Tollywood Magazine Telugu September - 2015

Page 1

SEPTEMBER 2015 VOL 12 ISSUE 9

/tollywood /tollywood

RNI NO: APTEL/2003/10076

TOLLYWOOD.NET


ట్టకేలకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కాజల్ అగర్వాల్ ని ఎంపిక చేసారు . గతకొంత కాలంగా హీరోయిన్ ఎంపిక వేటలో ఉన్న సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ ఎట్టకేలకు కాజల్ ని ఎంపిక చేసారు . కాజల్ తో పాటు సమంత ని కూడా అనుకున్నప్పటికీ కాజల్ అగర్వాల్ పవన్ పక్కన మరింత ఫ్రెష్ గా ఉంటుందని భావించి ఆమెని సెలెక్ట్ చేసారు . పవన్ తో కాజల్ కు ఇది తొలి కాంబినేషన్ . కాజల్ ని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు సర్దార్ గబ్బర్ సింగ్ యూనిట్ . సెప్టెంబర్ మొదటి వారంలో జరిగే మూడో షెడ్యూల్ లో కాజల్ అగర్వాల్ పవన్ తో రొమాన్స్ చేయనుంది . బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు .

  d #dq

dssY




 మె

గాస్టార్ చిరంజీవితో నటించే చాన్స్ వస్తే ఎలా వదులుకుంటానని ,తప్పకుండా చేస్తానని పైగా నేను చిరంజీవి అభిమానినని అంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా . ఇటీవలే బాహుబలి తో భారీ విజయాన్ని అందుకున్న తమన్నా బాహుబలి పెద్ద హిట్ అవుతుందని అనుకున్నాం కానీ మరీ ఇంత పెద్ద హిట్ అవుతుందని కలలో కూడా ఊహించలేదని అంది . ఇక చిరంజీవి సినిమా విషయానికి వస్తే ఆయన సినిమాలో నాకు చాన్స్ వస్తే వదులుకోనని ,ఆ చాన్స్ కోసం ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని అంటోంది . మరి చిరు తమన్నా కు చాన్స్ ఇస్తాడా లేదా చూడాలి .

Edited, Printed, Published and Owned by Murali Mohan Ravi, Printed at Kala Jyothi Process Pvt Ltd, 1-1-60/5, RTC X Roads, Hyderabad - 500020. Published At Flat # 410, D-Block, Keerthi Apartments, Yellareddyguda, Hyderabad-500073 EDITOR: MURALI MOHAN RAVI RNI: APTEL/2013/10076 SEPTEMBER 2015

టాలీవుడ్ P 3




టసింహం నందమూరి బాలకృష్ణ రెచ్చిపోతే ఇక తట్టుకోవడం ఎవరి వల్లా కాదు ! బాలయ్య ఎవరితో

అంతగా కలవడు ,ఒకవేళ కలిస్తే వదలడు అంతగా ప్రభావితం చేస్తాడు . ఇక చనువు ఇవ్వడు ,అలాగే చనువు ఇచ్చాడు గదా చంక నెక్కుతా అంటే కూడా ఊరుకోడు ఏదైనా తనే చెయ్యాలి . బాలయ్య ఈమధ్య పలు ఫంక్షన్ల కు వెళుతూ అక్కడున్న వాళ్ళని సంతోషంలో ముంచెత్తు తున్నాడు . ఇటీవల హూదుద్ తుఫాన్ కోసం నిర్వహించిన మేము సైతం లో పాల్గొని పాటపాడటమే కాకుండా అనర్గళంగా మన దేవతా మూర్తుల పేర్లని చెప్పి అందరినీ సంబ్రమాస్చార్యంలో ముంచెత్తాడు బాలయ్య . మొన్నటికి మొన్న చిరు బర్త్ డే వేడుకలో సైతం మాంచి జోష్ ని అందించాడట .



 తె

లుగబ్బాయి అయినప్పటికీ తమిళనాట పాతుకుపోయిన హీరో విశాల్ . తెలుగు వాళ్ళకు పందెం కోడి చిత్రంతో బాగా దగ్గరయ్యాడు దాంతో వరుసగా తమిళ చిత్రాలను తెలుగులో కూడా రిలీజ్ చేస్తూ బాగానే సొమ్ము చేసుకుంటున్నాడు . కాగా గతకొంత కాలంగా విశాల్ స్నేహితులు హీరో నితిన్ ,నిర్మాత విక్రమ్ లు డైరెక్ట్ గా తెలుగులో సినిమా చేయాలనీ విశాల్ పై వత్తిడి చేస్తూనే ఉన్నారు కానీ ఇంతవరకు కుదరలేదు కానీ త్వరలోనే చేస్తానని మాత్రం అన్నాడు విశాల్ . పైగా శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ ని అందించిన కొరటాల శివ విశాల్ తో సినిమా చేస్తానని ప్రకటించాడు . ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే తప్పకుండా బంపర్ హిట్టే .

4 P టాలీవుడ్


ఫ్యా

షన్ పేరిట హీరోయిన్ లు కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎక్కువ మంది ద్రుష్టి ని ఆకర్షించడానికి నానా పాట్లు పడుతున్నారు . తాజాగా ఇటీవల రాత్రి జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరైన అందాల ముద్దుగుమ్మ లు ఒక్కొక్కరు ఒక్కోలా తయారై వచ్చి అందాల విందు చేసారు . కాగా ఇదే వేడుకకు తనపై ఉన్న నెక్స్ట్ డోర్ అమ్మాయి ఇమేజ్ పోవాలని తాపత్రయ పడుతున్న అందాల రాక్షసి ఫేం లావణ్య త్రిపాఠీ కూడా అల్ట్రా మోడరన్ గా తయారై చూపరుల మతి పోగొట్టింది. బొడ్డు కింది దాకా దించి కట్టి బొడ్డు ని చూడయ్యో బొంగర మాడయ్యో అన్న రేంజ్ లో కలరిచ్చింది . సెక్సీ హొయలు పోతూ పార్టీ కి వచ్చిన అతిథుల ద్రుష్టి లో పడింది . లావణ్య ఇంతగా రెచ్చిపోయే విధంగా వస్తుంది అని కలలో కూడా అనుకోలేదట .

eD “eD+” టాలీవుడ్ P 5




H>sTq

కిం

గ్ నాగార్జున ,కార్తీ ల కాంబినేషన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీ స్టారర్ చిత్రానికి ''ఊపిరి '' అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్ . ఓ ఫ్రెంచి చిత్రానికి స్పూర్తిగా రూపొందుతున్న ఈ చిత్రంలో నాగార్జున ఓ పేషెంట్ లా ఎక్కువసేపు కుర్చీ కే పరిమితమయ్యే పాత్రలో కనిపించనున్నారు . అయితే ఈ చిత్రానికి ''దోస్త్ '' అనే టైటిల్ అనుకున్నప్పటికీ దాన్ని మాత్రం ఫిక్స్ చేయలేదు కానీ తాజాగా ''ఊపిరి '' అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు . త్వరలోనే ఆ పేరుని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది . అనుష్క అతిథి పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కథానాయిక .





మం

చి కథలు నాకు సరిపడేవి తీసుకువస్తే నన్ను మెప్పిస్తే హరీష్ శంకర్ ,వంశీ పైడిపల్లి ఇంకా యంగ్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు వాళ్లతో నేను చేయడానికి రెడీ అని సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో వేదికపై చెప్పి యంగ్ డైరెక్టర్ లకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు చిరంజీవి . 150వ సినిమా కోసం బోలెడు కథలు విన్నప్పటికీ అవి చిరుకి నచ్చకపోవడంతో డైనమెట్ లా దూసుకు వస్తున్న యంగ్ డైరెక్టర్ లతో చేస్తే బాగుంటుందని భావించాడేమో అందుకే అభిమానుల సమక్షంలో మంచి కథ చెప్పి ఒప్పిస్తే హరీష్ తో చేయడానికి ,వంశీ తో చేయడానికి అభ్యంతరం లేదు అంటూ హరీష్ పై పొగడ్తల వర్షం కురిపించాడు . గబ్బర్ సింగ్ చిత్రానికి నేను పెద్ద అభిమానినని ఆ సినిమాలో ఎక్కడా వినోదం తగ్గకుండా అద్భుతంగా తీర్చి దిద్దారు అంటూ హరీష్ శంకర్ ని ఆకాశానికి ఎత్తేశాడు చిరంజీవి .

6 P టాలీవుడ్


 అ

శేష మెగా అభిమానుల మద్య హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకకు మెగా హీరోలు చరణ్ ,నాగబాబు ,సాయి ధరమ్ తేజ్ ,అల్లు అర్జున్ ,వరుణ్ తేజ్ ,అల్లు శిరీష్ లతో పాటు శ్రీను వైట్ల ,అల్లు అరవింద్ తదితరులు హాజరై చిరుకి పుట్టినరోజు శుభాకాంక్షలు

 అందజేసారు . చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఒకరోజు ముందుగా అభిమానుల కోసం ఈ వేడుక నిర్వహించారు . చిరు పుట్టినరోజు కావడంతో మెగా అభిమానుల్లో సంతోషం వెళ్లి విరిసింది . కాగా చరణ్ నటిస్తున్న చిత్రంలో చిరంజీవి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు దాంతో మరింత ఆనందంగా ఉన్నారు చిరంజీవి అభిమానులు .



