DECEMBER 2016 VOL 13 ISSUE 12
/tollywood /tollywood
RNI NO: APTEL/2003/10076
TOLLYWOOD.NET
క్వాం
టికో సిరీస్ లో నటించి సంచలనం సృష్టించిన ప్రియాంక చోప్రా నాని తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి . హాలీవుడ్ రేంజ్ కి వెళ్లిన ప్రియాంక చోప్రా లోకల్ గా కొన్ని ప్రాంతీయ చిత్రాలను నిర్మించాలని అనుకుందట అందులో భాగంగా మొదట మరాఠీ లో నిర్మించింది ఆ సినిమా హిట్ కావడంతో మరింత ఉత్సాహం వచ్చింది అందుకే తెలుగులో నాని తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఒకవైపు హాలీవుడ్ , బాలీవుడ్ చిత్రాలు చేస్తూ బిజీ గా ఉన్న ప్రియాంక మరోవైపు సినిమా నిర్మాణం కూడా చేపట్టాలని భావిస్తోందట . నాని తెలుగులో వరుసగా విజయాలు సాధిస్తున్నాడు . ఇప్పటివరకు గత రెండేళ్లుగా 5వరుస విజయాలను అందుకున్నాడు , కాగా ఆరో చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు .
“YOU ARE ALWAYS RESPONSIBLE FOR HOW YOU ACT, NO MATTER HOW YOU FEEL. REMEMBER THAT.” Murali Mohan Ravi
Credits:
Editor in Chief Executive Editor Associate Editor Web Developer/Designer Content Editor Photographer Publication Consultant Distributed By
: : : : : : : :
Murali Mohan Ravi Satyam Gorantla Prathama Singh Moulali Deshamoni V Ravi Goud R.K. Chowdary Raghurama Raju Kalidindi Murthy
Follow Us On :
Email: editor@tollywoodmag.com I www.tollywood.net Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 DECEMBER 2016
టాలీవుడ్ P 3
ఎ
వడే సుబ్రమణ్యం, భలే భలే మగాడివోయ్, కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్‌మేన్, మజ్ను వంటి వరస హిట్స్‌తో ప్రేక్షకుల అపూర్వ ఆదరాభిమానాలను అందుకొని ప్రస్తుతం 'నేను లోకల్' చిత్రంలో నటిస్తున్న నేచురల్‌స్టార్ నాని హీరోగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్ని నిర్మించిన భారీ నిర్మాత దానయ్య డి.వి.వి... శివ నిర్వాణ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్‌ఎల్‌పి పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్‌నెం.3 షూటింగ్‌నవంబర్23 ఉదయం 9.38 గంటలకు ఫిలింనగర్ దైవ సన్నిధానంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రారంభమైంది. నాని, నివేథా థామస్, ఆది పినిశెట్టిలపై తీసిన ముహూర్తపు షాట్‌కి సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ కొట్టగా, సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి, ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్, దామోదర ప్రసాద్, మైత్రి మూవీస్ యలమంచిలి రవిశంకర్, దర్శకుడు బి.వి.ఎస్.రవి, జెమిని కిరణ్, శివలెంక కృష్ణప్రసాద్, బెక్కం వేణుగోపాల్ తదితరులు ఈ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. చిత్రం గురించి నాని మాట్లాడుతూ - ''వరసగా మంచి సినిమాలు చేసే అవకాశం వచ్చిన నాకు 'నేను లోకల్' తర్వాత ఎలాంటి సినిమా చెయ్యాలా అని ఆలోచిస్తున్న టైమ్‌లో శివ వచ్చి ఈ స్టోరీ చెరప్పగానే ఇలాంటి సినిమానే చెయ్యాలనిపించి ఇమ్మీడియేట్‌గా అంగీకరించాను. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఎంటర్‌టైనింగ్‌గా సాగే ఈ సినిమా టీమ్ అంతా నాకు ఇష్టమైన టీమ్. శివ, కోన వెంకట్, కార్తీక్ ఘట్టమనేని, గోపీసుందర్, హీరోయిన్ నివేథా వీళ్ళందరితో కలిసి చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. ఆది పినిశెట్టి నేను కలిసి
ఈ
4 P టాలీవుడ్
వర్క్ చేస్తున్నాం. నాకు మరో మంచి సినిమా అవుతుంది'' అన్నారు. ర్మాత దానయ్య డి.వి.వి. మాట్లాడుతూ - ''నానితో ఫస్ట్ టైమ్ మా బేనర్‌లో చేస్తున్నాం. ఈ చిత్రం 80 శాతం షూటింగ్ అమెరికాలో వుంటుంది. చాలా భారీ సినిమా. మిగిలిన షూటింగ్‌హైదరాబాద్, వైజాగ్‌లలో జరుగుతుంది. శివ చెప్పిన కథ నచ్చి కథకు పూర్తి న్యాయం జరిగేలా భారీ ఎత్తున ఈ సినిమా చేస్తున్నాం. డిసెంబర్5 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ప్రారంభించి ఏకధాటిగా చేస్తాం'' అన్నారు. చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్న యంగ్‌హీరో ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ''మలుపు, సరైనోడు చిత్రాలతో నన్ను బాగా ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. నాని, నేను కలిసి చేస్తున్న ఈ కథ నాకు బాగా నచ్చింది. శివ ఈ సబ్జెక్ట్ ని చాలా ఇంట్రెస్టింగ్‌గా చెప్పాడు. నా క్యారెక్టర్‌ఏంటి? అన్నది ముహూర్తం రోజు చెప్పడం కంటే రిలీజ్ ముందు చెప్తే బాగుంటుంది. డెఫినెట్‌గా నా కెరీర్‌కి ప్లస్ అయ్యే సినిమా ఇది'' అన్నారు. రోయిన్ నివేథా థామస్ మాట్లాడుతూ ''జెంటిల్‌మన్‌తర్వాత నానితో మళ్ళీ వర్క్‌చెయ్యడం ఆనందంగా వుంది. ఈ సబ్జెక్ట్, ఈ టీమ్‌అంతా వండర్‌ఫుల్. ఎప్పుడెప్పుడు షూటింగ్ చేస్తానా అని చాలా ఎక్సైటింగ్‌గా వుంది '' అన్నారు. ర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ - ''ఒక సెన్సిబుల్ పాయింట్‌ని ఎంటర్‌టైనింగ్ వేలో చెప్పే ప్రయత్నం ఇది. నానికి కథ చెప్పగానే వెంటనే ఓకే అన్నారు. కోన వెంకట్‌గారి స్క్రీన్‌ప్లే ఈ కథకు ఇంకా గ్రిప్ తెచ్చింది. దానయ్యగారిలాంటి పెద్ద ప్రొడ్యూసర్ బేనర్‌లో ఇంత మంచి టీమ్‌తో నా తొలి చిత్రం చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను'' అన్నారు.
ని
ఈ హీ
ద
క
్నడంలో సూపర్‌హిట్ అయిన శివలింగ చిత్రాన్ని న అభిషేక్ ఫిలింస్ బ్యానర్‌పై రాఘవేంద్ర లారెన్స్, రితిక సింగ్ హీరో హీరోయిన్లుగా పి.వాసు దర్శకత్వంలో రమేష్ పి.పిళ్లై నిర్మిస్తున్నారు. ఒక సాంగ్ మినహా సినిమా చిత్రీకరణ అంతా పూర్తయ్యింది. ఈ సందర్భంగా ఇటీవల చిత్రయూనిట్ హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్లో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ చిత్రంలో.. లారెన్స్ చాలా రిస్క్‌తీసుకుని నటించారు ర్శకుడు పి.వాసు మాట్లాడుతూ - శివ లింగ చిత్రాన్ని తెలుగు, తమిళంలో ఏక కాలంలో సినిమాను షూటింగ్ చేశాం. కాంచన, కాంచన2లకు రాఘవేంద్ర లారెన్స్ ఎంత రిస్కు తీసుకుని నటించాడో అంత కంటే ఎక్కువ రిస్కు తీసుకుని ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. ఓ సాంగ్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది`` అన్నారు. కన్నడ కంటే తెలుగులో పెద్ద హిట్ కావాలి విచంద్రన్ మాట్లాడుతూ - ``కన్నడలో శివలింగ సెన్సేషనల్ హిట్ సాధించింది. ఇప్పుడు తెలుగు, తమిళంలో వాసుగారి దర్శకత ్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కన్నడం కంటే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు. ర్మాత రమేష్ పి.పిళ్లై మాట్లాడుతూ - ``వాసుగారు, లారెన్స్‌గారి కాంబినేషన్‌లో రూపొందుతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు. ఎస్.ఎస్.థమన్ మాట్లాడుతూ - ``నేను, లారెన్స్‌గారు చేసిన కాంచన, కాంచన2 సినిమాలు పెద్ద విజయాలు సాధించాయి. ఇప్పుడు మా కాంబినేషన్‌లో శివలింగ
ద ర
ని
సినిమా రూపొందుతోంది. ఈ సినిమా జనవరిలో విడుదల కానుంది. వాసుగారి వంటి సీనియర్ దర్శకుడితో కలిసి వర్క్‌చేయడం ఆనందంగా ఉంది. సినిమాలో ఆరు పాటలున్నాయి. అన్నీ సాంగ్స్ బాగా వచ్చాయి. సర్వేష్ మురారిగారు అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. నిన్న హైదరాబాద్‌లో చిత్రీకరణ పూర్‌ాయ్యింది. ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. నవంబర్ 25 నుండి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ స్టార్ట్ చేస్తాం. డిసెంబర్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తాం. జనవరిలో సినిమా రిలీజ్ ఉంటుంది. డిసెంబర్ మొదటి వారంలో ఆడియో విడుదల చేస్తున్నాం`` అన్నారు. ఘవేంద్ర లారెన్స్ మాట్లాడుతూ - ``కాంచన పెద్ద హిట్ అయ్యింది. కాంచన కంటే గంగ ఇంకా పెద్ద హిట్ అయ్యింది. గంగ కంటే పెద్ద హిట్ మూవీ చేయాలని ఎదురుచూస్తున్న సమయంలో వాసుగారు శివలింగ సినిమా చూడమన్నారు. చూడగానే నచ్చింది. సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను. ఈ సినిమాకు కథే మొదటి హీరో. రితిక సింగ్ రెండో హీరోయిన్, శక్తివాసు మూడో అయితే నేను నాలుగో హీరోఅవుతానంతే. సినిమా అంత మంచి కథతో రూపొందింది. చంద్రముఖి సినిమాలో రితికసింగ్‌కు ఎంత మంచి పేరు వచ్చిందో రితికకు అంత మంచి పేరు వస్తుంది. రితిక ఇంటర్వెల్ బ్లాక్‌లో చేసిన నటన చూసి థ్రిల్ అయ్యాను. ఇక దర్శకుడు వాసుగారు గురించి చెప్పాలంటే నా ఫేవరేట్ హీరో రజనీకాంత్‌ను డైరెక్ట్ చేసిన వాసుగారి దర్శక త్వంలో నటించడం ఆనందంగా ఉంది. సినిమాకు ప్రేక్షకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను`` అన్నారు.
