TOLLYWOOD.NET MAY 2018 | VOL 15 | ISSUE 5 | Rs.25/-
/tollywood
/tollywood
p
RNI NO: APTEL/2003/10076
ముఖ్య కథనాలు
“KEEP YOUR FACE ALWAYS TOWARD THE SUNSHINE - AND SHADOWS WILL FALL BEHIND YOU.”
Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Publication Consultant Distributed By
: : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
అ Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MAY 2018
ర్జున్ రెడ్డి వంటి సంచలన చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అనూహ్యంగా పెరిగిపోయింది దాంతో అతడితో సినిమాలు నిర్మించడానికి పలువురు దర్శక నిర్మాతలు పోటీ పడుతున్నారు . ఒప్పుకున్న చిత్రాలతో చాలా బిజీ గా ఉన్నాడు విజయ్ దేవరకొండ . తెలుగు , తమిళ్ బాషలలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ''నోటా '' చిత్రంలో నటిస్తున్నాడు ఈ హీరో అయితే ఆ సినిమాలో ఒక హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకున్నారు కాగా ఇప్పుడేమో మరో భామని కూడా
హీరోయిన్ గా తీసుకునాన్నారు . డల్ గా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తున్న హాట్ భామ '' సంచనా నటరాజన్ '' ని ఎంపిక చేసారు . అసలే హాట్ భామ ఆపై కుర్ర హీరో విజయ్ దేవరకొండ తో రొమాన్స్ అంటే ఇక ప్రేక్షకులకు అందునా కుర్రకారు కి పండగే పండగ అన్నమాట . అర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన విజయ్ దేవరకొండ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న నోటా చిత్రంతో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి .
మో
యం
గ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలనీ భావించాడు రచయిత వక్కంతం వంశీ , టెంపర్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తనకు ఇవ్వడంతో ఇక వక్కంతం వంశీ ని దర్శకుడిగా పరిచయం చేయాలనీ అనుకున్నాడు ఎన్టీఆర్ అసలు ఎన్టీఆర్ సినిమాతోనే వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం కావాలి కానీ ఎన్టీఆర్ కోసం వక్కంతం వంశీ రెడీ చేసిన కథ నచ్చకపోవడంతో ఆ సినిమా పక్కకు పోయింది , ఆ సమయంలో వక్కంతం వంశీ కి ఎన్టీఆర్ కు మధ్య గొడవ
జరిగినట్లు వార్తలు వచ్చాయి కట్ చేస్తే ఇన్నాళ్లకు వక్కంతం వంశీ స్పందించాడు . అసలు ఎన్టీఆర్ కు నాకు గొడవ జరగలేదు కేవలం అభిప్రాయబేధాలు మాత్రమే వచ్చాయని అంటున్నాడు . న్టీఆర్ కు కథ నచ్చకపోవడంతో నిరాశలో ఉన్న సమయంలో అల్లు అర్జున్ కోసం కథ ఉంటే చెప్పమని కోరారట బుజ్జి అనే నిర్మాత దాంతో నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే కథ చెప్పాడు , ఆ కథ అల్లు అర్జున్ కు నచ్చడంతో దర్శకుడిగా మారాడు .
ఎ
ఆం
ధ్రప్రదేశ్ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు పార్టీ అయిన తెలుగుదేశం ని ఓడించడమే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లక్ష్యమట ! గత ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు కి మద్దతుగా నిలిచిన పవన్ 2019 లో జరగబోయే ఎన్నికల్లో మాత్రం ప్రత్యర్థిగా రంగంలోకి దిగుతున్నాడు . ఆంధప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలలో జనసేన పోటీ చేస్తుందని అధికారికంగా ప్రకటించాడు పవన్ కళ్యాణ్ . చంద్రబాబు ని ఓడించడమే లక్ష్యంగా అటు జగన్ ఇటు పవన్ కళ్యాణ్ లు పోటీ పడుతున్నారు అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా చంద్రబాబు ఓటమి ని కోరుకుంటోంది ప్రగాడంగా .
ఇ
ప్పటివరకైతే ఎన్నికల పొత్తు లేదు కానీ తీరా ఎన్నికల సమయానికి మాత్రం జనసేన బీజేపీ తో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యం లేదు ఎందుకంటే చంద్రబాబు ని ప్రత్యేక హోదా విషయంలో కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో జరుగుతున్న అవినీతి పై కానీ అదేపనిగా విమర్శిస్తున్నారు పవన్ కానీ ప్రధాని నరేంద్ర మోడీ ని మాత్రం పల్లెత్తు మాట కూడా అనడం లేదు దాంతో ఎన్నికల నాటికి పొత్తు ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . పొత్తుల మాట ఎలా ఉన్నప్పటికీ అధికారంలో ఉన్న చంద్రబాబు ని అధికారానికి దూరం చేయాలనీ కంకణం కట్టుకున్నాడు పవన్ . అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్నామని ప్రకటించాడు . 3 P టాలీవుడ్
TOLLYWOOD join hands with kadambari
Manam Saitam
టాలీవుడ్ P 4
స్వా
తి, శ్రీ దివ్య, ఆనంది.. వీరందరు తెలుగు హీరొయిన్ లు. తమిళంలో సక్సెస్పుల్ కధానాయికలుగా వెలుగొందినవారు. ఇప్పుడీ లిస్ట్ లొ మనాలీ రాథోడ్ కూడా చెరనుంది. తెలుగులో ఎమ్.ఎల్.ఎ, ప్యాషన్ డిజైనర్, హౌరా బ్రిడ్జి లాంటి సినిమాల్లో నటించిన మనాలీకి తొలి తమిళ సినిమా ఆఫర్ వచ్చింది. వరలక్ష్మి శరత్ కుమార్ పూనమ్ బజ్వా ,ఆత్మిక ప్రధాన పాత్రల్లొ డికె దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మిస్తొన్న "కాతెరి" త్రంలొ మనాలీ లీడ్ రోల్ లో నటిస్తొంది. తమిళ సినిమాలంటే స్వతహాగా ఇష్టపడే తనకు విజయ్ సేతుపతి, శివకార్తీకేయనల సినిమాలను అభిమానిస్తానని, వారితో నటించె అవకాశం కొసం ఎదురు చూస్తున్నానంటోంది మనాలీ.