 సె

ప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రుద్రమదేవి చిత్రాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు దర్శక నిర్మాత గుణశేఖర్ కొద్ది రోజుల క్రితం ,అప్పుడే అనుకున్నారు అనుక్కన్న సమయానికి రావడం కష్టమే అని! అలాగే అయ్యింది . అక్టోబర్ 9 న రుద్రమదేవి చిత్రం రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గుణ. అనుష్క రుద్రమ గా నటించిన ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి గా అల్లు అర్జున్ నటించాడు . అత్యంత భారీ బడ్జెట్ తో గుణశేఖర్ విజువల్ వండర్ గా తెరకెక్కించారు .

టాలీవుడ్ P 7


sdT>Ts+

ల్లు అర్జున్ - సురేందర్ రెడ్డి ల కాంబినేషన్ లో వచ్చిన ''రేసుగుర్రం '' 2014లోనే అతిపెద్ద హిట్ గా నిలిచి బాక్సాఫీస్ కుళ్ళబొడిచింది. అటు అల్లు అర్జున్ కెరీర్ లో ఇటు సురేందర్ రెడ్డి కెరీర్ లో నెంబర్ వన్ చిత్రంగా నిలిచిన రేసుగుర్రం చిత్రానికి సీక్వెల్ చేయాలనీ ఆశపడుతున్నాడు దర్శకులు సురేందర్ రెడ్డి . పర్ఫెక్ట్ స్క్రిప్ట్ కోసం చూస్తున్నానని ,పక్కగా కథ రూపొందిన తర్వాత రేసుగుర్రం సీక్వెల్ చేస్తానని అన్నాడు . సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన కిక్ 2 ఇటీవలే రిలీజ్ అయిన నేపథ్యంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సురేందర్ రెడ్డి రేసుగుర్రం తో పాటు కిక్ 2 చిత్రానికి కూడా సీక్వెల్ చేయాలనీ ఉందని తెలిపాడు .



     

బా

8 P టాలీవుడ్

హుబలి అనుకున్నదాని కంటే భారీ విజయం సాధించడంతో జక్కన్న పైనే కాకుండా జక్కన్న కుటుంబం పై కూడా వత్తిడి ఎక్కువయ్యింది ,బాహుబలి 2పై భారీ అంచనాలు మరింతగా పెరగడంతో వాటిని అందుకోవడానికి జక్కన్న అహర్నిశలు శ్రమిస్తున్నాడు . జక్కన్న ఒక్కడే కాదు అతడి కుటుంబం మొత్తం బాహుబలి 2లో ఎటువంటి లోపాలు ఉండకుండా స్క్రిప్ట్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడానికి సిట్టింగ్ లు స్టార్ట్ చేసారట . బాహుబలి చిత్రానికి కథ అందించింది జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ అన్న విషయం తెలిసిందే . బాహుబలి మొదటి భాగం త్వరలోనే 600కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది . కాబట్టి పార్ట్ 2 పై భారీ అంచనాలు ఏర్పడిన నేపథ్యంలో కథ ,కథనంలో లోపాలు లేకుండా బిట్ టూ బిట్ ని జల్లెడ పడుతున్నారట . ఇంతగా జల్లెడ పడితే ఎందుకు బంపర్ హిట్ కాదు చెప్పండి .


 మె >V+q H>uT

గా బ్రదర్ నాగబాబు కు కోపం వచ్చింది అంతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల పై ఆగ్రహంతో ఊగిపోయాడు . పవన్ కళ్యాణ్ ఇక్కడకు రాడు ? ఎన్నిసార్లు పిలవాలి ? ఎన్నిసార్లు బ్రతిమిలాడాలి కానీ రాడే ? మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళండి ,లేదా వాడి ఆఫీసుకు వెళ్ళండి నిలదీయండి ఎందుకు రావడం లేదని ? అంతేకాని మేము మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ .......... పవర్ స్టార్ అంటూ గోల చేయకండి అంటూ పవన్ అభిమానుల పై విరుచుకు పడ్డారు నాగబాబు . ఇటీవల హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జరిగిన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో మెగా హీరోలంతా పాల్గొన్నప్పటికీ పవన్ మాత్రం రాలేదు దాంతో పలుసార్లు మెగా హీరోలు మాట్లాడుతున్న సమయంలో పవర్ స్టార్ , పవర్ స్టార్ అంటూ పదే పదే అడ్డుతగులుతుండటంతో నాగబాబు ఆగ్రహం కట్టలు తెంచుకుంది అంతే పవర్ స్టార్ అభిమానులపై విరుచుకు పడ్డారు . నాగబాబు ఆగ్రహాన్ని చూసిన మెగా అభిమానులు ,పలువురు సినీ ప్రముఖులు ఆశ్చర్య పోయారు.







80

వ దశకంలో హీరోయిన్ గా ఓ ఊపు ఊపేసి కుటుంబ కథా చిత్రాల్లో నటించి మన పక్కింటి అమ్మాయి ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటి సుహాసిని . అయితే సుహాసిని హీరోయిన్ కావడం చిన్నాన్న కమల్ హాసన్ కు ఏమాత్రం ఇష్టం లేదట ! దాంతో నువ్వు హీరోయిన్ గా నటించడానికి వీల్లేదు అంటూ కోపానికి వచ్చాడట కానీ సుహాసిని మాత్రం నేను నటిస్తా నంటూ మొండి కేసి సినిమాల్లోకి వచ్చిందట ,ఆ తర్వాత సుహాసిని తెలుగులో బాగా సక్సెస్ అయ్యాక కమల్ కూడా సంతోషపడ్డాడట !సుహాసిని తండ్రి నటుడు చారుహాసన్ కాగా చారుహాసన్ తమ్ముడే గ్రేట్ కమల్ హాసన్ .

టాలీవుడ్ P 9


\+<$ z +< ఈ

వీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రం బ్యానర్ లోగో, టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ ఇటీవల హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..

మ్.ఎమ్.కీరవాణి మాట్లాడుతూ "జగదీశ్ మా కుటుంబలో వ్యక్తి లాంటివాడు. మంచి టెక్నీషియన్. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. 'అందాల రాక్షసి' జంట మళ్ళీ ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. నా ఫేవరేట్ యాక్టర్ జె.పి గారు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్థ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ముఖ్యమైన సూత్రదారి, పాత్రదారి డబ్బే. సినిమా అంతా చాలా ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది" అని చెప్పారు.

ర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ "ఇదొక కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రం. ప్రతి ఒక్కరికి ఓ లెక్కుంటుంది అలానే లచ్చిందేవికీ ఓ లెక్కుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు" అని చెప్పారు.

వీన్ చంద్ర మాట్లాడుతూ "కీరవాణి గారితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. జగదీశ్ గారు టాలెంటెడ్ డైరెక్టర్. అందాలా రాక్షసి తరువాత లావణ్య తో మరలా కలిసి నటిస్తున్నాను" అని చెప్పారు.

సా

యి ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రాల్లో మా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాగా నిలుస్తుంది" అని చెప్పారు.

10 P టాలీవుడ్

చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాటలు: శివశక్తి దత్తా, అనంత శ్రీరాం, ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచనదర్శకత్వం: జగదీశ్ తలశిల.


      



ప్ర

జల క్షేమం కోసమే నేను తండ్రి తర్వాత తండ్రి అంతటివాడైన అన్నయ్య తో గొడవపడ్డానని ,ఆయనతో విభేదించి టిడిపి - బిజెపి కూటమికి మద్దతు ఇచ్చానని ,మీకు అన్యాయం జరిగితే క్షమించేది లేదని అధికార తెలుగుదేశం పార్టీ కి సవాల్ విసిరాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో సీమాంద్ర కు అన్యాయం జరుగకుండా అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయకుడిగా ఉంటేనే న్యాయం జరుగుతుందని నా భుజ స్కంధాలపై వాళ్ళని మోసానని ,నేను పదవులు కోరుకోలేదని ,ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం స్వచ్చందంగా రైతులు ఇచ్చే భూములను తీసుకోండని కానీ ఒక్కరి నుండి బలవంతంగా లాక్కున్న్నా ఊరుకునేది లేదని ఘాటుగానే విమర్శించాడు పవన్ కళ్యాణ్ . రాజధాని ప్రాంత రైతులు గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో ఈరోజు గుంటూరు జిల్లా పెనుమాక వెళ్ళిన పవన్ అక్కడ రైతులనుద్దేశించి మీకోసం నేనున్నానంటూ ధైర్యాన్ని నూరి పోశాడు .

టాలీవుడ్ P 11


 శ్రీ

మంతుడు చిత్రాన్ని చూసాను ,ఇట్స్ మార్వెలెస్ అని అన్నాడట చావు బతుకుల్లో ఉన్న మహేష్ అభిమాని ,తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా తనపై ఇంత అభిమానాన్ని కురిపిస్తూ శ్రీమంతుడు చిత్రాన్ని చూసి మహేష్ ని కలవాలని ఆశ పడుతున్న అభిమాని మహేష్ తో అన్న మాటలు మహేష్ చెవిన పడగానే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయట . అదీ అభిమానమంటే . ఇదే నా జీవితంలో బెస్ట్ కాంప్లిమెంట్ అంటూ ఇటీవల హైదరాబాద్ లో జరిగిన శ్రీమంతుడు థాంక్స్ మీట్ లో పాల్గొన్న మహేష్ తన అభిమానులకు చెప్పి ఎగ్జైట్ అయ్యాడు . ఇకనుండి మీకు నచ్చే సినిమాలే చేస్తానని అన్నాడు మహేష్ . కాకినాడ కు చెందిన మహేష్ అభిమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కూడా శ్రీమంతుడు చిత్రాన్ని చూసి మహేష్ ని కలిసి సినిమా నచ్చిందని చెప్పడంతో మహేష్ చలించి పోయాడు .



