TOLLYWOOD.NET MAY 2020 | VOL 17 | ISSUE 5 | Rs.20/-
/tollywood
/tollywood
ముఖ్య కథనాలు
p
RNI NO: APTEL/2003/10076
Happy Birthday
Jr. NTR
NEWS HAPPENINGS
“HEALTH IS THE GREATEST POSSESSION. CONTENTMENT IS THE GREATEST TREASURE. CONFIDENCE IS THE GREATEST FRIEND. NON-BEING IS THE GREATEST JOY.”
LIFE style
Murali Mohan Ravi
HOT SPICY
Credits: Editor in Chief CEO VP Sales and Marketing Executive Editor Associate Editor Telugu Content Writer Telugu Content Writer Graphic & Web Designer/Developer Content Editor Publication Consultant
: : : : : : : : : :
CHIT CHAT
Murali Mohan Ravi Siva Dosakayala Sanathan Ravinder Gorantla Prathama Singh Vihari Yoganand Moulali Deshamoni Vincent Raghurama Raju Kalidindi
PA
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON
FOR ADVERTISEMENT ENQUIRES CALL : +91 7702 555 873
Follow Us On :
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE My CHOICE
wanna be featured
Email: editor@tollywoodmag.com I www.tollywood.net
in
Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MAY 2020
ఇస్మార్ట్
శంకర్ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో సవ్యసాచి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెల్సిందే. ఆ
తర్వాత అఖిల్ తో mr మజ్ను చేసినా ఆ చిత్రం కూడా అదే ఫలితాన్ని అందుకుంది. అయితే ఈ రెండు సినిమాలు ప్లాపైనా కూడా గతేడాది విడుదలైన ఇస్మార్ట్ శంకర్ ఆమె ఫేట్ ను మార్చేసింది. ఈ సినిమా ద్వారా ఆమె మరోసారి తన గ్లామరస్ యాంగిల్ ను బయటపెట్టింది. ఈ సినిమా సాధించిన విజయంతో మరోసారి నిధి అగర్వాల్ కు అవకాశాల వెల్లువ వచ్చింది. ప్రస్తుతం ఆమె ఖాతాలో వరస సినిమాలు ఉన్నాయి. మహేష్ బాబు మేనల్లుడు
send your details and portfolio to
subscription 1 year (12 issues) : Rs 200
2 Year ( 24 issues) : Rs 400
Name:_______________________________________________________________________ Address: _____________________________________________________________________ ____________________________________________________________________________ City: ____________________________ Pin:________________________________________ Phone Number: ___________________Email Id:_____________________________________ Please find enclosed cheque/dd no: _________________________ Date: ________________ IN FAVOUR OF : VIBHU MEDIA PVT LTD Mailing Address: #8-3-833/A, Flat No.105, Ground Floor, B Block, Usha Enclave, Srinagar Colony, Hyderabad - 500073. Contact: +91 7702555873 Terms & Conditions 1. Rates are valid for Hyderabad only. For delivery to other parts of Telangana add Rs 40 per 12 issues, Rs 80 for 24 issues. 2. Vibhu Media PVT LTD is not responsible for postal delays or delivery failures. 3. Subscriptions are not refundable. 4. All disputes are subject to the exclusive jurisdiction of competent courts in Hyderabad only.
editor@tollywoodmag.com అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న సినిమాలో నిధి హీరోయిన్ గా ఎంపికైన విషయం తెల్సిందే. అలాగే మాస్ మహారాజా రవితేజ సరసన రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నిధి ఎంపికైంది. ఈ చిత్రాలతో పాటు ఈ ఏడాది మలయాళ ఎంట్రీ కూడా ఇవ్వనుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే నిధి అగర్వాల్ తన అభిమానులకు ఎప్పటికప్పుడు హాట్ షో తో గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇప్పుడు 5 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారు. రీసెంట్ గా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆమె అభిమానులతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ను పెట్టింది. దానికి అభిమానుల నుండి విశేష స్పందన రాగా ఆమె అన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పడం విశేషం. ఆమె రిలేషన్ స్టేటస్ పై వచ్చిన ప్రశ్నకు సమాధానమిస్తూ అందరూ అనుకుంటున్నట్లు తాను ఎవరితోనూ డేటింగ్ చేయలేదని, ప్రస్తుతం సింగిల్ గానే ఉన్నానని పేర్కొంది. ఇంకా తన వాట్సాప్ డిపి, ఫోన్ లాక్ స్క్రీన్, ఆమె లాస్ట్ గా వాడిన యాప్ ఇలా అన్నిటికీ సమాధానాలు ఇచ్చింది. అలాగే తనకు ఇంటర్ లో 87 శాతం మార్కులు వచ్చినట్లుగా ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ఇలా నిధి అగర్వాల్ బ్యూటీ విత్ బ్రెయిన్స్ అన్నమాట.
QUIZ
మహానటి చిత్రం తర్వాత
COMPETET కీర్తి సురేష్ రేంజ్ON తెలుగులో పూర్తిగా మారిపోయింది. ఈ ఒక్క d ary ఆమెకు ఎనలేని రెస్పెక్ట్ సినిమా ను తీసుకొచ్చింది. ఈ సినిమా B RTHDAYS విజయం, ఆమె నటన రెండూ కలిసి EXCLUS VE కీర్తి సురేష్ కు ఆఫర్ల వెల్లువ వచ్చేలా చేసాయి. ఇప్పుడు కీర్తి సురేష్ తెలుగులో చాలా బిజీగా ఉంది. మిస్ ఇండియా చిత్రాన్ని పూర్తి LittleStar చేసిన కీర్తి సురేష్, గుడ్ లక్ సఖి, రంగ్ దే సినిమాల్లో నటిస్తోంది. ఇవి కాకుండా నితిన్ తో మరో సినిమా, మహేష్ బాబుతో సినిమాల్లో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు. అయితే ఈ మధ్యన కీర్తి సురేష్ బాగా సన్నబడింది. బికినీ కోసమే కీర్తి సన్నబడిందని, బికినీ ధరించాలంటే దానికి తగ్గ ఫిజిక్ ఉండాలని, అందుకోసమే కీర్తి సురేష్ తగిన బాడీని సంపాదించిందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై కీర్తి సురేష్ స్పందించింది. తనను బికినీ ధరించమని అడిగిన మాట నిజమేనని, అయితే ఆ పని తాను చేయలేనని అందుకోసమే సినిమా నుండి బయటకు వచ్చేసానని తెలిపింది కీర్తి సురేష్. ఎప్పటినుండో తాను సన్నపడాలనుకుంటున్నానని తనకు తగ్గ బాడీ రావడానికి దాదాపు ఏడాదికి పైగా సమయం పట్టిందని తెలిపింది. తనను తాను ఫిట్ గా ఉంచుకోవడానికే సన్నపడ్డాను తప్ప బికినీ ధరించే ఉద్దేశాలు అసలు లేవని తెలిపింది కీర్తి సురేష్. అయినా మహానటి వంటి సినిమా తర్వాత తెలుగులో కచ్చితంగా ఏ నిర్మాత, దర్శకుడు ఆమెను బికినీ వేసుకోమని చెప్పే ధైర్యం కచ్చితంగా చేయరు.
MAY, 2020 b టాలీవుడ్ z 3
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
నా
గచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం `లవ్‌స్టోరీ`. శేఖర్‌కమ్ముల తెరకెక్కిస్తున్నారు. నారాయణ్ దాస్ కె., నారంగ్, పి. రామ్మోహన్‌రావు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి పల్లవి పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం బర్డే త్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. కొత్త తరహా కథతో మృద్యమైన ప్రేమకథగా దర్శకు డు శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. నటనకు ఆస్కారమున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తున్న సాయి పల్లవి ఈ చిత్రంలోనూ తనదైన శైలిలో సాగే పాత్రలో కనిపించనుంది. తెలంగాణలోని ఓ గ్రామం నుంచి సిటీకి వచ్చే ఓ యువ జంట ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. కథానాయికగా తొలి చిత్రంతోనే ప్రత్యేకమైన ఇమేజ్‌ని సొంతం చేసుకుంది సాయి పల్లవి. ఈ చిత్రంలోనూ ఆమె పాత్ర ప్రత్యేకతని కలిగి వుంటుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తగ్గని స్థాయిలో సినిమా వుంటుందని, ఇప్పటికి విడుదలైన ఫస్ట్ లుక్, ఏయ్ పిల్లా సాంగ్‌కు మంచి ఆదరణ లభిచిందని, మరో 15
తెలుగు
సినిమా అంటే ప్రతీ పాట, లేదా కీలక సన్నివేశం.. విదేశాల్లో తీయాల్సిందే. అలా తీస్తేనే క్రేజ్. కానీ కరోనా తరువాత లెక్క మారింది. మేకిన్ ఇండియా.. మేడ్ ఇన్ ఇండియా అనే మాట ప్రముఖంగా వినిపిస్తోంది. విదేశాల్లో షూటింగ్‌లు, విదేశీ టెక్నీషియన్‌లు అంటే అత్యధిక ప్రాధాన్యతనిచ్చే మన వాళ్లు ఇప్పుడు వద్దంటున్నారు. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం `పుష్ప` ఈ విషయంలో ముందు వరుసలో నిలబడిందని తెలిసింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌తో కలిసి ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది. శేషాచలం అడువల నేపథ్యంలో సహజత్వానికి అత్యంత
దగర ్గ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లోకల్ టెక్నీషియన్‌లతో తెరకెక్కించబోతున్నారు. వంద శాతం మేకిన్ ఇండియా ప్రాజెక్ట్గా ఈ చిత్రాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో విలన్ పాత్ర మరితం ప్రభావవంతంగా వుంటుందట. అతని పరిచయ సన్నివేశాల కోసం దాదాపు 6 కోట్లని చిత్ర బృందం ఖర్చు చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరపైకి రాబోతున్న ఈ చిత్రంలో ఊరమాస్ పాత్రలో లారీడ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ రగ్గ్‌డ్ పాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా సోషల్ మీడియా ఇన్ స్టా వేదికగా అల్లు అర్జున్ షేర్ చేసిన స్థిల్ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర ఏ స్థాయిలో ఆశ్చర ్యపరచనుందో అర్థం మవుతోంది. లాక్‌డౌన్ తరువాత ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
రోజులు చిత్రీకరణ బ్యాలెన్స్‌గా వుందని, లాక్‌డౌన్ తరువాత పరిణామాలని బట్టి మిగతా షూటింగ్‌ని పూర్తి చేస్తామని, ఈ సినిమాతో శేఖర్ కమ్ముల మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారని చిత్ర బృందం వెల్లడించింది.
బుల్లితెరపై
తె
లుగు తెరపై బయోపిక్‌ల పరంపర `మహానటి`తో మొదలైన విషయం తెలిసిందే. `మహానటి` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇదే తరహా జీవిత కథల పరంపర మొదలైంది. ఇదే జాబితాలో హైదరాబాదీ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు. గత కొన్ని నెలలుగా ఈ వార్త వినిపిసస్తూనే వుంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పుల్లెల గోపీచంద్ పాత్రలో హీరో సుధీర్‌బాబు నటించనున్నారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ
నిర్మించడానికి గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమాపై హీరో సుధీర్‌బాబు అఫీ2ఇయల్‌గా ప్రకటించడం ఆసక్తికర ంగా మారింది. ఇటీవల బయోపిక్ కోసం బ్యాడ్మింటన్ లో మరిన్ని మెళకువలు నేర్చుకుంటున్నానని వెల్లించిన సుధీర్‌బాబు తాజాగా పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఎప్పుడు మొదలయ్యేది చెప్పేశాడు. లాక్‌డౌన్ తరువాత మొదలుపెట్టాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మేకర్స్ నుంచి త్వరలోనే వెలువడే అవకాశం వుంది. హీరో నానితో కలిసి సుధీర్‌బాబు నటిస్తున్న `వి` చిత్రం లాక్‌డౌన్ తరువాత రిలీజ్ కాబోతోంది.