చి
యం
గ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ ని దిగ్విజయంగా పూర్తిచేసుకుంది . కాగా ఈ సినిమాకు ఇంకా పేరు నిర్ణయించలేదు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ''అసామాన్యుడు'' అనే టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది . రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అసామాన్యుడు పెట్టాలని భావిస్తున్నారట .
ఇం
కా అధికారికంగా ప్రకటించలేదు కానీ అసామాన్యుడు తో పాటుగా మరికొన్ని పేర్లు కూడా పరిశిలీస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్ . ఎన్టీఆర్ ఇప్పటివరకు రాయలసీమ నేపథ్యంలో పలు చిత్రాలు చేసాడు కానీ వాటికీ భిన్నంగా ఈ సినిమా ఉంటుందట . ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించనుంది . త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన '' అజ్ఞాతవాసి '' డిజాస్టర్ కావడంతో ఎన్టీఆర్ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నాడు . అందుకే రాయలసీమ ఫ్యాక్షన్ ని నమ్ముకున్నాడు .
ఎ
ద అందాలను కుర్రాళ్లకు చూపిస్తూ పిచ్చ షాక్ ఇచ్చింది హాట్ భామ ప్రియాంక చోప్రా . తాజాగా ఈ భామ వేసుకున్న డ్రెస్ సరికొత్త వివాదాన్ని రాజేసింది .మోకాళ్ళ పై వరకు ఉన్న సఫారి లాంటి డ్రెస్ లో ఎద భాగం దగ్గర రెండు వైపులా కిటికీ లలాగా కట్ చేసి ఉండటం వల్ల ఎద అందాలు బయటకు తొంగిచూస్తున్నాయి దాంతో ప్రియాంక చోప్రా తాజా ఫోటో వైరల్ అవుతోంది అంతేకాదు పలువురు నెటిజన్లు ప్రియాంక ని ట్రోల్ చేస్తున్నారు కూడా .
అ
సలే ఎండాకాలం దాంతో ఇలా సరికొత్త ఫ్యాషన్ అనిపించేలా ప్రియాంక వేసుకున్న డ్రెస్ కుర్రాళ్లకు మంచి కనువిందు అనే చెప్పాలి . క్లీవేజ్ అందాలు బయటకు తొంగి చూస్తుంటే కుర్రాళ్ళ గుండె లయ తప్పుతోంది . ఇప్పటికే హాలీవుడ్ లో పలు టివి సిరీస్ లలో నటించిన ఈ భామ హాలీవుడ్ నుండి మకాం మార్చుతోంది , అక్కడ ఎంతగా అందాలను ఆరబోసినా అనుకున్న రేంజ్ లో స్టార్ డం ని అందుకోలేకపోయింది ప్రియాంక దాంతో మళ్ళీ బాలీవుడ్ నే నమ్ముకోవాలి అని భావిస్తోందట .
5 P టాలీవుడ్
మ
హానటి చిత్రం మే 9న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఆ చిత్ర శాటిలైట్ రైట్స్ కి ఫుల్ డిమాండ్ ఏర్పడింది . మహానటి శాటిలైట్ హక్కుల కోసం జెమిని టివి తో పాటుగా జీ తెలుగు చానల్ వాళ్ళు కూడా పోటీ పడ్డారు అయితే అశ్వనీదత్ కు సదరు చానల్ వాళ్ళు ఇస్తున్న ఆఫర్ నచ్చకపోవడంతో సినిమా విడుదలకు ముందు అమ్మలేకపోయాడు కట్ చేస్తే సినిమా ఇప్పుడు సూపర్ హిట్ అవుతుండటంతో శాటిలైట్ రైట్స్ కు డిమాండ్ ఏర్పడింది .
ఖ
మ్, తనిష్క్ రాజన్, షానీ, పృథ్వీ రాజ్, యూ సమీర్, లోహిత్ ప్రధాన పాత్రల్లో సారా క్రియేషన్స్ పై గౌతమ్ రాజ్ కుమార్ దర్శక త్వంలో రమా గౌతమ్- కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `దేశంలో దొంగలు పడ్డారు`. ఈ సినిమా ఇటీవల షూటిగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంత పనులు తుది దశలో ఉన్నాయి. సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, `ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తయింది. వైజాగ్, సీలేరు, చింతపల్లి, డొంకరాయ, హైదరాబాద్ తదితర ప్రదేశాల్లో షూటింగ్ చేసాం. ఇప్పటివరకూ ఆంధ్ర ప్రదేశ్ లో ఎవ్‌రూ చేయని లోకేషనలో ్ల షూటింగ్ చేసాం. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. హ్యామన్ ట్రాఫికింగ్ అంశాన్ని హైలైట్ చేస్తూ తెరకెక్కిస్తున్నాం. ఇప్పుడు సమాజంలో జరుగుతోన్న పరిస్థితులను ప్రతిబింబిస్తూ కథను తెరకెక్కించాం. ఓ కాన్సెప్ట్ లా తీర్చిదిద్దాం. కథలో రొమాన్స్ కు ప్రాధాన్యతుంది.
ఈ
యువతకు బాగా చేరువవుతుంది. సినిమా బాగా వచ్చింది. కథన ం ఆసక్తికరంగా సాగుతుంది. అనుకున్నది అనుకున్నట్లు తీయగలిగాను. క్రైమ్ సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాత్రలన్ని వేటికవి ప్రత్యేకంగా కనిపిస్తాయి. డబ్బింగ్ పూర్తయింది. ఆర్.ఆర్. కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. మే ద్వితియార్థంలో టీజర్ రిలీజ్ చేస్తాం. జూన్ లో సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్నాం` అని అన్నారు. త్ర నిర్మాతల లో ఒకరైన కార్తికేయ మాట్లాడుతూ,` కథకు తగ్గ మంచి నటీనటులు కుదిరారు. నటీనటులంతా బాగా నటించారు. షూటింగ్ పూర్తయింది. అవుట్ ఫుట్ బాగా వచ్చింది. క్రైమ్ జోనర్లో కొత్త అనుభూతినిచ్చే చిత్రమిది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఈనెలలో టీజర్ రిలీజ్ చేస్తాం. అలాగే జూన్ లో సినిమా రిలీజ్ చేస్తాం` అని అన్నారు.
