ఊ
హలు గుస గుసలాడే చిత్రంతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన రాశీఖన్నా ప్రస్తుతం వరుస ఆఫర్ లతో దూసుకువెళ్తోంది . గోపీచంద్ తో జిల్ సినిమాలో సందడి చేసిన ఈ బామ .. మరో సారి గోపీచంద్ తో రొమాన్స్ చెయ్యబోతోంది . ప్రస్తుతం మెగా ఫ్యామిలీకి చెందిన సాయిధరమ్ తేజ్ సరసన సుప్రీమ్
సినిమాలో నటిస్తున్న రాశీఖన్నా.. గోపీచంద్ సరసన రెండోసారి నటించే అవకాశం దక్కించుకుంది . ‘నీ మనసు నాకు తెలుసు’, చిత్రానికి దర్సకత్వం వహించిన జ్యోతికృష్ణ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు గోపి చంద్ ను డైరెక్ట్ చెయ్యబోతున్నాడు . జ్యోతికృష్ణ చెప్పిన కథ నచ్చటంతో గోపి చంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ..ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలో సెట్స్ పై కి వెళ్లనుంది . జిల్ సినిమా తో ఆకట్టుకున్న ఈ జోడి మరో సూపర్ హిట్ సినిమా ఇవ్వబోతుందో లేదో చూడాలి ..
p
Gangopadhyay
Richa
హా
ట్ భామ రిచా గంగోపాధ్యాయ సినిమాలకు గుడ్ బై చెప్పేసింది . తెలుగులో లీడర్ చిత్రంలో రానా సరసన నటించిన ఈ భామ కు మంచి అవకాశాలే వచ్చాయి . ప్రభాస్ తో మిర్చి ,రవితేజ తో మిరపకాయ్ ,నాగార్జున తో భాయ్ చిత్రాల్లో నటించిన ఈ భామ కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది . అయితే పై చదువుల నిమిత్తం సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్లు ట్వీట్ చేసింది . స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోక పోయినప్పటికీ గ్లామర్ తో కుర్రకారు ని ఆకట్టుకుంది ఈ భామ
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2015
టాలీవుడ్ P 3
ర
చయిత గోపి మోహన్ దర్శకుడిగా సునీల్ హీరోగా ఒక సినిమా ప్రారంభించాలని ఎప్పటినుండో అనుకున్నారు కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ సినిమా ఆగిపోయిందని ఇక ఆ కాంబినేషన్ లో సినిమా వచ్చే పరిస్థితి లేదని అందుకు కారణం కేవలం సునీల్ మాత్రమే నని తెలుస్తోంది . సునీల్ ఆ సినిమా
టా లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బాలీవుడ్ లో జెండా పాతనున్నాడా అంటే అవుననే అంటున్నాయి ముంబై వర్గాలు . టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ హాలీవుడ్ హీరోలా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే ! ఇక మహేష్ భార్య నమ్రత బాలీవుడ్ హీరోయిన్ అన్న విషయం కూడా తెలిసిందే ,దాంతో మొదటి నుండి మహేష్ ని బాలీవుడ్ లో నటింప చేయాలనీ నమ్రత ప్లాన్ చేస్తున్నప్పటికీ మహేష్ ఎప్పటికప్పుడు నిరాకరిస్తూనే ఉన్నాడట కానీ నమ్రత మాత్రం పోరు పెడుతూనే ఉందట . దాంతో మహేష్ కు సైతం బాలీవుడ్ పై మనసు మల్లిందని తెలుస్తోంది ,అయితే హిందీ చిత్రాల్లో నటించడానికి పచ్చ జెండా ఊపుతాడట కానీ అక్కడికి మాత్రం మఖాం మార్చాడట ! అయితే ఒకవేళ హిందీ చిత్రాల్లో నటించాల్సి వస్తే మాత్రం ఉండటానికి సౌకర్యంగా ఉండేలా ఓ బ్రహ్మాండమైన విల్లా తీసుకున్నాడట అందుకే అని తెలుస్తోంది . హిందీపై పూర్తిగా ఫోకస్ పెట్టక పోయినప్పటికీ తప్పకుండా బాలీవుడ్ లో మాత్రం చేయడం ఖాయమట.
4 P టాలీవుడ్
ని పక్కన పెట్టి కృష్ణాష్టమి సినిమా చేస్తూ దానికే ఎక్కువ రోజులు కేటాయించడంతో గోపి మోహన్ ప్రాజెక్ట్ అట కెక్కిందట . ఈ విషయాన్నీ గోపి మోహన్ స్వయంగా వెల్లడించాడు . సునీల్ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తూ కెరీర్ ని ఎటు కాకుండా చేసుకుంటున్నాడు . మరి కృష్ణాష్టమి ఏమౌతుందో చూడాలి .
వి
ప్రే
కా
గౌ ఏ
సి
భిన్న చిత్రాలతో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఆకట్టుకుంటూ సక్సెస్‌ఫుల్ హీరోగా దూసుకెళ్తున్న మహానటుడు అక్కినేని మనవడు, కింగ్ నాగార్జున తనయుడు యువసామ్రాట్ నాగచైతన్య పుట్టినరోజు నవంబర్ 23. ఈ సందర్భంగా నాగచైతన్య తన కెరీర్ గురించి మాట్లాడారు. 'మనం' ఓ మెమరబుల్‌ఫిలిం క్షకులు, అక్కినే అభిమానులు ఆదరించడం వల్ల హీరోగా నా కెరీర్ చాలా హ్యాపీగా వుంది. ఏమాయ చేసావె, 100% లవ్, తడాఖా, ఒక లైలా కోసం చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వాటన్నింటినీ మించి మనం చిత్రం అన్నివిధాలా నాకు సంతృప్తి కలిగించిన విజయాన్ని అందించింది. అంతేకాదు తాతగారితో, నాన్నతో కలిసి నటించడం అన్నది ఓ మంచి అనుభూతి కలిగించింది. మనం నా కెరీర్‌లో ఓ మెమరబుల్ ఫిలిం అయింది. ప్రేక్షకులు, అభిమానులు మెచ్చే వైవిధ్యమైన సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఎయిమ్. అన్నపూర్ణ స్టూడియో బేనర్‌లో నిర్మించిన ఒక లైలా కోసంలో హీరోగా నటిస్తూనే ప్రొడక్షన్ కూడా చూసుకున్నాను. నిర్మాతగా అందరికీ నచ్చే సినిమాలు చెయ్యాలన్నది నా యాంబిషన్. తమ్ మీనన్‌తో మరో మంచి సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో' మాయచేసావెతో రొమాంటిక్ హీరోగా నాకు ఇమేజ్ తెచ్చిన గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సాహసం శ్వాసగా సాగిపో చేస్తున్నాను. ఆల్‌మోస్ట్ పూర్తయింది. ఫస్ట్ హాఫ్ ఓ రోడ్ ట్రిప్‌లో జరిగే లవ్‌స్టోరీ. సెకండాఫ్ యాక్షన్‌కి వెళ్తుంది. ఈ యాక్షన్ చాలా నేచురల్‌గా వుంటుంది. హీరో క్యారెక్టర్‌కి ఆడియన్స్‌బాగా కనెక్ట్‌అవుతారు. గౌతమ్‌మీనన్ ఈ సినిమాని బాగా డిజైన్‌చేసారు. ఏమాయ చేసావె తర్వాత ఎ.ఆర్.రెహమాన్‌గారు నాకు మ్యూజిక్‌చెయ్యడం వెరీ హ్యాపీ. మ్యూజిక్‌కి ఈ సినిమాకి చాలా పెద్ద ఎస్సెట్. పొయెటిక్‌గా టైటిల్స్‌పెట్టే గౌతమ్‌మీనన్‌గారు ఈ సినిమాకి పెట్టిన టైటిల్ అందరికీ నచ్చింది. సినిమా చూసాక సాహసం శ్వాసగా
సాగిపో టైటిల్ హండ్రెడ్ పర్సెంట్ పర్‌ఫెక్ట్ అంటారు. కోన వెంకట్, రావి రవీంద్రరెడ్డి కాంప్రమైజ్ అవకుండా సినిమా చేస్తున్నారు. 'ప్రేమమ్' కథ నాకు ఎంతో నచ్చింది! ర్తికేయ డైరెక్టర్ చందు మొండేటితో సినిమా చేద్దామని నిర్మాత సూర్యదేవర నాగవంశీ అన్నారు. నాకు కార్తికేయ బాగా నచ్చింది. అప్పటి నుంచి నేను చందుతో ట్రావెల్ అవుతున్నాను. ఓ కథ కూడా అనుకున్నాము. ఈలోగా మలయాళంలో ప్రేమమ్ అనే లవ్‌స్టోరీ రిలీజ్‌అయి సూపర్‌హిట్‌అయింది. ఈ కథ నాకు బాగా నచ్చి రీమేక్ చేద్దామన్నాను. స్కూల్‌లో వున్నప్పుడు ప్రేమ, కాలేజీలో వున్నప్పడు ప్రేమ, మెచ్యూర్డ్ ఏజ్‌లో పెళ్ళి చేసుకున్నప్పుడు వుండే ప్రేమ.. వీటన్నింటి మధ్య వుండే వేరియేషన్‌ని హీరో క్యారెక్టర్ నుంచి చెప్పే అల్టిమేట్ లవ్‌స్టోరీ ఇది. లైఫ్ జర్నీలో ఈక్యారెక్టర్ మారే తీరు చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే అనుభవాలు ఈ హీరో పాత్రలో వుంటాయి. ఈ సినిమాని ఎంతో ప్యాషన్‌తో వంశీ, చందు మొండేటి చేస్తున్నారు. ఈ సినిమాకి తెలుగులో ఇంకా పేరు నిర్ణయించలేదు'' అన్నారు యువసామ్రాట్‌నాగచైతన్య. తార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో చందు మొండేటి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించే ఈ చిత్రాన్ని ఈనెల 28న మూహూర్తం చేసి డిసెంబర్ 3 నుండి వైజాగ్‌లో షెడ్యూల్ చెయ్యడానికి ప్లాన్‌చేస్తున్నారు. వసామ్రాట్ నాగచైతన్య సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. శృతిహాసన్‌తోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు వుంటారు. వారిలో ఒకరు అనుపమ పరమేశ్వరన్ కాగా, మరో హీరోయిన్‌ఎంపిక జరుగుతోంది.
యు
టాలీవుడ్ P 5
యం
గ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనున్న కొత్త చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నాడు ,కొద్దిరోజులు ఆ వార్త వినబడుతున్నప్పటికి తాజాగా ఆ వార్తని దృవీకరించారు చిత్ర యూనిట్ . ఇంతకుముందు బాలయ్య నటించిన గాండీవం చిత్రంలో ఓ ప్రత్యేక పాటలో మెరిసిన మోహన్ లాల్ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం . మోహన్ లాల్ తెలుగులో నటించిన మొదటి చిత్రం బాలయ్య గాండీవం కాగా రెండో చిత్రం కూడా నందమూరి వారి చిత్రం కావడం విశేషం . ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ''నాన్నకు ప్రేమతో'' చిత్రం పూర్తయ్యాక కొరటాల శివ సినిమా ప్రారంభం కానుంది .
వి
వాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ తాజాగా రాసిన తన జీవిత కథ ని ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదుల సంఖ్యలోని వాళ్ళకు అంకితం ఇస్తున్నట్లు ట్వీట్ చేసాడు . తన జీవితానికి కొంతమంది ఉపయోగ పడ్డారని వాళ్ళ వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతూ వాళ్ళ పేర్లు కూడా ప్రకటించాడు వర్మ . ఆ లిస్టులో అమితాబ్ ,ఊర్మిళ ,అయాన్ రాండ్ ,బ్రూస్ లీ ,పోర్న్ స్టార్ టోరి బ్లాక్ లతో పాటు మరికొంతమంది గ్యాంగ్ స్టర్ కు అంకితం ఇస్తున్నాడు ''గన్స్ అండ్ థైస్ ''. అండర్ వరల్డ్ డాన్ లతో అలాగే మహిళలతో వర్మ కున్న సంబంధాల గురించి రాసాడట . మరి ఈ పుస్తకం రిలీజ్ అయ్యాక ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి .
6 P టాలీవుడ్
వా
రసుల రాజ్యం అయిన సినీరంగంలోకి మరో వారసురాలు రాబోతోంది . బాలనటి గా మీనా పలు చిత్రాల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్ గా దక్షినాది న అగ్ర తార గా ఓ వెలుగు వెలిగిన విషయం తెలిసిందే ! మీనా కూతురు చిన్నారి నైనిక బాలనటిగా పరిచయం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మీనా . కాగా తమిళ చిత్రంలో బేబీ నైనిక నటించనుంది ఇక నైనిక కు తల్లిగా నటించే హీరోయిన్ ఎవరో తెలుసా ......... అందాల ముద్దుగుమ్మ సమంత . తమిళంలో రూపొందనున్న ఈ చిత్రానికి రాజా రాణి వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన అట్లి ఈ చిత్రానికి దర్శకుడు కాగా హీరో విజయ్ . ఇళయ దళపతి విజయ్ సరసన సమంత ,అమీ జాక్సన్ లు నటించనున్నారు .
మ
నం వంటి బ్లాక్ బస్తర్ చిత్రానికి దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ మహేష్ దగ్గరకు వెళ్లి చెప్పిన కథ కు మొదట మహేష్ ఓకే చెప్పినప్పటికీ సెకండాఫ్ నచ్చకపోవడంతో ఆ చిత్రాన్ని చేయడానికి నిరాకరించాడట దాంతో అదే కథ ని తమిళ హీరో సూర్య కు చెప్పగా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు కట్ చేస్తే ''24'' పేరుతో ఆ సినిమా రూపొందింది పైగా ఆ చిత్రాన్ని సూర్య స్వయంగా నిర్మించడం విశేషం . సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశం తో తెరకెక్కిన ఆ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటిస్తోంది . వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమాని తెలుగు ,తమిళ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మరి మహేష్ వదులుకున్న 24 చిత్రం హిట్ అవుతుందా ? లేదా అన్నది తెలియాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే .
టాలీవుడ్ P 7
తె
లుగు చిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటులు పెద్ద ఎన్టీయార్ నుంచి పవన్ కళ్యాణ్ వరుకు మీ అభిమానులమంటూ చెప్తుంటే విన్నాము ...కొన్ని సినిమాలలో అభిమానులుగా నటిస్తే చూసాము.....బాలయ్య అభిమానులు అంటూ ఆయన ఫ్యామీలి హీరోలు చెప్పారే తప్పా... మరెవ్వరు చెప్పలేదు..ఇప్పుడు యంగ్ హీరో నాని బాలయ్య వీరాభిమానినని చూపించుకుంటున్నాడు.. ఇప్పటివరకు ఎవరికి తను స్వయంగా చెప్పని నాని.. ఆయన చేతి పై 'జై బాలయ్య ' టాటు కూడా వేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇప్పటివరకు చెప్పని నానీ ..హాఠాత్తుగా బాలయ్య అభిమానిగా మారిపోయాడేంటి అని ఆలోచనలో పడకండి..నాని ,అందాల రాక్షసి ఫేం హాను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ చిత్రం రూపోందుతుంది..ఈ చిత్రంలో నాని బాలయ్య అభిమాన సంఘం అద్యక్షుడిగా నటిస్తున్నాడు..అందుకే చేతిపై జై బాలయ్యా టాటూ వేసుకున్నాడు..బాలకృష్ణ తో లెజెండ్ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ బ్యానర్ ఈచిత్రాన్ని నిర్మిస్తోంది..‘సైజ్ జీరో' మూవీ ప్రీమియర్ షోకు హాజరైన నాని తన చేతిపై ‘జై బాలయ్య' టాటూతో కనిపించారు ..మరి బాలయ్య అభిమానిగా చేస్తున్న నాని ఆయన ఫ్యాన్స్ ను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి.
న
8 P టాలీవుడ్
టసింహం నందమూరి బాలకృష్ణ వందో చిత్రానికి రెడీ అవుతున్నాడు . ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో ''డిక్టేటర్ '' చేస్తున్న విషయం తెలిసిందే ! దాన్ని డిసెంబర్ లో కంప్లీట్ చేసిన తర్వాత 2016 లో బాలయ్య పుట్టినరోజు అయిన జూన్ 10 న అశేష నందమూరి అభిమానుల సమక్షంలో ఘనంగా ప్రారంభించనున్నారు . బాలయ్య తో సింహ , లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన బోయపాటి శ్రీను ఈ వందో చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు . ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు చిత్రాలు కూడా పెద్ద హిట్ కావడంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈ వందో చిత్రానికి ''గాడ్ ఫాదర్ '' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు .
తె
లుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పరుచుకున్న తమిళ హీరో సూర్య తాజాగా విక్రం కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ''24 ''. ఇటీవల రిలీజ్ అయిన సూర్య ఫస్ట్ లుక్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది . స్టైలిష్ లుక్ లో సూర్య అదరగోడుతున్నాడు ,సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఇష్క్ ,మనం వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తుండటం విశేషం . ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య నిర్మించడం విశేషం . ఇప్పటికే బిజినెస్ మొత్తం పూర్తయిన 24 చిత్రం తెలుగులో కూడా రిలీజ్ కానుంది . కాగా సూర్య ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి .
టాలీవుడ్ P 9
అ
మీర్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేసింది మాజీ హీరోయిన్ రవీనా టాండన్ . ఇటీవల ఢిల్లీ లో అమీర్ చేసిన వ్యాఖ్యలు పెను సంచలనం సృష్టించాయి . దాంతో సినిమా ప్రముఖులు మాత్రమే కాకుండా పలువురు నెటిజన్లు సైతం అమీర్ ఖాన్ పై విరుచుకు పడుతున్నారు . ఇక రవీనా నైతే విమర్శల జడి వాన కురిపించింది . ముంబై లో తీవ్రవాదులు మారణకాండ సృష్టించినపుడు నీకు
ద
ర్శకులు పూరి జగన్నాద్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయ్యాడు . రెండు సినిమాలకు దర్శకత్వం వహించడానికి అందుకుంటున్న రెమ్యునరేషన్ ఎంతనో తెలుసా ......... అక్షరాల ముప్పై కోట్లు . ఒక్కో సినిమాకు 15 కోట్ల చొప్పున రెండు సినిమాలకు 30 కోట్లు రెమ్యునరేషన్ గా అందుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు . మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు ,కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి తనయుడు అయిన నిఖిల్ గౌడ హీరోగా పరిచయం కానున్నాడు దానికి గాను అందుకుంటున్న సొమ్ము 15 కోట్లట ! అలాగే హీరో శ్రీకాంత్ తో ''మహాత్మ'' వంటి చిత్రాన్ని తీసిన మనోహర్ నాయుడు బంధువు అయిన ఇషాన్ ని కూడా హీరోగా పరిచయం చేయనున్నాడు పూరి ఇక ఆ సినిమాకు కూడా 15 కోట్లు రెమ్యునరేషన్ అంట . ఈ రెండు సినిమాలతో వాటి రెమ్యునరేషన్ తో సంచలనం సృష్టిస్తున్నాడు పూరి .
10 P టాలీవుడ్
భయం వేయలేదా ? అమీర్ ని సూటిగా ప్రశ్నించింది రవీనా టాండన్ . ప్రధాని గా మోడీ రాగానే అంతగా అసహనం పెరిగిపోయిందా? నిన్ను స్టార్ గా చేసిన ఈ దేశానికి నువ్వు ఏమిచ్చావ్ ? ఒక్కసారి నిన్ను నువ్వు ప్రశ్నించుకో ? నీ భార్య ఈ దేశం విడిచి వెల్లిపోదాం అని నీతో అన్నప్పుడు నీ భార్య ని ప్రశ్నించ లేకపోయావా ? అసలు ఈ దేశానికి నువ్వేమిచ్చావ్ ? అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది . రవీనా మాత్రమే కాదు సోషల్ మీడియాలో వేలకొద్ది నెటిజన్లు అమీర్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు .
సీ
తమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో మహేష్ మరదలి గా ,ఐస్ క్రీం చిత్రంలో అందాలను ఉదారంగా ఆరబోసిన భామ తేజస్వి నటించిన చిత్రానికి అండగా నిలిచాడు అగ్ర నిర్మాత సాయి కొర్రపాటి . విభిన్న చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకత ని నిలిపుకున్న సాయి ఇటీవల ''రాజుగారి గది '' చిత్రాన్ని రిలీజ్ చేసి సక్సెస్ అయ్యాడు దాంతో ఆ చిత్రంలో హీరోగా నటించిన ''అశ్విన్ - తేజస్వి తో కలిసి నటించిన ''జతకలిసే ''చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చాడు దాంతో ఈ చిత్రం కూడా హిట్ అవుతుంది అన్న నమ్మకం తో ఉన్నారు ఆ చిత్ర యూనిట్ . ఇక తేజస్వి హీరోయిన్ గా ఓ వెలుగు వెలగాలని ఆశిస్తోంది మరి తేజస్వి ఆశలకు ఈ చిత్రం ఊపిరి పోస్తుందా లేదా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే .
టాలీవుడ్ P 11
సా
యి కృప, రామకృష్ణ, వంశీ ప్రధాన పాత్రల్లో అమృత సాయి ఆర్ట్స్ బ్యానర్ పై సాయిరాం దాసరి దర్శకత్వం వహిస్తూ.. నిర్మిస్తున్న చిత్రం 'మిత్రవింద'. ఈ చిత్రం పోస్టర్ ను, ట్రైలర్ ను సోమవారం సంగీత దర్శకురాలు ఎం.ఎం.శ్రీలేఖ హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ సందర్భంగా.. .ఎం.శ్రీలేఖ మాట్లాడుతూ.. ''ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ఈ మధ్య ఇలాంటి చిత్రాలకు మంచి ప్రేక్షకాదరణ లభిస్తోంది. 'మిత్రవింద' టైటిల్ చాలా బావుంది. సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. టీం అందరికి ఆల్ ది బెస్ట్''.. అని చెప్పారు. యిరాం దాసరి మాట్లాడుతూ.. ''నేను మొదట డైరెక్ట్ చేసిన 'లాటరీ' చిత్రానికి నేషనల్ అవార్డు లభించింది. తరువాత 'అమ్మ' అనే ఆల్బం చేసాను. ఇది నా మూడవ ప్రాజెక్ట్. మొట్టమొదటి సారిగా ఇండియన్ సినిమాలో ఎస్.బి.రే టెక్నాలజీను ఉపయోగించిన
ఎం సా
12 P టాలీవుడ్
చిత్రమిది. ఈ సినిమా ఒక్క రోజులో జరిగే కథాంశం గా రూపొందించాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం''... అని చెప్పారు. లేటి రామకృష్ణ మాట్లాడుతూ.. ''ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సంవత్సరాలు నుండి అన్నపూర్ణ స్టూడియోస్ లో పని చేస్తున్నాను. చిన్న బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఇలాంటి మంచి సినిమాలు మరిన్ని చేయాలని భావిస్తున్నాం'' అని చెప్పారు. శీ మాట్లాడుతూ.. ''ఇది నా మొదటి సినిమా. లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టు ఇది. నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలు థాంక్స్'' అని చెప్పారు. చిత్రానికి ఎడిటర్: కిరణ్ రెడ్డి, కెమెరామెన్: దారా రవి, కో-ప్రొడ్యూసర్: ఓలేటి రామకృష్ణ, దర్శకనిర్మాత: సాయిరాం దాసరి.