రాములమ్మగా తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటోంది శ్రీముఖి. బిగ్‌బాస్ రియాలిటీ షోతో యరింతగా పాపులర్ అయిన శ్రీముఖి మళ్లీ సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఆమె నటిస్తున్న తాజా చిత్రం `ఇట్స్ టైమ్ టు పార్టీ`. గౌతమ్ ఇ.వి.ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దితిప్రియ భట్టాచార్య, మాయ నెల్లూరి క్రిష్ సిద్ధిపల్లి, బాషా మొహిద్దిన్ షేక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎయిన్స్ మోషన్ పిక్చర్ స్, కాక్‌టైల్ సినిమాస్ బ్యానర్‌పై అల్లం సుభాష్, గౌతమ్ ఇ.వి.ఎస్ నిర్మిస్తున్నారు. శ్రీముఖు పుట్టిన రోజు సందర్భంగా శ్రీముఖి ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేశారు. దర్శకుడు మాట్లాడుతూ `ఇదొక సైబర్ క్రైమ్ థ్రిల్లర్ . నాలుగు పాత్రల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రస్తుతం సమాజంలో యువతరం జీవితాలకు అద్ధం పట్టేలా ఉంటుంది. ఈ సినిమాలో శ్రీముఖి పూర్తి
స్థాయి పాత్రలో నటించడం లేదు కానీ ఆమె పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది. గతంలో ఈ తరహా పాత్రలో శ్రీముఖి నటించలేదు. ఆమె పాత్ర నిడివి తక్కువే అయినా చాలా కొత్తగా సర్‌ప్రైజింగ్‌గా వుంటుంది. ఈ పాత్రలో శ్రీముఖి అద్భుతంగా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి` అన్నారు. `బాబు బాగా బిజీ` చిత్రం తరువాత శ్రీముఖి మరో సినిమాలో నటించలేదు. ఆమె సినిమా వచ్చి దాదాపు మూడేళ్లకు పైనే అవుతోంది. మూడేళ్ల గ్యాప్ తరువాత శ్రీముఖి నటిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో సినిమా వుంటుందని దర్శకుడు చెబుతున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ : అనిల్ కుమార్. పి, కెమెరా: దిలీప్ కుమార్ ఎం.ఎస్. సంగీతం : శేఖర్ మోపూరి, సహ నిర్మాత : సి.హెచ్. వేణుమాధవ్. MAY, 2020 b టాలీవుడ్ z 5
NEWS HAPPENINGS
ద
ర్శకుడు హరీష్ శంకర్ కు కమర్షియల్ డైరెక్టర్ గా మంచి పేరుంది. తన కెరీర్ లో ప్లాపులున్నా కానీ స్టార్ హీరో ఇమేజ్ కు తగ్గట్లుగా, అభిమానులు మెచ్చే విధంగా సినిమాలు తీస్తాడని అంటుంటారు. దానికి తగ్గట్లుగానే ఎంటర్టైనింగ్ సినిమాలతో ఎప్పటికప్పుడు మెప్పిస్తున్నాడు హరీష్ శంకర్. గతేడాది గద్దలకొండ గణేష్ తో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హరీష్ శంకర్, ఈసారి పవన్ కళ్యాణ్ తో సినిమాకు సన్నాహాలు చేసుకుంటున్న విషయం తెల్సిందే. అయితే హరీష్ శంకర్ తో సినిమా కంటే ముందు పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. రీసెంట్ గా హరీష్ శంకర్ ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విశేషాలను పంచుకున్నాడు. పవన్ తో గబ్బర్ సింగ్ తీసినప్పుడు ఒక అభిమానిలా మారి తీశానని, ఇప్పుడు కూడా ఒక నిజమైన అభిమానిలానే
LIFE style
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
పవన్ తో సినిమా చేయబోతున్నానని తెలియజేసాడు హరీష్ శంకర్. అయితే సినిమా జోనర్ ఏంటి, కథ పాయింట్ ఏంటి అన్నదానికి మాత్రం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కరోనా కారణంగా పవన్ తో సినిమా అనుకున్నదానికంటే ఆలస్యమవుతోందని, అయితే మన చేతుల్లో లేని దాని గురించి కంగారుపడటం కూడా అనవసరమని తెలియజేసాడు హరీష్. ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని కూడా కొట్టిపారేయలేదు. త్వరలో అన్నీ కుదిరితే చిరుతో సినిమా ఉంటుందని హింట్ ఇచ్చాడు హరీష్. ఒకవేళ మెగాస్టార్ తో సినిమా చేస్తే కనుక రౌడీ అల్లుడు తరహాలో మాంచి ఎంటర్టైనింగ్ కథను చేస్తానని, ఆయన కెరీర్ లో రౌడీ అల్లుడు తనకు చాలా స్పెషల్ చిత్రమని తెలియజేసాడు. అది ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి పరిస్థితుల బట్టి చూస్తుంటే పవన్ సినిమా
BEHIND THE WOODS LOCAT ON
2021 చివరికి వచ్చే అవకాశముంది. అంటే వెంటనే చిరంజీవి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించినా 2022 చివరికి కానీ ఆ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు.
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life GUIDE trade ఊహలు
గుసగుసలాడే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన భామ రాశి ఖన్నా. తన బబ్లీ లుక్స్, క్యూట్ యాక్టింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించిన రాశి ఖన్నా చాలా త్వరగానే రేసులోకి వచ్చేసింది. అయితే మొదట్లో హిట్స్ వచ్చినా వెనువెంటనే వచ్చే ప్లాప్స్ తో ఆమె టాప్ స్థానాన్ని కైవసం చేసుకోలేకపోయింది. గతేడాది వెంకీ మామ, ప్రతిరోజూ పండగే వారం రోజుల వ్యవధిలో రిలీజవ్వడమే కాకుండా రెండూ కూడా సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండిట్లో రాశి ఖన్నా హీరోయిన్ గా నటించింది. దీంతో మళ్ళీ తెలుగులో ఆమెకు అవకాశాల వెల్లువ ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ ఏడాది విజయ్ దేవరకొండ హీరోగా చేసిన వరల్డ్ ఫేమస్ లవర్ ప్లాపవ్వడమే కాకుండా రాశి ఖన్నా పోషించిన పాత్రకు విమర్శలు వచ్చిన సంగతి తెల్సిందే. దీనిపై రాశి ఖన్నా వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది కూడా. రాశి ఖన్నా అభిమానులకు ఆమె అలాంటి పాత్రలు చేయడం నచ్చలేదు. వరల్డ్ ఫేమస్
My CHOICE QUIZ
లవర్ తర్వాత తెలుగులో ఎటువంటి సినిమాలు ఒప్పుకోలేదు రాశి ఖన్నా. దీనిపై పలు రకాల వార్తలు వచ్చాయి కూడా. అయినా కూడా రాశి ఖన్నా నుండి ఎటువంటి స్పందనా లేదు. రీసెంట్ గా ఈమె అభిమానులతో ఆన్లైన్ లో ముచ్చటించింది. అభిమానుల నుండి వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది. తమిళంలో రెండు ప్రాజెక్టులు చేస్తున్నట్లు రివీల్ చేసింది. హరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరోయిన్ గా నటించబోతున్నట్లు తెలియజేసింది రాశి ఖన్నా. అలాగే సుందర్ సి దర్శకత్వంలో రాబోయే అరణ్మణై మూడవ పార్ట్ లో హీరోయిన్ గా సెలక్ట్ అయినట్లు కూడా తెలియజేసింది. ఇక తెలుగులో సినిమాలు ఎందుకని ఒప్పుకోవట్లేదు అన్న ప్రశ్నకు ప్రస్తుతం రెండు ప్రాజెక్టులు డిస్కషన్ స్టేజి లో ఉన్నాయని, లాక్ డౌన్ పూర్తయ్యాక వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుస్తాయని తెలిపింది రాశి ఖన్నా.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
ఎ
స్ ఎస్ థమన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అల వైకుంఠపురములో ఆల్బమ్ ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా సాధించిన అద్భుత విజయంలో పాటలదే అగ్రతాంబూలం అంటే అందులో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క పాట అని కాకుండా ఆల్బమ్ మొత్తం శ్రోతలను ఆకట్టుకుంది. ఈ పాటలకు ఆరంభమే అదిరిపోయింది. సామజవరగమన సాంగ్ తో మొదలైన అల వైకుంఠపురములో ప్రభంజనం ఇంకా ఆగలేదు. సామజవరగమన పాట విడుదలైనప్పుడు శ్రోతలను ఊపేసింది. రాములో రాముల ఆ ఊపును కొనసాగించింది. ఇక ఇప్పుడు హవా అంతా ఆఖరున విడుదల చేసిన బుట్ట బొమ్మ సాంగ్ దే. ఈ సినిమా ఆల్బమ్ లో ఆఖరున విడుదలైనా బుట్ట బొమ్మ ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా అందరినీ ఊపేస్తోంది. లిరికల్ సాంగ్ కన్నా వీడియో సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం
ఈ సాంగ్ కు ఎంతలా కనెక్ట్ అయ్యారో మనం చూసాం. ఆస్ట్రేలియా క్రికెట్ ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఆయన సతీమణితో కలిసి రీసెంట్ గా బుట్టబొమ్మ సాంగ్ స్టెప్ ను వేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. మన పాట ఖండాంతరాలు దాటి అందరినీ అలరిస్తోందని ఖుషీ అయ్యారు. అందరి ఫేవరేట్ అయిన ఈ బుట్ట బొమ్మ పాట ఇప్పుడు మరో మైలురాయిని అందుకుంది. బుట్ట బొమ్మ వీడియో సాంగ్ యూట్యూబ్ లో 150 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఈ ఆల్బమ్ ను విడుదల చేసిన ఆదిత్య మ్యూజిక్ కు కాసులు వర్షం కురిపించింది ఈ సినిమా. సామజవరగమన లిరికల్ సాంగ్ 180 మిలియన్ వ్యూస్ దాటి తెచ్చుకోగా, రాములో రాముల అయితే ఏకంగా 260 మిలియన్ వ్యూస్ ను సాధించింది. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో బుట్ట బొమ్మ కూడా చేరింది. ఒక్క సినిమాలో అన్ని పాటలు ఇంతలా హిట్ అవ్వడం విశేషమే మరి. MAY, 2020 b టాలీవుడ్ z 7
Interview SpecialStory Hollywood పెంగ్విన్ (తమిళం, తెలుగు)
రచన - జూహీ చతుర్వేది దర్శక త్వం - షూజిత్ సర్కార్ నిర్మాతలు - రోన్నీ లాహిరి, శీల్ కుమార్
`మహానటి`
చిత్రంతో నటిగా తన సత్తాను చాటుకున్నారు కీర్తిసురేష్. తెలుగు, తమిళ భాషల్లో మంచి నటిగా జేజేఅందుకున్నారు, విమర్శకుల ప్రశంసల్ని సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆమె నటించిన థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ `పెంగ్విన్`. విభిన్నమైన కథ, కథనాలతో తెరక్కిన చిత్రమిది. ఈశ్వర్ కార్తిక్ దర్శకత ్వం వహించారు. స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ బ్యానర్పై కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు.
ఈ చిత్రాన్ని చిత్ర బృందం అమెజాన్ ప్రైమ్‌లో
రిలీజ్ చేస్తోంది. `మహానటి` చిత్రానికి అమెజాన్ భారీ ఆఫర్‌ని అందించింది. అదే స్థాయిలో `పెంగ్విన్` చిత్రానికి కూడా భారీ ఆఫర్‌ని అందించి ఎక్స్‌క్లూజివ్‌గా తెలుగు ప్రేక్షకుల కోసం అందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ వెర్షన్ లోనూ ఈ చిత్రం అందుఎబాటుతో వుండబోతోంది. ఈ నెల 19న అమెజాన్‌లో డైరెక్ట్‌గా రిలీజ్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు క్రేజీ చిత్రం ఇదే కావడం గమనార్హం.
అమెజాన్
ప్రైమ్‌లో ఈ సినిమాతో పాటు డైరెక్ట్ స్లాట్‌లో మరో ఆరు ఇతర భాషల చిత్రాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. ఈ విషయాన్ని అమెజాన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెజాన్‌ప్రైమ్ వీడియో డైరెక్టర్, కంటెంట్ హెడ్ విజయ్ సుబ్రమణియం మాట్లాడుతూ `అమెజాన్‌లో మేము వినియోగదారుల మాట వింటాం. ఆ దిశగా మేం పనిచేస్తాం. గత రెండేళ్లుగా వివిధ భాషల్లో, థియేటర్లలో విడుదలైన కొద్ద వారాలకే కొత్త రిలీజ్‌లని చూసేందుకు ఏకైక డిజిటల్ ప్లాట్ ఫామ్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో రూపు దిద్దుకుంంది. ఇప్పుడు మేము మరో అడుగు ముందుకు వేశాం. అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఏడు భారతీయ సినిమాలను ఎక్స్ క్లూజివ్‌గా ప్రైమ్ వీడియోపై ప్రసారం చేయనుంది. సినిమాటిక్ అనుభూతిని వారి ఇళ్లముంగిళ్లలో కి తీసుకురానుంది` అన్నారు. భారతీయ ప్రేక్షకులు ఏడు చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. వినియోగదారుల కోసం వీటిని నేరుగా రిలీజ్ చేస్తుండటం ఆనందంగా వుంది. ఇంట్లోనే సురక్షితంగా వుంటూ వీక్షించవచ్చు. 4000కు పైగా పట్‌ంణాలు, నగరాలతో వీక్షణంతో భారత దేశంలో పాపులర్ అయిన అమెజాన్ ప్రైమ్ ఇప్పుడు 200కు పైగా దేశాలు, టెరిటరీస్‌లలో అందుబాటులో వుంది. ఈ సినిమాలకు అంతర్జాతీయ రిలీజ్ ముద్రను అందించనుంది. ఈ కార్యక్రమం పట్ల మేమెంతో ఉద్వేగంగా వున్నాం. ఇది మా ప్రైమ్ సభ్యులను ఆనందపరుస్తుందని మేము విశ్వసిస్తున్నాం` అని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్, కంట్రీ జనరల్ మేనేజర్ గౌరవ్ గాంధీ వెల్లడించారు.
అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ అవుతున్న చిత్రాలు: `పోన్ మగల్ వంధాల్` (తమిళం) విడుదల తేదీ మే 29 - 2020 తారాగణం : జ్యో తిక, పార్తీబన్, భాగ్యరాజా, ప్రతాప్ పోతన్, పాండ్యరాజన్, రచన, దర్శత కత్వం : జె.జె. ఫ్రెడరిక్ నిర్మాతలు - సూర్య, రాజశేఖర్ కర్పూర సుందర పాండ్యన్
`గులాబో సితాబో` (హిందీ)
రిలీజ్ తేదీ - జూన్ 12, 2020 తారాగణం : అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా 8 z టాలీవుడ్ b MAY, 2020
రిలీజ్ తేదీ - జూన్ 19, 2020 తారాగణం - కీర్తి సురేష్ రచన , దర్శక త్వం - ఈశ్వర్ కార్తిక్ నిర్మాతలు - స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, కార్తీక్ పసుబ్బరాజు
లా (కన్నడ)
రిలీజ్ తేదీ - జూన్ 26, 2020 తారాగణం - రాగిని చంద్రన్, సిరి ప్రహ్లాద్, ముఖ్యమంత్రి చంద్రు,
రచన, దర్శకత్వం - రఘు సమర్ధ్ నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్‌కుమార్
ఫ్రెంచ్ బిర్యానీ (కన్నడ)
రిలీజ్ తేదీ - జూలై 24, 2020 తారాగణం - డానిష్ సెయిత్, సాల్ యూసుఫ్, పిటొ బాష్ రచన - అవినాష్ బాలెక్కాల దర్శకత్వం - పన్నాగ భరణ నిర్మాతలు - అశ్విని, పునీత్ రాజ్‌కుమార్, గురుదత్ ఎ తల్వార్,
శకుంతలాదేవి ( హిందీ)
రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. తారాగణం - విద్యాబాలన్
రచన - నాయనిక మహ్తిని, అనూ మీనన్ దర్శకత ్వం - అనూమీనన్ నిర్మాతలు అబున్ డాంటియా ఎంటర్టై న్‌మెంట్ ప్రై. లి, సోనీ పిక్చర్ స్ నెట్ వర్క్ ఇండియా
సుఫియాం సుజాతయం (మలయాళం) రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. తారాగణం - అదితిరావు హైదరీ, జయసూర్య రచన, దర్శకత ్వం - నరని పుజా షనవా స్ నిర్మాణం - విజయ్ బాబు ప్రైడే ఫిల్మ్ హౌస్.
ఈ పసినిమాలన్నీ రానున్న మూడు నెలల్లో ప్రైమ్ వీడియోలో ఎక్స్ క్లూజివ్‌గా ప్రసారం కానున్నాయి.
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
కరోనా
కరోనా
కారణంగా ఫిల్మ్ ఇండస్ట్రీ స్థంభించిపోయింది. ఎక్కడా షూటింగ్‌లు లేవు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లేవు, థియేటర్స్ బంద్.. కొత్త సినిమాల సందడి లేదు. దీంతో చాలా మంది సినీ కార్మికులు పనిలేకుండా ఖాలీగా కాలం వెల్లదీస్తున్నారు. అయితే తాజాగా తమిళనాడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కు అనుమతులివ్వడంతో తమిళ ఇండస్ట్రీలో మళ్లీ హంగామా మొదలైంది. ఈ నెల 11 నుంచే షరతులతో కూడిన అనుమతులు ఇవ్వడంతో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ హడావిడి మొదలైంది. దీంతో భారీ చిత్రాల హంగామా మళ్లీ మొదలైంది. తమిళనాడు ప్రభుత్వం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కు అనుమతులు ఇవ్వడంతో రజనీ తాజా చిత్రాన్ని పొంగల్‌కి
రిలీజ్ చేయబోతున్నామంటూ చిత్ర బృందం ప్రకటించింది. `దర్బార్` తరువాత తమిళ సూపర్‌స్టార్ రజనీ కాంత్ నటిస్తున్న చిత్రం `అన్నాతే`. శివ దర్శకత్వం వహిస్తున్నారు. మీనా, ఖుష్బూ సుందర్, నయన తార, కీర్తిసురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్ స్ బ్యానర్పై కళానిధి మారన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని సన్ పిక్చర్ స్ ఇటీవల అధికారికంగా ప్రకటిస్తూ ఓ వీడియో ని రిలీజ్ చేసింది. లాక్‌డౌన్ తరువాత ఈ చిత్రానికి సంబంధించిన మరింత సమాచారాన్ని రజనీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేయనున్నారట.
కారణంగా జన జీవితం స్థభించిపోయింది. ప్రతీ రంగం నడ్డి విరిపోయింది. లాక్‌డౌన్ కారణంగా అంతా ఇంటి పట్టునే వుంటుండటంతో ఏ బిజినెస్ కూడా రన్ కావడం లేదు. షాప్స్, షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ అన్నీ మూసివేయబడ్డాయి. ఎక్కడ చూసినా కరోనా.. కరోనా.. దీంతో సినిమాల పరిస్థితుల మరింత దారుణంగా మారింది. థియేటర్లు తెరిచే పరిస్థితి లేక సినిమా షూటింగ్‌లకు అనుమతి లేకపోవడంతో సినిమా వాళ్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్‌కు రెడీగా వున్నాయి. కొన్ని సెన్సార్‌కు సిద్ధంగా వున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర సెన్సార్ బోర్డ్
సినీ వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పింది. చాలా రోజులుగా సినీ పరిశ్రమ వర్గాలు జాతీయ సెన్సార్ బోర్డు స్పందించాలని కోరిన నేపథ్యంలో ఆసక్తికర మై న ప్రకటన వెలువడటం గమనార్హం. సెన్సార్ ఆకుండా ఆగిపోయిన సినిమాలకు ఆన్‌లైన్‌లో సెన్సార్ చేసుకోవచ్చని అనుమతులిచ్చింది. ఇది నిజంగా నిర్మాతల కు గుడ్ న్యూసే. ఎందుకంటే ఇంతకు ముందు ఓ సినిమాని సెన్సార్ చేయించాలంటే ప్రత్యేకంగా సెన్సార్ సభ్యుల కోసం షో ఏర్పాటు చేయాలి. నిర్మాత అక్కడే వారి కోసం ఎదురుచూస్తూ వుండాలి. కానీ ఇప్పుడు మాత్రం నిర్మాత ఎక్కడ ప్రదర్శన ఏర్పాటు చేస్తే సెన్సార్ బోర్డ్ మెంబర్స్ అక్కడికే వచ్చి సినిమా చూస్తారు. తరువాత ఈమెయిల్ ద్వారా సర్టిఫికెట్ జారీ చేస్తారు.
రాజమౌళి తెరకెక్కించిన `బాహుబలి` రెండు
భాగాలుగా తెరకెక్కి సంచలన ం సృష్టించిన విషయం తెలిసిందే. తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన ఈ సినిమా భారతీయ సినీ జగత్తులో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. ఈ సినిమా ఫార్మాట్‌నే దర్శకు డు శంకర్ అనుసరించబోతున్నారు. కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించి `ఇండియన్` ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా `ఇండియన్ - 2` చిత్రం తెరకెక్కుతోంది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై అల్లిరాజా సుభాస్కరన్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాజల్
అగర్వాల్, సిద్ధార్ధ్, రకుల్ ప్రీత్‌సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరోనా ప్రభావం ప్రారంభానికి ముందు చెన్నైలోని ఓ స్టూడియోలో షూటింగ్ చేస్తుండగా క్రేన్ విరిగిపడి ముగ్గురు సిబ్బంది మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఈ చిత్ర షూటింగ్‌ని నిరవదికంగా వాయిదా వేశారు. మళ్లీ ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా కారణంగా షూటింగ్ ఆడిపోయింది. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కించాలని శంకర్ ప్లాన్ చేస్తున్నారట. తొలి పార్ట్‌ని వచ్చే ఏడాది రిలీజ్ చేసి ఆ తరువాత రెండవ భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆలోచనలో వున్నట్టు తెలిసింది. MAY, 2020 b టాలీవుడ్ z 9
హీరో
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY
CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS
కరోనా
వైరస్ ఏ రంగాన్నీ విడిచిపెట్టలేదు. ప్రపంచ వ్యాప్తంగా వున్న ప్రతీ రంగం దీని కారణంగా ఇబ్బందులు, ఆర్థికంగా నష్టాలని చవిచూస్తోంది. మధ్య తరగతి జీవితాలు ఒక విధంగా చెప్ఆలంటే దర్భరంగా మారాయి. కనీస అవసరాల కూడా తీర్చుకోలేని స్థితిలోకి చాలా కుటుంబాలు చేరుకుంటున్నాయి. ఓ పక్క కరోనా సాకుతో పలు ప్రైవేట్ సెక్టార్‌లన్నీ ఉద్యోగుల్ని తొలగిస్తూ వారి జీవితాల్ని మరింత భయంకరంగా మారుస్తున్నాయి. అయితే ఇంత విధ్వంసం జరుగుతున్నా కొన్ని సంస్థల కు ఈ విపత్కర పరిస్థితే బిగ్ అడ్వాంటేజ్‌గా మారింది. ఇంతకు ముందు ఈ సంస్థల ంటే కొంత మంది మాత్రమే ఆసక్తిని చూపించేవారు కానీ కరోనా కారణంగా గతంలో వున్న వారి సంఖ్య ఇప్పుడు రెట్టింపు అయింది. విషయం ఏంటంటే గతంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే
LOCAT ON
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE My CHOICE
వారి సంఖ్య చాలా తక్కువగా వుండేది. అఇ ఓ సెపరేట్ వర్గంగా అంతా భావించే వారు కరోనా కారణంగా అంతా ఇంటిపట్టునే వుండటంతో కాల క్షేపం కోసం టీవీలని పక్కన పెట్టి ఓటీటీలని ఆశ్రయించడం మొదలుపెట్టారు. టీవీ సీరియల్స్, సినిమా షూటింగ్‌లు నిలిపివేయడంతో లాక్‌డౌన్ కారణంగా ఇంటి పట్టునే వుంటున్న జనానికి వినోదం అందుబాటులో లేకుండాపోయింది. దీంతో అత్యధిక శాతం జనాలు ఓటీటీలని నమ్ముకోవడం మొదలైంది. రెండు నెలలుగా లాక్‌డౌన్ పిరియడ్ నడుస్తున్న నేపథ్యంలో ఓటీటీలకి సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోయారు. జీ5, దిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్‌లలో అత్యధిక శాతం జీ5కే సబ్‌స్క్రైబర్స్ పెరిగిపోయారు. దీంతో ఈ లాక్‌డౌన్ టైమ్ జీ5కి బాగా కలిసి వచ్చిందంటున్నారు.
అంటే సినిమాలే కాదు సామాజిక బాధ్యత కూడా వుండాలని చాలా మంది హీరోలు నిరూపిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా మధ్యతరగతి జీవితాలు నిత్యావసరాల కోసం ఇబ్బందిపడుతున్న వేళ నేనున్నానంటూ భయ హస్తం అందించారు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. ఆయన తరహాలోనే మరో మహాత్తర కార్యక్రమానికి హీరో మంచు విష్ణు శ్రీకారం చుట్టబోతున్నారు. సాయుధ బలగాల గురించి అందులోనూ తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని ఇటీవల సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడిస్తూ ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆర్మీలో తెలుగు జవాన్ల వీరత్వాన్ని, వారి త్యాగాన్ని చూపే వీడియోలు, ఫొటోలు ఎవరి దగ్గరైనా ఉంటే తనకు పంపించాలని ఈ సందర్భంగా మంచు విష్ణు కోరుతున్నారు. `ప్రపంచంలో మనం నిత్యం శిరస్సు వంటి నమస్కరించాల్సిన వారు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చే తల్లి.. మన ఆకలి తీర్చే రైతన్న.. తన
కుంటుంబానికి దూరమై మన భద్రత కోసం దేశ సరిహద్దుల్లో కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికి లభించాల్సిన గుర్తింపు దక్కట్లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయులైన కన్నతల్లుల్ని, కష్టజీవులైన రైతన్నలను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవాన్లను కలిసే అదృష్టం మాత్రం నాకెప్పుడూ కలగలేదు. ఇప్పుడు భారత ఆర్మ్‌డ్ ఫోర్సెస్ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెట్టబోతున్నాను. ప్రపంచంలో సమర్ధవంతమైన భారత ఆర్మ్‌డ్ ఫోర్సెస్లో అడుగుపెట్టి మన దేశాన్ని గర్వించేలా చేస్తున్న ప్రతి ఒక్కరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా ఆర్మీలో తమదైన ముద్ర వేసిన తెలుగు వీర జవాన్ల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగరై ్గ నా మన తెలుగు వీరసైనికుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు, వాళ్ల పేర్లు ఉంటే నా సోషల్ మీడియా అకౌంట్‌కి పంపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రపంచంతో వాళ్ల వీరకథల్ని పంచుకుందాం. జై జవాన్.. జై కిసాన్.. జైహింద్!` అంటూ మంచు విష్ణు వీడియో షేర్ చేశారు.
