Tollywood Magazine Telugu May - 2015

Page 1

MAY 2015 VOL 12 ISSUE 5

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


Bhatia

TAMANNAAH







నా

గచైతన్య - తమన్నా లది హిట్ పెయిర్ . ఇప్పటివరకు ఈ ఇద్దరూ కలిసి నటించిన రెండు చిత్రాలు 100%లవ్ , తడాఖా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి . దాంతో ఈ కాంబినేషన్ పై అంచనాలు పెరిగాయి . తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం రాబోతోంది . ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరూ జతకట్ట నున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో తమన్నా ని హీరోయిన్ గా తీసుకోవాలని భావిస్తున్నారట దర్శక నిర్మాతలు . దాంతో తమన్నా కనుక ఉంటే తప్పకుండా హిట్ అవుతుందని సెంటిమెంట్ గా భావిస్తున్నారట.


అం 



దాల బొమ్మాలి అనుష్క పెళ్లీడు దాటిపోతున్నా ఇంకా పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదంటూ చెప్పుకోస్తోంది . అయితే పెళ్ళంటూ చేసుకుంటే తప్పకుండా ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకుంటానని అంటోంది . ప్రస్తుతం రెండు భారీ చిత్రాలైన బాహుబలి ,రుద్రమదేవి చిత్రాలతో బిజీ గా ఉన్న ఈ భామ ఇప్పట్లో పెళ్లి చేసుకునేది లేదని అంటోంది . అనుష్క నటించిన రుద్రమదేవి ,బాహుబలి చిత్రాలు విడుదలకు సిద్దం అవగా ''సైజ్ జీరో '' చిత్రంలో నటిస్తోంది . ఇటీవలే అనుష్క న్యూడ్ వీడియో అంటూ నెట్ లో హల్చల్ చేసిన సంగతి విదితమే .

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 MAY 2015

టాలీవుడ్ P 3


 







 ని

న్నటి వరకు స్టార్ హీరోల సరసన నటించిన ముద్దుగుమ్మ సమంత తాజాగా ఓ తమిళ హాస్య నటుడు శివ కార్తికేయన్ తో నటించడానికి ఒప్పుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఈ వార్త దావానలం లా వ్యాపించడంతో ఇండస్ట్రీ ప్రముఖులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు . తెలుగులో ఇటీవలి కాలం వరకు నెంబర్ వన్ హీరోయిన్ గా ఉన్న సమంత ఒక హాస్య నటుడు శివ కార్తికేయన్ హీరోగా నటిస్తుంటే అతడి సరసన నటించడం ఏంటని ? దీంతో సమంత రేంజ్ పడిపోయిందా అన్న చర్చ జరుగుతోంది .

4 P టాలీవుడ్

ని

తిన్ హీరోగా నటించిన చిత్రం ''కొరియర్ బాయ్ కళ్యాణ్ ''. దర్శకులు గౌతమ్ మీనన్ ఈ చిత్రానికి నిర్మాత కాగా గత మూడేళ్ళుగా ఆ సినిమా ల్యాబ్ లోనే మూలిగిపోతోంది . ప్రభుదేవా శిష్యుడు ప్రేం సాయి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . ఎప్పుడో చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం అదిగో - ఇదిగో అంటూ రెండు మూడుసార్లు రిలీజ్ కి రెడీ అయి సాధ్యం కాక మూలన పడిపోయింది . నితిన్ కు ఆ మద్య వరుస హిట్స్ రావడంతో కొరియర్ బాయ్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసినప్పటికీ మళ్ళీ షరా మామూలే అయ్యింది . పాపం హీరోయిన్ యామి గౌతమ్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి తన ఆశలు ఎప్పుడు నెరవేరాలి .




 



టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి మహిళా అభిమానులు తక్కువేం కాదు ''మహేష్ '' అంటూ కలవరించేంత పిచ్చి అభిమానులు ఉన్నారు . ఇక హీరోయిన్ లలో కూడా లెక్కపెట్టలేనంత మంది మహేష్ ని అభిమానిస్తున్నారు తాజాగా ఆ లిస్టు లోకి అమెరికన్ బ్యూటీ ,కమల్ హసన్ తో వరుసగా సినిమాలు చేస్తున్న పూజా కుమార్ కూడా చేరింది . మహేష్ అంటే నాకు పిచ్చి అభిమానం , ఎటువంటి క్యారెక్టర్ నైనా అవలీలగా చేస్తాడని హీరో అన్న పదానికి సరైన నిర్వచనం మహేష్ అంటూ ఆకాశానికి ఎత్తుతోంది పూజా కుమార్ . కమల్ హాసన్ తో ఈ భామ ''ఉత్తమ విలన్ '' చిత్రంలో నటించింది . ఆ చిత్రం మే 1న రిలీజ్ కానుంది

టాలీవుడ్ P 5


  

వన్ కళ్యాణ్ తో చేసేది పొలిటికల్ సినిమా కాదని యాక్షన్ ఎంటర్ టైనర్ అని అన్నారు దర్శకరత్న దాసరి నారాయణరావు . ఆమధ్య పవన్ కళ్యాణ్ దాసరి ఇంటికి వెల్లి పరామర్శించి మనిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా చేద్దామని మాట ఇచ్చాడన్న విషయం తెలిసిందే . దాంతో ఈ వార్త సంచలనమే అయ్యింది . దాసరి - పవన్ ల కాంబినేషన్ లో సినిమా అనగానే మొదట ఆశ్చర్యపోయారు ,తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఖచ్చితంగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి అయితే వాటిని ఖండిస్తున్నాడు దాసరి . ఒకవేళ పవన్ రాజకీయ సినిమా చేయమంటే తప్పకుండా నేనే ఆ సినిమాకి దర్శకత్వం వహిస్తానని అంటున్నాడు . అయితే ప్రస్తుత సినిమాకి వేరే దర్శకుడు దర్శకత్వం వహిస్తాడని ,ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని అన్నారు .



   ఎ

ట్టకేలకు బాహుబలి కొత్త రిలీజ్ డేట్ వచ్చింది . ఎన్నాళ్ళుగానో బాహుబలి కోసం ఎదురు చూస్తున్న అశేష అభిమానులకు ఇదొక తీపి కబురు అనే చెప్పాలి . ఇక ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా మా డార్లింగ్ సినిమా అని ఎదురు చూస్తున్న వాళ్ళకు ఇది నిజంగా తీపి కబురే . జూలై 10న బాహుబలి చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు .ఈ విషయాన్ని జక్కన్న ప్రకటించాడు . రాజమౌళి దర్శకత్వం వహించిన సింహాద్రి ,మగధీర ,మర్యాద రామన్న ,ఈగ చిత్రాలు జూలై నెలలోనే విడుదల కావడం గమనార్హం . ఆ సెంటిమెంట్ దృష్యాట్ కూడా బాహుబలి చరిత్ర సృష్టించడం ఖాయమని అంటున్నారు .

6 P టాలీవుడ్






బా

లీవుడ్ లో క్వీన్ ,ప్యాషన్ చిత్రాలకు గాను జాతీయ స్థాయిలో అవార్డులను గెలుచుకున్న అందాల భామ కంగనా రనౌత్ . తెలుగులో అపుడెపుడో డార్లింగ్ ప్రభాస్ తో ఏక్ నిరంజన్ చిత్రంలో నటించిన ఈ భామ తాజాగా తెలుగులో కానీ తమిళ చిత్రాల్లో కానీ నటించే ఆసక్తి లేదని అంటోంది . ఎందుకంటే బాలీవుడ్ లో ఒప్పుకున్న చిత్రాలు చేయడానికే సమయం సరిపోవడం లేదని ఇక దక్షినాది భాషా చిత్రాల్లో నటించే తీరిక ఎక్కడిదని అంటోంది .

టాలీవుడ్ P 7








 

న్నికల ముందు రాజేంద్రప్రసాద్ ప్రకటించినట్లుగా ఎన్నిక కాగానే పేద కళాకారులకు 26మందికి తలా వెయ్యి రూపాయల చొప్పున ఇచ్చారు . ఈ కార్యక్రమం ఫిలిం చాంబర్ లో జరిగింది . ఈ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ ,శివాజీ రాజా ,కాదంబరి కిరణ్ ,ఏడిద శ్రీరాం తదితరులు పాల్గొని పేద కళాకారులకు సహాయం అందించారు . ఇప్పుడిస్తున్న మొత్తం వాళ్ళకు ఏమూలకు సరిపోదు కాబట్టి త్వరలోనే ఆ మొత్తాన్ని పెంచుతాం ,అలాగే 40లేదా 50మందికి పెన్షన్ ఇవ్వలనుకున్నాం త్వరలోనే మరికొంతమందికి ఇస్తామని అన్నారు . మా వెనుక మెగాస్టార్ చిరంజీవి అండదండలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు రాజేంద్రప్రసాద్ .

