Tollywood Magazine Telugu January - 2018

Page 1

JANUARY 2018 VOL 15 ISSUE 1

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET

    

 

Power Star



PAWAN KALYAN


         http://facebook.com/tollywood


“WHAT LIES BEHIND YOU AND WHAT LIES IN FRONT OF YOU, PALES IN COMPARISON TO WHAT LIES INSIDE OF YOU.” Murali Mohan Ravi

Credits:

Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By

: : : : : : :

Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy

Follow Us On :

Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 JANUARY 2018

టాలీవుడ్ P 3


ర్జున్ రెడ్డి చిత్రంలో హీరోయిన్ తో ఘాటు రొమాన్స్ చేస్తూ ముద్దుల మీద ముద్దులు ఇచ్చి సంచలనం సృష్టించాడు హీరో విజయ్ దేవరకొండ కానీ తాజాగా ఓ చిత్రంలో నటించడానికి అంగీకరించిన ఈ హీరో ఆ చిత్రంలో చాలా పద్దతిగా కనిపిస్తానని , ముద్దులు , హగ్గులు లాంటివి ఏమి లేవని అంటున్నాడు అంతేనా ...... ఈ సినిమా తర్వాత ఓ మూడు సినిమాల వరకు పద్దతిగా కనిపిస్తానని అంటున్నాడు . అంటే కావలసినంత ముద్దులు ఒక్క అర్జున్ రెడ్డి చిత్రంలోనే తీసుకున్నాడు కాబట్టి వాటికీ కొంత గ్యాప్ ఇస్తున్నాడన్న మాట . ర్జున్ రెడ్డి చిత్రం హిట్ కంటే వివాదాస్పదం ఎక్కువయ్యింది దాంతో తాజాగా నటించబోయే చిత్రాల్లో హీరోయిన్ కు కనీసం ముద్దు కూడా పెట్టనని , ఫ్యామిలీ చిత్రాలను కోరుకునే వాళ్ళ కోసం సినిమా చేస్తున్నాని అంటున్నాడు విజయ్ దేవరకొండ . పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి చిత్రాలు విజయ్ దేవరకొండ కెరీర్ ని మలుపు తిప్పాయి . దాంతో మంచి జోరు మీదున్నాడు ఈ హీరో .

    

4 P టాలీవుడ్


సా

యి హరీశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాస్టర్ హరి సమర్పణలో హరీష్ వట్టి కూటి ని దర్శకుడిగా పరిచయం చేస్తూ మోహన్ బాబు పులిమామిడి నిర్మిస్తున్న చిత్రం '' శివకాశీపురం ''. స్వర్గీయ స్వర చక్రవర్తి మనవడు , శ్రీ తనయుడు అయిన రాజేష్ శ్రీ చక్రవర్తి ని ఈ చిత్రంతో హీరోగా పరిచయం చేస్తున్నారు . ప్రియాంక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న శివకాశీపురం చిత్ర నిర్మాణం పూర్తిచేసుకొని సెన్సార్ కు సిద్ధంగా ఉంది . నేపథ్యంలో మాసాబ్ ట్యాంక్ లోని ఎఫ్ డిసి కార్యాలయంలో' శివ కాశీపురం ' చిత్రంలోని మూడవ పాటని తెలంగాణ ఎఫ్ డిసి చైర్మన్ రామ్మోహన్ రావు రిలీజ్ చేసి చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు అందజేశారు . ఈ సందర్బంగా ఎఫ్ డిసి చైర్మన్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ '' శివకాశీపురం '' చిత్రాన్ని అత్యధిక శాతం మంచిర్యాల లో చిత్రీకరించామని , అక్కడి ప్రజలు మాకు ఎంతో సహాయ సహకారాలు అందించారని దర్శక నిర్మాతలు చెప్పారు సంతోషం , అక్కడే కాదు తెలంగాణ అంతటా సినిమా వాళ్లకు సహకరించే వాళ్లే ఎక్కువగా ఉంటారు . చక్రవర్తి గారి మనవడు , శ్రీ తనయుడు రాజేష్ ని హీరోగా పరిచయం చేస్తున్నట్లు తెలిపారు ..... సినిమా నిర్మాణం ఎంత బాధ్యతగా చేయాలో అంతకంటే ఎక్కువగా రిలీజ్ ని ప్లాన్ చేసుకోవాలి , సరైన డేట్ లో రిలీజ్ చేయడమే మనముందున్న టాస్క్ అని ...... శివకాశీపురం చిత్రం ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు .

   

ని

ర్మాత పులిమామిడి మోహన్ బాబు మాట్లాడుతూ " రామ్మోహన్ రావు గారి చేతుల మీదుగా మా చిత్రం లోని పాట రిలీజ్ కావడం ఆనందంగా ఉంది , ఈ సినిమాని మంచిర్యాలలో చిత్రీకరించాం ఆ సమయంలో రామ్మోహన్ రావు గారి కుటుంబం మాకు ఎంతగానో సహాయ సహకారాలు అందించారని , అలాగే రిలీజ్ కి కూడా రామ్మోహన్ రావు గారి సహకారం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు . ర్శకులు వట్టికూటి హరీష్ మాట్లాడుతూ " సినిమా సెన్సార్ కి సిద్ధంగా ఉంది , త్వరలోనే సెన్సార్ కు పంపించి జనవరి లేదా ఫిబ్రవరి లో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని .... పవన్ శేష అందించిన సంగీతం మా చిత్రానికి హైలెట్ గా నిలుస్తుందని ,మాకు అన్నిరకాల గైడెన్స్ ఇస్తున్న రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలని అన్నారు . ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు పవన్ శేష , పాటల రచయిత చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు .

టాలీవుడ్ P 5


టీవలే జవాన్ చిత్రంతో హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తాజాగా మాస్ దర్శకులు వివివినాయక్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . సి . కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి నటిస్తోంది . ఇక ఈ చిత్రానికి పెడుతున్న టైటిల్ ఏంటో తెలుసా ...... ''ధర్మా భాయ్ ''. మాస్ ప్రేక్షకులకు తొందరగా రీచ్ కావాలనే ఉద్దేశ్యంతో ఈ టైటిల్ ని ఎంపిక చేసారు . అయితే ఈ టైటిల్ కంటే ముందు మరో టైటిల్ అనుకున్నారు అదేంటో తెలుసా ..... ఇంటలిజెంట్ . టలిజెంట్ అనే టైటిల్ పట్ల చిత్రబృందం అంతగా సానుకూలంగా లేకపోవడంతో దాన్ని మార్చి '' ధర్మా భాయ్ '' అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు . అయితే ఇంకా అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది . జవాన్ సక్సెస్ తో సంతోషంగా ఉన్న మెగా మేనల్లుడు కి ధర్మా భాయ్ మరింత మాస్ ఇమేజ్ తెస్తుందని భావిస్తున్నాడు .

ఇం

 

6 P టాలీవుడ్


   

హేష్ బాబు సోదరి మంజుల నాని తో ఓ సినిమాని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . ఇప్పటికే కొన్ని సినిమాల్లో నటించిన మంజుల తాజాగా సందీప్ కిషన్ హీరోగా నటించిన మనసుకి నచ్చింది చిత్రానికి దర్శకత్వం వహించి బహుముఖ ప్రజ్ఞాశాలి గా పేరు తెచ్చుకుంది . షో చిత్రంతో అందరి ప్రశంసలు అందుకున్న మంజుల నటిగా , దర్శకురాలిగా , నిర్మాతగా రాణిస్తోంది . మనసుకి నచ్చింది సినిమా రిలీజ్ కాకుండానే నాని తో ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది . యితే నాని హీరోగా నటించే చిత్రానికి మంజుల దర్శకత్వం వహించకుండా ఆ బాధ్యతలను మనం వంటి క్లాసికల్ హిట్ ని అందించిన విక్రమ్ కుమార్ కు అప్పగిస్తోంది . గతంలో సోదరుడు మహేష్ తో పోకిరి వంటి బ్లాక్ బస్టర్ ని అందించింది మంజుల . అలాగే మరికొన్ని సినిమాల్లో నిర్మాణ భాగస్వామి గా ఉంది కూడా . నాని వరుసగా విజయాలు సాధిస్తుండటంతో అతడితో సినిమా చేయడానికి ముందుకు వచ్చింది మంజుల .

టాలీవుడ్ P 7




తె

లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ లో డిజిట‌ల్ మ‌రియు థియేట‌ర్స్ లీజ్ విధానం పైన‌ మార్చి 31 లోపులో డిజిట‌ల్ రేట్స్ త‌గ్గించ‌కున్నా థియేట‌ర్స్ లీజ్ విధానం తీసివేయ‌క‌పోయిన‌ ఆరోజు నుంచి రెండు రాష్ట్ర‌ల‌ల్లో సినిమాలు మ‌రియు థియేట‌ర్లు మ‌రియు షూటింగ్ లు బంద్ చేయాల‌ని నిర్ణయ ‌ ంచుకున్న‌ట్లు తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ మ‌రియు స‌బ్యులు తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ జెమిని కిర‌ణ్ సెక్ర‌ట‌రి ఎమ్.రామ్ దాస్ కి మ‌ద్ద‌త్తు తెలియ‌జేస్తున్న‌ట్లు ప్రెస్స్ మీట్ నిర్వ‌హించారు ఈ కార్య‌క్రమ ‌ ంలో తెలంగాణ‌ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌ గౌడ్ సెక్ర‌ట‌రి ల‌య‌న్ సాయి వెంక‌ట్ వైస్ ప్ర‌సిడంట్ అలీ ఖాన్ పాల్గొన్నారు... లంగాణ ఫిల్మ్ చాంబ‌ర్ ఛైర్మ‌న్ ప్ర‌తాని రామ‌క్రిష్ణ‌గౌడ్ మాట్లాడుతూ....మేము ఇండ‌స్ట్రీ స‌మస ‌ ్య‌ల‌ పైన‌ గ‌త‌ 15 సంవ‌త్స‌రాలుగా పోరాడుతున్నాం చాలా కాలం నుంచి డిజిట‌ల్ విధానం మ‌రియు థియేట‌ర్స్ రెంట‌ల్ విధానం పైన‌ పోరాటం సాగిస్తూ ఉన్నాం ప్ర‌క్క‌ రాష్ట్రాల్లో ఉన్న‌ విధానం మ‌న‌కు రావాలి మ‌న‌తెలుగు రాష్ట్రాల్లో డిజిట‌ల్ చార్జీలు ఒక‌ వారానికి ఒక‌షో అయిన‌దాదాపుగా 13 వేల‌రూపాయ‌లు చార్జీ చేస్తున్నారు ప్ర‌క్క‌ రాష్ట్రాల్లో త‌మిళ‌వనాడు, క‌ర్ణాట‌క, బాంబ‌య్ లో ఒక‌ వారానికి 2500 మాత్ర‌మే ఉంది ఈ రేటు మ‌న‌కు కావాలి మ‌రియు చిన్న‌సినిమాల‌కు అద‌నంగా 50 వేల రూపాయ‌లు డిపాజిట్ చేపించుకుంటున్నారు ఈ విధానం వ‌ల్ల‌ సెన్సార్ పూర్తి చేసుకున్న మూడు వంద‌ల‌ (‌ 300 ) విడుద‌ల‌కు నోచుకోలేదు ఈ ప‌రిస్థితికి కార‌ణం మ‌న‌ తెలుగు ఇండ‌స్ట్రీలో ఉండే ముగ్గురు,న‌లుగురు నిర్మాతలే ‌