చి
ప్రే
మ కథా చిత్రం, జక్కన్న వంటి బ్యాక్ టూ బ్యాక్ సూపర్ హిట్స్ తో ఆర్ పి ఏ క్రియేషన్స్ మంచి పేరు సంపాదించింది. ఇప్పుడు ప్రేమ కథా చిత్రం కు సీక్వెల్ ప్లాన్ చేసింది. ఆర్ పి ఏ క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెంబర్ 3 గా ఆర్. సుదర్శన్ రెడ్డి నిర్మాతగా "ప్రేమ కథా చిత్రం 2" సినిమా సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. 'బ్యాక్ టూ ఫియర్' అనేది క్యాప్షన్. సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్నారు. సీనియర్ డైరెక్టర్ సాగర్ క్లాప్ కొట్టారు. అమరేందర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. అఖిల్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. హరి కిషన్ ఈ చిత్రం తో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. సందర్భంగా చిత్ర నిర్మాత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ఆర్ పి ఏ క్రెయేషన్స్ బ్యానర్లో వచ్చిన ప్రేమ కథా చిత్రం, జక్కన్న సూపర్ హిట్స్ గా మా సంస్థ కు మంచి పేరు తీసుకొచ్చాయి. ప్రేమ కథా చిత్రం హిలేరియస్ కామెడీ తో ట్రెండ్
ఈ
టాలీవుడ్ P 6
క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా ప్రేమ కథా చిత్రం 2 ప్రారంభించాం. సుమంత్ ఆశ్విన్ హీరోగా నటిస్తున్నారు. హరి కిషన్ ను దర్శకుడు గా పరిచయం చేస్తున్నాం. కామెడీ ఎంటర్టైనర్ గా అన్ని వర్గాల్ని ఎంటర్ టైన్ చేసే కథ ఇది. మా బ్యానర్ కి మరొక సూపర్ హిట్ చిత్రం గా నిలుస్తుందని నమ్ముతున్నాం. సీనియర్ కెమెరామెన్ సి.రాం ప్రసాద్, ఎడిటర్ ఉద్ధవ్, సంగీతం జెబి డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ లాంటి టెక్నీషియన్స్ మెయిన్ పిల్లర్స్ గా ఈ సినిమా రూపొందిస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. అని అన్నారు. సాంకేతిక నిపుణులు : కెమెరామెన్ - సి. రాం ప్రసాద్, ఎడిటర్ - ఉద్ధవ్, సంగీతం - జెబి డైలాగ్ రైటర్ - చంద్ర శేఖర్ ఆర్ట్ - అశోక్ కో ప్రొడ్యూసర్స్ - ఆయుష్ రెడ్డి, ఆర్ పి అక్షిత్ రెడ్డి నిర్మాత - ఆర్. సుదర్శన్ రెడ్డి దర్శకుడు - హరి కిషన్
ఇ
తర పాత్రల్లో గిరిధర్, జబర ్దస్త్ రాఘవ, వినోద్, తడివేలు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శేఖర్ గంగనమోని, సంగీతం: శాండీ, ఎడిటింగ్: మధు. జి. రెడ్డి, కళ: మధు రెబ్బా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కరుణాకర్, లైన్ ప్రొడ్యూసర్: సాయికుమార్ పాలకూరి, సహ నిర్మాత: సంగతోష్ డొంకాడ.
ఇ
క ఇప్పుడు జీ తెలుగు ఛానల్ అలాగే జెమిని టివి లతో పాటుగా రంగంలోకి స్టార్ మా కూడా చేరింది . మహానటి అద్భుత దృశ్య కావ్యం అని దాన్ని సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు సదరు ఛానల్ వాళ్ళు . దాంతో అశ్వనీదత్ మంచి రేటు ఎవరు ఇస్తే వాళ్లకు సినిమా ని అమ్మాలని చూస్తున్నాడు . మహానటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు జేజేలు పలుకుతున్నారు . మళ్ళీ ఇన్నాళ్లకు వైజయంతి సంస్థ కు ఓ బ్లాక్ బస్టర్ వచ్చింది .
అ
ర్జున్ రెడ్డి చిత్రంతో ప్రభంజనం సృష్టించిన హీరో విజయ్ దేవరకొండ . ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది . ఇప్పుడు వరుసగా చిత్రాలు చేస్తున్నాడు . టాక్సీవాలా చిత్రం విడుదలకు సిద్ధం అవుతుండగా , కొత్త దర్శకుడి తో చేస్తున్న సినిమా కూడా పూర్తి కావచ్చింది . కమ్మ భరత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రానికి '' డియర్ కామ్రేడ్ '' అనే టైటిల్ ని పెట్టారు . యర్ కామ్రేడ్ అనగానే ఇదేదో విప్లవాత్మక చిత్రమని అనుకోవద్దని , ప్రేమకథా చిత్రమని అయితే అందులో ట్విస్ట్ ఉంటుందని అంటున్నారు ఆ చిత్ర బృందం . విజయ్ దేవరకొండ కు అర్జున్ రెడ్డి చిత్రం వల్ల మంచి ఫాలోయింగ్ ఏర్పడింది దాంతో ఈ డియర్ కామ్రేడ్ సినిమా పట్ల కూడా మంచి అంచనాలు నెలకొనేలా ఉన్నాయి .