 హే

8 P టాలీవుడ్

ట్ స్టొరీ ,హేట్ స్టొరీ 2 చిత్రాల్లో రొమాంటిక్ సీన్స్ పేరిట ఎంత వల్గర్ సీన్స్ ఉన్నాయో చూసిన అందరికీ తెలిసిందే . శృంగార సన్నివేశాల పేరిట బరితెగింపు సీన్లు ఎన్నో ఉన్న ఆ చిత్రాలకు తాజాగా మరో సీక్వెల్ రానుంది . ఈ హేట్ స్టొరీ 3చిత్రంలో హీరోయిన్ గా హాట్ భామ జరీన్ ఖాన్ నటించనుంది . ఈ ఎర్రతోలు భామ గ్లామర్ తో రెచ్చిపోతే చూసే ప్రేక్షకులకు పెద్ద కనువిందే అని చెప్పాలి . విక్రం భట్ సినిమాలో కామన్ గానే శృంగార సన్నివేశాల పేరిట బరితెగింపు సీన్లు బోలెడు ఉంటాయి ఇక వాటిని జరీన్ ఖాన్ పోషిస్తే జరీన్ ఖాన్ అందాలను చూడటానికి రెండు కళ్ళు సరిపోతాయా .






మధ్య తెలుగులో కానీ తమిళంలో కానీ హర్రర్ కామెడీ చిత్రాలు మంచి విజయం సాధిస్తుండటంతో వరుసగా అవే చిత్రాలను నిర్మించడానికి ఉత్సాహం చూపిస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నటీనటులు కూడా వారినే అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు . తాజాగా ఆ లిస్టు లోకి హీరోయిన్ త్రిష కూడా చేరింది . ఆమె మేనేజర్ అయిన గిరిధర్ ఓ హర్రర్ కామెడి చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది . తెలుగు ,తమిళంలో ఈ చిత్రం తెరకెక్కనుంది .





రా

ఘవేంద్రరావు అంకుల్ దర్శకత్వం లో ''ఝుమ్మంది నాదం '' సినిమా నిర్మించి తప్పు చేసానని ,లేకుంటే నాకు ముందుగానే సినిమా నిర్మాణ రంగంలో ఉన్న అన్ని విషయాలు తెలిసేవని అంటోంది మంచు లక్ష్మి . ఝుమ్మంది నాదం చిత్ర సమయంలో కేవలం డబ్బులు మాత్రమే పెట్టానని మొత్తం ప్రొడక్షన్ వ్యవహారాలు రాఘవేంద్రరావు అంకులే చూసుకున్నారని అందువల్ల నాకు ప్రొడక్షన్ గురించి తెలియక పోవడం వల్ల ''ఊ కొడతారా ఉలిక్కి పడతారా ''అనే చిత్రానికి ఎక్కువ డబ్బులు పెట్టి నష్టపోయానని అదే ముందుగానే తెలిసి ఉంటే నష్టపోయే దాన్ని కాదని అంటోంది . ప్రస్తుతం మంచు లక్ష్మి ''దొంగాట '' చిత్రాన్ని నిర్మించి నటించింది . ఆ చిత్రం మే 8న రిలీజ్ కి సిద్దం అయ్యింది .

టాలీవుడ్ P 9






వేసవి లో సేద తీరాలంటే బికినీ వేయాల్సిందే ,స్విమ్మింగ్ పూల్ లో దిగాల్సిందే అంటోంది బాలీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా . వేసవి వచ్చిందంటే చిట్టి పొట్టి బట్టలు వేసుకోవచ్చు అందువల్ల హాయిగా ఉంటుంది ఇక నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి బికినీ వేసి ఈ సమ్మర్ లో హాయిగా సేద తీరుతానని ,బికినీలలో మరీ టూ పీస్ బికినీ లంటే నాకు చాలా ఇష్టం అందుకే ఎప్పుడు కొన్నా టూ పీస్ బికినీ లే కొంటానని అవంటే నాకు చాలా మోజని అంటోంది ఈ భామ . ఇంకేముంది ఇది వేసవి కాబట్టి ఇక బికినీ ల మీద బికినీ లు వేసి స్విమ్మింగ్ పూల్ లో తన సరదా తీర్చుకోనుంది .





ల్లరి నరేష్ కు గతకొద్ది రోజులుగా గడ్డు రోజులు నడుస్తున్నాయి . చేస్తున్న సినిమాలు వరుసగా వస్తూ వచ్చినవి వచ్చినట్లే పరాజయాల బాటలో పయనిస్తున్నాయి . వరుసగా పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది . కాగా తాజాగా మరోసారి నవ్వించి హిట్ కొడతానంటూ జేమ్స్ బాండ్ మొగుడిగా వస్తున్నాడు . అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి సాయి కిషోర్ దర్శకత్వం

10 P టాలీవుడ్

వహించారు . అల్లరి నరేష్ సరసన జేమ్స్ బాండ్ పాత్రలో సాక్షి చౌదరి నటిస్తోంది . మరి ఈ చిత్రంతో నైనా అల్లరి నరేష్ హిట్ కొడతాడా అనేది చూడాలి . మే నెల 12న ఆడియో రిలీజ్ చేసి మే నెల చివరి వారంలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .


 



ప్ర

ముఖ నటుడు నాగార్జున ఓ సినిమాలో చిన్న పాత్రలో మెరవనున్నాడు. అయితే ఆ పాత్ర సినిమాకే కీలకం కావడం తో ఆయన నటించేందుకు ఓకే చెప్పాడట ? ప్రస్తుంతం నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో పాటు కార్తి తో కలిసి మరో సినిమాలో నటిస్తున్నాడు. ఇంతకి నాగార్జున కీలక పాత్రలో నటించే సినిమా ఏది ? అనేకదా మీ అనుమానం ? అదే సైజ్ జీరో ? అవును అనుష్క కీలక పాత్రలో రూపొందుతున్న ఈ సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలిసింది. కె రాఘవెందర్రావు తనయుడు ప్రకాష్ దర్హకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది. పివిపి బ్యానర్ పై ఈ సినిమా నిర్మిస్తున్నారు.

         అ



క్కినేని నాగచైతన్య హీరోగా గౌతం మీనన్ దర్శకత్వం లో రూపొందనున్న చిత్రం షూటింగ్ త్వరలో ప్రారంబం కానుంది. చైతు ను హీరోగా నిలబెట్టిన సినిమా ఏ మాయ చేసావే. గౌతం మీనన్ రూపొందించిన ఈ సినిమా తరువాత మల్లి వీరిద్దరి కలయికలో సినిమా రావడం పై ఇప్పుడు అంతట ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు కుడా నెలకొన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా మల్లి సమంతా నే తీసుకోవాలని అనుకున్నారు కాని అది కుదరక పోవడం తో లేటెస్ట్ గా ఓ మలయాళ భామను ఓకే చేసారు. మంజిమ మోహన్ అనే అమ్మడిని హీరోయిన్ గా ఓకే చేసారు. ఈ భామ ఇప్పటికే పలు మలయాళ సినిమాల్లో నటించి మంచి క్రేజీ సొంతం చేసుకుంది. సో మరో కొత్త అందాల భామ టాలీవుడ్ కి పరిచయం అవుతుందన్న మాట !

