాలని కలలు కంటారు. విలక్షణ నటుడు విక్రమ్ కూడా అలాగే భావించాడు. తన కొడుకు ధృవ్ విక్రమ్ సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు తనకి అంతా పెర్ఫెక్ట్ ఉండాలని అర్జున్ రెడ్డి రీమేక్ ను సజెస్ట్ చేసాడు. ఈ సినిమా అయితే ఆల్రెడీ ప్రొవెన్ సబ్జెక్ట్, పైగా నటనకు మంచి పేరు వచ్చే అవకాశముంది. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో మనందరం చూసాం. అందుకే అర్జున్ రెడ్డి రీమేక్ చేస్తే ధృవ్ విక్రమ్ కు హీరోగా మంచి పేరు వస్తుందని తలచాడు విక్రమ్. అయితే తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అంటారు. ధృవ్ విక్రమ్ విషయంలో అదే జరిగిందా అనిపిస్తుంది. ఇంటెన్సిటీ ఉన్న సినిమాలను పెర్ఫెక్ట్ గా తీస్తాడు అన్న పేరున్న బాల అర్జున్ రెడ్డి రీమేక్ కు దర్శకుడిగా ఎంచుకున్నా సినిమా అంతా చూసాక, అది బాలేదని దాన్ని మొత్తం తీసి చెత్తబుట్టలో పడేయాల్సిన పరిస్థితి. డుకు విషయంలో బాల వంటి దిగ్గజ దర్శకుడని కూడా చూడలేదు విక్రమ్. ఆ తర్వాత మళ్ళీ కాస్ట్ అండ్ క్రూ లో మార్పులు చేసి ఆదిత్య వర్మను తెరకెక్కించారు. గత వారమే విడుదలైన ఈ
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
సినిమాకు మొదట మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే మెల్లగా ఈ సినిమాను ప్రేక్షకులు రిసీవ్ చేసుకోవడం మొదలుపెట్టారు. ఒరిజినల్ తో పోలిక పెట్టలేం కానీ ధృవ్ విక్రమ్ కూడా ఆకట్టుకున్నాడనే పేరు వచ్చింది. కలెక్షన్స్ కూడా బాగా పెరిగాయి. మొదటి వీకెండ్ ముగిసేసరికి దాదాపు 8 కోట్ల గ్రాస్ వచ్చింది. మొదటి వారంలో 11 కోట్ల గ్రాస్ అందుకుని ఆదిత్య వర్మ హిట్ స్టేటస్ సంపాదించుకుంది. సెకండ్ వీకెండ్ లో కూడా ఆదిత్య వర్మకు రెస్పాన్స్ బాగుంది. ఈ విషయంలో విక్రమ్ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. డుకు మొదటి సినిమా హిట్ అవ్వడంతో కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఆదిత్య వర్మకు వస్తోన్న రెస్పాన్స్ పట్ల ఆనందంగా ఉన్నాడు. ఒక రివ్యూలో విక్రమ్ కొడుకు ధృవ్ అని కాకుండా ధృవ్ తండ్రి విక్రమ్ అని రాసారని, ఒక తండ్రిగా తనకు ఇంతకంటే ఏం కావాలంటూ ఎమోషనల్ గా వ్యాఖ్యానించాడు. అలాగే తన కొడుకు మొదటి సినిమాకు ఇంత మంచి సినిమా రావడానికి మూల కారకుడైన సందీప్ వంగకు కృతఙ్ఞతలు చెప్పాడు. సందీప్ దగ్గర అర్జున్ రెడ్డికి పనిచేసిన గిరీశాయ ఆదిత్య వర్మను తెరకెక్కించడం విశేషం. ఏదేమైనా ఆదిత్య వర్మ హిట్ అవ్వడం పట్ల విక్రమ్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఇప్పుడు ధృవ్ రెండో సినిమాపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ధృవ్, విక్రమ్ కలిసి నటిస్తారని అంటున్నారు. మరి చూడాలి అందులో నిజమెంతుందో.
కొ
BEHIND THE WOODS LOCAT ON కొ
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
ఏడాది పాటు నరకం అనుభవించి ఈ శుక్రవారం
తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు యువ హీరో నిఖిల్. అర్జున్ సురవరం, నిఖిల్ ను చాలా ఇబ్బంది పెట్టిందన్నది వాస్తవం. సినిమా షూటింగ్ పూర్తవుతోంది అన్న సమయంలో టైటిల్ విషయంలో వివాదం తలెత్తడం, తర్వాత టైటిల్ మార్చుకుని విడుదలకు సిద్ధమవుతుంటే కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యం కావడం జరిగాయి. అయితే ఆ ఆలస్యం ఏకంగా ఏడాది పాటు ఉంటుందని ఊహించలేకపోయాడు నిఖిల్. మొదట డిసెంబర్ 2018లో సినిమాను విడుదల చేద్దామనుకున్నాడు. అయితే మొదటిసారి వాయిదా పడి మే 1 కి మారింది. ఇక అక్కడినుండి సినిమా ఎన్ని సార్లు వాయిదా పడిందో లెక్కే లేదు. సినిమా విడుదలను ప్రకటించడం అది వాయిదా పడటం, అంతా ఓ ఆనవాయితీలా జరిగిపోయింది. అయితే ఈ కాలమంతా తాను ఎన్ని సార్లు గదిలో ఒక్కడ్ని కూర్చుని ఏడ్చానో లెక్కేలేదు అంటున్నాడు నిఖిల్. తీవ్రమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిన సమయంలో తన కుటుంబం, స్నేహితులు అండగా ఉండి తనకు అండదండగా నిలిచారని చెప్పుకొచ్చాడు. ఏదైతేనేం మొత్తానికి నిఖిల్ కష్టాలు గట్టెక్కి అర్జున్ సురవరం నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. పోటీగా వస్తోందన్న రామ్ గోపాల్ వర్మ చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు కూడా ఈ వారం విడుదలకావట్లేదు. వాయిదా పడింది. ఇది అర్జున్ సురవరంకు కచ్చితంగా అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం థియేటర్లన్నీ మంచి సినిమా కోసం
N GHT Life
trade GUIDE My CHOICE QUIZ
ఎదురుచూస్తున్నాయి. ప్రేక్షకులు రాక షో లు కూడా క్యాన్సిల్ చేసుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో అర్జున్ సురవరం ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చినా ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. క నిఖిల్ అర్జున్ సురవరం సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేసాడు. ఈ సినిమా వల్ల తన కెరీర్ లో చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి వచ్చే ఏడాది దాన్ని ఫిల్ చేస్తా అంటున్నాడు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. దీంతో పాటు మరో రెండు సినిమాలు తన చేతిలో ఉన్నట్లు ప్రకటించాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఒక చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించాడు. దీనికి విఐ ఆనంద్ దర్శకుడు. వీరిద్దరూ గతంలో చేసిన ఎక్కడికి పోతావు చిన్నవాడా సూపర్ హిట్టైన విషయం తెల్సిందే. దీంతో పాటు హనుమాన్ అనే ఒక సోషియో ఫాంటసీ కథను కూడా చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే దీనికి దర్శకుడు ఎవరనేది ఇంకా తెలీదని అంటున్నాడు నిఖిల్. కపోతే శ్వాస అనే సినిమా ప్రకటించిన నిఖిల్, ఇప్పుడు అది చేయట్లేదని దాన్నుండి తప్పుకున్నానని తెలిపాడు. తనకు ముందు చెప్పిన కథ ఒకటని, తర్వాత షూటింగ్ దగ్గరకి వచ్చేసరికి కథ మార్చేశారని, అందుకే ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు ప్రకటించాడు. అయితే ఇప్పుడు అదే బ్యానర్లో హనుమాన్ ను చేస్తున్నట్లు తెలిపాడు. మొత్తానికి నిఖిల్ కు మళ్ళీ మంచి రోజులు వస్తున్నట్లున్నాయి.
ఇ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
ఇ
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 11
LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
12 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 13
ng od Bollywood w tory od
బాలీవుడ్
హిందీ చిత్రసీమకు ఈ పేరు ఎందుకు పెట్టారో తెలియదు గానీ, ఇక్కడ బాలు ఎవరి కోర్టులో ఉంటే వాడే తోపు. భారతదేశంలో 3 అత్యంత శక్తివంతమైన అంశాలు ఏవైనా ఉన్నాయంటే మొదటి సినిమా రెండోది రాజకీయం మూడోది స్పోర్ట్స్. విచిత్రమైన అంశం ఏమిటంటే హిందీ చిత్రసీమ సినిమాలతో పాటు తాను చేసే సినిమా లోని అంశాలను ఖచ్చితంగా పాలిటిక్స్ మరియు స్పోర్ట్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకుంటుంది. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే ఎన్నో విషయాలు ఇక్కడ చర్చించబడుతూ ఉంటాయి. ఒక్క ఛాన్స్ వస్తే వెండితెర మీద వెలిగిపోదామని ప్రతి శుక్రవారం ఇక్కడ చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అందరికీ ఆ అదృష్టం దక్కదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రత్యక్షంగా ఒక వంద మంది పరోక్షంగా కొన్ని వేల మంది తలరాతలు మారిపోతూ ఉంటాయి. క 2019 బాలీవుడ్ సినిమా రౌండప్ ఒక్కసారి గమనిస్తే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఈ సంవత్సరం ఎటువంటి సినిమా చేయలేదు.
ఇ
ఎప్పుడో ఒకసారి సినిమా చేసి హిట్ కొట్టే అమీర్ ఖాన్ ఈ సంవత్సరం ఎటువంటి సినిమా చేయలేదు. “rubaruroshni” అనే ఒక డాక్యుమెంటరీ చేశాడు.