డి
నా
పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో జరిగిన ఓ తప్పు హీరో అల్లు అర్జున్ వల్ల జరిగింది తప్ప నావల్ల జరగలేదు అంటూ ఆ తప్పు ని అల్లు అర్జున్ మీద నెట్టేశాడు దర్శకులు వక్కంతం వంశీ . రచయిత అయిన వక్కంతం వంశీ ని నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేసాడు అల్లు అర్జున్ . ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది . అయితే అల్లు అర్జున్ నటన కు మాత్రం ప్రేక్షకుల ప్రశంసల తో పాటుగా విమర్శకుల ప్రశంసలు కూడా లభిస్తున్నాయి .
ఈ
సినిమాలో ఒక సన్నివేశంలో తల్లి తో మాట్లాడే సన్నివేశం ఉంటుంది అయితే ఆ సన్నివేశంలో తల్లి కొడుకు పాత్ర ని గుర్తు పట్టదు , యుక్త వయసు లో ఇంటి నుండి వెళ్ళిపోతాడు హీరో . అయితే పెరిగి పెద్ద అయిన తర్వాత కనీసం తన కొడుకు ని కొద్దిగా నైనా గుర్తు పట్టే వీలుంటుంది దానికి తోడు హీరో కనుబొమ్మ మీద గాయం ఉంటుంది కనీసం ఆ గాయం ని చూసైనా తల్లి గుర్తు పట్టాలి కానీ ఆ తప్పు దొర్లిపోయింది దాంతో అది నా తప్పే ! అయితే నేను సూర్య పాత్ర అనుకున్నప్పుడు కనుబొమ్మ మీద గాయం లేదని అది అల్లు అర్జున్ ఐడియా అని దాంతో తప్పు దొర్లిందని ఆ తప్పు ని అల్లు అర్జున్ మీద నెట్టేశాడు వక్కంతం వంశీ .
వి
వేక్ విశాల్, తరుణికాసింగ్, యామిని నాయకానాయికలుగా వై.వై.వి క్రియేషన్స్ పతాకంపై సుకు పూర్వాజ్ దర్శకత్వంలో మారుతి వన్నెంరెడ్డి నిర్మిస్తోన్న `యు` అనే చిత్రం ఇటీవల హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రచయిత కోన వెంకట్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. సీనియర్ దర్శకు లు వి. సాగర్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం మీడియా సమావేశంలో... త్ర దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ, ` దర్శకుడిని కాకముందు కొన్ని డెమోస్ తీసాను. అందులో `కాలజ్ఞానం` అనేది ఒకటి. న్యూయార్క్, బాంబే తదితర ప్రదేశాల్లో ఈ డెమో ప్రదర్శన జరిగింది. ఇప్పుడిదే డెమోను పూర్తి కథతో సినిమాగా చేస్తున్నా. మనిషి సృష్టించుకుంటోన్న అభివృద్దే వినాశనానికి కారణమని చెప్పబోతున్నా. పంచభూతాలు మాట్లాడవు? కానీ ధర్మాన్ని పాటిస్తాయి. మనిషి ఎక్కువగా మాట్లాడుతాడు. కానీ ధర్మాన్ని పాటించడు. ఈ అంశాలను హైలైట్
చి
చేస్తూ తీయబోతున్నా. ఇదొక యూనిక్ సబ్జెక్ట్. మంచి నిర్మాత కుదిరారు. ఆయనకు పరిశ్రమలో 25 ఏళ్ల పాటు అనుభవం ఉంది. సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా` అని అన్నారు. త్ర నిర్మాత మూర్తి వన్నెంరెడ్డి ,` నిర్మాత కాకముందు రామానాయుడు స్టూడియో, శబ్ధాలయ స్టూడియోస్ లో పనిచేసా. ఇండస్ర్టీలో 25 ఏళ్ల నుంచి ఉంటున్నా. ఇప్పుడీ సినిమాతో నిర్మాతగా పరిచయం కావడం సంతోషంగా ఉంది. మంచి కథ ఇది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తా. వైజాగ్, అరకు, పాడేరు ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తిచేస్తాం` అని అన్నారు. రో వివేక్ విశాల్ మాట్లాడుతూ, `యూనివర్శల్ సబ్జెక్ట్ ఇది. కథ చాలా బాగా వచ్చింది. సినిమా కూడా అంతే బాగా వస్తుంది. మంచి టీమ్ కుదిరింది` అని అన్నారు. సినిమాలో అవకాశం పట్ల హీరో, హీరోయిన్లు ఆనందం వ్యక్తం చేసారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వద్, కో-డైరెక్టర్- శంకర్ నిమ్మన.
చి
హీ
7 P టాలీవుడ్
డ్యా
న్స్ మాస్టర్ ప్రభుదేవా -హీరోయిన్ నికిషా పటేల్ లు పెళ్లి చేసుకోనున్నారా ? ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ పెళ్లి వార్తలు గుప్పుమంటున్నాయి . కొమరం పులి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది నికిషా పటేల్ . అయితే ఆ సినిమా ప్లాప్ కావడంతో పాపం పెద్ద స్టార్ అవుదామని వచ్చిన ఈ భామని తెలుగులో పట్టించుకోవడమే మానేశారు అయితే పవన్ సరసన నటించింది కాబట్టి అడపా దడపా ఈ భామకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి .
ఇ
క ప్రభుదేవా తో ఈ భామకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి , దాంతో పెళ్లి అంటూ గుసగుసలు మొదలయ్యాయి . ప్రభుదేవా కు ఎప్పుడో పెళ్లయ్యింది ఇద్దరు పిల్లలు కూడా పైగా వాళ్ళు పెద్దవాళ్ళు కూడా . అయితే నయనతార ని ప్రేమించడం వల్ల భార్య రామాలత్ కు విడాకులు ఇచ్చాడు . ఇక నయనతార తో పెళ్లి కావడమే తరువాయి అని అనుకుంటున్న సమయంలో ఆ పెళ్లి పెటాకులు అయ్యింది . దాంతో అప్పటి నుండి మళ్ళీ పెళ్లి చేసుకోలేదు ప్రభుదేవా . అయితే ఇప్పుడు మాత్రం ప్రభుదేవా - నికిషా పటేల్ ల పెళ్లి అంటూ గుసగుసలు మొదలయ్యాయి .