ఓ
వం ఈ
అ
ష్టా చెమ్మా చిత్రంతో తనని హీరోగా పరిచయం చేయడమే కాకుండా ఆ చిత్రంతో హిట్ ని కూడా అందించిన దర్శకులు మోహన్ కృష్ణ ఇంద్రగంటి ఋణం తీర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు హీరో నాని . ఇటీవలే భలే భలే మగాడివోయ్ చిత్రంతో బ్లాక్ బస్టర్ ని అందుకున్న నాని ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్న ఇంద్రగంటి తో ఒక చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు దానికి సంబంధించి ట్వీట్ కూడా చేసాడు నాని . ఆమధ్య అల్లరి నరేష్ తో బందిపోటు వంటి డిజాస్టర్ ని అందించి ఇబ్బందుల్లో పడ్డ మోహన కృష్ణ ఇంద్రగంటి మళ్ళీ దర్శకుడి గా తన సత్తా చూపించాలంటే నాని సపోర్ట్ చాలా అవసరమే మరి . పైగా నాని ఈరోజు హీరోగా ఈ పొజీషన్ లో ఉన్నాడంటే ఆరోజు అష్టాచెమ్మా చిత్రంలో చాన్స్ ఇవ్వడం వల్లే ! అందుకే ఉభయకుషలోపరి గా ఈ చిత్రాన్ని చేయనున్నారట .
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు గుడి కట్టడానికి సన్నాహాలు చేస్తున్నాడు జబర్దస్త్ తో వెలుగులోకి వచ్చిన హాస్య నటుడు శకలక శంకర్ . పవర్ స్టార్ కు వీరాభిమాని అయిన శకలక శంకర్ జబర్దస్త్ లో పవన్ కళ్యాణ్ పై చాలా స్కిట్ లనే చేసాడు . శకలక శంకర్ పేద వాడు అయినప్పటికీ జబర్దస్త్ ప్రోగ్రాం తో బాగానే సంపాదించాడు ఇక ఇప్పటికే దాదాపు 50 చిత్రాలకు పైగా నటించాడు ,అవన్నీ చిన్న చిన్న పాత్రలే అయినప్పటికీ ఎంతోకొంత సొమ్ము చేసుకోవడంతో తన అభిమానాన్ని నిరూపించు కోవడానికి రెడీ అయ్యాడు శకలక శంకర్ . అయితే ఈ గుడి ని శ్రీకాకుళం జిల్లాలోని తన స్వగ్రామంలో కట్టనున్నాడు ,ఇన్నాళ్ళు దేవుళ్ళకు ఆ తర్వాత హీరోయిన్ లకు మాత్రమే ఉన్న గుడులు ఇక నుండి పవన్ కళ్యాణ్ కు కూడా ఉండనుంది .
టాలీవుడ్ P 13
80
14 P టాలీవుడ్
వ దశకంలో వినోద ప్రధానమైన కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన దర్శకులలో అగ్ర గణ్యులు రేలంగి నరసింహారావు .పలు సూపర్ హిట్ చిత్రాలతో అప్రతిహతమైన విజయాలతో ఇంటిల్లిపాది చూసే చిత్రాలతో అద్భుత విజయాలను అందించారు . పోలిస్ భార్య ,ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలిస్ ,ఎదురింటి మొగుడు -పక్కింటి పెళ్ళాం ,చిన్నోడు -పెద్దోడు ,డబ్బెవరికి చేదు ,సంసారం ,గుండమ్మగారి కృష్ణులు ,మామా -అల్లుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు మరెన్నో హిట్ చిత్రాలు ఇచ్చారు . అప్పట్లో హాస్య చిత్రాలకు కొలమానం లా నిలిచిన రేలంగి నరసింహారావు కాలక్రమంలో వచ్చిన చిత్రాల విపరీత పోకడతో కొంతకాలం దర్శకత్వానికి దూరంగా ఉన్నారు . అయితే మెగా ఫోన్ కి దూరం అవడం అంతగా ఇష్టం లేక కన్నడంలో కూడా కొన్ని హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రేలంగి తాజాగా ఏడేళ్ళ గ్యాప్ తర్వాత తెలుగులో చేస్తున్న చిత్రం ''ఎలుకా మజాకా ''. మరోసారి తనదైన మార్క్ కామెడీ తో తెరకెక్కుతున్న ఎలుకా మజాకా చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నాడు దర్శకులు రేలంగి , మళ్ళీ కుటుంబ కథా చిత్రాలను ఆదరిస్తున్నారని కాబట్టి నా బ్రాండ్ చిత్రాలకు డోఖా లేదని ఆశిస్తున్నాడు దర్శకులు రేలంగి . బ్రహ్మానందం ,వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మారెళ్ళ నరసింహారావు ,వడ్డెం పూడి శ్రీనివాసరావు లు సంయుక్తంగా నిర్మించగా బల్లేపల్లి మోహన్ సంగీతం సమకూర్చాడు . అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఎలుకా మజాకా చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
-
రా
నా మావయ్య అయ్యాడు .తన సోదరి మాళవిక నిన్న పండంటి పాప కు జన్మనిచ్చింది . 2012 లో భరత్ కృష్ణారావు తో మాళవిక వివాహం ఘనంగా చేసారు సురేష్ బాబు . కాగా ఇటీవల పండంటి బిడ్డ కు రానా సోదరి జన్మనివ్వడంతో దగ్గుబాటి కుటుంబంలో సంతోషం వెళ్లి విరుస్తోంది . ఈ సంవత్సరం రానా కు చాలా సంతోషాలను ఇచ్చింది బాహుబలి భారీ విజయం సాధించి రానా కు ఎక్కడా లేని పేరు ప్రఖ్యాతులను అందుకుంటున్నాడు కాగా ఇదే ఏడాది తన సోదరి కి పాప జన్మించడం తో లక్ష్మీదేవి మా ఇంట అడుగు పెట్టిందని సంతోషంగా ఉన్నారు . ఇక సురేష్ బాబు అయితే మరింతగా మురిసి పోతున్నాడట ఎందుకంటే తాతయ్య అయ్యాడు కదా !
80
వ దశకంలో చిరంజీవి - మోహన్ బాబు లు పోటీ పడి నటించడమే కాకుండా ఇద్దరి మద్య నువ్వా -నేనా అన్నట్లుగా సాగింది పోరాటం . ఇద్దరు కలిసి హీరోలుగా నటించారు ఆతర్వాత చిరంజీవి పాలిట విలన్ అయ్యాడు మోహన్ బాబు . ఇద్దరు కూడా మిత్రులే
కావడంతో రసవత్తరంగా సాగింది ఆ కాంబినేషన్ . ఇక మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత వారిద్దరి వారసులు రాంచరణ్ తేజ్ - మంచు మనోజ్ లు హీరోలుగా రాణిస్తున్నారు . కాగా రాంచరణ్ తాజా చిత్రంలో మంచు మనోజ్ ని విలన్ గా ఎంపిక చేయాలనీ భావిస్తున్నారట ! ఇక మంచు మనోజ్ కూడా హీరోగా రాణిస్తూనే మంచి పాత్రలు లభిస్తే విలన్ గా చేయడానికి నేను రెడీ నే అంటూ ఇంతకుముందే ప్రకటించాడు కూడా . దాంతో మనోజ్ ని విలన్ గా ఎంపిక చేస్తే బాగుంటుందని భావిస్తున్నారట మరి మంచు మనోజ్ అంగీకరిస్తాడా చూడాలి .
టాలీవుడ్ P 15
సీ
నియర్ హీరోలు బాలకృష్ణ - నాగార్జున సంక్రాంతి బరిలో పోటీకి సిద్దం అవుతున్నారు . బాలకృష్ణ నటిస్తున్న ''డిక్టేటర్ '' చిత్రాన్ని జనవరి 14 న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుండగా ఆ తెల్లవారి అంటే జనవరి 15 న నాగార్జున నటించిన ''సోగ్గాడే చిన్ని నాయనా '' చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా చూసుకున్నాడు . జనవరి 15 న వస్తున్నాం అంటూ ప్రకటించేసాడు నాగార్జున దాంతో బాలయ్య - నాగ్ ల మద్య పోరాటం తప్పేలా లేదు . రెండు భారీ చిత్రాలు ఒకేసారి రావడం ఇద్దరు అభిమానులకు సంతోషకరమైన వార్తే అయినప్పటికీ రెండు భారీ చిత్రాలు ఒకేసారి వస్తే ఆ ప్రభావం తప్పకుండా కలెక్షన్ల పై పడుతుందని బయ్యర్లు బలంగా నమ్ముతున్నారు . మరి ఈ పోటీ లో ఎవరు నెగ్గుతారో ? ఎవరు తప్పుకుంటారో ? చూడాలి .
వ
16 P టాలీవుడ్
రుసగా మూడు చిత్రాలను 50 కోట్ల క్లబ్ లో చేర్చిన అరుదైన ఘనత సొంతం చేసుకొని సంచలనం సృష్టించాడు అల్లు అర్జున్ . గతేడాది ''రేసుగుర్రం '' చిత్రంతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అల్లు అర్జున్ ఏకంగా 59 కోట్ల షేర్ ని సాధించి చరిత్ర సృష్టించాడు . ఇక ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన ''సన్నాఫ్ సత్యమూర్తి '' చిత్రానికి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ 51 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి 50 కోట్లను దాటించాడు ఇక తాజాగా ''రుద్రమదేవి '' చిత్రంతో హ్యాట్రిక్ సాధించాడు అల్లు అర్జున్ . కాకతీయ వీరనారి రుద్రమ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఆ చిత్రంలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి గా నటించిన విషయం తెలిసిందే . ఇక ఈ చిత్రం కూడా ఇప్పటివరకు 51. 35 కోట్లను సాధించి సంచలనం సృష్టించింది దాంతో వరుసగా మూడు చిత్రాలు 50 కోట్ల క్లబ్ లో చేరిన హీరోగా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్ .
వ
రంగల్ కు చెందిన ''జీసెస్ ఒల్దేజ్ హోం'' నిర్వాహకులు వచ్చి ప్రభాస్ ని వృద్దుల కోసం సహాయం అందించాల్సిందిగా కోరడంతో వెంటనే స్పందించి 5 లక్షల రూపాయల సహాయం అందించాడు . దాంతో అడిగిన వెంటనే ఇంత పెద్ద మొత్తం లో సహాయం చేసినందుకు ప్రభాస్ కు కృతఙ్ఞతలు తెలిపారు సదరు వృద్ద సంఘం సభ్యులు . ఇటీవల బాహుబలి తో సంచలన విజయం సాధించిన ప్రభాస్ ఖ్యాతి భారతీయ ఎల్లలు దాటిన విషయం తెలిసిందే . వృద్దుల కోసం అడిగిన మొత్తం ఇచ్చి సహాయం చేసిన ఈ బాహుబలి ని వేనోళ్ళ పొగుడుతున్నారు .