తె

8 P టాలీవుడ్

వీళ్ళు క‌లిసి వేల‌ మంది నిర్మాతల ‌ ‌,డిస్ట్రిబ్యూట‌ర్ల‌ రక్తం తాగుతున్నార‌ని వ్య‌క్తం చేస్తూ ఈ విధానం మార‌కపో ‌ తే ఈ ఉద్యమాన్ని తీవ్ర‌త‌రం చేస్తామ‌న్నారు రెండు రాష్ట్రాల‌ నుండి డిస్ట్రిబ్యూటర్ల‌నుండి మంచి స్పంద‌న‌వ‌స్తుంది దీనికి అంద‌రు స‌హ‌క‌రిస్తున్నారు అని అన్నారు. లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ సెక్ర‌ట‌రి సాయి వెంక‌ట్ మాట్లాడుతూ..... తెలంగాణ‌ ఫిల్మ్ చాంబర్ ఆద్వ‌ర్యంలో మా ఛైర్మ‌న్ గారు గ‌తంలో ఫిల్మ్ ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌లపై ‌ న‌ 7 రోజులు ఆమ‌ర‌ణ‌ నిర‌హ‌ర‌ దీక్ష‌కు దిగారు త‌రువాత‌ తెలంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ మెంబ‌ర్స్ అంద‌రు క‌లిసి రిలే నిర‌హ‌ర‌ దీక్ష‌ తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ఎదుట‌ నిర్వ‌హించ‌డం జ‌రిగింది.స‌మ‌స్య‌లు ప‌రిష్కరిస్తామని ‌ మంత్రులు మ‌హెంద‌ర్ రెడ్డి,వేణుగోపాల‌ చారి,బుర్ర‌ న‌ర్స‌య్య‌గౌడ్,మెద‌క్ ఎమ్.పి.కొత్త‌ప్ర‌భాక‌ర్ రెడ్డి త‌దిత‌రులు హామి ఇచ్చి దీక్ష‌ను విర‌మింప‌ చేయ‌డం జ‌రిగింది కాని ఇప్ప‌టికి స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి ఇప్ప‌టికైనా తేరుకొని ప‌రిష్క‌రించ‌క‌పోతే ఉద్య‌మాన్ని తీవ్ర‌ ఉద్రుతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. లంగాణ‌ ఫిల్మ్ చాంబ‌ర్ వైస్ ప్ర‌సిడంట్ అలీ ఖాన్ మాట్లాడుతూ.....మా ఛైర్మ‌న్ తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ లో ఇ.సి. మెంబ‌ర్ గా ఉండి ప్ర‌తి మీటింగ్ లో ఈ స‌మ‌స్య‌ల గురించి మాట్లాడుతూ జ‌రుగుతూనే ఉంది ఇప్ప‌టికైన‌ తేలుకొని తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ స‌మ‌స్య‌ల‌ పై నిర్ణయ ‌ ం తీసుకోవ‌డం ఆనందంగా ఉంది ఈ సంద‌ర్భంగా వారికి తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ ప్ర‌సిడంట్ జెమిని కిర‌ణ్ సెక్ర‌ట‌రి ముత్యాల‌రాము గారికి క్రుత‌జ్న‌త‌లు అన్నారు.

తె

తె






లై

చిత్రంతో ఘోర పరాజయాన్ని పొందిన నితిన్ తాజాగా పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ లు నిర్మిస్తున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లై భామ మేఘ ఆకాష్ నితిన్ సరసన నటిస్తోంది . ఇక ఈ సినిమాకు టైటిల్ తాజాగా సెలక్ట్ చేసాడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . ఇంతకీ త్రివిక్రమ్ ఎంపిక చేసిన టైటిల్ ఏంటో తెలుసా ....... '' గుర్తుందా శీతాకాలం ''. ఈ టైటిల్ ని నితిన్ తో పాటు మిగతా యూనిట్ సభ్యులకు చెప్పగా అందరు కూడా ఆ టైటిల్ కే ఓటు వేసారట . రుకి పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ లు ఈ చిత్రానికి నిర్మాతలు కానీ వాళ్ళు పైసా పెట్టడం లేదు ..... కేవలం వాళ్ళ బ్రాండ్ వేసుకొని నితిన్ ఈ సినిమా చేస్తున్నాడు అయితే లాభాల్లో ,అలాగే బిజినెస్ లో వాళ్లకు వాటా ఇవ్వనున్నాడు . పవన్ -త్రివిక్రమ్ బ్రాండ్ వల్ల బిజినెస్ జరుగుతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేసారు . లై తో డిజాస్టర్ అందుకున్న నితిన్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .

పే

టాలీవుడ్ P 9


వి

శాల్ హీరోగా నటిస్తున్న తెలుగు , తమిళ చిత్రం '' అభిమన్యుడు '' . కాగా ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరిలో 12 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ సంక్రాంతి రేసులో ఇప్పటికే పలు సినిమాలు పోటీ పడుతుండటంతో థియేటర్ ల సమస్య ఉంది కాబట్టి దానికి తోడు ఇంకా కొన్ని కార్యక్రమాల వల్ల తన అభిమన్యుడు చిత్రాన్ని వాయిదావేశాడు విశాల్ . జనవరి మొదటి వారానికి బదులుగా జనవరి 26న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో

తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత కథానాయికగా నటిస్తోంది . నియర్ హీరో అర్జున్ విలన్ గా నటించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు , ఇక ఈ చిత్రాన్ని విశాల్ నిర్మిస్తుండటం విశేషం . తమిళనాట స్టార్ హీరోగా ఎదిగిన విశాల్ తన సినిమాల కంటే ఇతర కార్యక్రమాలతోనే పెను సంచలనం సృష్టిస్తున్నాడు . ఇక అభిమన్యుడు తో తెలుగులో కూడా ఘనవిజయం అందుకోవాలని భావిస్తున్నాడు .

సీ



10 P టాలీవుడ్




ని

రూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'రాజరథం'. ఇదే కాంబినేషన్‌లో రూపొందిన 'రంగితరంగ' కన్నడలో బిగ్గెస్ట్‌ హిట్‌ చిత్రంగా నిలిచింది. యు.ఎస్‌.లో ఈ చిత్రం సెన్సేషనల్‌ హిట్‌ అయింది. అక్కడ 300 సెంటర్స్‌లో రన్‌అవ్వడమే కాకుండా కొన్ని చోట్ల 50 రోజులు ప్రదర్శింపబడడం విశేషం. యు.కె.లో కూడా 'రంగితరంగ' సూపర్‌హిట్‌ అయ్యింది. ఇప్పుడు ఓ విభిన్న కథాంశంతో రూపొందుతున్న 'రాజరథం' చిత్రంతో హీరో నిరూప్‌ భండారి, హీరోయిన్‌ అవంతిక శెట్టి, దర్శకుడు అనూప్‌ భండారి తెలుగులో పరిచయమవుతున్నారు. షూటింగ్‌పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జనవరి 25న విడుదల చేసేందుకు ప్లాన్‌ చేశారు. కాగా, ఈ చిత్రం ట్రైలర్‌ను డిసెంబర్‌26న హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో విడుదల చేశారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన దగ్గుబాటి రానా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో నిరూప్‌ భండారి, హీరోయిన్‌ అవంతిక శెట్టి, దర్శకుడు అనూప్‌ భండారి, రామజోగయ్యశాస్త్రి, అబ్బూరి రవి, నిర్మాతల్లో ఒకరైన సతీష్‌శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. రోయిన్‌అవంతిక శెట్టి మాట్లాడుతూ - ''రాజరథం' నా తొలి తెలుగు సినిమా. అనూప్‌గారి దర్శకత్వంలో నిరూప్‌ వంటి కోస్టార్‌తో కలిసి పనిచేయడం..నాకొక మంచి ఎక్స్‌పీరియెన్స్‌'' అన్నారు. రో నిరూప్‌ భండారి మాట్లాడుతూ - ''రాజరథం' సినిమా చేయడానికి ముందు నాకు తెలుగు వచ్చేది కాదు. డబ్బింగ్‌ చెప్పే సమయానికి తెలుగు నేర్చుకున్నాను. సినిమా బాగా వచ్చింది. రానాగారు మా యూనిట్‌ను అభినందించడానికి వచ్చినందుకు ఆయనకు థాంక్స్‌. మా ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా కోసం కష్టపడ్డాం. డైరెక్షన్‌, మ్యూజిక్‌ ను అన్నయ్య చేస్తే, కాస్ట్యూమ్స్‌ను వదిన డిజైన్‌ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగులోకి

హీ

హీ

ఎంట్రీ ఇస్తున్నాను. తెలుగు ప్రేక్షులు నన్ను ఆదరిస్తారని నమ్ముతున్నాను'' అన్నారు. త్ర దర్శకుడు అనూప్‌ భండారి మాట్లాడుతూ ''రంగితరంగ' వంటి సక్సెస్‌ఫుల్‌ మూవీ తర్వాత నా దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'రాజ రథం'. ఈ సినిమాకు దర్శకత్వంతో పాటు మ్యూజిక్‌ కూడా నేనే చేశాను. నా మ్యూజిక్‌లో వస్తున్న ఆల్బమ్‌ మా నాన్న సుధాకర్‌ భండారిగారు తెలుగులో చాలా సినిమాలకు పని చేశారు. నా ఫేవరేట్‌ మూవీ గీతాంజలితో పాటు..చిరంజీవిగారి సినిమాలకు పనిచేశారు. అలాగే నా శ్రీమతి ఈ సినిమాకు కాస్ట్యూమ్స్‌ డిజైనింగ్‌ చేసింది. హీరో హీరోయిన్స్‌ బాగా నటించారు. నన్ను నమ్మి ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు థాంక్స్'‌' అన్నారు. ర్మాతల్లో ఒకరైన సతీష్‌శాస్త్రి మాట్లాడుతూ - ''అనూప్‌ దర్శకత్వంలో వచ్చిన తొలి సినిమా 'రంగితరంగ' చిత్రాన్ని ఓవర్‌సీస్‌లో మేమే డిస్ట్రిబ్యూట్‌చేశాం. ఓవర్‌సీస్‌లో ఆ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్‌వచ్చింది. ఓ థియేటర్‌లో 50 రోజులు ప్రదర్శితమైంది. ఓవర్‌సీస్‌లో అంత మంచి రెస్పాన్స్‌ను తెచ్చుకున్న సినిమా అదే. తర్వాత అనూప్‌ను కలిసి..తనతో రాజరథం సినిమాకు అసోసియేట్‌అయ్యాం. హై టెక్నికల్‌ వాల్యూస్‌తో భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను మేకింగ్‌పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌కాకుండా నిర్మించాం. అలాగే ఈ సినిమాకు మోరల్‌ సపోర్ట్‌ అందిస్తున్న హీరో రానా గారికి ప్రత్యేక కృతజ్ఞతలు'' అన్నారు. గ్గుబాటి రానా మాట్లాడుతూ - ''నేను ఒక సినిమా అవార్డ్‌ఫంక్షన్‌ను హోస్ట్‌చేస్తున్నప్పుడు 'రంగితరంగ' సినిమా ఎక్కువ అవార్డులను గెలుచుకుంది. అప్పటి వరకు అనూప్‌ భండారి నాకు పరిచయం లేదు. ఆ తర్వాతే అనూప్‌ను కలిసి తనతో పరిచయం పెంచుకున్నాను. ఈ సినిమాలో నేను కనిపించను..వినిపిస్తాను.'రాజరథం' తెలుగులో పెద్ద సక్సెస్‌ సాదిస్తుంది. ఎంటైర్‌ యూనిట్‌కు అభినందనలు'' అన్నారు.

చి

ని ద

టాలీవుడ్ P 11


     మె

గాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ హీరోగా నటించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మెగా కుటుంబం నుండి చాలామంది హీరోలు ఉన్నారు కాగా వాళ్ళ సరసన కళ్యాణ్ చేరనున్నాడు. చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రాంచరణ్, సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ , నిహరికలు ప్రేక్షకులను అలరిస్తున్నారు మెగా ఫ్యామిలీ నుండి. రు చిన్నల్లుడు కళ్యాణ్ కు కూడా సినిమాలపై ఆసక్తి ఉండటంతో హీరోగా నటిస్తానని చెప్పడంతో రాంచరణ్ దగ్గరుండి మరీ కళ్యాణ్ కు శిక్షణ ఇప్పించాడు. చిరంజీవి కూడా సంతోషంగా ఒప్పుకున్నాడట అయితే ఇప్పుడు ప్రేక్షకులు , అభిమానులు ఆదరిస్తేనే కళ్యాణ్ కు భవిష్యత్ ఉంటుంది . వారసుడి గా పరిచయ కావడం పెద్ద విషయం కాదు కాని ఆ తర్వాత నిలబడటమే కష్టం . మరి ఈ కళ్యాణ్ సక్సెస్ అవుతాడా ?