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో
శ్రీ
తిరుమలతిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న 9 చిత్రం ఫిలింనగర్ సాయి బాబా టెంపుల్ లో ప్రారంభమైంది. గుగవర ఈ చిత్రానికి దర్శకుడు. వసంత్ సమీర్, సెహర్ హీరొ హీరొయిన్లుగా , శ్రీహర్ష, రవివర్మ ముఖ్య పాత్రలొ నటిస్తున్నారు. ముహూర్తపు షాట్ కు జి.నాగేశ్వర రెడ్డి క్లాప్ నివ్వగా, దేవి ప్రసాద్ కెమెరా స్విచ్చాన్ చెశారు. సినీయర్ దర్శకులు అజయ్ కుమార్ గౌరవ దర్శకత్వం వహించారు.
నా
మా
నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ... బ్యానర్ లొ ఇది 9వ చిత్రం. జర్నలిస్ట్ వినాయక రావు గారి ద్వారా దర్శకుడు నాగు పరిచయమమయ్యాడు. తను విలువైన క్రైమ్ సబ్జెక్ట్ చెప్పాడు. ది బెస్ట్ కాంబొ లొ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. బిచ్చగాడు,డి16 తరహాలొనె విభిన్నమైన చిత్రమిది. ఈ టీమ్ అందరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నానన్నారు ర్శకుడు నాగు గవర మాట్లాడుతూ.. వీకెండ్ లవ్ తరువాత సమయం తీసుకుని, వినాయకరావు గారి ద్వారా ఈ సినిమా చేస్తున్నాను
ద
. చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మాతగా పెద్ద బ్యానర్ లొ ఈ చిత్రాన్ని చేస్తున్నాను . కాటెంపరరీ క్రైమ్ కు సంబందించిన కథ ఇది. రియలిస్టిక్ గా గ్రిప్పింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. మంచి టీమ్ ఈ సినిమాకు సెట్ అయింది. ఈ నెల 14 నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తామన్నారు. జయ్ కుమార్ మాట్లాడుతూ. మిత్రులు చదలవాడ శ్రీనివాసరావు గారు యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చెస్తూ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కొత్తదనం తో వస్తొన్న ఈ టీమ్ కు మంచి పేరు రావాలని ఆశిస్తున్నానన్నారు. సన్న కుమార్ మాట్లాడుతూ.. పెద్ద రేంజ్ సినిమాలు చెసె స్థాయి ఉన్నా, కొత్త కాన్సెప్ట్ లను , టాలెంట్ ను ఎంకరేజ్ చెయాలని చదలవాడ శ్రీనివాసరావుగారు ఈ సినిమా చేస్తున్నారు . నాగు దర్శకుడిగా సక్సెస్ కొడతాడన్నారు.
అ ప్ర
అ
హీరో వసంత్ సమీర్ మాట్లాడుతూ.. వకాశమిచ్చిన దర్శకనిర్మాతలకు దన్యవాదాలు. మా టీమ్ కు విజయం లభిస్తుందని అశిస్తున్నానన్నారు. కా ఈ కార్యక్రమంలొ సెహర్ , రవి వర్మ, శ్రీహర్ష, శ్రావణ్ భరద్వాజ్ తదితరలు
ఇం
వ
పాల్గొన్నారు సంత్ సమీర్(తొలి పరిచయం), సెహర్(తొలి పరిచ) , రవివర్మ, శ్రీ హర్ష, జబర్దస్త్ రాం ప్రసాద్ , రఘుబాబు, ,కాదంబరి కిరణ్, నీలిమ, జెమిని సురేష్, కమల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ద
శాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల సేవలందిస్తున్న ఫిలిం ఎనాలిటికల్ అండ్ అప్రిషియేషన్ సొసైటీ(ఫాస్) - దాసరి 2018 ఫిలిం అవార్డులను మే 6న హైదరాబాద్‌లోని శ్రీత్యాగరాయ గానసభ వేదికగా ప్రదానం చేశారు. సంస్థ అధ్యక్షులు, పూర్వ సెన్సార్ బోర్డు సభ్యులు డా|| కె.ధర్మారావు ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. స్ - దాసరి కీర్తి కిరీట సిల్వర్ క్రౌన్ అవార్డులను దర్శకులు కోడి రామకృష్ణ, టి.వి. రంగ సుప్రసిద్ధులు సుమ కనకాలకు అందజేశారు. సరి జీవన సాఫల్య పురస్కారాన్ని సూపర్‌హిట్‌సినీ వారపత్రిక ఎడిటర్‌అండ్ పబ్లిషర్, సూపర్‌హిట్ చితాల్ర పి.ఆర్.ఓ, ప్రముఖ
ఫా
టాలీవుడ్ P 8
దా
సినిమాటోగ్రఫీ: దుర్గా కిషోర్ బొయడపు, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, సంగీతం: శ్రావణ్ భరద్వాజ్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్: అనీ, స్టూమ్స్: టి.ఎస్.రావు, కాస్టూమ్స్ డిజైనర్: మంజుల భూపతి, నిర్మాత: చదలవాడ పద్మావతి, రచన- దర్శకత్వం:నాగు గవర.