రా
టాలీవుడ్ P 5
న
సింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రధారిగా ట జాగర్లమూడి క్రిష్ దర్శక త్వంలో ఫస్ట్‌ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `గౌతమిపుత్ర శాతకర్ణి`. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా సినిమా విడుదలవుతుంది. తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన తెలుగు చక్రవ ర్తి గౌతమిపుత్ర శాతకర్ణి నేపథ్యంలో రూపొందుతోన్న ఈ చిత్రం కోసం నందమూరి అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నందమూరి అభిమానులు సినిమా విజయవంతం కావాలని ఆశిస్తూ నవంబర్ 28 కార్తీక సోమవారం రోజున దేశవ్యాప్తంగా ఉన్న 1116 శివాలయాల్లో ఏకకాలంలో మహారుద్రాభిషేకంను నిర్వహిస్తున్నారు. ల్ ఇండియా ఎన్.బి.కె.ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మహారుద్రాభిషేకం జరగనుంది. ఈ రుద్రాభిషేకంలో ఏదేని ఓ ఆలయంలో జరిగే రుద్రాభిషేకంలో నందమూరి బాలకృష్ణ పాల్గొంటున్నారు. దేశంలో ఏ హీరోకు నిర్వహించని విధంగా నందమూరి బాలకృష్ణ కోసం ఆయన నటించిన 100వ చిత్రంగౌతమిపుత్ర శాతకర్ణి కోసం ఆయన అభిమానులు వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఆ 6 P టాలీవుడ్
పృ
థ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా, సలోని, శృతి సోధి హీరోయిన్లుగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ నిర్మించిన ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 23న విడుదల చేసేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్ సన్నాహాలు చేస్తున్నారు. సందర్భంగా నిర్మాత కె.కె.రాధామోహన్ మాట్లాడుతూ - ''పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈనెలలోనే చిత్రాన్ని రిలీజ్ చెయ్యాల్సి వుండగా, ప్రస్తుతం అందరూ ఎదుర్కొంటున్న కరెన్సీ సమస్యను దృష్టిలో వుంచుకొని డిసెంబర్23న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించాం. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన ట్రైలర్స్ అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా సూపర్‌హిట్ అయింది. తప్పకుండా మా బేనర్‌లో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' మరో సూపర్‌హిట్ సినిమా అవుతుంది'' అన్నారు. థ్వీ, నవీన్‌చంద్ర, సలోని, శృతి సోధి, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లా ప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖా రామన్, మీనా, నేహాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీవసంత్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి పి., కథ, మాటలు: నాగేంద్రకుమార్
ఈ
పృ
వేపూరి, కథా విస్తరణ: విక్రవమ్‌రాజ్, డైలాగ్స్‌డెవలప్‌మెంట్: క్రాంతిరెడ్డి సకినాల, పాటలు: రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, ఎడిటింగ్: గౌతమ్‌రాజు, ఆర్ట్: కిరణ్‌కుమార్, ఫైట్స్: రియల్ సతీష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎం.ఎస్. కుమార్, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్, నిర్మాత: కె.కె. రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఇ.సత్తిబాబు.
టాలీవుడ్ P 7
మ
యాలంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ల సినిమాగా మల్లూవుడ్ లో 'పులిమురుగన్' రికార్డ్ క్రియేట్ చేసింది. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ నటించిన పులి మురుగన్ చిత్రాన్ని తోమిచన్ ముల్కపాద్ సమర్పణలో శ్రీ సరస్వతి ఫిల్మ్స్ పతాకం పై `మన్యం పులి` పేరుతో ప్రముఖ నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి విడుదల చేస్తున్నారు. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్ ప్రసాద్‌ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా.... ధూర పువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ - చాలా గ్యాప్ తర్వాత తెలుగులో పులి మురుగన్ సినిమాను మన్యం పులి పేరుతో విడుదల చేస్తున్నాను. సింధూరపువ్వు, సాహసఘట్టం సినిమాల కంటే మన్యంపులి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం చిత్రయూనిట్ దాదాపు రెండు సంవత్సరాల పాటు బాగా కష్టపడ్డారు. ``పులిమురుగన్ మలయాళంలో 125 కోట్ల గ్రాసర్ సాధించిన చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ట్రైలర్ చూశాను. నాకు నచ్చడంతో సినిమాను తెలుగులో విడుదల చేయడానికి రెడీ అయ్యాను. అన్నీ కార్యక్రమా లను పూర్తి చేసి సినిమాను డిసెంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాను`` అన్నారు. మిచన్ ముల్కపాదమ్ మాట్లాడుతూ - సినిమాను 180 రోజులు పైగా చిత్రీకరిస్తే 110 రోజులు యాక్షన్ సీన్స్‌ను చిత్రీకరించారు. అందులో టైగర్ ఫైట్‌ను 43 రోజుల పాటు చిత్రీకరించారు. ముఖ్యంగా టైగర్ ఫైట్ కోసం పులి కోసం సౌతాఫ్రికా, వియత్నాంలో చూశాం. అక్కడ చూసిన
సిం
తొ
8 P టాలీవుడ్
పులులేవీ మాకు నచ్చలేదు. చివరకు థాయ్‌లాండ్‌లో రెండు పులులను సెలక్ట్ చేసుకుని వాటితో టైగర్ ఫైట్‌ను షూట్ చేశాం. దీని కోసం మాకు 43 రోజుల సమయం పట్టింది. సినిమా క్లైమాక్స్ 28 నిమిషాలుంటుంది. దీన్ని 58 రోజుల్లో చిత్రీకరించాం. ``నిర్మాతగా పులి మురుగన్ నాకు ఐదవ సినిమా. అయితే ఈ చిత్రం మలయాళంలో సెన్సేషనల్ హిట్ సాధించడమే కాకుండా వందకోట్లకు పైగా కలెక్షన్స్‌ను సాధించిన మలయాళ చిత్రంగా రికార్డును క్రియేట్ చేసింది. మలయాళంలో సినిమా ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలుగులో కూడా అంతే పెద్ద హిట్ కావాలి`` అన్నారు. రో నాగాన్వేష్ మాట్లాడుతూ - తెలుగు ఆడియెన్స్‌ను బాహుబలి ఎలాగో మలయాళ ఆడియెన్స్‌కు పులిమురుగన్ అంత పెద్ద సినిమా అయ్యింది. తెలుగులో మన్యం పులి పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను`` అన్నారు. బ్బా పటేల్ మాట్లాడుతూ - ``టీజర్ చూశాను నాకు చాలా బాగా నచ్చింది. సినిమా పెద్ద హిట్‌కావాలని కోరుకుంటూ యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను`` అన్నారు. గపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు దర్శకుడు : వైశాఖ, కథ: ఉదయకృష్ణ, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: షాజీకుమార్, ఎడిటింగ్ః జాన్ కుట్టి, షిజాస్ పి.యూనస్, విజువల్ ఎఫెక్ట్స్ః విజయ్, స్రిస్, పిక్స్‌ల్, నిర్మాతః సింధూరపువ్వు కృష్ణారెడ్డి, దర్శక త్వంః వైశాక్
హీ
హె
జ
సూ
పర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ అదే కాంబినేషన్‌లో సుభాష్ కరణ్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సైన్స్ ఫిక్షన్ '2.0'. 350 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ఇటీవల ముంబాయిలోని యశ్‌రాజ్ స్టూడియోలో పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్‌జోహార్‌వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కార్యక్రమంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, హీరో అక్షయ్‌కుమార్, హీరో సల్మాన్‌ఖాన్, డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహమాన్, నిర్మాత సుభాష్ కరణ్, విఎఫ్‌ఎక్స్ వాల్ట్ జోన్స్, హీరోలు ఆర్య, విజయ్‌ఆంటోనీ, సినిమాటోగ్రాఫర్‌నిరవ్‌షా, ఫైట్‌మాస్టర్ సెల్వ, ప్రముఖ నిర్మాతలు ఎ.ఎం.రత్నం, బెల్లంకొండ సురేష్ తదితరులు పాల్గొన్నారు. గీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ మాట్లాడుతూ - ''నేను చేసిన సినిమాల్లో ఇది టఫెస్ట్ మూవీ. శంకర్‌గారిని శాటిస్‌ఫై చెయ్యడం చాలా కష్టం. శంకర్‌గారితో వర్క్ చేయడం ఒక ఛాలెంజ్ లాంటిది. ఆయన ఐడియాలు చాలా హై లో వుంటాయి. యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒక యునీక్ ప్రొడక్ట్‌ని ప్రపంచానికి అందించాలన్నదే మా లక్ష్యం. ఈ సినిమాకి సంబంధించి ఒక సాంగ్‌పూర్తి చేయడం జరిగింది. ఇలాంటి సినిమా చేయడం ఒక ఛాలెంజ్‌లాంటిది'' అన్నారు. ర్శకుడు ఎస్.శంకర్ మాట్లాడుతూ - ''నేను ఇంతకుముందు చేసిన సినిమాలకంటే బెటర్