టాలీవుడ్ P 11


  తె

లుగు దర్శకుడు క్రిష్ బాలీవుడ్ లో అడుగుపెట్టి ఘనవిజయం అందుకున్నాడు . అక్షయ్ కుమార్ ,శృతి హాసన్ ,కరీనా కపూర్ ,సుమన్ ల కాంబినేషన్ లో క్రిష్ తెరకెక్కించిన చిత్రం గబ్బర్ ఈజ్ బ్యాక్ .తమిళంలో విజయ్ కాంత్ నటించిన ''రమణ '',తెలుగులో చిరంజీవి నటించిన ''ఠాగూర్ '' చిత్రాలకిది రీమేక్ . మే ఐ న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయిన ఈ గబ్బర్ మూడు రోజుల్లోనే 40కోట్ల ను వసూల్ చేసి సంచలనం సృష్టిస్తోంది . 2015 సంవత్సరం లో ఇప్పటివరకు ఎన్ని చిత్రాలు వచ్చినా ఇంత మొత్తాన్ని సాధించలేక పోయాయి . అక్షయ్ నటన ,శృతి ,కరీనా ల గ్లామర్ వెరసి బాక్సాఫీస్ వద్ద గబ్బర్ భారీ వసూళ్ళ ను సాధించేలా చేస్తున్నాయి





మిళంలోనే కాదు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అన్న విషయం తెలిసిందే . అందుకే సూర్య నటించిన ప్రతీ సినిమా తమిళంతో పాటే తెలుగులో కూడా రిలీజ్ అవుతోంది . హిట్ ,ఫ్లాప్ లతో సంబంధం లేకుండా ప్రతీ సినిమా తెలుగులో వస్తోంది . ప్రస్తుతం సూర్య తమిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ''మాస్ ''. ఆ చిత్రాన్ని తెలుగులో ''రాక్షసుడు '' గా అనువాదం చేయనున్నారు . సూర్య సరసన నయనతార ,ప్రణీత లు నటిస్తున్నారు . దయ్యాల చుట్టూ తిరిగే కథ తో తెరకెక్కిన ఈ రాక్షసుడు చిత్రం ట్రైలర్ ఇప్పటికే దుమ్ము రేపుతోంది . దాంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి .

12 P టాలీవుడ్


అం

దాల ఆరబోత నాకు సరదా కాదని కథ డిమాండ్ ని బట్టి ,అలాగే పాత్ర డిమాండ్ చేసే దాన్ని బట్టి గ్లామర్ ని ఒలకబోస్తాం కానీ కావాలని అందాలను అరబోయం కదా అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా . ప్రస్తుతం తమన్నా నాగార్జున - కార్తీ ల చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది . ఈ ద్విభాషా చిత్రంలో మొదట హీరోయిన్ గా శృతి హాసన్ ని తీసుకున్నప్పటికీ ఆమె ప్లేస్ లో డేట్స్ సమస్య కారణంగా తమన్నా ని తీసుకున్నారు . పాత్ర బాగుంటే గ్లామర్ ని పక్కన పెట్టి నటించడానికి నేను సిద్దమే అని అంటోంది తమన్నా .

 

టాలీవుడ్ P 13


నా

ని హీరోగా ఇటివలే విడుదలైన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా పరవాలేదు అనే టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పాటు జెండాపై కపిరాజు సినిమా కుడా ఒకే రోజు విడుదల కావడం తో నాని కి రెండు పడవల మీద ప్రయాణం అయినట్టయ్యింది. రెండు సినిమాలు సో సో గా అనిపించుకున్నాయి. అయితే ఇప్పుడు ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు సాటిలైట్ క్రేజ్ దక్కింది. ఈ సినిమా హక్కులను ప్రముఖ చానల్ 3. 90 కోట్లకు కొనుగోలు చేసిందట ? నిజంగా ఇది క్రేజీ అంటున్నారు. అయిపోయిన సినిమాకు ఇంతలా సాటిలైట్ క్రేజ్ దక్కడం విశేషం. నాగ్ అశ్విన్ దర్శకత్వం లో అశ్విని దత్ కూతురు ప్రియాంక దత్ నిర్మించిన చిత్రమిది. ఓ చిన్న సినిమాకు ఇది మంచి అవకాశమే అని చెప్పాలి ?

 





ప్ర



స్తుతం మెగాస్టార్ హీరోగా నటించే 150 వ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు పూరి. ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన చర్చలు కుడా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆగష్టు 22 న ప్రారంబం కానుంది. అయితే ఈ సినిమా తరువాత పూరి జగన్నాధ్ మహేష్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే మహేష్ సినిమాకు స్క్రిప్ట్ రెడీ అయ్యింది ... మా కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అంటూ ట్విట్ చేసాడు పూరి. మహేష్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన పోకిరి సినిమా తరువాత బిజినెస్ మెన్ చిత్రం కుడా మంచి హిట్ అందుకుంది. మరి ఇప్పుడు ఎలాంటి సబ్జెక్టు తో రెడీ అయ్యాడో అనే ఆసక్తి మహేష్ అభిమానుల్లో మొదలైంది.

14 P టాలీవుడ్






ఆం

   

ధ్రా పోరి గా నటిస్తున్న ఉల్కా గుప్త ని పొగడ్తలతో ముంచెత్తాడట అల్లు అర్జున్ . ఝాన్సీ కి రాణి సీరియల్ తో దేశ వ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న భామ ఉల్కా గుప్త . ఝాన్సీ రాణి గా అద్భుతంగా నటించిన ఉల్కా ని తెలుగులో ''ఆంధ్రా పోరి '' తో హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు . ఆంధ్రా పోరి చిత్రంలోనే కాకుండా ''రుద్రమదేవి '' చిత్రంలో కూడా నటించింది ఉల్కా ,ఆ చిత్ర షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ తన నటన ని చూసి పొగడ్తలతో ముంచెత్తా రని త్వరలోనే ఆయన తో నటించే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నా నని అంటోంది . గుర్రపు స్వారి ,కత్తి యుద్దాల్లో ఆరితేరిన ఈ భామ విన్యాసాలను చూస్తూ మైమరచి పోయాడట అల్లు అర్జున్ .



లయాళ ముద్దుగుమ్మ సారి బొద్దుగుమ్మ నిత్యా మీనన్ వరుసగా చిత్రాలు చేస్తూ దూసుకు పోతోంది . మొన్నటి వరకు కెరీర్ లో చాలా స్లో గా చిత్రాలు చేసిన ఈ భామ ఇటీవల వరుసగా చిత్రాల్లో నటిస్తూ బాగానే బిజీ గా ఉంది . ఆ బొద్దుగుమ్మ చేతిలో తక్కువ సినిమాలు ఉండటం వల్లనేమో లేక సరైన వర్కౌట్ చేయక పోవడం వల్లనేమో కానీ కాస్త బొద్దుగా తయారయ్యింది . చక్కనమ్మా చిక్కినా అందమే అనేది పాత సామెత కానీ నిత్యా బొద్దుగా ఉన్నప్పటికీ ముద్దుగానే ఉంది కానీ ముద్దుగుమ్మ అనిపించుకోవాలంటే మాత్రం కాస్త బాడీ షేప్ ని తగ్గిస్తేనే మంచిదని అంటున్నారు . ఈమధ్య వచ్చిన తమిళ డబ్బింగ్ చిత్రం ఓకే బంగారం హిట్ కావడం ,అల్లు అర్జున్ తో చేసిన సన్నాఫ్ సత్యమూర్తి కూడా మంచి వసూళ్ళ ని సాధించడంతో మంచి జోష్ మీదుంది నిత్యా . ఐతే కాస్త లావు తగ్గితే ఇంకా అందంగా ఉంటుందని అంటున్నారు వింటున్నావా నిత్యా .

టాలీవుడ్ P 15






గపతిబాబు, మీరా నందన్‌ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఫిలింస్‌పతాకంపై విప్లవ్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ కేఎస్వీ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘హితుడు’. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్రి ‌ లీజ్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత కేఎస్వీ మాట్లాడుతూ "ఈ చిత్రంలో ప్రముఖ హీరో జగపతిబాబుగారు ప్రధాన పాత్ర పోషించారు. యువ దర్శకుడు విప్లవ్‌తొలి ప్రయత్నంగా చేసిన ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది ఒక సామాజిక అవసరాన్ని గుర్తు చేస్తూ తీసిన చిత్రం. ఇది కార్యాచరణకు సంబంధించిన చిత్రం. సమాజంలో జరగాల్సిన ముఖ్యమైన కార్యం ఏదైతే వుందో దాన్ని ప్రేరేపిస్తూ తీసిన సినిమా. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నాను" అని అన్నారు. గపతిబాబు మాట్లాడుతూ "ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేయడానికి అంగీకరించాను. బడ్జెట్ పరంగా ఖర్చు ఎక్కువవుతున్నా నిర్మాత వెనుకాడలేదు. ఇదొక ప్రేమ కథ. మాస్టర్, నక్సలైట్ పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తాను. చాలెంజింగ్ రోల్ లో నటించాను. హీరోయిన్ పాత్ర సినిమాకి హైలైట్ అవుతుంది. రెగ్యులర్ మ్యూజిక్ లా కాకుండా భిన్నంగా ఉంటుంది. సినిమాలో పాటలు అధ్బుతంగా ఉంటాయి. ప్రేక్షకులు సినిమా చుసిన తరువాత మంచి సినిమా చూసాం అనే ఫీల్ లో ఉంటారు" అని చెప్పారు. ప్లవ్ మాట్లాడుతూ "సీతారాం అనే వ్యక్తి తనకు తెలిసిన సిద్ధాంతాలను మరొకరి చెప్పే ప్రాసెస్ లో ఓ స్కూల్ ను పెడతారు. అక్కడకి వచ్చిన ఓ అమ్మాయికి, సీతారాం కు మధ్య సాగే ప్రేమాయణమే ఈ కథ. కోటి గారు మంచి మ్యూజిక్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను ఎలివేట్ చేసింది. ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా అనంతశ్రీరాం గారు ఈ చిత్రానికి సాహిత్యాన్ని అందించారు" అని అన్నారు. నర్జీ మాట్లాడుతూ "కొత్త కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. సినిమాలో జగపతి బాబు అధ్బుతంగా నటించాడు. సినిమాలో ఫ్రెష్ నెస్ ఉంటుంది. విప్లవ్ కు కథ