ఏ
వ్యక్తి జీవితంలో అయిన బాల్యం ఎంతో మధురమైంది.. అప్పుడు జరిగిన ప్రతి విషయం ఓ మధురానుభూతిని ,మరవలేని గుర్తులను మిగులుస్తోంది...అదే బాల్యం యంగ్ హీరోలకు అలాంటి అనుభూతలను మిగిల్చింది. అక్కినేని నాగచైతన్య ,దగ్గుబాటి రానా ఇద్దరు బావ బామ్మర్తులు అనే విషయం అందరికి తెలిసిందే..సోమవారం నాగ చైతన్య బర్త్ డే సందర్బంగా ఆయనకు ఇండస్ట్రీ నుంచి అందరు పుట్టిన రోజు శుభాకాంక్షులు తెలిపారు..రానా కూడా తన ట్విట్టర్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు..చిన్నప్పుడు రానా ,నాగ చైతన్యలిద్దరు తాతా రామానాయుడుతో కలిసి ఉన్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట చేసి అనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు..లవ్ యూ ద మోస్ట్ చై అంటూ ట్విట్ కూడా చేశాడు రానా...బుల్లి బుల్లిగా ఉన్న చైతు ,రానా ఫోటో ను చూసి వారి అభిమానులు మురిసిపోతున్నారు..ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కెర్లు కోడుతోంది...
టాలీవుడ్ P 17
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,బాబి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ' సర్దార్ గబ్బర్ సింగ్ ' . ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది . ఈ చిత్రం లో పవన్ సరసన కాజల్ నటిస్తున్న ఈ చిత్రం లో లక్ష్మి రాయ్ ఒక ఐటెం సాంగ్ లో రొమాన్స్ చెయ్యగా .. ఇప్పుడు కన్నడ హాట్ బ్యూటీ సంజన లక్కీ ఛాన్స్ కొట్టేసింది . ఈ చిత్రం లో కీలక సన్నివేశాలలో సంజన పవన్ తో నటిస్తోందని తెలుస్తోంది . బుజ్జిగాడు మూవీతో టాలీవుడ్ కి ఎంట్రి ఇచ్చిన ఈ బామకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు . సంజన ఫేడ్ అవుట్ అయిపోయినట్టే అని అనుకుంటున్న సమయం లో పవన్ తో నటించే ఛాన్స్ సంపాదించుకుందని ఫిలిం నగర్ టాక్ . అయితే గ్లామర్ షో చేసే పాత్రలో కాకుండా .. సాంప్రదాయ పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది . ఇప్పటివరకు సరైన బ్రేక్ దొరకని ఈ బామకు పవన్ సినిమా తో అయిన దశ తిరుగుతుందో చూడాలి .
18 P టాలీవుడ్
బా
లీవుడ్ భామ ప్రియాంక చోప్రా హాలీవుడ్ బాట పట్టాలనే ఆలోచనలో ఉందేమో అందుకే రెచ్చిపోయి అందాలను అరబోయడమే కాకుండా విచ్చలవిడిగా శృంగార సన్నివేశాల్లో నటిస్తూ పోర్న్ స్టార్ లను తలపిస్తోంది . క్వాంటి కో అనే ఆంగ్ల సీరియల్ కోసం బరితెగించిన ప్రియాంక చోప్రా ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు నెటిజన్లు . ఓ టివి షో కోసం ప్రియాంక ఇంత పచ్చిగా నటించడంతో ఆశ్చర్య పోతున్నారు . ఇక తాజాగా రిలీజ్ అయిన ప్రియాంక బాత్ రూం వీడియో కూడా పెను సంచలనమే సృష్టిస్తోంది . ఇంతకుముందు వచ్చిన కారు సెక్స్ వీడియో ,తాజాగా షెవర్ వీడియో ఈ రెండూ కలిసి ఓ పోర్న్ మూవీ చూసినట్లే ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారంటే ఎంత దారుణంగా నటించిందో అర్ధం చేసుకోవచ్చు . బాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఈ భామ హాలీవుడ్ బాట పడుతుందేమో అందుకే ఇలా రెచ్చిపోయి నటిస్తున్నట్లు ఉంది .
p
నీ
లిరంగు చీరలోన అన్న పల్లవి కి అనుగుణంగా నీలిరంగు మోడ్రన్ వేర్ లో సోయగాలను పంచేసి చలికాలంలో సెగలు కక్కేలా చేస్తోంది బ్లాక్ బ్యూటీ రెజీనా . ఇటీవలే వరుసగా సాయి ధరం తేజ్ తో రెండు సినిమాలు చేసిన ఈ భామ కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతోంది . మోడ్రన్ వేర్ లో బయటకి తొంగి చూస్తున్న లేలేత అందాలతో కళ్ళు తిప్పుకోకుండా చేస్తోంది . తాజాగా మంచు మనోజ్ సరసన శౌర్య చిత్రంలో నటిస్తున్న ఈ భామ మరింతగా అందాలను ఆరబోసి టాప్ హీరోయిన్ కావాలని కళలు కంటోంది . మరి అమ్మడి కలలు నెరవేరుతాయా లేదా అన్నది చూడాలి.
p
మె
గా వారసురాలు నిహారిక లో ఉన్న కమిట్ మెంట్ ని ,హీరోయిన్ అవ్వాలని ఉన్న కసిని చూసి షాక్ అవుతున్నారు సినిమా ఇండస్ట్రీ లోని పెద్దలు . గత 5 సంవత్సరాలుగా నిహారిక హీరోయిన్ కావాలని కళలు కంటోంది అయితే ఆమె ఆశలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న మెగా కుటుంబం ఇక నిహారిక ని నిలువరించలేమని తెలుసుకొని మొదట యాంకర్ గా వెళ్ళమని చెప్పారట దాంతో యాంకర్ గా బుల్లితెరపై తన సత్తా ఏంటో చూపించి సినిమాల్లోకి వెళ్ళాలనే కోరిక వెల్లడించడం తో ఇక అనుమతి ఇవ్వక తప్పలేదట మెగా కుటుంబానికి . ఇక నిహారిక పై చేసిన ఫోటో షూట్ లో బాపు బొమ్మ ని తలపిస్తూ ఇండస్ట్రీ వాళ్ళని షాక్ కి గురి చేస్తోందట నిహారిక . దాంతో నిహారిక హీరోయిన్ గా సక్సెస్ కావడం ఖాయమని అంటున్నారు .
వా
రసుల రాజ్యంలోకి మరో వారసుడు హీరోగా ఎంటర్ అయ్యాడు . అయితే కాస్త బ్యాగ్రౌండ్ తక్కువ ఉన్న వారసుడు అయినప్పటికీ హీరో ఫీచర్స్ ఉండటంతో దానికి తోడూ నటనలో మంచి ప్రతిభ ఉండటం వల్ల ఖచ్చితంగా ఈ కుర్రాడు హీరోగా నిలబడతాడు అంటూ ''సంతోష్'' పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ ప్రముఖులు . వర్షం చిత్రానికి దర్శకత్వం వహించి నిర్మాతకు కాసుల వర్షాన్ని కురిపించి ,ప్రభాస్ కు స్టార్ డం ని తెచ్చిపెట్టిన దర్శకులు శోభన్ తనయుడే ఈ సంతోష్ . గోల్కొండ్ హై స్కూల్ చిత్రంలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంతోష్ పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ బ్యానర్ లో హీరోగా ''తను -నేను '' చిత్రంలో నటించేసరికి సంతోష్ అదృష్ట వంతుడే అనుకున్నారు కానీ ఇటీవల రిలీజ్ అయిన తను నేను సినిమా ఫ్లాప్ అయినప్పటికీ హీరోగా సంతోష్ నిలబడే చాన్స్ ఉందని ఆశిస్తున్నారు . కేవలం హీరోగానే కాకుండా నటుడిగా ఎటువంటి పాత్ర నైనా చేస్తానంటున్న సంతోష్ హీరోగా నిలబడాలని ఆశిద్దాం .
హ
ర్రర్ కథా చిత్రాలు వరుస విజయాలు సాధిస్తుండటంతో ఆ చిత్రాల జోరు కొనసాగుతోంది . వాస్తు పండితుడిగా విశేషపేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఫణి రాజ్ కుమార్ తాజాగా ''జయంతి '' చిత్రానికి శ్రీకారం చుట్టాడు . స్వీయ దర్శకత్వంలో జయంతి చిత్రాన్ని రూపొందించడమే కాకుండా హీరోగా కూడా నటిస్తున్నాడు ఫణి రాజ్ కుమార్ . సిజయ్ మున్షి , శిఖా మల్హోత్రా హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్లుగా రాధాకృష్ణ ,వేణు ,మహేష్ ,మారుతి శర్మ లను పరిచయం చేస్తున్నాడు . ఈ సందర్భంగా హీరో ,దర్శక నిర్మాత ఫణి రాజ్ కుమార్ మాట్లాడుతూ చిత్ర విశేషాలను వెల్లడించారు . నాకు హీరోగా ,దర్శకుడిగా ఇది తొలి చిత్రమే అయినప్పటికీ , సినిమా రంగం పట్ల పూర్తి అవగాహన ఉండటం వల్ల కొంత కషమై ్ట నప్పటికీ నా మిత్రుల సహకారం వల్ల అనుకున్నది అనుకున్నట్లుగానే చిత్రీకరించానని సినిమా చాలా బాగా వచ్చిందని......... త్వరలోనే ఆడియో ని రిలీజ్ చేస్తామని తెలిపారు ఫణి రాజ్ కుమార్ .
టాలీవుడ్ P 23
యం
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు నేను పెద్ద ఫ్యాన్ ని అని అంటున్నాడు మెగా హీరో వరుణ్ తేజ్ . మెగా హీరో వరుణ్ తేజ్ ఏంటి ? ప్రభాస్ కు ఫ్యాన్ ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇటీవల వరుణ్ ని ఓ అభిమాని మీకు బాగా ఇషమై ్ట న హీరో ఎవరు అని అడిగితే టక్కున చిరంజీవి పేరు చెప్పాడు ,ఆ తర్వాత రాంచరణ్ తేజ్ పేరు చెప్పడంతో మీ ఇంట్లోవాళ్ళు కాకుండా అని అడగడంతో ప్రభాస్ పేరుని కూడా అంతే వేగంగా చెప్పాడు వరుణ్ . ప్రభాస్ యాక్టింగ్ అంటే ఇషమ ్ట ని ,యాక్షన్ సీన్స్ లలలో కూడా చాలా డిఫరెంట్ గా చేస్తాడని చెప్పడంతో కొంతమంది షాక్ అయ్యారు . ఇక వరుణ్ విషయానికి వస్తే ఇటీవలే కంచె చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు .
వి
లక్షణ పాత్రలు పోషించి నటుడిగా సక్సెస్ అయిన ప్రకాష్ రాజ్ ..దర్శకుడిగా మాత్రం సక్సెస్ సాధించలేకపోతున్నాడు..దర్శకుడిగా వరుస ప్లాప్ లు ఎదురౌవుతున్న ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తున్నాడు... ధోని , ఉలవచూరు బిర్యాని సినిమాలను రూపోందించిన ప్రకాష్ రాజ్ దర్శకుడిగా పర్వాలేదనించుకున్నా...ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..అయినా నిరుత్సాహ పడకుండా ముందుకెళ్తున్నాడు...మూడో ప్రయత్నంగా ''మన ఊరి రామాయణం'' పేరుతో కన్నడ ,తెలుగులో భాషల్లో రూపోందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు..ఈ సినిమా కు సంబంధించిన పోస్టర్ ను తన ఫేస్ బుక్ ,ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు..ఈ చిత్రాన్ని ఆయన సోంత నిర్మాణ సంస్థ ప్రకాష్ రాజ్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు..మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ మూవీ పోస్టర్ అందరిని ఆకట్టుకుంటోంది.. మరి ప్రకాష్ రాజ్ దర్శకుడిగా ఈ సినిమాతోనైనా సక్సెస్ సాధిస్తాడో చూడాలి....