ఈ
సం
ద
సినిమా చెయ్యాలని ప్రతిసారీ ప్రయత్నిస్తుంటాను. నేను చేసే ప్రతి సినిమాకీ నేనొక ఆడియన్‌లా ఫీల్ అవుతాను. నాలో వున్న ఆడియన్‌ని శాటిస్‌ఫై చెయ్యడానికి ట్రై చేస్తాను. రోబో కంటే 10 రెట్లు కష్టపడి దానికి సీక్వెల్2.0 చేస్తున్నాను. రోబో చేస్తున్నప్పుడు స్టెప్ బై స్టెప్ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్న ఫీలింగ్‌కలిగింది. మొత్తానికి దాన్ని రీచ్‌అయ్యాను. ఇప్పుడు 2.0 విషయానికి వస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని నా భుజంపై పెట్టుకొని స్టెప్ బై స్టెప్ ఎవరెస్ట్‌ని ఎక్కుతున్న ఫీలింగ్ కలుగుతోంది. సైన్స్ ఫిక్షన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ జోనర్. 2.0 తర్వాత నా మైండ్‌లోకి ఇంకా కొత్త ఐడియాలు వస్తే తప్పకుండా 3.0, 4.0, 5.0 చేస్తాను'' అన్నారు. పర్‌స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ - ''నిజం చెప్పాలంటే శంకర్‌తో వర్క్ చేయడం చాలా కష్టం. అతను ఓ పర్‌ఫెక్షనిస్ట్. కాబట్టే 25 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో వుంటూ ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. శంకర్‌తో కలిసి ఇంతకుముందు సినిమాలు చేసినా 2.0 అనేది ఇది 3డి మూవీ. 3డిలో నన్ను నేను చూసుకోవడం చాలా డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌నిచ్చింది. ఇక్కడ మీకో నిజం చెప్పాలి. అదేమిటంటే ఇందులో హీరో రజనీకాంత్ కాదు, అక్షయ్‌కుమార్ హీరో. క్యారెక్టర్ సెలెక్ట్‌చేసుకునే అవకాశం నాకు ఇచ్చినట్టయితే అక్షయ్‌కుమార్ చేస్తున్న క్యారెక్టర్ని సెలెక్ట్‌చేసుకునేవాడ్ని. హ్యాట్సాఫ్‌టు అక్షయ్‌కుమార్. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత అక్షయ్‌కుమార్‌ని దేశం మొత్తం అభినందిస్తుంది'' అన్నారు.
సూ
టాలీవుడ్ P 9
సి
నిమా రంగంలో అసాధారణ విజయాలు సాధించి, విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ.. యంగ్ జనరేషన్ కు స్ఫూర్తినిచ్చే యువతరానికి మలయాళ పరిశ్రమ `ఆసియా విజన్ -2016` పేరిట `యూత్ ఐకన్` పురస్కారాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కమిటీ టాలీవుడ్ నుంచి మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ని ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేసుకోవడం విశేషం. నదైన ఛరిష్మాతో వెండితెరపై వెలుగులు విరజిమ్ముతున్న స్టార్ హీరో చరణ్‌కి కోట్లాది ప్రేక్షకాభిమానుల ఫాలోయింగ్ ఉంది. యువతరానికి స్ఫూర్తినిచ్చే అసాధారణ విజయాలు ఈ యువహీరో సొంతం. తన రెండో సినిమా(మగధీర)కే బాక్సాఫీస్ వద్ద 70 కోట్లు పైగా వసూళ్లు సునాయాసంగా రాబట్టిన హీరో చరణ్ . అందుకే అతడి ప్రతిభకు చక్కని గుర్తింపు దక్కింది. ఇటీవల షార్జా స్టేడియం(యుఏఈ )లో జరిగిన `ఆసియా విజన్ -2016` వేడుకల్లో రామ్ చరణ్ కి అత్యున్నత `యూత్ ఐకన్` పురస్కారం అందించారు. దుబాయ్‌లో ప్రతియేటా నిర్వహించే అతి పెద్ద మలయాళ అవార్డుల కార్యక్రమం ఇది. 2006 నుంచి ఈ పురస్కారాల్ని అందిస్తున్నారు. లేటెస్టుగా చరణ్ నటించిన `ధృవ` అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే తను నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `ఖైదీ నంబర్ 150` సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.
త
10 P టాలీవుడ్
ప
వర్ స్టార్ పవన్ కల్యాణ్, మాటల మాంత్రికుడు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శీనివాస్, ప్రముఖ పంపిణిదారుడు, నిర్మాత సుధాకర్ రెడ్డి కలిసి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ స్టార్ నితిన్ హీరోగా పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ , శ్రేష్ట్ మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. ప్రముఖ లిరిసిస్ట్ కృష్ణ చైతన్య దర్శకుడు. తొలిసారి పవన్ కల్యాణ్ తాను కాకుండా తన బ్యానర్ పై మరో హీరో నితిన్ కొసం నిర్మాతగా మారటం విశేషం. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలతో పాటు మూల కధను సమకూర్చటం మరో హైలెట్. తటి క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శ్రేష్ట్ మూవీస్ సంస్థ కార్యాలయంలో ఇటీవల జరిగాయి. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు పవన్ కల్యాణ్ క్లాప్ నివ్వగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరోయిన్ ,నటీనటులు, పూర్తి టెక్నికల్ టీమ్ మరియు షూటింగ్ సంబందిత వివరాలను త్వరలొనె తెలియచెస్తారు . ఈ చిత్రానికి మూల కథ: త్రివిక్రమ్ శ్రీనివాస్, సినిమాటోగ్రఫీ : ఎన్. నటరాజ సుబ్రహ్మణ్యన్, ఆర్ట్: రామకృష్ణ, కథమాటలు- స్ర్కీన్ ప్లే - దర్శకత్వం : కృష్ణ చైతన్య
ఇం
టాలీవుడ్ P 11
రొ
మాంటిక్ లవ్ స్టోరీలు.. క్రైమ్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో గౌతమ్‌మీనన్‌ని కొట్టేవాళ్లే లేరు! గౌతమ్ మీనన్ దర్శకత్వంలో సినిమా వస్తోంది అంటే హీరో ఎవరు? అన్నదాంతో సంబంధం లేకుండా ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఎదురు చూసే ఫ్యాన్స్ ఉంటారు. ఆయన మార్క్ క్లాస్ టచ్.. పోయెటిక్ ఎప్రోచ్‌తో మనసు దోచే స్టైలిష్ ఎంటర్‌టైనర్లు చూడాలన్న క్యూరియాసిటీ జనాల్లో ఉంటుంది. అటు తమిళ్, ఇటు తెలుగు రెండు చోట్లా ఆయనకంటూ ప్రత్యేకించి అభిమానులున్నారు. చెలి, ఘర్షణ, సూర్య సన్నాఫ్ కృష్ణన్, రాఘవన్, ఏమాయ చేశావే, ఎంతవాడు గానీ, ఎటో వెళ్లిపోయింది మనసు, .. లేటెస్టుగా `సాహసం శ్వాసగా సాగిపో` .. ఇవన్నీ క్లాసిక్ హిట్స్‌గా తెలుగు ప్రేక్షకుల మనసు దోచాయి. తటి స్టార్ డైరెక్టర్ మెచ్చిన తమిళ చిత్రం `మెట్రో` ఇప్పుడు తెలుగులోనూ అనువాదమై రిలీజవుతోంది. `ప్రేమిస్తే`, `జర్నీ`, `షాపింగ్‌మాల్`, `పిజ్జా` వంటి బ్లాక్ బస్టర్లను తెలుగువారికి అందించిన సురేష్ కొండేటి సమర్పణలో ఆర్-4 ఎంటర్‌టైన్‌మెంట్స్ అధినేత రజని తాళ్లూరి ఈ చిత్రాన్ని తెలుగువారికి అందిస్తున్నారు. హైదరాబాద్‌లో `మోట్రో` తెలుగు ట్రైలర్‌ని లాంచ్ చేశారు గౌతమ్ మీనన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -``మెట్రో ఫెంటాస్టిక్ మూవీ. తమిళంలో రిలీజైన ఈ చిత్రం
అం
12 P టాలీవుడ్
పెద్ద విజయం సాధించింది. తెలుగులో అంతకుమించిన విజయం సాధిస్తుంది. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన న్యూ ఏజ్ సినిమా. నవతరా నికి బాగా నచ్చుతుంది. ఈ సినిమాకి పనిచేసిన టీమ్‌కి మంచి పేరొచ్చింది. తెలుగులో రిలీజ్ చేస్తున్న సురేష్ కొండేటి- రజనీ తాళ్లూరికి నా బెస్ట్ విషెస్`` అన్నారు. ర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ -``డబ్బింగ్ సహా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో రిలీజ్‌కి వస్తోంది. గౌతమ్ మీనన్ అంతటి స్టార్ డైరెక్టర్ మా సినిమా ట్రైలర్ లాంచ్ చేసి, సినిమా తెలుగువారికి నచ్చుతుందని ప్రశంసించడం సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది`` అన్నారు. మర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -``ఏ నిర్మాత అయినా.. ఆయన కాల్షీట్లు ఇస్తే తనతో సినిమా తీయాలనుకుంటారు. అంత గొప్ప స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్. ఆయన మెట్రో ట్రైలర్‌ని లాంచ్ చేయడం చాలా సంతోషాన్నిచ్చింది. ఈ సినిమా నాకెంతో నచ్చిన సినిమా అని గౌతమ్ మీనన్ చెప్పారంటే విజయంపై మా నమ్మకం మరింత రెట్టింపైంది. గౌతమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను నిర్మించిన `జర్నీ` సినిమాని మించి `మెట్రో` విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా`` అన్నారు.