కా
అ
నిర్మాత బి.ఎ.రాజు అందుకున్నారు. వార్డు అందుకున్న బి.ఎ.రాజు మాట్లాడుతూ," దాసరి గారి పేరు మీద పెట్టిన ఈ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. అవార్డు ఇచ్చి గౌరవించిన కమిటీ కి, సహాయ, సహకారాలు అందించిన కుటుంబ సభ్యులకి, సినిమా పరిశ్రమ కి, తోటి జర్నలిస్ట్ మిత్రులకీ కృతజ్ఞతలు. ఈ వేదిక మీద అవార్డు అందుకుంటున్న తోటి అవార్డు గ్రహీతలకు అభినందనలు". తర అవార్డులు డైరెక్టర్ ఆఫ్ ది ఇయర్(ఫిదా) శేఖర్ కమ్ముల, ఉత్తమ గేయరచయిత సుద్దాల అశోక్‌తేజ, ఉత్తమ గాయని మధుప్రియ, ప్రశంసా దర్శకుడు అవార్డు వడ్డేపల్లి కృష్ణ(లావణ్య విత్ లవ్‌బాయ్స్), దాసరి ప్రతిభా పురస్కారాలను సంపూర్ణేష్‌బాబు, శివపార్వతి, సంగీత దర్శకులు వాసూరావు, మాటల రచయిత సంజీవి అందుకోగా, దాసరి విశిష్ట సేవా పురస్కారాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు లయన్ డా. ఎ.నటరాజుకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఇ
కె
ఎస్‌పి ప్రొడక్షన్స్ పతాకంపై యలమంచిలి ప్రవీణ్ సమర్పణలో డా.ఎ.స్. కీర్తి, డా.జి. పార్థసారథి రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం `నీతోనే హాయ్ హాయ్`. బియన్ రెడ్డి అభినయ దర్శకు డు. అరుణ్ తేజ్ , ఛరిష్మా శ్రీకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకు డు బియన్ రెడ్డి అభినయ మాట్లాడుతూ...``మా నిర్మాతల పూర్తి సహకారంతో తొలి షెడ్యూల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో విజయవంతంగా పూర్తి చేశాం. నటీనటలు, సాంకేతిక నిపుణులు సపోర్ట్ చేయడంతో అనుకున్న విధంగా తీయగలిగాను. ఈ నెల 20 నుంచి రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నాం. పది రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ లో టాకీతో పాటు ఒక పాట చిత్రీకరించనున్నాం. దీంతో టాకీ పార్ట్ మొత్తం పూర్తవు తుంది. మే నెల లో మిగిలిన మూడు పాటలలో రెండు పాటలు కేరళలోని మున్నార్ లో , మరో పాట వైజాగ్ లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నాం. డబ్బు న్న వ్యక్తుల
వ్వక్తిత్వాలు, మధ్య తరగతి వారి మనస్తత్వాలు ఎలా ఉంటాయనే ఆసక్తికరమైన అంశానికి క్యూట్ లవ్ స్టోరి మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం`` అన్నారు. త్ర నిర్మాతలు డా.ఎస్. కీర్తి, డా. జి. పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ...``బి.యన్.రెడ్డి గారికి సినీ పరిశ్రమలో ఉన్నఅనుభవంతో అద్భుతంగా తొలి షెడ్యూల్ ఎక్కడా ఇబ్బంది లేకుండా పూర్తి చేశారు. ఏ విషయంలో రాజీ పడకుండా సినిమాను గ్రాండ్ గా నిర్మించడానికి దర్శకుడికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం. దర్శకుడిగా తనకు నిర్మాతలు గా మాకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రమవు తుందన్న నమ్మకం ఉంది. ఇక మీదట జరగబోయే షెడ్యూల్స్ లో కూడా మా యూనిట్ ఇలాగే సహకరి స్తారని ఆశిస్తున్నాం. కృష్ణ ప్రియ పై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలుస్తుందని`` అన్నారు. త్ర సమర్పకులు యలమంచిలి ప్రవీణ్ మాట్లాడుతూ...`` సీనియర్ నటీనటలుతో పాటు ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఈ
చి
చి
చిత్రం రూపొందుతోంది. దర్శకుడు బియన్ రెడ్డిగారికి సినీ ఇండస్ర్టీలో ఉన్న అపారమైన అనుభవంతో సినిమాను అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. వైద్యరంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రముఖ న్యూరాలజిస్ట్ డా.ఎస్.కీర్తిగారు, గైనాకాలజిస్ట్ డా.జి. పార్థసారథిరెడ్డిగారు ఈ చిత్రాన్ని రాజీ పడకుండా అభిరుచితో నిర్మిస్తున్నారు``అన్నారు. నంద్, బెనర్జీ, ఏడిద శ్రీరామ్, జయచంద్ర, రత్న ప్రభ, శ్రీప్రియ, జబర ్దస్త్ రామ్ ప్రసాద్, జబర్దస్త్ పవన్, అడప రామారావు, రవి ఆనంద్, తదితరులు నటించిన ఈ చిత్రానికి డి.ఓ.పిః ఈదర
ఆ
ప్రసాద్; సంగీత దర్శకుడుః రవి కళ్యాణ్; సాహిత్యంః వెంకట బాలగోని, ప్రవీణ్; కొరియోగ్రఫీః సాయి రాజ్; ప్రొడక్షన్ కంట్రోలర్ః మట్టా కృష్ణారెడ్డి; కో-డైరక్టర్ః నవీన్; ఫైట్స్ః రవి; ఆర్ట్ః సుబ్బారావు పి.ఆర్.ఓః రమేష్ చందు; అసోసియేట్ డైరక్టర్ః మహేష్; అసిస్టెంట్ డైరక్టర్ః వెంకట్ డి, సిసింద్రి; పబ్లిసిటీ డిజైనర్ః ఇమేజ్ 7; మేకప్ః బి.యన్.బాబు; కాస్ట్యూమ్స్ః కృష్ణ; సమర్పణః యలమంచిలి ప్రవీణ్; ప్రొడ్యూసర్స్ః .డా. ఎ.స్. కీర్తి, డా.జి.పార్థసారథి రెడ్డి; కథ-స్ర్కీన్ ప్లేడైలాగ్స్-డైరక్షన్ః బి.యన్.రెడ్డి అభినయ.