24 P టాలీవుడ్
ప వర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,బాబి కాంబినేషన్ లో రూపొందుతున్న ‘సర్దార్ గబ్బర్‌సింగ్ ' చిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటోంది . ఇప్పటికే గుజరాత్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న సర్దార్ టీం మరో షెడ్యూల్ ను గుజరాత్ సమీపంలోని కుచ్‌రన్ ఏరియాలో షూటింగ్ జరుపుకుంటోంది . ఈ విషయం తెలుసుకున్న ఇండియన్ క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్
షూటింగ్ జరుగుతున్న లొకేషన్‌కు వెళ్లి పవన్ కళ్యాణ్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నాడట . పవన్ సినిమాల గురించి అడిగి తెలుసుకున్నాడట .. పవన్ కూడా కపిల్ దేవ్ ఇండియా క్రికెట్ కు సేవలను కొనియాడట ..పవన్ కపిల్ ను కలవడం పై సంతోషం వ్యక్తం చేస్తూ పవన్,కపిల్ కలిసి దిగిన ఫోటోలను ,సర్దార్ టీమ్ దిగిన ఫోటో లను చిత్ర నిర్మాత శరత్ మారర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు .ఇప్పుడు ఆ ఫోటోలను పవన్ ఫాన్స్ షేర్ల మీద షేర్లు చేసుకుంటూ ఆనంద పడుతున్నారు .
మె
గా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస ప్లాప్ లు వచ్చేసరికి సినిమా మీద సినిమాలు చేయడానికి ప్లాన్ సిద్దం చేసుకుంటున్నాడు... ప్రస్తుతం తమిళంలో ఘనవిజయం సాధించిన 'తనీ ఓవరువన్ ' రీమేక్ ను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న చరణ్ ..ఇప్పుడు మరో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చినట్టు పిల్మ్ సర్కిల్స్ ప్రచారం జరుగుతోంది..జిల్ ఫేం రాధాకృష్ణ చెప్పిన లైన్ నచ్చడంతో కథను రెడీ చేసుకొమ్మని చెప్పాడట. అయితే ఈ చిత్రాన్ని ప్రబాస్ స్నేహితులు ప్రమోద్ ,వంశీ లు యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది..ఈ బ్యానర్ లో మిర్చి , రన్ రాజా రన్ , జిల్ , భలే భలే మగాడివోయ్ చిత్రాలు సక్సెస్ కావడంతో ...ఆ బ్యానర్ కు ఉన్న సక్సెస్ సెంటిమెంట్ తనకు కలిసోస్తుందని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది..సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి అవ్వగానే ..ఈ చిత్రం సెట్స్ కి వెళ్లనుందని సమాచారం..ఈ సినిమాతో అయిన చెర్రీ పేట్ మారుతుందో చూడాలి..
టాలీవుడ్ P 25
శ్రీ
వెంకట్, భవ్య శ్రీ ప్రధాన పాత్రల్లో ఎస్ఎస్ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెద్దరాసు సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న చిత్రం సతీ తిమ్మమాంబ. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా వుంది.. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తెలిపేందుకు పత్రికా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో ర్శకుడు బాలగొండ ఆంజనేయులు మాట్లాడుతూ.. ''2012 లో సతీ తిమ్మమాంబ నవల రాశాను. ఒక జానపద చిత్రంగా తెరకెక్కించాలని భావించాను. జానపద చిత్రమయినా.. నవరసాలను మేళవించి తీశాను. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే చిత్రమవుతుంది. అనంతపురం జిల్లాలోని మహావృక్షమైన మర్రిమాను చరిత్రకు సంబంధించిన చిత్రమిది. సినిమా బాగా వచ్చింది. రొటీన్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. నిర్మాత గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇటీవల విడుదలయిన పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది'' అని చెప్పారు.
ద
26 P టాలీవుడ్
ని
ర్మాత పెద్దరాసు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ''ఇదొక చారిత్రాత్మక చిత్రం. రెండు రాజ కుటుంబాలకు చెందిన కథ. మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసేసాం. పాటలకు మంచి స్పందన లభించింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి అయ్యింది. డిశంబర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం'' అని చెప్పారు. రో శ్రీవెంకట్ మాట్లాడుతూ.. ''ఇదొక మంచి హిస్టారికల్ సినిమా. 400 సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమాలో నటించే అవకాసం ఇచ్చిన దర్శకనిర్మాతలకు థాంక్స్'' అని చెప్పారు. చిత్రానికి సంగీతం: బండారు దానయ్య కవి, కెమెరా: షాహిద్ హుస్సేన్, పాటలు: బందరు దానయ్య కవి, బాలగొండ ఆంజనేయులు, ఎడిటింగ్: వినయ్, నిర్మాత: పెద్దరాసు సుబ్రహ్మణ్యం, కథ-మాటలుస్క్రీన్ ప్లే-దర్శకత్వం: బాలగొండ ఆంజనేయులు.
హీ
ఈ
ప్ర
ముఖ సినీనటి జయప్రద కుమారుడు సిద్ధార్థ్ సంగీత్ కార్యక్రమం ఘనంగా జరిగింది. శంషాబాద్‌లోని సుచిర్ టింబర్ లీఫ్‌ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సమాజ్ వాది పార్టీ నేత అమర్‌సింగ్, మంచు.మోహన్ బాబు, మంచులక్ష్మి, జయసుధ, సంగీత దర్శకురాలు ఎంఎం
త
మిళ స్టార్ విజయ్ నటించబోయే 60 వ చిత్రాన్ని తెలుగు వారు నిర్మిస్తున్నారు. తెలుగు అగ్రనిర్మాణ సంస్థ అయిన విజయా ప్రోడక్షన్స్ బ్యానర్ పై బి.భారతి రెడ్డి , బి.వెంకట్రామ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో అణిముత్యాల్లాంటి చిత్రాలను రూపోందించిన విజయ సంస్థ కొన్నాళ్లుగా సినినిర్మాణానికి దూరంగా ఉంటూ వస్తోంది..మంచి చిత్రాలను నిర్మించే ఈ సంస్థ గత రెండేళ్ల క్రితం అజిత్ తో వీరం చిత్రాన్ని నిర్మించి విజయం సాధించింది..ఇప్పుడు భరతన్ దర్శకుడిగా విజయ్ తో సినిమా రూపోందించడానికి సన్నాహాలు చేస్తున్నారు..ప్రస్తుతం విజయ్ తెరి చిత్రంలో నటిస్తున్నాడు.. లేటేస్ట్ గా టైటిల్ ను కన్ఫామ్ చేస్తూ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు మంచి ఆదరణ లభిస్తోంది..ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన వెంటనే విజయా ప్రోడక్షన్ లో చిత్రం ప్రారంభం కానుంది
శ్రీలేఖ హాజరై సరదాగా స్టెప్పులు వేశారు. శుక్రవారం 27న హైదరాబాద్‌లో సిద్ధార్థ్, ప్రవల్లికా రెడ్డి వివాహం జరగనుంది..అయితే సిద్దార్థ తన సోదరుడి కుమారుడు.. జయప్రద ,సిద్దార్థని ఇదివరకే దత్తతు తీసుకుంది..అందుకే తన చేతులు మీదుగా సిద్దార్థ కి పెళ్లి చేస్తోంది.. సిద్ధార్థ కూడా జయప్రద నట వారసుడిగా కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.. తమిళంలో 'ఉయిరే ఉయిరే' అనే చిత్రంలో నటించాడు .ఈచిత్రంలో సిద్దార్థ సరసన హన్సిక నటించింది.. ఈచిత్రం నితిన్ నటించిన ఇష్క్ కు రీమేక్ . ఈ వివాహానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు పలువురు సినీ ,రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది..
టాలీవుడ్ P 27
శ్రీ
నం
రంజిత్ మూవీస్ పతాకం పై కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ ' అలా మొదలైంది' ' అంతకు ముందు ఆ తరువాత ' లాంటి కుటుంబ కధా చిత్రాల తరువాత బి.వి నందిని రెడ్డి దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం " కళ్యాణ వైభోగమే " దిని రెడ్డి తన మొదటి చిత్రం ' అలా మొదలైంది ' శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై రూపొందించింది . స్తుతం యువతలో ప్రేమ , పెళ్లి లాంటి బంధాల పై ఉన్న అభిప్రాయాలను ప్రతి ఒక్కరికి చక్కగా అర్ధమయ్యేలా కామెడీ , సంగీతం మరియు భావోద్వేగాలను సరైన పాళ్ళలో మేళవించి వాటి విలువలను చాటి చెప్పేలా రూపొందించబడిన కుటుంబ కధా చిత్రం " కళ్యాణ వైభోగమే " టింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో భాగంగా ఉంది . చిత్ర నిర్మాతలు త్వరలో ఆడియో ను డిసెంబర్ లో సినిమా ను విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు. నటీనటులు : నాగ శౌర్య , మాళవిక నాయర్ ( ఎవడే సుబ్రహ్మణ్యం ఫేం ) , పెర్ల్ మానె , రాశి ఐశ్వర్య , ఆనంద్ , రాజ్ మదిరాజ్ , తాగుబోతు రమేష్ , ధనరాజ్ , 'మిర్చి' హేమంత్ , స్నిగ్ధ తదితరులు ..సాంకేతిక నిపుణులు : సంగీతం : కళ్యాణ్ కోడూరి సినిమాటోగ్రఫీ : జి . వి . ఎస్ . రాజు ఎడిటర్ : జునైద్ సిద్దిక్ కొరియోగ్రఫీ : చిన్ని ప్రకాష్ , రఘు , అని యాక్షన్ : డ్రాగన్ ప్రకాష్, పాంథర్ నాగరాజు కాస్ట్యూమ్ డిజైనర్ : శ్రీ , వైశాలి డైలాగ్స్ & లిరిక్స్ : లక్ష్మీ భూపాల్ కో - ప్రొడ్యూసర్స్ : వివేక్ కూచిభొట్ల , జగన్ మోహన్ రెడ్డి . వి ప్రొడ్యూసర్ : కె . ఎల్ . దామోదర్ ప్రసాద్ స్టొరీ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం : బి వి నందిని రెడ్డి .
ప్ర
షూ
మె
గా మేనల్లుడు సాయి ధరం తేజ్ ని ఏడిపించాడు హాస్యనటుడు వెన్నెల కిషోర్ . వినడానికి ఇది విచిత్రంగా ఉన్నప్పటికీ వాస్తవమే ! అయితే సాయి ధరం తేజ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు కానీ అది ఏడిపించడం తో కాదు అభిమానం తో నట ! ఇదంతా కూడా జస్ట్ ఫర్ ఫన్ కోసం . వివరాల్లోకి వెళితే ....... సాయి ధరం తేజ్ కు మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు వెన్నెల కిషోర్ అయితే ఆ గిఫ్ట్ కు సాయి కి వెంటనే కన్నీళ్లు వచ్చాయి దాంతో అదే ఫోటో ని సోషల్ మీడియాలో పెట్టి అన్న య్యా! నువ్వ్వు ఇచ్చిన గిఫ్ట్ కు కన్నీళ్లు వచ్చాయన్నా అంటూ కామెంట్ చేసాడు సాయి ధరం తేజ్ . దానికి వెన్నెల కిషోర్ కూడా'' ఏదో కృష్ణుడికి కుచేలుడు అటుకులను ఇచ్చినట్లుగానే ఉడతా భక్తిగా ఏదో చేసానని ''కొంటేగానే సమాధానం ఇచ్చాడు . అదీ విషయం .