ఇక చిన్న సినిమాలు గా రిలీజ్ అయి సంచలనం 2019
లో రిలీజ్ అయిన సినిమాల విషయానికొస్తే పుల్వామా ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో భారత సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రైక్ ఆధారంగా రూపొందిన URI అనే సినిమా సంచలన విజయం నమోదు చేసి, బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 342 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది.
తెలుగులో
గతంలో రిలీజ్ సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమా ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా హిందీలో షాహిద్ కపూర్ తో “కబీర్ సింగ్” అనే పేరుతో తీసి మరింత భారీ విజయం సాధించాడు. ఈ సినిమా సుమారు 379 కోట్ల కలెక్షన్స్ సాధించింది.
సృష్టించిన చిత్రాల జాబితాలో రాజ్ కుమార్ రావు నటించిన “మేడ్ ఇన్ చైనా”, ఆయుష్మాన్ ఖురానా నటించిన “బాల” అదేవిధంగా సుశాంత్ సింగ్ రాజ్పుత్ నటించిన “చిచ్చోరే” సినిమా లు ఉన్నాయి.
ఎంతో అంచనాల మధ్య రిలీజ్ అయినటువంటి సల్మాన్ ఖాన్ “భరత్” అనే సినిమాను రిలీజ్ చేసి సూపర్ హిట్ కొట్టాడు. అదే ఊపులో తనకు ఎంతగానో కలిసివచ్చిన దబాంగ్ ఫార్ములా ఆధారంగా, హిందీ రాని హిందీ సినిమా డైరెక్టర్ ప్రభుదేవాతో దబాంగ్ ౩సినిమా రిలీజ్ కి సిద్ధం చేశాడు.
అదే
విధంగా పరోక్షంగా రాజకీయాలను ప్రభావితం చేస్తూ రూపొందించిన అనేక సినిమాలు ఈ సంవత్సరం బాలీవుడ్ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో అనుపమ్ ఖేర్ నటించిన “యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్”, శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే జీవిత కథ ఆధారంగా రూపొందిన “థాకరే” ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీవిత ఆధారంగా రూపొందిన “పీఎం నరేంద్ర మోడీ”, భారత సైంటిస్టులు విజయం సాధించిన ప్రాజెక్టు స్ఫూర్తితో రూపొందిన “మిషన్ మంగల్” ఉన్నాయి.
ఇక తెలుగు సినిమా హీరో ప్రభాస్ నటించిన సాహో
14 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
సినిమా కూడా బాలీవుడ్ లో రిలీజ్ అయి మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన బద్లా సినిమా హిట్ అవ్వడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
సంజయ్ దత్ సినిమా “ప్రస్థానం” బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అదేవిధంగా కరణ్ జోహార్ తెరకెక్కించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2సినిమా కూడా ఘోర పరాజయం పాలైంది. శం గర్వించదగ్గ గణిత శాస్త్రవేత్త జీవిత కథ ఆధారంగా హృతిక్ రోషన్ నటించిన సూపర్30” సూపర్ హిట్ అయ్యింది. అదేవిధంగా మరొక నటుడు టైగర్ ష్రాఫ్ తో కలిసి హృతిక్ రోషన్ నటించిన మల్టీ స్టారర్ సినిమా “వార్” కూడా ఘన విజయం సాధించి, ఈ ఏడాది అత్యధిక కలెక్షన్లు పొందిన చిత్రంగా నిలిచింది. వార్ సినిమా సుమారు 474 కోట్ల కలెక్షన్లు నమోదు చేసింది.
దే వరుసపెట్టి సినిమాలు రిలీజ్ చేస్తూ అటు సందేశాత్మకంగా సినిమాలు చేస్తూనే, వ్యాపార పరంగా కూడా రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టే సినిమాలు చేసే అక్షయ్ కుమార్ ఈ సంవత్సరం కూడా తన బాక్సాఫీస్ పై తనదైన ప్రతాపం చూపించాడు. దేశభక్తిని ప్రతిబింబించే “కేసరి” అనే సినిమా చేసిన అక్షయ్ కుమార్ ఆ తర్వాత హౌస్ ఫుల్ సిరీస్ లో భాగమైన హౌస్ ఫుల్ 4 సినిమాను కూడా రిలీజ్ చేశాడు.
బాలీవుడ్ విలక్షణ నటుడు రణవీర్ సింగ్ నటించిన
“గల్లీబాయ్” సినిమా ఈ సంవత్సరం రిలీజ్ అయిన సినిమా లో ఒక హిట్ చిత్రంగా నిలబడటమే కాకుండా, ఆస్కార్ నామినేషన్ కి పంపే జాబితాలో ఒక చిత్రంలో కూడా ఎంపికైంది. గల్లీ బాయ్ సినిమా 238 కోట్లు కలెక్షన్స్ సాధించింది.
ఇక పూర్తి లెక్కలు తేలాలంటే డిసెంబర్ లో
రిలీ జ్కిసిద్ధంగాఉన్నసల్మాన్ఖాన్“దబాంగ్ 3” ఫలితం కూడా తెలిశాక బాలీవుడ్ పూర్తి 2019 రివ్యూ మనం తెలుసుకోవచ్చు.
ing od Bollywood w సి Story od
నిమా ఇండస్ట్రీ లో ఒక్కసారి బ్రేక్ రావడమే కష్టం. ఎన్నో బాధలు పడి చివరకు ఒక్క చాన్సు కొట్టేసి, వెండి తెర పైకి వచ్చాక, ఒక అద్భుతమైన రోజు, సక్సెస్ రూపంలో లైఫ్ వస్తుంది. ఇంకా, అప్పుడు తగ్గేది లేదు అంటూ తమకు కావాల్సినవి ఏవైనా చేతి దగ్గరకి, కాళ్ళ దగ్గరకి కాదు ఏకంగా నోటికి అందించామన్నా, మన క్రేజ్ నడిచినంత కాలం ప్రపంచం అన్నీ మూసుకుని భరిస్తుంది. కానీ మనం అప్పుడు పిచ్చి కథలు పడకుండా, జాగ్రత్తపడి దీపం ఉండాగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ సామెతను మన బాలీవుడ్ బ్యూటీలు మాత్రం తప్పనిసరిగా పాటిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరికైనా లాంగ్ లైఫ్ గ్యారంటీ లేదు. హీరోయిన్స్ కి అయితే అస్సలు లేదు. కాబట్టి ఒక్క హిట్టు పడగానే పారితోషికాలను అమాంతం ఆకాశానికి ఎత్తి చూపిస్తూ ఉంటారు. మరి, ప్రస్తుతం అలా అత్యధిక రెమ్యునరేషన్ లు తీసుకునే బాలీవుడ్ పాపలు ఎవరో చూద్దాం.
అనిపించే, హీరోయిన్ ఆలియా భట్ సినిమాకు రూ.14 కోట్లు తీసుకుంటుంది. ప్రస్తుతం మన జక్కన RRR సినిమా నుండి ఆ కారణం చేత తప్పుకుంది. అయినప్పటికీ ఆమె చేతిలో సడక్ 2, బ్రహ్మాస్త్ర సినిమాలు ఉన్నాయి .
తీసుకుంటుంది.
4. కరీనా కపూర్
కాస్త గుండ్రంగా మంచి షేపులతో ఉండే బాలీవుడ్ అందాలకు “సైజ్ జీరో” అనే ఒక చెత్త ఫ్యాషన్ పరిచియం చేసి, ఆ తరవాత తప్పు తనది కాదంటూ చెంపలు వేసుకున్న ఈ స్వాతి ముత్యం ఇప్పుడు మళ్ళీ లేటు వయసులో ఘాటు అందాలు ఆరబోస్తూ, నిర్మాతల దగ్గర కనీసం సినిమాకు 17 కోట్లు తగ్గకుండా తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అంగ్రేజీ మీడియం, గుడ్ న్యుజ్ సినిమాలు ఉన్నాయి.
7. కత్రిన కైఫ్
ఈ మధ్య ఎందుకో సినిమాలు తగ్గించిన కత్రినా ఇప్పుడు అక్షయ్ కుమార్ తో “సూర్యవంశీ” అనే సినిమాలో నటిస్తోంది. ఆమె రెమ్యునరేషన్ సినిమాకి సుమారు రూ.12 కోట్లు ఉంటుంది.
10. అనుష్క శర్మ
సినిమాలు కంటిన్యూ గా హిట్ కాకపోయినా, తన భర్త క్రికెటర్ విరాట్ కోహ్లి ఫాలోయింగ్ ని వాడుకుంటూ, కొంచెం అతి చేసే మన అనుష్క శర్మ సినిమా రెమ్యునరేషన్ రూ. 9 కోట్లు అని విశ్వసనీయ సమాచారం.
ఇక ఆ తర్వాతి స్థానాల్లో ప్రియాంక చోప్రా సోదరి
1. కంగనా రనౌత్
బాలీవుడ్ లో హీరో ల డామినేషన్ పై మాట్లాడి వార్తలలో నిలిచిన కంగనా, ఆ తర్వాత హీరో హృతిక్ రోషన్ పై చేసిన ఆరోపణలతో ఎంతో ప్రచారం సాధించింది. ఆమె గత చిత్రం “మణి కర్ణిక” సినిమాకి కూడా డైరెక్టర్ గా క్రిష్ తో పాటు తన పేరు కూడా టైటిల్స్ లో వేయించే దాకా వెళ్ళింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ గా ఉన్న కంగన ఒక్కొక్క సినిమాకు సుమారు రూ. 24 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
అయిన పరిణితి చోప్రా సినిమాకు సుమారు 7 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరిణితి చోప్రా అనే సినిమాతో పాటు సైనా నెహ్వాల్ బయోపిక్, గర్ల్ ఇన్ ది ట్రైన్ అనే హాలీవుడ్ సినిమా రీమేక్ కూడా చేస్తోంది.