<TeTT |>TH&T చ

రణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్ర టీజర్ చిరంజీవి పుట్టినరోజుని పురస్కరించుకొని ఇటీవల రిలీజ్ చేసారు . ఆ టీజర్ మెగా అభిమానులను విశేషంగా అలరించేలా రూపొందింది .చరణ్ జోష్ చూస్తుంటే ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపేలా ఉన్న ఈ టీజర్ తో చరణ్ హిట్ కొట్టడం ఖాయమని మెగా అభిమానులు సంతోషంగా ఉన్నారు. శ్రీను వైట్ల మహేష్ తో చేసిన ఆగడు చిత్రం డిజాస్టర్ కావడంతో తన సత్తా ఏంటో మరోసారి చూపించడానికి కసితో ఈ చిత్రం చేసాడనిపిస్తోంది. డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు .

12 P టాలీవుడ్


 

  వెం

డితెరపై ఓటమి ఎరుగని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ని ఇద్దరు అందమైన భామలు చంపేస్తున్నారట ! ఈ విషయాన్ని తనే ట్వీట్ చేసాడు. ఇంతకీ జక్కన్న ని చంపేస్తున్న ఆ ఇద్దరు భామలు ఎవరో తెలుసా అనుష్క ,త్రిష . అనుష్క నటిస్తున్న ''సైజ్ జీరో '' లుక్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే ,అనుష్క భారీ సైజ్ అందాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి ,అలాగే త్రిష ప్రధాన పాత్ర పోషించిన ''నాయకి ''పోస్టర్ చాలా డిఫరెంట్ గా ఉంది ,ఒకవైపు నవ్వుతూనే మరో చేతిలో కత్తి పట్టి చంపేస్తోంది ,ఈ ఇద్దరూ కూడా చంపేస్తున్నారు అంటూ కామెంట్ చేసాడు జక్కన్న . దర్శక ధీరుడు ని చంపేస్తున్న ఈ ఇద్దరు భామల చిత్రాలు రేపు రిలీజ్ అయ్యాక ప్రేక్షకులను ఎలా చంపేస్తాయో చూడాలి .

టాలీవుడ్ P 13






బొ



బా



హుబలి చిత్రం తర్వాత తెలుగు సినిమా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది ,ఒక్క తెలుగులోనే రిలీజ్ చేస్తే కష్టం బడ్జెట్ పెరుగుతున్నందున సౌత్ లోని మిగతా భాష లలో రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకుంటున్నారు దానికి బాహుబలి సాధించిన విజయం ఓ ఉదాహరణ అయ్యింది. అలాగే ఇటీవలే రిలీజ్ అయిన శ్రీమంతుడు చిత్రం కూడా తెలుగు తో పాటు తమిళ ,మలయాళ భాషల్లో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నారు . తెలుగు సినిమా మార్కెట్ పరిది పెరగడంతో తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా రూటు మార్చాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని తమిళ ,మలయాళ భాషల్లో రిలీజ్ చేయడానికి అప్పుడే సన్నాహాలు చేస్తున్నారు దీనివల్ల పొరుగు మార్కెట్ లో కూడా కొంత డబ్బు వస్తుంది తద్వారా తెలుగు సినిమా స్థాయి కూడా పెరుగుతుంది కాబట్టి ఇతర భాషల్లో కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .

14 P టాలీవుడ్

మ్మరిల్లు హాసిని ఉరఫ్ జెనీలియా తృటిలో ఘోర ప్రమాదం నుండి తప్పించుకుంది . బ్యాంకాక్ లో జరిగిన బాంబు పేలుళ్ళ సంఘటన యావత్ ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన ఈ ఘటనలో జెనీలియా తప్పించుకుందని తెలిసి చిత్ర పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది . బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ భామ ఇటీవల ఓ యాడ్ ఫిలిం షూటింగ్ నిమిత్తం బ్యాంకాక్ వెళ్ళింది . బాంబు పేలుళ్లకు అతి సమీపంలో జెనీలియా ఓ షాపింగ్ మాల్ లో ఉండగా ఒక్కసారిగా బాంబులతో దద్దరిల్లి పోయిందట ఆ ప్రాంగణం ,చూస్తుండగానే వరుసగా పేలుళ్లు సంబవించడంతో చాలా భయపడి పోయిందట . అయితే తనకు ఎటువంటి గాయాలు కాకపోవడంతో తేరుకున్న జెనీలియా ఈ విషయాన్నీ ట్వీట్ చేసింది .




 కి

క్ 2 సినిమాలో మాంచి లిక్ లాక్ సీన్ ఉండటంతో ప్రేక్షకులు తెగ ఇదై పోతున్నారు . కిక్ 2లో లిప్ లాక్ సీన్ ఉన్నట్లు దర్శక నిర్మాతలు రివీల్ చేయలేదు దాంతో సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఫ్రెష్ గా ఫీలయ్యారు ఆ లిప్ లాక్ సీన్ ని బాగా ఆస్వాదిస్తున్నారు . రవితేజ -రకుల్ ప్రీత్ సింగ్ ల లిప్ లాక్ రసిక ప్రేక్షకులకు మరింత జోష్ నిచ్చింది . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మించిన కిక్ 2 భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది . అయితే ఈ చిత్రానికి డివైడ్ టాక్ వస్తోంది.

టాలీవుడ్ P 15


     

మొ

త్తానికి చిరంజీవి చరణ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించి మెగా అభిమానులను అలరించనున్నాడు. ఈ వార్త ఇన్నాళ్ళు నానుతూనే ఉన్నప్పటికీ ఆ చిత్ర దర్శకులు శ్రీను వైట్ల అధికారికంగా తెలిపారు . చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రంలో చిరంజీవి కీలక పాత్ర పోషించడానికి ఒప్పుకున్నాడట . ఇక చిరంజీవి - చరణ్ లను తెరపై చూస్తే అభిమానుల ఆనందానికి హద్దు ఉండదు ,దానికి తోడూ బాక్స్ లు బద్దలవడం ఖాయమని ధీమాగా ఉన్నారు మెగా అభిమానులు . ఆగష్టు 22 చిరంజీవి పుట్టినరోజు కాబట్టి ఈ వార్తని చిరు అభిమానుల కోసం ప్రకటించారు .

  

 నం

దమూరి హీరోలు బాలయ్య -ఎన్టీఆర్ ల మద్య భారీ యుద్ధం జరిగేలా ఉంది . 2016 జనవరిలో వారం గ్యాప్ లో ఈ ఇద్దరు హీరోల చిత్రాలు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా జనవరి 8న రిలీజ్ చేయాలనుకుంటున్నారు కాగా జనవరి 14న బాలయ్య నటిస్తున్న డిక్టేటర్ ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . వారం రోజుల గ్యాప్ లో బాలయ్య - ఎన్టీఆర్ ల సినిమాలు వస్తే బాబాయ్ - అబ్బాయ్ ల మద్య యుద్ధం తప్పదు ,అలా యుద్ధం జరిగితే వాళ్ళకే నష్టం . ఆ నష్ట నివారణ కోసం ఎవరో ఒకరు వెనక్కి తగ్గక తప్పదు మరి ఈ ఇద్దరిలో ఎవరు వెనకడుగు వేస్తారు అన్నది చూడాలి .

16 P టాలీవుడ్




 నా

కిప్పుడే పెళ్లి వయసు రాలేదని మరో పదేళ్ళ తర్వాత పెళ్లి వయసు వస్తుందని అంటోంది బాలీవుడ్ హాట్ భామ ఆలియా భట్ . పెళ్ళికి సరైన వయసు 32 ఏళ్ళు అని అప్పుడు పెళ్లి చేసుకోవాలని నాకు ఇప్పుడు 22ఏళ్ల వయసే........... పైగా నాకు కాబోయేవాడు నన్ను బాగా చూసుకోవాలి ,నన్ను బాగా అర్ధం చేసుకునే వాడై ఉండాలి అని అంటోంది ఆలియా . తన స్నేహితురాలు అనుష్క రాజన్ హీరోయిన్ గా పరిచయం అవుతున్న చిత్రం ''వెడ్డింగ్ పలావ్ '' చిత్ర ట్రైలర్ ని లాంచ్ చేయడానికి వచ్చిన ఆలియా పై విధంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది .

టాలీవుడ్ P 17


 yT సా

లిడ్ అందాల బొమ్మాలి అనుష్క మరింత సాలిడ్ గా చూడటానికి రెండు కళ్ళు సరిపోనంతగా ఉన్న చిత్రం ''సైజ్ జీరో ''. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ ,స్టిల్స్ చూసి ముక్కున వేలేసు కునేలా ఉండగా తాజాగా రిలీజ్ అయిన స్టిల్స్ చూస్తే మాత్రం మతి పోవడం ఖాయం . నిజంగానే అనుష్క ను చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే నమ్మండి . అంత డ్రమ్ము లా ఉంది అనుష్క ,ఆ

18 P టాలీవుడ్



#&>\e

భారీ సైజ్ అందాలతో జాగింగ్ చేస్తుంటే కాళ్ళ కింది భూమి బద్దలై పోతున్నట్లుగా ఉంది . అలా చూస్తున్నప్పుడు ఓరి దేవుడో ! అని అనిపించక మానదు . రేపు తెరపై అనుష్క ని ఇలా చూడగలమా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే !


{e&  ue& ueT టా

లీవుడ్ లో హీరోయిన్స్ గా వెలగాలనే చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కు ఉంటుంది. కాని సరైన అవకాశాలు రావాలి కదా. అయితే లేటెస్ట్ గా ఇలాంటి మంచి అవకాశాన్ని కొట్టేసింది హాట్ హాట్ అందాల భామ పరిణితి చోప్రా. ఆ మద్య బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు చాలా స్లిమ్ గా తయారయింది. దాంతో బాలీవుడ్ లో అవకాశాల జోరు కూడా పెరిగింది. ప్రస్తుతం ఈ అమ్మడికి తెలుగు సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కింది. నాగ చైతన్య హీరోగా నటించే నెక్స్ట్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి. కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం లో రూపొందే ఈ సినిమా లో పరిణితి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారట. ఈ సినిమాలో చేయడానికి పరిణితి ఓకే చెప్పినట్టు తెలిసింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది.

||


తె

లుగులో హీరోయిన్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్న అందాల భామ రెజినా కు ఇప్పుడు వరుసగా మంచి అవకాశాలే వస్తున్నాయి. ఇప్పటికే ఆమె కెరీర్ లో మంచి హిట్ ఉండడం కూడా మరో కారణం కావొచ్చు. అయితే లేటెస్ట్ గా రెజిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రం లో నటిస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మంచి స్కోప్ ఉందట. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత ఈ అమ్మడికి టాప్ హీరోయిన్ గా అవుతానన్న నమ్మకం బాగా పెరిగిందట. ఈ చిత్రం లో సీత పాత్రలో అందరిని ఆకట్టుకుంటా అనే నమ్మకం తో ఉంది ఈ భామ ?

dTVXD+  |  \T |Tq

VssTTH


సౌ

త్ క్రేజీ హీరోయిన్ గా మంచి పాపులారిటీ తెచ్చుకున్న్ అందాల భామ సమంతా మరో సారి బికినీ లో అదరగొట్ట నుందట ! ఇదివరకే సూర్య హీరోగా వచ్చిన సికిందర్ చిత్రం లో బికినిలో రెచ్చిపోయిన ఈ అమ్మడు ఇప్పుడు మరో సారి బికినీ వేస్తుంది. సూర్య హీరోగా విక్రం కుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న 24 చిత్రం లో సమంతా హాట్ హాట్ బికినీ అందాలూ దర్శనం ఇస్తాయని కోలీవుడ్ టాక్. ఈ మధ్యే కోలీవుడ్ లో కూడా వరుస విజయాలు అందుకుంటున్న సమంతా ఇప్పుడు గ్లామర్ బాటా పట్టింది. ఈ సినిమాతో ఈ అమ్మడికి అవకాశాలు వరదల వస్తాయనడం లో సందేహం ఏముంది.

eTs k] _ s#>= qTq V{ ueT


{HC 

| |qT\T #d+<

పే

రుకి వంటి మీదకు వయసు వచ్చింది కానీ ఆ వయసులో ఎలా నడుచుకోవాలో ,ఎలా మాట్లాడాలో ,ఎలా ప్రవర్తించాలో మాత్రం అస్సలు తెలీలేదట కాజల్ అగర్వాల్ కు . దాంతో వాళ్ళ అమ్మ ఇప్పుడు నువ్వు వయసుకు వచ్చిన ఆడపిల్లవు కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడటం ,ప్రవర్తించడం మంచిది కాదని హితువు చెప్పి ఎలా ప్రవర్తించాలో విడమరిచి చెప్పిందట దాంతో మెల్లి మెల్లిగా ఒక దారిలోకి వచ్చానని కానీ ఇప్పుడన్నీ నా పనులను చూసుకుంటూ ఎదిగానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ . అవును మరి టీనేజ్ లోకి రాగానే యవ్వనపు మొగ్గ తొడిగిన సమయంలో శరీరంలో మార్పులు వస్తుంటాయి కానీ ప్రవర్తన లో అంతగా మార్పు రాదు ఆ సమయమ్లో తల్లి అన్ని విషయాలను చెప్పడం వల్ల తమని తాము మలుచుకోగలుగుతారు .


 

సౌ

త్ క్రేజీ గ్లామర్ భామ గా ఏంతో పాపులారిటీ సృష్టించింది సిల్క్ స్మిత. అపట్లో ఆమె సినిమాలకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అందరికి తెలిసిందే. ఇప్పటికే ఆమె జీవిత కథతో బాలీవుడ్ లో డర్టీ పిక్చర్ గా రూపొందింది సంచలన విజయం సాదించింది. విద్యాబాలన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు ఆమె ఏకంగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇప్పుడు మరో సారి సిల్క్ స్మిత జీవిత కథ నేపద్యం లో మరో సినిమా రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. గతం లో సిల్క్ స్మిత తో సన్నిహిత సంబందాలు ఉన్నాయంటూ వార్తల్లోకి వచ్చిన వేలు ప్రభాకరన్ ఈ సినిమాను రుపొందిస్తాడట. అయితే ఈ సీనియర్ దర్శకుడికి సిల్క్ కు ఉన్న సాన్నిహిత్యం కూడా ఈ సినిమాలో ఉంటుందని ఆయన తెలిపాడు?? ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే సిల్క్ పాత్రలో ఎవరు నటిస్తారో మరి ?

H q T L 

మద్య హర్రర్ సినిమాల హవా బాగా ఎక్కువైంది. ఏ బాషలో చూసిన ఈ తరహ చిత్రాలు జోరుగా

నిర్మితం అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరిస్తుండటం తో ఇప్పుడు అందరు ఇదే దారిని ఎంచుకుంటున్నారు. లేటెస్ట్ గా తానూ కూడా బయపెడ్తా అంటూ వస్తుంది మరో హాట్ అందాల భామ. ఆ మద్య పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గుడుంబా శంకర్ చిత్రం తో పాటు పలు చిత్రాల్లో నటించిన అందాల భామ మీరా జాస్మిన్ గుర్తుంది కదా. ఆ మద్య పెల్లి చేసుకుని సినిమాలకు దూరం అయిన ఈ అమ్మడు మల్లి రీ ఎంట్రీ ఇస్తూ ఓ మలయాళం సినిమాలో నటించింది. ఆ చిత్రాన్ని ది ఐస్ పేరుతొ తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నట్టు తెలిసింది. వచ్చే నెలలో ఈ సినిమా విడుదల కానుంది. మరి ఈ అమ్మడు ఎలా బయపెడ్తుందో చూడాలి ???

టాలీవుడ్ P 23


 uT j>| deTT<eT

ప్ర

తి ఒక్కరి జీవితాన్ని సముద్రంతో పోల్చుతుంటాం. ఎన్నో ఆటుపోట్లతో కూడుకున్న మనిషి జీవితం ఒక్కొక్క దరిని చేరుతుంటుంది. అయితే ఓటమి ఎదురైనప్పుడు మనిషి నిరాశ, నిస్పృహలతో కుండిపోకుండా ముందుకు సాగాలనే జీవిత సత్యాన్ని తెలియజేసేదే ‘సముద్రం’. సముద్రంలో అలలు తీరాన్ని తాకడానికి ముందు అనేక ఆటు పోట్లు ఎదుర్కొని ఉవ్వెతున్న లేస్తాయి. అలాగే కిందకి పడిపోతుంటాయి. ఇలాంటి ఒడిదొడుకులు కూడా జీవితంలో సహజం, అయితే మనిషి ఓటమి ఎదురైన ప్రతిసారి కుంగిపోకుండా ప్రయత్నం చేయాలి. అప్పుడే ఉవ్వెత్తున ఎగిసే అలలా పైకెదుగుతాడు. ఇది ఎవరూ కాదనలేని జీవిత సత్యం. దీన్ని విజ్ఞులు మనకు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. అలాంటి జీవిత సత్యాన్ని ఆధారంగా చేసుకుని హీరో, నటుడు జగపతిబాబు ఆటో బయోగ్రఫీతో ‘సముద్రం’ అనే ధారావాహిక ప్రసారం కానుంది. పదమూడు ఎపిసోడ్లతో ఈ సీరియల్‌ ప్రసారం కానుంది. హీరోగా కెరీర్‌ను