లాక్‌డౌన్ వేళ తానిస్తున్న గిఫ్ట్ అంటూ ప్రచారం మొదలుపెట్టిన వర్మ ఇటీవల `క్లైమాక్స్`కి సంబంధించిన టీజర్‌ని రిలీజ్ చేశాడు. ఈ టీజర్‌లో అంతా ఊహించినట్టే మియా మాల్కోవా అందాలని తెర నిండా ఆరబోశాడు. ఎంత వరకు కుర్ర కారుని కిర్రెక్కించాలో అంత వరకు మియా అందాల్ని క్యావ్వాస్‌పై ఆవిష్కరించాడు. ఎడారిలోని ఓయాసిస్సు ప్రాంతంలో మియా మాల్కోవాతో తెరకెక్కించిన ఈ `క్లైమాక్స్`తో ఎలాంటి సంచలనాలు
సృష్టించనున్నారో చూడాలి. శ్రేయాస్ ఈటీ సమర్పణలో ఆర్ ఎస్ ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ మూవీ ట్రైలర్ని ఈ నెల 18న రిలీజ్ చేయబోతున్నానని, లాక్‌డౌన్ సమయంలో మియా మాల్కోవాతో కలిసి తాను అందిస్తున్న గిఫ్ట్ ఇదని టీజర్‌లో వెల్లడించడం విశేషం.
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
వివాదాల్ని...
విపత్కర పరిస్థితుల్ని రాగ్ గోపాల్‌వర్మ వాడుకున్నత ఈజీగా మరెవ్వరూ వాడుకోలేరంటే అది అతిశయోక్తి కాదేమో. ఎక్కడ వివాదం వుంటే అక్కడే అడుగు పెట్టడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య. వివాదాన్నే తనకు ప్రచారంగా మార్చుకుంటూ దాన్నే సినిమాగా మలచడంలోనూ వర్మను మించిన వాళ్లు లేరు. తాజగా కరోనా మహమ్మారి విళయతాండవ సృష్టిస్తున్న వేళ వరుస ట్వీట్‌లతో వార్తల్లో నిలిచారు వర్మ. 10 z టాలీవుడ్ b MAY, 2020
ఆయన చేసినన్ని ట్వీట్‌లు కరోనాపై మరెవరూ చేయలేదు. ఇక ఆయన కన్ను తాజాగా లాక్‌డౌన్‌పై పడింది. లాక్‌డౌన్ వేళ అంతా ఇంటిపట్టునే వుండి కరానా భారీన పడకుండా జాత్రత్తలు తీసుకుంటుండే ఈ సమయాన్ని కూడా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఆ మధ్య `జీఎస్టీ` అంటూ పోర్న్ స్టార్ మియామాల్కోవాతో హంగామా చేసిన వర్మ ఈ లాక్‌డౌన్ వేళ మళ్లీ ఆమెనే నమ్ముకుని `క్లైమాక్స్` అంటూ ఓ ఫిల్మ్‌ని రూపందించారు.
NEWS HAPPENINGS
టాలీవుడ్ లో 100 శాతం సక్సెస్ రేట్ ఉన్న
అతి కొద్ది మంది దర్శకులలో అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఇప్పటివరకూ 5 సినిమాలను డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి అన్ని సినిమాలతో సూపర్ హిట్లు సాధించాడు. తన లాస్ట్ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేసిన సరిలేరు నీకెవ్వరు ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరం చూసాం. ప్రస్తుతం 2018లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ఎఫ్ 2కు సీక్వెల్ ఎఫ్ 3 స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్న అనిల్ రావిపూడి, ఈ ఏడాది చివరి నుండి ఈ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాలనుకుంటున్నాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో కంటిన్యూ అవుతారని చెప్పాడు అనిల్ రావిపూడి. అయితే రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రస్తుతం ఎఫ్ 3 పనుల్లో ఉన్నా కూడా వేరే హీరోలకు కథలు కూడా సిద్ధం చేసుకుంటున్నా. మెగాస్టార్ చిరంజీవి కోసం ఒక అద్భుతమైన పాయింట్ దొరికింది. దాన్ని
LIFE style
HOT SPICY CHIT CHAT PA
RAZZI
కథగా మార్చే పనుల్లో ఉన్నాను. ఒక్కసారి లాక్ డౌన్ తీయగానే మెగాస్టార్ ను కలిసి నా స్క్రిప్ట్ ను నరేట్ చేస్తాను. చిరంజీవి గారిని డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అంతకంటే అదృష్టం ఏముంటుంది. ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి దర్శకులం అయినవాళ్ళం. ఇప్పుడు ఆయన్నే డైరెక్ట్ చేసే అవకాశం వస్తే అదృష్టమే కదా అంటున్నాడు అనిల్ రావిపూడి. తన వద్ద నందమూరి బాలకృష్ణ కోసం కూడా ఒక పాయింట్ ఉందని అంటున్నాడు. గతంలోనే బాలయ్యతో ఒక సినిమా చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యాడు. మళ్ళీ మరోసారి ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం చిరంజీవి వరస సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం చేస్తోన్న ఆచార్య పూర్తవ్వగానే సుజీత్ దర్శకత్వంలో లూసిఫెర్ రీమేక్ ను చేయాల్సి ఉంది. దాని తర్వాత బాబీ, మెహెర్ రమేష్ దర్శకులతో సినిమాలు ఉంటాయని రీసెంట్ గా ప్రకటించిన విషయం తెల్సిందే.
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
నందమూరి
trade GUIDE
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ అయినా కానీ అది మొదలవ్వడానికి చాలా బాలారిష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముందుగా ఈ సినిమాకు వేసుకున్న బడ్జెట్ వర్కౌట్ కాదని వాయిదా వేశారు. ఎందుకంటే బాలకృష్ణ రీసెంట్ గా నటించిన సినిమాలు అన్నీ ఒకదాన్ని మించి మరొకటి దారుణమైన పరాజయాలుగా మిగిలాయి. సినిమాలు కొన్న డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోయారు. పైగా బోయపాటి శ్రీను కూడా ఒక దారుణమైన డిజాస్టర్ ను అందించి ఉన్నాడు. దీంతో బడ్జెట్ ను తగ్గించాలని భావించారు. దీనిపై చాలా తతంగమే నడిచింది. ముందు 60 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్తా 40 కోట్లకు కుదించగలిగారు. అయితే ఇంతలోనే కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డబ్బుల్లేక నానా అవస్థలు పడుతున్నారు. సినిమాలకు కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. దీంతో ఈ సినిమా బడ్జెట్
My CHOICE QUIZ
ను మరోసారి సమీక్షిస్తారని, సినిమా రేంజ్ ను తగ్గిస్తారని వార్తలు వచ్చాయి. అయితే బోయపాటి శ్రీను ఈ వార్తలను పూర్తిగా కట్టిపడేసారు. భారీతనంలో ఎక్కడా లోటుపాట్లు ఉండవని తెలిపాడు బోయపాటి. మా కాంబినేషన్ అంటే ఉండే అంచనాలు వేరు. భారీతనం తగ్గితే ఫ్యాన్స్ నిరుత్సాహపడతారు. ఎంతలో తీయాలో అంతలోనే తీస్తాం. అందరూ ఆనందపడే సినిమానే అవుతుంది అని తెలిపాడు బోయపాటి. ఈ చిత్రం కోసం ఇద్దరు కొత్త హీరోయిన్లను తీసుకుంటున్నట్లు ఇప్పటికే బోయపాటి శ్రీను ప్రకటించిన విషయం తెల్సిందే. సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ షూటింగ్ లకు అనుమతి లభించిన వెంటనే ఉంటుందని తెలుస్తోంది. దసరా కానుకగా సినిమాను అందించాలని బోయపాటి ప్రణాళికలు రచిస్తున్నాడు. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా తెరకెక్కి అద్భుత విజయం సొంతమవుతుందో లేదో చూడాలి.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
MAY, 2020 b టాలీవుడ్ z 11
LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
12 z టాలీవుడ్ b MAY, 2020
MAY, 2020 b టాలీవుడ్ z 13
ng od Bollywood w tory od
క్రేజీ హీరోయిన్స్ చాలా మంది విదేశీ బాయ్
ఫ్రెండ్స్‌తో డేటింగ్ చేయడం చివరికి వారినే వివాహం చేసుకోవడం ఈ మధ్య మరీ ఎక్కువైంది. ప్రీతీ జింటా, రాధికా ఆప్టే, శ్రియా సరన్ పారినర్స్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా తాప్సీ కూడా ఫారిన్ బాయ్ ఫ్రెండ్‌ని వివాహం చేసుకోబోతున్నట్టు వెల్లడించింది. తాజాగా ఈ జాబితాలో బాలీవుడ్ హాటీ ఈషా గుప్తా కూడా చేరబోతోంది. రామ్‌చరణ్ హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రం `వినయ విధేయ రామ`. ఈ చిత్రంలోని ఓ స్పెషల్ సాంగ్‌లో చిందులేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఇషా గుప్తా గత కొంత కాలంగా స్పానిష్ బిజినెస్‌మెన్ మానుయెల్ కాంపస్ గుల్లర్‌తో డేటింగ్ చేస్తోంది. త్వరలో అతన్నే వివాహం చేసుకోబోతున్నానని ఇషా గుప్తా తాజాగా వెల్లడించింది. గత కొంత కాలంగా ఇషా గుప్తా సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ వేదికగా హాట్ ఫొటోలు, యోగా వీడియోలతో నెటిజన్స్‌ని హీటెక్కిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ సమయం కావడంతో హాట్ యోగాసనాలు వేస్తూ ఆ విడియోస్‌ని, ఫొటోలని నెటిజన్స్‌తో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ వైరల్ అవుతోంది.
`మైనే
ప్యార్‌కియా` (ప్రేమ పావురాలు).. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో యావత్ భారతావనికి పరిచయమైన పేరు భాగ్యశ్రీ. 1989లో వచ్చిన ఈ చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ తొలి సినిమాకే బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్‌గా తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డుని సొంతం చేసుకుంది. రాజశేఖర్ నటించిన `ఓంకారం`, బాలకృష్ణ నటించిన `రాణా` చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత ప్రభాస్ నటిస్తున్న `జాన్` సినిమాతో టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. రాధాకృష్ణకుమార్ దర్‌ీకత ్వంలో యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరో ప్రభాస్‌కు తల్లిగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు `తలైవి`లోనూ
కీలక పాత్రలో నటిస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా భాగ్యశ్రీ వెల్లడించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటి జయల లిత జీవిత కథ ఆధారంగా తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషల్లో `తలైవి` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కంగన రనౌత్ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలోని తన పాత్ర గురించి భాగ్యశ్రీ స్పందించారు. `సినిమాలో తన పాత్ర చాలా కీలకంగా వుంటుందని, తలైవి జీవితం ముఖ్యమైన మలుపు తిరగడా నికి తన పాత్ర కారణంగా నిలుస్తుందని, సెప్టెంబర్ నుంచే ఈ చిత్రంలో నటిస్తున్నానని, కంగణతో కలిసి నటించడం ఫన్‌గా వుందని, ఆమె చాలా గొప్ప నటి అని ఈ సందర్భంగా వెల్లడించింది.