ఇక 120 కిలోల బరువు ఉన్నప్పుడే బాలీవుడ్ ఎంట్రీ 8. సోనమ్ కపూర్
అనిల్ కపూర్ ముద్దుల కూతురు అయిన, సోనం పాప కనీసం రూ.11 కోట్లు ఇవ్వకపోతే సినిమా చెయ్యడాని బాలీవుడ్ ట్రేడ్ టాక్
ఇచ్చి సల్మాన్ కేరాఫ్ అడ్రస్ తో ఆఫర్లు సంపాదించి; ఆ తర్వాత సొంత టాలెంట్ తో బాలీవుడ్ లో సెటిల్ అయిన బ్యూటీ సోనాక్షి సిన్హా సినిమాకు 7 కోట్లు తీసుకుంటుంది. ప్రస్తుతం ఆమె నటించిన దబాంగ్ 3 సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది
బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యరాయ్ కూడా ఏం
తక్కువ తినట్లేదు. ఇంత మంది హీరోయిన్లు వచ్చినా ఒకవేళ ఐశ్వర్యరాయ్ గనుక సినిమాలో చేయాల్సి ఉంటే 6 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందే. సల్మాన్ ఖాన్ పరిచయంచేసినమరొకఅద్భుతమైనఅందగ త్తె, శ్రీలంక సుందరి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అయితే, సినిమాకి 5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.
2. దీపికా రణవీర్ సింగ్
“పద్మావత్” సినిమా తరువాత దీపికా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. తన భర్త రణవీర్ తో కలిసి పోటాపోటీగా బ్రాండింగ్ చేస్తున్న దీపికా ప్రస్తుతం సినిమాకు రూ.21 కోట్లు వసూల్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో చప్పాక్, మహాభారత్, కపిల్ దేవ్ బయోపిక్ “83”, తో పాటు కరణ్ జోహార్ చిత్రం కూడా ఉన్నాయి.
ఇక మన సల్మాన్ ఖాన్ తర్వాతి సినిమా “రాధే” లో
హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని అయితే ప్రస్తుతం పేమెంట్ ని 4 కోట్లకుపెంచేసింది. వరుస సినిమాలసక్సెస్అయినతర్వాతకృతిసనన్ రూ 3 కోట్లు వసూలు చేస్తూ ఉండగా, ఏదో బాగా కష్టపడుతున్న ట్లు బిల్డప్ ఇచ్చే తాప్సీ 2.5 కోట్లకు సినిమాలు చేస్తోంది.
5. శ్రద్దా కపూర్
రీసెంట్ గా రిలీజ్ అయిన సాహో సినిమాతో సౌత్ లో కూడా ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా కపూర్ ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్, బాఘి 3 సినిమాలలో నటిస్తోంది. ఆమె పారితోషికం సుమారు 14 కోట్లు .
కబీర్
సింగ్ సక్సెస్ తర్వాత సూపర్ ఫామ్ లోకి వచ్చిన బోల్డ్ బ్యూటీ కియారా అద్వానీ కూడా తన రెమ్యునరేషన్ దాదాపు 4 కోట్లకు పెంచినట్లు సమాచారం.
ఇన్ని డబ్బులకు ఒప్పుకున్న సినిమా షూటింగ్ తో
౩. ప్రియాంక చోప్రా
బెవాచ్ సీరిస్ తర్వాత పూర్తిగా హాలీవుడ్ కి పరిమితం అయిన ప్రియాంక బాలీవుడ్ ఆఫర్లను మినిమం దేఖటం లేదు. ఈమె సినిమా కి సైన్ చెయ్యాలంటే కనీసం 18 కోట్లు ఇవ్వాలట.
9. విద్యా బాలన్ 6. ఆలియా భట్
అసలు ఈ అమ్మాయి హీరోయిన్ ఏంటి.? అని
కరీనా కపూర్ మాదిరిగానే లేటు వయసులోనే కానీ అందాలు అంతగా చూపించకపోయినా కూడా మన విద్య కుట్టి సినిమాకు కనీసం 10 కోట్లు
పాటు, ప్రమోషన్లు, ఫోటో షూట్ లు, అడ్వర్టైజ్మెంట్ లు, ఈవెంట్ లు, అవార్డు ఫంక్షన్ డ్యాన్సులు కూడా ప్యాకేజ్ లో కలుస్తాయి అంటే పొరపాటే, ఫ్లైట్ టికెట్ దగ్గరనుండి, తుడుచుకునే టిష్యు తో సహా ఎక్స్ ట్రా గా వసూలు చేస్తారు.
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 15
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ
@
టా
లెంట్ ఉంటే ఎదగడానికి ఏదీ అడ్డంకి కాదని నిరూపిస్తోంది నేటి యువత. డిజిటల్ విప్లవం మొదలవ్వడంతోనే యువత కలలకు రెక్కలొచ్చినట్లైంది. మన టాలెంట్ ఏంటో మనకు తెలిస్తే చాలు ఇది ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్న వారు ఎందరో ఉన్నారు. వారిలో శ్రావణి కూడా ఒకరు. మాములుగా శ్రావణి అంటే తెలీకపోవచ్చు కానీ ప్రాంక్ పటాకా శ్రావణి అంటే మాత్రం సోషల్ మీడియాను విరివిగా ఉపయోగిస్తున్న వారికి కచ్చితంగా తెలిసే ఉంటుంది. తనదైన శైలిలో ప్రాంక్ వీడియోలతో అందరినీ ఆకర్షిస్తోంది శ్రావణి. ప్రాంక్ వీడియోలే కాక సామాజిక ప్రయోగాలు చేయడంలో కూడా శ్రావణి ముందుంటారు. ముఖ్యంగా రీసెంట్
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
- సాLittleStar త ధారణంగా ఎంటర్టైన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టాలనుఉంటున్న ఎవరికైనా సినిమాల్లోకి వెళ్లాలన్నదే కల. కనీసం ఒక్కసారైనా తన పేరుని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని ఆరాటపడిపోతుంటారు చాలా మంది. అయితే తనకు సినిమాలకంటే సీరియల్స్ అంటేనే ఇష్టమంటోంది అనూష వేణుగోపాల్. ఈ పేరు ఒక్కసారిగా వింటే ఎవరబ్బా ఈ అమ్మాయి అని అనుకునే ఛాన్స్ ఉంది కానీ కోయిలమ్మ సీరియల్ లో ఉపలక్షిత పేరు చెప్పగానే అందరూ గుర్తుపడతారు. అంతలా ఈ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యారు అనూష. సీరియల్ లో మంచి పేరు తెచ్చుకోవడమే తన ముందున్న లక్ష్యమని చెబుతోంది అనూష వేణుగోపాల్. ఇంతకీ అనూష నేటివ్ ప్లేస్ చెప్పలేదు కదూ. వైజాగ్ లో పుట్టి పెరిగిన అనూష, తన మకాం హైదరాబాద్ కు మార్చేశారు.
నకు ఎక్కువ కష్టపడకుండానే ఆఫర్లు వచ్చాయని చెబుతోందామె. మొదట్లో ఒక రాధా ముగ్గురు కృష్ణులు అనే సినిమాలో నటించినా అది విడుదలకు నోచుకోలేదు. అయితే కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ప్రస్తుతం సీరియల్స్ లో రాణిస్తోంది. తన తల్లిదండ్రులకు కూడా సీరియల్స్ లో నటించడమే ఇష్టమని అంటోంది. అయితే తను మొదట ఎంటెర్టైన్మెంట్ రంగంలోకి వెళతాను అన్నప్పుడు ఇంట్లో ఒప్పుకోలేదు. ఒక రకంగా అనూష ఇంట్లో ఈ విషయమై పోరాడిందని చెప్పొచ్చు. కుటుంబం పరువు నిలబడేలా నడుచుకుంటానని మాట ఇచ్చి వచ్చిందట. ఈరోజు బయటకెళ్లిన్నప్పుడు తనని అందరూ పలకరిస్తారని, కుటుంబ సభ్యులలో ఒకరిగా టాబ్లెట్స్ అన్నీ వేసుకోవచ్చు.
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
16 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
గా జరిగిన దారుణం తర్వాత అమ్మాయిల భద్రత విషయంలో మన సమాజం ఎలా స్పందిస్తోంది అన్న వీడియో అందరి దృష్టినీ ఆకర్షించింది. వలం ప్రాంక్ వీడియోలే కాక షార్ట్ ఫిల్మ్స్ తో మంచి పేరు సంపాదించుకుంది. ఇప్పటివరకూ 26 షార్ట్ ఫిలిమ్స్ లో నటించానని చెబుతోన్న శ్రావణి అదంతా తన తల్లి సపోర్ట్ వల్లనే అని అంటున్నారు. తెనాలిలో పుట్టి పెరిగిన శ్రావణి తల్లిదండ్రులు గుమ్మ చెంచయ్య, గుమ్మ శివలక్ష్మి. డిగ్రీ పూర్తి చేసిన శ్రావణి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మీద ఆసక్తితో ఈ రంగంలోకి అడుగు పెట్టినట్లు చెబుతారు. తన ఫ్రెండ్ మనోజ్ సపోర్ట్ కూడా తన ఎదుగుదలలో మరిచిపోలేనిదని చెబుతుంటారు శ్రావణి.
కే
90
ల జెనరేషన్ వారిని టాలీవుడ్ లో బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని అడగండి.. ఏ మాత్రం తడుముకోకుండా మణిశర్మ అని చెప్తారు. 2000వ సంవత్సరానికి అటూ ఇటూలో మణిశర్మ తన పాటలతో మ్యాజిక్ చేసాడనే చెప్పాలి. ముఖ్యంగా మెలోడీ కొట్టాలంటే మణిశర్మ తర్వాతే ఎవరైనా అనే పేరు తెచ్చుకున్నాడు. టాప్ హీరోలందరికీ అప్పట్లో మణిశర్మనే మ్యూజిక్ కంపోజర్. చిరంజీవి, బాలకృష్ణలకు ఎన్నో మరపురాని సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చాడు మణిశర్మ. తర్వాతి జెనరేషన్ హీరోలు మహేష్, పవన్ లకు కూడా సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఇక ఇతని బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడంలో మణిశర్మ సిద్ధహస్తుడు. అలాంటి మణిశర్మ తర్వాత్తర్వాత నెమ్మదించాడు. దేవి శ్రీ ప్రసాద్, థమన్ లాంటి యువ సంగీత దర్శకులు రావడంతో పాటు తన సంగీతంలో కూడా పస తగ్గడంతో మణిశర్మకు అవకాశాలు సన్నగిల్లాయి. ఒక దశలో మొత్తంగా ఆగిపోయాయని చెప్పవచ్చు.