జ వి

బె

16 P టాలీవుడ్

మీద క్లారిటీ ఉంది. ప్రతి సీన్ చాలా కాన్ఫిడెంట్ గా చేసాడు" అని అన్నారు. .వి.ఎల్.నరసింహారావు మాట్లాడుతూ "ఇదొక మంచి సినిమా అవుతుంది. కెమెరామెన్ విజువల్ గా అధ్బుతంగా ప్రెజంట్ చేసాడు" అని అన్నారు. గపతిబాబు, మీరా నందన్‌ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: కోటి, పాటలు: అనంతశ్రీరామ్‌, సినిమాటోగ్రఫీ: భరణి కె. ధరన్‌, ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల, సమర్పణ: సుంకర మధుమురళి, నిర్మాత: కేఎస్వీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్.‌

సి


బా

 

లీవుడ్ హాట్ భామ ప్రియాంక చోప్రా ఏది చేసిన సంచలనమే. లేటెస్ట్ గా ఆమె సెక్స్ సన్నివేశాలు ఇప్పుడు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి.. అదికూడా కార్ లో ఆమె ప్రియుడితో శృంగారం లో పాల్గొన్న క్లిప్పింగ్స్ ఇప్పుడు దుమారాన్నే రేపాయి. అసలు విషయం లోకి వస్తే .. ప్రియాంక చోప్రా ఈ మధ్యే ఓ హాలీవుడ్ సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే. క్వాంటికో అనే పేరుతొ రూపొందిన ఈ సీరియల్ ట్రైలర్ ను ఇటీవలే విడుదల చేసారు. 9/11 బాంబు దాడుల నేపద్యం లో సాగే ఈ సీరియల్ లోని కొన్ని సీన్స్ లో హాట్ హాట్ సన్నివేశాలు ఉన్నాయని. ముఖ్యంగా కార్ లో తన ప్రియుడితో సెక్స్ లో రెచ్చిపోయిన ప్రియాంక ను చూసి ఇంతలా రెచ్చిపోయిందే అని అందరు వాపోయారు. మరి ట్రైలర్ ఇలా ఉంటే ఇంకా అసలు సినిమా ఎలా ఉంటుందో మరి ??



టాలీవుడ్ P 17




 బా

లీవుడ్ హాట్ ప్రొడ్యూసర్ ఏక్తాకపూర్ తాజాగా నిర్మిస్తున్న చిత్రం ''ఎక్స్ ఎక్స్ ఎక్స్ '' ఈ చిత్రంలో మితిమీరిన శృంగార సన్నివేశాలు ,నగ్న దృశ్యాలు చాలా ఉన్నాయట అందుకే సన్నీ లియోన్ ఆ చిత్రం చేయడానికి నిరాకరించిందని అంటోంది కానీ మరో కథనం వినబడుతోంది , ఆ కథనం ప్రకారం మితీమీరిన శృంగార సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి 5 కోట్లు రెమ్యునరేషన్ ఇవ్వాలని అడిగిందట అందుకు ఏక్తా నిరాకరించిందట కానీ సన్నీ మాత్రం ఇప్పటికే నేను బోలెడు పోర్న్ చిత్రాల్లో నటించాను మళ్ళీ అలాంటి చిత్రాలు చేయడానికి నాకుఆసక్తి లేదు అని నీతివ్యాఖ్యలు చెబుతోంది

18 P టాలీవుడ్






అం

దాల బొమ్మ రకుల్ ప్రీత్ సింగ్ హవా కొనసాగుతోంది . ఈ అమ్మడు గోల్డెన్ లెగ్ అయిపొయింది . వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ భామ ఇటీవల పండగ చేస్కో ఆడియో వేడుకలో వేసుకొచ్చిన పింక్ కలర్ గౌన్ లో శృంగార దేవతలా మెరిసిపోయింది . వీపు భాగాన్ని మొత్తం నడుము వరకు ఖాళీగా వదిలేసి చల్లని సాయంత్రపు వేల వేడిని రగిలించింది . పింక్ కలర్ లాంగ్ గౌను వేసుకొని వీపంతా ఫ్రీ షో చేస్తూ అశేష అభిమానులను రక్తం మరిగేలా చేసింది . రకుల్ ని అలా చూసిన కుర్రకారు కళ్ళ ని పక్కకి తిప్పుకోలేక పోయారంటే అతిశయోక్తి కాదు . ఇక ఆ ఆడియో వేడుకకు వచ్చిన వాళ్ళ చూపంతా కూడా రకుల్ వీపు పైనే పడిందంటే ఈ భామ ఎంతగా రెచ్చగోట్టిందో అర్ధం చేసుకోవచ్చు .


తె

లుగులో తన సోయగాలతో టాప్ స్టార్ గా ఎదిగినప్పటికీ మనల్ని వదిలేసి ఉత్తరాది కి వెళ్లి ఏదో పొడిచేద్దాం అని వెళ్లి అక్కడ ఏమి చేయలేక చతికిల బడింది గోవా భామ ఇలియానా . తెలుగు ప్రేక్షకులు ఇలియానా ని నెత్తిన పెట్టుకున్నారు అయితే ఇక్కడ బికినీ లు వేయడానికి ,తన అందాలను చూపించడానికి కొంచెం సంశయించింది కానీ బాలీవుడ్ బాట పట్టగానే ఓ బ్రహ్మరథం పడతారని భావించిందేమో అందుకే అందాల ఆరబోత కు దిగింది కానీ ఈ అమ్మడిని బాలీవుడ్ ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోలేదు దాంతో వంటిపై బట్టలను విప్పేస్తూ స్కిన్ షోకి దిగింది . ఒకటా రెండా బోలెడు సార్లు స్కిన్ షో లు చేస్తూనే ఉంది కానీ ఏమాత్రం ప్రయోజకరంగా మాత్రం లేదు .






అం

దమైన భామలు అందాలను పందెం వేస్తూ మగవాళ్ళను చంపేయడం కామన్ అయిపొయింది . ఎంతగా రెచ్చిపోయి అందాలను చూపిస్తే అంత అందం ,మకరందం అని అనుకుంటున్నారు . ఇక అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ విషయానికి వస్తే పోర్న్ చిత్రాల్లో నటించిన ఈ భామకి ఎక్స్ పోజింగ్ అన్నది చాలా చాలా చిన్న వ్యవహారం కింద లెక్క . అందుకే లెక్కలేని విధంగా రెచ్చిపోతూ మగాళ్ళ కు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది . తాజాగా వైట్ అండ్ వైట్ వేసింది ,అది కూడా పైన వేసుకున్న షర్ట్ బటన్స్ లలో ఒకటి తప్ప అన్ని తీసేయడంతో ఆ సందుల్లోంచి ఎద సంపద బయటకు పొంగు కోస్తోంది . ఇక కింద వేసిన మరో వైట్ ని చూస్తే మతి పోవడం ఖాయం . ఇలా అందాలతో మగాళ్ళ ను చంపేస్తూ కాలం వెళ్ళ దీస్తోంది .