చి 12 P టాలీవుడ్


ని

ర్మాతగా వంద చిత్రాలకు చెరువవుతున్నారు తుమ్మలపల్లి రామసత్యనారాయణ. తన భీమవరం టాకీస్ పై 92 చిత్రంగా " బటర్ ప్లెయిస్ " చిత్రాన్ని నిర్మిస్తున్నారు‌ . కె.ఫణిరాజ్ దర్శకత్వం వహిస్తొన్న ఈ సినిమాలొ అందరు ఆడవాళ్లె నటిస్తుండటం విశేషం. జోత్స శర్మ , హర్షిణి, మేఘనా రామి, రొజా భారతి తదితరులు లీడ్ రోల్స్ లొ నటిస్తున్నారు. సినీయర్ రాజకీయ నాయకులు రోశయ్య ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సందర్బంగా రోశయ్య మాట్లాడుతూ.‌. రామ సత్యనారాయణ సినిమా అంటే ప్యాషన్ ఉన్న వ్యక్తి. వంద సినిమాలకు చెరువయ్యారు. అందరు ఆడవాళ్లతో చెస్తొన్న ఈ చిత్రం ఓ మంచి ప్రయోగం. ఇలాగే సక్సెస్ ఫుల్ సినిమాలను చెయాలని ఆశిస్తున్నానన్నారు‌. మసత్యనారాయణ మాట్లాడుతూ.. సినిమా చిత్రీకరణ పూర్తయింది. జనవరి 26 న విడుదల చేస్తాము. రోశయ్య గారు ఫస్ట్ లుక్ ను విడుదల చేయటం ఆనందంగా ఉందన్నారు‌. అందరు ఆడవాళ్లె నటిస్తొన్న ఈ చిత్రం ఆడియోన్స్ తప్పకుండా ఆకట్టుకుంటుందన్నారు. ధాన పాత్రలోజోత్స శర్మ,(usa).. హర్షిణి, మేఘనా రామి, రోజా భారతి, ,సుప్రజ, జయ ,ప్రవళ్లిక తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి పాటలు: గీత ,సాదనాల, సంగీతం: అర్జున్.., కెమెరా: కర్ణ , రచన- దర్శకత్వం:కె.ఆర్. ఫణిరాజ్





రా ప్ర

టాలీవుడ్ P 13


ష్టాల వలయంలో చిక్కుకుని సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆపన్నులను ఆదుకుంటూ అతి పెద్ద ఛారిటీ సంస్థగా ఎదుగుతోంది మనం సైతం. ఈ సంస్థ తాజాగా మరో పది మంది నిస్సహాయులకు ఆర్థిక సహాయం అందజేసింది. హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగిన ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రదాన కార్యదర్శి సంతోష్ కుమార్, నట కిరీటి రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, జెమినీ కిరణ్ తో పాటు మనం సైతం సభ్యులు బందరు బాబీ, చిల్లర వేణుగోపాల్, సురేష్, సన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో ఇబ్బందుల్లో ఉన్న రమణమూర్తి, డ్రైవర్ రాజు, మేకప్ రాజశేఖర్, లైట్ మెన్ బాబు, గిరయ్య, రాంప్రసాద్ తదితర పది మందికి సంతోష్ కుమార్, రాజేంద్రప్రసాద్, అల్లరి నరేష్, జెమినీ కిరణ్ చేతుల మీదుగా చెక్ లు అందజేశారు. నంతరం మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇవాళ ఇంత పెద్ద కుటుంబం కళ్ల ముందు కనిపిస్తోంది. సంతోషన్న, రాజేంద్ర ప్రసాద్, నరేష్ లాంటి మంచి వాళ్ల అండ దొరికింది. 1977 ఫిబ్రవరిలో హైదరాబాద్ కు వచ్చాను. బంధువులు అడిక్ మెట్ లో ఉండేవాళ్లు. అప్పుడు ప్రముఖ పాత్రికేయులు జి.కృష్ణ గారి అబ్బాయితో నాకు మితృత్వం ఏర్పడింది. అలా జి.కృష్ణ గారి సాన్నిహిత్యం దొరికింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పెషల్ కరస్పాండెంట్ గా జి.కృష్ణ పనిచేసేవారు. మంత్రులు ఆయన ఇంటి ముందు వేచి ఉండేంత పరపతి ఉన్నా... సొంత ఇళ్లు గురించి కూడా ఆలోచించలేదు. నిస్వార్థంగా జీవించారు. అద్దె ఇంటిలో బతికి అక్కడే కన్నుమూశారు. అలాంటి వాళ్ల సాహచర్యం నాలో సేవా ఆలోచన రేకెత్తించింది. నిస్వార్థంగా ఉండటం, నలుగురికి సహాయ

14 P టాలీవుడ్

పడాలనే దృక్పథాన్ని కలిగించింది. ఈ ప్రపంచంలో మనల్ని మనమే నమ్ముకోవాలి, మనకు మనమే అండగా నిలబడాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే మనం సైతం. ముగ్గురు నలుగురితో మొదలైన ఈ సంస్థ ప్రస్తుతం లక్షల మందికి చేరువువతోంది. సంస్థ ప్రధాన సభ్యులమే పాతిక మంది





దాకా ఉన్నాం. ప్రతి జీవి సంపాదన ఆహారమే. అవి దొరికిన ప్రతి ఆహారాన్ని తోటి వాళ్లతో పంచుకుంటాయి. మనిషి మాత్రమే తన సంపాదన తన వాళ్లకే దక్కాలనుకుంటాడు. స్వార్థంగా ఆలోచిస్తాడు. జి.కృష్ణ లాంటి గొప్పవాళ్ల జీవితాలను తెలియపరిస్తే ప్రతి హృదయం కదులుతుంది. ప్రతి మనసు మారుతుంది. నాకున్నది ఒక మెతుకే కదా అని దాన్ని కూడా వెనకేసుకుంటున్నారు. వంద మెతుకులు కలిస్తే ఒక ముద్ద. వంద ముద్దలు కలిస్తే ఒక జీవితం. మనం సైతం స్ఫూర్తి ఇదే. మా సంస్థ కార్యక్రమాలు చూసి దర్శకులు కొరటాల శివ రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. చిరంజీవి గారు ఇంటికి పిలిచి..రెండు లక్షల రూపాయలు ఇచ్చారు. మనం సైతంతో నేనున్నాను అని చెప్పారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్టు కంటే మనం సైతం గొప్ప పేరు తెచ్చుకోవాలని ప్రశంసించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మనం సైతం కార్యక్రమాలను అభినందించారు. ఇప్పుడు ఈ పెద్దలు మా వెంట


నడుస్తామని ముందుకొచ్చారు. మనస్ఫూర్తిగా వీళ్లందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. అన్నారు. ఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.....మాటలు చెప్పడం నాకు చేతకాదు. చేయాలనుకున్నది చేతల్లో చేస్తుంటాను. మనం సైతంలో నేను కూడా ఉన్నానని తెలియజేస్తున్నాను. నా వంతుగా రెండు లక్షల రూపాయల సాయం ప్రకటిస్తున్నాను. ఈ సంస్థకు నా సంపూర్ణ సహకారం ఉంటుంది. ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరి మొహాల్లో నవ్వులు చూడాలి. అన్నారు. ట కిరీటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....ప్రపంచంలో అతి పెద్ద ధనవంతుడు వారెన్ బఫెట్ తన సంపాదనలో ముప్పాతిక వంతు సహాయ కార్యక్రమాలకు ఇస్తున్నాడు. బిల్ గేట్స్ ఛారిటీలు చేస్తున్నాడు. మనం సైతం లాంటి సంస్థను నడిపిస్తున్న కాదంబరి కిరణ్ కు వాళ్లకు పెద్ద తేడా లేదు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ కు ఉన్నంత డబ్బుంటే కిరణ్ కూడా ఇచ్చేవారు. ఇంకా ఎక్కువ సేవ చేసేవారు. వీళ్లకు డబ్బు లేకున్నా గొప్ప మనసుంది. కిరణ్ నాకు ఎన్నో ఏళ్లుగా తెలుసు. ఆయన మనస్తత్వానికి

టీ





ఇలాంటి కార్యక్రమాలు చేస్తారని ఊహించాను. మనం సైతం లో ప్రతి సభ్యుడు గొప్పవాడే. నా ఆస్తిలో కొంత వాటా ఈ సంస్థకు ఇవ్వాలనుకుంటున్నాను. అన్నారు. నిమా కథలు సుఖాంతం అయినట్లు...సినిమా కోసం పనిచేసే వాళ్ల జీవితాలు సంతోషంగా ఉండవు. ఇక్కడ పేరు ఉన్నంత వరకే అవకాశాలు. లేకుంటే ఆదుకునేందుకు ఎవరూ ఉండరు. ఇరవై నాలుగు విభాగాల్లో ఎవరికైనా ప్రమాదాలు జరగొచ్చు. అలాంటి వాళ్లకు అండగా నిలబడుతోంది మనం సైతం. నా వంతు సహాయాన్ని మా నాన్న ఈవీవీ పుట్టిన రోజున ప్రకటిస్తాను. ప్రతి ఏటా ఆ సహాయాన్ని అందజేస్తాను. అన్నారు. సందర్భంగా మనం సైతం సభ్యుడు బందరు బాబీ సతీమణి ఆకుల కవిత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సి

టాలీవుడ్ P 15


దం

డుపాళ్యం చిత్రంతో కన్నడ చిత్రరంగంలో సంచలనం సృష్టించిన దర్శకులు శ్రీనివాసరాజు. కన్నడంలో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయగా తెలుగులో సైతం సంచలన విజయం సాధించింది. వాస్తవ సంఘటన ల ఆధారంగా తెరకెక్కిన దండుపాళ్యం చిత్రానికి ఆదరణ అద్భుతంగా లభించడంతో దానికి సీక్వెల్ చేసాడు శ్రీనివాసరాజు. తెలుగు , కన్నడ భాషల్లో రూపొందిన దండుపాళ్యం 2 అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది కానీ కొంతవరకు టెంపో ని మెయింటైన్ చేసింది. అలాగే అంతకుమించిన వివాదాన్ని కూడా సృష్టించింది.

ట్ చేస్తే ......ఇప్పుడు దండుపాళ్యం 3 వస్తోంది. దండుపాళ్యం లాగే దండుపాళ్యం 3 సంచలనం సృష్టించడం ఖాయమని ధీమాగా ఉన్నాడు దర్శకులు శ్రీనివాసరాజు. వచ్చే ఏడాది జనవరి 25న దండుపాళ్యం 3 ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఆ చిత్ర బృందం. పూజా గాంధీ ప్రధాన పాత్ర పోషించిన దండుపాళ్యం 3 పై ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఫలితం ఏంటన్నది తెలియాలంటే జనవరి 25 వరకు ఎదురుచూడాల్సిందే.

       

16 P టాలీవుడ్


 

యు

వన్ టూరింగ్ టాకీస్ మరియు సింహా ఫిలిమ్స్ సంయుక్తంగా శివ గణేష్ దర్శకత్వంలో తనిష్క్ రెడ్డి హీరోగా.. అనిల్ కుమార్ గుంట్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'సకల కళా వల్లభుడు'. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాత అనిల్ కుమార్ మాట్లాడుతూ.. దర్పణం తర్వాత తనిష్క్ రెడ్డి హీరోగా చేస్తున్న చిత్రమిది. నటునిగా తనిష్క్ రెడ్డి ని ఓ మెట్టు ఎక్కించే చిత్రమిది. మంచి కథ కుదిరింది. దర్శకుడు శివ గణేష్ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. విలేజ్ నేపధ్యంలో నడిచే యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ ఇది. ఓ ప్రముఖ హీరోయిన్ నటించనుంది. ఇటీవలే షూటింగ్ మొదలైంది. ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్

జరుగుతుంది. జనవరి 3 నుంచి పార్వతీపురం, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరపబోతున్నాం. ఆస్ట్రేలియా లో ఒక షెడ్యూల్ ప్లాన్ చేశాం. తప్పకుండా అందరికి నచ్చే, మెచ్చే చిత్రం అవుతుంది మా 'సకల కళా వల్లభుడు' చిత్రం.. అని అన్నారు. నిష్క్ రెడ్డి తో ప్రముఖ హీరోయిన్ నటించనున్న ఈ చిత్రంలో.. సుమన్, వినోద్ కుమార్, చిన్నా, పృథ్వి, జీవా, ఉత్తేజ్, అనంత్, అపూర్వ తదితరులు నటించనున్నారు. చిత్రానికి సంగీతం: అజయ్ పట్నాయక్, కెమెరా: సాయి చరణ్, పాటలు: రామ్ పైడిశెట్టి, గిరిధర్, కో ప్రొడ్యూసర్స్: శ్రీకాంత్, త్రినాథ్, ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: చిన్నా, నాగేంద్రమ్మ, నిర్మాత: అనిల్ కుమార్ గుంట్రెడ్డి, దర్శకత్వం: శివ గణేష్.

టాలీవుడ్ P 17


అం దమైన భామలకు ఒంటి మీద నూలు పోగు ఉండాలంటే పరమ చిరాకు అనుకుంటా అందుకే రెచ్చిపోయి విప్పేస్తూ కుర్రాళ్ళ ని రెచ్చగొడుతున్నారు . ఎంతగా విప్పితే అంతగా ఫెమస్ అవ్వచ్చు అని అనుకుంటున్నారో ఏమో ! ఒకరిని మించి ఒకరు అందాల ప్రదర్శన చేస్తున్నారు . తాజాగా బుల్లితెర భామ కరిష్మా శర్మా రెచ్చిపోయి మొత్తం విప్పేసి అందాల ఆరబోత చేసి షాక్ ఇచ్చింది . ఇక ఎద అందాలపై ఎటువంటి అచ్చాదన లేకుండా చేసిన ఫోటో షూట్ కుర్రకారు ని పిచ్చెక్కిస్తోంది .