LIFE style
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మణిశర్మ తనకు వచ్చే అవకాశాల పట్ల అసహనం వ్యక్తం చేసాడు కూడా. ధ్యలో జెంటిల్ మ్యాన్, లయన్ అంటూ కొన్ని సినిమాలకు మ్యూజిక్ చేసినా అది అప్పటికి బాగున్నాయి అనిపించాయి కానీ మణిశర్మ కోరుకున్న బ్రేక్ మాత్రం రాలేదు. ఇక మణిశర్మ ఆశలన్నీ వదిలేసుకున్న క్రమంలో వచ్చింది ఇస్మార్ట్ శంకర్. ఈ ఒక్క సినిమాతో మణిశర్మ సుడి మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది. కంటెంట్ యావరేజ్ గా ఉన్నా సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి మణిశర్మ మ్యూజిక్ ప్రధాన కారణం. ఇప్పటి యువతను ఆకట్టుకునే మాస్ బాణీలు అందించగలనని నిరూపించాడు మణిశర్మ. ఇక ఈ సినిమాలో కొట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి ప్రస్తావించే అవసరమేముంది. ఎప్పట్లానే తుక్కురేగ్గొట్టేసాడు. ఒక్క సినిమాతో మళ్ళీ పెద్ద సినిమాల్లో మణిశర్మను కన్సిడర్ చేయడం మొదలుపెట్టారు.
మ
ఈ
BEHIND THE WOODS
NEWS HAPPENINGS
ఇప్పటికే రామ్ తన తర్వాతి చిత్రం రెడ్ సినిమాకు కూడా మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమాకు మణిశర్మ సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడన్న వార్త తెలుగు సంగీత ప్రియులకు చాలా సంతోషాన్నిచ్చింది. ఇది మణిశర్మకు ఒక బంగారు అవకాశం. కొరటాల శివ సినిమాలో పాటలకు మంచి ప్రాధాన్యత ఉంటుంది. సీన్లను ఎలివేట్ చేయడంలో కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సహాయం తీసుకుంటాడు. పైగా చిరంజీవి - మణిశర్మ కాంబినేషన్ లో గోల్డెన్ హిట్స్ ఉన్నాయి. సో ఈ కాంబో చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది.
ఇ
క్కడితో అయిపోలేదు. వెంకటేష్ తాజాగా ఎంతో ఇష్టపడి ఎంచుకున్న అసురన్ రీమేక్ కు మణిశర్మనే సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారట. అసురన్ చిత్రంలో మ్యూజిక్ చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో పాటలు తక్కువే ఉన్నా నేపధ్య సంగీతానికి బోలెడంత స్కోప్ ఉంది. ఈ కారణాలతోనే మణిశర్మను అప్రోచ్ అయినట్లున్నారు. మరి మణిశర్మ ఈ మూడు సినిమాలకు అదిరిపోయే అవుట్ ఫుట్ ఇస్తే మరింత మంది హీరోలు మణిశర్మతో పనిచేయడానికి సిద్ధపడతారనడంలో సందేహం లేదు.
LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD
sex psychology
top జో
ష్ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య ఇప్పటికీ మిడ్ రేంజ్ హీరోగానే ఉండిపోయాడు. కన్సిస్టెంట్ గా హిట్ సినిమాలు ఇవ్వడంలో విఫలమవుతున్నాడు నాగ చైతన్య. ఒక సూపర్ హిట్ వచ్చిందంటే రెండు, మూడు ప్లాపులతో కెరీర్ మళ్ళీ మొదటికి వస్తోంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఈసారి తన కెరీర్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ఇటీవలే భార్య సమంతతో కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అవ్వడంతో తన మార్కెట్ పెంచుకునే అవకాశాన్ని వదులుకోవాలనుకోవట్లేదు. వరసగా ఆసక్తికర సినిమాలను లైన్లో పెడుతున్నాడు. కెరీర్ మీద ఫోకస్ తో ఎలాంటి సినిమా చేయాలా అన్న ఆలోచనతో ఎక్కువ సమయం వృధా చెయ్యట్లేదు చైతూ. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను ప్రకటించేస్తున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య నటించిన సినిమా ఒకటి విడుదలకు సిద్ధంగా ఉండగా, ఒక సినిమా సెట్ పై ఉంది, మరొక సినిమాను ఓకే చేసే పనిలో ఉన్నాడు. జిలీ హిట్ తర్వాత మావయ్య వెంకటేష్ తో కలిసి వెంకీ మామ సినిమాను పూర్తి చేసాడు చైతూ. డిసెంబర్ 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆ రోజు వెంకటేష్ పుట్టినరోజు కావడం విశేషం. ఇప్పటికే చైతన్య తన తర్వాతి సినిమాను మొదలుపెట్టేసిన సంగతి తెల్సిందే. సాయి పల్లవి హీరోయిన్ గా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య చేస్తున్న సినిమా అప్పుడే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. సెకండ్ షెడ్యూల్
N GHT Life
trade GUIDE My CHOICE QUIZ
త్వరలోనే మొదలవుతుందని తెలుస్తోంది. మార్చ్ కల్లా షూటింగ్ ను పూర్తి చేసి సమ్మర్ లో సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ యూనిట్. ఫిదా వంటి సెన్సేషనల్ హిట్ తర్వాత శేఖర్ కమ్ముల నుండి రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన చిన్న టీజర్ లో చైతూ శేఖర్ కమ్ముల సినిమాల్లోని హీరోల్లానే చాలా సింపుల్ గా ఉంటూ ఆకట్టుకుంటున్నాడు. దిలా ఉంటే నాగ చైతన్య 20వ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. గీత గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న పరశురామ్ నాగ చైతన్యతో తన తర్వాతి సినిమాను ప్లాన్ చేస్తున్నాడట. లైన్ విన్న చైతూ నచ్చడంతో ఫుల్ స్క్రిప్ట్ కు పచ్చ జెండా ఊపేసాడని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వేసవికి పరశురామ్ - నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా మొదలవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ ఈ సినిమాను నిర్మించనుంది. ఫుల్ స్క్రిప్ట్ పూర్తవ్వగానే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. గీత గోవిందం సినిమా తర్వాత పరశురామ్ స్టార్ హీరోతో సినిమా చేయాలని దాదాపు ఏడాది పాటు ఎదురుచూశాడు. మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి టాప్ హీరోలకు కథలను నరేట్ చేసాడు కానీ అటువైపు నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో అక్కినేని హీరోతో సినిమాను సెట్ చేస్తున్నాడు.
COMPETET ON మ
d ary B RTHDAYS EXCLUS VE
ఇ
ఈ మధ్య థమన్ టైమ్ ఏంటో తనకు
కూడా అర్ధం కావట్లేదు. ప్రతీ క్రేజీ ప్రాజెక్ట్ తన ఖాతాలోనే పడిపోతోంది. గతేడాది నుండి బాణీలు కట్టడంలో స్టైల్ ను పూర్తిగా మార్చేసిన థమన్ దానికి తగ్గ ఫలాలను అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం ప్రొడక్షన్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్టులన్నిటికీ (ఒకటి రెండు తప్ప) థమన్ సంగీత దర్శకుడు కావడం విశేషం. గత రెండు నెలల నుండి యూట్యూబ్ లో ఏ పాట విడుదలవుతున్నా దానికి సంగీత దర్సకుడు ఎవరా అని చూడాల్సిన పని లేదు. ఎందుకంటే దానికి థమన్ పేరే ఉంటోంది. మొదట అల వైకుంఠపురములో చిత్రంలో సామజవరగమన పాటతో అంతా మొదలైంది. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సాంగ్. ఇప్పటికి ఈ సాంగ్ 92 మిలియన్ వ్యూస్ సాధించింది, 1మిలియన్ లైక్స్ వైపు దూసుకుపోతోంది. అలాగే అదే సినిమాలో రాములో రాముల కూడా సెన్సేషనల్ హిట్ అయింది. ఈ సాంగ్ 60 మిలియన్ వ్యూస్ దాటి దూసుకుపోతోంది. అంతే కాకుండా వెంకీ మామ సినిమాలో ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. రెండూ కూడా వేటికవే ప్రత్యేకంగా ఉండడం కాకుండా శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోంచి కూడా రెండు పాటలు విడుదలయ్యాయి. టైటిల్ సాంగ్, ఓ బావ సాంగ్స్ రెండూ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నాయి. మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రొడక్షన్ లో ఉన్న డిస్కో రాజా సినిమాకు కూడా
థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులోంచి కూడా ఒక సాంగ్ విడుదలై సూపర్ హిట్ అయింది. క్కడితో లిస్ట్ అయిపోలేదు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న మిస్ ఇండియాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వరుణ్ తేజ్ బాక్సింగ్ నేపథ్యంలో చేయబోతున్న సినిమాకు కూడా థమన్ సంగీత దర్శకుడు. సాయి ధరమ్ తేజ్ ఇటీవలే మొదలుపెట్టిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాకు థమన్ పనిచేస్తున్నాడు. రవితేజ ఇటీవలే షూటింగ్ స్టార్ట్ చేసిన క్రాక్ సినిమాకు కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇలా తెలుగులో వరసగా క్రేజీ ప్రాజెక్టులకు థమన్ పనిచేస్తున్నాడు. డిసెంబర్ నుండి ప్రతి నెలలో కనీసం ఒక్క సినిమా అయినా థమన్ ది విడుదలవుతుంది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వి చాలవన్నట్లు థమన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెల్సిందే. పవన్ కళ్యాణ్ నటించనున్న పింక్ సినిమా రీమేక్ కు ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ మొదలైపోయాయి. జనవరి నుండి షూటింగ్ కు వెళ్లనున్న నేపథ్యంలో దిల్ రాజు, దర్శకుడు వేణు శ్రీరామ్ కలిసి సాంకేతిక వర్గాన్ని ఎంచుకునే పనిలో పడ్డారు. సంగీత దర్శకుడిగా థమన్ పేరుని ప్రదిపాదించారట. ఇప్పటికే థమన్ తో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ కూడా థమన్ పేరునే రికమెండ్ చేయడంతో పవన్ కళ్యాణ్ కూడా ఎస్ చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది.