ని
స
అ
ష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు రామ్మోహన్ పి. అష్టాచమ్మాతో హీరోగా పరిచయమైన నాని, ఉయ్యాలా జంపాలాతో హీరోగా పరిచయమైన రాజ్ తరుణ్ సూపర్‌హిట్ సినిమాలు చేస్తూ హీరోలుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఉయ్యాలా జంపాలా చిత్రంతో దర్శకుడుగా పరిచయమైన విరించి మజ్నుతో మరో సూపర్‌హిట్ చిత్రాన్ని అందించారు. అష్టాచమ్మాతో పరిచయమైన అవసరాల శ్రీనివాస్‌ఆ తర్వాత హీరోగా సక్సెస్ అవ్వడమే కాకుండా దర్శకుడుగా కూడా హిట్ సినిమాలను అందించారు. నాని, రాజ్‌తరుణ్‌లను హీరోలుగా పరిచయం చేసిన రామ్మోహన్ పి... డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై విశ్వదేవ్ రాచకొండను హీరోగా, అనుదీప్ కె.వి.ని దర్శకుడుగా పరిచయం చేస్తూ దినేష్‌కుమార్‌తో కలిసి 'పిట్టగోడ' పేరుతో ఓ విభిన్నమైన చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, ఫ్రెండ్‌షిప్‌ప్రధానాంశంగా గోదావరి ఖని బ్యాక్‌డ్రాప్‌లో పూర్తి వినోదాత్మక చిత్రంగా 'పిట్టగోడ' చిత్రం రూపొందుతోంది. చిత్రానికి సంగీతం: 'ప్రాణం' కమలాకర్, నిర్మాతలు: దినేష్‌కుమార్, రామ్మోహన్ పి., దర్శకత్వం: అనుదీప్‌కె.వి.
ఈ
టాలీవుడ్ P 13
షా
పింగ్ మాల్, జర్నీ, గీతాంజలి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డిక్టేటర్ వంటి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన తెలుగు, తమిళ సినీ రంగాల్లో హీరోయిన్‌గా తనదైన గుర్తింపు సంపాదించుకున్నహీరోయిన్ అంజలి రెండు షేడ్స్‌లో నటించిన చిత్రం `అల్లుడు సింగం`. సత్యదేవ పిక్చర్ స్ బ్యానర్‌పై విమల్, అంజలి జంటగా రూపొందుతోన్న మాస్ ఎంటర్టై నర్‌ని రావిపాటి సత్యనారాయణ ` తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లవ్‌స్టోరీగా రూపొందుతో్న్న``అల్లుడు సింగం` సినిమాలో సరికొత్త గ్లామర్ లుక్‌తో ఇప్పటి వరకు మరే సినిమాలో చేయని విధంగా లాయర్, పొలిటీషియన్‌గా రెండు షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో కనప డనుంది. లవ్, యాక్షన్ సహా అన్ని ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమాలో సీనియర్ నటుడు రాధారవి నటన, కమెడియన్ సూరి కామెడి సినిమాకు పెద్ద ఎసెట్ అవుతాయి. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధమ ైంది. ఎన్. ఆర్.రఘునందన్ సంగీతం అందించిన ఈ సినిమాలో ఐదు సాంగ్స్‌ను ప్రముఖ రచయిత వనమాలి రాశారు. త్వరలోనే ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించి, సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాత రావిపాటి సత్యనారాయణ తెలియజేశారు.
14 P టాలీవుడ్
ఈ
చిత్రానికి సంగీతంః ఎన్.ఆర్.రఘునందన్, మాటలుః వెంకట్, నిర్మాతః రావిపాటి సత్యనారాయణ, దర్శకుడుః రాజశేఖర్
అం
దాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యి యూత్ హర్ట్ ని దొచుకున్న నవీన్ చంద్ర చేస్తున్న నూతన చిత్రం చందమామ రావే . ప్రియల్ గోర్ అనే నూతన తార హీరోయిన్ గా నటిస్తుంది. ``అది రాదు.. వీడు మారడు`` అనేది క్యాప్షన్ . ఈ చిత్రాన్ని IEF CORPORATION – Italian of the East Films corporation ప్రోడక్షన్ నెం-1 గా నిర్మాతలు కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రక్తచరిత్ర సినిమాకు రామ్‌గోపాల్ వర్మ సహా పలువురు స్టార్ డైరెక్టర్ స్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన కవల దర్శకులు ధర్మ- రక్ష ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా.... ర్మాత కిరణ్ జక్కంశెట్టి మాట్లాడుతూ ``ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ వద్ద దర్వకత్వ శాఖలో పనిచేసిన దర్శకులు ధర్మ, రక్షలు సినిమాను చక్కగా రూపొందించారు. ప్రపంచంలో ట్విన్స్ డైరెక్ట్ చేసిన తొలి సినిమా కూడా మా చిత్రమే కావడం విశేషం. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు
ని
పూర్తయ్యాయి. సినిమా చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. పెక్యులర్ లవ్‌స్టోరీ. లవ్‌కు, లైఫ్‌కు టైమింగ్ చాలా అవసరమని చెప్పేఎక్స్‌ట్రీమ్ లవ్‌స్టోరీ `చందమామ రావే` డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్‌ను ప్రేక్షకులకు అందించాలనే ఆలోచనతో రూపొందించిన పెక్యులర్ లవ్ స్టోరీ చందమామ రావే. నవీన్‌చంద్ర పాత్ర చాలా ఆసక్తికరంగా, యూనిక్‌గా ఉంటుంది. మంచి ఎమోషన్స్‌తో సాగే చిత్రం. హీరో నవీన్‌చంద్ర పూర్తి సహకా రాన్ని అందించారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా హిమాలయాలు, గ్యాంగ్‌టక్ సహా పలు ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ఇటీవల టీజర్ను విడుదల చేశాం. టీజర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో నే ఆడియో విడుదల చేసి, సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు. చిత్రానికి ఎడిటర్ఃఎస్.ఆర్.శేఖర్, మ్యూజిక్ః శ్రవణ్, సినిమాటోగ్రఫీః వెంకట్ ప్రసాద్, నిర్మాతలుః కిరణ్ జక్కంశెట్టి, శ్రీని గుబ్బల, దర్శకత్వంః ధర్మ-రక్ష.