24 P టాలీవుడ్

ప్రారంభించిన జగపతిబాబు తన సినీ గమనంలో ఎన్నో ఎత్తు పల్లాను చూశారు. అయితే ఆయన ఓటములకు కుంగిపోలేదు. ప్రయత్నం చేశాడు..చేస్తూనే ఉన్నాడు. అందుకే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉత్తమ నటుడుగా నిలిచిపోయారు. జగపతిబాబు జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా రానున్న ఈ ధారావాహిక ఆయన నేపథ్యం నుండి ప్రారంభం అవుతుంది. హీరోగా ఆయన సాధించిన సక్సెస్‌లు, ఫెయిల్యూర్స్, సమాజంలో, రియల్ లైఫ్ లో జగపతిబాబు ఎలా ఉంటారు?, రీల్ లైఫ్ లో ఎలా ఉంటారు? వంటి చాలా విషయాలు ఆయన స్వయంగా వివరిస్తారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇంత వరకు ఇండియన్‌ సినీ హిస్టరీలో ఏ హీరో చేయని ప్రయోగమిది అనాలి. ఈ ‘సముద్రం’ ధారావాహికకు సినీ జర్నలిస్ట్‌ వంశీ చంద్ర వట్టికూటి రచయిత. ‘మ్యాంగో’ వంశీ నిర్మాణ, నిర్వహణ బాధ్యతను చూస్తారు. ఈ కార్యక్రమాన్ని ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ప్రసారం చేయనుంది.


|eH dssY > u|dt  <\T=&&

స్వా

తంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ''సర్దార్ గబ్బర్ సింగ్ ''ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు . సర్దార్ లుక్ పవన్ అభిమానులను విశేషంగా అలరించింది . పోలిస్ యూనిఫాం లో రెండు చేతుల్లో గన్స్ పట్టుకొని సింహం లా నడిచి వస్తున్న స్టిల్ కేక పెట్టించేలా ఉంది . గుండె నిండా ధైర్యమే కాదు గన్నులు వాటితో పాటు కావలసినంత ప్రేమ ఉందంటూ జాతికి సెల్యూట్ చేసాడు పవన్ . సర్దార్ ఫస్ట్ లుక్ లో పవన్ కున్న

తిక్కేంటో చూపించాడు ,అభిమానులకు ఎలాంటి లుక్ కావాలో అలాంటి లుక్ ని పవన్ దగ్గరుండి మరీ డిజైన్ చేయించి వదిలాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ట్రెండ్ సృష్టించింది . పవన్ లుక్ ని చూసి పిచ్చెక్కి పోతున్నారు అభిమానులు . ఈ ఒక్క లుక్ చాలు బాక్సాఫీస్ ని బద్దలు కొట్టడానికి అంటూ చర్చించుకుంటున్నారు . కే ఎస్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

* #bsTT+< *dH

>T+& s+ ప్ర

H&

భాస్ తో మిర్చి సినిమా చేస్తున్న సమయంలోనే దర్శకుడు కొరటాల శివ తల్లి అనారోగ్యంతో చనిపోయిందట అయితే తన తల్లి చనిపోయిందన్న బాధతో కుమిలి పోతున్నప్పటికీ దాన్ని బయటకు కనబడనీయకుండా మిర్చి ని హిట్ చేయాలనే కసితో పని చేసాడట కొరటాల ,అంతేకాదు ఆ సినిమాని పెద్ద హిట్ చేసి కనిపెంచిన తల్లి ఋణం తీర్చుకున్నాడు దర్శకులు కొరటాల శివ . మిర్చి తో దర్శకుడిగా పరిచయం అయిన శివ తన తల్లి మమ్మల్ని పెంచడానికి చాలా కష్టాలు పడిందని కానీ నేను దర్శకుడిగా సక్సెస్ సాధించక ముందే చనిపోవడం చాలా బాధించిందని అంటున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం శ్రీమంతుడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధిస్తున్న నేపథ్యంలో తన తల్లి ని గుర్తు చేసుకున్నాడు కొరటాల శివ .

టాలీవుడ్ P 25


H

 f{ |&<eT

ని

#b&

తిన్ హీరోగా దర్శకులు గౌతమ్ మీనన్ నిర్మించిన చిత్రం ''కొరియర్ బాయ్ కళ్యాణ్ ''. గతకొంత కాలంగా నానుతున్న ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చేనెల లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గౌతమ్ మీనన్ . అయితే కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే టైటిల్ ఆలోచన మాత్రం హీరో నితిన్ దే నట ! పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ నితిన్ అనే విషయం అందరికీ తెలిసిందే . దాంతో ఏదో ఒక పేరు పెట్టే బదులు కొరియర్ బాయ్ కళ్యాణ్ అని పెడితే బాగుంటుంది అని చెప్పాడట దాంతో మిగతావాళ్ళు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా ఓకే చెప్పారట . నితిన్ తన ప్రతీ చిత్రంలో ఏదో ఒక సన్నివేశంలో పవన్ పేరుని వాడుకోవడమో లేక సీన్ ని వాడుకోవడమో చేస్తూనే ఉన్నాడు .

+#  yT> Vs

eT]jT V{ =&&

ము

కుంద చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన మెగా హీరో వరుణ్ తేజ్ కు ఆ చిత్రం నిరాశనే మిగిల్చింది . కాగా రెండో చిత్రంగా క్రిష్ దర్శకత్వంలో ''కంచె '' చేస్తున్నాడు . ఈ చిత్రంలో సైనికుడిగా నటిస్తున్నాడు వరుణ్ . రెండో ప్రపంచ యుద్ద కాలంలో జరిగిన ఓ ప్రేమకథా చిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది . మొదటి చిత్రం యావరేజ్ కావడంతో ఈ చిత్రం తోనైనా హిట్ కొడతాడా ? అన్న ప్రశ్న తలెత్తుతోంది . సామజిక స్పృహ ఉన్న చిత్రాలను అందించే క్రిష్ వరుణ్ కు కమర్షియల్ హిట్ ఇస్తాడా అన్నది మెగా అభిమానుల్లో నెలకొన్న ప్రశ్న . కంచె చిత్రాన్ని దసరా కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . మరి విజయానికి గుర్తుగా జరుపుకునే ఆ పండుగ సందర్భంగా వస్తున్న కంచె విజయానికి కంచె వేస్తుందా లేదా చూడాలి.

26 P టాలీవుడ్


 VssTTH

|[ #dT<

ప్రే

మలో పడితే జీవితం నాశనం అయిపోతుంది అందుకే నేను ప్రేమ జోలికి వెళ్ళను ఒకవేళ నన్ను ప్రేమిస్తున్నానని ఎవరైనా వెంట పడితే వాళ్ళకు దూరంగా ఉంటాను అని అంటోంది కేరళ కుట్టి లక్ష్మీ మీనన్ . తనని ప్రేమిస్తున్నానంటూ చాలామందే వెంటపడ్డారట అయితే వాళ్ళ ఆటలు సాగలేదని ,ప్రేమలో పడటం అంటే జీవితాన్ని నాశనం చేసుకోవడమే అని ఇక పెళ్లి కూడా చేసుకునే ఆలోచన లేదని అంటోంది లక్ష్మీ మీనన్ . తమిళనాట కుంకీ చిత్రంతో సంచలనం సృష్టించిన ఈ మలయాళ ముద్దుగుమ్మ లిప్ లాక్ లు చేస్తూ బాగానే రెచ్చగొడుతోంది కానీ ప్రేమ ,పెళ్లి అంటే మాత్రం వైరాగ్యం పోతోంది ఎందుకో

bsY , dTesY

\ de

f{ <H సు

కుమార్ దర్శకత్వం లో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాకు “నాన్నకు ప్రేమతో “ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్నీ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ ట్విట్టర్ ద్వార లీక్ చేసారు.ఈ సినిమా లో ఎన్టీఆర్ ఇంటర్ పోల్ ఆఫీసర్ అభిరామ్ గా కనిపించానున్నాడట. దర్శకులు సుకుమార్ , ఎన్టీఆర్ కోసం ఒక స్పెషల్ బైక్ ను డిజైన్ చేయించాడు . హార్లీ డేవిడ్సన్ కంపెనీ కి చెందిన ఈ బైక్ పేరు ఎలక్ట్ర గ్లిడ్ క్లాసిక్ ఫై ఈ సినిమాలో తిరగనున్నాడు ఎన్టీఆర్. ఈ బైక్ ఖరీదు సుమారుగా 37 లక్షలట . జనవరి 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . నాన్నకు ప్రేమతో అనే టైటిల్ ముందునుండి వినబడుతున్నప్పటికి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ లీక్ చేసారు కాబట్టి ఇదే టైటిల్ అని ఫిక్స్ అయినట్లే .