   






సె

22 P టాలీవుడ్



క్సీ ఫిగర్ ఉన్నవాళ్లకే ఐటెం సాంగ్స్ ఆఫర్లు వస్తాయని అందుకే కత్రినా కైఫ్ ,కరీనా కపూర్ ,మలైకా అరోరా లాంటి వాళ్ళకు ఐటెం సాంగ్స్ ఆఫర్లు వస్తున్నాయని ఇప్పుడు ఆ జాబితాలో నేను కూడా చేరిపోయనని అంటోంది సెక్సీ భామ ఎవేలిన్ శర్మ . నేను సెక్సీ గా ఉన్నాను అని పదిమంది చేత చెప్పించుకోవడానికి పడరాని పాట్లు పడుతోంది ఈ భామ . ఇటీవల చేసిన ఓ ఫోటో షూట్ లో స్థన ద్వయం పై ఎటువంటి అచ్చాదన లేకుండా ఫోటో షూట్ చేసి సంచలనం సృష్టించిన ఈ భామ తాజాగా తన సెక్సీ పిరుదులను చూపిస్తూ ఫోటోలకు ఫోజిచ్చింది . ఆ ఫోటో లను చూపిస్తూ నేను కూడా సెక్సీ యెస్ట్ ఫిగర్ నని చెప్పుకుంటోంది .




 రా

జమౌళి దర్శకత్వంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషించాలని కళలు కంటోంది మంచు లక్ష్మి . మరి జక్కన్న మంచు లక్ష్మి కోరికని మన్నిస్తాడా లేదా అన్నది చూడాలి . ఇప్పటికే తెలుగులో మంచి నటిగా తన ప్రతిభని నిరూపించుకున్న మంచు లక్ష్మి తనకు ఉన్న డ్రీం రోల్ ని బయట పెట్టింది . ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్ర పోషించాలని ఎప్పటినుండో కోరిక గా ఉంది అది కూడా ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శకుడు ఆ సినిమా చేస్తే బాగుంటుందని అది నా డ్రీం రోల్ అని అంటోంది . మరి జక్కన్న మంచు లక్ష్మి ని ఝాన్సీ లక్ష్మీభాయ్ గా ఎప్పుడు చూపిస్తాడో చూడాలి .

!


  తి



రుమలశ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమల కు వచ్చిన నాగార్జున చేతిపై ముద్దు పెట్టి అందరినీ షాక్ కి గురి చేసింది ఓ మహిళా అభిమాని . దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు టిటిడి పాలకమండలి సభ్యుడి గా పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఆయన్ని అభినందించడానికి అలాగే శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిన నాగార్జున దర్శనం అనంతరం మీడియా తో మాట్లాడుతుండగా ఓ మహిళా అభిమాని వచ్చి నాగార్జున చేతిని పట్టుకొని ముద్దు పెట్టి తన అభిమానాన్ని చాటుకుంది .

    

జా 24 P టాలీవుడ్

తీయ ఉత్తమ నటుడు కమల్ హసన్ హీరోగా నటిస్తున్న చిత్రం పాపనాసం. మలయాళం సూపర్ హిట్ చిత్రం దృశ్యం సినిమాకు రిమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గా గౌతమి నటిస్తుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్దం అయ్యింది. మరి ఆ సినిమా ఫస్ట్ లుక్ పై మీరు ఓ లుక్ వేయండి. అన్నట్టు ఈ సినిమా తెలుగులో దృశ్యం పేరుతొ రిమేక్ అయి సూపర్ హిట్ అందుకుంది.




బా

త్ రి

ష వివాహ నిశ్చితార్దం ఎట్టకేలకు మూడునాళ్ళ ముచ్చటగా మారింది . ఆ వివాహ నిశ్చితార్దం జరిగిన తర్వాత ఇక పెళ్లి జరగదని రకరకాల కథనాలు వచ్చిన నేపథ్యంలో త్రిష తల్లి ఉమా కృష్ణన్ త్రిష పెళ్లి ఆగిపోయిందని ఒప్పుకుంది . అయితే త్రిష పెళ్లి ఆగిపోవడానికి వరుణ్ కారణం కాదని ,త్రిష ని సినిమాల్లో నటించకూడదు అనే నిబంధన పెట్టలేదని కానీ కొంతమంది కుటుంబ పెద్దల వల్ల ఈ పెళ్లి ఆగిపోయిందని అయితే వాళ్ళ పేర్లు వెల్లడించలేనని అన్నారు . దాంతో కొద్ది రోజులుగా త్రిష వివాహం పై వస్తున్న ఊహాగానాలు నిజమేనని తెలిసింది .

హుబలి కోసం జూలై కి తన సినిమాని షిఫ్ట్ చేసుకున్నప్పటికీ వాళ్ళు కనీసం మాతో ఒక్కమాట చెప్పకుండా జూలై 10న రిలీజ్ చేయడానికి నిర్ణయించు కోవడంతో తన శ్రీమంతుడు చిత్రాన్ని ఎన్ని అవాంతరాలు వచ్చినప్పటికీ జూలై 17న రిలీజ్ చేయడానికి మహేష్ సిద్దంగా ఉన్నాడు . అంతేకాదు దర్శక నిర్మాతలకు చాలా గట్టిగా చెప్పాడట జూలై 17న ఖచ్చితంగా సినిమా రిలీజ్ చేయాల్సిందే అందుకు అనుగుణంగా పనులన్నీ పూర్తిచేయాలని చెప్పాడట మహేష్ . ఒకవేళ మన సినిమా కాస్త ఆలస్యమైనా బాహుబలి ని చూసి వెనకడుగు వేసారు అన్న అపప్రద వస్తుంది కాబట్టి మనం చెప్పిన డేట్ కి సినిమా రావాల్సిందే అంటూ కసిగా ఉన్నాడట మహేష్ . కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ సంస్థ ఈ శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించారు .

    టాలీవుడ్ P 25


    చిం

తకాయల రవి ఫేం దర్శకుడు ‘యోగేష్’ దర్శకత్వం లో, వి.వి.యన్.ప్రసాద్ నిర్మాతగా ‘సత్య ఎంటర్టైన్మెంట్స్’ రూపొందిస్తున్న చిత్రం 'జాదూగాడు' . ‘ఊహలు గుసగుస లాడే, దిక్కులు చూడకు రామయ్య',లక్ష్మీ రావే మాఇంటికి’ వంటి విజయ వంతమైన చిత్రాల యువ హీరో ‘నాగ శౌర్య’ ఈ చిత్ర కధానాయకుడు కాగా, నాయికగా ‘హర హర మహాదేవ’ సీరియల్ లో పార్వతి గా నటించిన ‘సోనారిక’ ఈ చిత్రం ద్వారా నాయికగా తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు.

జాదూగాడు: మాస్ ఎంటర్ టైనర్

చి

త్ర దర్శకుడు 'యోగేష్' మాట్లాడుతూ..' కధానాయకుడు నాగశౌర్య ఇప్పటివరకు ప్రేమ కధా చిత్రాల నాయకుడిగా నటించారు. కానీ ఈ చిత్రం లోఅతని పాత్ర గత చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. లోన్ రికవరీ బిజినెస్ చేసే పాత్రలో ఈ చిత్ర కధానాయకుడు కనిపిస్తారు. కధానాయిక సోనారిక తొ ప్రేమలో పడ్డ తరువాత లోకల్

26 P టాలీవుడ్

గ్యాంగ్ లీడర్ తొ కదానాయకుడి వివాదం ఇటు కధను, అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందన్నది చిత్రమని, మాస్ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఈ చిత్రం లో కధానాయకుడి పాత్రను తీర్చి దిద్దటం జరిగిందని,వినోదంతో కూడిన మాస్ కధా చిత్రం ఈ 'జాదూగాడు' అన్నారు దర్శకుడు. ర్తి మాస్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్నఈ ‘జాదూగాడు’ నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఇటీవల విడుదల అయిన చిత్రం ఆడియోకు మంచి స్పందన లభించిందని, చాట్ బస్టర్స్ లో ఈ చిత్రం పాటలు ద్వితీయ స్థానంలో ఉన్నాయని తెలిపారు. సంగీత దర్శకుడు సాగర్ మహతి సంగీతం ఈ చిత్ర విజయానికి ఓ మెట్టు అవుతుందని, ఈనెల ౩వ వారంలో చిత్రం విడుదల అవుతుందని నిర్మాత వి.వి.ఎన్. ప్రసాద్ తెలిపారు.

