WHO IS WHO
నండూరి సాంబశివరావు గారు
ఆంధ్రప్రదేశ్ మాజీ డిజీపీ
ముఖ్యులు 1984లో ఎస్పీ పోలీసు విభాగంలో చేరారు. అప్పటి నుంచి పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేశారు. ఏ పదవిలో చేరిన రాజీలేని పోరు సలిపారు. అందుకే ఆయన ప్రశంసల జల్లు వెల్లువెత్తిన సందర్భాలు వున్నాయి. ఆయన పేరు చెబితే చాలు కరుడుగట్టిన నేరగాళ్లు కూడా నేరాలకు దూరంగా జరిగేలా చేశారు.
అనుకున్నది సాధించే దాకా అవిశ్రాంతంగా శ్రమించే నైజం ఆయనది. ఈ క్రమంలో ఎవరెన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా.. ఎవరెంతగా బెదిరించిన తమ ఎజెండా నుంచి ఒక్క అంగుళం కూడా వెనక్కి జరగరు. రాజీ అన్నదే వాళ్ల నిఘంటువులో ఉండదు. అటువంటి వ్యక్తులు పోలీసు విభాగంలో ఉంటే ఇంకేముంది.? నేరగాళ్ల వెన్నులో చలి పుట్టక మానదు. ఇలాంటి పోలీసు అధికారులు మన రాష్ట్రంలో చాలా మందే వున్నారు. అయితే విధి నిర్వహణలో వారు చూపించే మెళకువలు సమయం, సందర్భం వచ్చిన సమయంలో తప్ప మరెప్పుడూ వెలుగులోకి రావు. వారిలో SANGHATANA | Vol 2, Issue 1
ఐపీఎస్ ఐఏఎస్ అధికారుల్లో చాలామందికి ప్రత్యేకమైన ఫనితీరు ఉంటుంది. దాని ద్వారానే వారు అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రజల్లో గుర్తింపు తెచ్చుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గాని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఈ తరహా ప్రత్యేక హోదా కలిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే పరిపాలనాపరంగా వారిలో చాలా మందిపై కొన్ని ప్రధాన రాజకీయ పార్టీల ప్రత్యేక అభిమానం చూపుతార్న ముద్రపడింది. ఐపీఎస్ సర్వీసుల్లో చేరినప్పటి నుంచి ఎలాంటి రాజకీయ ముద్ర పడకుండా ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఎక్కడ నియమించినా.. తమదైన శైలిలో ముక్కుసూటిగా వ్యవహరించి అనుకున్నది అనుకున్న విధంగా చేసుకుపోయే పనితీరు కలిగిన అధికారులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వారిలో ఆంధ్రప్రదేశ్ మాజీ డిజీపీ నండూరి సాంబశివరావు ఒకరు. కాస్త కోపం మరికాస్త ముక్కుసూటి వ్యవహారం ఎక్కడ పనిచేసినా ఆ విభాగంపై తనదైన ముద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకునే తత్వం కలిగిన అధికారి ఆయన పేరు తెచ్చుకున్నారు. ఈ స్థాయిలో పని చేసిన క్రైసిస్ మేనేజ్మెంట్ నిపుణుడిగా ఖ్యాతిగాంచిన సాంబశివరావు తాను పనిచేసిన ఏ విభాగంలోనూ యధాతధ స్థితి (స్టేటస్) కొనసాగించడానికి అసలు ఇష్టపడని అధికారి. ఆ కారణంగానే శాంతిభద్రతల విభాగం అయినా.. చివరకు ఐపీఎస్ అధికారుల ఫనిష్మంట్ పోస్టింగ్ గా భావించి విభాగంలో నియమించిన అక్కడ కూడా ఆ విభాగాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ఎక్కువ సమయం 8