టాలీవుడ్ P 27


leT+ T & d] d+~

సై

కిల్ తొక్కడం వల్ల ఆరోగ్యానికి చలామంచిదని డాక్టర్లు సూచిస్తుండటంతో ఆ డాక్టర్ల మాటలను లెక్కచేయడం లేదు జనాలు కానీ మహేష్ మాత్రం శ్రీమంతుడు చిత్రంలో సైకిల్ ఎక్కి తొక్కడంతో మేము సైతం అంటూ యువత మాత్రమే కాదు పెద్దవాళ్ళు మహిళలు కూడా సైకిల్ తొక్కుతున్నారు . తాజాగా ఆ లిస్టులోకి సీనియర్ నటిమణి సంధ్యా జానక్ శ్రీమంతుడు ఇచ్చిన స్పూర్తితో సైకిల్ ఎక్కింది . సైకిల్ ఎక్కడమే కాకుండా శ్రీమంతుడు ఇచ్చిన స్పూర్తి ఇదని చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది . పలు తెలుగు చిత్రాల్లో అమ్మగా ,అత్తగా ,ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సంధ్య మాత్రమే కాదు పలువురు ప్రముఖులు కూడా సైకిల్ ఎక్కుతున్నారు .

e# d++

u bs+ ]> +~

28 P టాలీవుడ్

చ్చే సంక్రాంతికి పలువురు అగ్ర హీరోలు బరిలోకి దిగుతుండటం వల్ల భారీ పోరాటం తప్పేలా లేదు . ఒకవైపు బాలకృష్ణ నటిస్తున్న ''డిక్టేటర్ '' చిత్రాన్ని జనవరి 14న రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు ,కాగా అదే సంక్రాంతికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా బరిలో దిగనున్నాడు ''సర్దార్ గబ్బర్ సింగ్ '' చిత్రంతో . ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా జనవరి 8న ''నాన్నకు ప్రేమతో '' అంటూ పలకరించడానికి సిద్దం అంటూ ప్రెస్ నోట్ కూడా పంపించాడు . ముగ్గురు అగ్ర హీరోలు కేవలం పది రోజుల వ్యవధిలో కనుక వస్తే భారీ పోరాటం తప్పదు దానివల్ల ఎవరో ఒకరు నష్టపోవడం ఖాయం . పైగా థియేటర్ల సమస్య కూడా వస్తుంది కాబట్టి ముగ్గురిలో ఎవరో ఒకరు తప్పనిసరిగా వెనకడుగు వేయాల్సిందే మరి ఎవరు వెనకడుగు వేస్తారో చూద్దాం .


శ్రీ

మంతుడు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమా బ్రహ్మోస్థవం సినిమాలో నటిస్తాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వచ్చేనెల 14 నుండి ప్రారంబం కానుంది. విజయవాడ నేపద్యం లో రూపొందనున్న ఈ సినిమాను శ్రీకాంత్ అడ్డాలా రుపొందిస్తాడు. అయితే ఈ సినిమా తరువాత మహేష్ సినిమా ఏమిటి? అనే అసఖ్తి ఇప్పుడు అందరిలో ఎక్కువైంది. అయితే మహేష్ నెక్స్ట్ సినిమా మాత్రం వినాయక్ తో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. వినాయక్ ప్రస్తుతం అఖిల్ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చిరంజీవి సినిమా రూపొందించే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ ఆ సినిమా కాకుంటే వెంటనే మహేష్ తో సినిమా చేస్తారని సమాచారం. సో త్వరలోనే దీనికి సంబందించిన వివరాలు వెల్లడి కానున్నాయి.



 <sHH <X+

b| neX\ CsT

మధ్యే వెంకటేష్ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా మంచి విజయం సాదించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ కూతురిగా నటించిన కృతిక కు అవకాశాల జోరు పెరిగింది. ఇప్పటికే హీరోయిన్ గా వినవయ్య రామయ్య చిత్రం లో నటించిన ఈ భామకు ఇప్పుడు వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. లేటెస్ట్ గా ప్రముఖ దర్శకుడు మారుతి నిర్మిస్తున్న రోజులు మారాయి చిత్రం లో హీరోయిన్ గా నటిస్తుందట. మురళి కృష్ణ దర్శకత్వం లో రూపొందే ఈ సినిమాలో కేరింత సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పార్వతీశం హీరోగా నటిస్తాడట !! ఈ సినిమాతో పాటు మరిన్ని అవకాశాలు ఈ అమ్మడికి వస్తున్నాయి మరి ?

టాలీవుడ్ P 29


 - #sDY \

eT< |{+> |< బా

వ - బామ్మర్ది ల మద్య భీకర పోరు తప్పేలా లేదు అది కూడా దసరా బరిలో ఈ పోరు సాగనుంది . ఇంతకీ ఆ బావ - బామ్మర్ది ఎవరో తెలుసా ఇంకెవరు చరణ్ - అల్లు అర్జున్ లు . చరణ్ - శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న ''బ్రూస్ లీ '' ది ఫైటర్ చిత్రాన్ని అక్టోబర్ 16న రిలీజ్ చేయడాన్కి సన్నాహాలు చేస్తున్నారు ఇక అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి గా నటించిన చిత్రం ''రుద్రమదేవి '' , ఈ చిత్రం గతకొంత కాలంగా రుద్రమదేవి చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది . ఇక తాజాగా రుద్రమదేవి చిత్రాన్ని అక్టోబర్ మొదటి వారంలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు గుణశేఖర్ . దీంతో వారం గ్యాప్ లో కనుక ఈ రెండు చిత్రాలు వస్తే బావ -బామ్మర్దుల మద్య ఫైటింగ్ తప్పేలా లేదు . మరి ఈ ఫైటింగ్ లో ఎవరు కొడతారో హిట్టు .



de bH #dTq

<s&T

30 P టాలీవుడ్

టివలే ఎన్టిఆర్ తో రామయ్య వస్తావయ్య చిత్రాన్ని రూపొందించిన హరీష్ శంకర్ ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ సినిమా తరువాత హరీష్ శంకర్ మరో సారి ఎన్టిఆర్ తో సినిమా చేయాలనీ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కోసం ఓ కథ కూడా సిద్దం చేసాడని తెలిసింది. త్వరలోనే ఎన్టీఆర్ కు వినిపించే ప్రయత్నాల్లో ఉన్నాడు. మరి భారి అంచనాలతో వచ్చిన రామయ్య వస్తావయ్య ఫ్లాప్ తో హరీష్ శంకర్ కు మరో సినిమా చేస్తాడో లేదో చూడాలి ?


H deT+ \ $yT

మా

టల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ల కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్' చిత్రం ప్రారంభానికి రంగం సిద్ధమైంది.

రుసగా 'జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి' వంటి ఘన విజయం సాధించిన చిత్రాల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం లోనే తమ బ్యానర్ లో మూడవ చిత్రాన్ని నిర్మించటానికి సిద్ధమయ్యారు అభిరుచి గల నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు). త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత నాయికగా తొలిసారిగా నటిస్తున్నారు. మరో కధానాయిక కూడా ఈ చిత్రం లో నటించ బోతున్నారు, ఆ వివరాలతో పాటు ఇతర నటీ నటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు నిర్మాత రాధాకృష్ణ.

||ueTH+ V#]\ yqZq

వన్ కళ్యాణ్ జనసేనానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల నుండి భూమిని సేకరించాలన్న ఆలోచన నుండి తప్పుకుంది. పవన్ సూచన మేరకు భూసేకరణ చట్టాన్ని ప్రయోగించమని ,దాన్ని వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేసారు మంత్రి నారాయణ . ఇటీవల పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులను కలుసుకొని వాళ్ళ సమస్యలను సావధానంగా విన్న పవన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు పంపారు . రైతులు భూమి ఇస్తే తీసుకోండి కానీ భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకుంటే మాత్రం నేను ధర్నా కు దిగడం ఖాయం ,నేను మీకు మద్దతు ఇచ్చాను కానీ మీ బానిసను కాను అంటూ హెచ్చరికలు జారీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది .

టాలీవుడ్ P 31


uV Q * |<Hq >essY qTH&

బా

హుబలి పెద్దనాన్న గవర్నర్ కానున్నాడా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు . ప్రభాస్ పెద్దనాన్న సీనియర్ నటుడు కృష్ణంరాజు బిజెపి నాయకుడు అన్న విషయం తెలిసిందే ,అటల్ బిహారీ వాజ్ పాయ్ మంత్రివర్గంలో కృష్ణంరాజు కేంద్రమంత్రిగా సేవలందించిన విషయం తెలిసిందే . అయితే కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్న కృష్ణంరాజు మళ్ళీ బిజెపి లో క్రియాశీల పాత్ర పోషిస్తున్నాడు . దాంతో కృష్ణంరాజు కు గవర్నర్ పదవి రానుందని వినిపిస్తోంది . పైగా ఇటీవలే ప్రభాస్ ని తీసుకొని బిజెపి అగ్రనేతలను ,ప్రధానమంత్రి ని కూడా కలిసాడు కృష్ణంరాజు . దాంతో ఈ ఊహాగానాలకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది . బాహుబలి భారీ విజయం తో ప్రభాస్ రేంజ్ కూడా బాగా పెరగడంతో తప్పనిసరిగా ప్రభాస్ కోసమైనా కృష్ణంరాజు కు గవర్నర్ గిరి ఇవ్వడం తప్పదేమో .

eT V wt   b{ >  10>e\qT <rdTq టా

$w

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కు పోటీ వస్తున్నాడు మంచు విష్ణు అందుకే ఏకంగా పది గ్రామాలను దత్తత తీసుకున్నాడు . సొంత ఊరికి ఎంతో కొంత చేయాలనేది శ్రీమంతుడు కాన్సెప్ట్ ,ఆ ఇతివృత్తం తో

32 P టాలీవుడ్

తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో పలువురు రాజకీయ ,సినీ ప్రముఖులు తమ తమ సొంత గ్రామాలకు ఎంతోకొంత చేయాలని సిద్దం అవుతున్నారు . కాగా మంచు విష్ణు కూడా చిత్తూరు జిల్లా లోని చంద్రగిరి నియోజక వర్గం లోని పది గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఎలా డెవలప్ చేయాలో ప్లాన్ చేస్తున్నాడు . ఇక శ్రీమంతుడు మహేష్ రెండు గ్రామాలను దత్తత తీసుకున్న విషయం తెలిసిందే .