ఇ
ఇ
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 17
d ary B RTHDAYS EXCLUS VE
@LittleStar టాలెంట్ ఉండాలే కానీ ఈరోజుల్లో రాణించడానికి
ఈ
రెండు ఛానల్స్ ఫాలో అయ్యేవారికి భార్గవ్ సుపరిచితుడే. స్వతహాగా రైటర్ అయిన భార్గవ్ ఈ మధ్య లీడ్ రోల్ లో షార్ట్ ఫిలిమ్స్ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. "when she is home alone", "temporary boyfriend", "proposing to my exgirlfriend" వంటి షార్ట్ ఫిలిమ్స్ తో ఈ మధ్య బాగా పాపులర్ అయ్యాడు. అయితే యాక్టర్ కంటే ముందు భార్గవ్ లో ఒక మంచి రైటర్ కూడా ఉన్నాడు. హే పిల్లా ఛానల్ లో భార్గవ్ రచనలు చాలా ఫేమస్. భార్గవ్ రెడ్డి రచించిన "she & periods" ఏకంగా 5 మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం విశేషం. దీంతో పాటు "when your boyfriend is a topper", "Ammayi boothulu maatladite" వంటి షార్ట్ ఫిలిమ్స్ కూడా 1 మిలియన్ వ్యూస్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యాయి.
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
దారులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా డిజిటల్ విప్లవం మొదలయ్యాక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు అంటూ టాలెంట్ ఉన్న యువతకు ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఎంతో మంది యువత రాణిస్తున్నారు కూడా. వీరిలో భార్గవ్ రెడ్డి అనే రైటర్ కం యాక్టర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి.
సీఏపిడిటి, హే పిల్లా అనే యూట్యూబ్ ఛానల్స్ కు
సబ్స్క్రైబ్ అయిన ప్రేక్షకులకు భార్గవ్ సుపరిచితమే. సిఏపిడిటి అనేది మొదట ఒక ఫేస్ బుక్ పేజీగా మొదలైంది. తర్వాత యూట్యూబ్ ఛానల్ ను మొదలుపెట్టారు. కంటెంట్ ను డిఫరెంట్ గా ప్రెజంట్ చేయడం వాళ్ళ స్పెషలిటీ. ముఖ్యంగా ప్రతి షార్ట్ ఫిలిమ్ క్లైమాక్స్ లోనూ వాళ్ళు ఇచ్చే ట్విస్ట్ లు బాగా ఫేమస్ అయ్యాయి. అయినా వాళ్ళకి సబ్స్క్రైబర్లు అంత సులభంగా ఏం రాలేదు. క్వాలిటీ కంటెంట్ నే నమ్ముకుని ముందుకు సాగరు. వాళ్లే హే పిల్లా అని మరో యూట్యూబ్ ఛానల్ ను కూడా మొదలుపెట్టారు. ఇది మహిళలకు ప్రత్యేకంగా మొదలైన ఛానల్.
ప్రాసల
కోసం ప్రయాస పడకుండా ప్రేక్షకులను ఆకట్టుకునేలా డైలాగులు రాయడం భార్గవ్ ప్రత్యేకత. భార్గవ్ రైట్స్ అనే పెన్ నేమ్ పై అతని రచనలు సాగుతుంటాయి. తను ఎంచుకునే కాన్సెప్ట్స్ కూడా ఎంతో కొంత వైవిధ్యంగా ఉండడంతో భార్గవ్ కు ఫేమ్ త్వరగానే వచ్చింది. సినిమాల్లోకి వెళ్లడమే తన లక్ష్యంగా ముందుకెళుతున్న భార్గవ్ త్వరలోనే తన కలను సాకారం చేసుకోవాలని కోరుకుందాం.
పాపులర్
మ్యూజిక్ కంపోజర్ మున్నా కాశి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం హేజా. హారర్ జోనర్ లో రూపొందిన ఈ చిత్రం టీజర్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. హారర్ లోనే ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కిన హేజా, టీజర్ చూస్తేనే ఒళ్లు జలదరించడం ఖాయం. అలాంటి హేజా ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రంలో మున్నా కాశి ప్రధాన పాత్రలో నటిస్తుండగా ముమైత్ ఖాన్, తనికెళ్ళ భరణి, నూతన్ నాయుడు, లిజ్యి గోపాల్, లక్ష్మణ్, భూషణ్ ప్రీతి నిగమ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హేజాలో సంగీతం కూడా ప్రధాన భూమిక పోషించనుంది. అందుకే దీన్ని మ్యూజికల్ హారర్ గా ప్రమోట్ చేస్తున్నారు.
టీజర్ చూసిన ఎవరికైనా బ్యాక్ గ్రౌండ్ సౌండ్స్
వల్ల కూడా భయం పుట్టడం ఖాయం. మున్నా కాశి
18 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
స్వయంగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు అవ్వడం వల్ల సౌండ్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. రెగ్యులర్ గా హారర్ సినిమాల్లో చూపించే సౌండ్స్ కాకుండా కొత్త పంథాలో మున్నా కాశి ఈ చిత్రంలో మ్యూజిక్ ను వాడటం జరిగింది. మున్నా కాశి గతంలో యాక్షన్ 3డి, చిత్రం చెప్పిన కథ, అమ్మ నాన్న ఊరెళితే, కిల్లింగ్ వీరప్పన్ వంటి సినిమాలకు సంగీతం అందించాడు.
హేజా
డిసెంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్. సినిమా మొదటినుండి చివరి వరకూ వెన్నులో వణుకు పుట్టించే థ్రిల్స్ ఎన్నో ఉంటాయని చెబుతున్నారు. మరి హేజా టీజర్ నెలకొల్పిన అంచనాలను అందుకుంటుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 12 వరకూ ఆగాల్సిందే.
B RTHDAYS EXCLUS VE
.
LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
ఎవరికైనా
హార్డ్ వర్క్, డిసిప్లిన్, టాలెంట్ ఉంటే లక్ అనేది మనల్ని ఫాలో అవుతూ వస్తుందని నిరూపించాడు సిద్ధం మనోహర్. ప్రస్తుతం ఈ పేరు వింటే ఎవరు అనే సందేహం వచ్చినా త్వరలో అందరూ గుర్తించుకునే పేరు అవుతుందని నమ్మకంగా ఉన్నాడు మనోహర్. నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం ‘మహానటి‘కి అసోసియేట్ సినిమాటో గ్రాఫర్ గా చేసాడు సిద్ధం మనోహర్. మహానటికి కెమరామెన్ గా డాని సాంచెజ్ – లోపెజ్ పనిచేసారు. తనకి అసిస్టెంట్ గా పనిచేసిన సిద్ధం మనోహర్ పనితనానికి ముగ్దుడైన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మనోహర్ కు అద్భుతమైన అవకాశమిచ్చాడు. వడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన నాగ్ అశ్విన్, నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం జాతి రత్నాలు. మహానటి
ఎ
వంటి చిత్రాన్ని అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు వారికి దగ్గరైన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయినట్లు, మార్చి 2020 లో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని మూవీ యూనిట్ తెలిపింది. ఇటీవల ఈ చిత్ర మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ ఖైదీ బట్టలో ఉండగా ముగ్గురికీ వరసగా చొక్కాపై 420, 210, 840 నంబర్లు ఉన్నాయి. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “ఫన్నీయస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్”గా ప్రమోట్ చేస్తున్నారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. రి నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడి నిర్మాణంలో, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో టాలెంటెడ్ నటులతో తెరకెక్కుతున్న జాతి రత్నాలు వంటి చిత్రంతో ‘డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ’గా తన మొదటి అడుగును వేయబోతున్న సిద్ధం మనోహర్ కు ఇది సువర్ణకాశమనే చెప్పాలి. తన టాలెంట్, నిబద్ధత, క్రమశిక్షణతో పిన్న వయసులోనే పెద్ద అవకాశాన్ని పొందిన సిద్ధం మనోహర్, తన కెమెరా కంటితో ఎలాంటి మాయ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. చిత్రంలో హీరోగా చేస్తున్న నవీన్ పోలిశెట్టి
మ
ఈ
వరస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్నాడు. తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టగా, హిందీలో చేసిన చిచ్చోరే కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జాతి రత్నాలతో తన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు నవీన్. మరోవైపు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన బ్రోచేవారెవరురా చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాలో వీరు ఎంత కామెడీ చేస్తారన్నది కూడా ఆసక్తికరం. వీరికి సాయం మురళి శర్మ, నరేష్, తనికెళ్ళ భరణి వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చూద్దాం మరి ఈ జాతిరత్నాలు ఎంతటి నాణ్యత కలిగినవారో!
