డయల్ యువర్ విల్లేఙ్ (Dial Your Village-DYV), అమెరికాలో స్థిరపడిన తెలుగువారు నడుపుతున్న ఒక కార్యక్రమం. తెలంగాణాకు చెందిన వీరంతా ప్రత్యెక రాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. తెలంగాణా రాష్ట్రావతరణ తరువాత గత నాలుగు సంవత్సరాలుగా డయల్ యువర్ విల్లేఙ్ కార్యక్రమం క్రింద వారం వారం గ్రామీణ ప్రజా ప్రతినిధులతో, గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తున్నప్రభుత్వాధికారులతో. పౌర సమాజ ప్రతినిధులతో అనేక గ్రామ, క్షేత్ర స్థాయి చర్చలు చేస్తున్నారు. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకోవడము, ప్రజలను చైతన్య పరచడము, అవసరమైన చోట తగిన సహాయము చేయడం వీరి ముఖ్యోద్దేశం.
ఎందుకీ పీపుల్స్ మానిఫెస్టో?
క్షేత్ర స్థాయి సమస్యలపై చర్చల సందర్భంగా DYV టీమ్ అర్థం చేసుకున్నదేమంటే ప్రజావసరాలకు, ప్రభుత్వ పరంగా జరుగుతున్న కార్యక్రమాలకు పొంతన లేదు. ఎన్నికల సందర్భంగా ఒకరిని మించి ఒకరు పోటీ పడుతూ అన్నీఉచితం అంటూ చేస్తున్న వాగ్దానాలు ఆందోళనకరమైన పరిణామం. నిజమైన ప్రజావసరాలు ఏవి, వీటిని తీర్చడానికి కావాల్సిన చర్యలేమిటి అనే ఈలోచన నుండి ఈ పీపుల్స్ మేనిఫెస్టో పుట్టింది.