MEN PROFESSIONALS
ఎంహెచ్ రావు గారు ప్రముఖ పారిశ్రామికవేత్త
ఓ కట్టడం చాలా కాలం వరకు బలంగా వుండాలంటే అందులో వినియోగించే సిమెంట్ ఎంత ముఖ్యమో తెలిసిన వ్యక్తిగా.. దేశంలోనూ. ఇటు రాష్ట్రంలోనూ సిమెంట్ పరిశ్రమలు వృద్దిలో తనవంతు పాలుపంచుకున్న ఎంహెఛ్ రావు.. మల్లెం హనుమంతరావుగారు మనందరికీ సుపరిచితులే. ఆయన మల్లన్న వేణుగోపాల్ నాయుడు గారి దంపతులకు 1939 మే 23న చెన్నైలో ( అప్పట్లో చిన్నప్ప నాయుడు పట్టణం) జన్మించారు. ఆయన పితామహులు రావుబహద్దూర్ మల్లం చెంగలరాయుడు నాయుడు ఇంగ్లాండ్ లో న్యాయశాస్త్ర పట్టభద్రులు. అనంతర కాలంలో లండన్, రంగూన్, చెన్నై నగరాల్లో ఉన్నత న్యాయస్థానాల్లో న్యాయవాద వృత్తిలో రాణించారు. ఎంహెచ్ రావు గారి మాతామహులు రావుబహద్దూర్ కొండూరి వెంకట రామానాయుడు బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో రైల్వేశాఖలో అత్యున్నత పదవిని అలంకరించిన తొలి భారతీయుడు.
SANGHATANA | Vol 2, Issue 1
12