28 P టాలీవుడ్
త
మిళ స్టార్ హీరోకు ఓ చెడ్డ పేరుంది అదేమంటే హీరోయిన్ లకు బిర్యానీ పెట్టి పడేస్తాడట! తనతో నటించిన ప్రతీ హీరోయిన్ కు బిర్యానీ ని ఆఫర్ చేసి బుట్టలో పడేస్తుంటాడు, అలా నయనతార ,అనుష్క ,హన్సిక ఇలా చెప్పుకుంటూ పొతే పెద్ద లిస్టే ఉంది, ఆర్య బిర్యానీ కోసం ఇప్పటికి పలువురు హీరోయిన్ లు పోటీ పడుతూనే ఉంటారు .అయితే తాజాగా అనుష్క తో పాటు సోనాల్ చౌహాన్ తో కలిసి ఆర్య నటించిన చిత్రం ''సైజ్ జీరో '' . ఆ చిత్రంలో నటించిన సోనాల్ చౌహాన్ కు ఆర్య బిర్యానీ ఆఫర్ చేయలేదట ఈ విషయాన్నీ సోనాల్ చెప్పింది . ఆర్య తనకు నచ్చిన హీరోయిన్ కు తప్పకుండా బిర్యానీ ని ఆఫర్ చేసి మైకంలో పడేస్తాడు కానీ సోనాల్ కు ఆ చాన్స్ ఇవ్వలేదంటే కారణం ఏంటో మరి .
ఇ
ప్పటికే మెగా ఫ్యామిలీ నుండి బోలెడు మంది హీరోలు వచ్చారు ఇక వాళ్ళ లిస్టు అంతా ఒకటి తయారు చేస్తే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం ,అది చాలనట్లు మరో హీరో రెడీ
అవుతున్నాడు . అతడు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు ,సాయి ధరం తేజ్ తమ్ముడు అయిన వైష్ణవ్ తేజ్ . ఇతడు చిరంజీవి తో ''శంకర్ దాదా జిందాబాద్ '' చిత్రంలో నటించాడు . కుర్చీకే పరిమతం అయిన పేషెంట్ ఉన్నాడు చూడండి ఆ బాలుడే ఈ వైష్ణవ్ తేజ్ . ఒకవైపు అన్న సాయి ధరం తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కొట్టగానే ఇతడికి కూడా హీరో అవ్వాలని ఫిక్స్ అయ్యాడట ! పైగా మెగాస్టార్ కాంపౌండ్ అనే బ్రాండ్ ఎలాగూ ఉంది కాబట్టి సక్సెస్ అవుతాను అనే నమ్ముతున్నాడట వైష్ణవ్ . మెగా ఫ్యామిలీ నుండే ఇంతమంది హీరోలు ఉంటే వాళ్ళను లెక్కపెట్టడం అంటే కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం ఎందుకంటే భారతదేశపు జనాభాలా ............మెగా హీరోల సంఖ్య పెరిగిపోతూనే ఉంది .
టాలీవుడ్ P 29
అ
క్కినేని అఖిల్ రాయభారి గా కనిపించనున్నట్లు తెలుస్తోంది . అఖిల్ ఏంటి ? రాయభారి ఏంటి ? అని అనుకుంటున్నారా ? ఇటీవల కంచె చిత్రంతో కమర్షియల్ హిట్ ని సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు పొందిన దర్శకుడు క్రిష్ . తాజాగా క్రిష్ రాయభారి అనే టైటిల్ ని రిజిస్టర్ చేయించాడు దాంతో అది అఖిల్ కోసమే అన్న మాట వినబడుతోంది . ఇక అఖిల్ మొదటి సినిమాతో ఘోర పరాజయాన్ని అందుకొని తీవ్ర నిరాశలో ఉన్న విషయం తెల్సిందే ! ఆ షాక్ తో అఖిల్ మాత్రమే కాక నాగార్జున సైతం రెండో చిత్రాన్ని చాలా జాగ్రత్తగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు . క్రిష్ అయితే అఖిల్ ని సరైన దిశలో ప్రాజెక్ట్ చేస్తాడని భావిస్తున్నాడట నాగ్ . ఇక క్రిష్ రాయభారి ఎవరు అనేది త్వరలోనే తెలిసిపోనుంది .
స్వ
30 P టాలీవుడ్
ర సంగీతం దేవి శ్రీ ప్రసాద్ హీరో గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నీ కుమారి 21 ఎఫ్ చిత్రం సక్సెస్ మీట్ లో దిల్ రాజు స్వయంగా ప్రకటించాడు. అంతే కాదండోయ్ సినిమాకు సంబందించిన నిర్మాణ పనులు కుడా చాలా వేగంగా చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రకటించిన దిల్ రాజు తాజాగా ఫిలిం చాంబర్ లో 'ఫీల్ మై లవ్ ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. దీంతో దేవి శ్రీ ప్రసాద్ హీరో గా పరిచయం కాబోయే సినిమాకు టైటిల్ ఇదేనని ప్రచారం మొదలైంది. అయితే దేవిశ్రీ ప్రసాద్ అందించిన సూపర్ హిట్ మ్యూజిక్ ఆల్బమ్ ఆర్య సినిమా లోని ఓ పాట పల్లవినే సినిమా పేరుగా రిజిస్టర్ చేయించడం తో ఈ టైటిల్ అయితేనే దేవి కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని ఫీల్ అవుతున్నారు దేవి ఫ్యాన్స్ .
రీ
సెంట్ గా మహేష్ థాంక్యూ సో మచ్ అంటూ దీపిక పదుకొనె ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అయితే దీపిక మహేష్ కు థాంక్స్ ఎందుకు చెప్పిందంటే.... ఈ మద్యన విడుదలైన దీపిక 'తమాషా' చిత్రాన్ని చుసిన మహేష్ దీపిక కు ఫోన్ చేసి తను చేసిన పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్నారట. దాంతో థాంక్స్ మహేష్ అంటూ ట్వీట్ చేసింది ఈ అమ్మడు. అయితే ఈ విషయం తెలియని ఫ్యాన్స్ ఎందుకిల దీపిక చెప్పిందని అనుకుంటున్నారు. అంతే కాదండోయ్ మొన్న ఆ మద్యన ఓ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూ లో మహేష్, దీపిక ప్రస్తావన తెచ్చారు. మహేష్ మాట్లాడుతూ నా ఆల్ టైం ఫేవరట్ హీరోయిన్ శ్రీదేవి , అయితే ఇప్పుడు దీపిక పదుకొనె. ఆమె చాలా తెలివైన నటి, పికూ చిత్రంలో ఆమె నటన చూసి స్టన్ అయ్యాను. అందం , అభినయం ఈ రెండు ఉండడం చాలా గొప్ప విషయం ఈ రెండు దీపికకు ఉన్నాయి అని తెలిపారు. మహేష్ వంటి స్టార్స్ దగ్గర నుండి ఇలాంటి ప్రశంసలు రావడం తో ఆనందంలో మునిగిన దీపిక ఈ విషయం ఫై స్పందిస్తూ థాంక్యూ సో మచ్ అంటూ ట్వీట్ చేసింది.
టాలీవుడ్ P 31
లో
కనాయకుడు కమల్ హాసన్ చీకటి రాజ్యం తర్వాత నటించబోయే చిత్రం 'అమ్మా నాన్న ఆట ' .తమిళంలో 'అప్పా అమ్మా విళయాట్టు ' గా రూపోందుతుంది..ఈ చిత్రంలో కమల్ సరసన అక్కినేని అమల , జరీనా వహాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే..ఈ చిత్ర కథ ప్రకారం మరో హీరోయిన్ తీసుకోవాల్సి వుంది..అయితే ఈ చిత్రంలో శ్రీదేవి నటిస్తోందని కోలీవుడ్ సర్కిల్స్ వినిపిస్తోంది..వీరి కాంబినేషన్ లో వచ్చిన పదహారేళ్ల వయసు ,ఆకలి రాజ్యం ,వసంత కోకిల ,ఎర్ర గులాబీలు బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచాయి..ఈ చిత్రంలో శ్రీదేవి నటిస్తే..దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ వెండితెరపై కనిపించనుంది.. కమల సరసన అమల ,శ్రీదేవి నటిస్తుండటంతో ఈ చిత్రం పై మంచి అంచనాలు నెలకొన్నాయి..
వ
రుణ్ సందేశ్ ,వితిక షేర్ త్వరలో ఒక్కటి కాబోతున్నారు..పడ్డానండీ ప్రేమలో మరి చిత్రంతో ప్రేమలో పడ్డ ఈ జంట లవ్ కి ఫుల్ స్టాప్ పెట్టి ..పెళ్లికి సిద్దమయ్యారు. వీరి ప్రేమను ఒప్పుకున్న ఇరు కుటుంబసభ్యులు డిసెంబర్ 7 నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్నారు...హైద్రాబాద్ లోనే పలువురు సినీ ,రాజకీయ ,కుటుంబసభ్యుల సమక్షంలో ఏంగేజ్ మెంట్ జరుగనుంది..ఈ విషయాన్ని హీరో వరుణ్ సందేశ్ తన ఫేస్ బుక్ ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు..అంతేకాకుండా వీరిద్దరు కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు.. హ్యాపిడేస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన వరుణ్ సందేశ్ యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు....తెలుగు ,తమిళ ,కన్నడ భాషల్లో హీరోయిన్ గా నటించిన వితిక షేరు అందిరికి తెలిసిన అమ్మాయే..వీరి పెళ్లిని వచ్చే ఏడాది పిభ్రవరిలో చేయనున్నట్లు తెలుస్తోంది... కెరీర్ మొదట్లో వరుస సక్సెస్ లు సాధించిన వరుణ్ ..ఇప్పుడు వరుస ప్లాప్ లు పలకరిస్తున్నాయి.. మరి పెళ్లి తర్వాతైన మనోడి దశ తిరుగుతుందో చూద్దాం...