కరోనా
కరోనా
కారనంగా ఇంటికి పరిమితమైన నటీనటులు కొత్త కొత్త చిమ్మిక్కులు చేస్తూ ఫ్యాన్స్‌ని, నెటిజన్స్‌ని ఆకట్టుకునే ప్రయత ్నం చేస్తున్నారు. కొంత మంది యోగా వీడియోలని షేర్ చేస్తుంటే మరి కొంత మంది మాత్రం నచ్చిన వంటలు, వర్కవుట్‌లకు సంబంధించిన వీడియోలని అభిమానులతో పంచుకుంటున్నారు. మరి కొంత మందేమో ఇన్ స్టా లైవ్‌లో అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అయితే బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి మాత్రం టిక్ టాక్ వీడియోలతో ఎంజాయ్ చేస్తోంది. లాక్‌డౌన్ సమయాన్నిఅలా గడిపేస్తూ నిత్యం 14 z టాలీవుడ్ b MAY, 2020
నెటిజన్స్‌కి, అభిమానులకి టచ్‌లో వుంటోంది. తాజాగా శిల్పాశెట్టి తన భర్తతో కలిసి చేసిన టిక్ టాక్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. రాజ్ కుంద్రాతో కలిసి చేసిన ఈ వీడియోలో శిల్ప తన భరని ్త చితక్కొట్టడం వైరల్‌గా మారింది. శిల్పాకు రాజ్ కుంద్రా ముద్దు పెట్టాలని ప్రయత్నించడం.. ఆ సమయంలో మరో పాత్రలో శిల్ప ఎంటరై పనిలో వుండగా డిస్ట్రబ్ చేస్తే చిరాకొస్తుందని, కొట్టాలనిపిస్తుందని చెప్పడం.. ఆ వెంటనే శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాపై పిడిగుద్దులు కురిపించడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
వైరస్ ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలని సైతం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా షూటింగ్‌లు రద్దయ్యాయి. థియేటర్లు మూతపడ్డాయి. దీంతో స్టార్స్ ఇంటిపట్టునే వుంటున్నారు. ఇప్పటికే పూర్తయిన సినిమాల రిలీజ్‌లు ప్రస్తుతం ప్రశ్నార్థక ంగా మారాయి. దీంతో చాలా మంది నిర్మాతలు తమ చిత్రాల్ని ఓటీటీ ప్లాట్ ఫాంలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తెలుగు సినిమాల రిలీజ్‌ల కోసం ఓటీటీ ప్లాట్ ఫామ్‌లు భారీ ఆఫర్లు ఆఫర్ చేస్తున్నాయి. కానీ ప్రొడ్యూసర్స్ మాత్రం ఓటీటీల్లో తమ చిత్రాల్ని రిలీజ్ చేయడానికి ఆసక్తిని చూపించడం లేదు. ఇదిలా వుంటే
బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు మాత్రం పరిస్థితిని అంచనా వేసి ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదని భావించి ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌లో రిలీజ్ చేయడానికి ముందుకొస్తున్నారు. బిగ్‌బి అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం `గులాబో సితాబో`. సూజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన కొత్త పోస్టర్‌ని ఇటీవల రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్‌లో జూన్ 12న రిలీజ్ చేస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది.
B RTHDAYS EXCLUS VE
LittleStar
FilmMaking Kollywood Bollywood Interview టా SpecialStory Hollywood
లీవుడ్ వదిలేసిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్‌లో నటనకు ప్రాధాన్యం వున్న చిత్రాల్లో నటిస్తూ విమర్శకు ల ప్రశంసలు అందుకుంటోంది. ప్రధానంగా ఉమెన్ సెంట్రిక్ చిత్రాల్లో నటిస్తూ పలు అవార్డుల్ని దక్కించుకుంది. అదే స్థాయిలో వివాదాల్లోనూ చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. `సాండ్ కీ ఆంఖ్` సినిమా సమయంలో కంగన రనౌత్ సిస్టర్ రంగోలి చందేల్ కారణంగా వార్తల్లో నిలిచిన తాప్సీ తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా ఓ మీడియా కిచ్చిన ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ విషయంలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది. గత కొంత కాలంగా
p
డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూస్ బోయేతో ప్రేమలో వుంది. ఈ విషయాన్ని గత కొంత కాలంగా వెల్లడించని తాప్సీ తాజాగా తన బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పేసింది. మాథ్యూ బోయేతో గత కొంత కాలంగా ప్రేమలో వున్నానని, తమ ప్రేమని తల్లిదండ్రులు అంగీకరించాని, అయితే తన ప్రేమని తన పేరెంట్స్ అంగీకరించి వుండకపో తే మధ్యలోనే బ్రేకప్ చెప్పేసేదానన్నని వెల్లడించింది. బోయునే ప్రేమించడం గర్వంగా భావిస్తున్నానని, నటిగా గుర్తింపు తెచ్చుకున్న తరువాత అతని పేరు చెప్పాలనుకున్నానని, అది ఇప్పటికి కుదిరిందని తాస్సీ వెల్లడించింది. ఇటీవల తాప్సీ నటించిన పింక్, బద్లా, తప్పడ్ చిత్రాలు మంచి
విజయాన్ని సాధించమే కాకుండా నటిగా తాప్సీకి మంచి పేరు తెచ్చిపెట్టాయి.
సహాయం
విషయంలో రాఘవ లారెన్స్ ఎప్పుడూ పెద్ద మనసే. సందర్భం ఏం లేకపోయినా కానీ తన వంతుగా తన బాధ్యతగా ఎంతో మందిని చదివిస్తున్నాడు. ఎన్నో కుటుంబాలను చూస్తున్నాడు. తన తల్లి పేరు మీద ఇప్పటికే ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసాడు లారెన్స్. అలాంటిది కరోనా కారణంగా ప్రజలు అల్లాడుతున్న వేళ లారెన్స్ స్పందించకుండా ఉంటాడా. తన తర్వాతి సినిమాకు వచ్చిన అడ్వాన్స్ ను మొత్తాన్ని కరోనా సహాయ నిధి కోసం వాడుకుంటున్నట్లు ప్రకటించాడు లారెన్స్. ఇంతకు ముందే ఈ ప్రకటన చేసిన లారెన్స్ ఇప్పుడు దాన్ని ఆచరణలో పెట్టాడు. స్వతహాగా నృత్య కళాకారుడు అయిన లారెన్స్, తన తోటి పేద నృత్య కళాకారులకు సహాయం
చేయడానికి నడుం బిగించాడు. హైదరాబాద్ లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మనిషికి 25,000 చొప్పున మొత్తం 5 లక్షల 75 వేల రూపాయలను డైరెక్ట్ గా వారి వారి అకౌంట్లలో జమయ్యేలా చూసాడు లారెన్స్. డ్యాన్స్ నే నమ్ముకుని ప్రస్తుతం కరోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సహాయం చేయడం నా బాధ్యతగా భావించాను. అందుకే ఇబ్బందులు పడుతున్న 23 మందిని గుర్తించి వారికి సహాయం అందేలా చేశాను. గతంలో ప్రామిస్ చేసిన అమౌంట్ ను కూడా విరాళంగా అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అని తెలిపాడు లారెన్స్. తాను ఎదిగిన నృత్య రంగంలో ఇబ్బందులు పడుతున్న వారిని గుర్తించి సహాయం చేయడంతో లారెన్స్ పెద్ద మనసు మరోసారి చాటిచెప్పినట్లు అయింది.
యంగ్
హీరో నితిన్ వరస పరాజయాల నుండి బయటపడి ఇటీవలే భీష్మతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న విషయం తెల్సిందే. అందరినీ లాభాల్లో నిలిపిన ఈ చిత్రం ఇటీవల ఓటిటి ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక నితిన్ ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ జరగట్లేదు కానీ లేదంటే ఈపాటికి అందులో ఒక చిత్ర షూటింగ్ కొలిక్కి వచ్చేసేది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ అనే చిత్రాన్ని కూడా సైన్ చేసాడు. ఈ రెండూ కాకుండా లాక్ డౌన్ కు ముందు అంధాధూన్ సినిమా రీమేక్ కు ముహూర్తం కూడా చేసుకున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ఈ చిత్ర తెలుగు రీమేక్ కు మేర్లపాక గాంధీను దర్శకుడిగా ఎంచుకున్నాడు.
ఈ సినిమాను తన సొంత బ్యానర్ పై నిర్మించాలని నిశ్చయించుకున్నాడు. అంధుడి పాత్రను వేయగలనా లేదా అన్న సంశయం ఉన్నప్పటికీ ధైర్యం చేసి ఈ సినిమా చేస్తున్నానని ప్రకటించాడు నితిన్. ప్రస్తుతం సినిమా షూటింగ్స్ జరగకపోయినా నితిన్ తన తర్వాతి సినిమాల విషయంలో దృష్టి కేంద్రీకరించాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా గ్యాంగ్ లీడర్ భామ ప్రియాంక అరుళ్ మోహన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్ సినిమా ప్లాపవ్వడంతో ప్రియాంకకు తెలుగులో అనుకున్నంతగా అవకాశాలు రాలేదు. మరి నితిన్ ఎందుకని ఈ ప్లాప్ భామను ఎంచుకున్నాడో తెలీదు. అయితే అంధాధూన్ లో హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేదు. అయితే ఈ సినిమాలో ఒక హాట్ సన్నివేశం మాత్రం ఉంటుంది. మరి తెలుగు రీమేక్ లో ఈ సన్నివేశంలో ప్రియాంక నటిస్తుందా లేక తొలి సినిమా తరహాలోనే పద్దతిగా నటిస్తుందా అన్నది తెలియాలి. MAY, 2020 b టాలీవుడ్ z 15
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top N GHT Life trade GUIDE My CHOICE QUIZ COMPETET ON
ta n ya h o p e
d ary B RTHDAYS EXCLUS VE LittleStar FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
talent contact us for PORTFOLIO'S and featured in TICKET 2 TOLLYWOOD m: +91 7702 555 873 e: editor@tollywoodmag.com
16 z టాలీవుడ్ b MAY, 2020
gehna sippy
NEWS HAPPENINGS
క
రోనా వైరస్ బారిన పడి దేశం సంక్షోభంలో ఉన్న సమయంలో టాలీవుడ్ ను స్టార్ లు అందరూ తమ వంతుగా ఎంతో కొంత సహాయం చేసి తమ పెద్ద మనసును చాటుకున్నారు. టాప్ స్టార్స్ నుండి మిడ్ రేంజ్ హీరోలు, హీరోయిన్లు కొందరు అటు పీఎం సహాయ నిధికి లేదా ముఖ్యమంత్రుల సహాయ నిధికి తమ విరాళాలను అందించారు. ఇక కొత్తగా క్రియేట్ అయిన కరోనా క్రైసిస్ చారిటీకి డొనేట్ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇంత జరుగుతున్నా కానీ రౌడీ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్న విజయ్ దేవరకొండ స్పందించకపోవడంపై కొంత మంది కావాలనే బురద జల్లే ప్రయత్నం చేసిన విషయం తెల్సిందే. విజయ్ దేవరకొండ ఇప్పటివరకూ ఎందుకని ఏం దానం చేయలేదని కొందరు డైరెక్ట్ గా అతణ్ణి ట్యాగ్ చేసి మరీ ప్రశ్నించారు. దాత్రుత్వం అనేది పర్సనల్ ఛాయస్. అది
LIFE style
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
ఎవరూ డిమాండ్ చేయకూడదు. అలాంటిది డొనేట్ చేయలేదని ట్రోల్ చేయడం దారుణమే. అయితే విజయ్ దేవరకొండ ఇటీవల తనపై ట్రోల్స్ చేసేవాళ్లు నోళ్లు మూయించాడు. ఇటీవల ఒక 11 నిమిషాల నిడివి ఉన్న వీడియోను రూపొందించి అందులో 2 కీలకమైన ప్రకటనలు చేసాడు. ఈ కరోనా మహమ్మారికి తాను కూడా తయారుగా లేనని తన వద్ద కూడా తగినన్ని ఫండ్స్ లేవని తెలియజేసాడు. అయితే దీని వల్ల నష్టపోయిన వాళ్లకు ఏ విధంగా సహాయం చేద్దామని ఆలోచించి కొంత మంది దగ్గర అప్పుగా తీసుకుని ఫండ్స్ ను సిద్ధం చేసుకున్నానని మొత్తం కరోనా వైరస్ సహాయానికి 1.30 కోట్ల రూపాయల సహాయాన్ని చేయబోతున్నట్లు ప్రకటించాడు. అందులో ఒకటి భవిష్యత్తు అవసరాల దృష్ట్యా యువతకు తమకు ఆసక్తి ఉన్న రంగంలో ట్రైనింగ్ ఇవ్వడం వంటివి ఉంటాయి. మరొకటి మిడిల్ క్లాస్ ఫండ్ అని ఒకటి క్రియేట్
BEHIND THE WOODS LOCAT ON
చేసి నిజంగా అవసరమున్న వారు మాత్రమే https://thedeverakondafoundation.org/ ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ కావాలని, రెండు తెలుగు రాష్ట్రాలలో అవసరమున్న వారికి తన టీమ్ సహాయం చేస్తుందని తెలిపాడు.