yT  L & eTVwt y\

టా

లీవుడ్ ,బాలీవుడ్ ,మాలీవుడ్ ,కోలీవుడ్ ఇలా ఏ వుడ్ లను తీసుకున్నా ''మహేష్ '' అంటూ కలవరిస్తున్నారు అందమైన భామలు . తాజాగా మాజీ మిస్ ఇండియా ,బాలీవుడ్ భామ ''జోయా అప్రోజ్ '' సైతం మహేష్ అంటూ కలవరిస్తోంది . తెలుగులో అవకాశాలు వస్తున్నాయని అయితే మహేష్ తో నటించే చాన్స్ కోసం ఎదురు చూస్తున్నానని ,అతడితో నటించే చాన్స్ వస్తే అంతకుమించిన అదృష్టం ఏముంటుంది చెప్పండి అని అంటోంది . హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమం లో పాల్గొనడానికి ఇక్కడకు వచ్చిన జోయా అప్రోజ్ కూడా మహేష్ కావాలని అంటోంది . ఇంతమంది అమ్మాయిలు మహేష్ .......... మహేష్ అంటూ కలవరిస్తే పాపం తట్టుకోవడం మహేష్ వల్ల అవుతుందా చెప్పండి .

eTVwt

e\ eT+# sT>T+~ టా

లీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రం పుణ్యమా అని బోసిపోయిన పల్లెటూర్లు బాగుపడేలా ఉన్నాయి . సొంత గ్రామానికి ఎంతోకొంత చేయాలి అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రం స్పూర్తితో అటు రాజకీయ నాయకులు ఇటు సినిమా రంగ ప్రముఖులు కూడా పలు గ్రామాలను దత్తత తీసుకుంటున్నారు . ఇలా గ్రామాలను దత్తత తీసుకోవడం వల్ల ఆ గ్రామాలు ఎంతోకొంత అభివృద్ధి చెందే అవకాశం ఉంది . శ్రీమంతుడు చిత్రాన్ని చూసిన రాజకీయ నాయకులు ఇప్పటికే కొంతమంది గ్రామాలను దత్తత తీసుకున్నారు ,అలాగే సినీ ప్రముఖులు కూడా . వీళ్ళు స్పూర్తి పొందడానికి మహేష్ శ్రీమంతుడు కారణం కావడంతో మహేష్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.

టాలీవుడ్ P 33


\ qsd+Vk$T odT\ bs+uyTq yue+

యా

దగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఆగస్ట్29న నా స్వంత బ్యానర్లో ‘వైభవం’ అనే సినిమాని ప్రారంభించానని దర్శకుడు విజయసముద్ర అన్నారు. ప్రవీణ్‌, హరీస్‌గౌతమ్‌, కార్తీకేయ, అభినవ్‌, మనస్విని ప్రధాన తారాగణంగా సముద్రమూవీస్‌ బ్యానర్‌పై చంద్రా యాదవ్‌ పోతురాజు సమర్పణలో కట్టారాంబాబు నిర్మాణ సారథ్యంలో విజయ సముద్ర దర్శకత్వంలో వి.విజయలక్ష్మి నిర్మాతగా నూతన చిత్రం వైభవం ఇటీవల యాదగిరి గుట్టలోని ప్రారంభమైంది. వి.గోపాలకృష్ణ, పి.సుబ్బారావు సహనిర్మాతలు. చిత్ర ముహుర్తపు సన్నివేశానికి చంద్రా యాదవ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, కల్వకుట్ల తేజారావ్‌ క్లాప్‌ కొట్టారు. శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలించాంబర్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో.. త్ర దర్శకుడు విజయసముద్ర: ప్రవీణ్‌, హరీస్‌ గౌతమ్‌, కార్తీకేయ, అభినవ్‌, మనస్విని వంటి కొత్త నటీనటులతో వైభవం సినిమాని ఈ రోజు నా బ్యానర్ లో స్టార్ట్ చేశాం. చంద్రాయాదవ్, కట్టారాంబాబు నాకు అండగా నిలబడ్డారు. ఈ సినిమాలో కొత్త అంశాలను యాడ్ చేస్తున్నాం. అందులో ముఖ్యమైనదేమిటంటే, ఈ సినిమాలో పెద్ద హీరో రీ ఎంట్రీ చేస్తున్నాడు. అలాగే ఓ పెద్ద హీరో సిస్టర్‌ కూడా హీరోయిన్‌గా రీ ఎంట్రీ అవుతుంది. ఆ డీటైల్స్ త్వరలోనే తెలియజేస్తాం. వైభవం అంటే మనుషులకు వచ్చే వైభవం గురించి కాదు, దేశానికి వచ్చే వైభవం గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం. కంట్రీ లెవల్‌ కాన్సెప్ట్‌. భారతీయ భాషలన్నింటిలో ఇది రూపొందుతుంది. భారతరత్న అనే కాన్సెప్ట్ పై రూపొందే చిత్రమిది. ట్టా రాంబాబు : సముద్ర చెప్పిన కథ నచ్చడంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. ఈ సినిమాలో ఒక కీలక

ఈ చి

34 P టాలీవుడ్

పాత్ర కోసం ఓ ప్రముఖ నటుడిని కలవబోతున్నాం. ఆ వివరాలు త్వరలోనే తెలియజేస్తాం. ద్రా యాదవ్‌ : ఈ చిత్రంతో మా అబ్బాయి ప్రవీణ్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేస్తున్నాం. సముద్రగారిపై నమ్మకంతో కథ కూడా వినకుండా సినిమాల్లోకి ఎంట్రీ అవుతున్నాం. నా తనయుడుని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ల్కార్‌ శ్రీనివాస్‌: ఈ సినిమాకి కథ, మాటలు అందిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్.‌ సినిమాలో మంచి మెసేజ్‌ ఉందని, ఇటువంటి వంటి చిత్రంలో నటించడం తమ అదృష్టమని కార్తికేయ, ప్రవీణ్‌లు చెప్పారు. వీణ్‌, హరీష్‌ గౌతమ్‌, కార్తీకేయ, అభినవ్‌, మనస్విని తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో డైరెక్టర్స్:‌ సురేష్‌, బ్రహ్మం, ప్రకాష్‌, మేనేజర్స్:‌ టి.మల్లి, సత్యం, స్టిల్స్‌: రాజు, కాస్ట్యూమ్స్‌: కరీమ్‌, సాహిత్యం: యస్‌.రవిశంకర్‌, అభినయ శ్రీనివాస్‌, మాతుమూరి రామారావు, ఆర్ట్‌: ఠాగూర్‌, ఫైట్స్‌: నందు, కథ, మాటలు: మల్కార్‌ శ్రీనివాస్‌, సంగీతం: యస్‌. ఆర్‌.శంకర్‌, ఎడిటర్‌: నందమూరి హరి, కెమెరామెన్‌: శ్రావణ్‌ కుమార్‌, సహ నిర్మాతలు: వి.గోపాలకృష్ణ, పి.సుబ్బారావు, నిర్మాత: వి.విజయలక్ష్మీ, డి.వి.వి.ఎస్‌.ఎన్‌. వి.ప్రసాద్‌, కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ సముద్ర.

చం మ ఈ ప్ర


>eTsY b\T e+& eTV|u

ఎం

తసేపు పక్కింటి అమ్మాయి పాత్రలేనా ? నాకు కూడా గ్లామర్ పాత్రలు చేయాలనీ ,నా సత్తా ఏంటో చూపించాలని ఆశ పడుతున్నాను కాబట్టి ఇకనైనా నాకు గ్లామర్ పాత్రలు ఇవ్వండి అని ప్రాధేయ పడుతోంది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠీ . అందాల రాక్షసి చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ భామకు వరుసగా హోమ్లీ పాత్రలు మాత్రమే వస్తుండటంతో కొద్దిగా ఫీల్ అవుతోంది నాకు గ్లామర్ పాత్రలు పోషించాలని గ్లామర్ తో ప్రేక్షకులను అలరించాలని ఉంది అని అంటోంది . విన్నారా దర్శక నిర్మాతలు . పాపం లావణ్య కు గ్లామర్ పాత్రలు ఇవ్వొచ్చుగా అప్పుడు తనేంటో చూపించే చాన్స్ ఉంటుంది కదా ! లావణ్య తాజాగా నాని సరసన నటించిన చిత్రం ''భలే భలే మగాడివోయ్ '' సెప్టెంబర్ 4న రిలీజై సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.

leT+T&T &ssY y+ |&TTq

s+J$

చి

రంజీవి తన 150వ చిత్రం కోసం శ్రీమంతుడు దర్శకుడు కొరటాల శివ తలుపు తట్టాడు. మిర్చి ,శ్రీమంతుడు వంటి బ్లాక్ బస్టర్ లను అందించిన కొరటాల శివ దర్శకత్వంలో కనుక సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ అవడం ఖాయమని నమ్ముతున్నాడట చిరంజీవి అందుకే కొరటాల కు కబురందించాడు నాకొక మంచి కథ తయారు చేయమని . మిర్చి ,శ్రీమంతుడు చిత్రాలు రెండు కూడా బ్లాక్ బస్టర్ లు కావడంతో కొరటాల శివ పై అగ్ర హీరోల ద్రుష్టి పడింది , మాకు సినిమా చేయమంటే మాకు చేయమని శివపై వత్తిడి చేస్తున్నారట . ఈ పరిస్థితుల్లో కొరటాల శివ ఎవరితో సినిమా చేస్తాడో ఏంటో చూడాలి .