32 P టాలీవుడ్
యం
గ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఈ పేరు నిన్న మొన్నటి వరకు టాలీవుడ్ లో మాత్రమే తెలుసు, కాని ఈ ఏడాది విడుదలై వసూళ్ళ సునామి సృష్టించిన 'బాహుబలి' సినిమా తరువాత ప్రభాస్ పేరు ఇండియా మొత్తం మారు మొగి పోయింది.' బాహుబలి' చిత్రం తర్వాత 'రన్ రాజా రన్ ' ఫేం సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇదివరకే తెలుసు. అయితే ప్రభాస్ పెద్ద నాన్న కృష్ణం రాజు చాలా రోజుల నుండి ప్రభాస్ తో ఓ సినిమా చేయాలనుకుంటున్న విషయం తెలిసిందే. కృష్ణం రాజు తన సొంత బ్యానర్ అయిన గోపికృష్ణ మూవీస్ బ్యానర్ ఫై "దందా" అనే పవర్ ఫుల్ మాస్ టైటిల్ ను ప్రభాస్ కోసమే రిజిస్టర్ చేయించినట్లు తాజా సమాచారం. అయితే ఈ సినిమాకు ప్రభాస్ పెద్ద నాన్న దర్శకత్వం వహించనున్నారా లేదా వేరే ఇంకెవరికైనా దర్శకత్వం వహించనున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇ టీవలే హాలిడే ట్రిప్ ముగించుకొని వచ్చిన రామ్ చరణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం ఫై దృష్టి పెట్టాడు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'తాని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్ చరణ్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరో క్యారేక్టర్ ఎంత ముఖ్యమో ,విలన్ క్యారేక్టర్ కూడా అంతే ముఖ్యం, కాబట్టి గత కొన్ని రోజుల నుండి రామ్ చరణ్ కి ఎవరు విలన్ గా సెట్ అవుతారని వెతుకుతున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా తమిళం లో విలన్ గా నటించిన అరవింద్ స్వామి అయితే కరెక్ట్ సెట్ అవుతాడని భావించిన దర్శక నిర్మాతలు ఆయన్ని కలిసి 5 కోట్లు ఆఫర్ చేసారంట. గత కొద్ది రోజులుగా ఈ ఆఫర్ ని హోల్డ్ లో పెట్టిన అరవింద్ స్వామి ఇప్పుడు తాజాగా తెలుగులో విలన్ గా నటించడానికి ఒకే చెప్పాడట. దాంతో చాలా కాలంగా ఈ చిత్ర యూనిట్ ని టెన్షన్ పెడుతున్న విలన్ రోల్ మ్యాటర్ ఫినిష్ అయ్యింది. ఈ చిత్రాన్ని డిసెంబర్ మొదటి వారంలో లాంచ్ చేసి, జనవరి లేదా ఫిబ్రవరి లో సెట్స్ ఫై కి తిసుకేల్లనున్నారట. అల్లు అరవింద్ - ఎన్. వి ప్రసాద్ లు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
టాలీవుడ్ P 33
డి
సెంబర్1 ప్రపంచ ఎయిడ్స్‌దినోత్సవం సందర్భంగా టీచ్ ఎయిడ్స్ ఇండియా ట్రస్ట్ ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అన్ని వయసుల విద్యార్థినీ విద్యార్థులకు హెఐవి ఎయిడ్స్‌పై అవగాహన కలిగించేందుకు యానిమేటెడ్ మల్టీమీడియా ఇంటరాక్టివ్ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్ పేరుతో సి.డి.ని విడుదల చేసింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి చెందిన 22 మంది నటీనటులు ఈ యానిమేటెడ్ ఫిలింలో తమ క్యారెక్టర్లకు వాయిస్‌ని అందించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జున, అనుష్క, సుదీప్, శృతిహాసన్, షబానా ఆజ్మీ, సూర్య, సుహాసిని, సిద్ధార్థ, స్వాతి, ఇమ్రాన్‌ఖాన్‌తదితర ప్రముఖులు ఈ యానిమేటెడ్ ఫిల్మ్‌లో క్రియేట్ చేసిన తమ క్యారెక్టర్లకు వాయిస్‌ని అందించారు. నేషన్ వైడ్‌గా అన్ని స్కూల్స్‌కి, ఇతర విద్యాలయాలకు ఈ వీడియోను డిసెంబర్ నెలలో పంపిణీ చేస్తారు. ఈ మల్టీమీడియా ఇంటరాక్టివ్ కంటెంట్‌ను హెల్త్ ఎడ్యుకేటర్స్, లేపర్సన్స్ ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. వీడియోను నవంబర్ 30న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీచ్‌ఎయిడ్స్ వ్యవస్థాపకురాలు, సి.ఇ.ఓ. డా|| పియా సర్కార్, టీచ్‌ఎయిడ్స్ ట్రస్టీ అయిన అక్కినేని అమల, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ జయేష్‌రంజన్‌ఐఎఎస్, అగ్రికల్చర్‌అండ్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ సి.పార్థసారథి ఐఎస్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా టచ్‌ఎయిడ్స్ వ్యవస్థాపకురాలు, సి.ఇ.ఓ. డా|| పియా సర్కార్ మాట్లాడుతూ - ''ఈ మల్టీమీడియా ఇంటరాక్టివ్ వీడియోను రూపొందించేందుకు ఎంతో రీసెర్చ్ చేశాం. హెచ్‌ఐవి ఎడ్యుకేషన్ మెటీరియల్ ఎవరికైతే అవసరమో వారు ఎలాంటి అభ్యంతరం లేకుండా ఉపయోగించుకోవచ్చు. ఈ వీడియోను తయారు చెయ్యడంలో ముఖ్యంగా ఇండియాలోని ప్రముఖ నటనటులు తమ తమ వాయిస్‌ని ఇచ్చినందుకు వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు
తెలియజేస్తున్నాను. ఈ నెలలోనే ఈ మెటీరియల్‌ను ఇండియా అంతా డిస్ట్రిబ్యూట్ చెయ్యడం జరగుతుంది'' అన్నారు. చ్‌ఎయిడ్స్ ట్రస్టీ అక్కినేని అమల మాట్లాడుతూ ''యువతీ యువకులంతా హెచ్‌ఐవి విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. టీచ్‌ఎయిడ్స్ ద్వారా ఎంతో విలువైన ఎడ్యుకేషన్ మెటీరియల్‌ను ఉచితంగా ఇండియాలోని విద్యార్థులకు అందించడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. దేశంలోని స్కూల్స్, హాస్పిటల్స్, కౌన్సిలింగ్ సెంటర్స్‌లకు లక్ష మాస్టర్ కాపీలను పంపిణీ చెయ్యాలన్నది మా లక్ష్యంగా పెట్టుకున్నాం. హెచ్‌ఐవికి సంబంధించిన విజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికీ తెలిజెయ్యాలన్నది మా సంస్థ ప్రధాన ఉద్దేశం'' అన్నారు. గ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ సి.పార్థసారథి మాట్లాడుతూ - ''ఈ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్ మెటీరియల్‌ను 7 భాషల్లో 14 వెర్షన్స్‌లో రూపొందించారు. ఈ కంటెంట్ ద్వారా హెచ్‌ఐవి నాలెడ్జ్‌ని ప్రతి ఒక్కరిలోనూ పెంచాలన్నది టీచ్‌ఎయిడ్స్ సంస్థ లక్ష్యం. దీంతో ఇండియాలోని విద్యార్థులంతా ఈ ఎడ్యుకేషన్ మెటీరియల్ ద్వారా హెచ్‌ఐవిపై పూర్తి పరిజ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తున్నాను'' అన్నారు. న్‌ఫర్మేషన్ టెక్నాలజీ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ - ''ఒక సిస్టమాటిక్‌గా దేశంలోని ప్రతి గ్రామానికి ఈ ఎడ్యుకేషన్‌ను పంపించాలని ప్రయత్నిస్తున్నాం. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేశంలోని అన్ని చోట్ల అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా హెచ్‌ఐవిపై పూర్తి అవగాహన కల్పించేందుకు వీలు కలుగుతుంది. దాని కోసం టీమ్‌ఎయిడ్స్ సంస్థ చేసిన ఆరు సంవత్సరా కృషి ఫలితంగా ఇప్పుడు ఈ మల్టీమీడియా ఇంటరాక్టివ్ హెచ్‌ఐవి ఎడ్యుకేషన్ అనే తయారైంది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను'' అన్నారు.
టీ
ఈ
అ
ఈ
ఇ
34 P టాలీవుడ్
ఇ
ప్పటికే ఎండార్స్ మెంట్ల విషయం లో సౌత్ ఇండియాలోనే టాప్ ప్లేస్ లో ఉన్న మహేష్ బాబు ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపిస్తున్నాడు. శ్రీమంతుడు సినిమాతో భారి కలెక్షన్లతో పాటు ఓవర్ సిస్ లో తన స్టామినా ఏంటో నిరూపించుకున్నాడు. దీంతో టాలీవుడ్ సూపర్ స్టార్ ఫై పలు భడా కంపెనీలు దృష్టి సారించాయి. ఇప్పటికే అత్యధిక బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న మహేష్ బాబు , ప్రస్తుతం అమీర్ ఖాన్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న పలు కంపెనీలు, ఆయనతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ సమయం ముగుస్తుండడం తో మహేష్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి రెడి అవుతున్నాయట. ఇప్పటి వరకు సౌత్ ఇండియాలో మాత్రమే యాడ్స్ చేసిన మహేష్ త్వరలోనే నేషనల్ యాడ్స్ లో కనిపించనున్నాడు.
కాం
ట్రవర్షియల్ డైరెక్టర్ వర్మ కన్ను ఇప్పుడు సెన్సార్ బోర్డ్ పై పడింది..సెన్సార్ బోర్డు ను రద్దు చేయాలంటూ లేటేస్ట్ కామెంట్స్ చేశాడు వివాదాల వర్మ.. ప్రస్తుతం ఏ సమాచారం కావాలన్నా ఇంటర్నెట్ లో దోరుకుతుందని ..ఇలాంటప్పుడు సెన్సార్ బోర్డ్ అవసరం ఎంతమాత్రం లేదన్నాడు..అంతేకాకుండా పోర్న్ సైట్లు చూడాలనుకున్నా..సెల్ ఫోన్ల లో అందుబాటులో ఉంటున్నాయని ,మనం డిజిటల్ ప్రపంచంలో బతుకుతున్నామని ,నలుగురైదుగురు కూర్చోని ఏం చూడాలో ..ఏం చూడద్దో డిసైడ్ చేయడం సరైంది కాదని అన్నాడు..లేటేస్ట్ గా జేమ్స్ బాండ్ సీరస్ లో వచ్చిన స్పెక్టర్ లో లిప్ లాక్ ను కుదించడం పై సెన్సార్ బోర్డుపై విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఢీల్లీలో జరుగుతున్న టైమ్స్ లిట్ ఫెస్టివల్ సందర్భంగా వర్మ ఈ కామెంట్స్ చేశారు..అయితే సెన్సార్ బోర్డ్ ఛీప్ నిహ్లానీ నిబందనల మేరకు నడుచుకున్నాడని ..దీని పై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..ఇలా సెన్సార్ బోర్డ్ ను నిందించడం సబబుకాదని మద్దతు తెలిపి చివరిలో ట్విస్ట్ ఇచ్చాడు వర్మ .
టాలీవుడ్ P 35
బా
లీవుడ్ బిగ్ బి కలకత్తా రోడ్ల పై స్కూటర్ తో చక్కర్లు కొట్టాడు..కలకత్తా వీధుల్లో అమితాబ్ స్కూటర్ నడుపుతుంటే చూసిన అభిమానులు ఎంతో ఆనందపడ్డారు.. అయితే ఏదో సరదాకోసం అమితాబ్ స్కూటర్ నడుపలేదు.. రిబూ దాస్‌గుప్తా రూపొందిస్తున్న 'టీఈ3ఎన్' (Te3N) చిత్రం కలకత్తాలో షూటింగ్ జరుపుకుంటోంది.. అమితాబ్ తో పాటు నవాజుద్దీన్ సిద్దిఖీ , విద్యాబాలన్ నటిస్తున్న ఈచిత్రాన్ని సుజయ్ ఘోష్ నిర్మిస్తున్నాడు.. టీఈ3ఎన్ చిత్రంలో స్కూటర్ నడపడం.. పీకూ చిత్రంలో సైకిల్ తొక్కడం.. చాలా సరదాగా ఉందన్న అమితాబ్ షూటింగ్ లో పాల్గోన్నఫోటోలను ట్విటర్ ్ట లో పోస్ట్ చేసి తన ఆనందాన్ని అబిమానులతో పంచుకున్నాడు...అమితాబ్ హెల్మెట్ పెట్టుకుని ,గళ్ల చొక్కా వేసుకొని వున్న ఫోటోలు చాలా సింపుల్ గా మద్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిలా ఉన్న ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి..
మ
ణికొండ లోని మన స్టూడియోలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది..మనా స్టూడియో అధినేత ,సీరియల్ ప్రోడ్యూసర్ డి.వై చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ,మణి కొండ సర్పంచ్ నరేందర్ రెడ్డి పలువురు ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.. హరి హర సుతుడు అయ్యప్ప శరణు ఘోష లతో ఆలయ మనస్టూడియో మారుమోగింది. మాలలతో అలంకరించిన విజ్ఞేశ్వర, సుబ్రమణ్య స్వాములతో పువ్వులు దీపాలు మరియు పండ్లతో అలంకరించిన పద్ని దె మిది పడి మెట్లపై స్వామి సేద తీరాడు ... అయ్యప్ప భజనలతో భక్తులు తన్మయత్వం చెందారు ... స్వామివారికి పుశాప్భిషేకం,పంచామృతం ,చందనం మరియు విభూది తో అభిషేకం చేసారు ... స్వామివారికి ప్రియమైన పొంగళ్ళు నైవేద్యం సమర్పించారు ...అయ్యప్ప పడి పూజను తిలికించడానికి చుట్టుప్రక్కల నుంచి అయ్యప్ప భక్తులు , మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు...ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పడిపూజ లో పాల్గోనడం అదృష్టంగా విస్తున్నానని డి.వై చౌదరి ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చానని..పూడిపూజలో పాల్గోన్నందుకు ఆనందంగా ఉందని తెలిపారు...