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 19
fash on
2
TICKET TOLLYWOOD
sex psychology
top
N GHT Life
సాధారణంగా దర్శకుడు కావాలంటే ఇక ప్రాసెస్
ఉంది. ముందు అసిస్టెంట్ గా చేరి, అసోసియేట్ అయ్యి అటు నుండి కో డైరెక్టర్ గా మారితే తర్వాత దర్శకత్వం వహించే అవకాశం వస్తుంది. అయితే ఇదంతా ఒకప్పుడు. సోషల్ మీడియా వాడకం బాగా పెరిగాక కంటెంట్ ను వీక్షించడం కూడా ఈ మధ్య బాగా పెరిగింది. టాలెంట్ ను నిరూపించుకోవాలంటే ప్రస్తుతం షార్ట్ ఫిలిమ్స్ సరైన దారి. మనకు ఇప్పటికే సుజీత్ లాంటి దర్శకులు షార్ట్ ఫిలిమ్స్ నుండి దర్శకులుగా మారి టాలీవుడ్ లో పాగా వేసేసారు.
trade GUIDE My CHOICE QUIZ
ఇప్పుడు అదే కోవలో ప్రయాణిస్తున్నాడు నవీన్ అల్లసాని. ఇప్పటివరకూ దాదాపు 20 షార్ట్ ఫిలిమ్స్ ను డైరెక్ట్ చేసిన నవీన్, తన బెస్ట్ వర్క్స్ అంటే మాత్రం అనగనగా ఓ రోజు, s/o మిడిల్ క్లాస్, నా ప్రయాణం, రంగస్థలంలో ఓ నాటకం, షీ వంటివి పేర్కొంటాడు. ఇకపోతే నవీన్ కు ఇప్పటివరకూ 5 అవార్డులు వచ్చాయని సమాచారం . అందులో బెస్ట్ రైటర్ గా, బెస్ట్ డైరెక్టర్ గా కూడా అవార్డులు అందుకున్నాడు. రైల్వే కోడూరులో జన్మించిన నవీన్ తల్లిదండ్రులు వెంకటరమణ, వెంకట లక్ష్మమ్మ. అయితే తాను ఇటువైపు రావడానికి తన బ్రదర్స్ శ్రీను, విశ్వనాధ్ సపోర్ట్ ఎంతో ఉందని చెప్తున్నాడు నవీన్. ఎంబీఏ పూర్తి చేసిన నవీన్ సినిమాల్లోకి వెళ్లడమే లక్ష్యంగా పనిచేస్తున్నాడు. వీలుంటే నవీన్ షార్ట్ ఫిలిమ్స్ పై ఓ లలుక్కేయండి మరి.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
నటన
LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
షార్ట్
ఫిలిమ్స్ చేస్తూ పట్టుదలగా ప్రయత్నించి సీరియల్లో రోల్ సంపాదించిన గణేష్ రెడ్డి, క్రమంగా ఎదుగుతూ కెరీర్ లో ఎంతో నేర్చుకొవాలనుకుంటున్నాడు. ఎలాంటి పాత్రనైనా చేయడానికి సిద్ధమని చెప్పే గణేష్ రెడ్డి, కొంచెం సెటిల్ అయ్యాక ఊరికి ఏదైనా మంచి చేయాలని అనుకుంటున్నాడు. వదినమ్మ సీరియల్లో తమ్ముళ్లలో ఒకడిగా చేస్తోన్న గణేష్ రెడ్డి, షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కూడా సుపరిచితమే. ఇప్పటిదాకా 29 షార్ట్ ఫిలిమ్స్ చేసిన గణేష్, తనకు ది బీచ్, రిలేషన్, లైలా మజ్ను వంటివి తనకు మంచి పేరు తీసుకొచ్చాయని చెబుతున్నాడు. వదినమ్మ సీరియల్లో అవకాశం గురించి చెబుతూ ఆడిషన్ ఇచ్చే రోజు తనకు 102 జ్వరం అని, అయినా ఎవరికీ పెద్దగా ఇష్టం
20 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
లేకపోయినా ఇటువైపు వచ్చాను కాబట్టి ప్రూవ్ చేసుకోవడానికి ఇదే సరైన అవకాశంగా భావించి జ్వరంలోనూ ఆడిషన్ ఇచ్చాడట. టుంబనేపథ్యం గురించి చెబుతూ నాన్న కేశవరావు దుబాయ్ లో పనిచేస్తున్నారని, రెండేళ్లకు ఒకసారి ఇంటికి వస్తారని, అమ్మ దమయంతి వైజాగ్ లోనే ఉంటారని తెలిపాడు. కుటుంబం కోసం ఇంతలా కష్టపడుతున్న నాన్న అంటే తనకెంతో ఇష్టం గౌరవం అని తెలిపాడు. పుట్టి, 7వ తరగతి వరకూ ముంబైలోనే చదువుకోవడం వల్ల వివిధ భాషలపై పట్టు వచ్చినట్లు చెబుతున్నాడు గణేష్. తనకు తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, ఒరియా పూర్తిగా వచ్చని, తమిళం అర్ధమవుతుందని చెప్పుకొచ్చాడు. సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేయాలనేది తన లక్ష్యమని చెబుతున్నాడు గణేష్.
కు
మీద ఆసక్తి ఉండి ఏ బ్యాక్ గ్రౌండ్ లేని ఉత్సాహవంతమైన యువతకు మార్గదర్శిగా నిలుస్తోంది షార్ట్ ఫిలిమ్స్. దర్శకుడైనా, నటుడైనా, లేదా సాంకేతిక నిపుణుడైనా తన ప్రతిభను చూపించుకోవడానికి సరైన మార్గం షార్ట్ ఫిలిమ్స్. అలా షార్ట్ ఫిలిమ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన మనోజ్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఇందులో తన కష్టం ఎంతో ఉందని, ఏదీ తనకు సులువుగా రాలేదని చెబుతుంటాడు మనోజ్. విజయవాడలో పుట్టిపెరిగిన మనోజ్ తల్లిదండ్రులు
రత్నకుమార్, ప్రమీల రాజకుమారి. డిప్లొమా కోర్స్ చేసాక నటన మీద ఆసక్తితో 2016లో అడుగులు షార్ట్ ఫిలిమ్స్ వైఫు పడ్డాయి. ఇప్పటిదాకా దాదాపు 30 షార్ట్ ఫిలిమ్స్ చేసిన మనోజ్, ప్రాంక్ పటాకాలో ఎన్నో ఆసక్తికరమైన ప్రాంక్స్ చేసాడు. ప్రాంక్ పటాకా మనోజ్ అంటే యూట్యూబ్ లో యాక్టివ్ గా ఉన్నవాళ్లకు బాగా తెలుస్తుంది. ఇంకా తానింత సక్సెస్ కావడానికి శ్రావణి కూడా ప్రధాన కారణమని చెబుతుంటాడు మనోజ్. తన తల్లిదండ్రులు ఫుల్ సపోర్ట్ ఇస్తారని, ఆ ధైర్యంతోనే ఇక్కడ అడుగు పెట్టానని చెబుతున్నాడు మనోజ్.
NEWS HAPPENINGS సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరసగా ఆరు
ప్లాపుల తర్వాత ఈ ఏడాది చిత్రలహరి చిత్రంతో డీసెంట్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. అయితే పూర్తి స్థాయిలో మార్కెట్ రావాలంటే మాత్రం తేజ్ సూపర్ డూపర్ హిట్ ను కొట్టి తీరాలి. ఆ సినిమా ఇప్పుడు పూర్తి చేసిన ప్రతిరోజూ పండగే అవ్వగలదని అనుకుంటున్నాడు తేజ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలకు సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ సినిమాను తీసినట్లు తెలుస్తోంది. తేజ్ కు తాత పాత్రలో సత్యరాజ్ నటించిన విషయం తెల్సిందే. మనిషి పుట్టినప్పుడు ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటామో, ఒక మనిషి పరిపూర్ణ జీవితాన్ని గడిపి చనిపోయినప్పుడు కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుని అతణ్ణి సాగనంపాలి అనే భిన్నమైన కాన్సెప్ట్ తో ప్రతిరోజూ పండగే తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో తేజ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న రాశి ఖన్నాకు కూడా ఈ సినిమా హిట్ అవ్వడం అత్యవసరమే. ఇప్పటికే థమన్ సంగీత సారధ్యంలో రూపొంది విడుదలైన రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమాపై అన్నీ పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో ప్రతిరోజూ పండగే తన కెరీర్ ను మలుపు తిప్పే చిత్రం కాగలదని విశ్వాసంతో ఉన్నాడు. ప్రతిరోజూ పండగే షూట్ ను పూర్తి చేసుకున్న వెంటనే తేజ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తన నెక్స్ట్ సినిమా షూటింగ్ ను కూడా మొదలుపెట్టేశాడు. సోలో బ్రతుకే సో బెటర్ అంటున్నాడు. సుబ్బు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రం టైటిల్ ఇది. వినగానే యూత్ కు కనెక్ట్ అయ్యేలా ఉందిగా.
LIFE style
HOT SPICY
నా
CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
fash on
2
ఈ సినిమా కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుందిట. అమ్మాయిలని అసహ్యించుకునే అబ్బాయిగా, అసలు అమ్మాయిలంటే పడని వ్యక్తిగా ఈ చిత్రంలో తేజ్ కనిపిస్తాడట. వింటుంటే ఎక్కడో చూసిన కాన్సెప్ట్ గుర్తొస్తోందిగా. గార్జున హీరోగా గతంలో వచ్చిన మన్మథుడు సినిమా స్టోరీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. దీంతో నాగ్ రూట్ లోనే తేజ్ కూడా వెళుతున్నాడని కామెంట్స్ మొదలయ్యాయి. సినిమా కాన్సెప్ట్ అలాగే ఉన్నా ట్రీట్మెంట్ వేరుగా ఉంటుందని తెలుస్తోంది. కాన్సెప్ట్ ఒకటే అలా ఉంటుందని, టేకింగ్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం అందింది. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రానికి కూడా థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటిదాకా తేజ్ - థమన్ కాంబినేషన్ లో వచ్చిన పాటలు హిట్ అయినా సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. ఈసారి పక్కాగా హిట్ కొట్టాలని చూస్తున్నారు ఇద్దరూ. అది ప్రతిరోజూ పండగేతో మొదలై, సోలో బ్రతుకే సో బెటర్ కు కూడా కంటిన్యూ అవ్వాలని తేజ్ - థమన్ భావిస్తున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని సీనియర్ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. మే 1న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ఇప్పటికే తేజ్ ప్రకటించిన విషయం తెల్సిందే.