fash on
2
TICKET TOLLYWOOD sex psychology
top
N GHT Life
trade GUIDE హీ
రోయిన్ గా టాప్ హీరోల సరసన నటించింది ప్రియమణి. ఎన్టీఆర్, బాలకృష్ణ, నాగార్జున, రవితేజ వంటి వారి సరసన లభించినా కానీ ప్రియమణి ఎప్పుడూ టాప్ లీగ్ లోకి వెళ్ళలేదు. గ్లామర్ పరంగా పెద్ద అడ్డంకులు కూడా ప్రియమణి చెప్పింది లేదు. బికినీలో కనిపించడానికి కూడా వెనకాడలేదు. అయితే మరి కాలం కలిసిరాకో మరొకటో కానీ ప్రియమణి కెరీర్ అనుకున్నంతగా ముందుకు కదిలింది లేదు. అయితే కెరీర్ లో కదలిక లేకపోవడంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిన ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం ఇరగదీస్తోందని చెప్పాలి. ఆమెకు ఈ విషయంలో వెబ్ సిరీస్ లు చాలా సహాయం చేస్తున్నాయి. కొత్త అవకాశాలు రావడంతో ప్రియమణి కెరీర్ ప్రస్తుతం దూసుకుపోతోంది. ప్రియమణి బాలీవుడ్ లో నటించిన సినిమా అతీత్. ఈ సినిమా డైరెక్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ లో విడుదలైంది. తన కూతురుని రక్షించుకునేందుకు ఎంత దూరమైనా వెళ్లే
My CHOICE QUIZ
తల్లిగా ప్రియమణి మెప్పించింది. దీనికి రివ్యూలు కూడా బాగా వస్తుండడంతో ప్రియమణి హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ లో హీరో భార్యగా కీలకమైన పాత్ర పోషించింది. ఆమె కెరీర్ కు ఒక సస్పెన్స్ ను కూడా పెట్టారు. సెకండ్ సీజన్ లో అది చాలా కీలకం కానుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా ప్రియమణి రీ ఎంట్రీ ఇస్తోంది. వెంకటేష్ నారప్పలో ప్రియమణి కీలక పాత్ర పోషిస్తోంది. సీనియర్ వెంకటేష్ భార్యగా నటిస్తోంది ప్రియమణి. అంతే కాకుండా రానా దగ్గుబాటి విరాటపర్వంలో ఈమె మాజీ నక్సలైట్ పాత్రను పోషించనుందని తెలిసింది. ఇవి కాకుండా కన్నడలో రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిసింది. మరో రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి. ఈ విధంగా కేవలం సినిమాలనే కాకుండా డిజిటల్ విప్లవాన్ని కూడా వాడుకుని అవకాశాలు సృష్టించుకుని సెకండ్ ఇన్నింగ్స్ లో అద్భుతాలు చేస్తోంది ఈమె.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
లా
క్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరగట్లేదు. అయితే ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ లో పనులు ఆపట్లేదు. సినిమా వాళ్ళు అయినా కానీ వర్క్ ఫ్రొం హోమ్ చేస్తూ తమ పనులు కానిచ్చేస్తున్నారు. అందులో ఎస్ ఎస్ రాజమౌళి ఉన్న విషయం తెల్సిందే. ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్, విఎఫ్ ఎక్స్ పనులు పూర్తవుతున్న విషయాన్ని ఇటీవలే రాజమౌళి వెల్లడి చేసిన విషయం తెల్సిందే. స్కైప్ కాల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఎడిటింగ్ పనులను పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు అదే కోవలో యువ నటుడు అడివి శేష్ కూడా ఉన్నారు. గూఢచారి, ఎవరు వంటి సినిమాల సక్సెస్ లతో తనదైన ముద్ర వేసిన అడివి శేష్ ప్రస్తుతం మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేష్ బాబు సహ నిర్మాతగా ఉన్న విషయం
తెల్సిందే. మేజర్ బొంబాయి బాంబు బ్లాస్ట్స్ లో ప్రాణాలు అర్పించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రను బేస్ చేసుకుని తెరకెక్కుతున్న చిత్రం. దీని షూటింగ్ ఇప్పటికే 40 శాతం పూర్తయినట్లు అడివి శేష్ తెలిపాడు. ప్రస్తుతం షూటింగ్ లు ఏం జరగట్లేదు కాబట్టి ఇప్పటివరకూ షూటింగ్ అయిన పోర్షన్ వరకూ ఎడిటింగ్ వర్క్ ను అడివి శేష్ పర్యవేక్షిస్తున్నాడు. ఈ సినిమాకు అడివి శేష్ దర్శకుడు కాకపోయినా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మేజర్ ఎడిటింగ్ వర్క్స్ తో పాటు గూఢచారి సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్స్ తో కూడా అడివి శేష్ బిజీగా ఉన్నట్లు తెలిపాడు. గూఢచారి సినిమాకు కూడా అడివి శేష్ కథ, స్క్రీన్ ప్లే అందించాడు. దాని సీక్వెల్ పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అడివి శేష్ ఈ స్క్రిప్ట్ చాలా బాగా వస్తోందని తెలిపాడు. మొత్తంగా లాక్ డౌన్ అయినా కానీ అడివి శేష్ ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. MAY, 2020 b టాలీవుడ్ z 17
Kollywood Bollywood Interview SpecialStory Hollywood
కరోనా ప్రభావం తో ఇండస్ట్రీ విపత్కర పరిస్థితుల్లో ఉంది. 24 క్రాప్ట్స్ నుండి థియేటర్స వరకూ నెలకొన్న స్తబ్దత అందరినీ ఆలోచనల్లో పడవేస్తున్నాయి. ఇండస్ట్రీ లో ఎప్పుడు మళ్ళీ షూటింగ్స్ మొదలవుతాయి.. ఈ సంవత్సరం పరిశ్రమ మనుగడ ఎలా ఉండబోతుంది అనే విషయాలపై తెలంగాణా ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్, ప్రముఖ నిర్మాత పి. రామ్మోహన్ మాట్లాడుతూ... ఇండస్ట్రీ పరిస్థితి ఎప్పుడు మాములు అయ్యే అవకాశాలున్నాయి..? అన్ని పరిశ్రమలలో ఉన్న పరిస్థితే పిల్మ్ ఇండస్ట్రీ లో కూడా ఉంది.. అంతకంటే ప్రత్యేకంగా చెప్పాలంటే సినిమా పరిశ్రమ మళ్ళీ మామూలు పరిస్థితి కి రావడానికి ఎక్కువ టైం పట్టొచ్చు.. సమ్మర్ సీజన్ నే కాదు.. ఈ సంవత్సరం కూడా మిస్ అయినట్లే అనుకోవాలి. జనవరి వరకూ ఈ పరిస్థితి కోనసాగుతుంది అని నా అంచనా. సినిమా అంటే ప్రేక్షకులు వందల సంఖ్యలో వస్తారు.. అంతమంది ఒకసారి వచ్చినా ఎటువంటి భయాలు ఉండని పరిస్థితి వచ్చే వరకూ సినిమా థియేటర్స్ పరిస్థితి మెరగవదు.. మాల్స్, ఫంక్షన్ హాల్స్ , రెస్టారెంట్స్ మాదిరిగానే థియేటర్స్ రికవరీ కూడా ఎక్కువ టైం పడుతుంది. అందరూ దానికి ప్రిపేర్ అవ్వాలి. పెద్ద సినిమాలు పరిస్థతి ఎంటి..? పెద్ద సినిమాలు, అంటే థియేటర్స్ దగ్గర రెవిన్యూ ని రాబట్టగలిగే సత్తా ఉన్న సినిమాలు తప్పకుండా ఆగాల్సిందే.. థియేటర్స్ కు ప్రేక్షకులు నిర్భయంగా వచ్చే టైం వరకూ సినిమాలను వాయిదా వేసుకోవాల్సిందే. నిర్మాతలు 18 z టాలీవుడ్ b MAY, 2020
కూడా సినిమాలను ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేసేందుకు ఇష్టపడరు. నేను నిర్మాతగా వ్యవహారిస్తున్న సినిమా ‘లవ్ స్టోరీ’ నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న ఈమూవీని సమ్మర్ రిలీజ్ అనుకున్నాం.. ఇంకా 15 రోజులు షూటింగ్ ఉంది.. ఈ సినిమా రిలీజ్ డేట్స్ తారుమారు అయ్యాయి. థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఆగాల్సిందే. తప్పదు. ఎప్పుడు షూటింగ్స్ మొదలవుతాయని అంచనా..? దాన్ని ఇప్పుడే ఎవరూ ఊహించలేము. ఒక వంది మందితో షూట్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు తప్పకుండా షూటింగ్స్ మొదలవుతాయి. కానీ ఇప్పుడే మనం ఖచ్చితంగా పరిస్థితిని అంచనా వేయలేం కానీ మరో ఆరునెల్లో షూటింగ్స్ మొదలవుతాయని నా అంచనా. చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ లిమిటెడ్ క్రూతో చేసుకొనే అవకాశాలుంటాయి. కానీ థియేటర్స్ దగ్గర సాధారణ పరిస్థితులు లేనప్పుడు షూటింగ్స్ కూడా మొదలవ్వవు. వైరస్ పూర్తిగా పోనంతవరకూ థియేటర్స్ కు ప్రేక్షకులు అంత సులభంగా రారు. అప్పటి వరకూ చిన్న చిన్న పనులు అయితే నడుస్తాయేమో కానీ, పూర్తిస్థాయి షూటింగ్స్ మొదలవ్వడం జరగదు. ఓటిటి ప్లాట్ ఫామ్ లు పుంజుకుంటాయా..? అక్కడ కూడా సినిమా స్టాండెర్డ్స్ ని మెయిన్ టైన్ చేస్తున్నారు. షూటింగ్స్ జరగాలంటే తప్పకుండా మినిమమ్ 50 మంది సిబ్బంది అవసరం అవుతారు. సీరియల్స్ అయినా ఓటిటి అయినా అంత సులభంగా షూటింగ్స్ జరిగే పరిస్థితులు కనపడటం లేదు.
ఏదైనా ఎంటర్ టైన్మెంట్ ఇండస్ట్రీ కి ఈ యేడాది అంతా ప్రభావం ఉంటుంది. ఓటిటి ప్లాట్ ఫామ్ ల మీదకు పెద్ద సినిమాల బడ్జెట్ లు వర్క్ అవుట్ అవుతాయా..? ఓటిటి ప్లాట్ ఫామ్ మీద పెద్ద సినిమాలు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రెడీగా లేరు. ఎందుకంటే వారి బడ్జెట్ లు ఓటిటి మీద వర్క్ అవుట్ అవ్వవు. సినిమా బిజినెస్ వేరు, ఓటిటి బిజినెస్ వేరు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే రెడీ గా ఉన్న సినిమాలు కొన్ని ఓటిటి మీదకు వస్తాయేమో కానీ 90 శాతం సినిమాలు ఓటిటి మీద రిలీజ్ చేసేందుకు నిర్మాతలు రారు. ఆరునెలలు సినిమాలు ఆగిపోయినంత మాత్రన సినిమాను వచ్చిన కాడికి అమ్ముకుందాం అని ఏ నిర్మాత అనుకోరు. సినిమా పరిశ్రమ కూడా దీనికి ప్రిపేర్ గా ఉండాలి. మార్కెట్ లో 20 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఫైనాన్సియల్ ఇష్యూస్ అన్ని పరిశ్రమలు కున్నాయి. వాటిలో సినిమా పరిశ్రమ కూడా ఒకటి గా చూడాలి అంతే.. ఈ కష్టాలు.. బయట కష్టాలకంటే ప్రత్యేకమైనవి కావు. థియేటర్స్ బంద్ అయితే తట్లుకునే శక్తి ఉందా..? నేను థియేటర్స్ ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు అన్నీ లీజ్ లోనే నడుస్తున్నాయి. నాకు రెంట్ రావడం లేదు.. పర్లేదు.. మరో ఆరునెలలు థియేటర్స్ బంద్ ఉన్నా నేను మెయిన్ టైన్ చేయగలను . సంవత్సరానికి పది లక్షల నిర్వహాణ వ్యయం తట్టుకునే శక్తి థియేటర్స్ యాజమాన్యం కి ఉంది.. ఎలక్ట్రిసిటీ ఛార్జ్ లను కమర్షియల్ గా కాకుండా ఇండస్ట్రీ యల్ ఛార్జ్ లు
వసూలు చేసేలా ప్రభుత్వాన్ని కోరుతాం.. అలాగే మినిమయ్ ఛార్జ్ లనుండి మినహాయింపులు అడుగుతాం.. ఇవన్నీ థియేటర్స్ యాజామాన్యంకు కాస్త ఊరట నిస్తాయి. పరిశ్రమలో ఎక్కవు గా ఇబ్బంది పడే కార్మికుల కోసం ప్రభుత్వం సహాయం అందిస్తుందా..? ఏ పరిశ్రమలో అయినా రోజు వారీ కార్మికులు ఉంటారు.. సినిమా తీస్తే అందులో 90శాతం సినిమా కోసం అపాయింట్ చేసుకున్న వారే ఉంటారు.. అంటే సినిమాలు లేవంటే వారికి పని ఉండదు. వాళ్ళకు చాలా ఇబ్బందులు ఉంటాయి. చిరంజీవి గారు మొదలు పెట్టిన కరోన్ క్రైసిస్ ఛారిటీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆ కార్మికులను కాపాడుకోవటమే ఇప్పుడు సినిమా పరిశ్రమ ముందు ఉన్న పెద్ద సవాల్. గవర్నమెంట్ చేసే ప్రతి సహాయం వీరికి అందేలా చూస్తాం.. ప్రభుత్వంతో కూడా చర్చించి మద్దతుగా నిలుస్తాం.. థియేటర్స్ దగ్గర మళ్ళీ అదే సందండి చూస్తామా..? నాకు పూర్తి నమ్మకం ఉంది. కరోనా లేదనే రోజు ఒకటి వస్తుంది. అప్పుడు థియేటర్స్ దగ్గర అదే సందండి కపడుతుంది. అది ఆరునెలలు పడుతుందా యేడాది పడుతుందా అనేది ఇప్పుడే చెప్పలేం.. కానీ థియేటర్స్ వ్యవస్థ ఎప్పటికీ అలాగే ఉంటుంది. లాక్ డౌన్ టైం ఎలా గడుస్తుంది..? నేను పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాను.. కరోనా ప్రభావం పై ఇండస్ట్రీ పెద్దలతో రోజూ మాట్లాడుతూనే ఉంటాను. తప్పకుండా ఈ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిన రోజున మళ్లీ ఇండస్ట్రీ మరింత వేగంగా పుంజుకుంటుంది.