భా
ను ఎంటర్‌టైన్‌మెంట్స్- `శ్రీ సాయి అమృతలక్ష్మి క్రియేషన్స్ బేనర్స్ పై గోదారి భానుచందర్ నిర్మిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ దర్శక త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రారంభోత్సవం ఇటీవల ఫిలింనగర్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకు లు వి.సాగర్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నివ్వగా ధవళ సత్యం కెమెరా స్విచాన్ చేశారు. నటుడు, దర్శకుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శక త్వం వహించారు. దర్శకు డు వీర శంకర్ స్ర్కిప్టు అందించారు. నంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు సుమన్ మాట్లాడుతూ...```ఫ్యామిలీ నేపథ్యంలో సాగే క్రైమ్
అ
సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. కథ నచ్చి నటిస్తున్నాను. నిర్మాతకు సినిమాల పట్ల మంచి ప్యాషన్ ఉంది. దర్శకు డు గతంలో కొరియోగ్రాఫర్ గా చాలా చిత్రాలు చేశాడు. మంచి కాన్సెప్ట్స్ తో , క్లారిటీతో ఈ సినిమా చేస్తున్నాడు. ప్రతి ఇంటికి ఒక హీరో ఉంటాడు. అది చిన్నవారు కావచ్చు ,పెద్దవారు కావచ్చు..ఆ విధంగా నేను ఈ సినిమాలో ఒక ఇంటికి హీరోగా లీడ్ రోల్ లో నటిస్తున్నా`` అన్నారు. ర్శకు డు పాలిక్ మాట్లాడుతూ...``కొరియోగ్రాఫర్ గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్రాలకు పని చేశాను. ఒక చిల్డ్రన్ ఫిల్మ్ కి డైరక్షన్ కూడా చేశాను. `సడి` నా రెండో సినిమా. నిర్మాత నాతో రెండేళ్లుగా జర్నీ చేస్తున్నారు. ఒక మంచి పాయింట్ తో సినిమా చేద్దామని ఈ సినిమా చేస్తున్నాం. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొన్న ఊహించని పరిణామాలే ఈ చిత్రం. మే నెలాఖరులో
ద
షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్ లో కంప్లీట్ చేస్తాం. సుమన్ గారికి హండ్రెడ్ పర్సంట్ సరిపోయే పాత్రిది. ఒక ప్రముఖ హీరోయిన్ నటించనున్నారు. త్వరలో ఎవరనేది ప్రకటి స్తాం`` అన్నారు. ర్మాత గోదారి భానుచందర్ మాట్లాడుతూ...``ఇటీవల కాలంలో మంచి కాన్సెప్ట్స్ తో వచ్చే చిన్న చిత్రాలను ఆదరిస్తున్నారు. ఓ విభిన్న మైన కథాంశంతో `సడి` చిత్రాన్ని చేస్తున్నాం. సుమన్ గారితో నా తొలి సినిమా నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల `ఇంతలో ఎన్నెన్ని వింతలో` చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్న యాజమాన్య మంచి బాణీలిస్తున్నారు. టాలెంటెడ్ టీమ్ తో ఈ సినిమా చేస్తున్నాం`` అన్నారు. డ రామకృష్ణ మాట్లాడుతూ...``కథ విన్నాను...చాలా బావుంది. సుమన్ గారు మాత్రమే చేయగల పాత్ర. నేను కూడా ఈ చిత్రంలో
ని
గూ
సు
మంచి పాత్రలో నటిస్తున్నా`` అన్నారు. మన్, హేమ్ చందర్, అల్లరి సుభాషిణి, ప్రీతి నిగమ్, గూడ రామకృష్ణ, రమేష్ రమ్మి, రఘు, అనిత ఆళ్లపాటి, జబర్దస్త్ అప్పారావు, వేణు, భాస్కర్, కొమరం, ఛైల్డ్ ఆర్టిస్స్ట్ మాస్టర్ కుషల్ కుమార్, బేబి గాయత్రి, బేబి శరణ్య, బేబి శివాని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జశ్వంత్, సంగీతం: యాజమాన్య, సాహిత్యం: సురేష్ ఉపాధ్యాయ, గోసాల రాంబాబు ఎడిటర్: నాగిరెడ్డి, స్టిల్స్: ఎన్.రమేష్ కుమార్, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, పిఆర్‌ఓ: చందు రమేష్; నిర్మాత: గోదారి భానుచందర్; కథ, మాటలు, స్క్రీన్‌ప్లే`దర్శకత్వం:పాలి క్(శ్రీనివాస్‌చారి) 9 P టాలీవుడ్
"స
మ్మోహనం" సినిమా సూపర్ హిట్ కావాలని ఆకాంక్షించారు మెగాస్టార్ చిరంజీవి. సుధీర్ బాబు, అదితి రావు హైదరి జంటగా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకం పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న 'సమ్మోహనం' చిత్రం టీజర్ ని మెగా స్టార్ చిరంజీవి డల్లాస్ (USA )లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సుధీర్ బాబు కాసేపు సరదాగా చిరంజీవిని ఇంటర్వ్యూ చేసారు.
ఆ విశేషాలు..
సుధీర్ బాబు: 'సమ్మోహనం' టైటిల్ చెప్పగానే మీకేం గుర్తొస్తుంది సర్ ! చిరంజీవి : 'సమ్మోహనం' అనగానే సరెండర్ ,ఇంకొక రకంగా మెస్మరైజింగ్ . ఫ్లాట్ అయిపోతున్నామనే ఫీలింగ్ వచ్చింది!
సుధీర్ బాబు : పర్సనల్ క్వశ్చన్ సర్ .... సురేఖ గారిని చూసి మీరు సమ్మోహితులు అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చి రంజీవి : (నవ్వుతూ) సురేఖని చుసిన ఫస్ట్ లుక్ లోనే నేను సమ్మోహితుడు అయ్యాను! సుధీర్ బాబు : అప్పట్లో మీ సినిమాలు రుద్రవీణ గానీ, ఆరాధన గానీ, ఆపద్బాంధవుడు గానీ అచ్చ తెలుగు టైటిల్ పెట్టేవారు! ఆ మధ్య కాలంలో తెలుగు టైటిల్స్ మిస్ అయ్యాం !మళ్ళి ఇప్పుడు ఆ టైపు టైటిల్స్ వస్తున్నాయి. చిరంజీవి : యా ! చాలా ఆనందకరమైనా విషయం ! మొన్న రంగస్థలం, నిన్న భరత్ అనే నేను, రేపు సమ్మోహనం. సుధీర్ బాబు : ఇంద్రగంటి గారి సినిమాలు ఏమైనా చూసారా మీరు ?