18 P టాలీవుడ్

బు

ల్లితెర పై సంచలనం సృష్టిస్తున్న ఈ భామ ఇప్పటికే పలుమార్లు అంగాంగ ప్రదర్శన చేసి హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది , కాగా ఇప్పుడేమో మరోసారి బరితెగించి షాక్ ఇస్తోంది . వెండితెర పై వెలిగిపోవాలని ఆశపడుతున్న ఈ భామకు ఈ ఫోటో షూట్ మరింతగా హెల్ప్ అయ్యేలా ఉంది . కుర్రాళ్ళ బలహీనతలని క్యాష్ చేసుకోవడానికి బాగానే తెగించింది కరిష్మా శర్మ .






 

వెం

కట్ ,హృశాలి , పావని ప్రధాన పాత్రలు పోషిస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టొరీ చిత్రం '' రాయలసీమ లవ్ స్టొరీ ''. రామ్ రణధీర్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగరాజు , రాయల్ చిన్న లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కర్నూల్ పరిసర ప్రాంతాల్లో మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కర్నూల్ లోని మౌర్య హోటల్ లో ప్రారంభమైన తర్వాత ఏకధాటిగా 14 రోజుల పాటు కర్నూల్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది , దాంతో మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది , ఈ షెడ్యూల్ లో జరిగిన షూటింగ్ తో 40 శాతం టాకీ పూర్తయ్యింది . ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ '' హీరో వెంకట్ , హీరోయిన్ పావని ,హృశాలి ల మద్య వచ్చే ప్రేమ సన్నివేశాలతో పాటు తల్లి పాత్రధారి మధుమణి పై కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించామని 14 రోజుల షెడ్యూల్ సవ్యంగా సాగిపోయిందని , రాజ్యసభ సభ్యులు , పెద్దలు టిజీ వెంకటేష్ గారి సహకారంతో , మా నిర్మాతల ప్లానింగ్ తో షూటింగ్ ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తీ చేసుకున్నామని త్వరలోనే రెండో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నామని తెలిపాడు. త్ర నిర్మాతలు నాగరాజు , రాయల్ చిన్న లు మాట్లాడుతూ '' రామ్ రణధీర్ లాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఈ రాయలసీమ లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం . టీజీ వెంకటేష్ గారి సహకారం మరువలేనిది , మొత్తానికి మొదటి షెడ్యూల్ ని అనుకున్నట్లుగా చిత్రీకరించినందుకు సంతోషంగా ఉంది . సినిమా బాగా వస్తోంది తప్పకుండా హిట్ కొడతామన్న నమ్మకం ఉందన్నారు . ఏ 1 ఎంటర్ టైన్ మెంట్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి సాయి సంగీతం అందిస్తుండగా ఛాయాగ్రహణం : మహీ శేర్ల , ఫైట్స్ : డ్రాగన్ ప్రకాష్ , డాన్స్ : బాలకృష్ణ , శ్యాం లు అందిస్తున్నారు .

చి






 యాం

గ్రీ యంగ్ మాన్ పాత్రలకు పెట్టింది పేరు డాక్టర్ రాజశేఖర్. 90 వ దశకంలో అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ లతో పోటీ పడి మరీ సత్తా చాటాడు. యాక్షన్ చిత్రాలతో పాటు నటనకు అవకాశం ఉన్న పాత్రలు పోషించిన రాజశేఖర్ అగ్ర హీరోగా ఓ వెలుగు వెలిగాడు. తెలుగు శివాజీ గణేషన్ గా పేరు పొందిన మహానటుడు డాక్టర్ రాజశేఖర్. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరో సొంత చిత్ర నిర్మాణానికి పూనుకొని ఆర్ధికంగా దెబ్బతినడమే కాకుండా కెరీర్ పరంగా కూడా తనదైన స్థానం కోల్పోయాడు. క అప్పటి నుండి ఇటీవల వచ్చిన పి ఎస్ వి గరుడవేగ చిత్రం వరకు కెరీర్ పరంగా ఇబ్బందులే ఎదుర్కొన్నాడు. 2017 నవంబర్ 3న రిలీజ్ అయిన గరుడవేగ చిత్రం తో రాజశేఖర్ కు మళ్లీ రాజయోగం పట్టింది. రాజశేఖర్ కు ఈమధ్య కాలంలో సరైన హిట్ లేకపోవడంతో మార్కెట్ కూడా అంతగా లేదు అయినప్పటికీ ధైర్యం చేసి భారీ బడ్జెట్ తో గరుడవేగ చిత్రం చేశారు. కట్ చేస్తే రాజశేఖర్ నమ్మకం వమ్ము కాలేదు ..... ధైర్యే సాహసం లక్ష్మీ అన్నట్లుగా గరుడవేగ సూపర్ హిట్ అయ్యింది దాంతో రాజశేఖర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యింది. 2017 సంవత్సరం రాజశేఖర్ కు ఎప్పటికీ గుర్తుండిపోయేదే ఎందుకంటే ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన తల్లి మరణం మరోవైపు గరుడవేగ లాంటి సంచలన విజయం. ఇక 2018 నుండి ఈ రోరింగ్ లయన్ కు మరింతగా కలిసి రావడం ఖాయమని రాజశేఖర్ అభిమానులు సంతోషిస్తున్నారు .






ఒం

టి మీద 44 ఏళ్ల వయసుంది , 13 ఏళ్ల వయసున్న కొడుకు కూడా ఉన్నాడు కానీ అవేవీ పట్టనట్లు రెచ్చిపోయి అందాలను చూపిస్తూ 16 ఏళ్ల అమ్మాయిల ఫోజులు కొడుతూ అందరికీ షాక్ ఇస్తోంది మలైకా అరోరా . ఐటెం భామగా ఎంటర్ అయిన ఈ భామ సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ ని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది కానీ అందాల ఆరబోత లో కుర్ర హీరోయిన్ లకు ఏమాత్రం తీసిపోని విధంగా రెచ్చిపోతోంది . ఇక ఇటీవలే అర్భాజ్ ఖాన్ తో విడాకులు తీసుకుంది మలైకా . డాకులు తీసుకోవడానికి కంటే ముందే అతడ్ని వీడి వేరుగా ఉంటోంది . తాజాగా ఓ మ్యాగజైన్ కోసం మళ్ళీ అందాల ఆరబోత తో షాక్ ఇస్తోంది . బికినీ వేసి 44 ఏళ్ళవయసులోను రెచ్చిపోయే సత్తా నాకుందని చాటి చెబుతోంది . మలైకా అరోరా అందాలను పందెంగా కాస్తూ ఇమేజ్ బాగానే క్యాష్ చేసుకుంటోంది . మొత్తానికి ఏజ్ అయితే ఒంటి మీదకు వచ్చింది కానీ తన అందాలకు కాదని , అందాల ఆరబోత లో వెనకడుగు వేసేది లేదని ఢంకా బజాయిస్తోంది .

వి

టాలీవుడ్ P 23


  1997

లో 'పెళ్ళి పందిరి' చిత్రంతో డిస్ట్రిబ్యూటర్‌గా సక్సెస్‌ సాధించిన దిల్‌రాజు..2002లో దిల్‌ చిత్రంతో నిర్మాతగా సక్సెస్‌ను సాధించారు. ఒక పక్క నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తున్న దిల్‌రాజు 2017లో తన వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆరు విజయవంతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించి డబుల్‌ హ్యాట్రిక్‌ నిర్మాత అయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌లో ఈ ఏడాది విడుద‌లైన స‌క్సెస్‌ఫుల్ మూవీస్ `శ‌త‌మానం భ‌వ‌తి`, `నేను లోక‌ల్`, `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్`‌ , `ఫిదా`, `రాజా ది గ్రేట్‌`, `ఎంసీఏ` చిత్రాల్లోని హీరోలు, దర్శకులను నిర్మాణ సంస్థ నుండి దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్లు ‌ సత్కరించారు. అలాగే దిల్‌రాజు డిస్ట్రిబ్యూట‌ర్గా ‌ స‌క్సెస్ జ‌ర్నీని స్టార్ట్ చేసిన పెళ్లిపందిరి సినిమా ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ,‌ హీరో జ‌గ‌ప‌తిబాబు స‌హా యూనిట్‌ను స‌త్క‌రించారు. ఈ కార్యక్రమంలో కోడి రామకృష్ణ, జగపతిబాబు, అల్లు అర్జున్‌, వరుణ్‌తేజ్‌, నాని, దిల్‌రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌, జయసుధ, భూమిక, అనుపమ పరమేశ్వరన్‌, మెహరీన్‌, దేవిశ్రీ ప్రసాద్‌, త్రినాథరావు నక్కిన, హరీష్‌ శంకర్‌, వంశీ పైడిపల్లి అనిల్‌ రావిపూడి, శేఖర్‌ కమ్ముల, సీనియర్‌ నరేష్‌, నవీన్‌ చంద్ర, బెక్కం వేణుగోపాల్‌, రైటర్‌ ప్రసన్న, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా... తాధిక దర్శకుడు కోడి రామకృష్ణ మాట్లాడుతూ ''దేనికైనా స్టార్టింగ్‌ పాయింట్‌ ఉంటుంది. దాని తర్వాత అల్లుకు పోవడమే గొప్ప విషయం అలా దిల్‌రాజు బ్యానర్‌చిత్ర సీమతో అల్లుకుపోయింది. చలనచిత్ర సీమకు

24 P టాలీవుడ్

ఈరోజు దిల్‌రాజుగారు గర్వంగా నిలబడ్డారు. పది మంది నిర్మాతలకు ఇలా సినిమా తీయాలనిపించేలా సినిమాలు చేస్తున్నారు. ఆయన కృషి, పట్టుదల కారణంగా రాజుగారు ఈ రేంజ్‌కు చేరుకున్నారు'' అన్నారు. గపతి బాబు మాట్లాడుతూ - ''కెరీర్‌ ప్రారంభంలో తనకు విజయాన్నిచ్చిన 'పెళ్ళిపందిరి' సినిమాను గుర్తుంచుకుని, దిల్‌రాజు..నేడు ఆ యూనిట్‌ను సత్కరించడం తన గొప్పతనం. తనకు ఈ సందర్భంగా థాంక్స్‌ చెబుతున్నాను. రాజు, శిరీష్‌, లక్ష్మణ్‌లు ముగ్గురు బెస్ట్‌ టీం. రాజు దిల్‌ సినిమా వల్ల దిల్‌రాజు కాలేదు.. తనకు సినిమాపైనున్న దిల్‌ వల్లనే దిల్‌రాజు కాగలిగాడు. ఏ సినిమా అయినా తీయగల దమ్ముంది. ఎవరితో అయినా తీయగలిగే సత్తా ఉంది. డబుల్‌ హ్యాట్రిక్‌ సినిమాను నిర్మించినందుకు తనకు హ్యాట్సాఫ్‌'' అన్నారు. నాథరావు నక్కిన మాట్లాడుతూ - ''రాజుగారు కొట్టిన ఆరు సిక్సర్స్‌(ఆరు హిట్స్‌)లో నా సిక్సర్‌ కూడా ఒకటి ఉండటం ఆనందంగా ఉంది. వచ్చే ఏడాది నుండి ఆయన ఏడాదికి 12 సిక్సర్లు కొట్టాలని కోరుకుంటున్నాను. నేను లోకల్‌ సక్సెస్‌కు కారణం..టీమ్‌ వర్క్‌. ఎస్‌.వి.సి ఫెస్టివల్‌లో మా సినిమా పార్ట్‌ అయ్యింది. అందుకు కారణమైన రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారికి థాంక్స్‌'' అన్నారు. వీన్‌చంద్ర మాట్లాడుతూ - ''దిల్‌రాజుగారి బ్యానర్‌లో 'నేను లోకల్‌' చేసే అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. నాని, కీర్తిసురేష్‌ సహా అందరికీ థాంక్స్‌'' అన్నారు. ల్లు అర్జున్‌ మాట్లాడుతూ - ''ఇది ఒక సినిమాకు సంబంధించిన ఈవెంట్‌ కాదు. ఆరు సినిమాలకు