ఈ
టాలీవుడ్ P 15
తె
లుగు ,తమిళ్,మలయాళ భాషలలో రూపొందిన పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరో గా నటించిన ఆర్య ,సక్సెస్ ఫుల్ చిత్రాల క్రేజీ కథానాయిక హన్సిక జంటగా తమిళం లో రూపొంది బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచిన ''మీగా మాన్ ''చిత్రాన్ని సర్వల ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సూర్య సాకేత్ పిక్చర్స్ తెలుగు లో "మండే సూర్యుడు" పేరుతో విడుదల చేస్తున్నారు.బెల్లంకొండ శ్రీ నిధి సమర్పణ లో బెల్లంకొండ వెంకటేశ్వర్లు,కొలన ఎల్లారెడ్డి,సర్వల గణేష్ యాదవ్ అనువదిస్తున్న ఈ సూపర్ హిట్ చిత్రానికి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహించారు.డ్రగ్ మాఫియా నేపథ్యం లో సాగే ఈ సినిమాలో ఆర్య స్టైలిష్ అండర్ కవర్ ఆఫీసర్ గా అద్భుతమైన పాత్రలో నటించారని,గ్లామర్ తో పాటు అభినయానికి స్కోప్ వున్నా పాత్రలో హన్సిక ఒక వైవిధ్యమైన రోల్ ప్లే చేసారని నిర్మాతలు తెలిపారు. మిళం లో అఖండ విజయాన్ని సాధించి,హీరో ఆర్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో ఇండియన్ డ్రగ్ మాఫియా నెటవర్క్ ఎలా ఉంటుంది?వారి ప్లన్స్ ఎలా ఉంటాయి?అనే అంశాలను ఎంతో రీసెర్చ్ చేసి దర్శకుడు మగిళ్ తిరుమేని సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతంగా ఆవిష్కరించారని నిర్మాతలు తెలిపారు.హీరో ఆర్య 7 గురు విలన్ల మధ్య జరిగే ట్రాక్ సినిమాకి హైలైట్ అవుతుందని
త
16 P టాలీవుడ్
,అతి త్వరలో ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నామని చెప్పారు.ఆర్య,హన్సిక,ఆశుతోష్ రానా,సుధాంశు పాండే ,రమణ,ఆశిష్ విద్యార్థి,అనుపమా కుమార్,మహదేవన్,హరీష్ ఉత్తమన్,అవినాష్,శరవణ సుబ్బయ్య తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఎస్ ఎస్ తమన్,మాటలు:వెంకట్ మల్లూరి,పాటలు:వెన్నెలకంటి,భువన చంద్ర,నిర్మాణ నిర్వహణ :శ్రీనివాసు రెడ్డి,
తె
లుగులో `అంతిమతీర్పు`, `మగాడు, `స్టేట్ రౌడీ` వంటి చిత్రాల నటుడిగా త్యాగరాజన్‌కు మంచి గుర్తింపు ఉంది. హీరో ప్రశాంత్ తండ్రిగా, తమిళ చిత్రాల దర్శక నిర్మాతగా ఆయన్ని అందరూ గుర్తుపడతారు. తెలుగింటి అల్లుడయిన త్యాగరాజన్ తాజాగా `రోజ్ గార్డెన్`లో నటిస్తున్నారు. నితిన్ నాష్, ఫర్నాజ్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం `రోజ్ గార్డెన్`. జి.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. నురాధ ఫిలింస్ డివిజన్ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. చదల వాడ తిరుపతిరావు సమర్పణలో చదలవా డ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో పాల్గొంటున్న త్యాగరాజన్ ఇటీవల హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలు.. లుగులో `అంతిమతీర్పు`, `మగాడు`, `స్టేట్ రౌడీ` వంటి చిత్రాలు నాకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత నేనిప్పుడు `రోజ్ గార్డెన్` అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాను. ఈ చిత్రంలో ఓ టీవీ ఛానెల్ అధినేతగా కనిపిస్తాను. ఎవరూ కాశ్మీర్‌లో టీవీ చానెల్ పెట్టడానికి సాహసించరు. అలాంటి సమయంలో నేను అక్కడ చానెల్ పెట్టాలనుకుంటాను. పనిచేయడానికి ఎవరూ ముందుకు రాని తరుణంలో ఓ అబ్బాయి వస్తాడు. అలా అతను ముందుకు రావడానికి కారణం ఏంటి? ఆ తర్వాత ఏమైంది? అనేది ఆసక్తికరం. ఈ చిత్ర దర్శకుడు రవికుమార్ నాకు చాలా సన్నిహితుడు. అతనికి పలు శాఖలపై మంచి అవగాహన ఉంది. మా
అ తె
`తొలిముద్దు` సినిమాకు రవికుమార్ కూడా పనిచేశారు. కాశ్మీర్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు, పాటలు తప్పకుండా ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి`` అని అన్నారు. కేరక్టర్ నచ్చితే భవిష్యత్తులో కూడా తెలుగు సినిమాల్లో నటించాలనే ఆసక్తి ఉందని తెలిపారు. న తనయు డు, హీరో ప్రశాంత్ గురించి మాట్లాడుతూ ``ప్రశాంత్ నటించిన ద్విభాషా చిత్రం `బొబ్బిలి` త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు ప్రశాంత్ హిందీలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు దర్శకని ర్మాతను నేనే. ఆ తర్వాత ప్రశాంత్ ఓ తెలుగు సినిమాలో నటిస్తాడు. తెలుగులో ప్రముఖ దర్శకుడు దానికి దర్శక త్వం వహిస్తారు. ప్రశాంత్ నేరుగా తెలుగులో చేసే ఆ సినిమాకు సంబంధించిన కథలను ఇప్పుడు వింటున్నాం``అని చెప్పారు. క్వీన్` సినిమా గురించి మాట్లాడుతూ ``కంగనా రనౌత్ నటించిన క్వీన్ చిత్రం సౌత్ ఇండియా రైట్స్ నేను తీసుకున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను రూపొందించనున్నాం. నాలుగు భాషల్లోనూ రెండో నాయికగా ఎమీ జాక్సన్ నటిస్తుంది. తమిళంలో తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళంలో అమలాపాల్ నాయిక. తమిళ, మలయాళ చిత్రాలకు రేవతి దర్శకత ్వం వహిస్తారు. కన్నడలో పరుల్ యాదవ్ హీరోయిన్‌గా ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుంది. తెలుగులో అనీష్ కురువిళ్ల దర్శకత ్వం చేస్తారు. తెలుగుకు సంబంధించి ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. ఈ నాలుగు భాషల్లోనూ నేనే నిర్మిస్తాను`` అని తెలిపారు.
త
టాలీవుడ్ P 17
టా
లీవుడ్ క్రేజీ సింగర్ గీతామాధురి త్వరలో వెండితెర ఆరంగేట్రం చేస్తోందంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ యంగ్ అండ్ డైనమిక్ సింగర్ నటించే ఆ సినిమా ఏది? అన్న ఆసక్తి కనబరిచారంతా. ఏదైతేనేం గీతామాధురి నటించిన సినిమా డీటెయిల్స్ వచ్చేశాయి. డైనమిక్ సింగర్ స్టైల్ని ఎలివేట్ చేస్తూ కొన్ని స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. తామాధురి ఎంట్రీ ఇస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమా `మెట్రో`. ఇటీవలే స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ ఫెంటాస్టిక్ నేరేషన్‌తో తెరకెక్కిన చిత్రంగా ఈ సినిమాపై ప్రశంసల జల్లులు కురిపించారు. చైన్ స్నాచింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఆద్యంతం రక్తికట్టించే ఈ చిత్రం తెలుగులోనూ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ఆయన అన్నారు. అలాంటి క్రేజీ మూవీ `మెట్రో`లో ఓ సాంగ్‌లో గీతామాధురి తనని తాను ఆవిష్కరించుకున్నారు. ఎంతో శ్రావ్యంగా సాగే ఈ మెలోడీ పాటను తాను స్వయంగా ఆలపించడమే గాకుండా తనదైన శైలిలో అభినయించారు. సందర్భంగా నిర్మాత రజనీ తాళ్లూరి మాట్లాడుతూ -`` అతి త్వరలోనే `మెట్రో` తెలుగు ప్రేక్షకుల
గీ
ఈ
18 P టాలీవుడ్
ముందుకు రాబోతోంది. గీతామాధురి ఆలపించిన ఆ మెలోడీ సాంగ్ సినిమాకి పెద్ద అస్సెట్. ఈ ట్యాలెంటెడ్ సింగర్ స్వయంగా పాడటమే గాకుండా అభినయించారు. ఈ సినిమాలో అన్ని పాటలు సందర్భానుసారం వస్తూ వేటికవే ప్రత్యేకంగా అలరిస్తాయి. గీతా మాధురికి సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. మర్పకుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ -``వర్ధమాన గాయని గీతామాధురి ఆలపించి నటించిన ఈ గీతం సినిమాలో వెరీ స్పెషల్. మేకింగ్ పరంగా విజువలైజేషన్ పరంగా వండర్‌ఫుల్‌గా ఉంటుంది. క్రియేటివ్ మేకింగ్ కనిపిస్తుంది. ఈ సీజన్‌లో పెద్ద హిట్టయ్యే చిత్రమిది. ఇటీవలే డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు. చిత్రాన్ని సురేష్ కొండేటి సమర్పణలో ఏ4 ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రజనీ తాళ్లూరి నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే.
స
ఈ
స్వి
మ్మింగ్ పూల్ వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేసి యువత బలహీనతలను మరింతగా క్యాష్ చేసుకుంటోంది గోవా భామ ఇలియానా . ఇన్ స్టాగ్రామ్ లో 40 లక్షల ఫాలోవర్స్ ని సంపాదించుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని హాట్ వీడియో షేర్ చేసి కుర్రకారు మతి పోగొడుతోంది ఇలియానా . ఇటీవలే వరుసగా తనకు సంబందించిన పలు హాట్ ఫోటోలను , వీడియో లను షేర్ చేస్తూ సంచలనం సృష్టిస్తోంది . ఆమధ్య ప్రియుడు ఆండ్రు తో కల్సి లిప్ లాక్ చేసిన వీడియో తో మరింత సంచలనం సృష్టించిన ఈ భామకు తెలుగులో సినిమాలే లేవు ఇక బాలీవుడ్ లో ఏదో చేద్దామని వెళ్ళింది కానీ పాపం అక్కడ కూడా సత్తా చాటలేక పోతోంది దాంతో ఈ బాట పట్టినట్లుంది . జస్ట్ టూ పీస్ బికినీ తో స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుంటే సొగసు చూడతరమా నీ సొగసు చూడతరమా అంటూ కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు ఇలియానా అందాలను .
చ
రణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చింది కానీ దానికి అడ్డుగా ఉంది తన బరువే అన్న నిజం తెలుసుకున్న ఈ భామ ఆ బరువుని తగ్గించుకోవడానికి ఎంత కష్టపడుతుందో తెలుసా ...... ....... రాత్రి , పగలు ..... ఇంటా , బయటా అన్న తేడా లేకుండా ఎక్కడికి వెళ్లినా ఎక్సర్ సైజ్ చేస్తూ బరువు తగ్గే పనిలో పడింది రాశి ఖన్నా . రాంచరణ్ తన తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే . ఆసినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా అయితే బాగుటుందని భావించడమే కాకుండా ఫోటో షూట్ కూడా చేశారట అయితే అంతా బాగుంది కానీ కాస్త లావుగా ఉండటం తో ఆ పార్ట్ తగ్గించమని సలహా ఇచ్చారట దాంతో ఎక్సర్ సైజ్ చేస్తూ బాగానే కష్టపడుతోంది రాశి ఖన్నా .