భా
36 P టాలీవుడ్
గో
వా బ్యూటీ ఇలియానా బాలీవుడ్ లో ఒక గోల్డెన్ చాన్స్ కొట్టేసింది..మూడేళ్లుగా సరైన ఆఫర్లు లేక వెలవెలబోతున్న ఇలియానాకు అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కినట్లు బాలీవుడ్ లో వినిపిస్తోంది.. అక్షయ్ కుమార్ హీరోగా నటించబోతున్న కొత్త చిత్రం ' రుస్తుం ' లో ఈ అమ్మడు అక్షయ్ తో రోమాన్స్ చేయబోతుంది.. నిజజీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని టిను దేశాయ్ తెరకెక్కించనున్నాడు..ఈ చిత్రంలోని ఓ నెగిటివ్ పాత్రకు బాలీవుడ్ నటి ఇషా గుప్తాని చిత్ర బృందం సంప్రదించింది.అయితే ఇప్పటివరకు ఏ విషయం నిర్థారణ కాలేదని ఇషా వెల్లడించింది. ప్రస్తుతం అక్షయ్ నటిస్తున్న 'ఎయిర్ లిఫ్ట్ ను జనవరిలో రిలీజ్ అవుతోంది..ఇది రిలీజ్ కాగానే రుస్తుం ను ప్రారంభించి అగష్ట్ లో రిలీజ్ చేయడానికి చిత్రయూనిట్ ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తోంది..
బా
లీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కరిష్మా కపూర్ ..సినిమాలకు దూరం అయి..సంజయ్ కపూర్ ని వివాహం చేసుకుంది.. కానీ ఆమె పెళ్లి చేసుకున్న ఏడేళ్లకి కుటుంబకలహాలు మొదలయ్యాయి..దీంతో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టులో ఫిటిషన్ వేసింది..అయితే ఇప్పుడు మాత్రం విడాకులు రద్దు చేసుకోవాలని బావిస్తుంది..వీరిద్దరి మధ్య కొన్ని విషయాలు పరిష్కారం కాకపోవడంతో విడాకుల కేసు వాయిదా లా మీద వాయిదాల పడుతూ వస్తోంది.. వీరద్దరు ఒక ఒప్పందానికి రాకపోతే కోర్టు ఆదేశాల ప్రకారం కేసు విత్ డ్రా చేసుకోవాల్సి వస్తోంది..ఇప్పుడు అదే జరిగింది.. విడాకుల నేపధ్యంలో కోర్టు ఆదేశాల ప్రకారం భర్త సంజయ్ నుంచి రావాల్సిన ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇంకా పూర్తికానందున పీటిషన్ వాపస్ తీసుకొనే ఆలోచనలో కరిష్మా ఉన్నట్లు సమాచారం..2010 నుంచి వేరుగా వీరిద్దరు వేరుగా ఉంటున్నారు..మరో వైపు పిల్లల కొరకు బాంద్రా కోర్టులో సంజయ్ గతంలో కస్టడీ పిటీషన్ దాఖలు చేశారు. అందులో ఫార్మా కంపెనీ అధినేత సందీప్ తోష్నివాల్‌తో కరిష్మా డేటింగ్ చేస్తోందని పేర్కొన్నాడు. వీరిద్దరు ఓ ఒప్పందానికి వచ్చే వరకు విడాకులు మంజూరులో ఆలస్యం జరుగుతోందని తెలుస్తోంది.
టాలీవుడ్ P 37
వి
క్టరీ వెంకటేష్ ,దర్శకుడు మారుతి కాంబినేషన్లో ఓ సినిమా మొదలై అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. భలే భలే మగాడివోయ్ సూపర్ హిట్ అవడం తో ఇప్పుడా కాంబినేషన్ పట్టాలేక్కబోతోంది. అయితే ఇంతకు ముందు వీరిద్దరి మధ్య సినిమా అనౌన్స్ అయినప్పుడు సినిమా టైటిల్ ను 'రాధ' అన్నారు. కాని ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ను 'బాబు బంగారం' గా ఖరారు చేసాడు దర్శకుడు మారుతి. అనామిక తర్వాత డైరెక్ట్ తెలుగు సినిమా లలో కనిపించని నయనతార , వెంకటేష్ తో లక్ష్మి, తులసి లాంటి హిట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళి ఈ చిత్రం లో వెంకటేష్ సరసన ముచ్చటగా మూడో సారి హీరోయిన్ గా నటించనుంది. డిసెంబర్ 16 నుండి ఈ చిత్రం షూటింగ్ మొదలు కానుంది.
ప
టాలీవుడ్ P 38
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పులి చిత్రంలో నటించిన భామ నికిషా పటేల్ తాజాగా క్లీవేజ్ షోతో చంపేస్తోంది కుర్రకారుని . తెలుగులో పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఈ భామని సరిగా పట్టించుకోలేదు దాంతో తమిళ నాట తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది . తాజాగా ఈ భామ తమిళంలో నటిస్తున్న చిత్రం ''కరై ఒరం ''ఆ చిత్రంలో గ్లామర్ తో అదరగొడుతోంది . నిన్న రాత్రి జరిగిన ఆడియో వేడుకకు వచ్చిన నికిషా క్లీవేజ్ షోతో ఆకట్టుకుంది . పిక్కల బలాన్ని కూడా చూపిస్తూ కంటికింపు గా కనిపించింది అదే కాదండోయ్ కాస్త లావు కూడా అయ్యింది నికిషా . ఆడియో వేడుకలో గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది .
మ
చరిత్ర` వంటి క్లాసిక్ సినిమాతో తెలుగు రో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నారు కమల్ హాసన్. సాగరసంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం వంటి సినిమాలతో విలక్షణ నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఇటీవలే విశ్వరూపం, ఉత్తమ విలన్ వంటి సినిమాలతో చక్కని విజయాలు అందుకున్నారు. యూనివర్శల్ హీరోగా కమల్ వరల్డ్‌వైడ్ స్టార్‌డమ్ సంపాదించుకున్న కమల్‌హాసన్ చాలా గ్యాప్ తర్వాత నేరుగా తెలుగులో నటించిన `చీకటిరాజ్యం` చిత్రంతో కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇదో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంటోంది. విశ్వనటుడు, లోకనాయకుడు కమల్‌హాసన్ కథానాయకుడిగా రాజేష్. ఎం.సెల్వ దర్శకత్వంలో రాజ్‌కమల్‌ఫిల్మ్స్‌ఇంటర్నేషనల్- శ్రీ గోకుళం మూవీస్ సంయుక్తంగా నిర్మించిన 'చీకటిరాజ్యం' నవంబర్20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజై భారీ ఓపెనింగ్స్ సాధిస్తోంది. మొదటి రోజు ఈ సినిమా ఏకంగా ఏపీ, తెలంగాణలో 1 కోటి 40 లక్షల గ్రాస్ (86 లక్షల షేర్) వసూళ్లు సాధించింది. ఈ ఆదివారం నుంచి మరో 25 -30 థియేటర్లను పెంచనున్నారు. ఈ విజయం మరో 10 ప్రయోగాత్మక సినిమాల్లో నటించేందుకు ఉతం ఇచ్చిందని చెబుతున్నారు కమల్‌హాసన్. హైదరాబాద్ పార్క్ హయత్ స్టార్ హోటల్‌లో జరిగిన సక్సెస్ మీట్‌లో విశ్వనటు డు కమల్ హాసన్ సహా మేటి నటి అక్కినేని అమల, `చీకటిరాజ్యం` దర్శకు డు రాజేష్ ఎం సెల్వ, కథానాయిక మధుశాలిని, రచయిత అబ్బూరి రవి తదితరులు పాల్గొన్నారు. క్సెస్ మీట్‌లో యూనివర్శల్ హీరో కమల్‌హాసన్ మాట్లాడుతూ -``చీకటిరాజ్యం చాలా డిఫరెంట్ ఫిలిం. ఇలాంటి సినిమాలు నచ్చకపోతే మళ్లీ తీయాలని అనిపించదు. నచ్చితే మరెన్నో ప్రయోగాత్మక సినిమాలు చేయాలని అనిపిస్తుంది. వెంట వెంటనే డిఫరెంట్ మూవీస్ తీసేందుకు స్కోప్ పెరుగుతుంది. తెలుగు
స
ప్రేక్షకులు మరోచరిత్ర అనే చిత్రంతో డోర్ ఓపెన్ చేశారు. ఇప్పుడు చీకటిరాజ్యం సక్సెస్‌తో ప్రయోగాలు చేసేందుకు డోర్ ఓపెన్ చేశారు. తెలుగువారి నుంచి ఇంత మంచి ఆదరణ దక్కినందుకు సంతోషంగా ఉంది. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ చిత్రంలో జిబ్రాన్ సంగీతం బావుందని అన్నారు. నేరుగా ఇలా సక్సెస్‌మీట్‌లో చీకటిరాజ్యం పంపిణీదారులు వచ్చి సక్సెస్ గురించి చెబుతుంటే చెవికి ఇంపుగా మ్యూజిక్‌లా ఉంది. జిబ్రాన్ మ్యూజిక్ కంటే ఈ మాట చాలా బావుంది. అంతేకాదు .. ఈ సక్సెస్ మీట్‌కి అమల గారు రావడానికి కారణం ఉంది. తను నా సినిమాలో అతిధి పాత్రలో నటిస్తున్నారు. అమ్మ నాన్న ఆట .. అనేది టైటిల్. త్వరలోనే సెట్స్‌కెళ్లనుంది`` అని చెప్పారు. న్నో వైవిధ్యభరితమైన సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నకమల్ హాసన్ లేటెస్టుగా `చీకటిరాజ్యం` సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పుడు నేరుగా మరో తెలుగు సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ `అమ్మా నాన్న ఆట`. నాటి మేటి నటి అక్కినేని అమల ఈ చిత్రంలో అతిధి పాత్రలో నటించనున్నారని, అమ్మా నాన్న ఆట అనే టైటిల్ నిర్ణయించామని కమల్ హాసన్ `చీకటిరాజ్యం` సక్సెస్‌మీట్‌లో అధికారికంగా ప్రకటించారు. కొత్త ప్రాజెక్టు గురించి యూనివర్శల్ హీరో కమల్ హాసన్ మాట్లాడుతూ -``టైటిల్‌కి తగ్గట్టే ఇదో ఫ్యామిలీ డ్రామా. రొమాన్స్, హాస్యం ఆకట్టుకుంటాయి. ఈ చిత్రంలో అమల గారు అతిధిగా నటిస్తున్నారు. తనతో చాలా కాలానికి కలిసి నటించే అవకాశం వచ్చింది. నాటి రోజుల్లో మేం ఎన్నో విజయవంతమైన సినిమాల్లో జోడీగా నటించాం. ఇంతకాలానికి మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు కనిపించబోతున్నాం. నా స్నేహితుడు, మలయాళంలో ఫేమస్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ (చాణక్య ఫేం)ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. జరీనా వహబ్ ఓ కీలకమై న పాత్రలో నటిస్తున్నారు. మరో యంగ్ హీరోయిన్ నటించనుంది. ఈ సినిమాలో నేను ఎవరితో రొమాన్స్ చేస్తాను అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్`` అంటూ చెప్పుకొచ్చారు.
ఎ