TICKET TOLLYWOOD
sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ
సినిమా ఇండస్ట్రీ అనేది ఎన్ని మాట్లాడుకున్నా ఒక
బిజినెస్. ఒక నిర్మాత అనేవాడు ముందుకొచ్చి కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎందుకు తీస్తాడు? సినిమా అనేది అందరికీ ప్యాషనే కావొచ్చు. కానీ ప్యాషన్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? ఆ నిర్మాతకు లాభాలు లేకపోయినా కేవలం ప్యాషన్ తోనే సినిమాలు నిర్మిస్తూ వెళ్ళిపోతాడా? ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. కేవలం నిర్మాత ఒక్కడే లాభపడినా కూడా లాభం లేదు. ఆ సినిమా ఎలా ఉంటుందో కూడా తెలీకుండా కేవలం హీరో, హీరోయిన్, దర్శకుడు, ట్రైలర్ వంటివి చూసి ఆ సినిమాను నమ్మి డబ్బు పెట్టే డిస్ట్రిబ్యూటర్ కూడా లాభపడాలి. అతని నుండి ఎగ్జిబిటర్ కూడా లాభాలు చూడాలి. ఈ మోడల్ అంతా సక్రమంగా జరిగితేనే తర్వాతి సినిమాకు డబ్బు ధైర్యంగా పెట్టగలడు నిర్మాతైనా, డిస్ట్రిబ్యూటరైనా, ఎగ్జిబిటరైనా!
ఇదివరకు సినిమా బిసినెస్ మోడల్ వేరుగా ఉండేది.
అప్పట్లో నిర్మాత చేతిలో మేకింగ్ అంతా ఉండేది. నిర్మాత, దర్శకుడు కలిసి సినిమా ఎలా ఉండాలో నిర్ణయించేవారు. హీరో కేవలం వారు చెప్పేది విని నడుచుకునేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ పెద్ద హీరోలైనా కూడా వారు నిర్మాతలు, దర్శకులు పట్ల వినమ్రంగా నడుచుకునేవారు. అందుకే అప్పట్లో సినిమా మేకింగ్ అదుపులో ఉండేది. తన సినిమాకు ఎంత పెట్టాలో నిర్ణయించుకునే అధికారం నిర్మాత చేతుల్లో ఉంది కాబట్టి రిస్క్ తక్కువగా ఉండేది. సినిమా ప్లాప్ అయినా భారీ నష్టాలు అయితే వచ్చేవి కావు. అయితే ఇప్పుడు సినిమా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేకింగ్ అంతా నిర్మాత చేతుల్లోంచి జారిపోయింది.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar
హీరో, దర్శకుడు ఒక్కటైపోయారు. పారితోషికాలే సగం బడ్జెట్ ను ఆక్రమించేస్తున్న పరిస్థితి. అందులో కేవలం హీరో, దర్శకుడి పారితోషికమే దాదాపు మూడు వంతులు ఉంటుంటే ఇక నిర్మాత ఎలా సేఫ్ అయ్యేది. బడ్జెట్ పెరుగుతుండడంతో బిజినెస్ ను కూడా పెంచుతున్నారు. పెద్ద సినిమాల విషయంలో నిర్మాత సేఫ్ అవుతున్నా బయ్యర్లు నిండా మునిగిపోతున్నారు. ఒకవేళ సినిమా బాగున్నా వచ్చే లాభాలు ముందు నష్టపోయిన వాటిని పూడ్చుకోవడంతోనే సరిపోతుంది. దాహరణకు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో సినిమాలనే తీసుకుంటే.. అయిన బడ్జెట్ లో సగం మహేష్ బాబు-అనిల్ రావిపూడి, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ లకే అవుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అనిల్
ఉ
రావిపూడికి దాదాపు 10 కోట్ల మేర పారితోషికం ఇస్తున్నారట. ఇక మహేష్ గురించి చెప్పేదేముంది. సరిలేరు నీకెవ్వరులో పార్ట్నర్ కాబట్టి పారితోషికం కింద నాన్ థియేట్రికల్ హక్కులు వెళ్ళిపోయినట్లు తెలుస్తోంది. అల వైకుంఠపురములో విషయానికి వస్తే అల్లు అర్జున్ సొంత సంస్థగీతాఆర్ట్స్ఇం దులోనిర్మాణభాగస్వామి. అయినా కూడా అల్లు అర్జున్ ఈ సినిమాకు 25 కోట్ల దాకా ముట్టినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఎప్పట్లానే 20 కోట్లు వచ్చాయట. ఇలా 45 కోట్ల దాకా ఇద్దరి పారితోషికాలకే వెళ్లిపోతుంటే, మిగతా వారి పరిస్థితి ఏంటి, సినిమాను ఎంతలో తీయాలి. ఆ హీరో, దర్శకుడికి ఉన్న క్రేజ్ ను బట్టి నిర్మాత కూడా డబ్బులు పెడుతున్నాడు కానీ లాస్ వస్తే జేబులు గుల్లవుతున్నాయి.
DECEMBER 1, 2019 b టాలీవుడ్ z 21
Interview SpecialStory Hollywood
ఎంత కాదనుకున్నా సినిమా అనేది వ్యాపారం. అయితే అతి తక్కువే సక్సెస్ రేట్ ఉన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా సినిమా ఇండస్ట్రీనే. కేవలం మూడు నుండి నాలుగు శాతం సక్సెస్ రేట్ ఉంది మనకు. 2019 కూడా అందుకు మినహాయింపేమి కాదు. ఇంకా సంవత్సరం పూర్తవ్వకపోయినా నవంబర్ వరకూ చూసుకుంటే ఈ ఏడాది సక్సెస్ అయిన చిత్రాలు డజను దాటవు. ఏడాదికి ఏడాది మారుతున్నా పరిస్థితిలో మార్పు రావట్లేదు. మహా అయితే నెలకు ఒక హిట్ మాత్రమే నమోదవుతోంది. ఆఫ్ సీజన్ అయిన ఫిబ్రవరి, నవంబర్ లలో పరిస్థితి మరింత ఘోరంగా ఉంటోంది. 2019లో మొదటి దెబ్బ సంక్రాంతికే పడింది. ఎప్పుడూ సినిమాలు హిట్ అయ్యే సంక్రాంతి సీజన్ లో ఈసారి తెలుగు సినిమా దారుణంగా విఫలమైంది. ఒకసారి 2019లో నవంబర్ దాకా రౌండప్ వేద్దాం.
జనవరి:
జనవరిలో 7 సినిమాలు విడుదలైతే ఒకే ఒక్క సినిమా హిట్టైంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎన్టీఆర్ కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోర పరాజయాలను మూటగట్టుకున్నాయి. జనవరి 25న విడుదలైన అఖిల్ చిత్రం Mr. మజ్ను కూడా ప్లాప్ అయింది. ఇది అఖిల్ కు హ్యాట్రిక్ పరాజయం. ఇక హిట్ అయిన సినిమాగా వెంకటేష్, వరుణ్ తేజ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2 సినిమా నిలిచింది. అందరి అంచనాలను దాటుకుని ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. దాదాపు రెండింతల ప్రాఫిట్స్ వచ్చాయంటే ఎంత పెద్ద విజయమో అర్ధం చేసుకోవచ్చు.
పెద్ద దెబ్బ పడింది. మిగతా సినిమాల గురించి చెప్పుకోకపోవడమే మంచిది.
ఏప్రిల్ :
అప్పటిదాకా హిట్లు లేక అల్లాడిపోతున్న తెలుగు ఇండస్ట్రీకి ఈ నెల రెండు హిట్లు ఒక యావరేజ్ సినిమా పడింది. నాగ చైతన్య, సమంత కలిసి చేసిన మజిలీ సూపర్ హిట్ అందుకుంది. సాయి ధరమ్ తేజ్ చిత్రం చిత్రలహరి కూడా డీసెంట్ హిట్ స్టేటస్ అందుకుంది. ఇక నాని నటించిన జెర్సీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నా యావరేజ్ అనిపించుకుంది. ఈ నెలలో మొత్తం 8 సినిమాలు విడుదలయ్యాయి.
22 z టాలీవుడ్ b DECEMBER 1, 2019
ఆగస్టులో బాక్స్ ఆఫీస్ కు పెద్ద షాక్ తగిలిందని చెప్పవచ్చు. భారీ అంచనాల మధ్య వందల కోట్ల బిజినెస్ చేసిన ప్రభాస్ సాహో అట్టర్ ప్లాప్ గా నిలిచింది. మొదటి రోజే టాక్ నెగటివ్ గా స్ప్రెడ్ అవ్వడంతో ట్రేడ్ కోలుకోలేకపోయింది. అలాగే నాగార్జున నటించిన మన్మథుడు 2 డిజాస్టర్ కావడంతో ఆగష్టు టాలీవుడ్ కు డిజాస్టర్ అని చెప్పవచ్చు. అలాగే ఈ నెలలో వచ్చిన ఎవరు, కొబ్బరి మట్ట, రాక్షసుడు సినిమాలకు డబ్బులు మిగిలాయి. ఈ మూడూ హిట్ అయ్యాయని చెప్పవచ్చు.
