INSPIRATIONAL STORY
రాజులు మారెనో, లేక గుర్రం ఎగిరానో.! - నీతి కథ
అనగనగా ఒక రాజుగారు తన రాజ్య పర్యటన చేస్తూ ఒక గుర్రాల బజారులోకి వెళ్ళారు. బజారులోని గుర్రాల వ్యాపారస్తులందరూ రాజుగారికి గుర్రాలు అమ్మాలని ప్రయత్నాలు మొదలెట్టారు. ఈ నేపథ్యంలో తమ గుర్రాన్నే రాజుగారు కోంటే చేతికందినంత సొమ్ము ఇస్తారని ఆశించి.. తమ గుర్రాలు గురించి గొప్పగా చెప్పడం ప్రారంభించారు. ఒకరిని మించి ఒకరు వారి వారి గుర్రాలను పొగడడం మొదలెట్టారు. “నా గుర్రం మీరు చెప్పినట్టు చేస్తుంది” అని ఒకరంటే, “నా గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది” అని ఒకరు, “అసలు నా గుర్రానికి భయమే తెలీదు” అని మరింకొకరు గొప్పగా చెప్పుకున్నారు. ఇంతలో మరోక వ్యాపారి తన గుర్రం అవసరమైన సందర్భాలలో కేవలం రెండు
SANGHATANA | Vol 2, Issue 1
కాళ్ల మీద కూడా పరుగెడుతుందని చెప్పాడు. ఇవన్నీ విని ఖంగుతిన్న మరో వ్యాపారి.. తన గుర్రాన్ని రాజుగారు కొనాలని నమ్మశక్యం కాని గొప్పను చెప్పాడు. అదేంటంటే “నా గుర్రం ఎగరగలదు” అన్నాడు. వెంటనే రాజు గారు ఆ గుర్రాన్ని కొని, తనతో రాజమహాలుకి తీసుకుని వెళ్ళారు. నేసాధిపతిని పిలిచి, గుర్రాన్ని అప్పగించి.. “ఈ గుర్రం ఎగురుతుంది” అని చెప్పారు. సేనాధిపతి ఆశ్చర్యపోయి, గుర్రాన్ని ఎగిరించే ప్రయత్నం చేసారు. కాని గుర్రం ఎలా ఎగురుతుంది? ఎగర లేదు. రాజు గారు, “అదేంటి, నిన్న మరి నాతో వ్యాపారస్తుడు అలా చెప్పాడు, అతన్ని పిలవండి” అని ఆదేశించారు. వ్యాపారస్తుడిని రాజుగారి ముందరు నిలపెట్టారు. రాజుగారు, “నిన్న నీ
26