హీ
రోతో సన్నిహితంగా ఉండే సన్నివేశాలలో నటించి, లిప్ లాక్ కూడా చేయడంతో హీరోయిన్ పూర్ణ అన్నయ్య ఆమెకు వార్ణింగ్ ఇచ్చాడట . అల్ల్లరి నరేష్ తో కలిసి ఈ భామ సీమ టపాకాయ్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రంలో ఒక సన్నివేశంలో అల్లరి నరేష్ కు లిప్ లాక్ ఇస్తుంది పూర్ణ ,అలాగే కొన్ని కౌగిలింత సీన్స్ కూడా ఉన్నాయి . సీమ టపా కాయ్ చిత్రాన్ని పూర్ణ ఫ్యామిలీ చూశారట అయితే ఇలాంటి సన్నివేశాల్లో
నటించొద్దు అని చెప్పాడట పూర్ణ సోదరుడు . వాళ్ళు అంతగా ఎందుకు ఫీలయ్యారో కూడా చెబుతోంది ఈ భామ , మేము ముస్లిం లం కాబట్టి ఇలా చేయడం తగదని వాళ్ళ ఉద్దేశ్యమని అయితే కొద్దీ రోజుల్లోనే ఇది నటన మాత్రమే అనే విషయం వాళ్లకు తెలిసిందని అంటోంది . పూర్ణ శ్రీనివాస్ రెడ్డి సరసన నటించిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రం నిన్న రిలీజ్ అయి హిట్ టాక్ సొంతం చేసుకుంది .
టాలీవుడ్ P 23
ఏ
దో పెద్దగా చేసెయ్యాలి. ఇరగదీ సెయ్యాలి. ఇంకేదో సాధించేయాలి..అని కలలు కంటూ క్లారిటీ మిస్సవుతోంది నేటి యువతర ం. మాటలు తగ్గించి చేతలు చూపించండి గురూ... ఒళ్లొంచి పనిచెయ్యండి. సెల్ఫ్‌కి, సమాజానికి పనికొస్తారని చెబుతున్నా``మన్నారు దర్శకుడు త్రివిక్రమ్.జి. శివ రామచంద్రవరపు, సూర్య శ్రీనివాస్, చందన నాయకానాయికలుగా వీణావేదిక ప్రొడక్షన్స్ పతాకంపై త్రివిక్రమ్. జి తెరకెక్కించిన సినిమా -`కారందోశ`. డిసెంబర్‌లో రిలీజ్ సందర్భంగా.. ర్శకనిర్మాతలు మాట్లాడుతూ -``చాలా సరదాగా సాగిపొయ్యే అర్థవంతమయిన కథతో ఈ సినిమాని తెరకెక్కించాం.ఇటివలే రిలీజ్ చేసిన ఆడియో, టీజర్ కి మంచి స్పందన వస్తోంది.పోస్ట్ ప్రొడక్షన్ , సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. డిసెంబర్‌లో రిలీజ్ చేస్తున్నాం`` అన్నారు. వంకాయలసత్యనారాయణ, కాశీవిశ్వనాథ్ ఇతర ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : సురేష్, కెమెరా : రాజభట్టాచార్య, సంగీతం : సిద్దార్థ్ వాట్కిన్స్, సాహిత్యం : శ్రీరామ్ , నేపద్య సంగీతం : దేవ్ గురు
ద
24 P టాలీవుడ్
ఎం
దుకంటే ప్రేమంట చిత్రంతో రామ్ కి ఘోర పరాజయాన్ని అందించాడు దర్శకులు కరుణాకరన్ , అయినప్పటికీ ప్రేమ కథా చిత్రాలను బాగా తెరకేక్కించగలడు అని పేరు ఉండటంతో పాటు తాజాగా అతడు చెప్పిన కథ బాగా నచ్చడంతో వెంటనే డేట్స్ ఇచ్చాడు హీరో రామ్ . పలువురి దర్శకులతో సినిమా చేయనున్నాడు అని వార్తలు వచ్చినప్పటికీ కరుణాకరన్ చెప్పిన కథ నచ్చడంతో ఫ్లాప్ దర్శకుడు అయినప్పటికీ అతడితోనే సినిమా చేయడానికి సిద్దమయ్యాడు రామ్ . తొలిప్రేమ చిత్రంతో ఎప్పటికీ చెరిగిపోని ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు కరుణాకరన్ . ఇన్నేళ్ళ తర్వాత కూడా కరుణాకరన్ కు చాన్స్ లు వస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ తో చేసిన తొలిప్రేమ చిత్రమే కారణం . ఇక రామ్ ఇటీవల నటించిన హైపర్ చిత్రం అనుకున్న విధంగా సక్సెస్ కాలేదు కానీ ఫ్లాప్ మాత్రం కాదు దాంతో సూపర్ హిట్ కొట్టాలని ఆశపడుతున్నాడు .
టాలీవుడ్ P 25
గీ
తాంజలి చిత్రంతో హీరోగా తొలి హిట్ ని అందుకున్న కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి తాజాగా జయమ్ము నిశ్చయమ్మురా చిత్రంతో మరో హిట్ అందుకున్నాడు . సినిమాపై నమ్మకం ఉంది కాబట్టే రెండు రోజుల ముందుగానే సినిమాని కొంతమంది ప్రేక్షకులకు చూపించారు . అయితే ఫస్టాఫ్ లో కొంత సాగతీత ఉంది దాంట్లో కొంత ట్రిమ్ చేస్తే ఇక ఈ సినిమాకు తిరుగులేదు అనే చెప్పొచ్చు . సెకండాఫ్ ప్రేక్షకులను అలరించేలా ఉంది . శ్రీనివాస్ రెడ్డి అద్భుత నటన , పోసాని ,ప్రవీణ్ , కృష్ణ భగవాన్ ల హాస్యం వెరసి జయమ్ము నిశ్చయమ్ము రా మంచి హిట్ అయ్యేలాగే ఉంది . మొత్తానికి శ్రీనివాస్ రెడ్డి నమ్మకం నిజమైంది . గీతాంజలి సినిమా తర్వాత శ్రీనివాస్ రెడ్డి కి దాదాపు 80 కథలు వచ్చాయట కానీ వాటినేవీ అంగీకరించకుండా ఈ కథ ని సెలెక్ట్ చేసుకున్నాడు . కట్ చేస్తే తన సెలెక్షన్ కరక్టే నని నిరూపించుకున్నాడు శ్రీనివాస్ రెడ్డి . రిలీజ్ అయిన జయమ్ము నిశ్చయమ్మురా చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది .
26 P టాలీవుడ్
సూ
పర్ స్టార్ రజనీకాంత్ పెద్దల్లుడు హీరో ధనుష్ మా కొడుకే అంటూ వృద్ధ దంపతులు కోర్టు కెక్కారు దాంతో ధనుష్ కి కోర్టు సమన్లు జారీ చేసింది . జనవరి 12 లోపు న్యాయస్థానం ముందు స్వయంగా హాజరు కావాలని ధనుష్ ని ఆదేశించింది కోర్టు . సంచలనం కలిగించే ఈ సంఘటన పూర్వాపరాలను పరిశీలిస్తే ..... తమిళనాడు లోని మేలూర్ తాలూకా మనం పట్టి గ్రామానికి చెందిన ఆర్ . కథారేసన్ ( 60)మీనాక్షి (55) అనే దంపతులు ధనుష్ మా కొడుకే అంటూ కోర్టు కెక్కారు . నవంబర్ 7, 1985లో ధనుష్ పుట్టాడని బర్త్ డే సర్టిఫికెట్ , ఫోటో లతో పాటు కోర్టు ని ఆశ్రయించారు . ధనుష్ అసలు ధనుష్ కాదని '' కాళీ సెల్వన్ '' అని సినిమాలపై మోజుతో ఇంటి నుండి పారిపోయాడని , ఇప్పుడు మేము వృద్ధులం కాబట్టి మాకు నెలకు 65 వేల జీవన భృతి కల్పించాల్సిందిగా ఆదేశించాలని కోర్టు ని ఆశ్రయించారు . మరి కోర్టు ఎలాంటి తీర్పు నిస్తుందో చూడాలి .
టాలీవుడ్ P 27
మ
లయాళ హీరో దిలీప్ , హీరోయిన్ కావ్యా మాధవన్ లు రహస్య వివాహం చేసుకొని షాక్ ఇచ్చారు . మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన కావ్య మాధవన్ కి ఇంతకుముందే పెళ్లి అయ్యింది కానీ సంవత్సరం లోనే అతడికి విడాకులు ఇచ్చింది కావ్య మాధవన్ . అలాగే దిలీప్ కి కూడా ఇంతకుముందే పెళ్లి అయ్యింది పైగా కూతురు కూడా ఉంది . కట్టుకున్న భార్య కు విడాకులు ఇచ్చాడు . గతకొంత కాలంగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారాలు నడుస్తున్నాయని జోరుగా వార్తలు వచ్చాయి కానీ వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు దిలీప్ కానీ కావ్యా మాధవన్ . కానీ ఇంతలోనే సడెన్ గా కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు . కావ్య దిలీప్ లు కలిసి దాదాపు 21 చిత్రాల్లో నటించారు . దాంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది . ఇద్దరికీ కూడా ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం .
28 P టాలీవుడ్
బా
లీవుడ్ దర్శకుడు విశాల్ పాండ్య తో సనా ఖాన్ డేటింగ్ చేస్తున్నట్లు ముంబై మీడియా లో గుప్పుమంటోంది . ఈ ఇద్దరి మధ్య ఇంతగా బాండింగ్ పెరగడానికి కారణం ఏంటో తెలుసా ........ '' వాజాహ్ తుమ్ హో '' చిత్రం . విశాల్ పాండ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సనా ఖాన్ హీరోయిన్ గా నటించింది . అయితే ఈ సినిమాలో శృంగార సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి పైగా ఆ శృంగార సన్నివేశాల్లో రెచ్చిపోయి నటించింది సనా ఖాన్ . తెరపై సనా ఖాన్ గుర్మీత్ తో రొమాన్స్ చేస్తున్నప్పటికీ నిజ జీవితంలో మాత్రం విశాల్ పాండ్య తో రొమాన్స్ చేస్తోందట . ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి . అయితే యధావిధిగానే ఈ వార్తలను వాళ్ళు కొట్టి పడేస్తున్నారు .
టాలీవుడ్ P 29
ఎ
న్టీఆర్ కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి మంచి మిత్రులు కానీ ఇప్పుడు ఆ ఇద్దరి మధ్య మాటలు లేవు ఎన్టీఆర్ శ్రీనివాస్ రెడ్డి ని దూరం పెట్టాడు . దానికి కారణం ఏంటో తెలుసా ....... 2009 ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఖమ్మం నుండి హైదరాబాద్ కు వస్తున్న సమయంలో కారు యాక్సిడెంట్ కు గురైన విషయం తెలిసిందే . ఆ సమయంలో ఎన్టీఆర్ వెనుక కారులో శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నాడట , యాక్సిడెంట్ అయిన వెంటనే ఎన్టీఆర్ ని సూర్యాపేట లోని ఆసుపత్రికి తరలించారు . అయితే ఎన్టీఆర్ కు యాక్సిడెంట్ కావడానికి కారణం శ్రీనివాస్ రెడ్డి వెంట ఉండటమే అని వాళ్ళ బ్యాచ్ లో ఎవరో అన్నారట అంతే శ్రీనివాస్ రెడ్డి కి ఎక్కడా లేని ఆవేశం వచ్చింది వెంటనే నేనుండటం వల్లే ఎన్టీఆర్ బ్రతికాడు లేకపోతే ఏమయ్యేదో అని ఆవేశంలో అన్నాడట అంతే ఆ మాటని మరోలా మోశారు ,శ్రీనివాస్ రెడ్డి పై చాడీలు చెప్పారు దాంతో శ్రీనివాస్ రెడ్డి ని కట్ చేసాడు ఎన్టీఆర్ . అందుకే అప్పటి నుండి తన సినిమాలలో శ్రీనివాస్ రెడ్డి కి ఛాన్స్ ఇవ్వడమే లేదు ఎన్టీఆర్ . మా మధ్య దూరం పెరిగింది కానీ ఇక నుండి ఆ దూరం తగ్గే ప్రయత్నం చేస్తానని అంటున్నాడు శ్రీనివాస్ రెడ్డి .
30 P టాలీవుడ్
టా
లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ ఇయర్ వేడుకల కోసం ఎక్కడికి వెళుతున్నాడో తెలుసా ..... ...... ఇంగ్లాండ్ . అవును కుటుంబ సమేతంగా క్రిస్మస్ వేడుకలను అలాగే న్యూ ఇయర్ వేడుకలకు జరుపుకోవడానికి పిల్లలకు సరికొత్త ప్రదేశాలను చూపించడానికి ఈసారి ఇంగ్లాండ్ ని ఎంచుకున్నాడు మహేష్ బాబు . ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ ఓ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . ఆ సినిమా కోసం అహ్మదాబాద్ వెళ్లనున్న మహేష్ ఆ షెద్యూల్ ని కంప్లీట్ చేసాక కుటుంబ సమేతంగా ఇంగ్లాండ్ వెళ్లనున్నాడు . పది రోజుల పాటు విదేశాల్లో విహరించిన తర్వాత మురుగదాస్ చిత్రాన్ని కంప్లీట్ చేయనున్నాడు .
టాలీవుడ్ P 31
అ
32 P టాలీవుడ్
న్నమయ్య , శ్రీరామదాసు , షిరిడి సాయి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున తాజాగా '' ఓం నమో వెంకటేశాయ '' చిత్రంలో నటిస్తున్నాడు . రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాతి కానుకగా జనవరిలో రిలీజ్ చేయాలనీ భావించారు కానీ జనవరి లో మాత్రమే కాదు ఆ సినిమా ఫిబ్రవరి లో కూడా రిలీజ్ కావడం కష్టమే అని అంటున్నాడు కింగ్ నాగార్జున . ఇటీవల హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియో లో ''రాజుగారి గది 2'' చిత్ర ప్రారంభోత్సవం సందర్బంగా నాగార్జున ఓం నమో వెంకటేశాయ చిత్ర విశేషాలను వెల్లడించాడు . గ్రాఫిక్ వర్క్ ఎక్కువగా ఉన్నందున ఆ పని పక్కాగా పూర్తికావాలి దాని తర్వాత నేను , రాఘవేంద్రరావు గారు కలిసి సినిమా చూడాలి ఒకే చెప్పాలి అప్పుడే రిలీజ్ పైగా రీ రికార్డింగ్ కోసం కీరవాణి 2నెలల సమయం అడిగాడు అందుకే ఫిబ్రవరి లో కూడా రిలీజ్ కావడం కష్టమే అని అంటున్నాడు నాగార్జున .
సి
నిమా రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది కానీ అప్పుడే రికార్డుల వేట మొదలైంది . తమిళ స్టార్ హీరో సూర్య నటించిన '' సింగం 3'' డిసెంబర్ 16 న రిలీజ్ కానుంది అయితే సింగం సిరీస్ లో వచ్చిన చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు సింగం 3 పై భారీ అంచనాలు నెలకొన్నాయి . దాంతో ఏరియాల వారీగా పోటీ పడి మరీ ఆ సినిమాని కొంటున్నారు బయ్యర్లు . తెలుగు లో కూడా భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ తమిళ చిత్రానికి ఇప్పటి వరకు ఎంత బిజినెస్ అయ్యిందో తెలుసా ...... ...... వంద కోట్లు . జస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ అది కూడా ఏరియాల వారీగా జరిగిన బిజినెస్ , దాని తర్వాత సాటి లైట్ రైట్స్ రూపంలో కూడా భారీగానే సొమ్ము రానుంది . రిలీజ్ కి ముందే వంద కోట్ల బిజినెస్ అయితే రేపు రిలీజ్ అయ్యాక మరెలాంటి సంచలనాలను సృష్టిస్తాడో సూర్య . ఈ హీరోకు తమిళంలోనే కాదు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది అన్న విషయం తెలిసిందే .
టాలీవుడ్ P 33
పె
ళ్లి చూపులు బ్లాక్ బస్టర్ కావడంతో ఆ చిత్రంలో హీరోగా నటించిన విజయ్ దేవరకొండ కు ఛాన్స్ ల మీదే ఛాన్స్ లు వస్తున్నాయి . వరుసగా ఛాన్స్ లు వస్తుండటంతో తన రెమ్యునరేషన్ ని కూడా బాగానే పెంచాడు . ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన ద్వారకా , అర్జున్ రెడ్డి చిత్రాలు పూర్తయ్యాయి అవి రిలీజ్ అయ్యాక వరుసగా ఆరు సినిమాలు లైన్లో పెట్టాడు విజయ్ . పెళ్లి చూపులు బ్లాక్ బస్టర్ కావడం , విజయ్ దేవరకొండ నటన లో విభిన్నత ఉండటంతో వరుసగా ఛాన్స్ లు వస్తున్నాయి . రెమ్యునరేషన్ విషయంలో గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ అతడికి సక్సెస్ ఉంది కాబట్టి ఎక్కువ మంది అతడితో సినిమా చేయడానికే ఇష్టపడుతున్నారు . అయితే కొంతమంది మాత్రం విజయ్ తో సినిమా చేయడానికి వెనుకాడుతున్నారు . ప్రస్తుతం ఆరు సినిమాలను కమిట్ అయ్యాడు విజయ్ దేవరకొండ .
34 P టాలీవుడ్
ర
జనీకాంత్ , అక్షయ్ కుమార్ లు నటిస్తున్న రోబో సీక్వెల్ చిత్రం ''2.0'' చిత్ర ఫస్ట్ లుక్ ఈనెల 20 వ తారీఖున ముంబై లో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . అయితే రజనీ - అక్షయ్ ల ఫస్ట్ లుక్ కి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది . ఆహా ! ఏమి రెస్పాన్స్ గురూ అని అనుకునేలోపు ఆ పోస్టర్ కాపీ అంటూ వైరల్ అవుతోంది . ఇంతకీ ''2.0'' పోస్టర్ ఏ చిత్రానికి కాపీ నో తెలుసా ............... ''హార్రీ పోట్టర్ అండ్ ద డెత్లీ హాలోస్ '' పార్ట్ 2 పోస్టర్ కు కాపీ అంటూ ఆ పోస్టర్ ని కూడా వదులుతున్నారు . అయితే రజనీ పోస్టర్ కు హర్రీ పోట్టర్ పోస్టర్ కు స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ పూర్తిగా ఒకేలా ఉన్నా ఇజ్జత్ పోయే కథ కాబట్టి చిన్న మార్పులు చేసి నట్లున్నారు . మనవాళ్ళ క్రియేటివిటీ ఎలా ఉన్నా హాలీవుడ్ వాళ్ళని మాత్రం భీకరంగా కాపీ కొడుతూనే ఉన్నారు పోస్టర్ ల విషయంలో కానీ కథల విషయంలో కానీ .