పూ

ప్రధాన తారాగణం :

కో

ట శ్రీనివాసరావు,అజయ్, శ్రీనివాస్ రెడ్డి, పృథ్వి, సప్తగిరి, తాగుబోతు రమేష్, జాకీర్ హుస్సేన్, ఆశిష్ విద్యార్ధి, రవి కాలే, ‘ప్రబాస్’ శ్రీను, ‘రాకెట్’ రాఘవ,‘అదుర్స్’ రఘు, స్వామిరారా సత్య, ఫిష్ వెంకట్ లు నటిస్తున్నారు.

సాంకేతిక వర్గం :

సి

నిమాటోగ్రాఫర్ : సాయి శ్రీరామ్ ,ఎడిటర్: యం.ఆర్. వర్మ: ఆర్ట్ : సాహి సురేష్ ; ఫైట్స్ : వెంకట్ ; కథ , మాటలు : మధు సూదన్; పాటలు : వరికుప్పల యాదగిరి , శ్రీమణి, విశ్వ, నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : యోగేష్


వితేజ ఇటీవల వరుస సక్సెస్ లతో మంచి జోరుమీదున్నాడు . అయితే ఆ జోరులో తప్పటడుగు వేస్తున్నడా ?అన్న చర్చ జరుగుతోంది . ఎందుకంటే ఎన్టీఆర్ తో రభస వంటి ఫ్లాప్ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ శ్రీనివాస్ కు తన తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ ఇచ్చాడట దాంతో ఈ చర్చ జరుగుతోంది . రామ్ తో కందిరీగ వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చినప్పటికీ ఎన్టీఆర్ వంటి పెద్ద హీరోతో ఫ్లాప్ ఇచ్చే సరికి సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేయడానికి ముందుకు వచ్చిన హీరోలంతా వెనక్కి వెళ్ళిపోయారు . ఆ సమయంలో రవితేజ ఇచ్చిన మాట కోసం ,అలాగే సంతోష్ పై నమ్మకంతో కథ పై నమ్మకం తో అతడికి సినిమా చేస్తానని మాటిచ్చాడు . పైగా ఈ చిత్రానికి ''తిక్కరేగింది '' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది .

 

   

మే

31న బాహుబలి ఆడియో వేడుక ని చాలా పెద్ద ఎత్తున చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు బాహుబలి యూనిట్ . అసలు మే 31న బాహుబలి ట్రైలర్ రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ ట్రైలర్ కు బదులుగా ఆడియో వేడుక చేయాలనే నిర్ణయానికి వచ్చారట . అందుకనుగుణంగా భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు . అశేష అభిమానుల సమక్షంలో ఈ బాహుబలి ఆడియో వేడుక చేయనున్నారు . తెలుగులోనే కాకుండా సౌత్ లోనే భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిస్టాత్మకంగా తెరకెక్కుతున్న బాహుబలి పై ఎన్నో అంచనాలు ఉన్నాయి . ప్రభాస్ ద్విపాత్రాభినయం చేస్తుండగా రానా ,అనుష్క ,తమన్నా ,రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు . కాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఎం ఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు .

టాలీవుడ్ P 27






న్టీఆర్ - సుకుమార్ ల కాంబినేషన్ లో భోగవల్లి ప్రసాద్ నిర్మించనున్న చిత్రం త్వరలోనే లండన్ లో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది . మహేష్ తో చేసిన 1నేనొక్కడినే ఫెయిల్యూర్ తర్వత కూడా సుకుమార్ స్క్రిప్ట్ నచ్చి ఎన్టీఆర్ ఈ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఈ సినిమా రివెంజ్ డ్రామా అని అందుకే ఎన్టీఆర్ గడ్డం పెంచాడని అంటున్నారు . అయితే ఈ చిత్రాన్ని వచ్చే సంవత్సరం జనవరి 8న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు . ఈ చిత్రంలో జగపతి బాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడట . ఇక ఎన్టీఆర్ సరసన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది .

 ద

 



28 P టాలీవుడ్

ర్శకులు మధుర శ్రీధర్ రెడ్డి నిర్మాతగా మారి డా . ఎమ్వికే రెడ్డి తో కలిసి నిర్మించిన చిత్రం ''లేడీస్ అండ్ జెంటిల్ మెన్ '' నేటితో వంద రోజులను పూర్తిచేసుకుంది . పిబి మంజునాథ్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు . ఈ సినిమాకి బాలీవుడ్ ,టాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు అందగా తాజాగా కొన్ని కేంద్రాల్లో వంద రోజులు పూర్తి చేసుకోవడంతో మధుర శ్రీధర్ సంతోషంగా ఉన్నారు . కాన్సెప్ట్ బేస్డ్ మూవీ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల మద్దతు లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాడు మధుర శ్రీధర్ .


 

నా

టార్గెట్ రజనీకాంత్ ,పవన్ కళ్యాణ్ లే వాళ్లతో సినిమాలు చేయడానికి ఉవ్విళ్ళూరుతున్నాడు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ . ఇప్పటికే రజనీకాంత్ కు ఓ లైన్ కూడా చెప్పాడట ఇక మిగిలింది పవన్ కళ్యాణ్ . త్వరలోనే పవన్ ని కలిసి కథ చెబుతానని అతడితో సినిమా చేస్తానని అంటున్నాడు . లారెన్స్ కు ఆశ ఉంది కానీ పవన్ కళ్యాణ్ లారెన్స్ కు చాన్స్ ఇస్తాడా లేదా చూడాలి . లారెన్స్ కథ చెప్పాలి అది పవన్ కు నచ్చాలి ఆ తర్వాత అతడు డేట్స్ ఇవ్వాలి . ఇప్పటికే పవన్ రెండు ,మూడు సినిమాలకు కమిట్ అయి ఉన్నాడు మరి ఇప్పట్లో పవన్ డేట్స్ ఇవ్వడం కష్టమే మరి .



మిళంలో నేను నిర్మించిన చిత్రాన్ని 80థియేటర్ లలో రిలీజ్ చేస్తానని మాటిచ్చి నా దగ్గర నుండి మరో 38లక్షలను తీసుకొని తక్కువ థియేటర్ లలో రిలీజ్ చేసి నాకు నష్టం వచ్చేలా చేయడ మే కాకుండా తనని మోసం చేసాడని ఆరోపిస్తోంది నటి ,నిర్మాత వనిత . తెలుగులో దేవి చిత్రంలో నటించిన వనిత నటుడు విజయ్ కుమార్ కూతురు . తెలుగు ,తమిళ చిత్రాల్లో పలు చిత్రాల్లో నటించిన వనిత తండ్రి విజయ్ కుమార్ తో గొడవపడి దూరంగా ఉంటోంది . ఈమధ్య ''ఎమ్జీఅర్ ,శివాజీ ,రజనీ ,కమల్ ,నర్పని మండ్రం '' అనే చిత్రాన్ని నిర్మించింది . దాన్ని రిలీజ్ చేయాలి కాబట్టి డిస్ట్రిబ్యూటర్ వెంకటేష్ రాజా కు ఆ చిత్ర పంపిణీ హక్కులు ఇచ్చింది అతగాడేమో 38లక్షలు వనిత దగ్గర తీసుకొని 80థియేటర్ లలో రిలీజ్ చేస్తానని చెప్పి తక్కువ థియేటర్ లలో రిలీజ్ చేసాడట . అందుకే చెన్నై నగర కమీషనర్ కు ఫిర్యాదు చేసింది వనిత .



టాలీవుడ్ P 29


2015

 

30 P టాలీవుడ్

సంవత్సరం తెలుగు సినిమాకి అచ్చివచ్చినట్లు లేదు ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం ఎంటర్ అయి నాలుగు నెలలు పూర్తయి మే కూడా అయిపోవస్తోంది కానీ ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ లేదు . జనవరిలో వచ్చిన పవన్ -వెంకీ ల ''గోపాల గోపాల '' చిత్రం హిట్ అనిపించుకున్నప్పటికీ పవన్ రేంజ్ కు తగ్గ హిట్ కాదు . ఇక నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ''పటాస్ '' మాత్రమే సాలిడ్ హిట్ గా నిలిచింది . కళ్యాణ్ రామ్ కు అలాగే ఆ సినిమా కొనుక్కున్న వాళ్ళకు మంచి లాభాలు వచ్చాయి కానీ అది బ్లాక్ బస్టర్ కాదు . ఇక ఎన్టీఆర్ టెంపర్ చిత్రం వసూళ్లు బాగానే వచ్చినప్పటికీ అది కూడా ఆ తర్వాత వెనుకబడి పోయింది దాంతో బ్లాక్ బస్టర్ రేంజ్ హిట్ అలాగే ఉండిపోయింది . త్రివిక్రమ్ -అల్లు అర్జున్ ల కాంబినేషన్ కాబట్టి ''సన్నాఫ్ సత్యమూర్తి '' ఆ లోటు తీరుస్తుందని అనుకున్నారు కానీ అది కూడా తుస్ మనిపించింది . దాంతో అయిదు నెలలు అవుతున్నప్పటికీ ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవడంతో తెలుగు సినిమా కళా విహీనమైపోయింది . ఇప్పటికే తెలుగు సినిమాకి వంద కోట్లను సాధించే సత్తా లేదు అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ కూడా లేకపోవడం ఆందోళనకరమైనదే . మే 14న బాలయ్య నటించిన లయన్ రిలీజ్ అవుతోంది మరి ఆ చిత్రం ఎలాంటి ఫలితాన్ని చవిచూస్తుందో చూడాలి .