చి రంజీవి : యా ! ఆయన గురించి గొప్పగా విన్నాను. ఇటీవల ఆయన తీసిన సినిమా "అమీ తుమీ " మా ఫ్యామిలీ తో చూసాను. సుధీర్ బాబు : టీజర్ చుస్తే ఏమనిపించింది సర్ మీకు? చిరంజీవి : చాలా బాగుంది. ఆ అమ్మాయి లో ఆ freshness చూడగానే అట్ట్రాక్ట్ అయ్యాను. ముఖ్యంగా ఆ అమ్మయితో sarcastic గా మాట్లాడుతూ, ఫ్యూచర్ లో 40 సంవత్సరాల తరువాత ఆ అమ్మాయి ఎలా వుండబోతుందో చెప్పడం. ముఖ్యంగా ఆ డైలాగు " చర్మం ముడతలు పడి ..పళ్ళు రాలిపోయి..కాళ్ళు వంగిపోయి'' చా లా తమాషా గా అనిపించింది. చూస్తుంటే స్ట్రాంగ్ లవ్ స్టోరీ అనిపించింది.
ఇంతకు కథ ఏంటి ? సుధీర్ బాబు : ఒక అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక ఫిలిం స్టార్ మధ్య జరిగే లవ్ స్టోరీ. చిరంజీవి : స్టోరీ ఇంద్రగంటి గారిదే కదా ! సుధీర్ బాబు : ఇంద్రగంటి గారిదే సర్ ! ఇంద్రగంటి గారు గోల్కొండ హై స్కూల్ టైం లో ఒక రియల్ ఇన్సిడెంట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ రాశారు. చి రంజీవి : ఓ బ్యూటిఫుల్ ! ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మీ అందరికి మంచి పేరు తీసుకు రావాలని కోరుకుంటున్నాను.
M
K ఫిలిమ్స్ ప్రొడక్షన్స్ బేనర్ లో కన్మణి దర్శకత్వం లో , కుమార్ నిర్మించిన “ దేశముదుర్స్ “ చిత్రం మోషన్ పోస్టర్ ని దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు విడుదల చేసారు . ఈ సందర్బంగా రాఘవేంద్ర రావు గారు మాట్లాడుతూ , మోషన్ పోస్టర్ చాలా ఇమ్ ప్రసివ్ గా ఉంది , పోసాని , పృథ్వి కాంబినేషన్ లో రూపొందిన ఈ కామెడీ కాంబో తప్పకుండా ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది చెపుతూ , చిత్ర యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు . ర్మాత కుమార్ మాట్లాడుతూ , మా దేశముదుర్స్ చిత్రం వినోదాల విందుగా , జనాలని ఆకట్టుకుంటుంది అన్న విశ్వాసాన్ని వ్యక్తం చేసారు .
ని
ద
ర్శకుడు కన్మణి మాట్లడుతూ, మంచి కధతో , వినోదమే ప్రదానంగా , ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది . దర్శకేంద్రుడు కే .రాఘవేంద్ర రావు గారు ఈ దేశముడుర్స్ మోషన్ పోస్టర్ ఆవిస్కరించడం ఆనందం ఉంది అని అన్నారు . కార్యక్రమానికి , దర్శకుడు కన్మణి, నిర్మాత కుమార్ తో పాటుగా అర్జున్ , గౌతం రాజు , భవాని ప్రసాద్ , అడుసుమిల్లి విజయ్ కుమార్ ,యాజమాన్య , రాంబాబు గోసాల పాల్గొన్నారు . సాని కృష్ణ మురళీ, పృథ్వి ముఖ్య పాత్రలు పోషించిన, ఈ సినిమాలో అర్జున్ , గాయత్రీ , ఆలీ , శకలక శంకర్ , అశ్విని ....తదితరులు నటించారు .
ఈ పో
టా
లీవుడ్‌యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం `పంతం`. `ఫర్ ఎ కాస్` ఉప శీర్షిక. `బలుపు`, `పవర్`, `జై లవకుశ` వంటి బ్లాక్ బసర్ ్ట చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. గోపీచంద్ నటిస్తోన్న 25వ చిత్రమిది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. సందర్భంగా నిర్మాత కె.కె.రాధా మోహన్ మాట్లాడుతూ - ``గోపీచంద్‌గారి సిల్వర్ జూబ్లీ మూవీని మా బ్యానర్‌లో నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి మెసేజ్‌తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా సినిమాను రూపొందుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో
ఈ టాలీవుడ్ P 10
క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. క్లైమాక్స్ పూర్తయిన తర్వాత యు.కెలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరిస్తాం. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసి జూలై 5న ప్రపంచ వ్యాప్తంగా సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. డైరెక్టర్ చక్రవర్తి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. సినిమా అవుట్‌పుట్ చక్కగా వస్తుంది`` అని తెలిపారు. పీచంద్, మెహరీన్, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటించనున్న ఈ చిత్రానికి ఆర్ట్ః ఎ.ఎస్.ప్రకాష్, డైలాగ్స్ః రమేష్ రెడ్డి, స్క్రీన్‌ప్లేః కె.చక్రవర్తి, బాబీ(కె.ఎస్.రవీంద్ర), కో డైరెక్టర్ః బెల్లంకొండ సత్యంబాబు, మ్యూజిక్ః గోపీసుందర్, సినిమాటోగ్రఫీః ప్రసాద్ మూరెళ్ల, నిర్మాతః కె.కె. రాధామోహన్, స్టోరీ, డైరెక్షన్ః కె.చక్రవర్తి(చక్రి).
గో