జ త్రి


సంబంధించిన ఈవెంట్‌. ఒక నిర్మాత ఓ ఏడాదిలో ఆరు సినిమాలు చేసి..ఆ ఆరు సినిమాలు బ్లాక్‌బస్టర్స్‌ కావడం అనేది ఒక దిల్‌రాజుగారికే సాధ్యమైంది. ఇంత యూనిక్‌ సక్సెస్‌ను సాధించిన ఎస్‌.వి.సి బ్యానర్‌కు అభినందనలు. ఈ బ్యానర్‌లో రెండో సినిమా నేనే చేశాను. తర్వాత మధ్యలో సినిమా చేశాను. అలాగే అదే బ్యానర్‌లో 25వ సినిమా కూడా నేనే చేశాను. ఇప్పుడు ఈ బ్యానర్‌ విజయవంతంగా 27 సినిమాలను పూర్తి చేసింది. ఈ ఏడాది శతమానం భవతి శర్వానంద్‌, సతీష్‌ వేగేశ్న సహా యూనిట్‌.నేను లోకల్‌ నాని, త్రినాథరావు సహా యూనిట్‌కు..డీజే విషయానికి వస్తే హరీష్‌కు, సక్సెస్‌లో భాగమైన యూనిట్‌కు..ఫిదాలో శేఖర్‌కమ్ముల, వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి సహా యూనిట్‌కి..రాజా ది గ్రేట్‌లో రవితేజ అన్నయ్య, అనిల్‌రావిపూడి సహా యూనిట్‌కు..ఎంసీఏలో నాని, శ్రీరామ్‌ వేణు సహా యూనిట్‌కి అభినందనలు. ఈ ఏడాది దిల్‌రాజుగారి సతీమణి అనితగారు అందరికీ దూరమయ్యారు. దిల్‌రాజుగారికి వ్యక్తిగతంగా ఎంతో పెద్ద దెబ్బ తగిలింది. అలాంటి సమయంలో..ఏ మనిషైనా క్రుంగిపోతారు.. ఓ భారం వ్యక్తిని అలా నొక్కేస్తుంటుంది. అలాంటి సమయంలో రాజుగారికి ఓ ట్రెమెండస్‌ హిట్‌ రావాలని నేను కోరుకున్నాను. అలాగే ఆయనకు ఆరు సక్సెస్‌లు వచ్చాయి. ఆయనకు ఇలాంటి సక్సెస్‌ రావడంతో వ్యక్తిగతంగా నాకు కూడా ఎంతో ఆనందమేసింది. ఓ సిచ్యువేషన్‌ వచ్చినప్పుడు రాజుగారు ఎలా రియాక్ట్‌ అవుతారనేది నేను చాలా సందర్భాల్లో చూశాను. కానీ ఆయన సతీమణి దూరమైనప్పుడు ఆయన రియాక్ట్‌అయిన విధానం చూసి ఆయనపై గౌరవం పెరిగింది'' అన్నారు. స్‌.హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ - ''అంచనాలను తట్టుకుంటూ ఆరు సక్సెస్‌లను సాధించడం అంత చిన్న విషయమేమీ కాదు. రెండు మూడేళ్ల క్రితం క్రికెట్‌లో ఆరు సిక్సర్స్‌ కొట్టింది యువరాజు అయితే..సినిమాలో ఒకే ఏడాదిలో ఆరు సిక్సర్స్‌(హిట్స్‌) కొట్టింది దిల్‌రాజు. ఆయన గ్యాప్‌ లేకుండా 48 గంటలు కూడా కష్టపడటం చూశాను. ఆయనకు సినిమాపై ఉన్న ప్యాషన్‌ అలాంటిది. ఓసారి నేను రాజుగారితో..'అన్నా నీకు ఏ చెడు అలవాట్లు లేవు.. చాలా హెల్దీగా ఉన్నావు. ఇలాగే చేసుకుంటూ వెళితే వంద సినిమాలు చేసేస్తావన్నయ్యా' అన్నాను. దానికి ఆయన 'హరీశ్‌ నేను వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళతాను. అవి 80..90 లేక వంద సినిమాలు అవుతాయో నాకు తెలియదు. కానీ వంద సినిమాలు చేయాలనే టార్గెట్‌తో సినిమాలు చేయడం లేదు' అన్నారు. ఆ మాట నాకెంతో ఇన్‌స్పిరేషన్‌గా అనిపించింది. ఈ ఏడాది ఆయనకు వచ్చిన ఆరు సక్సెస్‌లు ఆయన ప్యాషన్‌కు దేవుడు ఇచ్చిన గిఫ్ట్‌గా

నేను బావిస్తున్నాను. ఇంత మంచి జర్నీలో మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు థాంక్స్‌'' అన్నారు. తీష్‌వేగేశ్న మాట్లాడుతూ - ''సాధారణంగా ఎవరైనా వారున్న రంగంలో చరిత్ర సృష్టించాలనుకుంటారు. అలాగే ఈరోజు దిల్‌రాజు సినిమా రంగంలో ఓ ఏడాదిలో ఆరు హిట్స్‌ సాధించి చరిత్ర సృష్టించారు. ఆ చరిత్రలో శతమానం భవతి మొదటి అడుగు అయినందుకు ఆనందంగా ఉంది. 27 సంవత్సరాలు తర్వాత తెలుగు సినిమాకు నేషనల్‌ అవార్డ్‌ వస్తే..అందుకు ప్రధాన కారణం రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు. సాధారణంగా ఎవరైనా గెలుపు గుర్రంపైనే బెట్టింగ్‌ కడతారు. కానీ రేసు ఫీల్డ్‌ లాంటి సినిమాల్లో ఈ నిర్మాతలు ముగ్గురు కొత్త గుర్రంపై బెట్టింగ్‌ కట్టి సక్సెస్‌ కొడతారు లేదా..నాలాంటి ఓడిపోయిన గుర్రాన్ని తీసుకొచ్చి బెట్టింగ్‌ కట్టి సక్సెస్‌ సాధిస్తారు'' అన్నారు. యసుధ మాట్లాడుతూ - ''ఎస్‌.వి.సి బ్యానర్‌లో నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ ఏడాది ఆరు సినిమాలను సక్సెస్‌ సాధించిన ఎస్‌.వి.సి బ్యానర్‌కు అభినందనలు. అందులో తొలి సినిమా శతమానం భవతిలో నేను నటించే అవకాశం కలిగినందుకు ''

టాలీవుడ్ P 25


అన్‌సీజనల్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ రాజాది గ్రేట్‌, ఫైనల్‌గా ఎంసీఎ. శిరీష్‌గారు రెడ్‌బుల్‌. మా అందరికీ ఎనర్జీ ఇస్తారు'' అని తెలిపారు. యికార్తిక్ మాట్లాడుతూ ``దిల్‌రాజుగారు హిట్ కొట్టిన ఆరు బాల్స్ లో నాదీ ఓ బాల్ అయినందుకు, ఆ బాల్ ఆడ‌టానికి న‌న్ను గ్రౌండ్‌లోకి తీసుకెళ్లిన అనిల్ రావిపూడికి థాంక్స్`` అని అన్నారు. హ‌రీన్ మాట్లాడుతూ ``ఇంత పెద్ద స‌క్సెస్‌లు కొట్టడ ‌ ం మామూలు విష‌యం కాదు. ఈ సంస్థ‌లో ఈ సారి నానితో ఏడాది మొద‌లైంది. ఆయ‌న‌తోనే పూర్త‌వ‌డం ఆనందంగా ఉంది`` అని చెప్పారు. ణుశ్రీరామ్ మాట్లాడుతూ ``రాజుగారితో నా జ‌ర్నీ ఎక్కువ‌. ఆర్య‌కి అసిస్టెంట్ డైర‌క్ట‌ర్గా ‌ చేశాను. ప‌ర్స‌న‌ల్ లెవ‌ల్‌లో ఆయ‌న గురించి ఎక్కువే తెలుసు. ఆయ‌న ఒక ఏడాది ఆరు సిక్స్ లు కొట్టారు. ప‌ర్స‌న‌ల్ గోల్స్ పెట్టుకుని, వాటిని ఆయ‌నే బ్రేక్ చేస్తుంటారు. దిల్‌రాజు, శిరీష్‌, ల‌క్ష్మణ్ ‌ ఎంత స్నేహంతో ఉంటారో నాకు తెలుసు. `బిడ్డా ఐదు కొట్టిండ్రు. ఆరోది కొట్ట‌కపో ‌ తే నీ సంగ‌తి చెప్తా` అని రాజుగారు ఎప్పుడూ న‌న్ను అంటుండే వారు. లాస్ట్ పంచ్ మ‌నదై ‌ తే ఆ కిక్కే వేరు. ఈ ఏడాది ఆ ఆరో బాల్ నాది అయింది. నేను ఈ క‌థ‌ను ముందు చెప్పింది హ‌రీశ్‌శంక‌ర్‌గారికి.`` అని అన్నారు. మిక మాట్లాడుతూ ``ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు మూడేళ్ల త‌ర్వాత నేను ఇక్క‌డికి వ‌చ్చాను. నేను అంద‌రి కళ్ల‌కు దూరంగా ఉండొచ్చు. కానీ నా మ‌న‌సుకు అంద‌రూ ద‌గ్గ‌ర‌గా ఉన్నారు. ఇంత స‌క్సెస్‌ఫుల్ సినిమాలు తీసినందుకు రాజుగారికి కంగ్రాట్స్. ఈ సంస్థ‌లో పనిచేయ‌డం వ‌ల్ల నా క‌ల నెర‌వేరిన‌ట్టు అనిపించింది`` అని చెప్పారు. విశ్రీ ప్ర‌సాద్ మాట్లాడుతూ ``నిజ‌మైన మిడిల్ క్లాస్ అబ్బాయి దిల్‌రాజు. కోటీశ్వ‌రుడైనా, రిక్షావాడైనా అవే సినిమాలు చూడాలి. డిఫ‌రెంట్ క‌ల్చ‌ర్స్, జోన‌ర్స్ సినిమాలు చేస్తున్న రాజుగారికి కంగ్రాట్స్. ఒక ఏడాది ఆరు సినిమాలు చేయ‌డం, ఆరు హిట్లు కొట్ట‌డం గ్రేట్‌. రైట‌ర్స్ మీద నాకు ప్రేమ ఎక్కువ‌. మా నాన్న రైట‌ర్ కాబ‌ట్టి నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. ఏ టెక్నీషియ‌న్‌కైనా ఇన్‌స్పిరేష‌న్ ఇచ్చేది క‌థే కాబ‌ట్టి రైట‌ర్స్ అంటే నాకు ఇష్టం. అలాంటి క‌థ‌ల‌ను పోగుచేసి సినిమా చేసిన రాజుగారు ఈజ్ గ్రేట్‌. ఆయ‌న‌తో ప‌నిచేస్తుంటే నిర్మాతగా ‌ భావించం, ఒక ఫ్యామిలీగా ఫీల‌వుతాం. ఈ ఇయ‌ర్ రాజుగారికి నాకూ క‌లిసి హ్యాట్రిక్ ఉంది. వ‌చ్చే ఏడాది మూడు హ్యాట్రిక్‌లు కొట్టాలి. ఆ మూడు హ్యాట్రిక్‌లు క‌లిసి ఒక హ్యాట్రిక్ అవుతుంది. దీన్ని వింటుంటే సుకుమార్ డైలాగ్‌లాగా ఉంది క‌దా..`` అని చెప్పారు.