దురు పడినప్పుడు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టం లేని భామలు ఇద్దరు విచిత్రంగా కలిసారు పక్కపక్కనే కూర్చున్నారు ,కొద్దిసేపు మాట్లాడుకున్నారు దాంతో ఇదొక వింత అయ్యింది . ఇంతకీ ఆ ఇద్దరు భామలు సారీ ముదురు భామలు ఎవరో తెలుసా .......... శ్రీదేవి ,జయప్రద లు . తెలుగులోనూ ,హిందీ లోను చాలా చిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు పంతాలకు పోయి దాదాపు ముప్పై ఏళ్లకు పైగా ఒకరితో ఒకరు మాట్లాడుకునే వాళ్ళు కాదు ,ఎదురు పడినప్పుడు కానీ పక్క పక్కనే కూర్చున్నప్పటికీ మాట్లాడుకునే వాళ్ళు కాదట . ఆ గ్యాప్ అలానే ఉండిపోయింది . చాలామంది వాళ్ళని కలపాలని చూసినప్పటికీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు . అయితే తాజాగా ముంబై లో ఓ రెస్టారెంట్ లో ఒకే టేబుల్ దగ్గర వీళ్ళు కూర్చుని మాట్లాడు కోవడంతో భలే కలిసారే అంటూ ఆశ్చర్య పోతున్నారు .









 చూపించాను నాలాగా నేనుమొత్తంమొత్తంచూపించే దమ్ము మీకు

ఉందా ? అంటూ సవాల్ విసురుతోంది మాజీ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ . పోర్న్ చిత్రాల్లో నటించి మొత్తం చూపించి కేక పుట్టించిన ఈ భామ బాలీవుడ్ కు రాగానే అవకాశాలు వెల్లువెత్తుతుండటంతో కొంతమంది భామలకు కంటకింపుగా ఉంది . దాంతో సన్నీ పై విమర్శల జడివాన మొదలయ్యింది . ఇన్నాళ్ళు ఆ విమర్శలను ఎంతో ఓపికగా భరించిన సన్నీ ఇంకా సైలెంట్ గా ఉంటే లాభం లేదనుకొని వాళ్ళకు ఆ భాషలోనే సమాధానం చెబుతోంది . నేను ఏం చేసినా అది పబ్లిగ్గా చేశాను, నాజీవితం అంటే ఏమిటో అందరికి తెలిసిందే మీలా గా చీకటి జీవితం లేదు అంటూ కోపం వెల్లగక్కుతోంది సన్నీ .

టాలీవుడ్ P 31




 

చ్చేనెల నుండి హీరో రామ్ చరణ్ తేజ్ విమానాలు గాల్లో ఎగరనున్నాయి . ఇంతకుముందే తన మిత్రుడు తో కలిసి విమానయాన రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే . ఆ సంస్థ కు టర్బో మేఘ అనే పేరు కూడా పెట్టారు . కాగా ఈ టర్బో మేఘ విమానాలు జూన్ నుండి గాల్లో తెలనున్నాయి . ఈ వారంలోనే రెండు విమానాలు రానున్నాయట అవి వచ్చాక తుది అనుమతి తీసుకొని దక్షిణ భారతదేశం లోని పలు నగరాలకు విమాన సర్వీసులు అందించనున్నారు . చరణ్ ఈ టర్బో మేఘ సంస్థ కు డైరెక్టర్ గా నే కాకుండా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు .

 

 పదహారు మందిలో లేను ,పైగా నేనునేనుఆ మీడియా వెల్ విశర్ ని నేను

32 P టాలీవుడ్

నిర్మించిన చిత్రాల్లో హీరో కు ఎంత ప్రాధాన్యత ఉందో మీడియాకి కూడా అంతే ప్రాధాన్యత ఉందని అంటున్నాడు నిర్మాత బండ్ల గణేష్ . ఇటీవల కొంతమంది అగ్ర నిర్మాతలు ఓ మూడు చానల్స్ కు మాత్రమే యాడ్స్ ఇవ్వాలని మిగతావాళ్ళకు ఫీడ్ కూడా ఇవ్వొద్దని తీవ్ర నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో తీవ్ర వ్యతిరేకత వచ్చిన విషయం తెలిసిందే . ఆ పదహారు మంది నిర్మాతల్లో బండ్ల గణేష్ కూడా ఒకరు అని కథనాలు రావడంతో స్పందించిన బండ్ల నేను ఆ టైపు కాదని నా ఎదుగుదల లో మీడియా ప్రోత్సాహం ఎంతో ఉందని ,నేను కూడా మీ కుటుంబంలో ఒక సభ్యుడినే నని ప్రెస్ నోట్ పంపించారు .






బ్బర్ సింగ్ 2 మ్యూజిక్ సిట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి . మేలో షూటింగ్ జరపాలని నిర్ణయించిన చిత్ర బృందం అందుకు అనుగుణంగా ప్రస్తుతం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి . షూటింగ్ కి వెళ్ళేలోపు పాటల రికార్డింగ్ కు వెళ్ళాలని భావిస్తునారట అందుకే చిత్ర దర్శకులు బాబీ ,అలాగే దేవిశ్రీ ప్రసాద్ పవన్ కు నచ్చేలా మ్యూజిక్ ని రూపొందించేలా ప్రయత్నాలు చేస్తున్నారు . ఈనెలాఖరున రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళాలని భావిస్తున్నారు . ఇక సినిమాని 2016 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . గబ్బర్ సింగ్ లాగే గబ్బర్ సింగ్ 2ని కూడా మ్యూజికల్ హిట్ అయ్యేలా చేయాలనీ కష్టపడుతున్నారు దేవిశ్రీ .







ఫ్యూ

చర్ లో పెళ్ళిళ్ళు ఉండవని కానీ ఆడదానికి మగాడు అవసరం అలాగే మగాడికి ఆడది అవసరం అందుకే భవిష్యత్ లో పెళ్ళిళ్ళు మాత్రం ఉండవు కానీ ఇద్దరూ కలిసి సహజీవనం చేయడం మాత్రం ఖాయం అని అంటున్నాడు దర్శకులు పూరి జగన్నాద్ . మొన్న జరిగిన ''365 డేస్ '' ఆడియో వేడుక లో పాల్గొన్న దర్శకులు పూరి జగన్నాద్ పై విధంగా స్పందించాడు . ఇప్పటికే ప్రేమ పేరుతో సహజీవనం చేస్తూ నచ్చినన్నాల్లు కలిసి ఉండి ,బోర్ కొట్టినప్పుడు మాత్రం విడిపోతున్న సంగతి తెలిసిందే . పాశ్చాత్య సంస్కృతీ భారత్ లో విపరీతమైన పోకడలు పోతున్న నేపథ్యంలో పూరి ఇలా వ్యాఖ్యానించాడు .

టాలీవుడ్ P 33


    మ

గవాళ్ళ కొంటె చూపుకి ఆడవాళ్ళు పడిపోతారట . బయటకి చెప్పరు కానీ లోలోన తెగ సంతోష పడతారట మగవాళ్ళు అలా అదేపనిగా ఆశగా చూస్తుంటే బాగుంటుందట కానీ అంతకుమించి ఆశపడితే మాత్రం మాకు ఇబ్బందే అని అంటున్నారు ఆడవాళ్లు . ఇదే విషయాన్నీ బాలీవుడ్ భామ విద్యాబాలన్ చెబుతోంది . మగాళ్ళ అటెన్షన్ మా పై ఉండాలి అప్పుడే మా అందం మరింత ఇనుమడిస్తుంది పైగా ఆ కొంటె చూపులతో మా మనసులో సంతోషంగా ఉన్నపటికీ

బయటకి మాత్రం ''ఛీ పాడు అలా చూస్తున్నాడేంటి '' అని అనుకుంటాం . ఒకవేళ మగాళ్ళ అటెన్షన్ మాపై పడకపోతే మా అందం పై మాకే డౌట్ వస్తుంది అని అంటోంది విద్యాబాలన్ .