NEWS HAPPENINGS
అడివి
LIFE style HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON `ఇ స్మార్ట్ శంకర్` వంటి
బ్లాక్ బసర్ ్ట హిట్ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం `రెడ్` కిషోర్ తిరుమల దర్శక త్వం వహిస్తున్నారు. స్రవంతి మూవీస్ బ్యానర్‌పై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో హీరో రామ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. మాళవిశర్మ, నివేద పేతురాజ్, అమృతా అయ్యర్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ కరోనా కారణంగా అది సాధ్యపడలేదు.
fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
N GHT Life
trade GUIDE My CHOICE
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory కా స్టింగ్ కౌచ్ వివాదం దేశ వ్యప్తంగా పరిమితం అయిపోయింది. కాస్టింగ్ కౌచ్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వివాదం గురించి అదా మాట్లాడుతూ Hollywood టాలీవుడ్‌లో శ్రీరెడ్డి చేసిన హంగామా అంతా `కాస్టింగ్ కౌచ్ ఉత్తర భారతంలోనూ, లేదా ఇంతా కాదు. ఈ వివాదం గత కొంత కాలం వరకు పలు చిత్ర పరిశ్రమల్ని ఓ ఊపు ఊపాయి. తాజాగా ఈ వివాదంపై నితిన్ హీరోయిన్ అదా శర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలి సారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. తెలుగులో నితిన్ హీరోగా నటించిన `హార్ట్ ఎటాక్` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన అదా శర్మ ఆ తరువాత ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తమిళ, కన్నడ చిత్రాల్లో నటించినా ప్రస్తుతం హిందీ చిత్రాలకే
ఫస్ట్ లుక్ పోస్టర్‌ని ఇటీవల దర్శకుడు రిలీజ్ చేశారు. 1990 లో ఉత్తర తెలంగాణలో జరిగిన యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నక్సలిజానికి ఓ ప్రేమ జంటకు మధ్య సాగే రసవత ్తర కథ, కథనాలతో ఉత్తర తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తొలి చిత్రంతోనే `నీది నాది ఒకే కథ` అంటూ ఆలోచింపజేసిన వేణు ఊడుగుల ఈ చిత్రం ద్వారా ఓ సమకాలీన సామాజిక అంశాన్ని చర్చిస్తూనే ఓ హృద్యమైన ప్రేమకథని చూపించనున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో సాయి పల్లవి జనపద గాయనిగా కనిపించబోతోంది.
థియేటర్స్ మూసివేయడం, లాక్‌డౌన్ వంటి కారణాల వల్ల `రెడ్` రిలీజ్ వాయిదా పడింది. ఈ నెల 28తో లాక్‌డౌన్ ముగుస్తుండటంతో ఈ సినిమా రిలీజ్ విషయంలో చిత్ర బృందం మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రమోషన్స్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగా `నువ్వే నువ్వే..` అంటూ సాగే ఓ పాటకు సంబందించిన మేకింగ్ వీడియోని రిలీజ్ చేయబోతోంది. ఇటీవల ఈ మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు. రామ్ ఒక పాత్రలో మాస్‌గానూ, మరో పాత్రలో క్లాస్ గానూ కనిపించబోతున్నాడు. ఈ సినిమా అన్నీ కుదిరితే జూన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం వుంది.
QUIZ
మార్గాన ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరే ఆమె ఎందుకు ఒంటరిగా కూర్చుని వుంది? ఎవరి కోసం ఆమె నిరీక్షణ? ఆమె ఒడిలోని డైరీలో రాసి ఉన్న అక్షరాలేమిటి? ఆమె పక్కనున్న బ్యాగులో ఉన్నవేమిటి? ఈ ప్రశ్నలకు జవాబులు విడుదల తర్వాతే` అంటున్నారు దర్శకుడు వేణు ఊడుగుల పెట్టిన పోస్ట్ ఆకట్టుకుంటోంది. ఆయన తెరకెక్కిస్తున్న చిత్రం `విరాటపర్వం`. రానా దగ్గుబాటి హీరోగా సాయిపల్లవి హీరోయిగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటి నందితాదాస్, ప్రియమణి కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. టాలెంటెడ్ నటి సాయిపల్లవి పుట్టిన రోజు నేడు (మే 9). ఈ సందర్భంగా సాయి పల్లవికి సంబంధించిన
చైనాలోని
ఊహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏ దేశ వార్తలు విన్నా కరోనా మరణాలే. కరోనా పాజిటివ్ కేసులే. దీని కారణంగా ప్రజా జీవితం స్థంభించిపోయింది. ఈ వైరస్ ఊహాన్‌లోని గబ్బిలాల మార్కెట్ నుంచి పుట్టిందని, లేదా అక్కడే వున్న లాబ్ నుంచి ఉద్భవించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పక్కన పెడితే మే 9 న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సంచలనంగా మారింది. వైరస్ పుట్టిన ఊహాన్ నగరంలో షూటింగ్ జరుపుకున్న చివరి సినిమా అంటూ సంపూతో
సినిమా చేస్తున్న చిత్ర బృందం ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌ని రిలీజ్ చేయడం ఆసక్తికర ంగా మారింది. సంపూర్ణేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం `?`. నోలాన్ మౌళి ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అమృత ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జూలై 30న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించడానికి ముందు ఊహాన్ మార్కెట్‌లో ఈ చిత్రాన్ని షూట్ చేశామని మేకర్స్ చెబుతున్నారు. అది ఎంత వరకు కరెక్ట్ అన్నది సినిమా చూస్తే కానీ తెలియదు. ఏదిఏమైనా కరోనా మహమ్మారిని సంపూ టీమ్ ఇలా వాడుకుంటున్నారన్నమాట.
దక్షిణ భారతంలోనూ మాత్రమే చర్చించిన అంశం కాదని, దీనిపై ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుతున్నారని వెల్లడించింది. కాస్టింగ్ కౌచ్ అనేది ఎవరు బలవంతంగా చేయరని, తప్పు చేయాలా? వద్దా? అనే ఆప్షన్ ప్రతి ఒక్కరికీ వుంటుందని, అవకాశం కోసం కోరికని ఎందుకు తీర్చాలి అని, అలాంటి పరిస్థితి వస్తే అవకాశాన్ని వదులు కోవాలి లేదా కమిట్‌మెంట్‌లకు నో చెప్పాలని స్పష్టం చేయడం ఆసక్తికర ంగా మారింది. MAY, 2020 b టాలీవుడ్ z 19
టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుది ప్రత్యేక
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY CHIT CHAT RAZZI
PA
BEAUTY t ps
BEHIND THE WOODS LOCAT ON
fash మె గాస్టార్on చిరంజీవి, శ్రీదేవి కలయికలొ వచ్చిన చిత్రం `జగదేకవీరుడు అతిలోకసుందరి`. TICKET TOLLYWOOD కె. రాఘవేంద్రావు2తెర కెక్కించిన ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్ నిర్మించారు. ఈ చిత్రం విడుదలై నేటికి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి, ఈ చిత్రంలో శ్రీదేవితో కలిసి నటించడం గురించి పలు ఆసక్తికర విషయాల్ని చిరంజీవి అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ చిత్రంలో దేవకన్యగా ఆమెను తప్ప మరొకరని ఊహించుకోలేము. శ్రీదేవి లేనిదే ఈ సినిమా లేదు. ఈ పాత్ర ఆమె కోసమే సిద్ధమైందా అనిపిస్తుంది. అందచందాలతో, హోయలు, చిలకపులకులతో మెస్మరైజ్ చేసింది.
sex psychology top
N GHT Life
trade GUIDE My CHOICE
అత్యద్భుతంగా నటించింది. డ్యాన్సుల్లో ఏమాత్రం ఏమరపాటుగా వున్నా తన అందచందాలతో హోయలతో తన పాత్రని ఎక్కడ తినేస్తుందోనని తాను శ్రమించాల్సి వచ్చిందని ఆనాటి సంగతుల్ని ఈ సందర్భంగా చిరంజీవి గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ప్రస్తుతం `ఆచార్య` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శక త్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు 40 శాతం చిత్రీకరణ పూర్తి చేశారు. లాక్‌డౌన్ తరువాత తదుపరి పరిణామాలని బట్టి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేయాలని దర్శకు డు కొరటాల శివ ప్లాన్ చేస్తున్నారట.
స్థానం. విభిన్నమైన చిత్రాల్ని నిర్మిస్తూ వరుస సక్సెస్‌లు సాధిస్తున్నారాయన. ఆయన ఇటీవల మళ్లీ వివాహం చేసుకున్నారు. దిల్ రాజు భార్య అనిత మూడేళ్ల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత నుంచి వ్యక్తిగతంగా బాధలో వున్న ఆయన దాని ప్రభావం ఏ మాత్రం తన సినిమాలపై పడకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నారు. ఒంటరిగానే వుంటూ వస్తున్న ఆయన గత కొంత కాలంగా మళ్లీ వివాహం చేసుకోవాలనే ఆలోచనలో వున్నట్టు వార్తలు మొదలయ్యాయి. అయితే ఈ వార్తలని దిల్ రాజు కండించకపోవడంతో ఆ వార్తలు నిజమని అంతా భావించారు. దానికి తగ్గట్టే ఇటీవల ఆయన మీడియా ముఖంగా ఓ ప్రకటన చేశారు. `ప్రపంచం మొత్తం ప్రస్తుతం వున్న క్లిష్టపరిస్థితుల్లో మనలోని చాలా మంది వృత్తి పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొంత కాలంగా నా వ్యక్తిగత జీవితంలో ఎలాంటి సంతోషం
చోటుచేసుకోలేదు. ఈ క్లిష్టపరిస్థితులన్నీ త్వరలోనే చెదిరిపోయి మనం మళ్లీ అందమైన జీవితాల్లోకి అడుగుపెడతామని ఆశిస్తున్నాను. అలాంటి ఆశతోనే తన వ్యక్తిగత జీవితాన్ని పునః ప్రారంభించాలనుకుంటున్నానని వెల్లడించి తన రెండో పెళ్లిపై స్‌శష్టతనిచ్చారు దిల్ రాజు. దిల్ రాజు వివాహం అంతా ఊహించినట్టే నిజామాబాద్‌లోని దిల్ రాజు స్వగ్రామం అయిన నర్సింగ్ పల్లిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో రాత్రి 11 గంటలకు జరిగింది. ఈ వివాహానికి దిల్ రాజుకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. దిల్ రాజు వివాహానికి ఆయన కుమార్తె హన్షితనే కర్త కర్మ క్రియ అని తెలిసింది. దిల్ రాజు వివాహం చేసుకున్న యువతి ఎవరు? ఆమె పేరేంటనేది మాత్రం తెలియరాలేదు. హెయిర్ హోస్టర్‌గా పనిచేసిన ఆమె గత కొంత కాలంగా దిల్ రాజు కుమార్తె ద్వారా పరిచయం అని, ఆమె ఈ వివాహానికి ప్రధాన కారకురాలిగా నిలిచారని తెలుస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు వివాహానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar
FilmMaking Kollywood Bollywood Interview SpecialStory Hollywood
రకుల్ 20 z టాలీవుడ్ b MAY, 2020
ప్రీత్‌సింగ్‌పై ఈ మధ్య రోజుకో వార్త హల్‌చల్ చేస్తోంది. లాక్‌డౌన్ కొనసాగుతున్న వేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్యానికి ఓకే
చెప్పడంతో మద్యం షాపుల ముందు మందు బాబులు బారులు తీరిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే రకుల్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రకుల్ మద్యం కొంటోందంటూ పుకార్లు షికారు చేశాయి. మెడికల్ షాపులో మెడిన్స్ తీసుకుని వెళుతున్న రకుల్ మద్యం తీసుకుని వెళుతోందంటూ తప్పుడు ప్రచారం చేశారు. తాజాగా ఆమె పెళ్లిపై కూడా అదే స్థాయిలో పుకార్లు షికారు చేయడం మొదలైంది. దీనిపై ఆమె తల్లి రిప్లై ఇవ్వడం ఆసక్తికర ంగా మారింది. రకుల్ ప్రస్తుతం వరుస
భారీ ప్రాజెక్ట్‌లతో బిజీ వుందని, ఇప్పట్లో తనకు వివాహం చేసే ఆలోచన లేదని, తన చేతిలో వున్న ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాక అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తామని వెల్లడించడం ఆసక్తి కరంగా మారింది. రకుల్ ప్రీత్‌సింగ్ ప్రస్తుతం తమిళంలో కమల్‌హాసన్ నటిస్తున్న `ఇండియన్ 2`, శివకార్తికేయన్ నటిస్తున్న `అయలాన్`, తెలుగులో నితిన్ - చంద్రశేఖర్ ఏలేటి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రాల్లో నగటిస్తోంది. ఇవే కాకుండా హిందీలో మరో మూడు చిత్రాలు సెట్స్‌పై వున్నాయి.