సా మె

అన్నారు. నుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ - ''శతమానం భవతి విడుదలై అప్పుడే ఏడాది అయ్యింది. ఆ సినిమాలో నటించడంతో...జీవితంలో ఏదో సాధించానని ఫీల్‌ అవుతున్నాను. ఆ సినిమాలో నాకు సహకారం అందించి ఆ సినిమాను వండర్‌ఫుల్‌ ఎక్స్పీ ‌ రియెన్స్‌గా మిగిల్చినందుకు థాంక్స్'‌' అన్నారు. ఖర్‌ కమ్ముల మాట్లాడుతూ - ''కొన్ని సినిమాలు మ్యాజిక్‌ చేస్తుంటాయి. అలాంటి మ్యాజిక్‌కు కారణమైన దిల్‌రాజుగారికి, వరుణ్‌సహా నా టీం అంతటికీ థాంక్స్‌. ఆయన అప్రోచ్‌ చూస్తుంటే మంచి క్వాలిటీ ఉన్న వంద సినిమాలను త్వరలోనే పూర్తి చేసేస్తారని నమ్ముతున్నాను'' అన్నారు. రో వరుణ్‌తేజ్‌ మాట్లాడుతూ - ''రాజుగారి సాధించిన ఇంత పెద్ద సక్సెస్‌లో మేం కూడా పార్ట్‌ అయినందుకు ఆనందంగా ఉంది. సినిమాపై దిల్‌రాజుగారికున్న ప్యాషన్‌, కథపై ఉన్న కన్విక్షన్‌, డైరెక్టర్స్‌పై ఉండే నమ్మకమే ఆయన సక్సెస్‌కు కారణం. మంచి కథను నమ్ముకునే ఆయన సినిమాలు చేశారు. ఇలాంటి సక్సెస్‌ను మరిన్ని సాధిస్తారని దిల్‌రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణగారిని కోరుకుంటున్నాను'' అన్నారు. నిల్‌ రావిపూడి మాట్లాడుతూ ''ఇయర్‌ ఎగ్జామ్స్‌ అయ్యాక స్టూడెంట్స్‌ అందరినీ లైన్‌లో పిలిచి ప్రైజ్‌ డిస్ట్రిబ్యూషన్‌ చేస్తున్నట్టు అనిపిస్తోంది. ఈ సంస్థ తీసిన 27 చిత్రాల్లో 90 శాతానికి మించి హిట్లున్నాయి. నా జర్నీ 'సుప్రీమ్‌' నుంచి మొదలైంది. ఈ ఏడాది సినిమా పరంగా ఎన్నో తీపి జ్ఞాపకాలు, వ్యక్తిగతంగా చేదు జ్ఞాపకాలు ఉన్నప్పటికీ, దిగమింగుకుని ఈ సెలబ్రేషన్‌ చేస్తున్నందుకు హ్యాపీ. 2017 వెల్కమ్‌ సూపర్‌డూపర్‌ హిట్‌ శతమానం భవతి, మోటివేషనల్‌ నేను లోకల్‌, వార్మప్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ డీజే, మాన్‌సూన్‌ సూపర్‌డూపర్‌హిట్‌ ఫిదా,

శే

హీ

26 P టాలీవుడ్

వే

భూ దే


నా

ని మాట్లాడుతూ ``నాకు చిన్న‌ప్ప‌టి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ఎప్పుడూ బ్యాట్ ప‌ట్టుకుని కూర్చునేవాడిని. ఈ ఏడాది ఆరు బాల్స్ లో రెండు బాల్స్ ఇచ్చినందుకు రాజుగారికి థాంక్స్. పాట‌, టీజ‌ర్ వంటివి ఆయ‌న ఎప్పుడూ వాట్సాప్‌లో పంప‌రు. షూటింగ్ షాట్ గ్యాప్‌లో పిలిచి పాట వినిపిస్తారు. ఇంకా చిన్న పిల్లాడి లాగా ప్యాష‌న్‌తో చేస్తారు. అంత ప్యాష‌నే ఆయ‌న్ని నెంబ‌ర్ వ‌న్ నిర్మాతగా ‌ నిలిపింది. ఇది నేను ఇద్ద‌రు వ్య‌క్తుల్లోనే చూశా. ఒక‌టి ఆదిత్య చోప్రా, రెండోది దిల్‌రాజుగారు. ప్ర‌తి చిన్న విష‌యానికీ వారిద్ద‌రూ ఎగ్జయిట్ అవుతారు. నేను ఈ మ‌ధ్య‌నే ప్రొడ‌క్ష‌న్‌లోకి దిగాను. దిగిన త‌ర్వాత అర్థ‌మ‌వుతుంది ప్రొడ‌క్షన్ ‌ ఎంత క‌ష్ట‌మో.. ఒకే ఏడాది ఇన్ని సినిమాలు తీసి అన్ని హిట్లు కొట్టారంటే మీరు గ్రేట్ సార్‌. మేం ఎంసీఏలో చాలా భ‌య‌పడ్డాం. ఆ భ‌యాలేమీ అక్క‌ర్లేద‌ని ప్రేక్ష‌కులే హిట్ ఇచ్చారు కాబ‌ట్టి చాలా ఆనందంగా ఉన్నాం`` అని తెలిపారు. ల్‌రాజు మాట్లాడుతూ - ``ఒక ఏడాది ఇన్ని సినిమాలు చేయ‌డం మామూలు విష‌యం కాదు. ఆఫీస్‌లో క్రిస్మ‌స్‌కి ఎవ‌రూ రారు. స‌క్సెస్‌లు రావ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ కార‌ణం. అంద‌రూ అలా ఉన్నారు కాబ‌ట్టే మాకు ఇన్ని స‌క్సెస్‌లు వ‌చ్చాయి. 1987 డిసెంబ‌ర్‌లో నా జీవితం మొద‌లైంది. ఒక సూట్‌కేస్ ప‌ట్టుకుని ఆటోమొబైల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవ‌డానికి బ‌య‌లుదేరారు. 1987, 1997, ఇప్పుడు 2017.. అన్నిటికి ఏదో ఇంట‌ర్‌లింక్ ఉన్న‌ట్టు అనిపిస్తోంది. సినిమాల మీద ఆస‌క్తితో మేం ఇండ‌స్ట్రీలోకి రావ‌డం, బిగినింగ్‌లో ఫెయిల్యూర్స్... 20 ఏళ్ల క్రితం మా జీవితంలో గ్రేట్ డే స‌క్సెస్ తెచ్చిన సినిమా పెళ్లిపందిరి. ఆ సినిమా కొన్న‌ప్ప‌టి నుంచి రిలీజ్ వ‌ర‌కు ఎంత క‌ష్ట‌ప‌డ్డామో మాకు, మా ఫ్యామిలీస్‌కి తెలుసు. సినిమా విడుద‌ల రోజు రూ.3ల‌క్ష‌లు త‌క్కువ ఉంటే షాప్‌లు తిరిగి క‌ట్టాం. కోడి రామ‌కృష్ణ,‌ జ‌గ‌ప‌తిబాబుగారుకి థాంక్స్. ఆ సినిమా లేకుంటే మేం లేం. ఆ సినిమా ద్వారానే ఇక్క‌డి వ‌ర‌కు రాగ‌లిగాం. ఆ త‌ర్వాత డిస్ట్రిబ్యూష‌న్ ఆఫీస్ పెట్టాక చాలా మంది నిర్మాత‌లు మంచి సినిమాలు ఇచ్చారు. ఎన్నో సినిమాల‌తో అనుభ‌వం ఉన్న మేం ప్రొడ‌క్ష‌న్‌లోకి వ‌చ్చాం. వినాయ‌క్‌తో దిల్ చేశాం. ఆ సినిమా ద్వారా చాలా నేర్చుకున్నాం. దిల్ ద్వారా పుట్టిన సుకుమార్, బోయ‌పాటి శ్రీను, భాస్క‌ర్, వంశీ, శ్రీకాంత్ అడ్డాల‌, వేణు.. ఇలా ఎనిమిది మందిని ప‌రిచ‌యం చేశాం. ఒక్క ద‌ర్శకు ‌ డు త‌ప్ప మిగిలిన వాళ్లంద‌రూ స‌క్సెస్‌ఫుల్ ద‌ర్శ‌కులే. ఈ ఇయ‌ర్ మా సంస్థ‌కు రెండు హ్యాట్రిక్‌లు వ‌స్తాయని ‌ నేను అనుకోలేదు. ఆరు సినిమాలు వ‌స్తాయ‌ని నేను కూడా అనుకోలేదు. భ‌గ‌వంతుడు ఇలా డిజైన్ చేశారు. `శ‌త‌మానం భ‌వ‌తి`,

ది

`నేను లోక‌ల్‌` త‌ర్వాత అంద‌రికీ తెలిసిందే.. అప్ప‌టికి ప్లాన్డ్ గా ఉన్నాను. మిగిలిన సినిమాల‌న్నీ ప్లాన్‌గా ఉన్నాను. ఆరు సినిమాలు క‌నిపిస్తున్నాయి. వాట‌న్నిటినీ హిట్ చేయాల‌ని అంద‌రం ప్లాన్ చేసుకుంటున్నాం. డీజే షూటింగ్ జ‌రుగుతుంటే అబుద‌మీకి వెళ్లాను. అక్క‌డి నుంచి ఫారిన్ వెళ్లాలి. ఫిదా అప్ప‌టికి రెండు షాట్‌లు చూశాను. ఫ్లైట్ దిగుతుంటే... అస‌లు ఏం జ‌రుగుతుందో, ఎలా అవుతుందో నాకు తెలియ‌లేదు. ఎక్క‌డ డ్రాప్ అవుతానోన‌ని అనుకున్నా. గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్రెండ్స్ లేకుంటే జీవితంలో మ‌నం ముందుకు వెళ్ల‌లేం. ఈ ఆరు స‌క్సెస్‌ల వెన‌కాల నా ఫ్రెండ్స్ ఉన్నారు. నా ఫ్యామిలీ ఉంది. ఎంద‌రో నాకు ఈ ఏడెనిమిది నెల‌ల నుంచి మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చారు. దాంతోనే నేను సాధించాను. ఇది నేను కాదు. వంశీ అంద‌రికీ డైర‌కర్ ్ట‌ ‌గా తెలుసు. కానీ త‌ను నాకు ఫ్యామిలీ మెంబ‌ర్స్. వంశీ, ప్ర‌కాశ్‌రాజ్‌గారు, మ‌రో ఫ్రెండ్ న‌న్ను మోర‌ల్‌గా స‌పోర్ట్ చేశారు. స‌క్సెస్ ఉన్న‌ప్పుడు అంద‌రూ పొగుడుతారు అది కామ‌నే. సినిమా ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ అంద‌రినీ నిల‌బ‌డుతుంది. కానీ ఫెయిల్యూర్ ఉన్న‌ప్పుడే మోర‌ల్ స‌పోర్ట్ కావాలి. స‌క్సెస్ ఉన్న‌వాళ్ల‌తో సినిమాలు చేస్తే అది ఆటోమేటిగ్గా వ‌చ్చేస్తుంది. ఇది ఆరు సినిమాల‌నే ఈవెంట్‌లాగానే చేద్దామ‌నుక‌న్నా. కానీ ఎమోష‌న‌ల్ డ్రైవ్ అయిపోయింది. నాకు మా ఆవిడ గురించి తెలియ‌గానే నా ద‌గర‌ ్గ‌ కు వ‌చ్చింది శేఖ‌ర్గా ‌ రు. అక్క‌డినుంచి నేను వ‌చ్చేశాను. యు.ఎస్‌.లో కంప్లీట్ చేసుకుని వ‌చ్చారు కాబ‌ట్టి అది క్లాసిక్ అయింది. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తి ఒక్క‌రూ బ్ల‌డ్‌, హార్ట్ పెట్టి ప‌నిచేశారు. నా డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను సొంత మ‌నుషులులాగా చూస్తాను. వాళ్లు సినిమాల‌ను ప్ర‌మోట్ చేసి స‌క్సెస్‌ఫుల్ సినిమాలు అయ్యేలా చేశారు. ఒక సినిమా ఊరికే వ‌చ్చేయ‌దు. ఒక ట్యూన్ వ‌చ్చినా, సినిమా ఎవ‌రైనా డ‌బుల్ పాజిటివ్ చూసినా నేను గేట్ కీప‌ర్‌లాగా కూర్చుంటాను. అక్క‌డే నాకు రియాక్ష‌న్ తెలుసుకుంటాను. తొలి రియాక్ష‌నే సినిమా. అక్క‌డే తెలిసిపోద్ది. ఒక‌వేళ సినిమా బాగోలేక‌పోతే వాళ్ల రియాక్ష‌న్ ఏంటి అనేది తెలిసిపోతుంది. ఈ ఆరు సినిమాలు మావి కాదు. వీటికి ప‌నిచేసిన టెక్నీషియ‌న్ల‌వి. ఈ ఈవెంట్ అందుకే అలా చేయాల‌నుకున్నా`` అని చెప్పారు.

టాలీవుడ్ P 27




       భా

28 P టాలీవుడ్

గ్యనగరంలో నిలువనీడ లేని అభాగ్యులెందరో. పగలంతా దొరికింది తిని, రాత్రి ఫుట్ పాత్ లపై నిద్రిస్తుంటారు. ఇలాంటి నిరాశ్రయులను చలికాలం మరింత ఇబ్బంది పెడుతుంటుంది. కప్పుకునేందుకు దుప్పటి కూడా లేని వీళ్లకు సహాయం చేసేందుకు మనం సైతం ముందుకొచ్చింది. ఫుట్ పాత్ లపై నిద్రిస్తున్న వాళ్ల బాధలకు స్పందించిన మనం సైతం సభ్యులు దుప్పట్లు, రగ్గులు, శాలువాలు అందించారు. అర్థరాత్రి నగరంలో కాదంబరి కిరణ్, కుంపట్ల రాంబాబు, వేణు, సురేష్ , రవి, సీసీ శ్రీను, బందరు బాబి, వల్లభనేని అనిల్, వినోద్ బాల ఈ నిరాశ్రయుల దగ్గరకు వెళ్లి దుప్పట్లు అందజేశారు. ఈ సేవా కార్యక్రమం తనకెంతో సంతృప్తినిచ్చిందని మనం సైతం నిర్వాహకులు కాదంబరి కిరణ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ...చలికాలం ఇంట్లో ఉన్న మనమే తట్టుకోలేకపోతుంటాం. అలాంటిది రహదారుల పక్కన నిద్రించే వాళ్లకు ఎంత బాధ ఉంటుందో ఊహించుకోవచ్చు. చలికి ఇబ్బందులు పడుతున్న నిరాశ్రయులపై దినపత్రికల్లో వచ్చిన వార్తలు చదివి...మనం సైతం సభ్యులుగా తక్షణం స్పందించాం. రాత్రికి రాత్రే దుప్పట్లు, రగ్గులు, శాలువాలు తీసుకుని వెళ్లి వాళ్లకు అందించాం. అన్నారు.