34 P టాలీవుడ్






  ఏ

డు అంగుళాల పొడవు అనగానే ఇంకేదో అనుకునేరు ,సాలిడ్ అందాల భామ అనుష్క పొడవు అన్న సంగతి తెలిసిందే అలాగే కేరళ కుట్టి నిత్యా మీనన్ పొట్టి అన్న విషయం కూడా తెలిసిందే అయితే వీళ్ళిద్దరి మద్య ఏడు అంగుళాల తేడా ఉందట . ఈ విషయాన్నీ స్వయంగా నిత్యా మీనన్ వెల్లడించింది . ఎందుకంటే ఈ ఇద్దరూ కలిసి రుద్రమదేవి చిత్రంలో తల్లీ కూతుర్లు గా నటించారు ,కాగా అనుష్క పొడవు నిత్యా పొట్టి కావడం వల్ల స్క్రీన్ పై ఆ తేడా కనిపించకుండా హై హీల్స్ వేసుకొని ఆ లోటు కనిపించకుండా ప్రయత్నించిందట . ఆ సమయంలో నిత్యా కాలు బెనికిందట అలాగే అనుష్క ఎంతో సహకరించి ఆ పాట బాగా రావడానికి తోడ్పదిందట .

టాలీవుడ్ P 35






దేళ్ళ చిన్నారి శ్రీనిధి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకొని రామ్ దేవ్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన సమయంలో ఎన్టీఆర్ చలించి పోయారు . హైదరాబాద్ లో చిన్నారిని పలకరించిన ఎన్టీఆర్ ఆ పాపకు పెద్ద టెడ్డీ బేర్ ని అలాగే కొన్ని చాక్లెట్స్ ని ఇచ్చి పాప చేతిని తన చేతిలోకి తీసుకొని మాట్లాడారు . ఆ తర్వాత శ్రీనిధి తల్లిదండ్రులతో మాట్లాడి బయటకి వచ్చి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ గొంతు జీర బోయింది . నేను కూడా ఓ బిడ్డ కి తండ్రి నే అని పిల్లలు బాధపడితే తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో తెలుసునని అంటూ చిన్నారి శ్రీనిధి త్వరగా కోలుకోవాలని అన్నారు .

        వచ్చి తప్పు చేసానని ,యాభై నేనుఏళ్లుగారాజకీయాల్లోకి మచ్చ లేకుండా బతికిన నేను రాజకీయాల

పుణ్యమా అని బొగ్గు మసి అంటిందని వాపోయారు దాసరి నారాయణరావు . ఎవరినో కాపాడటానికి బొగ్గు మసి నాకు అంటించారని అంటున్నాడు దాసరి . అయితే ఆ మసి నుండి తప్పుకొని మళ్ళీ మచ్చ లేని వ్యక్తిగా బయట పడతానని అన్నారు . ఇటీవల రవీంద్రభారతి లో జరిగిన వేడుకలో పాల్గొన్న దాసరి పై వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు . అయితే ఈ బొగ్గు స్క్కాం లో అసలు దోషులెవరో దాసరి కి బాగానే తెలిసి ఉండాలి .

36 P టాలీవుడ్




టా

లీవుడ్ లో చాలాకాలం తర్వాత అసలు సిసలైన పోరు సాగనుందా అంటే అవుననే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు . పోటీ ఏంటి ? అని అనుకుంటున్నారా ? మహేష్ బాబు ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ''శ్రీమంతుడు '' కాగా ఈ చిత్రాన్ని జూలై 17న రిలీజ్ చేయాలనీ నెల రోజుల క్రితమే నిర్ణయించారు కానీ ఇప్పుడు ఆ చిత్రం ఒక్కటే సోలోగా రావడం లేదు . అత్యంత



భారీ బడ్జెట్ తో జక్కన్న ప్రభాస్ ,రానా ,అనుష్క ,తమన్నా లతో రూపొందిస్తున్న బాహుబలి చిత్రం కూడా మే బరి నుండి తప్పుకోవడంతో జూలై లోనే రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు . దాంతో మహేష్ కు బాహుబలి తో పోటీ తప్పదు అని అనుకుంటున్నారు . ఈ రెండు చిత్రాలకు కనీసం మూడు వారాలైన గ్యాప్ ఉండాలి లేదంటే రెండు చిత్రాలు నష్టపోవడం ఖాయం . మరి ఈ ఇద్దరిలో ఎవరు రాజీకోస్తారో చూడాలి .



 హీ

రోయిన్ ఖుషీ ముఖర్జీ ఓ స్టార్ హోటల్ లో నిద్రపోతున్న సమయంలో హోటల్ సిబ్బందిలో ఒకడు వచ్చి ఆమె పై చేతులు ఎక్కడెక్కడో వేసి తడిమాడట . ఆ సమయంలో నేను నిద్రలో ఉన్నానని నాపై అత్యాచార యత్నం చేసాడని పోలీసులను ఆశ్రయించింది . ఈ సంఘటన భోపాల్ లోని ఓ స్టార్ హోటల్ లో జరిగింది . అయితే హోటల్ నిర్వాహకులు చెబుతున్న మాటలు వేరేలా ఉన్నాయి . తప్పతాగి హోటల్ రూం గది తలుపు వేసుకోకుండానే నేలపై పడుకుందని ,డోర్ తెరుచుకోవడం వల్ల మా సిబ్బంది వచ్చి ఆమెని మంచం పైకి చేర్చి తలుపు వేసారని అంటున్నాడు . ఖుషీ ముఖర్జీ తాజాగా తెలుగులో ఆకాష్ తో దొంగప్రేమ అనే చిత్రంలో నటిస్తోంది . ఖుషీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు .

టాలీవుడ్ P 37






 పె

టాలీవుడ్ P 38



ళ్లి చేసుకొని పిల్లలను కన్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోయేకంటే సహజీవనం మంచిదేనని ,బాగున్నన్నాల్లు కలిసి ఉండవచ్చని తేడా వచ్చినప్పుడు హాయిగా విడిపోవచ్చని అంటోంది హాట్ భామ తాప్సీ . తెలుగులో సరైన హిట్ లేక ,చేతిలో సినిమాలు లేక బాలీవుడ్ బాట పట్టిన ఈ భామ ఇటీవల తమిళంలో రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోతున్న ''కాంచన 2'' లో నటించింది . కాంచన 2 హిట్ కావడంతో సంతోషంగా ఉంది తాప్సీ . ఆ సంతోషాన్ని మీడియా తో పంచుకుంటూ సహజీవనం గురించి ,పెళ్లి గురించి తన అభిప్రాయాలను పంచుకుంది . పెళ్లి చేసుకొని అస్తమానం గొడవపడి పిల్లలు పుట్టాక విడిపోయే కంటే సహజీవనం ఎంతో మంచిదని విడిపోయినప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అంటోంది . ఇక నా పెళ్లి ఇప్పట్లో ఉండదని కుండబద్దలు కొట్టింది తాప్సీ .






కి

క్ 2 చిత్రం రిలీజ్ కి ముందే సంచలనాలను నమోదు చేస్తోంది . ఇక ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్ కూడా ఇదేనేమో అనిపించేలా ఈ చిత్రం రూపొందింది అని అంటున్నారు . రవితేజ చిత్రంలో కావలసినంత వినోదం ఉంటుంది కాబట్టి కిక్ 2 చిత్రాన్ని ఏడున్నర కోట్లు చెల్లించి సాటి లైట్ హక్కులను పొందడానికి ముందుకు వచ్చింది జెమిని టెలివిజన్ . కిక్ సూపర్ హిట్ కావడంతో రవితేజ - సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో కిక్ 2 నిర్మిస్తున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్ . ఇటీవలే రిలీజ్ అయిన ఆడియో కు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో కిక్ 2 వేసవి బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని అంటున్నారు . రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించిన విషయం తెలిసిందే .



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.