టాలీవుడ్ P 35


d++ |eH de se&+ wyT

సం

క్రాంతికి సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ చేస్తామని ఘనంగా ప్రకటించారు కానీ వచ్చే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ సినిమా రావడం డౌటే ! ఎందుకంటే ఆగష్టు నెల కూడా అయిపోతోంది కానీ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా మాత్రం ముందుకు కదలడం లేదు . ఇప్పటికే రెండు షెడ్యూల్స్ అయ్యాయి అని ప్రకటించారు కానీ అందులో పవన్ కళ్యాణ్ పై తీసిన సన్నివేశాలు కొన్నే ! సెప్టెంబర్ నెల కూడా వస్తోంది షూటింగ్ అయిపోవాలి ,పోస్ట్ ప్రొడక్షన్ పనులు కావాలి అవన్నీ జరగాలంటే కనీసం నాలుగు నెలలు అంటే జనవరిలో సర్దార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అవడం కష్టమే . ఒకవేళ ఏకబిగిన షూటింగ్ చేసినా జనవరిలో రిలీజ్ కావడం కష్టమే ,ఇక పవన్ ఏకబిగిన షూటింగ్ చేయడం ఇంకా కష్టం కాబట్టి ఏ రకంగా చూసినా సంక్రాంతి కి డౌటే .

n

{sY n~]+~

36 P టాలీవుడ్

టీవల కింగ్ నాగార్జున పుట్టినరోజు కావడంతో అక్కినేని అభిమానులను సంతోషంలో ముంచెత్తడానికి అక్కినేని అఖిల్ నటిస్తున్న ''అఖిల్ '' చిత్రం టీజర్ ని రిలీజ్ చేసారు . ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీ గా తెరకెక్కిన ఈ టీజర్ అక్కినేని అభిమానులను విశేషంగా అలరించేలా రూపొందింది . ''అక్కినేని అభిమానులు గల్లా ఎగరేసి వస్తున్నాడ్రా మా అఖిల్ దుమ్ము లేపుతాడు చూడండ్రా '' అనేలా రూపొందింది . అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వివివినాయక్ దర్శకత్వం వహిస్తుండగా హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు . దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ కానున్న అఖిల్ చిత్ర ఆడియో సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది .


{sY u>T+~ >Ts అ

 $wj=d HH udt

-seT[

క్కినేని నాగార్జున పుట్టినరోజు ని పురస్కరించుకొని రిలీజ్ చేసిన ''సోగ్గాడే చిన్ని నాయనా '' టీజర్ బాగుంది గురూ . టీజర్ లోనే నాగార్జున ఎంతటి సోగ్గాడో తెలిసిపోతుంది . తండ్రీ కొడుకులుగా నాగార్జున ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో తండ్రి పాత్ర కు జోడీ గా అలనాటి అందాల తార రమ్యకృష్ణ నటిస్తుండగా ,కొడుకు పక్కన లావణ్య త్రిపాఠీ నటిస్తోంది . కొత్త దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు . అయితే టీజర్ మాత్రం అక్కినేని ఫ్యాన్స్ ని అలరించేలా రూపొందింది . పైగా సినిమా కంటెంట్ ఏంటో కూడా ఇట్టే తెలిసిపోతోంది ఈ టీజర్ వల్ల . మొత్తానికి నాగార్జున పుట్టినరోజున అక్కినేని ఫ్యాన్స్ కి మంచి విందే ఈ టీజర్ తో .

తె

లుగు సినిమా పరిశ్రమలోనే సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి ,ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ లది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు. జక్కన్న తన తొలి సినిమా “ స్టూడెంట్ నెం 1” నుండి “ బాహుబలి ”‘ వరకు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. అయితే ఇటివలే బాహుబలి సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా ప్రముఖ మేగజైన్ ” ఫోర్బ్స్” ఇంటర్వ్యూ లో సినీ విమర్శకుడు రోబ్ కెన్ ఒక ప్రశ్న అడిగాడు. కథచర్చల సమయంలో మీరు ,మీ నాన్న గారు ఇద్దరిలో ఎవరు బాస్ ల వ్యవహరిస్తారు? అన్న ప్రశ్నకు రాజమౌళి సిన్సియర్ గా సమాధానం ఇచ్చారు. ‘ నేనే బాస్.. డైరెక్టర్ నేనే కాబట్టి నేనే బాస్’ అని అన్నారు. మేము కథ చర్చలు చేసేటప్పుడు పని విషయంలో పక్క ప్రొఫెషనల్ గా ఉంటాం , అస్సలు మొహమాటం పడం ఏమైనా నచ్చని విషయాలను ఒకరికి ఒకరం షేర్ చేసుకుంటాం అని తెలిపారు. అయితే బాహుబలి ఫస్ట్ పార్ట్ కి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా బాహుబలి సెకండ్ పార్ట్ కు స్క్రిప్ట్ ను కలిసి ఫైనల్ చేస్తున్నాం అని అన్నారు.

టాలీవుడ్ P 37


n& uVQ*

$T+bsTT+~ #sDY de

రి

లీజ్ కు ముందే బాహుబలి రికార్డుని బద్దలుకొట్టాడు మెగా హీరో చరణ్ . ఇంకా రిలీజ్ కాకుండానే చరణ్ బాహుబలి రికార్డ్ ని బద్దలు కొట్టడం ఏంటి ? అని అనుకుంటున్నారా ? బహూబలి సినిమాని గల్ఫ్ కంట్రీ లో రిలీజ్ చేయడానికి 45లక్షలను చెల్లించారు కాగా ప్రస్తతం చరణ్ సినిమా ''బ్రూస్ లీ '' ది ఫైటర్ ని మాత్రం ఏకంగా 47లక్షలకు కొనుక్కున్నారు దాంతో రిలీజ్ కు ముందే బాహుబలి రికార్డు ని బద్దలు కొట్టిన చరణ్ రేపు సినిమా రిలీజ్ అయ్యాక మరెన్ని సంచలనాలను సృస్టించనుందో చూడాలి . ఇప్పటికే టీజర్ తో సంచలనం రేపిన బ్రూస్ లీ అక్టోబర్ 16న రిలీజ్ కానుంది .

neT | |+|+ p

*|t 

కి

#d+<

క్ 2లో రవితేజ - రకుల్ ప్రీత్ సింగ్ ల మద్య ఓ లిప్ లాక్ సీన్ ఉంది అయితే ఆ సీన్ గురించి దర్శకులు సురేందర్ రెడ్డి చెప్పినప్పుడు కొద్దిగా నెర్వెస్ గా ఫీల్ అయ్యిందట రకుల్ ,కానీ ఆ సన్నివేశం చిత్రీకరించే సమయంలో తన పక్కనే ఉన్న అమ్మని పక్కకు పంపించి రవితేజ లిప్ ని లాక్ చేసిందట రకుల్ ఈ విషయాన్ని రకుల్ విడమరిచి చెప్పింది . అమ్మ పక్కనే ఉండటం వల్ల ఇబ్బంది పడ్డాను కానీ పక్కకు పంపించడంతో కాస్త ఫ్రీ అయ్యాను అందుకే ఆ లిప్ లాక్ సీన్ చేయగలిగానని అంటోంది .అలాగే కళ్యాణ్ రామ్ తో కలిసి నటించే చాన్స్ వస్తే వదులుకోనని ఎందుకంటే కిక్ 2ని ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించారు అంటూ కళ్యాణ్ రామ్ కు కితాబు నిస్తోంది రకుల్ .

టాలీవుడ్ P 38


 d  e e\+ |<\ eyT

పో

ర్న్ స్టార్ సన్నీ లియోన్ నటించిన ''మస్తీ జాదే '' చిత్రంలో శృంగార సన్నివేశాలు ఎక్కువగా ఉండటం, ఎక్స్ పోజింగ్ మరీ శృతి మించిఉండటం వల్ల ఇన్నాళ్ళు సెన్సార్ కోరల్లో చిక్కుకుపోయింది . గత మే నెలలోనే రిలీజ్ కావాల్సిన ఆ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు కాకపోవడంతో రిలీజ్ కాకుండా ఆగిపోయింది. అయితే మొత్తానికి కొన్ని శృంగార సన్నివేశాలకు కట్ చెప్పి ''ఏ '' సర్టిఫికేట్ ఇవ్వడానికి ఓకే చెప్పారట సెన్సార్ సభ్యులు . ఇక దర్శక నిర్మాతలు కూడా రాజీ మార్గంగా వాళ్ళు చెప్పిన కొన్ని శృంగార సన్నివేశాలను వదులు కోవడానికి ఒప్పుకున్నారట . దాంతో త్వరలోనే ఈ శృంగార చిత్రం రిలీజ్ కానుందట . కొన్ని సన్నివేశాలు కట్ చేసినప్పటికీ ఇంకా బోలెడు శృంగార సన్నివేశాలు ఉన్నాయట అంటే అసలు ఏ రేంజ్ లో ఆ సీన్స్ ఉన్నాయో ఊహించుకోండి .



Turn static files into dynamic content formats.

Create a flipbook
Issuu converts static files into: digital portfolios, online yearbooks, online catalogs, digital photo albums and more. Sign up and create your flipbook.