`ఎ

వడే సుబ్రమణ్యం నుండి రీసెంట్గా విడుదలైన `ఎంసీఏ` వరకు ఎనిమిది వరుస సక్సెస్ఫుల్ చిత్రాలతో మెప్పిస్తున్న నేచరల్ స్టార్ నాని హీరోగా ద్విపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం `కృష్ణార్జున యుద్ధం`. వెంకట్ బోయనపల్లి సమర్పణలో షైన్ స్క్రీన్న్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `వెంకటాద్రి ఎక్స్ప్రెస్`, `ఎక్స్ప్రెస్ రాజా` చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. అనుపమ పరమేశ్వరన్ మరియు రుఖ్సార్ మీర్ ఈ చిత్రం లో నాయికలు గా నటిస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుంది. ఇందులో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 12న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతాన్ని అందిస్తుండగా, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

టాలీవుడ్ P 29








యూ

త్‌కింగ్‌ అక్కినేని అఖిల్‌ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్‌ , మనం ఎంటర్‌ప్రైజెస్‌బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం 'హలో'. విక్రమ్‌. కె.కుమార్‌ దర్శకత్వంలోఅక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదలైంది. ఈ సందర్భంగా అక్కినేని అఖిలతో ఇంటర్వ్యూ....

అందుకోసం స్పెషల్‌ట్రైనింగ్‌తీసుకున్నాను..

సినిమా పార్కోవర్‌ సీక్వెన్స్‌ కోసం దాదాపు 60 రోజులు ముందుగానే ట్రైనింగ్‌ తీసుకున్నాను. యాక్షన్‌ పార్ట్‌ను డిజైన్‌ చేసిన బాబ్‌ బ్రౌన్‌ అండ్‌ టీం ప్లానింగ్‌లో భాగంగా 16 మంది సభ్యులు లాస్‌ ఏంజిల్స్‌ నుండి ముందుగానే ఇక్కడకు వచ్చారు. ఆయన ఆధ్వర్యంలో ట్రైనింగ్‌ తీసుకోవడం వల్ల సినిమాలో పర్టికులర్‌ యాక్షన్‌ సీక్వెన్‌్ోల్లో నటించడం సులభమైంది. సినిమా స్టార్ట్‌చేయడానికి ముందుగానే సీజీ వాడకూడదని నిర్ణయించుకునే అందులో భాగంగానే ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఇలాంటి యాక్షన్‌ సీక్వెన్స్‌లను చేయడం

30 P టాలీవుడ్

అంత సులభం కాదు. యాక్షన్‌సీక్వెన్స్ల ‌ ను చేయడానికి 30 రోజులు పట్టింది. కాస్తా కష్టపడ్డాం కానీ ఆ యాక్షన్‌సీక్వెన్స్‌ బాగా వచ్చాయి.

చా డా

అదే బెస్ట్‌కాంప్లిమెంట్‌

లా కాంప్లిమెంట్స్‌ వచ్చాయి. ముఖ్యంగా బాగా తెలిసిన అమ్మాయి.. క్లైమాక్స్‌సీన్‌ను చూసి యు స్టోలెన్‌మై హార్ట్‌అని కాంప్లిమెంట్‌ఇచ్చింది.

డాన్సులు కూడా కథలో భాగంగానే..

న్స్‌ సాంగ్స్‌ వల్ల ఓ నాలుగైదు నిమిషాలు స్టోరీ ఆగిపోతుంది. కాబట్టి అలాంటి డాన్స్‌ నంబర్స్‌ పెట్టడం విక్రమ్‌కు ఇష్టం లేదు. కథలో భాగంగానే డాన్స్‌ నంబర్‌ సినిమాలో ఉంటుంది. ఉన్న డాన్సులు కూడా కథలో భాగంగానే ఉంది.

ఆ విషయంలో హ్యాపీ...

సా

ధారణంగానే నాకు టెన్షన్‌ ఎక్కువ. సినిమా విడుదలై యు.ఎస్‌.రిపోర్ట్స్‌వచ్చే వరకు టెన్షన్‌తో నిద్ర పోలేదు. సినిమా రివ్యూస్‌ పాజిటివ్‌గా రావడం


సంతోషానిచ్చింది. ఈ సినిమాతో హిట్‌కొట్టాలని ఆలోచన కాకుండా..ఓ మంచి సినిమాలో భాగం కావడంలో ముఖ్య భూమిక తీసుకోవడం చాలా హ్యాపీ. ఈ సినిమాను సక్సెస్‌ చేసిన అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్.‌

యు

యు.ఎస్‌లో తెలుగు మార్కెట్‌పెరిగింది..

.ఎస్‌ మార్కెట్‌ తెలుగు సినిమాకు పెరిగింది. అలాగే సినిమా రిలీజ్‌కు ముందుగానే వేసిన ప్లాన్‌ ప్రకారం అక్కడకు వెళ్లి ప్రమోట్‌ చేశాం. సినిమా ఆడియెన్స్కు ‌ బాగా నచ్చింది. దాని వల్ల సినిమా యు.ఎస్‌లో వన్‌మిలియన్‌డాలర్‌కలెక్షన్‌కు దగ్గరగా ఉంది. యు.ఎస్‌. మార్కెట్‌లో కలెక్షన్స్‌ బావుంటుందని అనుకున్నాను కానీ ఇంత బావుంటుందని అనుకోలేదు.

ఆయన ఎంకరేజ్‌చేస్తారు.

సినిమా మేకింగ్‌విషయాలను నేర్చుకున్నా...

నే

ను పెద్ద సినిమా కోసం వెయిట్‌ చేశాను. అందులో భాగంగా 'హలో' సినిమా చేశాను. ఈ జర్నీలో సినిమా మేకింగ్‌ గురించి చాలా విషయాలను నేర్చుకున్నాను. విక్రమ్‌కుమార్‌, పి.ఎస్‌.వినోద్‌వంటి టాప్‌టెక్నిషియన్స్‌తో ఈ సినిమాలో పనిచేశాను. సినిమాను నాకంటే ఎక్కువగా ప్రేమించే సీనియర్స్‌తో పనిచేయడం వల్ల చాలా విషయాలను నేర్చుకున్నాను. ఎడిటింగ్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఎలా మానిటర్‌ చేయాలి, డైలాగ్స్‌ ఎలా రాస్తారు ఇలా అన్నింటిని అబ్జర్వ్‌చేశాను.

మళ్లీ ఆయనతో వర్క్‌చేయాలని ఉంది..

'మ

చైతన్య ఏమన్నాడంటే..

నా

న్నగారు స్ట్రాంగ్‌ నిర్మాత. నా సినిమా, నాకు కావాల్సినట్లు చేస్తానని ఎడిటింగ్‌, రీరికార్డింగ్‌ ప్రతి విషయాన్ని దగ్గరుండి చూసుకున్నారు. సినిమాకు సంబంధించిన ప్రతి కోణాన్ని పర్యవేక్షించారు. రామ్‌గోపాల్‌వర్మగారి సినిమా షూటింగ్‌ను క్యాన్సిల్‌ చేసి మొత్తం టెన్షన్‌ను ఆయనే తీసుకున్నారు. ఆయనతో మళ్లీ వర్క్‌చేయాలనుకుంటున్నాను.

నే

ను నా తొలి సినిమా ఎక్కువగా ఫైట్స్‌, డాన్సుల్లో ఎక్కువ ఫోకస్‌పెట్టేశాను. ఈ సినిమా చూసిన తర్వాత చైతన్య..ఓ 'యాక్టర్‌గా ఓపెన్‌ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓ మంచి సినిమాలో పార్ట్‌అయ్యావని' అప్రిసియేట్‌ చేశారు.

పాట పాడటం గురించి..

నూప్‌తో మంచి అనుబంధం ఉంది. గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌లో రోజు మార్చి రోజు నాతో నాలుగైదు గంటలు కూర్చుని మ్యూజిక్‌ నేర్పించారు. కీ బోర్డ్‌, గిటార్‌ అంతా నా రూమ్‌లోనే వదిలేశాడు. బేస్‌ వాయిస్‌ బావుంది. సాధారణంగా నన్ను ఓసారి హమ్‌ చేయమని చెప్పాడు. అయితే నేను రెగ్యులర్‌ సింగర్‌ని కాను..నాకు ట్రైనింగ్‌ ఇవ్వమని అనూప్‌ను అడిగాను. తను మూడు నెలలు పాటు నాకు మ్యూజిక్‌లో బేసిక్స్‌తో చిన్నపాటి క్రాష్‌కోర్సు ట్రైనింగ్‌ఇచ్చాడు.

చిరంజీవి..నా లక్కీ చార్మ్‌..

సి

నిమా చూసిన చిరంజీవిగారు..'చాలా సెటిల్డ్‌గా చేశావ్‌' అని అన్నారు. చిరంజీవిగారు నా లక్కీ చార్మ్‌. నా తండ్రిలా నన్ను ఎంకరేజ్‌ చేస్తారు. నేనే కాదు, ఇండస్ట్రీలోకి వచ్చే ఏ నటుడినైనా ఆయన బాగా ఎంకరేజ్‌ చేస్తారు. ఆయనకు సినిమాలంటే పిచ్చి. అందుకే నటీనటలనే కాదు..సినిమాలో ఏ డిపార్ట్‌మెంట్‌ వ్యక్తినైనా

ముందుగానే అనుకున్నాం..

నం' సినిమా చేసే సమయంలోనే నాతో, విక్రమ్‌కుమార్‌తో సినిమా చేయూలని నాన్నగారు అనుకున్నారు. కానీ 'మనం' తర్వాత విక్రమ్‌ కుమార్‌ '24' సినిమాతో బిజీగా మారిపోయారు. ఆ సినిమా తర్వాత ఈ హలో సినిమానే స్టార్ట్‌అయ్యింది. ఫ్యాన్స్ కూడా మంచి సినిమా తీశామని హ్యాపీగా ఉన్నారని నాకు ఫీడ్‌బ్యాక్‌వచ్చింది.

ఆ ఆలోచనలేం పెట్టుకోలేదు..

ప్పుడు క్లాస్‌ సినిమా చేశాను. తర్వాత మాస్‌ సినిమా చేయాలి..ఇలాంటి ఆలోచనలేం పెట్టుకోలేదు. ఏ కాలిక్కులేషన్‌ లేవు. కథ బావుంటే ఏ సినిమా అయినా చేసేస్తాను.

హీరోయిన్‌గురించి..

ల్యాణి ప్రియదర్శిన్‌ తొలి సినిమానే అయినా చక్కగా చేసింది. హీరోయిన్‌గా కాదు..మంచి నటిగా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది. నా తొలి సినిమాలో నేను కూడా అంత బాగా చేయలేదనే అనుకుంటున్నాను. చాలా హార్డ్‌వర్కర్‌.

బాలీవుడ్‌లో సినిమా...

ప్ర

స్తుతం నా ఫోకస్‌ అంతా తెలుగు ఇండస్ట్రీపైనే. ఎందుకంటే నేను తెలుగువాడ్ని. మా అభిమానులు కూడా ఇక్కడి వారే. ఇక్కడొక ఐదారు సినిమాలు చేసిన తర్వాత బాలీవుడ్‌లో సినిమా గురించి ఆలోచిస్తాను.

తదుపరి సినిమా...

నవరి 5న ఒక కథ వింటున్నాను. జనవరి 8న మరో కథ వింటాను. ఈ రెండింటిలో ఏ సినిమా చేస్తాననేది జనవరి 10న అనౌన్స్‌ చేస్తాను. అయితే నేను పలానా దర్శకుడితో సినిమా చేస్తానని చాలా వార్తలు వినపడుతున్నాయి. అలాంటిదేమీ లేదు.