టాలీవుడ్ P 35
ప
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా డాలీ దర్శకత్వంలో కాటమ రాయుడు చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 29న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇంకా షూటింగ్ సగం కూడా కాలేదు కానీ రిలీజ్ డేట్ మాత్రం ఫిక్స్ అయ్యింది . పవన్ మిత్రుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు
. ప్రస్తుతం కాటమ రాయుడు చిత్రం రామోజీ ఫిలిం సిటీ లో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటోంది . పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రం వేసవిలో వస్తే రికార్డులు బద్దలు కావలసిందే అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్ . ఈ ఏడాది రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ప్లాప్ కావడంతో కాటమ రాయుడు చిత్రం పై చాలా ఆశలు పెట్టుకున్నారు పవన్ ఫ్యాన్స్ .
అ
36 P టాలీవుడ్
వసరాల శ్రీనివాస్ హీరోగా బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన '' హంటర్ '' చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు అది కూడా ''సోగ్గాడు '' టైటిల్ తో ఇక క్యాప్షన్ ఏంటో తెలుసా ....... బాబు బాగా బిజీ . శృంగార సన్నివేశాలు కోకొల్లలు గా ఉన్న ఈ చిత్రం అంతా అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే ఓ లుక్ ని సైలెంట్ గా రిలీజ్ చేసారు . కసిగా పెదవులను పళ్ళ తో కొరుకుతున్న స్టిల్ ఒకటి రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు ఆ చిత్ర యూనిట్ . అసలే ఎరోటిక్ సినిమా కాబట్టి ఆ స్థాయిలోనే ఈ స్టిల్ ఉందని చూసిన వాళ్ళు అంటున్నారు . అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తుండగా ఇందులో నలుగురు అందమైన భామలు మిస్తీ చక్రవర్తి , తేజస్వి , శ్రీ ముఖి , సుప్రియ లు నటిస్తున్నారు .
న
టసింహం నందమూరి బాలకృష్ణ తాజాగా గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే . అయితే వచ్చే ఏడాది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ చిత్రానికి ఇప్పటి వరకు దర్శకుడ్ని ఎంపిక చేయలేదు కానీ పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి కట్ చేస్తే ఇప్పుడు ఆ పేర్లన్నీ మరుగున పడ్డాయి ఒక్క పేరు మాత్రం వినిపిస్తోంది అదే క్రిష్ . అవును జాగర్ల మూడి క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి
చేస్తున్న సమయంలో అతడిలో ఉన్న డెడికేషన్ , హీరోలను చూసుకునే పద్దతి బాగా నచ్చిందట అందుకే తన వారసుడి ని క్రిష్ చేతిలో పెడితే బాగుంటుంది అని భావిస్తున్నాడట బాలయ్య . పైగా ఇప్పటికిప్పుడే మోక్షజ్ఞ కత్తులు ,తుపాకులు పట్టుకొని భారీ డైలాగ్స్ చెప్పాలనే కోరిక బాలయ్య కు లేదు కాబట్టి క్రిష్ అయితేనే మోక్షజ్ఞ కు మంచి ఫ్లాట్ ఫామ్ ఇవ్వగలడని నమ్ముతున్నాడట . అయితే ఇంకా పూర్తిస్థాయి లో ఫిక్స్ కాలేదు కానీ క్రిష్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని అంటున్నారు .
దం
డు పాళ్యం తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కన్నడ భామ పూజా గాంధీ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనుంది . ఓ వ్యాపార వేత్త తో సాగించిన ప్రేమాయణం కు ఇరు కుటుంబాల పెద్దల అనుమతి లభించడంతో ఒక్కటి కానున్నారు . గతకొంత కాలంగా వ్యాపారవేత్త ని ప్రేమిస్తోంది పూజా గాంధీ . గతంలో కూడా పూజా గాంధీ మరో వ్యాపారవేత్త ని ప్రేమించింది కానీ ఆ ప్రేమ పెళ్లి వరకు వెళ్ళలేదు కానీ తాజాగా ఈ ప్రేమ మాత్రం పెళ్లి పీటలు ఎక్కే వరకు వెళుతోంది . కన్నడంలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీ గా ఉంది . వాటిని త్వరగా పూర్తిచేసి పెళ్లి చేసుకోవడానికి సమాయత్తం అవుతోంది .
టాలీవుడ్ P 37
సా
యిధరమ్‌తేజ్ హీరోగా తెరకెక్కుతున్న `విన్నర్` చిత్రం ఫారిన్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. బేబి భవ్య సమర్పిస్తున్నారు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు నిర్మిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకత ్వం వహిస్తున్నారు. రకుల్ ప్రీత్‌సింగ్ నాయిక. ఇటీవలే ఈ చిత్రం ఫారిన్ షెడ్యూల్ పూర్తయింది. ర్శకుడు మాట్లాడుతూ ``షూటింగ్ అంతా ముందుగా అనుకున్న ప్రకారం సాగుతోంది. నవంబర్ 3 నుంచి 20 వరకు ఉక్రెయిన్‌లో పాటల్ని తీశాం. సాయిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ మీద రెండు పాటల్ని, సాయిధరమ్‌తేజ్, యాంకర్ అనసూయ మీద ఒక పాటను చిత్రీకరించాం. రాజు సుందరం కొరియోగ్రఫీ చేశారు. రామజోగయ్యశాస్త్రి, అనంతశ్రీరామ్, శ్రీమణి పాటలను రాశారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించాం. బల్గేరియన్ ఫైట్ మాస్టర్ కలయాన్ ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాం. `బాహుబలి`లో మంచు కొండల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించింది కలయాన్ కావడం విశేషం. డిసెంబర్ 6 నుంచి 22 రోజుల పాటు ఊటీ, బెంగుళూరులో షెడ్యూల్ జరుగుతుంది. అక్కడ కీలకమైన టాకీ, యాక్షన్ పార్టును తెరకెక్కిస్తాం. జనవ రిలో బ్యాలన్స్
ద
టాలీవుడ్ P 38
టాకీ, రెండు పాటలను చిత్రీకరిస్తాం. దాంతో సినిమా మొత్తం పూర్తవు తుంది. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం. సినిమాలోని ప్రతి ఫ్రేమూ గ్రాండ్‌గా ఉంటుంది. సాయిధరమ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంట చక్కగా కుదిరింది. తమన్ మంచి బాణీలనిస్తున్నారు. అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన రచన ఆకట్టుకుంటుంది. వెలిగొండ శ్రీనివాస్ మంచి కథనిచ్చారు`` అని తెలిపారు. ర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు మాట్లాడుతూ ``తనకు జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలవడం కోసం ఓ యువకుడు పోరాటం చేస్తాడు. అందులో గెలిచి `విన్నర్` గా ఎలా నిలిచాడనేది ఈ చిత్ర కథ. ఇప్పటివరకు చిత్రీకరించిన విజువల్స్ చాలా బాగా వచ్చాయి. మంచి లొకేషన్లలో తెరకెక్కించాం. అలాగే తమన్ చాలా మంచి సంగీతాన్నిచ్చారు. ఐదు పాటలు, ఒక బిట్ సాంగ్ ఉంటాయి. అన్ని వర్గాల వారికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దుతున్నాం`` అని అన్నారు. యిధరమ్‌తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, ముకేష్ రుషి, అలి, వెన్నెలకిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: చోటా.కె.నాయుడు, సంగీతం: తమన్, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, ఆర్ట్: ప్రకాష్, ఫైట్స్: రవివర్మ, కథ: వెలిగొండ శ్రీనివాస్, రచన: అబ్బూరి రవి, శ్రీధర్ సీపాన, స్క్రీన్ప్ లే, దర్శక త్వం: గోపీచంద్ మలినేని.
ని
సా
ఐ
టెం సాంగ్ చేస్తున్నావా ? అంటే హాట్ భామ అనసూయ కు ఎక్కడా లేని కోపం వచ్చింది అంతే ఐటెం ఏంటి ? ఐటెం ....... అంటూ ఆ మాట అన్నవాడ్ని దుమ్ము దులిపేసింది అనసూయ . ఈ భామకు ఐటెం అంటే ఇంతగా ఎందుకు కోపం వచ్చిందో తెలుసా ........ ప్రేక్షకులకు కాస్త రిలీఫ్ ఇవ్వడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం అటువంటిది అంత చీప్ గా ఐటెం అనడం ఏంటి ? అని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . ఇటీవల ఫేస్ బుక్ లో లైవ్ ప్రోగ్రాం లో పాల్గొన్న అనసూయ నెటిజన్లు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెబుతున్న క్రమంలో ఓ అభిమాని ఐటెం అనడంతో అనసూయ కు కోపం వచ్చింది అందుకే ఐటెం అన్నవాడికి క్లాస్ పీకింది . అన్నట్లు ఈ భామ సినిమాల్లో చేస్తున్నది ఐటెం సాంగ్స్ కాబట్టి అనసూయ కు ఎక్కడో తగిలిందన్న మాట .