మే :
మే లో మహేష్ బాబు నటించిన మహర్షి విడుదలై బాక్స్ ఆఫీస్ కు సరికొత్త కళను తీసుకొచ్చినట్లైంది. ఈ సినిమా అంచనాలను అందుకుని సూపర్ హిట్ సాధించింది. అలాగే నెలాఖరులో విడుదలైన ఫలక్నుమా దాస్ విమర్శలు అందుకున్నా కలెక్షన్స్ తో అదరగొట్టింది.
సెప్టెంబర్ :
సెప్టెంబర్ లో కేవలం 8 సినిమాలే విడుదలయ్యాయి. ఇందులో నాని నటించిన గ్యాంగ్ లీడర్ యావరేజ్ గా నిలవగా వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సూపర్ హిట్ అయింది. మిగతా సినిమాలన్నీ వచ్చినవి వచ్చినట్టే వెళ్లిపోయాయి.
జూన్ :
జూన్ లో కూడా 14 సినిమాలు విడుదలయ్యాయి. హిట్లు ఎప్పట్లానే తక్కువగానే నమోదయ్యాయి. జూన్ లో అన్నీ చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలు విడుదలవ్వగా నవీన్ పోలిశెట్టి నటించిన థ్రిల్లర్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మంచి విజయాన్ని అందుకుంది. అలాగే శ్రీవిష్ణు, సత్యదేవ్ హీరోలుగా వచ్చిన బ్రోచేవారెవరురా కూడా సూపర్ హిట్ సాధించింది. ఈ రెండు సినిమాలకు లాభాలు మంచిగా వచ్చాయి. మల్లేశం సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చినా కలెక్షన్లు నామమాత్రమే. మిగతావన్నీ షెడ్ కి వెళ్లిపోయాయి.
మార్చి :
మార్చ్ లో కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చి పడిపోయాయి. ఏకంగా 18 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ నెలలో 5 శుక్రవారాలు రాగా వారానికి సగటున 3 సినిమాలు కంటే ఎక్కువే విడుదలయ్యాయన్నమాట. ఇన్ని సినిమాలు విడుదలైతే హిట్లు ఎన్ని అంటే చెప్పడం కూడా కష్టమే. ఎందుకంటే ఒక్కటి కూడా లేదు కాబట్టి. కానీ 2 సినిమాలు మాత్రం ఎబోవ్ యావరేజ్ గా ఆడాయి. అవే కళ్యాణ్ రామ్ నటించిన 118, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్. వర్మ చిత్రానికి ఎలక్షన్ కోడ్ అడ్డొచ్చి ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోవడం
ఆగష్టు :
.
ఫిబ్రవరి :
ఫిబ్రవరిలో పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. మామూలుగానే ఫిబ్రవరి అంటే డ్రై సీజన్ గా పరిగణిస్తారు. తెలుగు సినిమాలు ఎక్కువగా ఈ కాలంలో ఆడిన చరిత్ర లేదు. ఈ నెలలో ఈ ఏడాది 10 సినిమాలు విడుదలైతే ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ లేదు. వైఎస్సార్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర ఓ మోస్తరుగా ఆడి పర్వాలేదనిపించింది. మిగతావన్నీ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన చిత్రాలే.
కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బయ్యర్లు అందరూ ఈ సినిమాతో పండగ చేసుకున్నారని చెప్పొచ్చు. అలాగే సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ బేబీ కూడా హిట్ అయింది. ఇక సందీప్ కిషన్ నటించిన థ్రిల్లర్ నిను వీడను నీడను నేనే యావరేజ్ గా నిలిచింది.
అక్టోబర్ :
అక్టోబర్ లో 13 సినిమాలు విడుదలైనా బాక్స్ ఆఫీస్ దృష్టాంతా మెగాస్టార్ 151వ సినిమా సైరా పైనే ఉంది. సైరా నరసింహారెడ్డి భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నా కూడా భారీ రేట్లకు అమ్ముడుపోవడం వల్ల హిట్ అనిపించుకోలేకపోయింది. గోపీచంద్ నటించిన చాణక్య కూడా అడ్రస్ లేకుండా గల్లంతైంది. ఈ నెల ఒక్క హిట్ కూడా నమోదవ్వకపోవడం దారుణం.
జులై :
ఈ నెలలో 13 సినిమాలు విడుదలవ్వగా ఒక బ్లాక్ బస్టర్, ఒక హిట్, ఒక యావరేజ్ తో పర్వాలేదనిపించింది. రామ్, పూరి జగన్నాథ్
ఇక నవంబర్ కూడా అందుకు భిన్నంగా ఏం లేదు. ఈ నెల కూడా ఇప్పటిదాకా ఒక్క హిట్ కూడా
నమోదవ్వలేదు. అయితే డిసెంబర్ లో వెంకీ మామ, ప్రతిరోజూ పండగే, రూలర్ ల రూపంలో మూడు డీసెంట్ సినిమాలు విడుదలవుతున్నాయి. మరి ఈ సినిమాలు విజయం సాధించి 2019 కి టాలీవుడ్ మంచి ముగింపుని ఇస్తుందేమో చూడాలి.
ఇటీవల
సక్సెస్ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి పుట్టినరోజు. తన మొదటి సినిమా నుండి ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఎఫ్ 2 వరకూ అన్నీ హిట్లే. పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2 ఇలా అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అందుకే ఐదో సినిమా ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసే అవకాశాన్ని సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి. సరిలేరు నీకెవ్వరు సినిమాతో తన ఐదో ప్రయత్నాన్ని తెరమీదకు సంక్రాంతికి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. అనిల్ రావిపూడి సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే నమ్మకాన్ని ప్రేక్షకులకు కలిగేలా చేసుకోగలిగాడు. ఇటీవల సరిలేరు నీకెవ్వరు టీజర్ విడుదలవ్వగా దానికి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ ఈ టీజర్ పట్ల పూర్తి ఆనందంగా ఉన్నారు. ఇన్నాళ్లూ అతి మంచి వాడి పాత్రలు, సటిల్ యాక్టింగ్ తోనే సినిమాలు చేస్తూ వచ్చిన మహేష్ ఈ టీజర్ లో చాలా యాక్టివ్ గా కనిపించడంతో కచ్చితంగా సినిమా అదిరిపోతుందని నమ్మకంతో ఉన్నారు. క అనిల్ రావిపూడి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దర్శక ధీరుడు రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఏంటో వివరించాడు. రాజమౌళి ఎలాంటి సినిమా చేసినా, అది ఎంత బడ్జెట్ తో తెరకెక్కినా తన సినిమాల్లో కామన్ గా ఒక పాయింట్ ఉంటుంది. మనమెప్పుడూ మన బలాన్ని విడిచి ఏదీ ప్రయత్నించకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా మన బలాన్ని మనం నమ్ముకోవాలి. ఇక రాజమౌళి విషయానికొస్తే అతని బలం ఎమోషన్. ఎంత భారీ బడ్జెట్ సినిమా యినా, అందులో ఎంత గ్రాఫిక్స్ వాడినా కూడా రాజమౌళి ఎమోషన్ ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈగ, బాహుబలి వంటి సినిమాలు చేసినప్పుడు కూడా ప్రేక్షకులను ఎక్కువ కదిలించింది కూడా ఎమోషనే. అందుకే రాజమౌళి సినిమాలు ఫెయిల్ అవ్వడానికి అవకాశాలు తక్కువ అని పేర్కొన్నాడు. జమే కదా. రాజమౌళి స్ట్రాటజీని అనిల్ రావిపూడి బాగా అనలైజ్ చేసాడని చెప్పవచ్చు. అన్నట్లు అనిల్ రావిపూడి కూడా సక్సెస్ఫుల్ దర్శకుడే. నాలుగు సినిమాలే చేసినా కూడా అవన్నీ మంచి విజయలే సాధించాయి. మరి అనిల్ రావిపూడి బలం ఏంటని తనకు తాను అనలైజ్ చేసుకున్నాడో లేదో కానీ అతని సినిమాలు చూసిన ఎవరికైనా ఈజీగా అర్ధమయ్యే విషయం కామెడీయే అనిల్ రావిపూడి ప్రధాన బలం. అన్ని సినిమాల్లోనూ కామెడీ హైలైట్ గా నిలిచింది. సరిలేరు నీకెవ్వరు లో కూడా కామెడీ అదిరిపోతుందని అంటున్నారు. మరి ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి అనిల్ రావిపూడి రికార్డును పదిలంగా ఉంచుతుందా లేదా అన్నది చూడాలి.
ఇ
ని
AN ISO 9001-2015 CERTIFIED INTERIORS
Interiors A trusted name in Salon interiors Since 2012 In Brief
+ 0 10 lons
Started in the year 2012 with a standalone salon in Hyderabad , we have come a long way to become preferred vendors for most of the salon Majors like Lakme , Jawed Habib, Pinks n Bloos, Pony , glam studios, De hair lounge, Matrix, and many stand alone salons.Known for its quality
AD Sa
and timely completion we have more than 100 satisfied salon owners.
Keys USPs º
More than 7 years experience in salon interiors-understands salon requirements better than anyone in the market
º
Handle Turnkey projects – from designing to execution
º
On roll employees – consistence n competent work force in all departments
º
Timely completion of the project – saves a lot of your hard earned money.
º
Affordable pricing – Starts from Rs 1000 per SFT
º
Customized- based on your budget n requirement
across Telangana, A.P, and Karnataka
We also cater interiors for
- Residential Segment - Hospitals n Gold Shops - Restaurants n Bakeries
Other Services - Wall Paper - In Salon Branding n Signage - AMC - Consultation on salon interiors
Preferred Interiors for Major Salon Brands
1st Floor, Above Shreya’s Clinic, Near Anu Furniture, Chandanagar, Hyderabad - 500050.
arcinteriors2012@gmail.com Cell : 9052058002 6304499785
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073
EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2019
Email: editor@tollywoodmag.com I www.tollywood.net