టాలీవుడ్ P 31




 వా

రసులను హీరోలుగా పరిచయం చేయడం చాలా కామన్ అయిపోయింది. ముఖ్యంగా సినిమా రంగంలో వారసుల రాజ్యం ఎక్కువ కాబట్టి ఇప్పటికే బోలెడు మంది వారసులు హీరోలుగా పరిచయమయ్యారు కాగా వాళ్లలో కొంతమంది అగ్ర హీరోలు గా రాణిస్తున్నారు కానీ కొంతమంది రాణించలేకపోయారు . అయినప్పటికీ వారసులు వస్తూనే ఉన్నారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి . తాజాగా డైరెక్టర్ విజయ భాస్కర్ తనయుడు కమల్ హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. ర్శకుడిగా పలు హిట్ చిత్రాలను అందించిన విజయ్ భాస్కర్ గతకొంత కాలంగా డైరెక్షన్ కి స్వస్తి పలికాడు. వెంకటేష్ తో నువ్వు నాకు నచ్చావ్ వంటి బ్లాక్ బస్టర్ ని చిరంజీవి తో జై చిరంజీవా వంటి హిట్ చిత్రాన్ని ఆది తో ప్రేమ కావాలి , స్వయం వరం , వంటి హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు విజయ్ భాస్కర్ . కాగా ఆ విజయ్ భాస్కర్ తనయుడు కమల్ హీరోగా నటించడానికి సమాయత్తం అవుతున్నాడు. ప్రస్తుతం నటనలో ,డ్యాన్స్ లో ఫైట్స్ లలో శిక్షణ తీసుకుంటున్నాడు కమల్ . ఓ కొత్త డైరెక్టర్ దర్శకత్వంలో పరిచయం కానున్నాడు కమల్. మరి ఈ వారసుడు ఎలాంటి విజయాలను సాధిస్తాడో చూడాలి.





మా

స్ మహారాజా రవితేజ హీరోగా 'టచ్ చేసి చూడు' పేరుతో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. ఇటీవలే ఆ సినిమా చిత్రీకరణ పూర్త‌యింది. .బేబీ భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప‌లు విజ‌య‌వంత‌మైన చిత్రాల‌కు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన విక్రమ్ సిరికొండ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. రాశీఖ‌న్నా, సీర‌త్ క‌పూర్ నాయిక‌లు. ర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ మాట్లాడుతూ "మాకు చిరకాల మిత్రుడైన రవితేజ తో ఈ సినిమా నిర్మిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మాస్ మహారాజా ఇమేజ్ కి తగ్గట్టుగా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అద్భుతమైన కథను తయారు చేశారు. షూటింగ్ పూర్త‌యింది.ప్రస్తుతం రీరికార్డింగ్ జ‌రుగుతోంది`` అని తెలిపారు.

ని

32 P టాలీవుడ్

చిత్రానికి సంగీతం : జామ్ 8, కథ : వక్కంతం వంశీ, స్క్రీన్ ప్లే : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస్ రెడ్డి, అడిషనల్ డైలాగ్స్: రవిరెడ్డి మల్లు,కేశవ్ , ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: రమణ, ఛాయాగ్రహణం : చోటా.కె.నాయుడు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) , వల్లభనేని వంశీ, స్క్రీన్ ప్లే ,దర్శకత్వం : విక్రమ్ సిరికొండ.






యం

గ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సాహో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. రన్ రాజా రన్ ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ అత్యంత భారీర్ ఎత్తున నిర్మిస్తోంది. తెలుగు ,తమిళ , హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్దా కపూర్ నటిస్తోంది. ప్రభాస్ సరసన నటించే భామ కోసం పెద్ద ఎత్తున కసరత్తు లు చేశారు చివరకు శ్రద్దా కపూర్ రెమ్యునరేషన్ విషయంలో బాగా డిమాండ్ చేసినప్పటికీ ఏరికోరి మరీ ఎంచుకున్నారు.

యితే ప్రభాస్ ఏరికోరి శ్రద్దా కపూర్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటో తెలుసా..... శ్రద్దా కపూర్ పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందట ,అంతేకాదు శ్రద్దా పై యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నారట . శ్రద్దా కూడా చాలా శ్రద్ధ గా అన్ని చేస్తోందట . శ్రద్దా అంకిత భావం చూసి ప్రభాస్ షాక్ అయ్యాడట . గ్లామర్ తో మాత్రమే కాకుండా యాక్షన్ తో కూడా అలరిస్తుందట శ్రద్దా కపూర్. ఇక ఈ చిత్రాన్ని 2018 దీపావళి కి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ 2019 లోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్ P 33






2017

వ సంవత్సరం లో తెలుగులో నేరుగా 177 చిత్రాలు విడుదల అయ్యాయి, కానీ హిట్ అయిన చిత్రాల శాతం మాత్రం యధావిధిగానే తక్కువ శాతం నమోదు అయ్యింది. 2017 లో కేవలం 12 చిత్రాలు మాత్రమే లాభాలను తెచ్చిపెట్టాయి కాగా మరో 8 చిత్రాలకు విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల ఆదరణ కూడా లభించింది కానీ పెద్దగా లాభాలు మాత్రం రాలేదు. ఎప్పటి లాగే విజయాలు తక్కువ పరాజయాలు ఎక్కువ నమోదయ్యాయి. ఈ ఏడాది కూడా విభిన్న తరహా చిత్రాలను ఆదరించారు ప్రేక్షకులు. యితే 177 చిత్రాల్లో చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 ,బాలయ్య నటించిన గౌతమిపుత్ర సాతకర్ణి, శతమానం భవతి , నేనో రకం , గురు, ఫిదా , రాజా ది గ్రేట్, మహానుభావుడు, ఘాజి, అర్జున్ రెడ్డి , బాహుబలి 2, జై లవకుశ, గరుడ వేగ, ఎం సి ఏ , చిత్రాలు ఉన్నాయి. అలాగే ఆనందో బ్రహ్మ , హలో , ఒక్క క్షణం, రారండోయ్ వేడుక చూద్దాం తదితర చిత్రాలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందాయి. పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతున్నాయి కానీ హిట్స్ మాత్రం తక్కువే అవుతున్నాయి దానికి కారణం రొటీన్ కథలు అలాగే రొటీన్ స్క్రీన్ ప్లే కావడమే . అయితే చెప్పుకోతగిన విషయం ఏమిటంటే కొత్త దర్శకులకు పట్టం కట్టారు ప్రేక్షకులు.

34 P టాలీవుడ్






గో

వా భామ ఇలియానా రహస్య వివాహం చేసుకున్నట్లు గతంలో టాలీవుడ్ చెప్పిన విషయం తెలిసిందే . అయితే నాకు - ఆండ్రు కి పెళ్లి కాలేదు మేమిద్దరం మంచి స్నేహితులం అని కొద్దిరోజులు , ఆ తర్వాత మేమిద్దరం సహజీవనం చేస్తున్నామని కొంతకాలం చెప్పుకుంటూ వచ్చింది అయితే అది నిజం కాదు ఇలియానా రహస్య వివాహం చేసుకుంది కానీ ఆ విషయం బయటకు చెప్పలేదు ఇప్పుడు మాత్రం క్రిస్మస్ సందర్బంగా రహస్య వివాహాన్ని పరోక్షంగా ఒప్పుకుంది ఇలియానా . జాగా క్రిస్మస్ సందర్బంగా ఓ ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఇలియానా . ఆ ఫోటో ని తీసింది నా భర్త అంటూ ట్వీట్ చేసింది దాంతో ఇలియానా రహస్య వివాహం వెలుగు చూసింది . ఇలియానా సన్నిహితులకు ఈ విషయం ముందే తెలుసు . ఆస్ట్రేలియా కి చెందిన ఆండ్రు తో కొంతకాలంగా ప్రేమలో ఉంది , ఇద్దరి మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో రహస్య వివాహం చేసుకుంది .

తా

టాలీవుడ్ P 35






హా

స్య చిత్రాలతో తమకంటూ ఓ ఒరవడి ని ఏర్పాటు చేసుకున్న హీరోలు అల్లరి నరేష్ , సునీల్ లు అయితే గతకొంత కాలంగా ఈ ఇద్దరు హీరోలు కూడా సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు . అల్లరి నరేష్ అయితే ఏకంగా అయిదేళ్ల నుండి సక్సెస్ కోసం తహతహలాడుతున్నాడు , ఈమధ్య చాలా చిత్రాల్లో నటించాడు కానీ అవన్నీ కూడా డిజాస్టర్ లు అయ్యాయి . సుడిగాడు మాత్రమే బ్లాక్ బస్టర్ అయ్యింది దాని తర్వాత వచ్చిన చిత్రాలన్నీ ప్లాప్ అవుతూనే ఉన్నాయి . ఇక సునీల్ విషయానికి వస్తే రోగా నటించిన మొదట్లో హిట్స్ కొట్టాడు కానీ పూల రంగడు , తడాఖా చిత్రాల తర్వాత నాలుగేళ్లుగా వరుస పరాజయాలు అందుకుంటున్నాడు . దాంతో ఈ ఇద్దరూ సక్సెస్ ల కోసం ఆరాటపడుతున్నారు . సుడిగాడు వంటి బ్లాక్ బస్టర్ తీసిన భీమనేని శ్రీనివాసరావు తాజాగా సుడిగాడు చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు , ఆ చిత్రంలో ఒక అల్లరి నరేష్ మాత్రమే కాకుండా సునీల్ ని కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది . సక్సెస్ కోసం ఇద్దరు ప్లాప్ హీరోలు ఒక్కటి అవుతున్నారు , తమ సుడి ఎలా ఉందో పరీక్షించుకోనున్నారు .

హీ

36 P టాలీవుడ్


సీ

నియర్ హీరో విక్టరీ వెంకటేష్ యంగ్ హీరో వరుణ్ తేజ్ లతో మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి . పటాస్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఆ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు , దాని తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తో సుప్రీమ్ వంటి హిట్ చిత్రాన్ని అందించాడు . ఆ తర్వాత రవితేజ తో రాజా ది గ్రేట్ చిత్రం చేసి ముచ్చటగా మూడో హిట్ కొట్టేసి హ్యాట్రిక్ ని తన ఖాతాలో వేసుకున్నాడు అనిల్ రావిపూడి .

చే

సిన మూడు చిత్రాలు కూడా సూపర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి కి మంచి డిమాండ్ ఏర్పడింది . దాంతో సీనియర్ హీరో వెంకటేష్ తో అలాగే వరుణ్ తేజ్ తో కలిసి మల్టీ స్టారర్ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఇక ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండటం విశేషం . వెంకటేష్ ఇటీవలే గురు చిత్రంతో హిట్ కొట్టిన విషయం తెలిసిందే . ఇక వరుణ్ కూడా ఫిదా చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు . మొత్తానికి ఈ నలుగురి కాంబినేషన్ లో వచ్చే '' F 2'' ( ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ) ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి .





టాలీవుడ్ P 37


మంత బాధపడుతోంది , అదేంటి ఇటీవలే అక్కినేని నాగచైతన్య ని ప్రేమించి పెళ్లి చేసుకుంది కదా ! ఆమెకు బాదేంటి ? అని ఆశ్చర్య పోతున్నారా ? ఈ బాధ నాగచైతన్య వల్ల కాదు కానీ నాగచైతన్య తో కలిసి నటించిన సినిమా వల్ల . సమంత తొలిచిత్రం '' ఏమాయ చేసావే '' . నాగచైతన్య - సమంత ల కాంబినేషన్ లో వచ్చిన ఏమాయ చేసావే చిత్రం సూపర్ హిట్ అయ్యింది అలాగే చైతు - సమంత ల మధ్య ప్రేమ కు అంకురార్పణ కూడా జరిగింది ఆ చిత్రం వల్లే ! ఆ విషయాన్నీ పక్కన పెడితే జెస్సీ క్యారెక్టర్ లో సమంత ని మినహా మరొకరిని ఊహించలేం అంతగొప్పగా నటించింది . దరి ప్రశంసలు అందుకుంది కట్ చేస్తే ..... ఇప్పుడు అదే జెస్సీ పాత్ర ...... ఏమాయ చేసావే చిత్రం అంటే బాధపడుతోంది సమంత దానికి కారణం ఏంటో తెలుసా ...... జెస్సీ పాత్రలో బాగా నటించావని ఏడేళ్ల తర్వాత కూడా అంటున్నారంటే ఈమధ్య నేను నటించిన సినిమాలు బాగో లేవా ? లేక నేను వాటిల్లో బాగా నటించలేదా ? అంటూ అసహనానికి గురౌతోంది . జెస్సీ పాత్ర ని పొగడటం ఇష్టమే కానీ అంతకుమించి చాలా చిత్రాల్లో నటించాను వాటిని ఎవరూ చెప్పడం లేదే అని బాధపడుతోంది . అయినా మొదటి సినిమా పైగా అందమైన అభినయం ఉన్న సినిమా కావడంతో చెబుతున్నారు దానికి సంతోషించాల్సింది పోయి బాధపడటం ఏంటో ?

అం





38 P టాలీవుడ్


          



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.