NEWS HAPPENINGS
LIFE style
యంగ్ హీరో నితిన్ కెరీర్ అయితే వరస విజయాలు, లేదంటే వరస పరాజయాలు అన్నట్లుగా సాగుతుంటుంది. వరసగా 12 ప్లాపుల తర్వాత ఇష్క్ చిత్రంతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన నితిన్, ఆ తర్వాత వరసగా మూడు విజయాలు అందుకున్నాడు. త్రివిక్రమ్ తో చేసిన అ.. ఆ చిత్రం నితిన్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్. అయితే ఆ తర్వాత నితిన్ కెరీర్ మళ్ళీ గాడి తప్పింది. వరసగా నాలుగు సినిమాలు పరాజయం పాలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నితిన్ భీష్మ చిత్రంతో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇదే ఊపులో 2020ను యమా బిజీగా గడిపేద్దామని భావించాడు. నితిన్ చేతిలో ఇప్పుడు నాలుగు
HOT SPICY CHIT CHAT PA
RAZZI
BEAUTY t ps
చిత్రాలున్నాయి. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతం పూర్తయింది. ఇది కాకుండా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో చెక్ చిత్రాన్ని చేస్తున్నాడు నితిన్. ఈ సినిమా షూటింగ్ మొదలైంది. కొన్ని నెలల క్రితం బాలీవుడ్ హిట్ మూవీ అంధధూన్ రీమేక్ ను తెలుగులో చేయబోతున్నట్లు ప్రకటించాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సినిమా ముహూర్తం కూడా జరిగింది. ఈ చిత్రాల తర్వాత నితిన్ తన కెరీర్ లో అత్యంత భారీ సినిమాను అటెంప్ట్ చేయబోతున్నాడు. తన స్నేహితుడు, తనతో ఛల్ మోహన్ రంగా తీసిన కృష్ణ చైతన్య దర్శకత్వంలో నితిన్ సినిమా చేయబోతున్నాడు. పవర్ పేట అనే టైటిల్ ఉన్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని దాదాపు 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. నితిన్ మార్కెట్ పరంగా 40-50 కోట్ల రేంజ్ లోనే ఉన్నాడు. మరి అలాంటి హీరోతో 90 కోట్ల సినిమా అంటే అది కచ్చితంగా రిస్కేమో కదా!
BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
ఒక సినిమా బ్లాక్ బస్టర్ అయినప్పుడు అదే
కాంబినేషన్ లో మరో సినిమా వస్తోందంటే ఆటోమేట్టిగా అంచనాలు అన్నీ దానిమీద ఉంటాయి. అది సహజం. నాని కెరీర్ లోనే అతిపెద్ద హిట్ గా భలే భలే మగాడివోయ్ గురించి చెప్పుకోవచ్చు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్నో సార్లు ఇద్దరూ కలిసి మళ్ళీ పనిచేద్దామని భావించారు, ప్రయత్నించారు కానీ ఏదీ సెట్ అవ్వలేదు. అయితే ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా తెరకెక్కే సూచనలు కనిపిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ప్రతిరోజూ పండగే చిత్రంతో సూపర్ డూపర్ హిట్ కొట్టిన మారుతి ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో
పడ్డాడు. ఆ స్క్రిప్ట్ నాని కోసమేనని అంటున్నారు. నానిని దృష్టిలో పెట్టుకుని ఒక పవర్ఫుల్ ఎంటర్టైనర్ ను రూపొందిస్తున్నాడని, అయితే ఇందులో మారుతి సినిమా నుండి ఆశించే ఎంటర్టైన్మెంట్ అంశాలు కూడా కచ్చితంగా ఉంటాయని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం నాని చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం నాని శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత శ్యామ్ సింగ రాయ్ అనే చిత్రాన్ని కూడా చేయాల్సి ఉంది. ఈ రెండూ పూర్తవ్వడానికి మరో ఏడాది సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అంతకాలం మారుతి వెయిట్ చేస్తాడా లేక మరో హీరోతో సినిమా చేస్తాడా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.
N GHT Life
trade GUIDE
My CHOICE QUIZ
యంగ్
హీరో నిఖిల్ గతేడాది విడుదలైన అర్జున్ సురవరం సినిమాతో కంబ్యాక్ ఇచ్చిన విషయం తెల్సిందే. వరస ప్లాపులతో సతమవుతున్న నిఖిల్ కు అర్జున్ సురవరం పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. ఇదే ఉత్సాహంతో 2020లో రెండు సినిమాలను లైన్లో పెట్టాడు నిఖిల్. మొదటిది ఎప్పటినుండో ఎదురుచూస్తోన్న కార్తికేయ సీక్వెల్. నిఖిల్ కెరీర్ లోనే అతిపెద్ద హిట్ అనదగ్గ కార్తికేయ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ఎప్పటినుండో చెబుతూ వస్తున్నారు. ఫైనల్ గా ఈ ఏడాది కార్తికేయ 2 సెట్ అయింది. కార్తికేయ 2కు సంబంధించి ఇంట్రడక్షన్ టీజర్ ను కూడా విడుదల చేసారు. షూటింగ్ మొదలుపెడదామనుకున్నప్పుడే కరోనా కారణంగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన విషయం తెల్సిందే. ఈ సినిమా
షూటింగ్ ను పర్మిషన్ వచ్చిన వెంటనే మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ఇక రెండో సినిమా 18 పేజిస్. కుమారి 21ఎఫ్ దర్శకుడు సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. సుకుమార్, గీత ఆర్ట్స్ 2 కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. గతంలో ఈ సినిమాకు అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకుందామని భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ ను ఈ సినిమా కోసం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గతేడాది రాక్షసుడు సినిమాతో హిట్ కొట్టినా కానీ అనుపమకు అవకాశాల వెల్లువ రాలేదు. మరి నిఖిల్ చిత్రంతోనైనా అనుపమ కెరీర్ మారుతుందేమో చూడాలి.
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE LittleStar
MAY, 2020 b టాలీవుడ్ z 21
NEWS HAPPENINGS
LIFE style HOT SPICY CHIT CHAT PA
సీఎంలతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా
RAZZI
BEAUTY t ps BEHIND THE WOODS LOCAT ON fash on
2
TICKET TOLLYWOOD sex psychology top
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అప్పుడే రైళ్లని పునరుద్దరించొద్దని ప్రధానిని కోరినట్టు తెలిసింది. దశల వారీగా ప్రయాణికుల రైళ్లని నడిపేందుకు కేంద్రం నిర్ణయించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ అప్పుడే రైళ్లని పునరుద్దరించొద్దని విజ్ఞప్తి చేశారు. రైలు ప్రయాణికులందరినీ క్వారెంటైన్ చేయడం సాధ్యం కాదని ఈ సందర్భంగా ఆయన కేంద్రాన్ని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లో కరోనా ప్రభావం అధికంగా వుందని, ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలి పోయేలా లేదని సీఎం కేసీఆర్ అన్నారు. కరోనాతో కలిసి బ్రతకడం తప్పదని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వల్ల ఈ ఆర్థిక
సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడిందన్నారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలను రీషెడ్యూల్ చేయాలని ఈ సందర్భంగా ప్రధానిని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల రుణపరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేశారు. వలస కూలీలను అనుమతించకపోతే ఆందోళనలు పెరిగే అవకాశం వుదన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా వైరస్‌కు జూలై, ఆగస్టు మాసాల్లోనే వ్యాక్సిన్ వచ్చే అవకాశం వుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నం అయ్యారని, అయితే భారత్ నుంచి, మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచే ఈ వ్యాక్సిన్ వచ్చే అవకాశం వుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్త చేశారు. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్నారు.
N GHT Life
trade GUIDE My CHOICE
QUIZ
COMPETET ON d ary B RTHDAYS EXCLUS VE
LittleStar FilmMaking Kollywood Bollywood హిందీ వెర్షన్‌ని ఫర్హాన్ అక్తర్, అనిల్ తడాని సైInterview లెంట్‌గా వచ్చి మోన్‌స్టర్ హిట్‌ని సొంతం ఎక్సెల్ మీడియా, ఏఏ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై రిలీజ్ చేసుకున్న చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. దర్శకుడు SpecialStory చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కిది రెండవ చిత్రం మాత్రమే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని భారీ మొత్తానికి రెండవ సినిమాతో సంచలన విజయాన్ని Hollywood అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్టు సాధించి హీరో యష్‌ని పాన్ ఇండియా స్టార్‌ని చేశారు. కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ సంచలనం సృష్టించింది. దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయి వసూళ్లని సాధించిన ఈ చిత్రం పలు అవార్డుల్ని తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ప్రస్తుతం `కేజీఎఫ్ చాప్టర్ 2` తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తొలి భాగం హ్యూజ్ హిట్ కావడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్ర 22 z టాలీవుడ్ b MAY, 2020
తెలిసింది. 55 కోట్లుకు ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌కు సొంతం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే మూడొంతులు చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్ర బ్యాలెన్స్ షూటింగ్ ని లాక్‌డౌన్ తరువాత ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. అక్టోబర్లో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్రంలోని కీలక పాత్రల్లో రవీనా టాండన్, సంజయ్‌దత్, రావు రమేష్, అనంత్‌నాగ్, శ్రీనిధిశెట్టి నటిస్తున్నారు.
యూ
ట్యూబ్‌లో తెలుగు పాటల హంగామా మొదలైంది. అల్లు అర్జున్ నటించిన `అల వైకుంఠపురములో`ని పాటలు యూట్యూబ్‌లో సంచలనం సృష్టించాయి. 100 మిలియన్‌ల వ్యూస్‌ని అధిగమించి తెలుగు సినిమా పాటల్లో సరికొత్త రికార్డుని సృష్టించాయి. ఇప్పుడు ఇదే తరహాలో యాంకర్ ప్రదీప్ నటించిన `30 రోజుల్లో ప్రేమించడం ఎలా? ` చిత్రంలోని `నీలి నీలి ఆకాశం..` 100 మిలియన్ వ్యూస్ దాటి ఆశ్చర్యపరిచింది. తాజాగా ఈ ఫీట్‌కి కొత్త హీరో సినిమా `ఉప్పెన` చేరువ కాబోతోంది. సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. సుకుమార్ శిష్యుడు
బుచ్చిబాబు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోని `నీ కన్ను నీలి సముద్రం..` అంటూ సాగే ఫస్ట్ సింగిల్ 50 మిలియన్‌ల వ్యూస్ దాటడం విశేషం. రొమాంటిక్ లవ్‌స్టోరీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కరోనా కారణంగా ఈ చిత్ర రిలీజ్‌ని వాయిదా వేశారు. ఈ నెలఖరున లాక్‌డౌన్ ఎత్తేయనున్న నేపథ్యంలో పరిస్థితులని బట్టి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ తొలి హిట్‌ని సొంతం చేసుకోవడం గ్యారంటీ అంటున్నారంతా.
TOLLYWOOD.NET MAY 2020 | VOL 17 | ISSUE 5 | Rs.20/-
RNI NO: APTEL/2003/10076 MAY 2020 VOL:17 ISSUE:5 Rs.20/- TOLLYWOOD TELUGU MONTHLY MAGAZINE
/tollywood
/tollywood